Mont Blanc
-
54 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పుడు దొరికింది
1966 నాటి విమాన ప్రమాదం గురించి నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. అప్పట్లో ఈ ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 1966 జనవరిలో బాంబే నుంచి న్యూయార్క్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 707 విమానం.. మాంట్ బ్లాక్ సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 1950లో మరో ఎయిరిండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలింది. ఈ ఘటనలో 48 మంది మరణించారు. ఆల్ఫ్స్ పర్వతాల్లోని ఈ మాంట్ బ్లాక్ హిమానీ నదం కరుగుతున్న కొద్ది దానిలో దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ఆల్ఫ్స్ పర్వత సానువుల్లో మానవ అవశేషాలు దొరికినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 1966 నాటి నేషనల్ హెరాల్డ్, ది ఎకనామిక్ టైమ్స్ వార్తా పత్రికల కట్టలు వెలుగు చూశాయి. ఇవి నాటి విమానం ప్రమాదం జరిగినప్పుడు ఇవి నదిలో పడి ఉంటాయని భావిస్తున్నారు. సుమారు 55 ఏళ్లు కావస్తున్నప్పటికి ఇవి ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయని సమాచారం. వీటిలో బ్యానర్ హెడ్డింగ్ ఏంటనుకుంటున్నారు... ‘ఇందిరా గాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి’. తిమోతీ మోటిన్ అనే రెస్టారెంట్ ఓనర్‌కి ఈ పేపర్లు దొరికాయి. ఇతను దాదాపు 4455 అడుగుల ఎత్తులో చామోనిక్స్ స్కీయింగ్ హబ్ సమీపంలో లా కాబేన్ డు సెరో అనే కాఫీ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. బోసన్స్ హిమానీ నదానికి కేవలం 45 నిమిషాల కాలినడక దూరంలో తిమోతీ రెస్టారెంట్ ఉంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘దాదాపు ఆరు దశాబ్దాల మంచు ఇప్పుడు కరిగిపోయింది. ఈ పేపర్లు నా కంటపడటం నా అదృష్టం. ఇప్పటికి కూడా ఇవి చాలా మంచి స్థితిలోనే ఉన్నాయి. ఎండిన తర్వాత వీటిని చదువుకోవచ్చు. ఎండిపోయిన తర్వాత ఈ పేపర్లను సందర్శనకు ఉంచుతాన్నారు’ తిమోతీ మోతీ. -
అవి ‘ఎయిరిండియా’ మృతులవేనా?
మాంట్ బ్లాంక్‌పై మానవ అవశేషాల గుర్తింపు గ్రానాబుల్(ఫ్రాన్స్): ఆల్ప్స్ శ్రేణిలో అతిపెద్ద పర్వతమైన ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌పై మానవ శరీర భాగాలను గుర్తించారు. ఇవి 50 ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో చనిపోయినవారివి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. 1950లో మాంట్ బ్లాంక్ పర్వతంపై ఎయిరిండియా విమానం కూలి 48 మంది మరణించారు. మరోసారి 1966లో బాంబే నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 707 విమానం మాంట్ బ్లాంక్ శిఖరాన్ని ఢీకొని అందులోని మొత్తం 117 మంది దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదాల గురించి అన్వేషణలు చేసే డేనియల్ రోచీ... ఈ రెండు ప్రమాదాల్లో చనిపోయిన వారి శరీర అవశేషాలు, విమాన శకలాలకోసం గతకొన్నేళ్లుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు గురువారం ఆయన ఓ చేయి, కాలిలో పై భాగంను కనుగొన్నారు. ఇవి 1966 ప్రమాదంలో చనిపోయిన ఓ మహిళవి అయ్యుండొచ్చనీ, తనకు ఆ విమానంలోని ఓ ఇంజిన్ కూడా కనిపించిందని రోచీ చెప్పారు. శరీర భాగాలను నిపుణులు ఇంకా పరిశీలించాల్సి ఉంది. అయితే ఇవి ఒకే వ్యక్తికి చెందినవి కాకపోవచ్చనీ, ప్రయాణికులవే అయినా రెండు ప్రమాదాల్లో ఎప్పుడు చనిపోయిన వారివో చెప్పడం కష్టమని స్థానిక అధికారి ఒకరు అన్నారు. ఇదిలా ఉండగా స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ఓ హిమనీనదం వద్ద 75 ఏళ్ల క్రితం అదృశ్యమైనవారి మృతదేహాలను 10 రోజుల క్రితమే కనుగొన్నారు. డీఎన్ఏ పరీక్షలు చేయగా వారిద్దరూ భార్యాభర్తలనీ, చనిపోయే నాటికి భార్య వయసు 37, భర్త వయసు 40 అని తేలింది. -
3,800 మీటర్ల ఎత్తు నుంచి దూకి..
వింగ్ సూట్ గేమ్.. ఆటను ఆస్వాదించాలనుకునే వారికి, భయానికి వెరవని వారికి ఈ ఆట ఆడటం అంటే మహా సరదా..! ఒకసారి జంప్ చేస్తే ఎంత ఉత్సహాన్ని ఇస్తుందో, ప్రమాదం జరిగితే అసలు ఆనవాళ్లు కనిపించకపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఫ్రాన్స్ లోని మౌంట్ బ్లాంక్ పర్వతంపై నుంచి వింగ్ సూట్ తో సాహసం చేసి దూకిన ఇటలీకి చెందిన ఓ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయినట్లు పర్వత భద్రతాధికారులు తెలిపారు. శనివారం నుంచి అతని కోసం హెలికాప్టర్లు, పర్వతం మీద రక్షణ బృందం గాలింపు చర్యలు చేపట్టగా.. ఆదివారం ఉదయం దాదాపు 2,000 మీటర్ల ఎత్తులో మృతదేహాన్ని గుర్తించినట్లు వివరించారు. అయితే, తాను వింగ్ జంప్ చేయనున్నట్లు ముందుగానే తెలిపాడని పోలీసులు చెప్పారు. అతని స్నేహితులతో మాట్లాడిన అనంతరం అతను తక్కువ వెలుతురు, మంచుకురుస్తున్న సమయంలో జంప్ చేయడానికి వెళ్లినట్లు చెప్పారని అన్నారు. కాగా, వింగ్ జంప్ చేసే వాళ్లు దాదాపు సగటున ఒక నిమిషం ఎనిమిది సెకన్లపాటు గాలిలో200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతారు. గతేడాది కూడా ఇలానే ఓ వింగ్ జంపర్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
కార్డు ఉండగా... రూపాయి ఎందుకు!
అధికారంలోకొచ్చే వరకు ఆస్తులమ్మి అయినా సరే పార్టీకి సేవ చేయండని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తనకు జేబులో రూపాయి కూడా లేదని చెప్పడంపై నేతలంతా నివ్వెరపోతున్నారు. నష్టపోయింది మేమైతే...! ఆయన జేబులో చిల్లి గవ్వ లేదని ఎలా చెబుతారని ఖర్చుపెట్టుకుని దిగాలుగా ఉన్న నేతలు ప్రశ్నిస్తున్నారు. జేబులో రూపాయి లేదు...! చేతికి వాచీ లేదు...!! అని ఇటీవల విజయవాడ సమావేశంలో ఒక నాయకుడు సానుభూతి పలుకులు పలికారు. దాంతో పక్కనున్న నేత మండిపడుతూ రూపాయితో పనేంటి? జేబులో సింగపూర్ కార్డులు ఉండగా...! చెబితే కొంచెం నమ్మశక్యంగా ఉండాలి.. అంటూ ఫైరయ్యారట. ఏది చెబితే అది జనం నమ్ముతారనుకుంటే ఎలా? సంతకం చేయడానికి ఆయన వాడుతున్న పెన్ను ఖరీదెంతో తెలుసా...? మాంట్బ్లాంక్... 60 వేల రూపాయలు...! అంటూ రుసరుసలాడారట. దాని ధర మీకెలా తెలుసని అమాయకంగా అడిగిన మరొకాయనకు...! అదిగో (ముందు వరుసలో ఉన్న ఒకాయనను చూపిస్తూ...) ఆయనే అమెరికా నుంచి తెచ్చి గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పారట. ఏదడిగినా ఇచ్చేవాళ్లు (బినామీలు) పక్కనుంటే...! జేబులో రూపాయెందుకు దండగ...!! అంటూ అక్కడినుంచి నిష్ర్కమించారు.