
1966 నాటి విమాన ప్రమాదం గురించి నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. అప్పట్లో ఈ ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 1966 జనవరిలో బాంబే నుంచి న్యూయార్క్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 707 విమానం.. మాంట్ బ్లాక్ సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 1950లో మరో ఎయిరిండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలింది. ఈ ఘటనలో 48 మంది మరణించారు. ఆల్ఫ్స్ పర్వతాల్లోని ఈ మాంట్ బ్లాక్ హిమానీ నదం కరుగుతున్న కొద్ది దానిలో దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ఆల్ఫ్స్ పర్వత సానువుల్లో మానవ అవశేషాలు దొరికినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 1966 నాటి నేషనల్ హెరాల్డ్, ది ఎకనామిక్ టైమ్స్ వార్తా పత్రికల కట్టలు వెలుగు చూశాయి. ఇవి నాటి విమానం ప్రమాదం జరిగినప్పుడు ఇవి నదిలో పడి ఉంటాయని భావిస్తున్నారు. సుమారు 55 ఏళ్లు కావస్తున్నప్పటికి ఇవి ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయని సమాచారం. వీటిలో బ్యానర్ హెడ్డింగ్ ఏంటనుకుంటున్నారు... ‘ఇందిరా గాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి’.
తిమోతీ మోటిన్ అనే రెస్టారెంట్ ఓనర్‌కి ఈ పేపర్లు దొరికాయి. ఇతను దాదాపు 4455 అడుగుల ఎత్తులో చామోనిక్స్ స్కీయింగ్ హబ్ సమీపంలో లా కాబేన్ డు సెరో అనే కాఫీ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. బోసన్స్ హిమానీ నదానికి కేవలం 45 నిమిషాల కాలినడక దూరంలో తిమోతీ రెస్టారెంట్ ఉంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘దాదాపు ఆరు దశాబ్దాల మంచు ఇప్పుడు కరిగిపోయింది. ఈ పేపర్లు నా కంటపడటం నా అదృష్టం. ఇప్పటికి కూడా ఇవి చాలా మంచి స్థితిలోనే ఉన్నాయి. ఎండిన తర్వాత వీటిని చదువుకోవచ్చు. ఎండిపోయిన తర్వాత ఈ పేపర్లను సందర్శనకు ఉంచుతాన్నారు’ తిమోతీ మోతీ.
Comments
Please login to add a commentAdd a comment