క్లబ్ డ్యాన్సర్లా చెలరేగిన టీచరమ్మ | Italian high school teacher gets her bra out 'during classroom striptease' | Sakshi
Sakshi News home page

క్లబ్ డ్యాన్సర్లా చెలరేగిన టీచరమ్మ

Published Wed, Apr 13 2016 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

క్లబ్ డ్యాన్సర్లా చెలరేగిన టీచరమ్మ

క్లబ్ డ్యాన్సర్లా చెలరేగిన టీచరమ్మ

ప్రాటో(ఇటలీ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఓ ఉపాధ్యాయురాలు గాడి తప్పింది. ఇటాలియన్ హై స్కూల్ టీచరమ్మ బోగోతం అందరూ నివ్వెర పోయేలా చేసింది. అమ్మగారు చేసిన నిర్వాకం వీడియో రూపంలో బయటకు వచ్చింది. అంతే సోషల్ మీడియాలో ఆ వీడియో హాల్ చల్ చేసింది.

వివరాల్లోకి వెళితే...వర్డ్ ప్రాసెసింగ్(ఐటీ) ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె క్లాస్ రూమ్ లో అసభ్యకరంగా నృత్యం చేసింది. ప్రాటోలోని టస్కన్లో గ్రాంసికిన్స్ విద్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు అరుస్తూ ఉంటే మైమరచి పోయిన ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే స్ట్రిప్ టీజ్ (దుస్తులు తొలగిస్తూ చేసే నృత్యం) చేసింది. పైకి కిందికి దూకుతూ ఓ క్లబ్ డ్యాన్సర్లా చిందులేసింది.

అయితే ఈ వీడియోను గ్రాంసికిన్స్ విద్యార్థులే తీసి, బయట పెట్టినట్టు భావిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించిన చేసిన టీచర్పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

'ఈ వీడియో చూసి షాక్కు గురయ్యాను. ఈ సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా మిగతా టీచర్లను ఆదేశించాను' అని హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు మారియా గార్జియా తెలిపారు. అయితే ఇంతకు ముందు వరకు ఆ టీచర్ నడవడిక పై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement