Nick Jonas REACTS After Someone Throws Underwear At Him At Concert - Sakshi
Sakshi News home page

Nick Jonas: నిక్ జోనాస్‌కు చేదు అనుభవం.. మహిళ లో దుస్తులు విసిరేసి!

Published Sun, Aug 13 2023 4:46 PM | Last Updated on Sun, Aug 13 2023 5:42 PM

Nick Jonas REACTS After Someone Throws Underwear At Him At Concert - Sakshi

ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్‌ భామ  ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే  ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. 

(ఇది చదవండి: చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలీదు: ఆర్జీవీ)

అయితే తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ సంగీత కచేరిలో పాల్గొన్నారు. అతని సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి శనివారం జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రదర్శన ఇచ్చారు. అయితే ఆ వేదికపై నిక్ జోనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. నిక్ జోనాస్ ఎంతో ఉత్సాహంగా పాట పాడుతున్న సమయంలో వేదికపైకి మహిళల లో దుస్తులను విసిరేశారు. ఇది చూసిన నిక్ జోనాస్ అవేమీ పట్టించుకోకుండా పాట పాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ ఆర్టిస్ట్‌ను ఇలా అవమానించడం ఏంటని నిలదీస్తున్నారు. విశేషమేమిటంటే ఈ సంఘటన జరిగినప్పటికీ కచేరీ సజావుగా కొనసాగింది.

కాగా.. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో ఇటీవల జరిగిన జోనాస్ బ్రదర్స్ కచేరీలో ఈ సంఘటన జరిగింది. ఊహించని  సంఘటనతో ఈ కచేరీని కొద్దిసేపు నిలిపేసి  మళ్లీ కొనసాగించారు. అయితే ప్రదర్శనను కొనసాగించడాన్ని చూసి నిక్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి చర్యలు కళాకారుల గౌరవాన్ని దెబ్బతీస్తాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలని అంటున్నారు.  అయితే గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివీ సింగర్స్‌ సవాలుగా మారాయని.. అభిమానుల తీరు తీవ్ర అంతరాయం కలిగించేలా ఉందని అంటున్నారు. 

(ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement