ఆల్ప్స్‌పై.. అలా అలా.. | With the Glacier Express through the Swiss Alps | Sakshi
Sakshi News home page

ఆల్ప్స్‌పై.. అలా అలా..

Published Tue, Sep 27 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ఆల్ప్స్‌పై.. అలా అలా..

ఆల్ప్స్‌పై.. అలా అలా..

స్విస్ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్
ఏడున్నర గంటల ప్రయాణం. నెమ్మదిగా వెళ్లే అద్దాల రైలు. 290 కిలోమీటర్ల ప్రయాణంలో... 291 వంతెనలు. పై నుంచి చూస్తే గుండె గుభేల్ మనిపించేంత లోతు. ఓ 91 పొడవైన టన్నెల్ మార్గాలు. 6,670 అడుగుల ఎత్తుండే పర్వతాల్ని చూస్తూ సాగే ఈ రైలు ప్రయాణం గురించి వింటుంటేనే మనసు తేలిపోతుంది. మరి అలాంటి రెలైక్కి ప్రయాణం చేస్తే...? స్విట్జర్లాండ్ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంతో ఈ అనుభవం సాధ్యమే. స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని ప్రధాన ప్రాంతాలైన జెర్మాట్ -దావోస్‌లను కలిపే ఈ రైలు ప్రయాణంలో ఒక్క క్షణం కూడా బోర్ అనిపించదు. ఈ మార్గంలో గంటకొకటి చొప్పున మామూలు రైళ్లూ ఉంటాయి. కానీ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత వేరు. ఏడాది పొడవునా నడిచే ఈ రైలు... వేసవిలో రోజుకు 3 ట్రిప్పులు, చలికాలంలో 1 ట్రిప్పు ఉంటుంది.
 
ఛార్జీలెంత?
ఒకవైపు ఛార్జీలు సెకండ్ క్లాస్‌లో అయితే ఒకిరిక 149 యూరోలు. అదే ఫస్ట్ క్లాస్ ప్రయాణమైతే 262 యూరోలు.
 
గ్లేసియర్ రైలును చేరేదెలా?
* స్విట్జర్లాండ్‌లోని ప్రధాన విమానాశ్రయాలు జెనీవా, లేదా జ్యూరిక్. గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరే జెర్మాట్‌కు జెనీవా కాస్తంత దగ్గర. కానీ జ్యూరిక్ నుంచి రైలు సదుపాయం అధికం.  
* కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి జ్యూరిక్‌కు ఛార్జీలు ఒకరికి రూ.40వేల నుంచి మొదలవుతాయి.
* జ్యూరిక్ నుంచి జెర్మాట్‌కు రైలు ప్రయాణం ఈజీ. ఇది మూడున్నర గంటల ప్రయాణం. నిజానికి యూరప్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైలు ప్రయాణం అనుకూలమే.
* గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ యాత్ర పూర్తయ్యాక సెయింట్ మారిట్జ నుంచి మళ్లీ జ్యూరిక్ చేరుకోవటానికి కూడా బోలెడన్ని రైళ్లుంటాయి.
* జెర్మాట్‌కు రైలు తప్ప ఇతర మార్గాలేవీ లేవు. అక్కడ కార్లు, ఇతర వాహనాలు నిషిద్ధం. చిన్న చిన్న జానీ క్యాబ్‌లుంటాయి.
 
ఏ సమయంలో వెళ్లొచ్చు?

* అక్టోబరు చివరి నుంచి మిడ్ డిసెంబరు... మధ్యలో కొద్దిరోజులు తాత్కాలికంగా గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేస్తారు. ఆ సమయాల్లో కూడా మామూలు లోకల్ రైళ్లు నడుస్తాయి.
* వేసవైనా, శీతాకాలమైనా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. అందుకని రెండు కాలాలూ అనుకూలమేనని చెబుతారు సందర్శకులు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement