రోడ్డుపై యువకుడి విన్యాసాలు
సాక్షి, చిత్తూరు: జాతీయ రహదారిపై ఓ యువకుడు వారం రోజులుగా బైక్‌తో సర్కస్ ఫీట్లు చేస్తూ రోడ్డుపై వెళ్లే వాళ్లని హడలెత్తిస్తున్నాడు. శాంతిపురం– రాజుపేటరోడ్డు మార్గంలో పాత యమహా బైకుతో చెలరేగిపోతున్నాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ యువకుడు తన నైపుణ్య ప్రదర్శనకు దిగుతున్నాడు. వేగంగా బైకు నడుపుతూ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి వంద మీటర్ల వరకూ దూసుకెళుతున్నాడు. (అన్నాతమ్ముళ్ల గొడవ.. కింద పడేసి)
వాహనాల రద్దీ సమయంలో వాటి మధ్య నుంచి అడ్డదిడ్డంగా బైకును చాకచక్యంగా నడుపుతున్నాడు. దీంతో చూసే వారు భయంతో హడలి చస్తున్నారు. అరిచి గోల చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతే వేగంతో క్షణాల్లో మాయం అవుతున్నాడు. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు రోడ్డుపై నిఘా పెట్టి బైకు వీరున్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment