bra
-
ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే..!
ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కొన్ని విషయాల్లో బిడియం, సిగ్గుతో వెనకబడే ఉన్నారు స్త్రీలు. ముఖ్యంగా పీరియడ్స్, లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయం. ఎవరిదైనా బ్రా, పెట్టీకోట్లు కొద్దిగా బయటకు కనిపిస్తుంటే... చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే అంశాన్నే కెరీర్‌గా ఎంచుకుంది రిచాకర్. అమ్మాయిల నుంచి మహిళలు ధరించే ‘బ్రా’ల బ్రాండ్‌ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎటువంటి బిడియం లేకుండా తీసుకొచ్చిన ఈ బ్రాండ్ నేడు కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. జంషెడ్‌పూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది రిచాకర్. తండ్రి టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం రిచాది. డిగ్రీ అయ్యాక ఐటీ కంపెనీలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసింది. శాప్ రిటైల్ కన్సల్టింగ్, స్పెన్సర్స్‌లో ఉద్యోగం చేశాక... సొంతంగా వ్యాపారం చేయాలన్న కోరికతో నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసింది. ఒకపక్క ఉద్యోగానుభవం, మరోపక్క మేనేజ్మెంట్ స్టడీస్ ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో సొంతంగా వ్యాపారం పెట్టడానికి పూనుకుంది. ఇందుకోసం మహిళల లోదుస్తుల వ్యాపారం ఎంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ‘‘సమాజంలో లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయడతారు. ఈ వ్యాపారం అవసరమా? వద్దు’’ అని నిరుత్సాహపరిచారు. తల్లిదండ్రులు అలా చెప్పినప్పటికీ రిచా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాపారం ప్రారంభ పనుల్లో మునిగిపోయింది. రేడియంట్ మి మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్ చేసి, తయారు చేసి, విక్రయించడంపై దృష్టిపెట్టింది. కొన్నిరోజులకి తన పనిమీద నమ్మకం ఏర్పడడంతో 2011లో ‘జివామే’ పేరుతో బ్రా బ్రాండ్‌ను ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో ‘రేడియంట్ మి’ అని అర్థం. కాలేజీ అమ్మాయిల నుంచి పిల్ల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే బ్రాలను విక్రయించడం మొదలు పెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఐదువేల డిజైన్లు, యాభై బ్రాండ్లు వంద రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అందిస్తోంది జివామే. డైరెక్టర్‌గా... కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోన్న సమయంలో కొన్ని కారణాలతో 2017 సీఈవో పదవి నుంచి తప్పుకుని, డైరెక్టర్‌గా కొనసాగుతోంది రిచా కర్. ప్రస్తుతం రిచా నెట్ వర్త్ దాదాపు 750 కోట్లు ఉండొచ్చని అంచనా. మంచి లాభాల్లో దూసుకుపోతోన్న జివామే బ్రాండ్‌ను 2020 లో రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న 43 ఏళ్ల రిచా కర్ ప్రస్తుతం తన భర్త కేదార్ గవాన్‌తో కలిసి అమెరికాలో నివాసముంటోంది. ‘‘ ఒక స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మూసపద్ధతులను దాటుకుని మహిళలు సౌకర్యంగా ధరించే లో దుస్తుల బ్రాండ్‌ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకు రావడానికి చాలా సవాళ్లను, ఒత్తిళ్లనూ ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోబట్టే ఇవాళ ఈ స్థాయికి రాగలిగాను. ఇంట్లో... సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది కచ్చితంగా సాధించ గలుగుతారు’’ అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది రిచాకర్. కోట్ల టర్నోవర్‌తో.. లోదుస్తులు ధరించిన మహిళలు సౌకర్యంగా... కాన్ఫిడెంట్‌గా ఉండడమే లక్ష్యంగా లోదుస్తులను అందుబాటులో ఉంచుతుండడంతో జివామే బ్రాండ్ మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడిదార్లను ఆకర్షించింది. దీంతో 2012లో మూడు మిలియన్ల డాలర్లు, మరుసటి ఏడాది ఇది రెట్టింపు అయ్యింది. 2015 నాటికి నలభై మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆరువందల కోట్లపైకి ఎగబాగి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!) -
ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. (ఇది చదవండి: చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలీదు: ఆర్జీవీ) అయితే తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ సంగీత కచేరిలో పాల్గొన్నారు. అతని సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి శనివారం జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చారు. అయితే ఆ వేదికపై నిక్ జోనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. నిక్ జోనాస్ ఎంతో ఉత్సాహంగా పాట పాడుతున్న సమయంలో వేదికపైకి మహిళల లో దుస్తులను విసిరేశారు. ఇది చూసిన నిక్ జోనాస్ అవేమీ పట్టించుకోకుండా పాట పాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ ఆర్టిస్ట్‌ను ఇలా అవమానించడం ఏంటని నిలదీస్తున్నారు. విశేషమేమిటంటే ఈ సంఘటన జరిగినప్పటికీ కచేరీ సజావుగా కొనసాగింది. కాగా.. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో ఇటీవల జరిగిన జోనాస్ బ్రదర్స్ కచేరీలో ఈ సంఘటన జరిగింది. ఊహించని సంఘటనతో ఈ కచేరీని కొద్దిసేపు నిలిపేసి మళ్లీ కొనసాగించారు. అయితే ప్రదర్శనను కొనసాగించడాన్ని చూసి నిక్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి చర్యలు కళాకారుల గౌరవాన్ని దెబ్బతీస్తాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలని అంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివీ సింగర్స్ సవాలుగా మారాయని.. అభిమానుల తీరు తీవ్ర అంతరాయం కలిగించేలా ఉందని అంటున్నారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
'బ్రా' ధరించిన పాక్ కెప్టెన్.. షాక్ తిన్న ఫ్యాన్స్; వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమాని అడగ్గానే జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన గిఫ్ట్ కంటే బాబర్ ఆజం తాను వేసుకున్న ఇన్నర్ వేర్‌ను చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. సాధారణంగా పురుషులు బనియన్ లేదా ట్రక్ వేసుకోవడం చూస్తుంటాం. అయితే మహిళలు ధరించే బ్రాను పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ధరించడం ఆశ్చర్యపరిచింది. నిజానికి బాబర్ ఆజం వేసుకున్నది స్పోర్ట్స్ బ్రా. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ బ్రా మార్కెట్లో ట్రెండింగ్ లిస్టులో ఉంది. స్పోర్ట్స్ బ్రా లాగా ఉండే దీనిని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాడుతుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది ధరించిన వ్యక్తి కూడా దానిని గుర్తించలేనంత తేలికగా ఉంటుంది. ఈ పరికరంలో GPS ట్రాకర్ ఉంటుంది. ఇది ప్లేయర్ తన రన్నింగ్ స్పీడ్‌ని లెక్కించుకునేందుకు వాడుతుంటారు. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇది ఆటగాళ్ల కదలికలను 3Dలో కొలుస్తూ.. వారి స్థానాలను ట్రాక్ చేస్తుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. దీని నుంచి అందుకున్న సమాచారంతో సెంట్రల్ డేటాబేస్ అనుసంధానిస్తుంటారు. ఇది విశ్లేషకులు పరిశీలన చేసి, ప్లేయర్ ఫిట్నెస్ను అంచనా వేస్తుంటారు. టీమిండియా ఆటగాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 2018లో భారత కండిషనింగ్ కోచ్ శంకర్ బసు దీనిని టీమిండియాకు తీసుకువచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టు ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి లంకకు గట్టిషాక్ ఇచ్చింది. సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ టీమిండియాను రెండో స్థానంలోకి నెట్టేసింది. లంకతో సిరీస్ ముగిశాకా పాక్‌కు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ వరకు ఆ జట్టుకు విశ్రాంతి లభించినట్లే. Babar Azam Gifted his Test Jersey to a Young Fan So Cute🇵🇰💯. #BabarAzam #NoChangeNeededPCB pic.twitter.com/KBMtBAYFcE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 27, 2023 చదవండి: Major League Cricket 2023: 'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!' -
లోదుస్తులు విప్పమన్నారు.. నీట్ విద్యార్థినుల ఆవేదన! ఎలా పరీక్ష రాసేది?
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష జరిగిన ప్రతిసారి నేషనల్ టెస్డింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈసారి కూడా పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్రా స్టాప్‌లు చెక్ చేశారని, లో దుస్తులు కూడా విప్పమన్నారని పలువురు అమ్మాయిలు వాపోయారు. పరీక్షకు ముందు సున్నిత విషయాల్లో తమను ఇలా ఇబ్బంది పెడితే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాస్తామని ప్రశ్నిస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన స్టూడెంట్ తెలిపింది. అలాగే మరికొంత మందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెబితే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్‌ను మార్చుకుని వచ్చారని పేర్కొంది. మరికొందరేమో సమీప దుకాణాల్లోకి వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్ష కేంద్రానికి తిరిగి వచ్చారని వివరించింది. ఎన్టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పింది. దీంతో ఈ రూల్స్‌పై తల్లిదండ్రులతో పాటు ఇతరుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు విద్యార్థులను ఇలా మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని ఓ డాక్టర్ జంట అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను ఇలా ట్రీట్ చేయడమేంటని మండిపడింది. అవసరమైతే నిబంధనలు మార్చి వారికి వస్త్రధారణలో ఉపశమనం కల్పించాలని సూచించింది. కాగా.. బెంగాల్‌లోని హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు. అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పారు. కొంతమంది విద్యార్థులు డ్రస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్లు వివరించారు. అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
Kerala NEET Controversy: బలవంతంగా లోదుస్తులు విప్పించారు
తిరువనంతపురం: నీట్ పరీక్ష కోసం వెళ్లిన ఓ అభ్యర్థి చేదు అనుభవం.. ఆమె తండ్రి ఫిర్యాదుతో ఆ ఘటన దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్ట్ ఏజెన్సీ’ ఈ ఘటనను తోసిపుచ్చింది. విద్యార్థిని తండ్రి Gopakumar Sooranad ఆరోపణలను అసత్యప్రచారంగా కొట్టిపడేసింది. అయితే మంగళవారం మరో రెండు ఫిర్యాదులు అందడంతో.. నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవహారం మరింత ముదిరినట్లయ్యింది. ఇదిలా ఉండగా.. బాధితురాలు ఆరోజు ఏం జరిగిందో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అదొక చేదు అనుభవంగా చెప్పిన పదిహేడేళ్ల యువతి.. నీట్ సెంటర్ దగ్గర బలవంతంగా తమతో లోదుస్తులు విప్పించారని తెలిపింది. ‘స్కానింగ్ జరిగే దగ్గర కొందరు సిబ్బంది ఉన్నారు. అక్కడికి రమ్మని నాకు సైగ చేశారు. అక్కడ రెండు లైన్లలో అభ్యర్థులు నిల్చుని ఉన్నారు. నన్ను స్కాన్ చేశాక.. లోపలికి పంపిస్తారు అనుకున్నా. కానీ, ‘మెటల్ ఉన్న ఇన్నర్‌వేర్ వేస్కున్నావా?’ అని అడిగారు. ‘అవును’ అని సమాధానం ఇచ్చా. వెంటనే పక్కనే ఉన్న ఓ లైన్లో నిల్చొమన్నారు. అప్పుడు అర్థమైంది ఆ లైన్లో ఉన్నవాళ్లంతా మెటల్ హుక్ బ్రాలు ధరించిన వాళ్లేనని... ఆ తర్వాత ఆ క్యూలో ఉన్న అందరినీ పక్కకు పిలిచి బ్రాలు తొలగించి.. టేబుల్ మీద పెట్టమన్నారు సిబ్బంది. పరీక్ష రాయడానికి బ్రాలు ఉండాల్సిన అవసరం లేదని, లేకుంటే లోపలికి పంపించమని అనడంతో మా అందరికీ సిగ్గుగా అనిపించింది. ఒక చీకటి గదిలోకి వెళ్లి అమ్మాయిలమంతా చెప్పినట్లు చేశాం. అదొక భయానక అనుభవం. గదిలో వెలుతురు లేదు.. లైట్ లేదు. అమ్మాయిలు.. అబ్బాయిలు అంతా ఒకే హాలులో పరీక్ష రాయాల్సి ఉంది. సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించి.. చాలామంది శాలువాలు, స్కార్ఫ్‌లు వేసుకుంటామని అడిగాం. కుదరదన్నారు. చేసేది లేక.. జుట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాశాం. చాలామంది అవమానంగా, భయంభయంగా పరీక్ష రాశారు. నాతో సహా చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఇన్విజిలేటర్ సెక్యూరిటీతో వచ్చి.. ఎందుకు ఏడ్వడం అంటూ గట్టిగా గద్దించారు. పరీక్ష అయ్యాక బ్రాలను కుప్పలుగా పడేశారు. వెతుక్కోవడానికి చాలామంది అవస్థలు పడ్డారు. ఇలాంటి అనుభవం ఏ అమ్మాయికి రాకూడదు అంటూ ఏడుస్తూ.. చెప్పుకొచ్చింది యువతి. ముక్తకంఠంతో ఖండన కేరళ కొల్లాంలో నీట్ పరీక్షకు హాజరైన అమ్మాయిల లోదుస్తులు తొలగించిన ఘటనపై జాతీయ మహిళా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన సిగ్గు చేటని, అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశమని ప్రకటించింది. మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. మళ్లీ తాజా దర్యాప్తును చేపట్టాలని కేరళ పోలీసులను విద్యాశాఖ మంత్రి డాక్టర్ బిందు ఆదేశించారు. మరోవైపు మానవ హక్కుల సంఘం సైతం ఘటనపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కేరళ పోలీసులను ఆదేశించింది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిజనిర్ధారణ కమిటీ రెండు మూడు రోజుల్లో ఘటనపై దర్యాప్తు ప్రారంభించనుంది. రేఖా శర్మ లేఖ కేరళలో ఆదివారం ఓ నీట్ పరీక్ష కేంద్రంలో 17 ఏళ్ల అమ్మాయిని నిర్వాహకులు లో దుస్తులు విప్పించారన్న వార్తలపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ తీవ్రంగా ఆగ్రహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు లేఖ రాశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ముగ్గురు ఏజెన్సీ వ్యక్తులను, ఇద్దరు విద్యాసంస్థ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, నీట్ పరీక్షలో అభ్యర్థికి బదులు వేరొకరు పరీక్ష రాసేందుకు రూ.20 లక్షల చొప్పున ఒప్పందాలు జరిగాయని సీబీఐ విచారణలో తేలింది. చదవండి: నీట్ పరీక్షకు ‘బ్రా’ వేసుకోకూడదా?.. గైడ్‌లైన్స్‌లో ఏముందంటే.. -
NEET అభ్యర్థి లోదుస్తుల తొలగింపుపై రగడ
తిరువనంతపురం: నీట్ పరీక్షలో అభ్యర్థి లోదుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షకు అనుమతించారనే వ్యవహారం ముదురుతోంది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. స్పందించిన మానవ హక్కుల సంఘం.. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది కూడా. అయితే.. నీట్ ఎగ్జామ్ కోసం వెళ్లిన అభ్యర్థిని లోదుస్తులు తొలగించారనే ఘటనపై ఎట్టకేలకు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జులై 17న నీట్ పరీక్ష సందర్భంగా.. కేరళ కొల్లాంలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థినిని లోదుస్తులు తొలగించాల్సిందిగా సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. 90 శాతం విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, వాళ్లంతా మానసిక వేదన అనుభవించారని ఆరోపించారు. మీడియా కథనాల ఆధారంగా.. ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ డ్రెస్ కోడ్ ప్రకారం.. నీట్ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవు. కోడ్ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్టీఏ తెలిపింది. విమర్శల నేపథ్యంతో.. కేరళ కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రంలో తన కూతురికి ఎదురైన ఘోర అవమానంపై కొట్టారకారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్టీఏ రూల్స్‌లో లేకున్నా తన కూతురి లోదుస్తులు విప్పించి స్టోర్ రూమ్‌లో పడేయాలని, ఆపైనే పరీక్షకు అనుమతించారని.. తద్వారా ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. మెజార్టీ విద్యార్థులకు ఇలాంటి సమస్యే ఎదురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేరళ లోక్‌సభ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు. ఈ మేరకు ఘటనపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నారు. పోలీస్ కేసు నమోదు బలవంతగా విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. అలాగే.. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్‌వేర్‌ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. అయితే పరీక్ష నిర్వాహణ కేంద్రం అయిన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు.. తమ సిబ్బంది ఎవరూ తనిఖీల ప్రక్రియలో పాల్గొనలేదని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ విద్యాశాఖ కూడా తమ పరిధిలో ఈ పరీక్ష జరగలేదని, రాష్ట్ర నిర్వాహణ అధికారులు ఎవరూ అందులో లేరని అంటోంది. డ్రెస్ కోడ్ ఏంటంటే.. అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే శాండల్స్, ఓపెన్ స్లిప్పర్స్ వేస్కోవచ్చు. షూలు ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్లెట్, కెమెరా, నగలు, మెటాలిక్ వస్తువులు నిషిద్ధం. అయితే మెటాలిక్ హుక్స్ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేరళలోనే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017లో కేరళ కన్నూర్‌లోనే ఓ అభ్యర్థితో బ్రా విప్పించారు సెంటర్ నిర్వాహకులు. ఆ ఘటన విమర్శలకు దారి తీసింది. తొలుత.. హాప్ స్లీవ్, బ్లాక్ ప్యాంట్‌తో సెంటర్‌కు చేరుకుంది ఓ అభ్యర్థి. అయితే డార్క్ కలర్ అనుమతించకపోవడంతో.. ఆమె ఆందోళనకు గురైంది. ఆదివారం కావడంతో దుకాణాలు సైతం తెరవలేదు. దీంతో రెండు కిలోమీటర్లు తల్లితో పాటు వెళ్లి కొత్త దుస్తులు కొనుగులు చేసుకుని మార్చుకుని వచ్చింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మెటల్ డిటెక్టర్ గుండా వెళ్తున్న టైంలో.. బ్రాకు ఉన్న హుక్స్ కారణంగా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇన్నర్‌వేర్ తొలగించి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆమె పరీక్ష రాసింది. ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లునీట్ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం పాలక్కడలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ ఏడాది నీట్ పరీక్షల సమయంలో హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు సైతం రావడం విశేషం. -
బ్రా ఖరీదు.. రూ. 13 కోట్లు
-
బ్రా ఖరీదు.. రూ. 13 కోట్లు
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్ పేరు.. లాయిస్ రిబీరో. ఈమె అందరిలాంటి మోడల్ అయినా.. లాయిస్కు మాత్రం ఈమె ధరించిన బ్రా వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. విక్టోరియా సీక్రెట్ మోడల్ 2017గా గుర్తింపు తెచ్చుకున్న లాయిస్.. ఈ నెల 28న షాంఘైలో జరగనున్న ఫ్యాషన్ షోలో పాల్గొననుంది. ఈ షోలో పాల్గొనేందుకు ఆమె ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బ్రాను ధరించనుంది. ఫాంటసీ బ్రాగా చెప్పుకునే దీనిని 24 కారెట్ల బంగారంతో రూపొందించారు. ఇందులో 6 వేల విలువైన రత్నాలును, నీలిరంగి పుష్పరాగములు, ఖరీదైన వజ్రాలను ఇందులో ప్రత్యేకంగా కూర్చారు. దినిని రూపొందించేందుకు 350 గంటల సమయం పట్టింది. సుమారు 13 కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన ఆమె.. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్నాయి. I've been holding this secret for too long and I am beyond honored to announce that I will be wearing the Champagne Nights Fantasy Bra this year! I am very happy and thankful for my Victoria's Secret family for trusting me and all the support from my on family, friends and fans! THANK YOU SO MUCH!!! 😭😭😭 its official!! 💎😭 A post shared by Lais Ribeiro (@laisribeiro) on Nov 1, 2017 at 6:19am PDT Introducing the $2 million Champagne Nights Fantasy Bra, worn by @laisribeiro & designed by @mouawadjewelry. Go behind the bling & discover the Dream Angels bra inspired by the fantasy (link in bio). 🥂#VSFantasyBra #VSFashionShow A post shared by Victoria's Secret (@victoriassecret) on Nov 1, 2017 at 6:11am PDT ✨Putting on the glitz as we celebrate @laisribeiro & the 2017 #VSFantasyBra. Click link in bio to shop her look! #VSFashionShow A post shared by Victoria's Secret (@victoriassecret) on Nov 1, 2017 at 1:29pm PDT -
'బ్రా'లో వల్గర్ ఏముంది: కంగనా
న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో చెలరేగిన వివాదంపై నటి కంగనా రనౌత్ స్పందించింది. దేశం ఏం చూడాలో కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించలేరని తెలిపింది. మూడుసార్లు జాతీయస్థాయిలో ఉత్తమనటిగా అవార్డు అందుకున్న కంగనా ఉడ్తా పంజాబ్ చిత్ర టీమ్‌కు మద్దతుగా నిలిచింది. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు ఏకంగా దాదాపు 90 కట్లు చెప్పడాన్ని విమర్శించింది. 'నేను డైరెక్టర్‌ను కాదు, దర్శక విభాగం గురించి ఎక్కువగా అవగాహన కూడా లేదు. కానీ వృత్తిలో భాగంగా వారిని చాలా దగ్గర నుంచి చూస్తుంటాను. ప్రస్తుత పరిణామాలు వారికి చాలా విసుగు తెప్పించేవిలా ఉన్నాయి' అని కంగనా అన్నారు. క్వీన్ చిత్ర విడుదల సమయంలో డైరెక్ట్ వికాస్ బహల్ తన వద్దకు వచ్చి ఓ సన్నివేశంలోని 'బ్రా'ను బ్లర్ చేస్తున్నట్టుగా చెప్పాడని కంగనా తెలిపింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సన్నివేశంలో ధరించకుండానే ఉన్న 'బ్రా'ను వల్గర్‌గా ఉందని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్లర్ చేయాల్సి వచ్చిందట. ధరించకుండానే ఉన్న మామూలు 'బ్రా'వల్ల సొసైటీకి ఎలాంటి హాని జరగదని.. మహిళల 'బ్రా'లో వల్గర్ ఏముంటుందని సెన్సార్ బోర్డు పై కంగనా మండిపడింది. -
క్లబ్ డ్యాన్సర్లా చెలరేగిన టీచరమ్మ
ప్రాటో(ఇటలీ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఓ ఉపాధ్యాయురాలు గాడి తప్పింది. ఇటాలియన్ హై స్కూల్ టీచరమ్మ బోగోతం అందరూ నివ్వెర పోయేలా చేసింది. అమ్మగారు చేసిన నిర్వాకం వీడియో రూపంలో బయటకు వచ్చింది. అంతే సోషల్ మీడియాలో ఆ వీడియో హాల్ చల్ చేసింది. వివరాల్లోకి వెళితే...వర్డ్ ప్రాసెసింగ్(ఐటీ) ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె క్లాస్ రూమ్ లో అసభ్యకరంగా నృత్యం చేసింది. ప్రాటోలోని టస్కన్లో గ్రాంసికిన్స్ విద్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు అరుస్తూ ఉంటే మైమరచి పోయిన ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే స్ట్రిప్ టీజ్ (దుస్తులు తొలగిస్తూ చేసే నృత్యం) చేసింది. పైకి కిందికి దూకుతూ ఓ క్లబ్ డ్యాన్సర్లా చిందులేసింది. అయితే ఈ వీడియోను గ్రాంసికిన్స్ విద్యార్థులే తీసి, బయట పెట్టినట్టు భావిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించిన చేసిన టీచర్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. 'ఈ వీడియో చూసి షాక్‌కు గురయ్యాను. ఈ సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా మిగతా టీచర్లను ఆదేశించాను' అని హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు మారియా గార్జియా తెలిపారు. అయితే ఇంతకు ముందు వరకు ఆ టీచర్ నడవడిక పై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు.