అలాంటి ఇలాంటి రికార్డు కాదు....కారు వెళ్తుండగానే టైరు మార్చడం | Viral Video: Italian Men Changing A Tyre On Moving Car Break Record | Sakshi
Sakshi News home page

Virla Video: అలాంటి ఇలాంటి రికార్డు కాదు....కారు వెళ్తుండగానే టైరు మార్చడం

Published Sat, Jul 23 2022 1:47 PM | Last Updated on Sat, Jul 23 2022 1:48 PM

Viral Video: Italian Men Changing A Tyre On Moving Car Break Record - Sakshi

ఇంతవరకు ఎన్నో గిన్నిస్‌ రికార్డులు చూశాం. మీసాలతో కారుని లాగడం, ఒక్కవేలుతో పెద్దపెద్ద బరువులను ఎత్తడం వంటి ఎన్నో భయంకరమైన ఫీట్‌లతో చేసిన రికార్డులను చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా ఏకంగా కారు వెళ్తుండగానే కారులో ఉండే టైరు మార్చడం అంటే ఊహకందని విషయం. ఇలాంటి ఫీట్‌ చేయాలనే ఆలోచన రావడమే గ్రేట్‌ అనుకుంటే అసాధ్య కాదంటూ చేసి చూపించి మరీ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు ఇద్దరు ఇటాలియన్లు.

వివారాల్లోకెళ్తే....ఇటలీలో జరిగిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్‌ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు. అదీ కూడా చాలా వేగంగా ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు.

ఈ మేరకు మాన్యయోల్‌ జోల్డాన్‌ అనే వ్యక్తి కారుని డ్రైవ్‌ చేస్తుండగా... జియాన్లుకా ఫోల్కో కారు వేగంగా కదులుతుంటే కారు కిటికిలోంచి వేలాడుతూ... టైరు మార్చేశాడు. మునపటి రికార్డును బ్రేక్‌ చేసి మరీ అత్యంత వేగవంతంగా కారు టైరుని మార్చేశాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ...ఏకంగా 500 మందికి భోజనాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement