Italian
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
US Open 2024: సూపర్ సినెర్
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్రేక్ పాయింట్‌తో మొదలు... 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.తొలి సెట్లోని తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్‌లో ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు. 55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు. -
Jannik Sinner: యూఎస్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్ (ఫోటోలు)
-
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
-
మజారె పావ్‌బాజీ.. బిర్యానీ భోజీ
సాక్షి, అమరావతి: దేశంలోని నగరాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో స్థానిక ఆహార పదార్థాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. వీధి చివరిలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ హోటళ్ల వరకు నోరూరించే రుచులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై వడాపావ్, చాట్ బఠాణి, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై ఇడ్లీ–దోశ, లక్నో కబాబ్–మొగలాయ్ వంటకాలు ఎల్లలు ఎరుగని ఆహార ప్రేమికులను సొంతం చేసుకుంటున్నాయి. ఒక ప్రాంత సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించడంలో పాకశాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని రుచుల ఎన్‌సైక్లోపిడియాగా పిలిచే ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ పేర్కొంది. తాజాగా ‘ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల’ జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్–100లో భారతదేశం నుంచి ఐదు నగరాలకు స్థానం దక్కింది. టేస్ట్ అట్లాస్ ‘ట్రావెల్ గ్లోబల్ ఈట్ లోకల్’ నినాదంతో ప్రాంతీయ రుచులకు పెద్దపీట వేస్తోంది. తద్వారా వ్యవసాయం, వాణిజ్యాన్ని బలోపేతం చేయొచ్చని భావిస్తోంది. ఇటాలియన్ నగరాలే టాప్ ♦ టేస్ట్ అట్లాస్ నివేదికలో ఇటాలియన్ నగరాల రుచుల హవా కనిపించింది. అగ్రస్థానంలో రోమ్ (ఇటలీ) ఆ తర్వాత బోలోగ్రా, నేపుల్స్ నగరాలు నిలిచాయి. మొత్తం మూడు ఇటాలియన్ నగరాల్లో పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందడం విశేషం. ♦ ఉత్తమ రేటింగ్ పొందిన వంటకంగా బ్రెజిలియన్ మీట్ కట్ పికాన్హా, ఆ తర్వాత మలేషియన్ బ్రెడ్ రోటీ కనై , థాయ్ స్టిర్ ఫ్రై రెసిపీలు ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీకి దేశంలో రెండో స్థానం ♦ ప్రపంచ ఉత్తమ ఆహార నగరాల్లో ముంబై (35), హైదరాబాద్ (39) స్థానాలను దక్కించుకున్నాయి. ♦ ఆ తర్వాత ఢిల్లీ (56), చెన్నై (65), లక్నో (92) స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ పావ్ బాజీ, దోశ, వడపావ్, చోలే భాతురే, కబాబ్స్, నిహారీ, పానీ పూరీ, చోలే కుల్చే, బిర్యానీ, వివిధ రకాల చాట్లు కేవలం కడుపునింపే ఆహారంగానే కాకుండా జిహ్వకు సంతృప్తి, అత్యుత్తమ రుచిని అందిస్తాయని నివేదిక పేర్కొంది. ♦ ఉత్తమ రెస్టారెంట్ల విషయంలో భారత్ 4.52 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. ♦ ఉత్తమ ఆహార పదార్థంగా బటర్ గార్లిక్ నాన్ 4.67 స్కోర్‌తో 7వ స్థానం, ముర్గ్ మఖానీ 4.54 స్కోర్‌తో 43వ స్థానం, టిక్కా 4.54 స్కోర్‌తో 47వ స్థానం, తందూరి 4.54 స్కోర్‌తో 48వ స్థానంలో నిలిచాయి. ♦ ఉత్తమ అల్పాహారంగా శనగల కూరతో కూడిన పూరీ 18వ స్థానంలో ఉండగా.. అత్యంత ప్రసిద్ధ ఆహార స్థలాల్లో మంగుళూరులోని పబ్బా ఐస్ పార్లర్‌కు 7వ స్థానం దక్కింది. ప్రపంచంలోని టాప్–10 ఆహార నగరాలు ♦ రోమ్, ఇటలీ ♦ బోలోగ్నా, ఇటలీ ♦ నేపుల్స్, ఇటలీ ♦ వియన్నా, ఆస్ట్రియా ♦టోక్యో, జపాన్ ♦ఒసాకా, జపాన్ ♦ హాంకాంగ్, చైనా ♦ టురిన్, ఇటలీ ♦గాజియాంటెప్, టర్కీ ♦బాండుంగ్, ఇండోనేషియా -
మనుషులే లేని ఊరు.. అసలు ఎక్కడ ఉంది..?
-
సీన్యో కాల్వీనో
ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్ రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు. ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు. జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్ సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్ 15) సంవత్సరం ఇది. ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్ ్స ఆఫ్ ద మూన్ ). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్ నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది. ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్ గ్రాండ్‌మదర్)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్ పాలొమార్’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది? (ద బ్లాక్ షీప్). కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్ యాన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే. కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్ మాడర్నిస్ట్ నవల అంటారు (ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్ జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం. ‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంట బెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు. ఒకరోజు– మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని ఛాట్ జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్‌బ్యాక్’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్ పొలొమార్’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట. ‘సీన్యో(మిస్టర్ లాంటి ఒక గౌరవ వాచకం) కాల్వీనో! ఒక ఇటాలియన్ చెవికి ఆ పదం ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్ వీవర్ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఆయన్ని ఆనందపరచొచ్చు! -
అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు
అరవై ఏళ్లుగా మనుషులు లేని ఊరు అదొక శాపగ్రస్త గ్రామం. అరవై ఏళ్లుగా ఆ ఊళ్లో మనుషులెవరూ ఉండటం లేదు. మధ్యయుగాల నాటి ఆ ఊరి పేరు క్రాకో. ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉందిది. కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద దాదాపు పద్నాలుగు శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా ఈ ఊరిని నిర్మించుకున్నారు. ఆనాటి రక్షణ అవసరాల కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా రూపొందించుకున్నారు. కొండను తొలిచి ఊరిలోని ఇళ్లను, ప్రార్థన స్థలాలను పూర్తిగా రాళ్లతోనే నిర్మించుకున్నారు. కొన్నిచోట్ల గుహలలో కూడా ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఇది ‘కేవ్ సిటీ’గా పేరుపొందింది. రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడెరిక్ కాలంలో ఈ ఊరు వ్యూహాత్మక సైనిక స్థావరంగా ఉపయోగపడేది. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో ఈ ఊళ్లోని వందలాది మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉండటంతో జనాలు దీన్నొక శాపగ్రస్త గ్రామంగా భావించడం మొదలుపెట్టారు. బందిపోట్ల దాడుల్లో కొందరు ఊరి జనాలు హతమైపోయారు. కొండచరియలు కూలిన సంఘటనల్లో కొందరు మరణించారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో మిగిలిన కొద్దిమంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీ వచ్చే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని ఆసక్తిగా చూసి వెళుతుంటారు. (చదవండి: 128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక.) -
ఆలయానికి ఇటలీ యువతి, కాశీ యువకుడు.. వదంతులకు పూజారి చెక్!
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమధ్య ఎలా చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరని అంటారు. దీనికి ఇప్పుడు మరో తాజా ఉదాహరణ మనముందు నిలిచింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని త్రిలోచన్ ఆలయంలో సందడి నెలకొంది. ఈ ఆలయానికి ఒక జంట వచ్చారు. ఆలయంలో మహాశివుడిని దర్శించుకున్న ఆ జంటను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ జంట వేర్వేరు దేశాలకు చెందినవారు కావడమే అందుకు కారణం. వారణాసికి చెందిన యువకుడు, ఇటలీకి చెందిన యువతి జంటగా వచ్చారు. వారు ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే వారు త్రిలోచన్ ఆలయంలో వివాహం చేసుకున్నారనే వదంతులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఆ దంపతులు త్రిలోచన్ మహాదేవ్ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నేపధ్యంలో వారికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటకు సంబంధించిన వివరాలను త్రిలోచన్ మందిరం ప్రధాన పూజారి సోనూ గిరి మాట్లాడుతూ ఆ జంటకు ఈ ఆలయంలో పెళ్లి జరిగిందనేది అవాస్తవమని, రిజిస్ట్రేషన్ లేకుండా ఇక్కడ పెళ్లిళ్లి చేయమని అన్నారు. వారణాసికి చెందిన అఖిలేష్ విశ్వకర్మ, ఇటలీకి చెందిన తానియా ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇక్కడ పూజలు చేసేందుకు మాత్రమే వచ్చారన్నారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం వారణాసి జిల్లాలోని కార్ఖియాం గ్రామ నివాసి అఖిలేష్ విశ్వకర్మ 2016లో హోటల్ మేనేజిమెంట్ కోర్సు చేసిన తరువాత కతర్ దేశం వెళ్లాడు. అక్కడ కతర్ ఎయిర్వేస్లో క్యాబిన్ క్రూ సిబ్బందిగా ఉద్యోగం పొందాడు. కొద్దిరోజుల తరువాత అతనికి ఇటలీకి చెందిన తానియాతో ప్రేమ ఏర్పడింది. తరువాత వారిద్దరూ జార్జియాలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే అఖిలేష్ తన భార్యతో పాటు ఇంటికి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే వారు త్రిలోచన్ మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ తానియా ఇటలీలో పుట్టిందని, ఆమె ఫిలిప్పీన్స్‌లో చదువుకున్నదని తెలిపారు. తానియా తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారన్నారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! -
టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!
స్కూలుకు డుమ్మా కొట్టే స్టూడెంట్స్‌ను చూసి ఉంటారు. కానీ, టీచర్ని ఎప్పుడైనా చూశారా! ఫొటోలో కనిపిస్తున్న ఈ టీచర్ ఒక రోజు కాదు, వారం కాదు.. ఏకంగా ఇరవై సంవత్సరాలు స్కూలుకు డుమ్మా కొట్టింది. ఇటలీకి చెందిన సింజియా పలైన డిలియో, వెనిస్లోని ఓ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది. ఇరవై నాలుగు సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో తను స్కూలుకెళ్లింది కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే! అనారోగ్య సెలవులు, కుటుంబ సెలవులు, అనుమతి సెలవులు వంటి వివిధ రకాల సెలవులు పెట్టి, డుమ్మా కొట్టేది. వీటిల్లో కొన్ని రికార్డుల్లో ఉంటే, చాలా వరకు సెలవులు రికార్డుల్లోనే లేవు. ఈ మధ్యనే స్కూల్ ఇన్స్పెక్టర్లు లియో బోధనను పరిశీలించినపుడు, ఆమె గందరగోళంగా పాఠాలను బోధించింది. తర్వాత పనితీరుపై పరీక్ష నిర్వహించినపుడు, విద్యార్థుల నుంచే లియో పుస్తకాలను సేకరించడం గమనించి, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. లియో ఇందుకు ఒప్పుకోలేదు. ఉద్యోగం తిరిగి సాధించుకోవడానికి కోర్టులో కేసు వేసింది. కోర్టు కూడా లియో దాదాపు రెండు దశాబ్దాలు స్కూలుకు హాజరు కాలేదని గుర్తించింది. ‘ఆమెతన ఉద్యోగం తిరిగి పొందలేదు’ అని తీర్పు ఇవ్వడంతో, ఇది కాస్త వైరల్‌గా మారింది. (చదవండి: చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..) -
మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..!
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయే ముందు ఆయన తన గార్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినా(33)కి రూ.900 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పైనే వీలునామా రాసి సంతకం చేశారు. బ్రిటన్‌కు మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం ఆరు బిలియన్లకు పైనే ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. మార్టా ఫాసినాతో బెర్లుస్కోనికి 2020 నుంచి గత మూడేళ్లుగా పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇరువురి మధ్య స్నేహం తర్వాత మరింత దగ్గరయ్యారు. అయితే.. బెర్లుస్కోనీ వ్యాపారాన్ని ఆయన ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ్యాపార వాటాలో 53 శాతం కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మీలియన్ల యూరోలను కేటాయించారు బెర్లుస్కోనీ. మాఫియాతో సహవాసం చేసి, జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మీలియన్ల యూరోలను ఇచ్చారు. ఉన్న ఆస్తిలో పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచి ఇస్తున్నట్లు వీలునామా రాసిన బెర్లుస్కోనీ.. మిగిలిన ఆస్థిని ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నట్లు రాశారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకున్నప్పటికీ వీలునామాలో మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. ల్యుకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో జూన్ 12న మరణించారు. వ్యాపార వేత్తగా, ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరేళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు. ఇదీ చదవండి: దయా హృదయం-మహా ఖరీదు.. అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా! -
విమానంలో ప్యాసింజర్ వీరంగం.. కొట్టి, ఉమ్మి వేసి..
విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనలకు సంబంధించన పలు ఘటల గురించి విన్నాం. ఇటీవలే సహ ప్రయాణకురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహ ఘటనలు వరసగా వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడొక ప్రయాణికురాలు అంతకు మించి అన్నట్టుగా.. చాలా ఘోరంగా ప్రవర్తించింది. ఆమె చేసిన హంగామా...ఆ విమానంలోని సిబ్బందిని హడలెత్తించేలా వికృతంగా ప్రవర్తించింది. తనది కాని సీటులో కూర్చొన్నదే గాక సిబ్బందిని దుర్భాషలాడుతూ..వారిపైనే దాడికి దిగింది. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...విస్తారా అబుదాబి అనే ముంబై విమానంలో 45 ఏళ్ల ఇటాలియన్ ప్రయాణికురాలు నానా బీభత్సం సృష్టిచింది. ఆమె ఎకనామీ టిక్కెట్టు కొనుక్కుని బిజినెస్ సీటులో కూర్చొంటానని పట్టుబట్టింది. ఆ సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పేందుకు యత్నించగా.. వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగింది. ఆ సిబ్బందిలో ఒకర్నీ కొట్టి, మరొకరిపై ఉమ్మి వేసి భయానకంగా ప్రవర్తించింది. అక్కడితో ఆగక అర్థనగ్నంగా నడిచి ప్రయాణికులను, సిబ్బందిని భయబ్రాంతులకు లోను చేసింది. దీంతో కెప్టెన్ ఆమె అనుచిత ప్రవర్తన దృష్ట్యా హెచ్చరిక కార్డ్‌ను జారీ చేసి ప్రయాణికురాలిని నిరోధించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి..సదరు ప్రయాణకురాలిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రౌండ్ సెక్యూరిటీ ఏజెన్సీలను అలర్ట్ చేశాడు. ఈ మేరకు భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: 13 గంటలు గగన ప్రయాణం.. చివరికి ఊహించని ల్యాండింగ్.. ప్రయాణికుల షాక్) -
గుం‘టూరు’ వచ్చిన ప్రపంచ పర్యాటకురాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ పర్యటనలో ఉన్న ఇటలీ దేశస్తురాలు ఎలీనా ఎగ్జీనా సోమవారం గుంటూరు నగరానికి వచ్చారు. గత మూడున్నరేళ్లుగా బైక్‌పై 28 దేశాలను సందర్శించిన ఆమె ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యలో గుంటూరు పండరీపురంలోని పులుగు దీపక్ నీట్, జేఈఈ ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న విద్యారి్థనులతో మమేకమై మహిళా సాధికారతపై మాట్లాడారు. విద్యారి్థనులు విద్యావంతులుగా ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు. తన పర్యటన విశేషాలను వివరిస్తూ బైక్‌పై మూడున్నరేళ్ల క్రితం మొదలైన తన ప్రపంచ యాత్ర ఇప్పటికి 28 దేశాల్లో ఎక్కడా ఒక్క హోటల్లో బస చేయకుండా, నిరంతరం కొనసాగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విభిన్న సంస్కృతులు, భిన్నమైన ప్రదేశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ఎలీనాను సత్కరించిన శిక్షణా కేంద్ర నిర్వాహకుడు పులుగు దీపక్ భారతదేశ గొప్పతనాన్ని వివరించే స్పేస్ సైన్స్ పుస్తకాన్ని బహూకరించారు. గుంటూరులో తనకు లభించిన ఆదరణ, ఆతీ్మయ స్వాగతంపై ఎలీనా ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్... ఆందోళనలో శాస్త్రవేత్తలు
తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్‌ని గుర్తించింది ఇటాలియన్ పరిశోధక బృందం. దీంతో పరిశోధకులు ఒక్కసారిగా ఈ పాలు ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లిపై పరీక్షలు నిర్వహించగా ఆమె పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ ఘటనతో పాలివ్వడం మంచిదని చెప్పాల? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ పాల వల్ల ఉపయోగాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండటంతో పరిశోధకులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరితగతిన పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. తాము ఇంతవరకు సుమారు 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను మానవ కణ తంతుల్లోనూ, జంతువుల్లో, సముద్ర జీవుల్లోనూ గుర్తించాం అన్నారు. అవన్నీ ల్యాబ్‌లో చనిపోయిన వాటిపై జరిపిన పరిశోధనల్లో బయటపడినట్లు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో... గర్భిణి మహిళ గర్భధారణ సమయంలో ప్లాస్టిక్ వాటిల్లో సర్వ్ చేసే ఏ ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే మానవుని కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు సీ ఫుడ్ తీసుకునేటప్పుడూ, పాలు తీసుకునేటప్పుడూ కాస్త జాగురకతతో ఉండాలని అన్నారు. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల కంటే తల్లి పాల ప్రయోజనాల గురించే నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని వైద్యుడు నోటార్స్టెషానో చెబుతున్నారు. అంతేగాదు కాలుష్యాన్ని నియంత్రించే చట్టాలను ప్రోత్సహించేలా రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అలాగాని పిల్లలకు బాటిల్ పాలను అలవాటు చేయడం మంచిద కాదని, పైగా దానివల్ల వారు మరింత ప్లాస్టిక్ వారి నోటిలోకి డైరెక్ట్‌గా వెళ్లే ప్రమాదం ఎక్కువ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్‌లు, సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణి స్త్రీలకు శాస్త్రవేత్తలు సలహలు, సూచనలు ఇస్తున్నారు. (చదవండి: 7 ఖండాలు కాదు ఏక ఖండమే..!) -
వైరల్ వీడియో: 68 మంది కవలలతో ఫ్యాషన్ షో
-
68 మంది కవలలతో ఫ్యాషన్ షో: వీడియో వైరల్
ఇప్పటి వరకు పలు రకాల ఫ్యాషన్ షోలు చూసి ఉంటాం. వాటిల్లో వారు ధరించిన బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ సాగేవి. ఇక్కడోక ఫ్యాషన్ షో మాత్రం అత్యంత విభిన్నంగా రూపొందించారు. మాగ్జిమమ్ ఎవరి ఇంట్లోనైనా ఇద్దరు అక్కచెల్లెళ్లు, లేదా అన్నాదమ్ములు లేదా కవలలు ఉంటే ఒకేలాంటి డ్రస్‌లు వేస్తారు. దీన్నే థీమ్‌గా తీసుకుని కవలలతో ఫ్యాషన్ షో నిర్వహించింది ఓ ప్రముఖ కంపెనీ వివరాల్లెకెళ్తే... ఈ షోలో ఇద్దరో లేదా ఐదోగురో కవలలు కాదు. ఏకంగా 68 మంది కవలలతో ఫ్యాషన్ షోని ప్రదర్శించారు. ఈ షోని ఇటాలియన్ దుస్తుల, జ్యువెలరీకి సంబంధించిన బ్రాండ్ గుస్సీ 'గుస్సీ ట్విన్బర్గ్' పేరుతో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించింది. అలెశాండ్రో మిచెల్ అనే ప్రముఖ డిజైనర్ 2022-23 స్ప్రింగ్ సమ్మర్ సీజన్ పేరిట మిలాన్ ఫ్యాషన్ షోలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఈ షోకి సంబంధించిన వీడియోలను గుస్సీ బ్రాండ్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట చేసింది. ఆ వీడియోలో ఒకే రకమైన దుస్తులు, జువైలరీని ధరించిన కవలల మోడళ్లు నడుస్తూ వస్తుంటారు. మిచెలల్ తన ఫ్యాషన్ షోలో పురాతన కాలం నాటి దుస్తులు, సింబల్స్‌ను ఉపయోగించి అప్పటి నాగరికతను ప్రతిబింబించేలా రూపొందించారు. పాతకాలం నాటి సినిమాల్లో ఉపయోగించిన దుస్తులను కూడా కవలల మోడళ్లు ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ వీడియోకి ఏడు వేలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: పుతిన్ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం...గాయపడ్డ కమాండర్: వీడియో వైరల్) -
US Open 2022: అల్కరాజ్ అద్భుతం
న్యూయార్క్: 315 నిమిషాలు... 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్, 21 ఏళ్ల జన్నిక్ సిన్నర్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ సమరమిది. యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండో సుదీర్ఘ పోరుగా రికార్డులకెక్కిన ఈ మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడగా చివరకు అల్కరాజ్దే పైచేయి అయింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ముగిసిన ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (7/9), 6–7 (0/7), 7–5, 6–3 స్కోరుతో 11వ సీడ్ సిన్నర్ (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా 1990 (పీట్ సంప్రాస్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సెమీ ఫైనల్లో అల్కరాజ్ 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)తో తలపడతాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో టియాఫో 7–6 (7/3), 7–6 (7/0), 6–4 తేడాతో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరాడు. 2006 (ఆండీ రాడిక్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి అమెరికా ఆటగాడు టియాఫో కావడం విశేషం. ప్రతీ షాట్లో పోరాటం... ఈ ఏడాది వింబుల్డన్‌లో సిన్నర్ చేతిలో ఓడిన అల్కరాజ్ ప్రతీకారం తీర్చుకునే దిశగా తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో కోలుకున్న సిన్నర్ గట్టి పోటీనిచ్చాడు. నాలుగు సెట్ పాయింట్లు కాపాడుకున్న అతను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడా మరో సెట్ పాయింట్‌ను కాచుకొని స్కోరు సమం చేశాడు. మూడో సెట్లో కూడా ఇదే ఫలితం పునరావృతమైంది. అయితే ఈ సారి అల్కరాజ్ ముందుగా 4–2తో, ఆపై 6–5తో ఆధిక్యంలోకి వెళ్లి కూడా సెట్‌ను కోల్పోయాడు. సిన్నర్ పదునైన డిఫెన్స్‌తో స్పెయిన్ ఆటగాడిని అడ్డుకోగలిగాడు. నాలుగో సెట్ మళ్లీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు దురదృష్టం సిన్నర్‌ను పలకరించింది. 5–4తో ఆధిక్యంలో ఉండి సెమీస్ చేరేందుకు సర్వీస్ చేసిన అతను అనూహ్యంగా పట్టు కోల్పోయాడు. పుంజుకున్న అల్కరాజ్ పదో గేమ్‌తో పాటు మరో రెండు గేమ్‌లు వరుసగా నెగ్గి ఫలితాన్ని చివరి సెట్‌కు తీసుకెళ్లాడు. అ ప్పటికే ఇద్దరూ తీవ్రంగా అలసిపోగా...అల్కరాజ్ మాత్రం పట్టుదల కనబర్చి ఏకపక్షంగా సెట్‌ను సాధించి మ్యాచ్ గెలుచుకున్నాడు. సిన్నర్ 8, అల్కరాజ్ 5 ఏస్‌ల చొప్పున కొట్టగా... అల్కరాజ్ అనవసర తప్పిదాలు(38)తో పోలిస్తే సిన్నర్ (61) ఎక్కువ తప్పులతో మూల్యం చెల్లించుకున్నాడు. నంబర్‌వన్ జోరు... మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరైనా సబలెంకా (బెలారస్) సెమీస్‌లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 7–6 (7/4) స్కోరుతో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించగా...ఆరో సీడ్ సబలెంకా 6–1, 7–6 (7/4)తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. -
కొల్లగొట్టేందుకు వచ్చి పట్టుబడ్డ దొంగలు... కొంపముంచిన ప్లాన్
ఇటీవల దొంగలు దోచుకునేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడ్డ ఉదంతాలు కోకొల్లలు. అంతేందుకు ఇటీవల ఒక దొంగ ఒక దేవాలయంలో దొంగతనానికి వచ్చి కిటికిలో ఇరుక్కుపోయి పట్టుబడ్డాడు. అచ్చాం అలానే ఒక దొంగల ముఠా ఏకంగా బ్యాంక్‌ని కొల్లగొట్టేందుకు ఒక పెద్ద స్కేచ్ వేశారు. అదే వారిని పట్టుబడేలా చేసింది. వివరాల్లోకెళ్తే....రోమ్‌లో ఒక ప్రముఖ బ్యాంకును దోచుకునేందుకు నలుగురు దొంగలు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఈ మేరకు రోమ్‌లోని వాటికన్ సమీపంలో ఇన్నోసెంటజోలోని రోడ్డులో కొంత భాగం కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా బ్యాంకుకు చేరుకునేలా సోరంగం తవ్వారు. ఆ సోరంగ గుండా వెళ్లి బ్యాంకును దోచుకోవాలనేది వారి ప్లాన్. ఆ నలుగురు దొంగలు అనుకున్న విధంగానే వెళ్లారు గానీ అందులో ఒక వ్యక్తి మాత్రం ఆ సోరంగం నుంచి బయటపడ లేకపోయాడు. దీంతో తనను రక్షించండి అంటూ పెడబొబ్బలు పెట్టాడు. దీంతో ఆ వ్యక్తి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో సదరు దొంగను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ మేరు పోలీసులు సదరు దొంగను రక్షించగా అసలు విషయం బయటపడింది. దీంతో తప్పించుకున్న మిగతా ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దొంగల ముఠాపై పలు దోపిడి నేరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
అలాంటి ఇలాంటి రికార్డు కాదు....కారు వెళ్తుండగానే టైరు మార్చడం
ఇంతవరకు ఎన్నో గిన్నిస్ రికార్డులు చూశాం. మీసాలతో కారుని లాగడం, ఒక్కవేలుతో పెద్దపెద్ద బరువులను ఎత్తడం వంటి ఎన్నో భయంకరమైన ఫీట్లతో చేసిన రికార్డులను చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా ఏకంగా కారు వెళ్తుండగానే కారులో ఉండే టైరు మార్చడం అంటే ఊహకందని విషయం. ఇలాంటి ఫీట్ చేయాలనే ఆలోచన రావడమే గ్రేట్ అనుకుంటే అసాధ్య కాదంటూ చేసి చూపించి మరీ గిన్నిస్ రికార్డు సృష్టించారు ఇద్దరు ఇటాలియన్లు. వివారాల్లోకెళ్తే....ఇటలీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు. అదీ కూడా చాలా వేగంగా ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు. ఈ మేరకు మాన్యయోల్ జోల్డాన్ అనే వ్యక్తి కారుని డ్రైవ్ చేస్తుండగా... జియాన్లుకా ఫోల్కో కారు వేగంగా కదులుతుంటే కారు కిటికిలోంచి వేలాడుతూ... టైరు మార్చేశాడు. మునపటి రికార్డును బ్రేక్ చేసి మరీ అత్యంత వేగవంతంగా కారు టైరుని మార్చేశాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ...ఏకంగా 500 మందికి భోజనాలు) -
తెల్లటి నెమలిని ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్
white peacock captured in flight: సాధారణంగా నెమలి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నెమళ్లు ఎక్కడైన కనిపిస్తే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా తన్మయంతో చూస్తుంటారు. నిజానికి తెల్లటి నెమళ్లు గురించి గానీ అవి ఉంటాయని గానీ ఎవ్వరికీ తెలియదు. ఈ వైరల్ వీడియో చూస్తే కచ్చితంగా పాల నురుగులాంటి ఒక అత్యద్భుతమైన నెమలి ఉందని ఒప్పుకుంటారు. వివరాల్లోకెళ్తే....ఉత్తర ఇటాలియన్ ద్వీపం ఐసోలా బెల్లాలోని బరోక్ గార్డెన్‌లోని శిల్పం వద్ద ఒక అరుదైన దేవతా పక్షిలా కనువిందు చేసింది. తొలుత ఈ పక్షిని చూసిన వెంటనే ఏంటిది అనిపిస్తుంది. దాన్ని నిశితంగా చూస్తే గాని అది తెల్లటి నెమలి అని అవగతమవదు. అంతేకాదు దాని ఈకలు తెల్లగా దేవతా పక్షి అనిపించేలా మెరుస్తూ ఉంటాయి. అయితే ఇవి లూసిజం అని పిలువబడే జన్యు పరివర్తన అని శాస్తవేత్తలు అంటున్నారు. ఇవి ఎక్కువగా బంధింపబడే ఉంటాయని చెబుతున్నారు. వీటి జనాభా కూడా చాలా తక్కువేనని అంటున్నారు. White peacock in flight..🦚😍 pic.twitter.com/CnBNbSoprO — 𝕐o̴g̴ (@Yoda4ever) April 29, 2022 (చదవండి: నాగుపాముతోనే నాగిని డ్యాన్స్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు) -
Rodomontade: రాజు గారిని కాదని ప్రత్యర్థితో పారిపోయినందుకు ఆమెను చంపేసి..ఆపై
How Word Rodomontade Enter In English Dictionary What Does It Mean: రోడమాంటేడ్.. ఇంతకీ ఎవరీయన? మాటియో మారియా బొయార్డో రాసిన ఇటాలియన్ ఎపిక్ పోయెమ్ ‘ఒరియండో ఇనెమోరటో’ (ఇంగ్లీష్‌లో ఒరియండో ఇన్ లవ్)లోని ఒక క్యారెక్టర్ ఈ రోడమాంటేడ్. ఇతడు సార్జా రాజు. ఊచకోతల మాట ఎలా ఉన్నా కోతలు బాగానే కోసేవాడు. గ్రనడా రాకుమార్తెను మహా గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమె మాత్రం రాజుగారిని కాదని అతని ప్రత్యర్థితో పారిపోతుంది. దీంతో ఆ ప్రేమికరాజు అహం దెబ్బతింటుంది. కోపంలో పొరపాటున ఆమెను చంపేస్తాడు. ఆ తరువాత పశ్చాత్తాపానికి గురవుతాడు. ఆమె జ్ఞాపకంగా ఒక వంతెన కడతాడు. ఈ వంతెన మీద నుంచి వెళ్లేవారు తప్పనిసరిగా ఆమెకు నివాళి అర్పించాలని ఆర్డర్ జారిచేస్తాడు. చంపడం ఎందుకు? ఈ వోవర్ యాక్షన్ ఎందుకు? అనేది తరువాత విషయంగానీ... ఇతడి పేరు ఆంగ్ల నిఘంటువుల్లోకి దూరిపోయింది. తమకు తాము గొప్పలు చెప్పుకునేవారిని ‘రోడమాంటేడ్లా ప్రవర్తించకు’ అనడం పరిపాటి అయింది. చదవండి: Health Tips: కాలీఫ్లవర్ తింటే ఇన్ని ఉపయోగాలా.. బోర్ కొడితే ఇలా ట్రై చేయండి! Shraddha Parekh: చేతిని గట్టిగా పట్టుకుంటే ఇంటర్నల్ బ్లీడింగ్.. ఎముకలు విరిగేవి.. 20 ఏళ్ల తర్వాత -
Bella Ciao: ఇటాలియన్ పాట గుజరాతీ నోట
-
ఇటాలియన్ పాట గుజరాతీ నోట.. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్
న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ మనీ హీస్ట్ సిరీస్ 2 సినిమా గత నెల సెప్టెంబర్ 3న విడుదలైంది. ఈ సినిమా ఎంతలా అభిమానుల ఆదరణకు నోచుకుందో మనకు తెలుసు. అత్యంత ప్రజాదరణ పోందిన ఈ క్రైమ్-థ్రిల్లర్ సినిమా హాలీవుడ్లో ఎప్పుడో వచ్చేసింది. ఈ సినిమా లోని బెల్లా సియావో పాట ప్రేక్షకులు మనస్సుకు ఎంతలా హత్తుకుందంటే ఈ పాట పాడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. (చదవండి: జమ్ము కశ్మీర్లో భారత వైమానిక దళ విన్యాసం) బెల్లా సియావో అంటే సాహిత్యపరమైన అర్ధం అందమైన అమ్మాయికి వీడ్కోలు. ఇది ఇటాలియన్ జానపద కథ, 1943 లో ఇటాలియన్ అంతర్యుద్ధం సమయంలో పాడారు. 1945 లో ఫాసిస్ట్ ఇటాలియన్ సోషల్ రిపబ్లిక్ నాజీ జర్మన్ మిత్రరాజ్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇటాలియన్ పక్షపాతాలు ఈ పాట ఆలపించారు. ఈ ఇటాలియన్ పాటను పంజాబీ, బిహార్ వంటి అనేక భారతీయ భాషల్లోకి అనువదించారు. ప్రస్తుతం ఈ పాటను దేశీ హార్మోనియం, తబలా, మంజీరాపై గుజరాతీ యాసలో పాడారు. ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇది నెటిజన్లు ఎంతగా ఆకర్షించిందటే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: పుట్టిన తేదీ ఉంటేనే విదేశాలకు పయనం) -
ఇటాలియన్ సందుల్లో ఇరుక్కుపోయిన రూ.4 కోట్ల కారు
ప్రముఖ లగ్జరీ ఫెరారీ రోమా వి8 సూపర్ కారు డ్రైవర్ చేసిన నిర్వహకం వల్ల అది ఇటాలియన్ సందుల్లో ఇరుక్కుపోయింది. ఆ కారు తాను హీరో అనుకున్నడెమో సినిమాలో చూపించినట్లు సందులో నుంచి రూ.4 కోట్ల విలువైన కారును తీసుకోని వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే, అది అనుకోకుండా ఆ సందులో ఇరుక్కొని పోయింది. చివరకు ఆ కారును ఆ సందులో నుంచి తీసుకోని వచ్చాడా? లేదా అనేది అస్పష్టంగా ఉంది. యూట్యూబ్ వీడియోలో మాత్రం డ్రైవర్ ఇరుకైనా సందు నుంచి సూపర్ కారును బయటకు తీయడానికి చాలా కష్టపడటం మనం చూడవచ్చు. ఫెరారీ రోమా ఏమి చిన్న కారు కాదు. ఇది 183.3 అంగుళాల పొడవు, 77.7 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఈ సూపర్ కారు బరువు 1,472 కిలోలు. రూ.4 కోట్ల విలువైన కారు సందులో ఇరుక్కొని పోవడం వల్ల దానికి ఎంతో కొంత నష్టం వాటిల్లింది అనే విషయం వీడియోలో చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఫెరారీ రోమాలో 4.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5,750 - 7,500 ఆర్ పీఎమ్ వద్ద 603 బిహెచ్ పీ పవర్, 3,000 - 5,750 ఆర్ పీఎమ్ వద్ద 760 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ కారు 3.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫెరారీ రోమా కారును ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేశారు. దీని ధర మన దేశంలో రూ.3.76 కోట్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. -
దేశీ ప్రీమియం బైక్స్ మార్కెట్‌పై బెనెల్లీ దృష్టి
ముంబై: ఇటాలియన్ సూపర్‌బైకుల తయారీ సంస్థ బెనెల్లీ భారత ప్రీమియం మోటార్ సైకిళ్ల మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరిలోగా 250 – 500సీసీ సిగ్మెంట్లో మూడు బైకుల విడుదల లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బెనెల్లీ 502సీ పవర్ క్రూజర్ బైకుల ప్రీ–బుకింగ్స్‌లను ఇటీవలే ప్రారంభించింది. ఈ నెలలో డెలవరీలను చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా డీలర్షిప్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ప్రీమియం టూ–వీలర్ సిగ్మెంట్లో 250–500 సీసీ శ్రేణి బైకుల అధిక డిమాండ్ ఉన్నందున ఈ విభాగపు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బెనెల్లీ భారత విభాగపు ఎండీ జబాక్ తెలిపారు. ఈ కంపెనీకి చెందిన భారత పోర్ట్‌ఫోలియోలో 500 సీసీ విభాగానికి చెందిన టీఆర్కే 502, టీఆర్కే 502 ఎక్స్‌తో పాటు లియోన్సినో, 374 సీసీ ఇంపీరియల్ అనే మూడు మోడళ్లు ఉన్నాయి. తెలంగాణకు చెందిన మహవీర్ గ్రూప్‌కు అనుబంధ ఆదిశ్వర్ ఆటో రైడ్ సంయుక్త భాగస్వామ్యంలో 2018లో ఒక తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించి తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. -
కళాకారుడు, ఈ అదృశ్య శిల్పం కాస్ట్ ఎంతో తెలుసా?!
ఇక్కడ కనిపిస్తున్న శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. ఏంటీ వేళాకోళమా? లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలా? అని కన్నెర్ర చేయకండి. నిజమే ఇక్కడ శిల్పం లేదు. అలాగని వేళాకోళమూ కాదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే మనిషికి, అతని నిజమైన స్వభావానికీ రూపం ఉండదనే భావనతో దానిని రూపొందించాడు. అందుకే ఇదొక అదృశ్య శిల్పం. దీనిని ఓ ప్రత్యేక గదిలో నిర్దిష్ట వాతవరణంలో భద్రపరుస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ శిల్పాన్ని ఓ వ్యక్తి పదమూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు కూడా. ఇదంతా వింటుంటే గతంలో 86 లక్షల రూపాయల విలువ చేసిన ‘గోడ మీద టేపుతో అతికించిన అరటిపండు’ కళాకృతి కంటే క్రేజీగా ఉంది కదూ! -
ఆ కేసు మూసివేతపై 15న ఆదేశాలిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేరళ తీరంలో ఇద్దరు మత్స్యకారులను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలియన్ నావికా దళం సిబ్బందిపై కేసు మూసివేతకు సంబంధించి ఈ నెల 15వ తేదీన ఆదేశాలు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలి పింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనలు, భారత్, ఇటలీ, కేరళ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి, ఆరోపణలు ఎదు ర్కొంటున్న మెరైనర్లు మస్సిమిలానో లాటొర్రె, సల్వటోర్ గిరోన్‌లపై ఇటలీలో విచారణ జరుగు తుందని ఈ కేసును శుక్రవారం విచారించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం పేర్కొంది. అప్పటి ఘటనలో చనిపోయిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 కోట్ల చొప్పున, మిగతా రూ.2 కోట్లను ఘటన చోటుచేసుకున్న పడవ ‘సెయింట్ ఆంథోనీ’ యజమానికి అందజే యనున్నట్లు కేరళ ప్రభుత్వం ధర్మాసనానికి నివేదిం చింది. ఈ కేసును మూసివేయాలన్న కేంద్రం విన తిపై ధర్మాసనం స్పందిస్తూ మంగళవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. అదేవిధంగా, పరిహారం సొమ్ములో ఎలాంటి కోత విధించకుండా పూర్తిగా బాధితులకు అందేలా చూసేందుకు కేరళ హైకోర్టు కు బదలాయించాలని తెలిపింది. ఎంవీ ఎన్రికా లెక్సీ అనే ఇటాలియన్ ఆయిల్ ట్యాంకర్‌లోని నేవీ సిబ్బంది మస్సిమిలానో లాటొర్రె, సల్వటోర్ గిరోన్ లు పడవలో చేపల వేటకు వెళ్లి వస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. 2012 ఫిబ్రవరిలో కేరళ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో చోటు చేసు కున్న ఈ ఘటన భారత్, ఇటలీ మధ్య కొంతకాలం దౌత్య పరమైన ఉద్రిక్తతలకు కూడా దారితీయడం తెలిసిందే. చదవండి: పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి -
కనిపించని కళాఖండం తయారు చేసి జాక్‌పాట్ కొట్టేశాడు
బ్రసిలియా: ఇటలీకి చెందిన 67 ఏళ్ల సాల్వటోర్ గారౌ కంటికి కనిపించని కళాఖండం తయారు చేశాడు. ఆ కళాఖండం వేలానికి వేయగా అది 15వేల యూరోలకు( ఇండియన్ కరెన్సీలో రూ.13 లక్షలు) అమ్ముడుపోయింది. అలా సాల్వటోర్ కనిపించని కళాఖండంతో జాక్‌పాట్ కొట్టేశాడు. కానీ సాల్వటోర్‌కు ఆ జాక్‌పాట్ దాని వల్ల రాలేదు.. అతని మాటల వల్ల వచ్చింది. విషయంలోకి వెళితే.. సాల్వటోర్ స్వతహాగా మంచి శిల్పి. అతను తయారు చేసే వాటిలో పైకి ఏం కనిపించకపోయినా దానిలో ఒక పరమార్థం ఉంటుంది. తాజాగా అతను ''ఐయామ్'' అనే పేరిట కనిపించని ఒక కళాఖండాన్ని తయారు చేశాడు. కానీ అతను దానిని ప్రదర్శనకు ఉంచినప్పుడు అతను ఏం చూపెట్టాడో అక్కడ ఉన్నవాళ్లకు అర్థం కాలేదు. కాగా సాల్వటోర్ అతను తయారు చేసిన శిల్పం గురించి వివరించాడు. ''నిజానికి నేను అమ్మింది ఒక శూన్యం మాత్రమే.. అంటే ఖాళీదని అర్థం. ప్రపంచంలోని ఏ వస్తువుకు బరువు ఉండదు. నేను చూపించే ఈ వాక్యూమ్‌లోనూ గాలి తప్ప ఇంక ఏం ఉండదు. హైసెన్బర్గ్ సూత్రం ప్రకారం వాక్యూమ్ శక్తితో నిండిన వేగం తప్ప మరొకటి కాదని తెలుసుకున్నా. నా దృష్టి నుంచి చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు మనం నమ్మే దేవుడికి రూపం ఉండడం మీరు గమనించారా.. ఇది అంతే నేను చెక్కిన ఈ శిల్పంలోనూ ఒక రూపం ఉంది. మనసు పెట్టి చూడండి.'' అని చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయిన నిర్వాహకులు అతని శిల్పాన్ని 15వేల యూరోలకు కొన్నారు.కానీ దీనిని టెస్టిఫై చేయాల్సి ఉంటుందని సదరు నిర్వాహకులు సాల్వటోర్‌కు తెలిపారు. చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు -
వరల్డ్ గ్రేటెస్ట్ లవర్: ‘ఆయనకు 130 మంది లవర్స్’
‘కాసనోవా ఎవరు?’ అనే ప్రశ్నకు ‘వరల్డ్ గ్రేటెస్ట్ లవర్’ ‘ఆయనకు 130 మంది లవర్స్’ ‘ఆయన చూపుల మాయజాలంలో ఎంత అందగత్తె అయినా చిక్కుకుపోవాల్సిందే’....ఇలా ఎన్నో వినిపిస్తాయి. కాసనోవా ఆత్మకథ ఇప్పటికీ హాట్‌కేకే!. కాసనోవాపై ఆసక్తితో ఆయన గురించి చరిత్రకారులు ఎప్పటికప్పడూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా పరిశోధన చెప్పేదేమిటంటే...కాసనోవా మంచి వైద్యుడు అని. ఆయన వైద్యుడు కాలేకపోయినా(ఫెయిల్డ్ డాక్టర్) వైద్యశాస్త్రం పట్ల ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఎన్నో వైద్య పుస్తకాలు చదివేవాడు. వైద్యానికి సంబంధించి ఆయన ఆలోచనలు, పరిశీలనలు, అంచనాలు చాలా విలువైనవి అంటున్నారు పరిశోధకులు. మొటిమల నివారణ నుంచి గర్భస్రావరం వరకు ఆయన స్త్రీలకు ఎన్నో సలహాలు ఇచ్చేవాడట. ఆయన చరిత్రపై ‘శృంగారపర్వం’ మాత్రమే డామినెట్ చేయడంతో ఆయనలోని నిపుణుడైన వైద్యుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. వెనిస్లో జన్మించిన గియాకోమో జిరోలామో కాసనోవా... సైనికుడు, జూదరి, వ్యాపారి, సాహసికుడు, రచయిత.. ఇలా ఎన్నో కావాలనుకున్నాడు.. పదిమందిలో పేరు తెచ్చుకోవడానికి కాదు, పలువురు స్త్రీల మనసు దోచుకోవడానికి! ఒకానొక సమయంలో కాసనోవా డిప్రెషన్లోకి వెళ్లాడు. దాని నుంచి బయటపడడానికి రోజుకు 10 గంటలు తన జ్ఞాపకాలను రాసేవాడు. ‘ఐసోలేషన్’ అనే మాట ఇప్పుడు చాలా గట్టిగా వింటున్నాంగానీ ఆరోజుల్లోనే కాసనోవా ఐసోలేషన్లోకి వెళ్లాడు. కరోనా కాదు సుమీ! తన ఆత్మకథ ‘స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పూర్తిచేయడానికి. ఈ పుస్తకం పై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ 18వ శతాబ్దంలో యూరోపియన్ల సాంఘిక జీవితాన్ని సాధికారికం గా చెప్పిన పుస్తకం అనడంలో ఎవరూ విభేదించరు. చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే -
670 కోట్ల అరుదైన చిత్రం!
కళాచరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే చిత్రకారుల్లో ఇటాలియన్ చిత్రాకారుడు సాండ్రో బాటిచెలి ఒకరు. ఆయన చిత్రించిన అలనాటి చిత్రం ఒకటి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 15 వ శతాబ్దానికి చెందిన ఈ చిత్రం న్యూయార్క్‌లోని సోత్బీస్ యాక్షన్ హౌజ్‌లో 670 కోట్లకు అమ్ముడుపోయి కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ‘యంగ్ మ్యాన్ హోల్టింగ్ ఏ రౌండెల్’ అని పేరుగల ఈ చిత్రరాజాన్ని వేనోళ్ల పొగుడుతుంటారు కళాభిమానులు. ఈ చిత్రం మార్కెటింగ్ కోసం నాలుగు నెలల సమయాన్ని వెచ్చించారు. లాస్ ఎంజెల్స్, లండన్, దుబాయ్‌లలో ప్రదర్శించారు. కళా, సాంకేతిక విషయాలకు సంబంధించిన విశ్లేషణతో 100 పేజీల కేటలాగ్ కూడా ప్రచురించారు. మొత్తానికైతే ఫలితం వృథా పోలేదు. చిత్రంలో ఉన్న వ్యక్తి గురించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు అనేది పక్కన పెడితే ఆ కాలానికి చెందిన సంపన్న, శక్తిమంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు. అంత పెద్ద మొత్తం పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన కళాభిమాని పేరు, వివరాలు ఇప్పటికైతే గోప్యంగా ఉన్నాయి. -
నాదల్ వస్తున్నాడు
రోమ్: ఏడు నెలల విరామం తర్వాత స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టనున్నాడు. ఈనెల 14 నుంచి 21 వరకు రోమ్‌లో జరిగే ఇటాలియన్ ఓపెన్‌తో నాదల్ పునరాగమనం చేయనున్నాడు. ఫిబ్రవరిలో మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్‌లో నాదల్ చివరిసారి బరిలోకి దిగి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో అంతర్జాతీయ టోర్నీలు నిలిచిపోయాయి. గత నెలలో న్యూయార్క్‌లో సిన్సినాటి ఓపెన్‌తో అంతర్జాతీయ టెన్నిస్ పునఃప్రారంభమైనా నాదల్ ఆ టోర్నీలో ఆడలేదు. న్యూయార్క్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో నాదల్ యూఎస్ ఓపెన్ టోర్నీకీ దూరంగా ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహక టోర్నీ అయిన ఇటాలియన్ ఓపెన్‌లో ఫెడరర్ మినహా టాప్–20 లోని 19 మంది ఆటగాళ్లు ఎంట్రీలు ఖరారు చేశారు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10లో నంబర్‌వన్ యాష్లే బార్టీ మినహా మిగతా తొమ్మిది మంది బరిలోకి దిగుతున్నారు. -
భారత్‌లో మరో కరోనా కేసు నమోదు
జైపూర్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని గజగజవణికిస్తోంది. ఈ వ్యాధికి సంబంధించి భారత్‌లో ఇప్పటిదాకా ఐదు కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో కేసు నమోదైంది. ఇటలీకి చెందిన పర్యాటకుడు భారత్ పర్యటనకు రాగా జైపూర్‌లో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించి కరోనా వైద్య పరీక్షలు చేయగా తొలుత నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కరోనాతో మరో వైద్యుడు మృతి అయితే అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించారు. అతని రక్తనమూనాలను పుణేలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగానికి పంపించారు. పరీక్ష చేసిన నిపుణులు అతనికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరుకి చేరింది. ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్ లో మరొకరికి కరోనా సోకినట్టు సోమవారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 90వేల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చదవండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం' -
పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు
ప్రేమించడం చాలా సులువైన పనే కానీ.. ప్రేయసిని ఒప్పించేలా ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత సులువేమీ కాదు. ప్రియురాలిని మెప్పించడానికి అనేక పద్దతులను, వినూత్న ఆలోచనలను ప్రయోగిస్తూ ఉంటారు. ప్రేమను పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా తెలియజేయాలి అనుకుంటారు ప్రేమికులు. ఇటాలియన్‌కు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి దారిని ఎంచుకున్నాడు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సమయంలో తన ప్రేయసి ఎలీసాకి ప్రపోజ్ చేశాడు ఎంపీ డై మూరో. ఈ ఘటన గురువారం ఇటాలియన్ పార్లమెంట్లో చోటుచేసుకుంది. వివరాలు.. డై మూరో ఇటాలియన్ ఎంపీ, తన ప్రేయసి ఎలీశా. గతకొంత కాలంగా ఆమెను ఇష్టపడుతున్నాడు. అయితే గురువారం పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా డై మూరో ప్రసంగం వినేందుకు ఎలీశా సభకు వచ్చారు. గ్యాలరీలో కూర్చోని ప్రసంగాన్ని వింటున్నారు. ఈ సమయంలో మూరో తన ప్రేమను వ్యక్త పరిచాడు. ‘విల్ యూ మ్యారీ మీ ఎలీశా’ అంటూ డైమెంట్ రింగ్‌ను చూపించాడు. వెంటనే పక్కనున్న సహచర సభ్యులంతా అతని చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాసేపటికే ఎలీశా తన ప్రపోజల్‌ను అంగీకరించిందని తోటి సభ్యులు తెలిపారు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సభ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలోనే అతను ప్రపోజ్ చేయడం విశేషం. -
విదేశీ రుచులకు ఫిదా..
సాక్షి, విశాఖపట్నం : ఒకప్పుడు ఏదైనా విదేశీ వంటకం టేస్ట్ చేయాలి అంటే కాస్తా శ్రమించేవారు. ఏ దేశం స్పెషల్ కావాలంటే.. ఆ దేశానికి వెళ్లి తీరాల్సిందే. అది వీలుకాని వారు.. విదేశాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతూ.. అక్కడి ఫుడ్ గురించి చెబితే తిన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పర్యాటక స్వర్గధామంగా భాసిల్లుతున్న నగరంలో రోజుకో రెస్టారెంట్ పుట్టుకొస్తోంది. దేశ, విదేశాల ఫుడ్ మెనూ అంతా నగరం నలుమూలల వ్యాపించేసింది. ఆయా రెస్టారెంట్లలో ఇటాలియన్, మెక్సికో, చైనా, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వంటలు నగర ప్రజల నోరూరిస్తున్నాయి. ఫ్యామిలీతో కలసి నచ్చిన వంటకాలు రుచి చూడాలంటే ఖచ్చితంగా గులాబీ నోటు జేబులో ఉండాల్సిందే. సిటీలో ఫుడ్లవర్స్ని నోరూరిస్తున్న వంటకాలను మనం ఓసారి టేస్ట్ చేద్దాం.... ఇరగదీస్తున్న ఇటాలియన్ రుచులు... ఇటలీ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతి ఉందో..అక్కడ లభించే ఫుడ్‌కు అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఇటలీకే పరిమితమైన ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, పోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు... ఇటాలియన్ వంటకాలను చవులూరించేలా మారుస్తున్నాయి. కార్న్‌తో చేసే ‘పొలెంటా’ నగరంలో కూడా నోరూరిస్తున్నాయి. ఇద్దరు కలసి ఇటాలియ న్ రుచులను చూడాలంటే కనీసం రూ.1000 నుంచి రూ.2వేలు వెచ్చించాల్సిందే. లెబనీస్... వెరీ వెరీ టేస్టీ బాస్... డ్రైఫ్రూట్స్‌ను విరివిగా ఉపయోగించే లెబనీస్ శైలి వంటకాలు కూడా నగరంలో ఆదరణకు నోచుకుంటున్నాయి. శెనగలు ఎక్కువగా వాడే వీరి వంటకాల్లో... ఆల్ షీమీ కోఫ్తాడజాజ్, కబ్సా బిర్యానీ, ఖబ్సాలాహమ్ వంటివి నగరంలో ఫుడీస్‌కు చేరువయ్యాయి. ఆలివ్ ఆయిల్‌తో ఈ వంటకాలు చేయడం కూడా ఆరోగ్యప్రియుల ఆదరణకు కారణం. మైండ్‌లో ఫిక్సయితే..మెక్సికన్ టేస్ట్ చెయ్యాల్సిందే... మెక్సికన్‌ను మనం సినిమాల్లో చూసి ఉంటాం. సిటీలో సైతం మెక్సికన్ వంటకాలు మైండ్‌బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. స్పైసీగా ఉండాలంటే మాత్రం మెక్సికన్ ఫుడ్‌పై ఓ కన్నెయ్యాల్సిందే. భారతీయ వంటకాల శైలికి దగ్గరగా ఉండడం కూడా మెక్సికన్ క్యుజిన్ని సిటీæజనులకు దగ్గర చేస్తోంది. వ్రోప్స్, నాథూస్, కేజూన్స్పైస్... వంటివి నగరంలో బాగా ఫేమస్ ఫుడ్‌గా పేరొందింది. చిప్టోల్ చికెన్ నగర భోజన ప్రియులు మెచ్చే స్టార్టర్‌గా మారిపోయింది. ఫ్యామిలీతో వెళ్లి మెక్సికన్ రుచులను ఆరగించాలంటే రూ.750నుంచి రూ.2వేలు ఉండాల్సిందే. గ్రీక్ ఫుడ్.. వెరీ గుడ్.. లేట్‌గా వచ్చినా లే‘టేస్ట్’ అనిపించుకుంటున్నాయి గ్రీక్ రుచులు. రోజ్మేరీ, థైమ్, బేసిల్ (తులసి) వంటి హెర్బ్స్ (వివిధ రకాల ఆకులు) అధికంగా మేళవించే ఈ వంటకాలు ఇప్పుడిప్పుడే నగరానికి పరిచయమవుతున్నాయి. అలాగే వెరైటీ బ్రెడ్స్ కూడా ఈ గ్రీక్ క్యుజిన్కు స్పెషల్. ప్రస్తుతానికి వెజ్ ముసాకా, ఎమిస్టా వంటి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. హాట్.. హాట్.. ఆఫ్ఘాన్ ఫుడ్... ఆఫ్ఘనిస్తాన్ వంటకాలు కూడా.. ఫుడీస్ని కట్టిపడేస్తున్నాయి. అక్కడి ప్రజల అభిరుచుల మేరకు తయారు చేసే వంటకాలన్నీ ఇప్పుడు నగరంలోని ఫుడ్డీలకు అందించడం హాట్టాప్క్గా మారుతోంది. నగరంలోని పలు రెస్టారెంట్లలో లభిస్తున్న విదేశీ వంటకాలను టెక్కీలు టేస్ట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ‘కుబ్లీ పలావ్’ భోజనప్రియుల్ని లొట్టలేయిస్తోంది. అదిరే.. అదిరే.. అరేబియన్ అమెరికా క్యుజిన్‌ను పోలి ఉండే అరేబియన్ శైలి వంటకాలు కూడా నగరంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. కబ్సా, మురమ్మరాతో పాటు బఖాదరా వంటి డిజర్ట్లు కూడా నగర ఫుడీస్‌కు ఫేమస్. అరేబియన్ వంటకాల్లో డ్రైఫ్రూట్స్ బాగా వినియోగించడం సిటీలో మరింత ఆదరణకు కారణమైంది. థాయ్.. ఇది చాలా టేస్ట్ గురూ... థాయ్‌లాండ్ అంటే గుర్తొచ్చేది ఒక్క మసాజే కాదు.. వంటకాలు కూడా ఆ దేశంలో మైమరిపిస్తాయి. ఉడికించిన, కాస్త కఠినంగా ఉండే రైస్, లెమన్‌గ్రాస్, స్వీట్ జింజిర్, నూనెలు తక్కువగా ఉపయోగించే ఆరోగ్యకరమైన ఆహారశైలిగా దీనికి పేరు. నగరంలో తోఫూ, బేసిల్–లెమన్ సూప్, పహాడ్క్రాపావో మొదలైన థాయ్ఫుడ్ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఇక రొయ్యల వంటకాలంటే లొట్టలేసే ప్రియులకైతే థాయ్... సూపరోయ్. థాయ్ వంటకాల్ని ఇద్దరు కలసి టేస్ట్ చేయాలంటే రూ.1000 పైనే ఖర్చవుతుంది. అభిరుచులకు అనుగుణంగా.... సిటీలోని ఫుడ్డీల అభిరుచికి అనుగుణంగా రెస్టారెంట్లు వస్తున్నాయి. దీన్నిబట్టి సిటీలోని పలు రెస్టారెంట్లలో విదేశీ వంటకాలు హల్చల్ చేస్తున్నాయి. రుచులతో పాటు ఆయా రెస్టారెంట్లలో వినోదం కూడా ఉండటం విశేషం. వివిధ దేశాల ప్రజలు విశాఖలో పర్యటిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా సిద్ధం చేస్తున్న ఫుడ్.. నగర వాసులకూ ఫేవరెట్‌గా మారుతున్నాయి.– శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ -
50వ ‘మాస్టర్స్ సిరీస్’ ఫైనల్లో రాఫెల్ నాదల్
నాలుగు నెలల విరామం తర్వాత స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ సీజన్లో రెండో టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. నాదల్ కెరీర్లో ఇది 50వ మాస్టర్స్ సిరీస్ ఫైనల్ కావడం విశేషం. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో ఆడిన నాదల్ ఆ తర్వాత ఐదు టోర్నీల్లో పాల్గొన్నా సెమీఫైనల్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు. -
వినసొంపైన సోఫా
సాక్షి, హైదరాబాద్: సోఫాలంటే మనకు తెలిసింది కూర్చోవటానికి, పడుకోవటానికి పనికొచ్చేవే. కానీ, మార్కెట్లో ఆధునికమైన, విలాసవంతమైన సోఫాలు కూడా లభ్యమవుతున్నాయి.ముఖ్యంగా ఇటాలియన్ రకాల సోఫాలకు ఆదరణ పెరుగుతోంది. ►ఆధునిక ఫర్నిచర్‌ను నగరవాసులు అక్కున చేర్చుకుంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సోఫాల్లో లైట్లు వెలుగుతాయి. స్పీకర్లుంటాయి. దీంతో చక్కని సంగీతాన్ని వినొచ్చు. సెల్ఫోన్లను చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బార్ కౌంటర్ కూడా ఉంటుంది. మీట నొక్కితే చాలు సోఫా వెనక భాగమంతా వెనక్కి వెళుతుంది. మన అవసరాలకు తగ్గట్టుగా వీటిని ఎంచుకోవచ్చు. అవసరమైతే ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు విడివిడిగా కొనుక్కోవచ్చు కూడా. ► ఉన్నత వర్ణాలు, ఐటీ నిపుణులతో బాటు ఇతర నగరాల్లో నివసించేవారంతా ఇటాలియన్ సోఫాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. మాడ్యులర్, రిక్లయినర్, సీక్రెట్ వంటి రకాలకు చక్కటి ఆదరణ వస్తుంది. -
డీజే ఆరోపణలు.. ఎయిర్ ఇండియా రిప్లై
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇటాలియన్ డీజే ఒల్లీ ఎస్సే చేసిన ఆరోపణలపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఇటాలియిన్ డీజే చేసిన ఆరోపణలు అసత్యమైనవని, తమ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించలేదని కొట్టిపారేసింది. సమయానికి పోలీసులు కూడా అందుబాటులో లేరని ఆరోపించిన ఇటాలియన్ డీజేకు విమానశ్రయ పోలీసు అధికారి బదులిచ్చారు. సంఘటన జరిగిన రోజంతా తాను పోలీస్ స్టేషన్లోనే ఉన్నానని, తమ అధికారులు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమెకు వివరించారు. అసలేం జరిగిందంటే.. ఇటాలియన్ డీజే ఒల్లీ ఎస్సే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిర్ ఇండియా సిబ్బంది తనపై చేయి చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలో వారిపై కేసు పెట్టేందుకు విమానశ్రయ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్తే ఎస్సై లేడని, తమకు ఏం తెలియదని అక్కడి పోలీసులు చెప్పారని.. అంతే కాకుండా అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని వివరించారు. విమానశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా విమానం 9 గంటలు ఆలస్యమైందని, అందుకే తాను ఎక్కాల్సిన విమానం ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు డిపరేచర్ గేటు వద్దనున్న అధికారుల దగ్గరికి వెళ్లినట్లు వీడియోలో పేర్కొన్నారు. కానీ, అక్కడి సిబ్బంది స్పందించకపోవడంతో పక్కనే ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లి అడగగా అది తనపని కాదని బిగ్గరగా అరిచారని, మరోసారి అడిగితే చేయిచేసుకున్నారని వీడియోలో పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియాపై ఇటాలియన్ డీజే ఫిర్యాదు
-
భలే ఉందే ఈ బిల్డింగ్..
ఈ భవనమే కాదు.. దీని వెనుక ఉన్న ఐడియా కూడా సూపర్. పైర్‌పాలో లాజరానీ అనే ఇటాలియన్ డిజైనర్ సముద్రంపై ఇలాంటి పిరమిడ్ ఆకారపు ఇళ్లు, నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదిస్తున్నాడు. ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పంటలు పండే గ్రీన్‌హౌస్‌లు, హోటళ్లు, సినిమాలు ఇలా బోలెడన్ని భవనాలను ఒకదగ్గర చేర్చి.. ఓ కొత్త నగరాన్ని కట్టేయాలన్నది లాజరానీ ఆలోచన. దీనికి ఆయన పెట్టిన పేరు.. ‘వాయాల్యాండ్’. ఒక్కో భవనాన్ని వాయా అని పిలుస్తారు. ఫైబర్‌గ్లాస్, కార్బన్లు, ఉక్కుతో తయారయ్యే ‘వాయా’లను మాయన్, జపనీస్ ఆర్కిటెక్చర్ ఆధారంగా డిజైన్ చేశారు. అన్నింటిపై వీలైనంత ఎక్కువ ప్రదేశంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటై ఉంటాయి. వీటితోపాటు వాటర్ టర్బయిన్ల ద్వారా కూడా కరెంటు ఉత్పత్తి అవుతుంది. అవసరమైనప్పుడు ఒక చోటి నుంచి మరోచోటికి వాయాలను తరలించేందుకు మోటార్లు కూడా ఉంటాయి. ఒక్కో వాయా (చిన్నసైజులో ఉండేది) ఖరీదు దాదాపు రూ.రెండున్నర కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వాయాల్యాండ్ నిర్మాణం కోసం లాజరానీ నిధులు సేకరిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2022 నాటికి ఏదో ఒక మహా సముద్రంలో దీనిని నిర్మిస్తానని చెబుతున్నారు. -
జస్ట్ ఫ్రెండ్.. అంతే!
ప్రేమా లేదు... పాడూ లేదు... మీరు ఏవేవో ఊహించుకోవద్దని శ్రుతీహాసన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మధ్య శ్రుతీతో సన్నిహితంగా ఓ అబ్బాయి తిరుగుతున్నాడని, అతను ఆమె లవర్ అనీ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే... ఇటీవల విమానాశ్రయాల్లో శ్రుతీహాసన్‌తో తరచూ ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. రఫ్ అండ్ టఫ్స్టైలిష్ లుక్‌లో కనిపించే అతగాడి పేరు మైఖేల్ కోర్సేల్. అతను లండన్‌లో సెటిల్ అయిన ఇటాలియన్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అందుకని, థియేటర్స్ ఆర్ట్స్‌లో ఓ కోర్స్ కూడా చేశాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన మైఖేల్‌తో శ్రుతీహాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగిందనే వార్తలు షికారు చేశాయి. ప్రేమికుల రోజున ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారనే వార్త గుప్పుమంది. ఇవన్నీ నిజమేనా? అని శ్రుతీహాసన్‌ను తాజా ఇంటర్వూ్యలో ప్రశ్నించగా.. ‘‘అలాంటిదేమీ లేదు. మేం జస్ట్ ఫ్రెండ్స్. అంతే’’ అన్నారామె. ఒక్క ముక్కలో సమాధానం చెప్పిన శ్రుతీహాసన్ ప్రేమలో ఎప్పుడు పడతారో మాత్రం చెప్పలేదు. -
3,800 మీటర్ల ఎత్తు నుంచి దూకి..
వింగ్ సూట్ గేమ్.. ఆటను ఆస్వాదించాలనుకునే వారికి, భయానికి వెరవని వారికి ఈ ఆట ఆడటం అంటే మహా సరదా..! ఒకసారి జంప్ చేస్తే ఎంత ఉత్సహాన్ని ఇస్తుందో, ప్రమాదం జరిగితే అసలు ఆనవాళ్లు కనిపించకపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఫ్రాన్స్ లోని మౌంట్ బ్లాంక్ పర్వతంపై నుంచి వింగ్ సూట్ తో సాహసం చేసి దూకిన ఇటలీకి చెందిన ఓ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయినట్లు పర్వత భద్రతాధికారులు తెలిపారు. శనివారం నుంచి అతని కోసం హెలికాప్టర్లు, పర్వతం మీద రక్షణ బృందం గాలింపు చర్యలు చేపట్టగా.. ఆదివారం ఉదయం దాదాపు 2,000 మీటర్ల ఎత్తులో మృతదేహాన్ని గుర్తించినట్లు వివరించారు. అయితే, తాను వింగ్ జంప్ చేయనున్నట్లు ముందుగానే తెలిపాడని పోలీసులు చెప్పారు. అతని స్నేహితులతో మాట్లాడిన అనంతరం అతను తక్కువ వెలుతురు, మంచుకురుస్తున్న సమయంలో జంప్ చేయడానికి వెళ్లినట్లు చెప్పారని అన్నారు. కాగా, వింగ్ జంప్ చేసే వాళ్లు దాదాపు సగటున ఒక నిమిషం ఎనిమిది సెకన్లపాటు గాలిలో200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతారు. గతేడాది కూడా ఇలానే ఓ వింగ్ జంపర్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
క్లబ్ డ్యాన్సర్లా చెలరేగిన టీచరమ్మ
ప్రాటో(ఇటలీ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఓ ఉపాధ్యాయురాలు గాడి తప్పింది. ఇటాలియన్ హై స్కూల్ టీచరమ్మ బోగోతం అందరూ నివ్వెర పోయేలా చేసింది. అమ్మగారు చేసిన నిర్వాకం వీడియో రూపంలో బయటకు వచ్చింది. అంతే సోషల్ మీడియాలో ఆ వీడియో హాల్ చల్ చేసింది. వివరాల్లోకి వెళితే...వర్డ్ ప్రాసెసింగ్(ఐటీ) ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె క్లాస్ రూమ్ లో అసభ్యకరంగా నృత్యం చేసింది. ప్రాటోలోని టస్కన్లో గ్రాంసికిన్స్ విద్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు అరుస్తూ ఉంటే మైమరచి పోయిన ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే స్ట్రిప్ టీజ్ (దుస్తులు తొలగిస్తూ చేసే నృత్యం) చేసింది. పైకి కిందికి దూకుతూ ఓ క్లబ్ డ్యాన్సర్లా చిందులేసింది. అయితే ఈ వీడియోను గ్రాంసికిన్స్ విద్యార్థులే తీసి, బయట పెట్టినట్టు భావిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించిన చేసిన టీచర్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. 'ఈ వీడియో చూసి షాక్‌కు గురయ్యాను. ఈ సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా మిగతా టీచర్లను ఆదేశించాను' అని హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు మారియా గార్జియా తెలిపారు. అయితే ఇంతకు ముందు వరకు ఆ టీచర్ నడవడిక పై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు. -
28 ఏళ్ళ తర్వాత అక్కడో శిశువు పుట్టింది..!
ఆ ప్రాంతంలో పిల్లలు పుట్టడమే కరువై... సంవత్సరాలు దాటి పోయింది. నవజాత శిశువులకోసం పరితపించే అక్కడి ప్రజలకు.. దశాబ్దాల తర్వాత అద్భుతం జరిగింది. ఏళ్ళుగా వారు కంటున్న స్వప్నం... వారం క్రితం సాకారమైంది. ఇటలీలోని ఓస్థానా పట్టణంలో 1987 తర్వాత ఏ కుటుంబంలోనూ పిల్లలు పుట్టడమే చూడలేదని, స్థానిక మేయర్ లాంబార్డో చెప్తున్నారు. గతవారం ఓ కుటుంబంలో శిశువు జన్మించడం నిజంగా అద్భుత సన్నివేశమని... దీంతో అక్కడి ప్రజలు ఆనందంలో తేలియాడుతున్నారని ఇటలీ డైలీ న్యూస్ పేపర్ లా స్టాంపా వెల్లడించింది. ఓస్థానాలో పుట్టిన చిన్నారితోపాటు... కేవలం 85 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇతర గ్రామాలు, పట్టణాలతో పోలిస్తే ఇక్కడి జనాభా క్రమంగా తగ్గిపోతోంది. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నిజానికి 1975 లో ప్రారంభమై...1976-87 కు మధ్య కేవలం 17 మంది పిల్లలు మాత్రమే పుట్టడం చరిత్రను సృష్టించింది. అప్పట్లో చివరిగా ఓ అబ్బాయి పుట్టినట్లు స్థానిక మేయర్ జియాకోమో లాంబార్డో చెప్తున్నారు. జననాల ట్రెండ్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో... ఈ పరిస్థితి కొనసాగాలని కోరుకుంటూ స్థానికంగా ప్రత్యేక వేడుకను కూడా నిర్వహించారు. జనాభా తగ్గిపోవడాన్ని అరికట్టడం ఎంతో కష్టమని, ఆ దిశగా తాము ఎన్నో ఆలోచనలు చేస్తున్నామని లాంబార్డో అంటున్నారు. ముఖ్యంగా యువ ఇటాలియన్లకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు లేకపోవడం కూడా ఇక్కడ జనాభా తగ్గడానికి కారణమని ఆయన అంటున్నారు. ఉద్యోగాలకోసం ఇక్కడి ప్రజలు అనేకమంది స్వంత ఇళ్ళను కూడా వదిలి నగరాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇటలీలోని ఈ ఓస్థానా పట్టణంలో ప్రస్తుతం ఓ దుకాణం, ఓ బార్, రెండు రెస్టారెంట్లు మాత్రమే ఉన్నట్లు స్థానిక వార్తా వెబ్ సైట్ 'ది లోకల్' ప్రకారం తెలుస్తోంది. ఉత్తర ఇటలీలో కొంత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, దక్షిణ ఇటలీలోని సిసిలీ సహా అన్ని ప్రాంతాలూ తీవ్రమైన భౌగోళిక మార్పులను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితులపై తీవ్ర ఆందోళనకు గురైన కొందరు స్థానికులు... ఇక్కడి జనాభా పెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వైద్యపరీక్షలు చేయించుకొని, మరణాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిసిలీ ద్వీపంలోని గంగి పట్టణంలో గతేడాది మరో ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడి సుమారు 20 గృహాలు రెండు డాలర్లకన్నా అతి తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సుమారు 50 మంది ముందుకొచ్చారు. వీరు తిరిగి వెళ్ళకుండా ఉండేందుకు కొనుగోలుదారుల ఇష్టప్రకారం పునరుద్ధరణకు కూడా అంగీకరించారు. దీంతో ప్రస్తుతం గంగిలో 7 వేల మంది నివాసితులు ఉన్నారు. అయినప్పటికీ ఓస్థానాలో పరిస్థితే ఇక్కడ కూడా ఏర్పడుతుందేమోనని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఓస్థానాలో జన్మించిన శిశువు పాబ్లో రాకను తాము స్వాగతిస్తున్నామని, ఇక్కడ తిరిగి పుట్టుక ప్రారంభమవ్వడం గర్వించదగ్గ మార్పు అని మేయర్ లాంబార్డో అంటున్నారు. స్థానిక యువకులు పట్టణం వదిలి ఉద్యోగాలకోసం వలస వెళ్ళకుండా ఆపే తమ ప్రయత్నం క్రమంగా ఫలిస్తోందని, తల్లిదండ్రులు కొన్నేళ్ళక్రితం ఉపాధికోసం ఊరు వదిలి వెళ్ళినా.. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగావకాశం కల్పించడంతో తిరిగి బస చేసేందుకు యువకులు వస్తున్నారని లాంబార్డో చెప్తున్నారు. తమ ప్రయత్నాలతో క్రమంగా జనాభా కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తున్నట్లు ఆయన అంటున్నారు. -
ఇంట్లో ఇటాలియన్
ఇటాలియన్ ఫుడ్ తినాలంటే ఇటలీ వెళ్లనవసరం లేదు. ఇంట్లోకే ఇటలీని తెప్పించుకోవచ్చు! ఇక్కడ ఇచ్చినవన్నీ ఇండియాలో దొరికే పదార్థాలు. వాటిని మన ఇండియన్ కిచెన్‌లో వండినా ఇటలీ ఐటమ్స్ తయారు అవుతాయి. చేసి చూడండి. ఫారిన్ రుచులను ఆస్వాదించండి. నాచోస్ సగం కప్పు టొమాటో గుజ్జు, టీ స్పూన్ కొత్తిమీర, టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు, తగినంత ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, రెండున్నర టీ స్పూన్ల టొమాటో సాస్.. ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని టొమాటో సాల్సా అంటారు. టీ స్పూన్ క్రీమ్, అర టీ స్పూన్ పెరుగు, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని సోర్ క్రీమ్ అంటారు.ఒక వెడల్పాటి గిన్నెలో 100 గ్రాముల మొక్కజొన్న చిప్స్ తీసుకోవాలి. దీని మీద రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన ఛీజ్, అర కప్పు టొమాటో సాల్సా, టేబుల్‌స్పూన్ సోర్ క్రీమ్ వేయాలి. చివరగా సన్నగా తరిగిన కీరా, కొత్తిమీరతో అలంకరించాలి. మినెస్ట్రాన్ క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్‌లను సన్నగా తరిగి 2 టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల పాస్తా కలిపి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేడి చేసి, అందులో అర టీ స్పూన్ వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో కప్పుడు టొమాటో గుజ్జు, కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, కప్పుడు నీళ్లు పోసి మిశ్రమం చిక్కగా అయ్యేలా ఉడికించాలి. ఇందులోనే ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని సూప్ బౌల్లో పోయాలి. 4 సన్నగా తరిగిన తులసి ఆకులను, అర టీ స్పూన్ ఛీజ్(మార్కెట్లో లభిస్తుంది) తరుగు వేసి అందించాలి. స్పినాచ్ కార్న్ ఫెటుచిని పాన్‌లో కొద్దిగా బటర్ వేసి వేడి చేసి దాంట్లో అర టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి వేయించాలి. దాంట్లో 50 గ్రా.ల తరిగిన పాలకూర వేసి కొద్దిగా ఉడికాక, టీ స్పూన్ పెరుగు కలపాలి. దీంట్లో అర కప్పుడు ఉడికించిన పాస్తా, పావు కప్పుడు వైట్ సాస్ (పాన్‌లో 2 టీ స్పూన్ల వెన్న, 2 టేబుల్ స్పూన్ల మైదా వేయించి, పావు కప్పు పాలు పోసి చేసిన మిశ్రమం) కలిపి, ఉప్పు, మిరియాలపొడి వేసి చివరలో బాగా కలిపిన పాల మీగడ జత చేయాలి. వడ్డించే ముందు ఛీజ్ తరుగు, కొత్తిమీర వేసి, గార్లిక్ బ్రెడ్‌తో అలంకరించాలి. ప్రాచుర్యం ఎక్కువ శతాబ్దాల చరిత్ర ఉన్న ఇటాలియన్ రుచులకు ప్రపంచంలోనే బాగా ప్రాచుర్యం ఉంది. ఉంది. ఐస్‌క్రీమ్‌లతో మొదలైన ఇటాలియన్ వంటకాలు పిజ్జాలతో పుంజుకుని కాఫీలతో కొనసాగి, పాస్తాలతో పరిపుష్టమైంది. టొమాటోను అధికంగా వాడే వీరి వంటకాలలో పెద్దవంకాయ, బ్లాక్-గ్రీన్ ఆలివ్స్, క్యాప్సికం తదితర కూరగాయల శాతం ఎక్కువ. దీంతో మన వంటకాలకు కాస్త సన్నిహితంగా అనిపిస్తాయి. అలాగే మిరియాలపొడితో చేసే సాస్‌లు, వెల్లుల్లి, పుదీనా, చికెన్ వెరైటీలు... వంటివి ఇటాలియన్ రుచులకు కేరాఫ్‌గా మారుస్తున్నాయి. ఇటలీ దేశస్థులకు స్పైసీగా అనిపించే ఇటాలియన్ రుచులు మన దగ్గర ఆధునికుల జిహ్వలకు సరిపడా ఉంటున్నాయి. ఇక ఈ వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. దాంతో ఆరోగ్యపరంగా కూడా ఇవి మేలనే ఆభిప్రాయం పెరిగింది. హార్వెస్ట్ వెజ్ పిజ్జా పిజా బేస్, పిజ్జా సాస్, పిజ్జా ఛీజ్‌లు రెడీమేడ్‌గా దొరుకుతాయి. టొమాటో, క్యాలీఫ్లవర్, పాలకూర, మొక్కజొన్న, 10 తులసి ఆకులు సన్నగా తరిగి 2 టీ స్పూన్ల చొప్పున తీసి, పక్కన ఉంచాలి. పిజ్జాబేస్ పైన సాస్ -దానిపైన తగినంత ఛీజ్ - ఆ పైన తరిగిన కూరగాయల ముక్కలు చల్లి అవెన్‌లో 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ చేయాలి. అవెన్ లేని వారు దీనిని పిజాపాన్లో తయారుచేసుకోవచ్చు. చిపొట్లె చికెన్ స్క్యేర్స్ పావుకేజీ బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రం చేసుకొని పైన టేబుల్‌స్పూన్ తేనె, అర టీ స్పూన్ చిపొట్లె టొబాస్కో (పండుమిర్చిని ముద్దగా నూరి వాడచ్చు), అర టీ స్పూన్ కారం వేసి, బాగా కలిపి పక్కన ఉంచాలి. మరొక గిన్నెలో పావు టీస్పూన్ పండుమిరప పేస్ట్, ఉప్పు, నల్ల మిరియాలపొడి, ఎండుకారం, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల మెయోనేజ్ సాస్ (మార్కెట్లో దొరుకుతుంది) ఇది అందుబాటులో లేదంటే వెన్నలో కలిపి పక్కన ఉంచాలి. బాగా నానిన చికెన్ ముక్కలను వెదురుపుల్లలకు గుచ్చాలి. వీటిని పెనం మీద కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. పండుమిర్చి పేస్ట్‌తో తయారుచేసుకున్న సాస్‌లో ముంచి, ప్లేట్లో పెట్టి, కొత్తిమీరతో అలంకరించాలి. ఛీజ్ కేక్ ఒక పాత్రలో గుడ్డుసొన, అర టీ స్పూన్ పంచదార, చిన్న కప్పుడు వెన్నతీసిన పాలు, చిటికెడు జెలెటిన్ (ఇది వాడకపోతే కేక్ గట్టిగా అవదు. మార్కెట్లో దొరుకుతుంది), కప్పుడు విప్డ్ క్రీమ్ (దీని బదులు పాల మీగడను బాగా మిక్స్ చేసి వాడచ్చు) వేసి, కలిపి పక్కన ఉంచాలి. కేక్ అడుగు గట్టితనం కోసం 2 గుండ్రటి బిస్కట్లు తీసుకొని, వెన్న రాసి,10 ని.లు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. తర్వాత ఈ బిస్కెట్లను తీసి, కప్పు అడుగున ఉంచాలి. వీటి పైన ముందుగా చేసి ఉంచిన మిశ్రమాన్ని బిస్కెట్ల మీదుగా పోసి, 30 ని.లు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత దానిని బయటకు తీసి, మన ఇళ్లలో రోజూ వాడుకునే 3 టేబుల్ స్పూన్ల చిక్కటి బ్లాక్ కాఫీ డికాషన్‌లో వెనీలా ఎసెన్స్ కలిపి పోసి, చల్లగా అందించాలి. రాజ శేఖర్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఓరిస్ రుసి అండ్ ఐడోని బంజారా హిల్స్ హైదరాబాద్ -
సొంతదేశం పొమ్మంది.. వలస దేశం వద్దంది..
-
ఇంటర్నేషనల్ ఫర్నిచర్ హబ్ బ్రాండ్స్ సిటీ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇటాలియన్ మాస్టర్ ఫర్నీచర్ నటుజీతో పాటు ఫర్నీచర్ రారాజులు ఎర్బా, ఆల్నో, ఇగో డిజైన్, సాంటారోజా వంటి బ్రాండ్స్ సిటీ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంటి అందాన్ని ఇనుమడింపజేసే ఫర్నీచర్ పై హైదరాబాదీలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సోఫా, మంచాలు, కి చెన్‌తో పాటు ఇతర ఆర్టిస్టిక్ ఫర్నీచర్ విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో ఫర్నీచర్ షాపులు వెలుస్తున్నాయి. కస్టమర్లు, ఆర్కిటెక్ట్స్ కోరిన విధంగా డిజైనర్ ఫర్నీచర్‌ను అందిస్తున్నారు. ఇటలీలో స్థిరపడ్డ అఖిల్ కుమార్ ఇటీవలే తల్లిదండ్రులకోసం హైదరాబాద్‌లో ఇల్లు కొన్నాడు. ఇటలీలోని తన ఇంటిని నటుజీ ఫర్నీచర్‌తో అందంగా తీర్చిదిద్దుకున్నాడు. తల్లిదండ్రుల ఇంటికి అలాంటి ఫర్నీచరే హైదరాబాద్‌లో దొరకడం అఖిల్ ఆశ్చర్యానికి కారణమైంది. నగరవాసుల శ్రమ తప్పించడానికి దక్షిణాదిలోని లగ్జరీ ఫర్నీచర్ ఎలివేట్ జూబ్లీహిల్స్‌లో ఎస్టాబ్లిష్ అయింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో తమ అవుట్ లెట్స్ ఏర్పాటు చేయనుంది. దేశీయ, విదేశీ బ్రాండ్లు ఇక్కడ దొరుకుతాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎలివేట్‌తో కలిసి లగ్జరీ ఫర్నీచర్‌ను అందుబాటులో ఉంచామని నటుజీ కంట్రీ మేనేజర్ నితిన్ బాల్ చెబుతున్నాడు. నటుజీ ఎడిషన్స్పై కొనుగోలుపై ఆగస్టు 9 నుంచి 30 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ఇంకేం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న ది ఎలివేట్ ఫర్నీచర్స్‌ను సందర్శిస్తే సరి. ఆన్లైన్లో చెక్ చేయాలనుకుంటే లాగాన్ టు www.theelevate.in, Contact : 04030014001