Priyanka Chopra, Nick Jonas Liplock Video From The New York Concert Goes Viral - Sakshi
Sakshi News home page

Priyanka Chopra- Nick Jonas: మోస్ట్ రొమాంటిక్ కపుల్.. వేదికపై ప్రియాంక-నిక్ రొమాన్స్!

Published Tue, Aug 15 2023 4:45 PM | Last Updated on Wed, Aug 16 2023 10:01 AM

Priyanka Chopra Nick Jonas Liplock Video From The New York Concert Goes Viral - Sakshi

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఫ్యాన్స్‌ అత్యంత ఇష్టపడే సెలబ్రిటీ జంటలలో ఒకరు. ఆమె భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్‌ భామ  ప్రియాంక చోప్రాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే  ఈ జంటకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యూజిక్‌ కన్సర్ట్‌లో నిక్ జోనాస్ ప్రదర్శన ఇస్తున్నారు. తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్నారు. 

(ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?)

తాజాగా ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. వేదికపై భర్తను ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ సందడి చేసింది. యాంకీ స్టేడియంలో ఒక సంగీత కచేరీలో ప్రియాంక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో వేదిక పక్కనే ఉన్న ప్రియాంక తన భర్త నిక్‌ జోనాస్‌ ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే సంగీత కచేరీకి హాజరైన ప్రియాంక తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. 

కాగా.. 2018 డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీకి స్వాగతం పలికారు. ప్రియాంక.. జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. 

(ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement