
అంబానీ ఇంట పెళ్లి ధూంధాంగా జరిగింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం విచ్చేసి అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌లను దీవించారు. నిండు నూరేళ్లు కలిసుండమని ఆశీర్వదించారు. సినిమా తారలే కాకుండా వ్యాపార, రాజకీయ ప్రముఖులు సైతం పెళ్లికి విచ్చేశారు. ఇకపోతే శుక్రవారం జరిగిన బరాత్‌లో సినిమా స్టార్స్ డ్యాన్స్‌తో హోరెత్తించారు.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తుంటే ఆమె భర్త నిక్ జోనస్ తనతో పాటు కాలు కదిపాడు. కానీ అంతలోనే నిక్‌ను వెనక్కు నెట్టిందో హీరోయిన్. లైగర్ బ్యూటీ అనన్య పాండే నిక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి ప్రియాంకతో డ్యాన్స్ చేసింది. దీంతో నిక్ బిత్తరపోయాడు. విషయం అర్థం చేసుకున్న హీరో రణ్‌వీర్ సింగ్.. అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో.. నిక్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారా?, బరాత్ అంటే అంతే మరి.. నలుగురిని తోసి అయినా సరే.. ముందుకొచ్చి మరీ డ్యాన్స్ చేయాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, రాశీ ఖన్నా, రణ్‌వీర్ సింగ్, అనిల్ కపూర్.. ఇలా తారలంందరూ బరాత్‌లో సరదాగా చిందేశారు.
Ananya is literally representing
Nick jiju hatiye 😭#PriyankaChopra #AnanyaPandey pic.twitter.com/ADWSMkEIr7— 𝒫𝓇𝒾𝓎𝒶🌸🤍 (@DewaniMastanii) July 13, 2024