Alps
-
54 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పుడు దొరికింది
1966 నాటి విమాన ప్రమాదం గురించి నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. అప్పట్లో ఈ ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 1966 జనవరిలో బాంబే నుంచి న్యూయార్క్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 707 విమానం.. మాంట్ బ్లాక్ సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 1950లో మరో ఎయిరిండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలింది. ఈ ఘటనలో 48 మంది మరణించారు. ఆల్ఫ్స్ పర్వతాల్లోని ఈ మాంట్ బ్లాక్ హిమానీ నదం కరుగుతున్న కొద్ది దానిలో దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ఆల్ఫ్స్ పర్వత సానువుల్లో మానవ అవశేషాలు దొరికినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 1966 నాటి నేషనల్ హెరాల్డ్, ది ఎకనామిక్ టైమ్స్ వార్తా పత్రికల కట్టలు వెలుగు చూశాయి. ఇవి నాటి విమానం ప్రమాదం జరిగినప్పుడు ఇవి నదిలో పడి ఉంటాయని భావిస్తున్నారు. సుమారు 55 ఏళ్లు కావస్తున్నప్పటికి ఇవి ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయని సమాచారం. వీటిలో బ్యానర్ హెడ్డింగ్ ఏంటనుకుంటున్నారు... ‘ఇందిరా గాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి’. తిమోతీ మోటిన్ అనే రెస్టారెంట్ ఓనర్‌కి ఈ పేపర్లు దొరికాయి. ఇతను దాదాపు 4455 అడుగుల ఎత్తులో చామోనిక్స్ స్కీయింగ్ హబ్ సమీపంలో లా కాబేన్ డు సెరో అనే కాఫీ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. బోసన్స్ హిమానీ నదానికి కేవలం 45 నిమిషాల కాలినడక దూరంలో తిమోతీ రెస్టారెంట్ ఉంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘దాదాపు ఆరు దశాబ్దాల మంచు ఇప్పుడు కరిగిపోయింది. ఈ పేపర్లు నా కంటపడటం నా అదృష్టం. ఇప్పటికి కూడా ఇవి చాలా మంచి స్థితిలోనే ఉన్నాయి. ఎండిన తర్వాత వీటిని చదువుకోవచ్చు. ఎండిపోయిన తర్వాత ఈ పేపర్లను సందర్శనకు ఉంచుతాన్నారు’ తిమోతీ మోతీ. -
గులాబీ రంగులోకి మంచు.. కారణం!
రోమ్: 2020 అంటేనే ప్రజల్లో భయం పుడుతోంది. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ఏడాదిలోనే చోటు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్లో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచమంతా కోరలు చాస్తున్న తరుణంలో 2020లో యుగాంతం అంటూ ఇటీవల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఊహించని ఎన్నో భయంకర సంఘటనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలో ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాల్లో గులాబీ రంగులోకి మారిన మంచును చూసి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని, ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘వేగంగా మంచు కరగడం వల్ల ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. మంచు ఆల్గేలు వేడిని గ్రహించి హిమనదిని త్వరగా కరిగిస్తాయి. వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పడానికి గులాబి మంచు ఉదాహరణ’ అని ఇటలీ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ శాస్త్రవేత్త బియాజియో డి మౌరో పేర్కొన్నారు. ‘సాధారణంగా మంచు సూర్యుని రేడియేషన్ 80 శాతానికి పైగా ఉన్నపుడు వాతావరంలో తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. కానీ ఆల్గే మాత్రం మంచును డార్క్ చేయడంతో మంచు వేడెక్కి తొందరగా కరుగుతుంది. మంచు మరింత వేగంగా కరుగుతున్నప్పుడే ఇటువంటి ఆల్గేలు కనిపిస్తాయి. తద్వారా పొసోగావియా వద్ద 8,590 అడుగుల ఎత్తులో ఉన్న తెల్లటి మంచు ఇలా వివిధ రంగుల్లోకి మారుతుంది. ఇలాంటి సంఘటన ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. దీనిపై గతంలో అధ్యయనం చేశాం. ఆల్గే ప్రమాదకరమైనది కాదు. ఇది వసంత రుతువుకు, వేసవి కాలం మధ్య ధ్రువాల వద్ద సంభవించే సహజమైన మార్పు’ అని బియాజియో చెప్పుకొచ్చారు. మనుషులు చేసే తప్పిదాల వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మంచు కరగడానికి సూర్యుడి వేడితో పాటు మంచుపై హైకర్తో పాటు స్కై లిఫ్టులు చేయడం కూడా ప్రధాన కారణమని డీ మౌరో అభిప్రాయపడ్డారు. మంచు గులాబీ రంగులోకి మారడంతో అక్కడి పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ‘భూమి వేడెక్కడమనేది పెద్ద సమస్య.. అందులో చివరిది ఆల్గే’ అని ‘మనం కోలుకోలేని స్థితిలో ఉన్నాము. ఇక ఎప్పటికీ దీనిని నుంచి బయటపడలేము’, ‘మనం చేసినదే భూమి తిరిగి ఇస్తుంది’, ‘2020 ప్రత్యేకమైనది. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ఏడాదిలోనే చోటుచేసుకుంటున్నాయి’ అంటూ పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆల్ప్స్‌పై.. అలా అలా..
స్విస్ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ఏడున్నర గంటల ప్రయాణం. నెమ్మదిగా వెళ్లే అద్దాల రైలు. 290 కిలోమీటర్ల ప్రయాణంలో... 291 వంతెనలు. పై నుంచి చూస్తే గుండె గుభేల్ మనిపించేంత లోతు. ఓ 91 పొడవైన టన్నెల్ మార్గాలు. 6,670 అడుగుల ఎత్తుండే పర్వతాల్ని చూస్తూ సాగే ఈ రైలు ప్రయాణం గురించి వింటుంటేనే మనసు తేలిపోతుంది. మరి అలాంటి రెలైక్కి ప్రయాణం చేస్తే...? స్విట్జర్లాండ్ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంతో ఈ అనుభవం సాధ్యమే. స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని ప్రధాన ప్రాంతాలైన జెర్మాట్ -దావోస్లను కలిపే ఈ రైలు ప్రయాణంలో ఒక్క క్షణం కూడా బోర్ అనిపించదు. ఈ మార్గంలో గంటకొకటి చొప్పున మామూలు రైళ్లూ ఉంటాయి. కానీ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత వేరు. ఏడాది పొడవునా నడిచే ఈ రైలు... వేసవిలో రోజుకు 3 ట్రిప్పులు, చలికాలంలో 1 ట్రిప్పు ఉంటుంది. ఛార్జీలెంత? ఒకవైపు ఛార్జీలు సెకండ్ క్లాస్‌లో అయితే ఒకిరిక 149 యూరోలు. అదే ఫస్ట్ క్లాస్ ప్రయాణమైతే 262 యూరోలు. గ్లేసియర్ రైలును చేరేదెలా? * స్విట్జర్లాండ్‌లోని ప్రధాన విమానాశ్రయాలు జెనీవా, లేదా జ్యూరిక్. గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరే జెర్మాట్‌కు జెనీవా కాస్తంత దగ్గర. కానీ జ్యూరిక్ నుంచి రైలు సదుపాయం అధికం. * కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి జ్యూరిక్‌కు ఛార్జీలు ఒకరికి రూ.40వేల నుంచి మొదలవుతాయి. * జ్యూరిక్ నుంచి జెర్మాట్‌కు రైలు ప్రయాణం ఈజీ. ఇది మూడున్నర గంటల ప్రయాణం. నిజానికి యూరప్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైలు ప్రయాణం అనుకూలమే. * గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ యాత్ర పూర్తయ్యాక సెయింట్ మారిట్జ నుంచి మళ్లీ జ్యూరిక్ చేరుకోవటానికి కూడా బోలెడన్ని రైళ్లుంటాయి. * జెర్మాట్‌కు రైలు తప్ప ఇతర మార్గాలేవీ లేవు. అక్కడ కార్లు, ఇతర వాహనాలు నిషిద్ధం. చిన్న చిన్న జానీ క్యాబ్లుంటాయి. ఏ సమయంలో వెళ్లొచ్చు? * అక్టోబరు చివరి నుంచి మిడ్ డిసెంబరు... మధ్యలో కొద్దిరోజులు తాత్కాలికంగా గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేస్తారు. ఆ సమయాల్లో కూడా మామూలు లోకల్ రైళ్లు నడుస్తాయి. * వేసవైనా, శీతాకాలమైనా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. అందుకని రెండు కాలాలూ అనుకూలమేనని చెబుతారు సందర్శకులు.