గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ పర్యటనలో ఉన్న ఇటలీ దేశస్తురాలు ఎలీనా ఎగ్జీనా సోమవారం గుంటూరు నగరానికి వచ్చారు. గత మూడున్నరేళ్లుగా బైక్‌పై 28 దేశాలను సందర్శించిన ఆమె ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యలో గుంటూరు పండరీపురంలోని పులుగు దీపక్ నీట్, జేఈఈ ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న విద్యారి్థనులతో మమేకమై మహిళా సాధికారతపై మాట్లాడారు. విద్యారి్థనులు విద్యావంతులుగా ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు.
తన పర్యటన విశేషాలను వివరిస్తూ బైక్‌పై మూడున్నరేళ్ల క్రితం మొదలైన తన ప్రపంచ యాత్ర ఇప్పటికి 28 దేశాల్లో ఎక్కడా ఒక్క హోటల్‌లో బస చేయకుండా, నిరంతరం కొనసాగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విభిన్న సంస్కృతులు, భిన్నమైన ప్రదేశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ఎలీనాను సత్కరించిన శిక్షణా కేంద్ర నిర్వాహకుడు పులుగు దీపక్ భారతదేశ గొప్పతనాన్ని వివరించే స్పేస్ సైన్స్ పుస్తకాన్ని బహూకరించారు. గుంటూరులో తనకు లభించిన ఆదరణ, ఆతీ్మయ స్వాగతంపై ఎలీనా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment