అత్యధిక దూరం ప్రయాణంతో యువకుడి రికార్డ్
అవయవదానం, జంతుసంక్షేమంపై అవగాహన యాత్ర
మొత్తం 96 రోజుల్లో.. 41వేల కి.మీ రైడ్
ఊ నాన్ రిపీటింగ్ రైడ్ సాధించిన మూడో పిన్నవయస్కుడిగా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: వేగవంతమైన రైడ్ చేసిన అతిపిన్న వయస్కుడైన బైకర్‌గా ఇటీవల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు çఅందుకున్నాడు కొండా సిద్ధార్‌్థ. నగరవాసి అయిన మంచిర్యాలకు చెందిన సిద్ధార్థ్ ప్రస్తుతం సొంత వ్యాపారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా తను పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే..
జాలీరైడ్ చేద్దామనుకున్నా..
బైక్ మీద తోచినదారిన సాగిపోవాలని, మార్గ మధ్యంలోనే పని చేసుకుంటూ, సంపాదించుకుంటూ ఆ డబ్బునే ఖర్చు చేసుకుంటూ యాత్ర చేయాలనేది నా ఆలోచన. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ మేనేజర్ విమలేష్ కుమార్ నాన్ రిపీటింగ్ రైడ్ గురించి నాకు తొలుత పరిచయం చేశాడు. తనే ఆ తర్వాత కూడా మార్గనిర్దేశం చేస్తూ సహకరించారు. ఈ రైడ్స్ ద్వారా మంచి సందేశాలు అందించవచ్చని, అలాగే రికార్డ్స్ సాధించొచ్చని తెలుసుకున్నాక.. ఆ దిశగా నేనెందుకు ప్రయత్నం చేయకూడదు? అని ప్రశ్నించుకున్నా.. నా యాత్రకు అవయవ దానం, జంతువుల సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యం మార్చుకున్నా. కేవలం 96 రోజుల్లో 40,708.5 కిమీ ప్రయాణంలో 28 రాష్ట్రాలు 2,731 ప్రదేశాల మీదుగా సాగిపోయా. ఇందులో ఓ కేంద్ర పాలిత ప్రాంతం కూడా కవర్ అయ్యింది.
ఈ రైడ్‌లో.. 3వ రికార్డ్..
ప్రపంచంలో ఈ తరహా నాన్ రిపీటింగ్ మారథాన్ ట్రిప్ ఫీట్‌ను సాధించిన ముగ్గురు పిన్న వయసు రైడర్‌లలో చైనా నుంచి ఒకరు, చెన్నై నుంచి మరొకరు మాత్రమే ఉన్నారు. అలా మన దేశం నుంచి నేను కూడా వారి సరసన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకున్నా. ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలనుకుంటున్నా. లడఖ్‌లో రెండు వారాల పాటు మంచు కురుస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ద్రాస్‌లో రోడ్డుకు అడ్డంగా మంచు చరియలు విరిగిపడుతున్నప్పుడు.. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. అదృష్టవశాత్తూ ఈ డేంజరస్ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదానికీ గురికాలేదు.
ప్రమాదాల నివారణకు..
ఈ రైడ్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 అనే అడ్వెంచర్ బైక్ ఉపయోగించా. జర్మనీ నుంచి ప్రత్యేక హెల్మెట్‌ను దిగుమతి చేసుకున్నా. స్లీపింగ్ బ్యాగ్, కెమెరాతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జంతువులకు కట్టడానికి కాలర్ టైలను తీసుకువెళ్లా, క్యాంపింగ్ టెంట్, మెడికల్ కిట్, మోటర్‌బైక్ ఉపకరణాలు దగ్గర ఉంచుకున్నా. యుఎస్ లోని ఓ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫైర్ సేఫ్టీ సంబంధిత కోర్సును అభ్యసించా.
Comments
Please login to add a commentAdd a comment