3,800 మీటర్ల ఎత్తు నుంచి దూకి.. | Italian dies in wingsuit accident on Mont Blanc | Sakshi
Sakshi News home page

3,800 మీటర్ల ఎత్తు నుంచి దూకి..

Published Mon, Jun 13 2016 10:39 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

3,800 మీటర్ల ఎత్తు నుంచి దూకి.. - Sakshi

3,800 మీటర్ల ఎత్తు నుంచి దూకి..

వింగ్ సూట్ గేమ్.. ఆటను ఆస్వాదించాలనుకునే వారికి, భయానికి వెరవని వారికి ఈ ఆట ఆడటం అంటే మహా సరదా..! ఒకసారి జంప్ చేస్తే ఎంత ఉత్సహాన్ని ఇస్తుందో, ప్రమాదం జరిగితే అసలు ఆనవాళ్లు కనిపించకపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఫ్రాన్స్ లోని మౌంట్ బ్లాంక్ పర్వతంపై నుంచి వింగ్ సూట్ తో సాహసం చేసి దూకిన ఇటలీకి చెందిన ఓ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయినట్లు పర్వత భద్రతాధికారులు తెలిపారు.

శనివారం నుంచి అతని కోసం హెలికాప్టర్లు, పర్వతం మీద రక్షణ బృందం గాలింపు చర్యలు చేపట్టగా.. ఆదివారం ఉదయం దాదాపు 2,000 మీటర్ల ఎత్తులో మృతదేహాన్ని గుర్తించినట్లు వివరించారు. అయితే, తాను వింగ్ జంప్ చేయనున్నట్లు ముందుగానే తెలిపాడని పోలీసులు చెప్పారు. అతని స్నేహితులతో మాట్లాడిన అనంతరం అతను తక్కువ వెలుతురు, మంచుకురుస్తున్న సమయంలో జంప్ చేయడానికి వెళ్లినట్లు చెప్పారని అన్నారు. కాగా, వింగ్ జంప్ చేసే వాళ్లు దాదాపు సగటున ఒక నిమిషం ఎనిమిది సెకన్లపాటు గాలిలో200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతారు. గతేడాది కూడా ఇలానే ఓ వింగ్ జంపర్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement