high school teacher
-
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
కురవి: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సక్రాంనాయక్ తండా డీఎన్టీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న డీఎస్ శ్రీను (శ్రీనివాస్) నాలుగో తరగతి చదువుతున్న బాలికలకు కొన్ని రోజులనుంచి సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన చిన్నారులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో సోమవారం తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకుని శ్రీనివాస్‌కు దేహశుద్ధి చేశారు. ఎంఈఓ ఇస్లావత్ లచి్చరాంనాయక్ ఆదేశాల మేరకు కాంపల్లి హైసూ్కల్ హెచ్ఎం అరుణశ్రీ పాఠశాలకు చేరుకుని విచారణ జరిపారు. అనంతరం డీఈఈ రవీందర్‌రెడ్డికి నివేదిక ఇవ్వడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. అసభ్యకర ప్రవర్తనపై జిల్లా సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, బాలరక్షా భవన్ వారిని విచారణ చేసేందుకు నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై నగేశ్ పాఠశాల వద్దకు చేరుకుని పిల్లల తల్లిదండ్రులతో, హెచ్ఎంతో మాట్లాడారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసిరిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. -
మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్.. సంబల్‌పురీ చీరకట్టి సంబురంగా పరుగెట్టీ
మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మధుస్మిత జెన నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఒడియా కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మారథాన్లు, ఆల్ట్రా మారథాన్లలో పాల్గొంది. తాజాగా మాంచెస్టర్‌లో 42.5 కి.మీల మారథాన్‌లో పాల్గొంది. ఈసారి మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. అభినందనలు అందుకుంది. ఈసారి ప్రత్యేకత...సంబల్‌పురీ చీర కట్టి మారథాన్‌లో పాల్గొంది మధుస్మిత. ‘అంతదూరం చీరతో పరుగెత్తడం సులువేమీ కాదు’ అంటున్న మధుస్మిత సంతోషం ప్లస్ సంకల్పబలంతో నాలుగు గంటల యాభైనిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ‘చీరతో మారథాన్‌లో పాల్గొనడం అసాధ్యం అనేది చాలామంది నమ్మకం. ఇది తప్పని రుజువు చేయాలనుకున్నాను’ అంటుంది 41 సంవత్సరాల మధుస్మిత. ‘తనలోని ప్రతిభతో ఎప్పుడూ ఎంతోమందికి స్మిత స్ఫూర్తి ఇస్తుంటుంది. ఆమె విజయానికి గర్విస్తున్నాం’ అంటున్నాడు ఒడియా కమ్యూనిటీ మాజీ కార్యదర్శి సుకాంత్ కుమార్ సాహు. ఒడిశాలోని కుస్పూర్ గ్రామానికి చెందిన మధుస్మితకు తల్లి, అమ్మల ద్వారా చీరెపై ఇష్టం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ప్రత్యేకమైన సందర్భాలు, వేసవిలో చీర ధరిస్తుంది మధుస్మిత. -
నాడు దినసరి కూలీ నేడు టీచర్
యాలకుల తోటలో దినసరి కూలీగా పనిచేసే 28 ఏళ్ల సెల్వమరి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా మారింది. ఆమె సాధించిన ఈ ఘనత వెనకాల కొన్నేళ్ల కృషి ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి అర్థంలా సెల్వమరి గురించి పిల్లలకు పాఠంలా చెప్పచ్చు. పెద్దలూ తమ దారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. స్వయంకృషితో ఎదిగిన సెల్వమరికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఫోన్ ద్వారా, ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. సెల్వమరి తన బాల్యంలో తల్లితో కలిసి సెలవుల్లో యాలకుల తోటలో పనిచేసేది. అర్ధరాత్రిళ్లు నూనె దీపాన్ని పెట్టుకొని చదువుకునేది. తండ్రి ఆమె చిన్నతనంలోనే తల్లిని, ఇద్దరు కూతుళ్లను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ పోషణకు తల్లి యాలకుల తోటలో పనిచేసేది. తల్లితోపాటు సెల్వమరి కూడా కూలికి వెళ్లేది. గణితంలో ప్రతిభ పూట గడవని రోజులైనా చదువును మాత్రం పక్కన పెట్టలేదు సెల్వమరి. చదువొక్కటే తమ జీవితాలను మారుస్తుందని నమ్మింది. తన కలను ఎవరికీ చెప్పకుండా దాచుకుంది. ఆ కలను సాధించడానికి నిత్యం కృషి చేసింది. సెల్వమరికి గణితం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ గణితంలో ప్రతిభ చూపుతుండేది. తిరువనంతపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు తల్లికి ధైర్యం చెప్పింది. కాలేజీకి సెలవు రోజులు ఇవ్వగానే తిరిగి ఇంటికి వచ్చి, తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. అలా వేసవి సమయమంతా తల్లికి చేదోదు వాదోడుగా ఉండేది. సమస్యలను అధిగమిస్తూ.. ‘డిగ్రీ ఇంగ్లిషు మాధ్యమంలో చేరడంతో మొదట సమస్యగా అనిపించేది. మాతృభాష మలయాళం తప్ప ఇంగ్లిషు సరిగా వచ్చేది కాదు. కానీ, మా అమ్మ ముఖం గుర్తుకు తెచ్చుకొనేదాన్ని’ అంటూ సమస్యను అధిగమించిన విధానాన్ని తెలియజేస్తుంది సెల్వమరి. క్రమంగా భాషా సమస్యను పరిష్కరించుకొని డిగ్రీ, అటు తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. కుమిలీలోని ఎంజి యూనివర్శిటీ నుంచి బీఈడీ, ఎమ్ఈడీ పూర్తి చేసింది. థైక్వాడ్ గవర్నమెంట్ కాలేజీ నుంచి ఎంఫిల్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పుడు మ్యాథమేటిక్స్‌లో పీహెచ్డీ చేస్తోంది. యుజిసి నెట్ ఎగ్జామ్ పూర్తి చేసింది. సివిల్ సర్వీసులలో రాణించాలన్నది తన పెద్ద కల. అందుకు ఎంత కష్టమైనా పడతానంటున్న సెల్వమరి కేరళలోని ఇడుక్కి జిల్లాల్లో వంచివయాల్ ఉన్నత పాఠశాలలో ఇటీవలే ఉపాధ్యాయురాలిగా చేరింది. ఎక్కడా అవకాశాలు లేవు, ఎటు చూసినా ఆర్థిక ఇబ్బందులే, కుటుంబ పరిస్థితి ఏమీ బాగో లేదని వాపోతూ అనేక సాకులు వెతికేవారికి సెల్వమరి జీవితం ఓ పాఠం. కృషి చేస్తే జీవితం తప్పక మారుతుందని తెలిపే విజయకథనం. -
క్లబ్ డ్యాన్సర్లా చెలరేగిన టీచరమ్మ
ప్రాటో(ఇటలీ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఓ ఉపాధ్యాయురాలు గాడి తప్పింది. ఇటాలియన్ హై స్కూల్ టీచరమ్మ బోగోతం అందరూ నివ్వెర పోయేలా చేసింది. అమ్మగారు చేసిన నిర్వాకం వీడియో రూపంలో బయటకు వచ్చింది. అంతే సోషల్ మీడియాలో ఆ వీడియో హాల్ చల్ చేసింది. వివరాల్లోకి వెళితే...వర్డ్ ప్రాసెసింగ్(ఐటీ) ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె క్లాస్ రూమ్ లో అసభ్యకరంగా నృత్యం చేసింది. ప్రాటోలోని టస్కన్లో గ్రాంసికిన్స్ విద్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు అరుస్తూ ఉంటే మైమరచి పోయిన ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే స్ట్రిప్ టీజ్ (దుస్తులు తొలగిస్తూ చేసే నృత్యం) చేసింది. పైకి కిందికి దూకుతూ ఓ క్లబ్ డ్యాన్సర్లా చిందులేసింది. అయితే ఈ వీడియోను గ్రాంసికిన్స్ విద్యార్థులే తీసి, బయట పెట్టినట్టు భావిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించిన చేసిన టీచర్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. 'ఈ వీడియో చూసి షాక్‌కు గురయ్యాను. ఈ సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా మిగతా టీచర్లను ఆదేశించాను' అని హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు మారియా గార్జియా తెలిపారు. అయితే ఇంతకు ముందు వరకు ఆ టీచర్ నడవడిక పై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు.