Bike riding
-
Viral Video: బైక్ నడిపేటప్పుడు కాళ్ళు అందకపోతే ఏం చేయాలి?
బైక్‌పై డ్రైవింగ్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కార్లు, బస్సుల్లో ప్రయాణించినా.. బండిపై వెళ్లడం అదో సరాదాగా అస్తుంది. చిన్న దూరాలకే కాకుండా లాంగ్ డ్రైవింగ్‌లకు సైతం బైక్ రైడ్‌కే నేటి యువత సై అంటున్నారు. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరూ టూవీలర్‌పై రయ్‌మంటూ వెళ్తున్నారు. అయితే బండి నడపాలంటే కచ్చితంగా మేజర్ అయి ఉండి, డ్రైవింగ్ వచ్చి ఉండాలన్న విషయం తెలిసిందే. అంతేగాక వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా రావాలి. కానీ.. బండి నడిపే సమయంలో రెండు కాళ్లు సరిగా కింద అందకపోయినా బైక్‌పై ఎంచక్కా వెళ్లిపోవచ్చని. మీకు తెలుసా?.తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్ల కంటపడింది.. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. బైక్ అంత పొడవున్న ఓ యువతి.. రహదారిపై దర్జాగా స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ వెళుతుంది. అయితే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆమెకు కాళ్లు అందక బండి ఆపేందుకు కష్టమవుతుంది. దీంతో తెలివిగా సిగ్నల్‌కు ముందే ఒకవైపుకు కాళ్లు తీసి చాలా స్టైల్‌గా టూవీలర్ ఆపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.బైక్ నడిపేటప్పుడు కాళ్ళు అందకపోతే ఏం చేయాలి?pic.twitter.com/mW5nzBgAcu— వై.ఎస్.కాంత్ (@yskanth) August 15, 2024 దీనిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూనే.. అలా డ్రైవ్ చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. అన్నట్లు ఈ వీడియోలో యువతి చేసినట్లు మీరేమైనా ప్రయత్నించేరూ.. అలాంటి సాహసాలు మాత్రం చేయకండి.. ఇంకో విషయం.. బండిపై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మర్చిపోకండి. -
క్వీన్ రైడర్స్
‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగిపొమ్మన్నది.. అబ్బాయితో సాగుతూ చిలిపి మదీ’ అంటూ మార్చేసి పాడేసే టైమ్ వచ్చేసింది. ఒకప్పుడు కింగ్స్‌కి మాత్రమే పరిమితమైన బైకింగ్ ఇప్పుడు క్వీన్స్‌కి కిరీటాలు అలంకరించేస్తోంది. ఈ క్రమంలో నగరానికి చెందిన నలుగురు మహిళల బృందం కూడా ఒక రేర్ రైడ్‌తో సిటీలో టాక్ ఆఫ్ ద బైకింగ్ క్లబ్‌గా మారారు. సొంత బైక్‌లపై పలు ప్రాంతాలను చుట్టేస్తూ..ప్రపంచంలోనే ఎత్తైన రోడ్లపై ప్రయాణంలఢాక్లోని ఉమ్లింగ్లా పాస్‌లో సాహస యాత్ర విభిన్న రంగాలకు చెందిన మహిళల్ని ఒకే బాట పట్టిస్తోంది బైక్ రైడింగ్. అలా వేర్వేరు రంగాలకు చెందిన నలుగురు నగర మహిళలు బైకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాజాగా లఢాక్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఉమ్లింగ్లా పాస్‌ను అధిరోహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ వారిని పలకరించినప్పుడు తమ రైడింగ్ అనుభవాలు పంచుకున్నారు.. ఆ వివరాలు...సొంతంగా కొనుక్కున్న బైక్‌తో.. జూబ్లీíß గత కొంత కాలంగా బైక్ రైడింగ్ అలవాటైంది. మన ఇంట్రెస్ట్ కోసం పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకూడదని గూగుల్‌లో పనిచేసి, ఆన్లైన్ బిజినెస్.. ద్వారా రూ.1.50 లక్షలు సంపాదించి సొంతంగా యమహా ఆర్15 వి2 బైక్ కొన్నాను. గతంలో షార్ట్ రైడ్స్‌కి కొన్నిసార్లు వెళ్లాను. అయితే బైకర్ణీలో చేరాక లాంగ్ రైడ్స్ మీద ఆసక్తి బాగా పెరిగింది. ఉమింగ్లా పాస్ రైడ్ అనుకున్నప్పుడు గతంలో ఎన్నడూ అంత లాంగ్వ్కి వెళ్లకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయం ఉండేది. కానీ.. గ్రూప్‌లో వెళ్లాం కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా ఏమీ ఫేస్ చేయలేదు. మైనస్ డిగ్రీస్ చలిలో మా టార్గెట్ రీచ్ అవడం అద్భుతమైన థ్రిల్లింగ్ ఇచ్చింది. – గీతిక పోలిశెట్టి (28), ఫ్యాషన్ డిజైనర్బైక్ రైడింగ్ ఇష్టం.. మేం ఎల్బీనగర్ లో ఉంటాం. చిన్నప్పటి నుంచీ బైక్ రైడింగ్ ఇష్టం. మా తాతయ్యకు లూనా ఉండేది. నేను వెనక ఎక్కేదాన్ని. ఆ తర్వాత మా నాన్నకి హోండా సీడీ 100 ఉండేది. ఆ బైక్ నేను డ్రైవ్ చేశాను. అందుకే నేను వాడిన నా ఫస్ట్ బైక్ జావా 42.. ఇప్పుడు బీఎండబ్ల్యూ జి3 10ఆర్ ఉంది. దీన్ని కేవలం లాంగ్ రైడ్స్‌కి వినియోగిస్తుంటాను. కర్ణాటక, హైదరాబాద్ టూ కన్యాకుమారి.. ఇలా టూర్స్ వెళ్లొచ్చాను. తొలి దశలో ఇంట్లో వాళ్లు కొంచెం భయపడ్డారు కానీ..ఇప్పుడు ఫుల్ కాని్ఫడెంట్గా ఉన్నారు. వీలైనంత వరకూ బైక్ రైడ్ ద్వారా మంచి మంచి ప్రదేశాలు చుట్టిరావాలని ఆశిస్తున్నాను. దీని తర్వాత నేపాల్, టిబెట్ రైడ్ కి వెళ్లాలనేది ప్లాన్.. –సుష్మితారెడ్డి (27), బిజినెస్ ఎనలిస్ట్డ్రీమ్ రైడ్ అదే..మేం మోకిలాలో నివసిస్తున్నాం. మొదట నేను యమహా ఆర్ఎక్స్ 100 నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంత బైక్ అంటే బెనల్లీ టీఎన్టీ 25, ప్రస్తుతం బీఎండబ్ల్యూ జి310ఆర్ నడిపిస్తున్నాను. ఏడేళ్లలో సిక్కిం, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలకు వెళ్లాం. ఎన్ని లాంగ్ రైడ్స్ వేసినా ఉమింగ్లా పాస్‌కు రైడ్ అనేది ఒక మరచిపోలేని అనుభూతిని అందించింది. మైనస్ డిగ్రీల వాతావరణం అలవాటు లేక కొంత ఇబ్బంది పడ్డాం. బైక్ స్కిడ్ అయి పడిపోవడం.. వంటి కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే థాంక్ ఫుల్లీ.. ఎవరికీ ఏమీ కాలేదు. టిబెట్, భూటాన్, వియత్నాం.. రూట్ కవర్ చేయాలనేది డ్రీమ్ రైడ్. – సుష్మారెడ్డి (42), బిజినెస్ ఎనలిస్ట్ఫిజికల్లీ ఫిట్.. మేం నేరేడ్ మెట్లో ఉంటాం. డిగ్రీ పూర్తి చేశాక 2017లో రైడింగ్ స్టార్ట్ చేశాను. మా నాన్నగారి ఓల్డ్ మోడల్ ఎలక్ట్రా 350 (రాయల్ ఎన్ఫీల్డ్) నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంతంగా థండర్‌బోల్ట్ 350ఎస్ కొనుక్కున్నా. తొలిరైడ్ 1700 కి.మీ నడిపించాను. వేల కిమీ లాంగ్ రైడ్స్ చేశాను. ఒక మహిళా రైడర్‌గా నాకున్న పరిధులు, పరిమితుల ప్రకారం.. పూర్తి ప్రణాళికా బద్ధంగా రైడ్స్‌కి వెళ్తుంటాను. ఎక్కడికి వెళ్లినా సాయంత్రం లోపు రైడ్ కంప్లీట్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే ఒక ఫిట్నెస్ ఫ్రీక్‌గా బైక్ పడినా సులభంగా లేపగలిగినæ ఫిట్నెస్ ఉండాలి. అందుకే లేహ్ లడక్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే అల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ రాలేదంటే...అందుకు కారణం నేను అనుసరించే సీరియస్ ఫిట్నెస్ రొటీన్ అని చెప్పగలను. –అనీషా ఫాతిమా లతీఫ్ (28), వృత్తి జిమ్ యజమాని -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
Bike Mileage Tips: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే..
మోటార్ బైక్ కొత్తదైనా చాలామంది మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే బైక్ నడుపుతున్నపుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మైలేజ్ తగ్గుందని నిపుణులు చెబుతున్నారు. బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ కింది విషయాలపై జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గేర్ మార్చకపోవడం బైక్ నడుపుతున్నపుడు బైక్ వేగానికి తగ్గట్టుగా గేర్ మార్చడం చాలా ముఖ్యం. మెయిన్ రోడ్డు(పెద్ద రోడ్లు, రహదారులు)పై అధిక వేగంతో బైక్‌ను స్థిరవేగంతో నడపాలంటే ఎక్కువ గేర్‌లో ఉండాలి. దీనివల్ల ఇంజిన్‌పై పెద్దగా ఒత్తిడి ఉండదు. దాంతో మంచి మైలేజ్ ఇస్తుంది. తక్కువ వేగంతో నడపాల్సి వస్తే రెండు లేదు మూడో గేర్‌లో బైక్‌ను నడపాలి. ఇలా చేయడం వల్ల బైక్ తక్కువ వేగంలో ఆగదు. ఎప్పుడూ కాలు బ్రేక్ పైనే.. బైక్ నడుపుతున్నపుడు చాలా మంది బ్రేక్‌పై కాలు ఉంచుతారు. అయితే బ్రేక్‌పై కాలు ఉంచి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటేం కాదు. ఇది వెంటనే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి బ్రేక్‌లపై ఒత్తిడి ఉంచితే స్వేచ్ఛగా ముందుకు కదలదు. ఇలా చేయడం వల్ల బైక్ నడపడానికి ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాలి. దాంతో కొంత మైలేజ్‌పై ప్రభావంపడే అవకాశం ఉంది. అలా అని బ్రేక్ వాడకూడదని కాదు. అనవసరమైన సందర్భాల్లోనూ బ్రేక్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. తక్కువ గాలి.. టైర్లలో తక్కువగా గాలి ఉండటం వల్ల బైక్ మైలేజ్ క్షీణిస్తుంది. మెరుగైన మైలేజీ కోసం టైర్లో సరిపడా గాలి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులు ఎయిర్ ప్రెజర్ మెషీన్ సదుపాయాన్ని కలిగి ఉంటున్నాయి. దాంతో ఉచితంగానే టైర్ల్లో గాలి చెక్ చేసుకోవచ్చు. -
ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్! క్షణకాలంలో ఇద్దరూ..
కరీంనగర్: అజాగ్రత్తగా బైక్‌లు నడపడంతో ఎదురెదురుగా ఢీకొని వేల్పుల అవినాశ్‌కుమార్(16), పూరెళ్ల అభిలాశ్(18) దుర్మర ణం చెందారు. మిత్రులతో సర్కస్ తిలకించేందుకు వెళ్లిన వీరిద్దరూ అనూహ్యంగా మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేటలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంటకృష్ణ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూ ర్కు చెందిన అవినాశ్‌కుమార్, పెద్దపల్లికి చెందిన అభిలాశ్, వేల్పుల రమేశ్, పంబాల మనోజ్, దాడి రామ్‌చరణ్, కొలిపార రాంచరణ్ మిత్రులు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రదర్శిస్తున్న సర్కస్ చూసేందుకు ఈ ఆరుగురు మిత్రులు రెండు బైక్‌లపై రాత్రి బయలుదేరి వెళ్లారు. సర్కస్ తిలకించాక అవే బైక్‌లపై ఇంటిదారి పట్టారు. ఈక్రమంలో ఎలిగేడు మండలం లోకపేట శివా రులోని వంతెన వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బైక్ అవినాశ్‌కుమార్, అభిలాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అవినాశ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాశ్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరిని ఢీకొ న్న మరోబైక్ నడుపుతున్న ముప్పిరితోటకు చెందిన మాదారపు వెంకట్రావు తీవ్రంగా గాయపడగా, కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా స్నేహితులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అవినాశ్ తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాల్లో తీరని విషాదం.. పెద్దపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్ – కవిత దంపతుల చిన్నకుమారుడు అభిలాశ్. వీరిది నిరుపేద కుటుంబం. అభిలాశ్ ఇంటర్‌పూర్తి చేశాడు. స్నేహితులతో సర్కస్ చూసేందుకు వెళ్లి వస్తూ మృతిచెందడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన అవినాశ్ కుమార్ పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి మల్లేశం అన్నీ తానై చదివిస్తున్నాడు. మిత్రులతో కలిసి సర్కస్ చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం! -
హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు హీరో 'అజిత్ కుమార్'. సినిమాల్లో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడు ఖరీదైన బైకులపై రైడింగ్ చేస్తూ ఉంటాడు. కాగా ఈయన తాజాగా 'వీనస్ మోటార్ సైకిల్ టూర్స్' (Venus Motor Cycle Tours) అనే సంస్థ స్టార్ట్ చేసాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బైక్ రేసింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ సంస్థ స్థాపించాడు. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా UAE, ఒమన్, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా సేవలను అందించనుంది. గతంలో చెప్పిన విధంగానే అజిత్ మోటార్ సైకిల్ టూర్స్ ప్రారంభించాడు. ఈ సంస్థ వివిధ ప్రాంతాల్లో రైడింగ్ చేసేవారికి సహాయం చేస్తుంది. కావున రైడర్లు దీని ద్వారా ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించవచ్చు. సంస్థ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు.. బైకులు అద్దెకు తీసుకోవడం, అవసరమైన అంతర్జాతీయ అనుమతులను, కావాల్సిన డాక్యుమెంట్స్ పొందటానికి ఇది సాయం చేస్తుంది. ఈ నెల 23 నుంచి బైక్ టూరింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. బైక్ రైడింగ్ వెళ్లాలనుకునే వారి కోసం ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ట్వీట్లో షేర్ చేసిన ఫొటోలో వెల్లడించారు. Ajith sir's @VenusMotoTours now launched. Our best wishes and congratulations for the successful venture. | #AK #Ajith #Ajithkumar | #VidaaMuyarchi | pic.twitter.com/BK4vxVK412 — Ajith | Dark Devil (@ajithFC) October 5, 2023 -
మీరెప్పుడూ చూడని గ్రేట్ ఖలీ రైడింగ్ వీడియో.. ఓ లుక్కేసుకోండి!
Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్‌లో నటించడం, 2015లో పంజాబ్‌లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్‌సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) -
బుల్లెట్టు బండెక్కి బైక్ రైడింగ్.. హిజాబ్ రైడర్ స్టోరీ ఇదే
ఇట్టే వస్తే రానీ వెంటా,నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా,డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ.. పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, బైక్ ఎక్కే రోజుల నుంచి గేర్ల్మీద గేర్లు మార్చుకుంటూ రయ్యన దూసుకెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు. సెల్ఫ్‌తో బండిని స్టార్ట్‌చేసి సూదూర ప్రాంతాలకు సోలోగా రైడ్ చేస్తూ దునియాని చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రైడింగ్ చేస్తుంటే... మరింత ప్రత్యేకంగా హిజాబ్ ధరించి జాతీయ రహదారులే కాదండోయే దేశాలు దాటి మక్కా దాక బుల్లెట్ మీదే వెళ్తానంటోంది ముఫ్పై ఏళ్ల నూర్ బీ. చెన్నైలోని పల్లవరానికి చెందిన అమ్మాయి నూర్‌బీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇది చేయకు! అది చేయకు! అలా ఉండకు! ఇలా ఉండాలి! అంటూ ఎన్నో నిబంధనలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాలి. అయినా నూర్ బీకి మాత్రం బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంట్లో అమ్మాయిలు బైక్‌లు అస్సలు నడపకూడదు. అయినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. కాలేజీలో ఉండగానే మోటర్ సైకిల్ కొనుక్కోవాలనుకునేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఐటీ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. నెలనెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని బండి కొనుక్కోవడానికి దాచుకునేది. ఇలా జమ చేసిన డబ్బులతో 2021లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను కొనుక్కుంది. బండి కొన్న వెంటనే ఉద్యోగం మానేసి రైడింగ్ షురూ చేసింది. ఫస్ట్ రైడ్... ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. వెంటనే రైడింగ్‌కు ప్రణాళిక రూపొందించుకుంది నూర్. 2021 నవంబర్ 14 తొలి రైడింగ్ గేర్‌ను స్టార్ట్ చేసింది. ఈ రైడ్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. బెంగళూరు నుంచి మహారాష్ట్ర, డామన్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పటికీ మహారాష్ట్రలోని లోనావాలకు చేరుకునేటప్పటికి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నూర్. ఐదున్నర అడుగుల ఎత్తున్న నూర్.. హిజాబ్ ధరించి బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అని వెళ్తుంటే ఆమెను అంతా ఆసక్తిగా చూసేవారు. ఆ చూపులు నూర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. ఈసడింపులు, యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ... ప్రపంచం రోజురోజుకీ అప్డేట్ అవుతున్నప్పటికీ కొంతమంది ఇంకా ‘అమ్మాయి ఏంటీ ఇలా చేస్తోంది? ఇదేం విడ్డూరం?’ అని నోరు వెళ్లబెట్టిన వాళ్ల ఈసడింపులు నూర్‌కూ ఎదురయ్యాయి. అయినప్పటికీ రోడ్డు మీద గేర్లు మారుస్తూపోతూనే ఉంది. తన రైడ్‌ను ఎక్కడా ఆపలేదు. ఇదే దూకుడుతో... ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ప్రయాణిస్తూ నేపాల్‌కు వెళ్లాలనుకుంది. బిహార్ సరిహద్దులోకి రాగానే చిన్న యాక్సిడెంట్ జరిగి రైడింగ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు తన మోటర్ సైకిల్‌ను ట్రైన్లో చెన్నై పంపించాల్సిన పరిస్థితి. చాలా బాధ వేసింది. అయినా తప్పలేదు. 2022 మేలో యాక్సిడెంట్ అయితే జూలైలో కోలుకుని బెంగళూరు వచ్చేసింది. ఇంక బండిని అమ్మేయమని అంతా చెప్పారు. అయినప్పటికీ నూర్ రైడింగ్ అపలేదు. జాతీయ రహదారులేగాక అంతర్జాతీయ రహదారులపై రైడింగ్ చేస్తానూ అంటోంది. వచ్చే సంవత్సరం బెంగళూరు నుంచి మక్కా, సౌదీ అరేబియా కూడా వెళ్తానని చెబుతోంది. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి... ‘‘నేను నోమాడ్ హిజాబీ రైడర్ని. దక్షిణ భారత దేశం నుంచి తొలి సోలోరైడర్ని నేనే అవుతాను. ఉత్తర భారతదేశంలోని గురుద్వారాలు, గుళ్లు, ఆశ్రమవాసులు నా మతం వేరైనప్పటికీ ప్రేమగా భోజన, వసతి సదుపాయాలను కల్పించేవారు. కొన్ని సేఫ్టీరూల్స్ పాటిస్తే తక్కువ బడ్జెట్లో ట్రిప్స్‌ను విజయవంతంగా పూర్తిచేయవచ్చు. సాయంత్రం ఐదు తరువాత ఎటువంటి రైడింగ్ చేయను. తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడను.పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాల్లో రాత్రుళ్లు బస చేస్తూ, ఉదయం రైడింగ్ చేస్తున్నాను. ఈ స్పీడుతో మక్కాను చేరుకుంటాను ’’అని నూర్‌బీ ధీమా వ్యక్తం చేస్తోంది. -
బీఎండబ్ల్యూ అంటే... బ్యూటీఫుల్ మంజు వారియర్!
అందాల కథానాయిక మంజు వారియర్‌కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘నేను కూడా రైడర్ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్‌ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్‌లో మంజు వారియర్‌కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది. -
'వరల్డ్‌కప్ ఉంది.. ప్లీజ్ ఇలాంటి రిస్క్‌లు వద్దు!'
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన కొత్త బీఎండబ్ల్యూ స్పోర్ట్స్బైక్పై లాహోర్ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బాబర్ ఆజం స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. Ready, Set, Go.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక బాబర్ హెల్మెట్ సహా అన్ని సేఫ్టీ రూల్స్ పాటిస్తూ రోడ్డు మీద బైక్ రైడింగ్ చేసినప్పటికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కారణం.. ''మనం ఎంతమంచిగా వెళ్లినా టైం బాగాలేకపోతే ఏమైనా జరగొచ్చు'' అంటూ కామెంట్ చేశారు. గతేడాది టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన పంత్ కోలుకున్నప్పటికి తొమ్మిది నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ సహా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ ఆడేది కూడా అనుమానంగానే ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబర్ ఆజం బైక్ రైడింగ్‌ను పాక్ అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. ''అసలే ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలున్నాయి. ఈ సమయంలో ఇలాంటి రిస్క్‌లు వద్దు''.. మరో ఐదు నెలల్లో వరల్డ్‌కప్ ఉంటే ఇలాంటి రిస్క్‌లు చేస్తున్నాడు.. బాబర్‌ను వెంటనే కెప్టెన్సీ నుంచి తీసేయడం మంచిది'' అంటూ పోస్టులు పెట్టారు. Ready, set, GO! 🏍️ pic.twitter.com/BvwwiFuVCG — Babar Azam (@babarazam258) May 24, 2023 You are very precious bhai, please don’t ride a bike 🙏🏼❤️ — Khalid Minhas, MD FACC (@minhaskh) May 24, 2023 No more bikes till the World Cup, please. No risks, skipper 🙏🏼♥️ — Farid Khan (@_FaridKhan) May 24, 2023 We have a World Cup to play in 5 months and Babar is doing such dangerous activities? Remove him from captaincy please, irresponsible. https://t.co/dAk7WcDj7M — f (@fas___m) May 24, 2023 చదవండి: మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం! 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
కొత్త బిజినెస్ ప్రారంభించిన స్టార్ హీరో అజిత్
తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు. కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్‌లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్‌ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు
భారతదేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ 'జావా యెజ్డీ మోటార్ మోటార్‌సైకిల్స్' మహిళల కోసం బైక్ రైడ్ ప్రారంభించింది. 2023 మార్చి 5న దేశంలోని మహిళా రైడర్ల స్ఫూర్తిని పురస్కరించుకుని ఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై, గౌహతి వంటి నగరాల్లో రైడింగ్ ప్రారంభించింది. ఈ రైడింగ్‌లో సుమారు 150 మంది మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఈ రైడ్లలో పాల్గొన్న మహిళలు సమాజంలోని అణగారిన వర్గాల మహిళల ఋతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు. కంపెనీ నిర్వహించిన ఢిల్లీ రైడ్‌లో ప్రముఖ ర్యాలీ రైడర్ 'గరిమా అవతార్' పాల్గొన్నారు. ఈ రైడ్‌లో ఆమె పాల్గొనడం వల్ల తోటి మహిళలు కూడా చాలా ఉత్సాహాన్ని కనపరిచాడు. ఈ రైడ్స్ బ్రాండ్ డీలర్‌షిప్‌ల నుండి ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాలు, రిఫ్రెష్మెంట్ల కోసం అనేక స్టాప్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రైడ్లలో పాల్గొన్న రైడర్లు వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు ఫుడ్ ప్యాకెట్లు, శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?) ఈ సందర్భంగా జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ సీఈఓ 'ఆశిష్ సింగ్ జోషి' మాట్లాడుతూ.. కంపెనీ బైకులపై మహిళకు అనుభూతి పెరుగుతోందని, మహిళా రైడింగ్ వంటి వాటిని ప్రోత్సహించడంలో మేము ముందుంటామని, వివిధ మహిళా సంక్షేమ అంశాలపై అవగాహన కల్పించడంలో తప్పకుండా ముందుకు వస్తామని అన్నారు. -
గుం‘టూరు’ వచ్చిన ప్రపంచ పర్యాటకురాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ పర్యటనలో ఉన్న ఇటలీ దేశస్తురాలు ఎలీనా ఎగ్జీనా సోమవారం గుంటూరు నగరానికి వచ్చారు. గత మూడున్నరేళ్లుగా బైక్‌పై 28 దేశాలను సందర్శించిన ఆమె ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యలో గుంటూరు పండరీపురంలోని పులుగు దీపక్ నీట్, జేఈఈ ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న విద్యారి్థనులతో మమేకమై మహిళా సాధికారతపై మాట్లాడారు. విద్యారి్థనులు విద్యావంతులుగా ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు. తన పర్యటన విశేషాలను వివరిస్తూ బైక్‌పై మూడున్నరేళ్ల క్రితం మొదలైన తన ప్రపంచ యాత్ర ఇప్పటికి 28 దేశాల్లో ఎక్కడా ఒక్క హోటల్లో బస చేయకుండా, నిరంతరం కొనసాగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విభిన్న సంస్కృతులు, భిన్నమైన ప్రదేశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ఎలీనాను సత్కరించిన శిక్షణా కేంద్ర నిర్వాహకుడు పులుగు దీపక్ భారతదేశ గొప్పతనాన్ని వివరించే స్పేస్ సైన్స్ పుస్తకాన్ని బహూకరించారు. గుంటూరులో తనకు లభించిన ఆదరణ, ఆతీ్మయ స్వాగతంపై ఎలీనా ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
బైక్ నడుపుతూ బీర్ తాగిన యువకుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023 చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు -
విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన రొమాంటిక్ జంట.. రెండు గంటల్లోనే!
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్రయ్ అంటూ దూసుకుపోయారు. ఈ దృశ్యాలను పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. దీంతో పట్టపగలు బరితెగించిన ఈ యువజంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో గాజువాక సమీప ప్రాంతాలకు చెందిన బైక్ నడిపిన అజయ్ కుమార్, యువతిని సంఘటన జరిగిన రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు స్టీల్ ప్లాంట్ సీఐ వి శ్రీనివాస్‌రావు తెలిపారు. యువకుడి బైక్ సీజ్ చేశామని, న్యూసెన్స్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’ -
రికార్డు బ్రేక్ ‘వీలీ’ స్టంట్
రోడ్డుపై బైక్‌లతో కుర్రకారు చేసే విన్యాసాలను మనలో చాలా మంది చూసే ఉంటాం.. బండిని మెలికలు తిప్పుతూ పోనీయడం.. ముందు చక్రాన్ని పైకి లేపి యాక్సిలేటర్‌ను రెయిజ్ చూస్తూ దూసుకుపోవడం, అత్యంత వేగంగా బండిని నడుపుకుంటూ వచ్చి వెనుక చక్రం పైకి లేచేలా ఒక్కసారిగా బ్రేక్ వేయడం... బండిని ఉన్నచోటనే గుండ్రంగా తిప్పడం వంటి స్టంట్లను మీరు చూసే ఉంటారు. కానీ లిథువేనియాకు చెందిన అరునస్ గిబేజా అనే స్టంట్ రైడర్ వీటన్నింటికన్నా క్లిష్టమైన ఓ విన్యాసాన్ని చేసి చూపించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతను చేసిన స్టంట్ ఏమిటంటే... బండిని కేవలం వెనుక చక్రంపై నడపడమే (వీలీ) కాకుండా హ్యాండిల్‌ను వదిలేసి ఏకంగా అర కిలోమీటర్‌కుపైగా దూరం (580 మీటర్ల 81 సెంటీమీటర్లు) దూసుకెళ్లాడు. తద్వారా 2019లో భారత్‌కు చెందిన రోహితేశ్ ఉపాధ్యాయ్ అనే యువకుడు సుమారు 566 మీటర్ల దూరంపాటు ఇదే రకంగా బండి నడిపి నమోదు చేసిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టాడు. -
Viral Video: భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని బండి నడిపిన బామ్మ..
బైక్ రైడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. బైక్ అంటే చాలు కుర్రాళ్లు ఎగిరి గంతులేస్తారు. ఒకప్పుడు మగవారే బైక్‌లు, కారులు నడిపేవారు. అమ్మాయిలు అసలు రైడింగ్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. యువతులు, మహిళలు కూడా అన్ని వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా వయసు పైబడిన పెద్దావిడ బండి నడిపి వావ్ అనిపించింది. అంతేగాక వెనుక సీట్లో తాతను కూర్చోబెట్టి బామ్మ డ్రైవ్ చేయడం మరింత స్పెషల్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో సుమారు 60 ఏళ్లు ఉన్న ఓ పెద్దావిడ ఎంతో ఉత్సాహంగా, చలాకీగా ద్విచక్ర వాహనం నడిపింది. భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని రోడ్డుపై రయ్ రయ్ అంటూ వెళ్లింది. బామ్మ చక్కగా చీరకట్టుకొని ఉండగా తాత తెల్లటి చొక్కా, పంచె కట్టుకొని కనిపించాడు. దీంతో మాములు బామ్మ కాస్తా బైక్ బామ్మగా మారిపోయింది. ఎలాంటి భయం, బెరుకు లేకుండా బండి నడిపి.. యువకులకు తాను ఎంత మాత్రం తీసిపోనని రుజువు చేసింది. దీనిని వెనకాల వస్తున్న వారు వీడియో తీశారు. సుస్మితా డోరా అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. బామ్మ డ్రైవింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఈ వయసులో బండి నడపడటం గ్రేట్..చూడటానికి ఎంతో అందంగా ఉంది. నీ డ్రైవింగ్‌కు తిరుగు లేదు’ అంటూ ప్రశంసిస్తున్నారు. కపుల్ గోల్స్ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. బండి నెంబర్ ప్లేట్ చూస్తుంటే తమిళనాడుకు చెందినదిగా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Susmita Dora (@the_aspiring_seed) -
Bengaluru: రైడ్ ఫర్ ఎ కాజ్! రైడింగ్‌తోనే సేవ.. ఆ ఊరిలో వెలుగులు నింపింది!
కొంతమంది దేశం కోసం తమ ప్రాణాలు అర్పించేందుకు రాత్రనక పగలనకా ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. వారు అక్కడ నిద్రాహారాలు మాని, కుటుంబ సంతోషాలను త్యాగం చేయబట్టి మనం ఇంత సురక్షితంగా జీవించగలుగుతున్నాము... అని ఎందరికి తెలుసు? ఒకవేళ తెలిసినా ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఏమైనా చేయగలుగుతున్నామా? అయితే బెంగళూరుకు చెందిన హర్షిణి అలా కాదు... వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఏకంగా ఓ ఎన్జీవోను ఏర్పాటు చేసింది. మహిళా బైక్ రైడర్స్‌తో కలిసి ఈవెంట్స్ నిర్వహిస్తూ సమకూరిన నిధులతో జవాన్ల కుటుంబాల అవసరాలు తీరుస్తోంది. హర్షిణి వెంకటేష్‌కు చిన్నప్పటినుంచి ఇతరులకు సాయం చేయలన్న ఆలోచనలు ఎక్కువ. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీతో బట్టలు, కార్డ్స్ మీద ప్రింట్స్ డిజైన్ చేయడం, పుట్టగొడుగుల పెంపకం వంటివి చేపట్టి వాటిద్వారా వచ్చిన ఆదాయంతో ఇతరులకు సాయం చేసేది. 1998లో హర్షిణికి పెళ్లి అవ్వడం, వెంటవెంటనే ఇద్దరు కొడుకులు పుట్టడంతో తన సమయం అంతా ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల పెంపకంతో సరిపోయింది. కొంతకాలానికి భర్త ప్రోత్సాహంతో ముంబై వెళ్లి బేకింగ్, చాక్లెట్ తయారీ కోర్సులు చేసింది. కోర్సు పూర్తయ్యాక సొంతంగా చాక్లెట్, కేక్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో పదికేజీల ఆర్డర్లు ఉండేవి. ఏడాది తరువాత వంద కేజీల ఆర్డర్లు ఇచ్చే స్థాయికి హర్షిణి వ్యాపారం విస్తరించింది. అయితే బేకింగ్ కు కావాల్సిన పదార్థాల నుంచి మార్కెటింగ్, సప్లై వరకు అన్నీ తనే చూసుకోవడం కష్టంగా అనిపించేది. ఇదే సమయంలో ముంబైలో జరిగిన మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి బెంగళూరు నుంచి రెండు వేల మందిలో హర్షిణి సెలెక్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మధ్యలోనే వదిలేసింది. ఇదే సమయంలో అంధ విద్యార్థులు చదివే ఓ స్కూలు గురించి తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి విద్యార్థులతో కొంత సమయం గడపడం, వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తూ సామాజిక సేవను ప్రారంభించింది. రైడింగ్‌తోనే సేవ పెళ్లి అయిన తరువాత బండి నడపాలన్న ఆసక్తితో హర్షిణి టూవీలర్ నడపడం నేర్చుకుంది. 2017లో ఓ మహిళా రైడర్స్ ఈవెంట్ జరుగుతుందని తెలిసి, రైడింగ్‌ను బాగా సాధన చేసి చీరకట్టులో బైక్ ర్యాలీలో పాల్గొంది. అప్పుడు హర్షిణి రైడ్ చేస్తోన్న ఫోటోతో సహా ఓ వార్తా పత్రిక మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. దానికి లభించిన ప్రోత్సాహంతో రైడింగ్‌తోనే సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలనుకుంది. ఇండియన్ ఆర్మీ దేశానికి, సమాజానికి ఎంతో సాయం చేస్తోంది. కానీ మనం ఆర్మీకి తిరిగిచ్చింది చాలా తక్కువే. అందుకే వాళ్ల కుటుంబ సభ్యులకు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అమర జవాన్ల్ల కుటుంబాల్లో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్సకు డబ్బులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, వారికోసం విరాళాలు సేకరించేందుకు ‘షీ ఫర్ సొసైటీ, రైడ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా మహిళా బైకర్స్ అందర్ని ఒకచోటకు చేర్చి బైక్ రైడింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును అవసరంలో ఉన్న ఆర్మీ కుటుంబాలకు ఇచ్చింది. ఈవెంట్ విజయవంతమవడంతో తర్వాత కూడా బైక్ రైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చిన విరాళాలతో అవసరం అయిన వారికి సాయం చేయడం కొనసాగించింది. ఊరిలో వెలుగులు నింపింది బెంగళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలార్ అనే గ్రామానికి ఎలక్ట్రిసిటీ సదుపాయం సరిగా లేదు. ఐదువేలమంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఆర్మీలో పనిచేసిన నాలుగు తరాలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. అయినా వీళ్లకి సరైన విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేదు. వీరికి విద్యుత్‌ను అందించేందుకు మూడువందల మంది మహిళా రైడర్స్‌తో కలిసి బెంగళూరు నుంచి కోలార్‌కు ర్యాలీ నిర్వహించింది. అందుకు స్పందనగా మాజీ సైనికులు వందమంది కలిసి సోలార్ కిట్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎలక్ట్రిసిటి నిరంతరాయంగా అందుతోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చే రెండు కంప్యూటర్ సెంటర్స్‌ను ఏర్పాటుచేసింది. భవిష్యత్‌లో మరిన్ని నిధులు సేకరించి బెంగళూరులోనేగాక, మైసూర్, థార్వాడ్‌లలో కూడా తన సేవలను విస్తరించనున్నట్లు హర్షిణి చెబుతోంది. చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్ వద్దనుకుని.. -
Sakshi Cartoon: నాలుగేళ్లలోపు పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి!
-
Bheemla Nayak: పవన్ కల్యాణ్ బైక్ రైడ్.. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. అయితే షూటింగ్ మధ్యలో రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే.. రానా ఇందులో రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇద్దరు వ్యక్తుల ఇగోలు హర్ట్ అయినప్పుడు వారెలా రియాక్ట్ అయ్యారనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. 👊⭐️🔥💕pic.twitter.com/tbNduyERPu — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021 -
బైక్, లద్ధాక్.. ఓ జంట
నిత్యం బైక్‌లపైనే తిరిగే ఉద్యోగం కావడమేమో గానీ.. ఆ యువకుడు బైక్ రైడింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు.. అందుకు సంబంధించి వీడియోలను యూట్యూబ్‌లో చూడటం మొదలెట్టాడు. అలా రాష్ట్రం నుంచి బైక్ రైడింగ్ చేసే సుమారు 20 మంది వ్లాగ్‌లను యూట్యూబ్‌లో గమనిస్తూ వచ్చాడు. అయితే వారంతా ఒంటరిగానే బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 12 మంది లద్ధాక్ ఒంటరిగానే వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో తను భార్యతో కలిసి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన అతనికి వచ్చింది.. వెంటనే భార్యకు ఆ విషయం చెప్పాడు. మొదట ఒకింత భయపడ్డా.. భర్త ఉత్సాహానికి ముచ్చట పడుతూ ఓకే చెప్పేసింది.. లద్ధాక్ వెళ్లొచ్చింది. పలమనేరు: మండలంలోని అప్పినపల్లెకు చెందిన రంపాల రమేష్ అదే మండలంలోని ఓ ప్రైవేట్ డె యిరీలో ఐటీ సలహాదారు. అతని భార్య తులసీకుమారి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు గత నెల రెండో తేదీన తమ యమహా ఎఫ్‌జీఎస్ వీ3 బైక్ పై తమ సాహస యాత్రను ప్రారంభించారు. పలమనేరు నుంచి హైదరాబాద్, నాగ్‌పూర్, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ, పానిపట్, అంబాలా, పతన్‌కోట్, జమ్మూ, పత్నిటాప్, సింథన్‌టాప్, అనంత్‌నాగ్, శ్రీనగర్, దాల్ సరస్సు, కార్గిల్, లేహ్, వారిల్లాపాస్, చెంగాలాటాప్, లద్ధాక్ దాకా ప్రయాణం సాగించారు. మార్గం మధ్యలోని పుణ్య స్థలాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సందర్శిస్తూ వెళ్లారు. అక్కడి నుంచే కష్టాలు జమ్మూ బోర్డర్ వరకూ వీరి ప్రయాణం సాఫీగానే సాగినా.. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. విపరీతమైన చలి వాతావరణం, కొండ మార్గాలు, లోయలు, సముద్ర మట్టానికి 982 అడుగుల ఎత్తు లో ప్రయాణం.. అయినా పట్టువదలకుండా తమ ప్రయాణాన్ని సాగించి ఎట్టకేలకు లద్ధాక్ చేరారు. అక్కడి ప్రజలు వీరిపై ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. అక్కడ లాడ్జిలు, హోటళ్ల వంటివి ఉండ వు. స్థానికులే ప్రయాణికులకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ జంటకు కూడా ఆశ్రయం ఇచ్చి తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని రమేష్ దంపతులు చెప్పారు. ఆ తర్వాత అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తమ యాత్రలోని రోజువారి విశేషాలను ‘రమేష్ రంపాల ఫస్ట్ కపుల్ రైడర్ ఫ్రం చిత్తూరు’ అనే వ్లాగ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు. తమ యాత్రను విజయవంతంగా ముగించుకుని ఆదివారం వీరు స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో వీరికి రూ.2 లక్షల దాకా ఖర్చు చేశారు. లడక్ వెళ్లి రావడానికి వీరికి 37 రోజుల సమయం పట్టింది. మొత్తం 11,500 కి.మీ ప్రయాణించారు. గ్రామస్తుల సత్కారం ఈ జంట లద్ధాక్‌కు బైక్‌పై వెళ్లి వస్తున్నారని తెలిసి అప్పినపల్లె్ల గ్రామస్తులు ఆలయంలో వీరి పేరున ప్ర త్యేక పూజలు చేయించారు. అనంతరం రమేష్, తులసీకుమారి జంటను సన్మానించారు. పలమనేరు నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చారంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ వీరికి అభినందనలు తెలిపా రు. ఇండియా–పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఒకింత ఆందోళన చెందామని, అక్క డి ప్రజలు ప్రేమానురాగాలు చూపినట్టు తెలిపారు. ఈ యాత్ర ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసిన ట్టు రమేష్, తులసీకుమారి దంపతులు చెప్పారు. -
బైక్ నడిపితే ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు
అబ్బాయిలకు తామేమీ తీసిపోమంటున్నారు నేటి యువతులు. ఈ కోవలోనే ముంబైకి చెందిన విశాఖ మరో అడుగు ముందుకేసి బైక్ రైడింగ్‌లో అబ్బాయిలతో పోటీపడుతోంది. దీంతో ఆమెను అందరూ ‘రైడర్‌గర్ల్ విశాఖ’ అని ముద్దుగా పిలుస్తున్నారు. దేశంలోనే తొలి మహిళ ‘మోటో వ్లాగర్’ అయిన విశాఖ కొత్త కొత్త ప్రదేశాలకు బైక్‌మీద వెళ్తూ వీడియోలు తీసి తన యూ ట్యూబ్ చానల్లో అప్లోడ్ చేస్తూ.. సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది. రైడర్ గార్ల్ విశాఖ అసలు పేరు విశాఖ ఫుల్‌సుంగి. ముంబైలో పుట్టి పెరిగిన 27 ఏళ్ల విశాఖ పదేళ్లకే సైకిల్ తొక్కడం నేర్చుకుంది. 12 ఏళ్లకు స్కూటర్ నడిపింది. తన స్నేహితుల్లో ఎక్కువమంది అబ్బాయిలే ఉండడంతో వాళ్లతో కలిసి తిరుగుతూ బైక్ నడపడం కూడా నేర్చుకుంది. పద్నాలుగేళ్లు వచ్చేటప్పటికి హీరో హోండా ప్యాషన్ బైక్‌ను నడిపింది. చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూనే... కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో.. పదోతరగతి పాసైన తరువాత విశాఖ ముంబైలోని ఓ బేకరీలో నెలకు రెండు వేల రూపాయలు జీతంతో క్యాషియర్‌గా చేరింది. కారణాంతరాల వల్ల 15 రోజులకే ఆ జాబ్ మానేసింది. తరువాత షాపింగ్ మాల్స్ దగ్గర ఉండి, పాంప్లెట్స్ పంచటం, వివిధ రకాల ఈవెంట్స్‌లో రోజువారి కూలీగా పనిచేయటం వంటి వాటితో సంపాదించిన దాన్లోనే కొద్ది డబ్బు దాచుకుంది. వాటికి పుస్తెలతాడు తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులు జతచేసి, 2015లో బైక్ కొనుక్కుంది. ఆ బైక్‌కు కాశిష్ అని పేరుపెట్టుకుంది. View this post on Instagram A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha) చిన్నచిన్న జాబ్‌లు చేస్తూనే ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తిచేసింది. ఆ తరువాత నుంచి తనెంతో ఇష్టమైన బైక్ రేసింగ్లలో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఇండియాలో మోటోవ్లాగింగ్ చేసేవారు ఎవరూ లేరని లె లుసుకుని మోటో వ్లాగింగ్ చేయాలనుకుంది. 2017లో సొంత యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. రోజూ ఏదోఒక ప్రాంతానికి తన బైక్ మీద వెళ్తూ.. వీడియోలు తీసి, తరువాత వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసేది. తొలిసారి అమ్మాయి రైడింగ్ వీడియోలు పోస్టుచేయడంతో చాలామంది నెటిజన్లు ఆమె వీడియోలను ఆసక్తిగా చూసేవారు. క్రమంగా వీడియోలు పెరగడంతో ఫాలోవర్స్ సంఖ్య ఎనిమిదిన్నర లక్షలకు చేరింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు బంగాళాఖాతం దాటి అండమాన్ దీవుల వరకు ప్రయాణించిన విశాఖ.. మూడుసార్లు లడఖ్, స్పితి, రాజస్థాన్, కన్యాకుమారి, కేరళ, రామేశ్వరం, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలలోని పలుప్రాంతాలను పర్యటించింది. నర్మదా నదీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఎనిమిదిరోజుల్లో చుట్టి వచ్చింది. రైడర్ గార్ల్ విశాఖ అని సరిపెట్టుకోకుండా, రెండు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. విశాఖ మాట్లాడుతూ..‘‘అబ్బాయిలు మాత్రమే నడిపే బైక్‌లను అమ్మాయి నడపడం చూస్తే.. ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు. అటువంటి పరిస్థితుల నుంచి ‘రైడర్‌గర్ల్ విశాఖ’గా ఎదిగాను. లడఖ్ వెళ్లిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. రైడింగ్ చేసేటప్పుడు వివిధ రకాల వాతావరణాలను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఒంటరిగా బైక్ నడిపే నాకు కొన్నిసార్లు వసతి సదుపాయం కూడా దొరికేది కాదు. నేను ప్రయాణించే రహదారులు, కొండలలో టాయిలెట్స్ ఉండవు. రాత్రిపూట రైడింగ్ అంత సురక్షితం కాదు, అందుకే రైడింగ్ చేసే సమయంలో కండీషన్లో ఉన్న రైడింగ్ గేర్, కొద్దిపాటి ఎమర్జన్సీ మనీ, నా బ్లడ్ గ్రూపును బైక్ మీద రాయడం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబరును మొబైల్ స్క్రీన్ మీద ఉంచుకోవడం, ట్రాకింగ్ యాక్సిడెంట్ డివైజ్‌ను నాతో ఉంచుకుంటూ.. నాలుగేళ్లుగా మోటోవ్లాగర్‌గా కొనసాగుతున్నాను’’ అని చెప్పింది. ఆమె మాటలు వింటుంటే అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని అర్థం అవుతోంది. చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్‌గేట్స్ -
పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ హీరో
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ భార్య ఆయనకు ఓ బైక్‌ని బహుమతిగా ఇచ్చింది. దీంతో అదే రోజు శ్రీమతిని బైక్‌పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే వివేక్ హెల్మెట్ ధరించకపోవడంతో ఇది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హీరో వివేక్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి చలానా విధించారు. అంతేకాకుండా కరోనా సమయంలో మాస్క్ ధరించనందున ఎఫైఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలోగత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తుండంతో అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వివేక్ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్‌లో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చదవండి : (వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!) (‘దిశా.. యమ హాట్‌గా ఉన్నావ్’) View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
జనాన్ని హడలెత్తిస్తున్న బైక్ వీరుడి జులాయి వేషాలు
సాక్షి, చిత్తూరు: జాతీయ రహదారిపై ఓ యువకుడు వారం రోజులుగా బైక్‌తో సర్కస్ ఫీట్లు చేస్తూ రోడ్డుపై వెళ్లే వాళ్లని హడలెత్తిస్తున్నాడు. శాంతిపురం– రాజుపేటరోడ్డు మార్గంలో పాత యమహా బైకుతో చెలరేగిపోతున్నాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ యువకుడు తన నైపుణ్య ప్రదర్శనకు దిగుతున్నాడు. వేగంగా బైకు నడుపుతూ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి వంద మీటర్ల వరకూ దూసుకెళుతున్నాడు. (అన్నాతమ్ముళ్ల గొడవ.. కింద పడేసి) వాహనాల రద్దీ సమయంలో వాటి మధ్య నుంచి అడ్డదిడ్డంగా బైకును చాకచక్యంగా నడుపుతున్నాడు. దీంతో చూసే వారు భయంతో హడలి చస్తున్నారు. అరిచి గోల చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతే వేగంతో క్షణాల్లో మాయం అవుతున్నాడు. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు రోడ్డుపై నిఘా పెట్టి బైకు వీరున్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. -
మైనర్ కాదు.. మోనార్క్!
సాక్షి, శ్రీకాకుళం : నగరంలో గత రెండేళ్లుగా వాహనాలు రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. పలు ద్విచక్ర వాహన ఉత్పత్తిదారులు యువతను ఆకట్టుకునేలా వాహనాలను రూపొందిస్తుండటంతో వీరి వేగానికి అదుపు లేకుండా పోతోంది. తల్లిదండ్రులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా తమ పిల్లలకు వాహనాలు కొనుగోలు చేయడమో, ఉన్న వాహనాలను పిల్లలకు ఇవ్వడమో చేస్తున్నారు. పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా యువత, తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వాహనాలు నడుపుతున్న యువతలో 80 శాతం మందికి లైసెన్స్లే లేవనడంలో అతిశయోక్తి కాదు. లైసెన్స్‌లు ఉన్నా వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడమో, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడమో జరుగుతున్నాయి. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతుండడం వల్ల వారికో.. ఎదురుగా వస్తున్న వారికో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మైనర్లలో, తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలకు అనుగుణంగా రోడ్లు ఎక్కాల్సిన వాహనాలు అందుకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. ఇలా నిబంధనలు అతిక్రమించి, పోలీసులకు చిక్కినపుడు సిఫార్సుల ద్వారానో, జరిమానా చెల్లించో వాటి నుంచి బయటపడి మళ్లీ రోడ్లపై యథేచ్చగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా ఇటువంటి వారికి జరిమానా విధిస్తున్నారే తప్ప, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం లేదు. ఇటువంటి సున్నితమైన సమస్యలపై మైనర్లు, తల్లిదండ్రులను చైతన్య పరచాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇటీవలే వారికి తరచూ కౌన్సిలింగ్ నిర్వహించి విడిచి పెడుతున్నారు. అయినా మార్పు రావడం లేదు. శ్రీకాకుళం నగరంలో పలు రోడ్లు ఇరుకుగా ఉండడం అందరికీ తెలిసింది. ఇటువంటి ప్రాంతాల్లో మైనర్లు అతి వేగాన్ని ప్రదర్శించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు.