
చిన్నారులకు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూపించిన టీచర్
చితకబాదిన తల్లిదండ్రులు
టీచర్‌ను సస్పెండ్ చేసిన విద్యాశాఖ అధికారులు
కురవి: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సక్రాంనాయక్ తండా డీఎన్‌టీ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న డీఎస్ శ్రీను (శ్రీనివాస్) నాలుగో తరగతి చదువుతున్న బాలికలకు కొన్ని రోజులనుంచి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన చిన్నారులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో సోమవారం తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకుని శ్రీనివాస్‌కు దేహశుద్ధి చేశారు. ఎంఈఓ ఇస్లావత్ లచి్చరాంనాయక్ ఆదేశాల మేరకు కాంపల్లి హైసూ్కల్ హెచ్‌ఎం అరుణశ్రీ పాఠశాలకు చేరుకుని విచారణ జరిపారు. అనంతరం డీఈఈ రవీందర్‌రెడ్డికి నివేదిక ఇవ్వడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. అసభ్యకర ప్రవర్తనపై జిల్లా సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, బాలరక్షా భవన్ వారిని విచారణ చేసేందుకు నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై నగేశ్ పాఠశాల వద్దకు చేరుకుని పిల్లల తల్లిదండ్రులతో, హెచ్‌ఎంతో మాట్లాడారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసిరిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment