మోటార్ బైక్ కొత్తదైనా చాలామంది మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే బైక్ నడుపుతున్నపుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మైలేజ్ తగ్గుందని నిపుణులు చెబుతున్నారు. బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ కింది విషయాలపై జాగ్రత్త తీసుకోవాలంటున్నారు.
గేర్ మార్చకపోవడం
బైక్ నడుపుతున్నపుడు బైక్ వేగానికి తగ్గట్టుగా గేర్ మార్చడం చాలా ముఖ్యం. మెయిన్ రోడ్డు(పెద్ద రోడ్లు, రహదారులు)పై అధిక వేగంతో బైక్‌ను స్థిరవేగంతో నడపాలంటే ఎక్కువ గేర్‌లో ఉండాలి. దీనివల్ల ఇంజిన్‌పై పెద్దగా ఒత్తిడి ఉండదు. దాంతో మంచి మైలేజ్ ఇస్తుంది. తక్కువ వేగంతో నడపాల్సి వస్తే రెండు లేదు మూడో గేర్‌లో బైక్‌ను నడపాలి. ఇలా చేయడం వల్ల బైక్ తక్కువ వేగంలో ఆగదు.
ఎప్పుడూ కాలు బ్రేక్ పైనే..
బైక్ నడుపుతున్నపుడు చాలా మంది బ్రేక్‌పై కాలు ఉంచుతారు. అయితే బ్రేక్‌పై కాలు ఉంచి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటేం కాదు. ఇది వెంటనే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి బ్రేక్‌లపై ఒత్తిడి ఉంచితే స్వేచ్ఛగా ముందుకు కదలదు. ఇలా చేయడం వల్ల బైక్ నడపడానికి ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాలి. దాంతో కొంత మైలేజ్‌పై ప్రభావంపడే అవకాశం ఉంది. అలా అని బ్రేక్ వాడకూడదని కాదు. అనవసరమైన సందర్భాల్లోనూ బ్రేక్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే..
తక్కువ గాలి..
టైర్లలో తక్కువగా గాలి ఉండటం వల్ల బైక్ మైలేజ్ క్షీణిస్తుంది. మెరుగైన మైలేజీ కోసం టైర్‌లో సరిపడా గాలి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులు ఎయిర్ ప్రెజర్ మెషీన్ సదుపాయాన్ని కలిగి ఉంటున్నాయి. దాంతో ఉచితంగానే టైర్‌ల్లో గాలి చెక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment