India Book of Records
-
India Book of Records: చిన్నారి ఆకర్షణ సంకల్పబలం..
కితాబ్తో విజ్ఞానాన్ని పంచుతూ.. లైబ్రరీల ఏర్పాటు పరంపర కొనసాగిస్తూ.. ఇప్పటివరకూ 15 గ్రంథాలయాల ఏర్పాటు.. 25 లైబ్రరీల లక్ష్యం దిశగా అడుగులు.. చిన్నారి ఆకర్షణ సంకల్పబలం.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఏపీ మాజీ సీఎం అభినందనలు.. 25వ లైబ్రరీ ప్రారంభోత్సవానికి హాజరవుతానని ప్రధాని హామీ..పుస్తక పఠనంపై ఆసక్తి రేపుతూ.. పుస్తకం తోడుంటే వెలకట్టలేని స్నేహితుడు వెన్నంటే ఉన్నట్టే. మంచి పుస్తకం నిండైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మదిని కమ్మేసిన నిరాశ నిస్పృహలను దూరం చేసి ధైర్యాన్ని కూడగడుతుందంటారు సాహితీవేత్తలు. పుస్తక సాహిత్యం జీవన విధానాన్ని, పోరాట పటిమను అలవర్చుతుందంటారు. అలాంటి పుస్తక విలువను విశ్వవ్యాప్తం చేసేందుకు చిన్నారి ఆకర్షణ కంకణం కట్టుకుంది. పిన్న వయస్సులోనే కితాబ్ గొప్పతనాన్ని గుర్తించి ఎందరికో చదువుకునే భాగ్యాన్ని కలిగిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9,536 పుస్తకాలను సేకరించి 15 లైబ్రరీలను ఏర్పాటుచేసి తోటి చిన్నారులతో పాటు ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని రేపుతోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ఈ చిన్నారి లైబ్రరీల ఏర్పాటు యజ్ఞం గురించి తెలుసుకుని, ఆమెను కలుసుకుని ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆకర్షణ ఆమెకు ప్రేరణ కలిగించిన అంశాలు, లక్ష్యాలను గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి: ఎన్నో ఏట నుంచి పుస్తక సేకరణ ప్రారంభించారు? ప్రేరణ కలిగించింది ఎవరు ?ఆకర్షణ: తొమ్మిది సంవత్సరాల వయస్సు నుంచి పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టాను. 2021లో ఎంఎన్‌జే క్యాన్సర్ చి్రల్డన్ ఆస్పత్రిలోని రోగులకు, వారి సహాయకులకు ఆహారాన్ని అందించేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాను. అక్కడి పిల్లల అవసరాలను గుర్తించాను. ముఖ్యంగా కలరింగ్ బుక్స్‌తో పాటు వారు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఊరటనిస్తాయని అనిపించింది. దీంతో పుస్తకాలను సేకరించి లైబ్రరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాను. నన్ను ప్రేరేపించిన ఎంఎన్‌జే కేన్సర్ హాస్పటల్లోనే మొట్టమొదటి లైబ్రరీని ఏర్పాటుచేశాను.సాక్షి: ఇప్పటి వరకూ ఎన్ని లైబ్రరీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. ?ఆకర్షణ: ఇప్పటివరకూ 15 లైబ్రరీలను ఏర్పాటు చేశాను. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, బోరబండ అల్లాపూర్ గాయత్రీనగర్ అసోసియేషన్, బాలికల కోసం జువైనల్ అబ్జర్వేషన్ హోమ్, కోయంబత్తూర్ సిటీ పోలీస్–స్ట్రీట్ లైబ్రరీ, చెన్నై బాయ్స్ క్లబ్–నోలంబూర్ పోలీస్‌స్టేషన్, సనత్‌నగర్ ఓల్డ్ ప్రభుత్వ పాఠశాల, సిద్దిపేట ఉమెన్ సేఫ్టీవింగ్ భరోసా సెంటర్, తమిళనాడు కన్యాకుమారి జిల్లాల్లోని కలితురై గ్రామం, అమీర్‌పేట స్టేడియం, ఏఎస్‌రావునగర్ బాలగోకులం భాగ్యనగర్, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని ఎయిడ్స్ అనాథ చిన్నారుల గృహం, బోరబండ ఆదర్శ ఫౌండేషన్, బోయిగూడ అనాథ బాలికల వసతి గృహం, బొల్లారంలోని కలాడీ ఆది శంకర మేడోమ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగింది.సాక్షి: ప్రధాని మన్‌కీ బాత్‌లో మాట్లాడే అవకాశం ఏ విధంగా వచ్చింది. ?ఆకర్షణ: నేను లైబ్రరీల ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ కూడా లైబ్రరీ కార్యక్రమాల నిమిత్తం వెయ్యి పిల్లల పుస్తకాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకువచి్చంది. ఈ నేపథ్యంలోనే 2023, సెపె్టంబర్ 24న ప్రధానమంత్రి మన్‌కీ బాత్ 105వ ఎపిసోడ్లో స్వయంగా మాట్లాడే అవకాశం దక్కింది.సాక్షి: స్వయంగా ప్రధానితో ముచ్చటించినప్పుడు మీ ఫీలింగ్? ఆయన ఏమన్నారు ?ఆకర్షణ: ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచి్చన ప్రధాని నరేంద్రమోదీని రాజ్‌భవన్‌లో స్వయంగా కలిసే అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిరి్వరామంగా కొనసాగించు అని ఎంతగానో ప్రోత్సహించి అభినందించారు. నేను ఏర్పాటుచేయబోయే 25వ లైబ్రరీ ప్రారం¿ోత్సవానికి స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు పలువురు అధికారుల అభినందనలు మరువలేనివి. సాక్షి: పుస్తకాల సేకరణకు ఇంకా ఎవరెవరి ప్రోత్సాహం ఉంది ?ఆకర్షణ: తెలంగాణ ఆధారిత మానేరు రచయితల సంఘం, బాల సాహిత్య పరిషత్, దక్కన్ సాహిత్య సభలు లైబ్రరీల ఏర్పాటుకు గాను వెయ్యి పుస్తకాలు విరాళంగా అందజేసేందుకు ముందుకువచ్చాయి. సాక్షి: పిన్న వయస్సులోనే మీరు సాధించిన మరుపురాని జ్ఞాపకాలు ?ఆకర్షణ: న్యూఢిల్లీలో జరిగిన 75వ గణతంత్ర వేడుకలకు రక్షణ శాఖ నుంచి ఆహ్వానం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పత్రం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కడం మధురానుభూతిని కలిగించింది. సాక్షి: మీ కుటుంబ నేపథ్యంఆకర్షణ: తండ్రి సతీష్ హెల్త్‌కేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి ప్రవిత గృహిణి. సనత్‌నగర్ లోధా అపార్ట్మెంట్లో ఉంటాం.సాక్షి: ఇప్పటివరకూ ఎన్ని పుస్తకాలు సేకరణ చేశారు? ఎలా సేకరిస్తారుఆకర్షణ: ఇప్పటివరకూ 9,536 పుస్తకాలను సేకరించాను. ఇందులో 8000 పుస్తకాలు ఇతరులు డొనేట్ చేసినవే. అపార్ట్మెంట్ల నివాసితులు, క్లాస్మేట్స్, బంధువుల కుటుంబాల నుంచి సేకరిస్తుంటాను. వారంతా చదివేసిన అనంతరం తమ వద్ద ఉన్న పుస్తకాలు నాకు అందజేస్తుంటారు. వాటిని కలుపుకుని స్వతహాగా నేను కొనుగోలు చేసిన కొన్ని పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేశాను. -
కృతి రికార్డ్
అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించడం ఇది రెండోసారి.తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్ ఆఫ్ ఆప్ రికార్డ్స్’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ‘ఈ రికార్డ్ కృతి ప్రతిభకు మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యానికి కూడా అద్దం పడుతుంది. భాషా సామరస్యత అనే భావనను పెం΄÷ందిస్తుంది’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
జ్ఞాపకశక్తిలో భళా దేవాన్షి
రామచంద్రాపురం (పటాన్చెరు): అద్భుత మేధస్సు.. అమోఘమైన జ్ఞాపకశక్తి ఆ చిన్నారి సొంతం. ఒక్కసారి చెబితే చాలు.. గుర్తించి దాని పేర్లను చెబుతుంది. ఏడాది 9 నెలల వయసున్న ఆ బాల మేధావి అసమాన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2023లో చోటు సంపాదించింది. వివరాలివి. రామచంద్రాపురం పట్టణంలోని కాకతీయ నగర్ ప్రాంతానికి చెందిన బండారి విజయేంద్ర, మౌనిక దంపతుల కుమార్తె దేవాన్షి.. వస్తువులను గుర్తించడం, అంకెలను ఒకటి నుండి పది వరకు చెప్పడం, ఐదు రకాల జంతువుల్లా అరవడంలో దిట్ట. దీంతో కుటుంబ సభ్యులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించారు. వారి సూచనల ప్రకారం కుమార్తె ప్రతిభపై చిత్రీకరించిన వీడియోలు, జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువులను సమర్పించారు. ఆ వీడియోలో దేవాన్షి 15 బొమ్మలు, ఆరు శిశువు ఉత్పత్తులు, తొమ్మిది కూరగాయలు, ఐదు కార్టూన్ పాత్రలు, శరీరంలోని 11 భాగాల చిత్రాలను గుర్తించినట్టు చూపించారు. అదనంగా 6 రైమ్‌లు, 10 యాక్షన్ పదాలు, 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం, ఐదు జంతువుల శబ్ధాలను అనుసరించడం వంటివి రికార్డు చేశారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దేవాన్షికి చోటు కల్పించారు. కాగా చిన్నారి తండ్రి విజయేంద్ర జూరాల ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తున్నారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్‌గా అవార్డు సాధించిన ఆయన.. 77వ స్వాత్రంత్య దినోత్సవం రోజున ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడితేనే ఎవరైనా విజయం సాధించగలరనడానికి ఈ అవార్డులే నిదర్శనమన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక మిగిలిన జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానని చెప్పారు. చదవండి: స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్‌లు.. -
23 నెలలకే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
కమలాపూర్: 23 నెలల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఓ చిన్నారి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ఆకినపెల్లి కృష్ణ మనుమరాలు శ్రేయాన్వి కృష్ణ వయస్సు రెండేళ్లు కూడా నిండలేదు. ఆమె తల్లిదండ్రులు శ్రావణి–సాయిరాం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. శ్రేయాన్వి తెలుగు పాటలు, పద్యాలు, శ్లోకాల పఠనంతోపాటు తెలుగు సినిమా నటీనటులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను గుర్తించడం, రామాయణంలోని కథలు చెప్పడం, దేవుళ్ల పేర్లను గుర్తించడం, పజిల్స్ సాల్వ్ చేయడం, ఇంగ్లిష్ రైమ్స్ వంటివి చెబుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. తల్లిదండ్రులు.. చిన్నారి వీడియోలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం పంపించారు. -
రికార్డ్: నజియ విజయం
ఎక్కడి కేరళ, ఎక్కడి మహారాష్ట్ర! కానీ కళకు దూరం ఎప్పుడూ భారం కాదు అని నిరూపించింది నజియ నవస్. తిరువనంతపురం(కేరళ)కు చెందిన నజియ ఇంటర్నెట్లో ఒకసారి వర్లీ పెయింటింగ్‌లను చూసి అబ్బురపడింది. మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన వర్లీ ఆర్ట్ తనను ఎంత ఆకట్టుకుందంటే ఎలాగైనా సరే ఆ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునేంతగా! అనుకోవడానికేం... ఎన్నయినా అనుకుంటుంటాం. మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి వర్లీ నేర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే అంతర్జాలాన్నే గురువుగా భావించి సాధన మొదలు పెట్టింది. దానికి ముందు ఎన్నో విషయాలను చదివి తెలుసుకుంది. వర్లీ కళ అనేది అసామాన్య చిత్రకారుల సృష్టిలో నుంచి వచ్చింది కాదు. సామాన్య గిరిజనులే దాని సృష్టికర్తలు. మట్టిగుడిసెలను తమకు తోచిన కళతో అలంకరించేవారు. నిత్యం అందుబాటులో ఉన్న వస్తువులనే పెయింటింగ్స్ కోసం వాడేవారు. తరాలు మారుతున్న కొద్దీ ఈ కళ మరింత విస్తృతి పొందింది. విశేషం ఏమింటే వర్లీ చిత్రాలలో ప్రకృతి ప్రధాన వస్తువుగా కనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య ఉండే సంబంధాలను అవి చిత్రీకరిస్తాయి. వర్లీ కళకు సంబంధించి రకాల విషయాలు తెలుసుకునే క్రమంలో ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదల నజియాలో పదింతలైంది. ఎట్టకేలకు తనకు ఇష్టమైన కళలలో పట్టు సాధించింది. ఇప్పటివరకు వందకు పైగా వర్లీ పెయింటింగ్స్ వేసింది. డిగ్రీ పూర్తి చేసిన నజియాకు తన అభిరుచి ఆదాయ మార్గంగా కూడా మారింది. ఆన్లైన్లో తన వర్లీ పెయింటింగ్‌లు అమ్ముతుంది. తాజాగా 5 అంగుళాల పొడవు, వెడల్పైన వర్లీ పెయింటింగ్‌తో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది నజియ. గతంలో ఉన్న పది అంగుళాల పొడవు, వెడల్పయిన వర్లీ పెయింటింగ్ రికార్డ్‌ను నజియ బ్రేక్ చేసింది. ‘నేర్చుకున్నది చాలు’ అని అనుకోవడం లేదు నజియ. ముంబైకి వెళ్లి ఆ కళలో మరిన్ని మెళకువలు నేర్చుకోవాలనుకుంటుంది. ‘కళను పట్టుదలగా నేర్చుకోవాలి. ఉదారంగా పంచాలి’ అంటారు. వర్లీ కళను సొంతంగా నేర్చుకున్న నజియ ఇప్పుడు ఆ కళను ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగా నేర్పించడానికి రెడీ అవుతుంది. -
హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన చిన్నారి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ఆ చిన్నారి అబ్బుర పరిచింది.. వచ్చీ రాని మాటలతో సరిగా పదాలే పలకలేని చిన్నారి ఏకంగా ప్రీహిస్టారికల్ అనిమల్స్ పేర్లను చకా చకా చెబుతూ ఆశ్యర్య చకితులను చేస్తోంది.. నిజాంపేట్ సిరిబాలాజీ టవర్స్‌లో నివాసముండే మధు కుమార్తె నాలుగేళ్ల గొట్టుముక్కుల నితీషా కేవలం 30 సెండ్ల వ్యవధిలోనే అత్యధిక ప్రీహిస్టారిక్ యానిమల్స్‌ను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. చిన్నారి జ్ఞాపక శక్తిని గమనించిన తల్లి మధు ఆమెకు ప్రీహిస్టారిక్ యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలను చూపించారు. వీడియో చూసే క్రమంలో ఠక్కున సదరు జంతువుల పేర్లను చెప్పడం ప్రారంభించింది. దీంతో చిన్నారి తల్లి మధు ప్రీహిస్టారికల్ యానిమల్స్ పేర్లు చెబుతున్న క్రమంలో వీడియోలు తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించారు. చిన్నారి ఘనతను గుర్తిస్తూ ఈ నెల 23న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి, 21న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి కన్షర్మేషన్ లెటర్లు అందాయని చిన్నారి తల్లి మధు ‘సాక్షి’ కి తెలిపారు. -
రెండేళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..
సాక్షి, మధురవాడ (భీమిలి): కొందరు చిన్నప్పటినుంచే ప్రతిభ కనబరుస్తుంటారు. ఇటువంటివాళ్లను చూసి ఇది గాడ్ గిఫ్ట్ అంటాం. ఈ చిన్నారి విషయంలో మదర్ గిఫ్ట్ కూడా ఉంది. తన బిడ్డను తీర్చిదిద్దిన వైనం రికార్డులు తెచ్చిపెట్టింది. రెండేళ్ల వయసులోనే జ్ఞాన్దేవ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మధురవాడ శివశక్తినగర్‌కు చెందిన గంధం అమిత ప్రియ ఏకైక కుమారుడు జ్ఞాన్దేవ్. బాలుడు తల్లి అమిత ప్రియ గీతం యూనివర్సిటీలో ఎం.కామ్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తండ్రి మనోహర్, తల్లి ఈశ్వరి కుమారీల సంరక్షణలో ఉంటుంది.అమితప్రియ రెండేళ్ల కుమారుడు జ్ఞాన్దేవ్కు 6 జాతీయ చిహ్నాలు , 12 రాశి ఫలాలు, 24 వాహనాలు, 13 రకాలు పండ్లు, 21 సంగీత పరికరాలు, 13 సముద్ర జీవ రాశులు, 10 చారిత్రక స్థలాలు, 10 స్టేషనరీ వస్తువులు, 10 కంప్యూటర్ విడిభాగాలు, 10 రకాల క్రీడల బంతులు, 8 ఇండియన్ సీఈవోలు, 5 ప్రార్థనా స్థలాలు, 6 మతాలు, 8 రకాల నీటి మొక్కల మూలాలు, 9 మంచి అలవాట్లు గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. అలాగే 15 రకాల చర్యలను నటన ద్వారా చూపించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: (విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి) -
నూజివీడు వండర్ కిడ్ తోషిత్‌రామ్
నూజివీడు: రెండున్నరేళ్ల వయస్సులో తన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన కలపాల తోషిత్‌రామ్. రెండున్నరేళ్లు అంటే మాటలుకూడా రాని వయస్సు. కానీ తోషిత్‌రామ్ మాత్రం తన ఐక్యూతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన పోటీల్లో తోషిత్ ఇంగ్లిష్ అక్షరాలను ఏ నుంచి జెడ్ వరకు, తిరిగి రివర్స్ ఆర్డర్లో జెడ్ నుంచి ఏ వరకు కేవలం 22 సెకన్లలోనే టకటకా చెప్పేశాడు. దీంతో యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కిడ్‌గా తోషిత్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. గతంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఈ బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్‌ప్రసాద్ టీటీడీలో ఉద్యోగి, తల్లి భవ్యశ్రీ స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ ) -
Padmarajan Record: రాజాధిరాజన్ ఓడినా.. రికార్డే
ఎన్నికల్లో పోటీ అంటే ఇప్పటి వరకు ఓట్లు.. సీట్లు.. మెజారిటీ.. అని మాత్రమే మీరు విని ఉంటారు.. కానీ తమిళనాడు సహా.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నామినేషన్ వేయడం, పోటీ చేసి.. డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం ఆయన స్పెషాలిటీ. ఈ కారణంతో ఏకంగా ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు ఈ నాయకుడు కాని.. నాయకుడు. ఆయనే 219 సార్లు పోటీ చేసి అరకోటికి పైగా డిపాజిట్ నగదు పోగొట్టుకున్న పద్మరాజన్..! సాక్షి, చెన్నై: గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా తొలిరోజే నామినేషన్ వేసే ఎన్నికల వీరుడు పద్మరాజన్ కొత్త రికార్డు నమోదు చేశాడు. ఎన్నికల్లో అత్యధికసార్లు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి గా ఆయన గుర్తింపు పొందారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన అరవై నాలుగేళ్ల పద్మరాజన్ 1988 నుంచి అనేక ఎన్నికల్లో ఆయన నామినేషన్లు వేశారు. సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో సైతం బరిలోకి దిగి.. ఎలక్షన్ కింగ్‌గా అవతరించారు. తాజాగా రాష్ట్రంలో ఓ రాజ్యసభ స్థానానికి జరగనున్న ఎన్నికలకు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా, ఈ నామినేషన్ బుధవారం తిరస్కరణకు గురైంది. జాబితా.. పెద్దదే..! ఇప్పటి వరకు 36 సార్లు లోక్‌సభకు, 41 సార్లు రాజ్యసభకు, 66 సార్లు అసెంబ్లీకి, ఐదు సార్లు రాష్ట్రపతి, మరో ఐదుసార్లు ఉప రాష్ట్రపతి, 4 సార్లు ప్రధాన మంత్రి అభ్యర్థులకు ప్రత్యర్థిగా, 13 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థులకు పోటీగా , ఏడు పార్టీల అధినేతలకు ప్రత్యర్థిగా.. మొత్తం 219 సార్లు పద్మరాజన్ ఎన్నికల నామినేషన్లు వేశారు. ప్రతి ఎన్నికల్లోనూ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి డిపాజిట్ సొమ్ముచెల్లించడం పద్మరాజన్ స్టైల్. ఇంతవరకు వార్డు సభ్యుడిగా కూడా గెలవనప్పటికీ, రికార్డులను మాత్రం పెద్దఎత్తున తన సొంతం చేసుకుంటున్నారు. రికార్డుల రారాజు.. అత్యధిక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పద్మరాజన్‌కు ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. ఇది వరకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుతో పాటుగా మరికొన్ని రికార్డులను దక్కించుకున్న ఆయనకు ప్రస్తుతం ఢిల్లీ బుక్ ఆఫ్‌రికార్డులోనూ స్థానం దక్కడం విశేషం. ఓటమితో కృంగి పోకూడదని, ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇలాంటి రికార్డుల రూపంలో విజయం దరిచేరుతుందని ఈ సందర్భంగా పద్మరాజన్ వ్యాఖ్యానించడం ఆసక్తికరం. గెలిచిన వాళ్లకే ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రపంచంలో వరుస ఓటములు చవిచూస్తున్న తనను కూడా గుర్తించి, రికార్డులు, అవార్డులు దరిచేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 219 నామినేషన్లు దాఖలు చేసిన రూ. 50 లక్షల మేరకు డిపాజిట్‌సొమ్మును పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. తన నామినేషన్ల పర్వం.. ఏదో ఒకరోజు గిన్నిస్ బుక్‌లోనూ చోటు సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: కాషాయ జెండా పట్టుకొని ఎర్ర జెండా డైలాగులా ఈటలా? -
రికార్డు కొట్టేసిన ‘వంటలక్క’.. 30 నిమిషాల్లో..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై తిరుమంగళానికి చెందిన ఒక మహిళ 30 నిమిషాల్లో 134 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. తనకున్న ప్రత్యేక టాలెంట్‌తో ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ అరగంట వ్యవధిలో 130 రకాల శాఖాహార, మాంసాహార వంటకాలు ఉండటం విశేషం. చిన్నతనం నుంచే వంటలపై ఆసక్తి ఉన్న ఇందిరా రవిచంద్రన్ పాక కళలో కొత్త రికార్డు సృష్టించారు.అతి తక్కువ సమయంలో ఎక్కువ రకాల వంటలు చేసిన ఇందిరా రవిచంద్రన్ పేరును ఇండియా రికార్డ్‌లో నమోదు చేశారు. చాలా రోజుల శిక్షణ తర్వాత, రికార్డు సృష్టించే ప్రయత్నంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో దోస, ఇడ్లీ, ఉతప్పం, ఆమ్లెట్, ఓఫయిల్, వడ, బజ్జీ, ఐస్ క్రీం, పుడ్డింగ్తోపాటు, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, వంటి అనేక రకాల మాంసాహార వంటకాలు ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల రసాలు, కేకులు కూడా ఉన్నాయి. చదవండి : అలా నటిద్దామనుకున్నాడు.. కనీసం మంచం కూడా దిగలేక పాట్లు! అంతకుముందు ఎవరి పేరుతో ఉందీ రికార్డు కాగా ఇంతకు ముందు, కేరళకు చెందిన 10 ఏళ్ల బాలుడు హాయెన్ ఒక గంటలో 122 వంటకాలను తయారు చేసాడు. తాజాగా రవిచంద్రన్ అధిగమించారు. దీంతో ఆమెపైప్రశంసల వెల్లువ కురుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఆమె రియాలిటీ వంట కార్యక్రమాల్లో కూడా సందడి చేయనున్నారు. అనేక ఛానెల్‌లు ఇప్పుడు ఆమెను వంట కార్యక్రమాలకు జడ్జ్‌గా రమ్మని ఆహ్వానిస్తున్నారట. చదవండి : Kukatpally: కూకట్‌పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్ ఇవే.. చదవండి : న్యూలుక్లో అదరగొట్టిన నటి, పెళ్లి ప్రపోజల్‌కు రిప్లై -
ఐదున్నరేళ్ల చిన్నారి చిచ్చర పిడుగులా..
భువనేశ్వర్: పాతికేళ్లు వచ్చినా.. రిపబ్లిక్ డే ఎప్పుడో కూడా తెలియని వారు సమాజంలో చాలామంది తారస పడుతుంటారు. ఇంటర్వ్యూల్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎంతటి వారైనా నీళ్లు నమలాల్సిందే. అయితే ఐదున్నరేళ్ల చిన్నారి చిచ్చర పిడుగులా 48 దేశాలు, వాటి రాజధానులు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 40 సెకన్ల లోనే వీటిని చెప్పడంతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.. జయపురం నకు చెందిన చిన్నారి అన్విత మిశ్ర. స్థానిక రాజు వీధిలోని వ్యాపారి శంకర మిశ్ర, మధుస్మిత ప్రాణిగ్రాహిల కుమార్తె అన్విత ప్రస్తుతం జయపురం ప్రకాశ్ విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. చిన్నతనంలోనే తన మేధస్సుతో ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పింది. గతంలో 34 సెకెన్లలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను అనర్ఘళంగా చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆసియా ఖండంలోని 48 దేశాల పేర్లు, వాటి రాజధానులను 48 సెకెన్లలో చెప్పడం పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను జూలైలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారికి పంపించారు. దీనిని బలపరుస్తూ సంస్థ నుంచి రెండు రోజుల క్రితం ధ్రువపత్రం అందిందని తల్లిదండ్రులు వెల్లడించారు. ప్రశంసాపత్రం తోపాటు మెడల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పుస్తకం, మరికొన్ని బహుమతలు పంపించారని తెలిపారు. కాగా... చిన్నారి అన్విత ప్రతిభ, అవార్డు పొందడం పట్ల జయపురం పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెజవాడ విద్యార్థి
పటమట (విజయవాడ తూర్పు): పటమటకు చెందిన గానుగుల కార్తికేయకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటంతో పాటు కేవలం నాలుగేళ్లలో (2014–2018) ప్రాథమిక నుంచి రాష్ట్రీయ భాషా ప్రవీణ వరకు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా గుర్తించి పురస్కారాన్ని అందిస్తున్నట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ బిష్వరూప్రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కార్తికేయ పదో తరగతి చదువుతున్నాడు. -
బైక్ నడిపితే ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు
అబ్బాయిలకు తామేమీ తీసిపోమంటున్నారు నేటి యువతులు. ఈ కోవలోనే ముంబైకి చెందిన విశాఖ మరో అడుగు ముందుకేసి బైక్ రైడింగ్‌లో అబ్బాయిలతో పోటీపడుతోంది. దీంతో ఆమెను అందరూ ‘రైడర్‌గర్ల్ విశాఖ’ అని ముద్దుగా పిలుస్తున్నారు. దేశంలోనే తొలి మహిళ ‘మోటో వ్లాగర్’ అయిన విశాఖ కొత్త కొత్త ప్రదేశాలకు బైక్‌మీద వెళ్తూ వీడియోలు తీసి తన యూ ట్యూబ్ చానల్లో అప్లోడ్ చేస్తూ.. సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది. రైడర్ గార్ల్ విశాఖ అసలు పేరు విశాఖ ఫుల్‌సుంగి. ముంబైలో పుట్టి పెరిగిన 27 ఏళ్ల విశాఖ పదేళ్లకే సైకిల్ తొక్కడం నేర్చుకుంది. 12 ఏళ్లకు స్కూటర్ నడిపింది. తన స్నేహితుల్లో ఎక్కువమంది అబ్బాయిలే ఉండడంతో వాళ్లతో కలిసి తిరుగుతూ బైక్ నడపడం కూడా నేర్చుకుంది. పద్నాలుగేళ్లు వచ్చేటప్పటికి హీరో హోండా ప్యాషన్ బైక్‌ను నడిపింది. చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూనే... కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో.. పదోతరగతి పాసైన తరువాత విశాఖ ముంబైలోని ఓ బేకరీలో నెలకు రెండు వేల రూపాయలు జీతంతో క్యాషియర్‌గా చేరింది. కారణాంతరాల వల్ల 15 రోజులకే ఆ జాబ్ మానేసింది. తరువాత షాపింగ్ మాల్స్ దగ్గర ఉండి, పాంప్లెట్స్ పంచటం, వివిధ రకాల ఈవెంట్స్‌లో రోజువారి కూలీగా పనిచేయటం వంటి వాటితో సంపాదించిన దాన్లోనే కొద్ది డబ్బు దాచుకుంది. వాటికి పుస్తెలతాడు తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులు జతచేసి, 2015లో బైక్ కొనుక్కుంది. ఆ బైక్‌కు కాశిష్ అని పేరుపెట్టుకుంది. View this post on Instagram A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha) చిన్నచిన్న జాబ్‌లు చేస్తూనే ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తిచేసింది. ఆ తరువాత నుంచి తనెంతో ఇష్టమైన బైక్ రేసింగ్లలో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఇండియాలో మోటోవ్లాగింగ్ చేసేవారు ఎవరూ లేరని లె లుసుకుని మోటో వ్లాగింగ్ చేయాలనుకుంది. 2017లో సొంత యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. రోజూ ఏదోఒక ప్రాంతానికి తన బైక్ మీద వెళ్తూ.. వీడియోలు తీసి, తరువాత వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసేది. తొలిసారి అమ్మాయి రైడింగ్ వీడియోలు పోస్టుచేయడంతో చాలామంది నెటిజన్లు ఆమె వీడియోలను ఆసక్తిగా చూసేవారు. క్రమంగా వీడియోలు పెరగడంతో ఫాలోవర్స్ సంఖ్య ఎనిమిదిన్నర లక్షలకు చేరింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు బంగాళాఖాతం దాటి అండమాన్ దీవుల వరకు ప్రయాణించిన విశాఖ.. మూడుసార్లు లడఖ్, స్పితి, రాజస్థాన్, కన్యాకుమారి, కేరళ, రామేశ్వరం, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలలోని పలుప్రాంతాలను పర్యటించింది. నర్మదా నదీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఎనిమిదిరోజుల్లో చుట్టి వచ్చింది. రైడర్ గార్ల్ విశాఖ అని సరిపెట్టుకోకుండా, రెండు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. విశాఖ మాట్లాడుతూ..‘‘అబ్బాయిలు మాత్రమే నడిపే బైక్‌లను అమ్మాయి నడపడం చూస్తే.. ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు. అటువంటి పరిస్థితుల నుంచి ‘రైడర్‌గర్ల్ విశాఖ’గా ఎదిగాను. లడఖ్ వెళ్లిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. రైడింగ్ చేసేటప్పుడు వివిధ రకాల వాతావరణాలను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఒంటరిగా బైక్ నడిపే నాకు కొన్నిసార్లు వసతి సదుపాయం కూడా దొరికేది కాదు. నేను ప్రయాణించే రహదారులు, కొండలలో టాయిలెట్స్ ఉండవు. రాత్రిపూట రైడింగ్ అంత సురక్షితం కాదు, అందుకే రైడింగ్ చేసే సమయంలో కండీషన్లో ఉన్న రైడింగ్ గేర్, కొద్దిపాటి ఎమర్జన్సీ మనీ, నా బ్లడ్ గ్రూపును బైక్ మీద రాయడం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబరును మొబైల్ స్క్రీన్ మీద ఉంచుకోవడం, ట్రాకింగ్ యాక్సిడెంట్ డివైజ్‌ను నాతో ఉంచుకుంటూ.. నాలుగేళ్లుగా మోటోవ్లాగర్‌గా కొనసాగుతున్నాను’’ అని చెప్పింది. ఆమె మాటలు వింటుంటే అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని అర్థం అవుతోంది. చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్‌గేట్స్ -
India Book Of Records: శభాష్ తోషిత్!
నూజివీడు: అపార జ్ఞాపకశక్తితో రెండేళ్ల రెండు నెలల వయస్సులోనే అబ్బురపరుస్తున్నాడు నూజివీడుకి చెందిన కలపాల తోషిత్‌రామ్. తన ఐక్యూతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. గతంలో ఈ రికార్డులో 2 ఏళ్ల నాలుగు నెలల వయస్సు బాలుడు ఉండగా, ఇప్పుడు తోషిత్‌రామ్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇంగ్లిష్ లో ఏ నుంచి జడ్ వరకు ఉన్న అక్షరాలు, 12 నెలలు, ఒకటి నుంచి 21 వరకు అంకెలు ఇంగ్లిష్ లో, ఒకటి నుంచి 33 వరకు హిందీలో, ఒకటి నుంచి 10 వరకు తెలుగులో, 20 పెంపుడు జంతువులను గుర్తించి వాటి పేర్లు చెప్పడం, 20 వన్య మృగాల పేర్లు చెప్పడం, 15 పక్షుల పేర్లు, 15 పండ్ల పేర్లు, ఐదు కూరగాయల పేర్లు, 14 రకాల వాహనాల పేర్లు, ఐదు జాతీయ గుర్తుల పేర్లు, 16 శరీర భాగాల పేర్లు, ఆరు ఆకారాలు, 11 రంగుల పేర్లు, ఐదు జంతువుల శబ్దాలు, 15 యాక్షన్ పదాలు చెప్పి ఈ ఘనతను సాధించాడు. బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్ ప్రసాద్ ఏపీ అసెంబ్లీలో మెంబర్ సర్వీస్ సెక్షన్లో లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తల్లి అట్లూరి భవ్యశ్రీ ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. తోషిత్ ప్రతిభ గురించి ఫిబ్రవరిలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి తెలియపర్చగా, మార్చిలో పరీక్షించి, రెండురోజుల కిందట సర్టిఫికెట్, మెడల్ పంపారని వివరించారు. -
ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’
సాక్షి, చెన్నై: గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా తొలి వ్యక్తిగా నామినేషన్ వేసే పద్మరాజన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని ఈసందర్భంగా పద్మరాజన్ తెలిపారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన పద్మరాజన్(62). 1988 నుంచి ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి ఎన్నికలు జరిగినా తొలి నామినేషన్ వేస్తున్నారు. రాష్ట్రంలో అయితే సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో సైతం నామినేషన్లు వేశారు. ఓ సారి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్ వేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచినా, రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 218 సార్లు.. ప్రతి ఎన్నికల్లోనూ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి డిపాజిట్ సొమ్ము చెల్లించి నామినేషన్లు వేయడం పద్మరాజన్ స్టైల్. ఇప్పటి వరకు 218 సార్లు ఆయన నామినేషన్లు వేశారు. అయితే వార్డు సభ్యుడిగా కూడా ఆయన ఇంత వరకు గెలవలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పళనిస్వామికి పోటీగా ఎడపాడి నియోజకవర్గంలో, కేరళ సీఎం పినరయి విజయన్‌కు పోటీగా ధర్మడం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇలా వరుస ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న ఆయనకు తాజాగా గుర్తింపు దక్కింది. ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఆయన్ను గుర్తించింది. తమ బుక్ ఆఫ్ రికార్డులో ఆయనకు చోటు కల్పిస్తూ సర్టిఫికెట్‌ను పంపించారు. దీనిని ఆదివారం పద్మరాజన్ మీడియా దృష్టికి తెచ్చారు. 2021కి గాను రికార్డుల జాబితాలో ఆయనకు అత్యధిక సార్లు ఓటమి పాలైన అభ్యర్థిగా ఈ అవార్డు రావడం గమనార్హం. ఈ అవార్డు గురించి పద్మరాజన్ మాట్లాడుతూ గిన్నిస్ బుక్ రికార్డులో తన పేరు నమోదయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: చావులోనూ... చేయి వదలనని.. మాయలేడి: పరిచయం, రెండేళ్ల ప్రేమ.. పెళ్లనగానే! -
నాన్నకు ప్రేమతో...కూతురు
కరోనాతో కన్నుమూసిన తండ్రి కల నెరవేర్చడానికి 13 ఏళ్ల తనిష్క బిఎ ఎల్‌ఎల్‌బిలో చేరాలనుకుంది. అయితే, అందుకు పర్మిషన్ లభించకపోవడంతో బిఎ సైకాలజీలో చేరింది. 12 ఏళ్ల వయసులో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 11 ఏళ్ల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఎనిమిదేళ్ల వరకు స్కూల్‌కు వెళ్లిన తనిష్క ఆ తర్వాత ఇంటి నుంచే చదువు కొనసాగించింది. చిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ తండ్రి కలను నెరవేర్చాలనుకుంటోంది తనిష్క. స్కూల్ ఏజ్‌లో డిగ్రీ స్థాయి చదువులతో బిజీగా ఉన్న తనిష్క మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఏరోడ్రోమ్ ప్రాంతంలో నివసిస్తోంది. 13 ఏళ్ల వయసు. స్కూల్ చదువు కూడా పూర్తి కాని ఈ అమ్మాయి ఇప్పుడు బి.ఎ సైకాలజీ చేస్తోంది. తండ్రి కల నెరవేర్చాలనే లక్ష్యంగా బిఎ ఎల్ఎల్బి కోసం అనుమతి కోరింది. కానీ, చిన్న వయసు అనే కారణంగా ఇంకా అనుమతి లభించలేదు. దీంతో బిఎ సైకాలజీలో చేరింది. ఈ డిగ్రీ పూర్తి చేశాక, ఎల్ఎల్బి చేస్తానంటోంది తనిష్క. -
24 గంటలు.. 79.6 కిలో మీటర్లు
అరగంట.. గంట.. మహాఅయితే రెండు గంటలు నడిస్తే హమ్మయ్య అంటాం. చాలామంది వయసును దృష్టిలో ఉంచుకొని వాకింగ్ చేస్తుంటారు. కాస్త వయసు పైబడినవారు ‘స్టాప్ ఎన్ స్టార్ట్’ పద్ధతిలో మధ్య మధ్యలో కాస్త సేదతీరుతూ నడక కొనసాగిస్తుంటారు. తార్నాకకు చెందిన సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ సీఐ రవికుమార్ మాత్రం నిత్యం 20 నుంచి 30 వేల అడుగులు అలవోకగా నడుస్తారు. పలుమార్లు ఏకంగా లక్ష అడుగులు నడిచి రికార్డు సృష్టించాడు. కొన్ని రోజుల క్రితం ఏకంగా 24 గంటల పాటు నడిచి 1,14,633 అడుగులతో 79.6 కిలోమీటర్లు నడిచిన ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం అభినందించారు. ⇔ తార్నాకలో ఉంటున్న రవికుమార్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్. పంజాబ్‌లో పనిచేసిన కాలంలో ఒళ్లు చేసింది. సీఆర్పీఎఫ్లో పనిచేస్తూ ఇదేం శరీరం అంటూ ఒక మిలటరీ అధికారి ప్రశ్నించడంతో వాకింగ్‌కు శ్రీకారం చుట్టారు. ⇔ 26 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్న ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీ మైదానాలు, ప్రకృతి మరింత స్ఫూర్తినిచ్చాయి. ⇔ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుశాంత్ జైస్వాల్, మహారాష్ట్రకు చెందిన సూర్యవంశీ లక్ష అడుగులు నడిచిన తొలి రెండు రికార్డులు సొంతం చేసుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మూడో వ్యక్తిగా రవికుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. కాగా మొదటి ఇద్దరి వయసు 28 ఏళ్లు కాగా రవికుమార్ వయసు 58. ⇔ తార్నాక నుంచి పెద్దమ్మగుడి, కీసరగుట్ట, యాదగిరిగుట్ట.. ఇలా సికింద్రాబాద్ నుంచి దాదాపు అన్ని మార్గాల్లో ఆయన ఉదయపు నడక సాగిస్తుండటం విశేషం. ⇔ నగర యువతలో ఊబకాయం పెరిగిపోతున్న నేపథ్యంలో వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఉదయం పూట నడక జీవిత కాలం కొనసాగిస్తానని తెలిపారు. -
‘సాక్షి’ పాట.. రికార్డు బాట...
ఈ పాటకు ట్యూన్ తెలుసా?’ కలెక్షన్‌తో విశాఖ వాసి అరుదైన ఘనత విశాఖ సిటీ: కొంత మంది పాటలు పాడుతూ రికార్డులు సొంతం చేసుకుంటారు. మరికొందరు ఆ పాటకు నిరంతరాయంగా నృత్యం చేస్తూ రికార్డు సాధిస్తారు. కానీ విశాఖ వాసి మాత్రం ‘సాక్షి’ పత్రికలో ‘ఈ పాటకు ట్యూన్ తెలుసా?’ పేరుతో ప్రచురించిన పాటల క్లిప్పింగ్స్ సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అక్కయ్యపాలెంలోని పురుషోత్తపురంలో నివసిస్తున్న ఉద్ధగిరి అచ్యుత్ కృష్ణకుమార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పాటలంటే ప్రాణం. సాహిత్యంపై ఉన్న మక్కువ అచ్యుత్‌ని పాటలకు దగ్గర చేసింది. ఇదే తరుణంలో.. 2008 మే 5 నుంచి ‘సాక్షి’ దినపత్రిక ఫ్యామిలీ పేజీలో ఈ పాటకు ట్యూన్ తెలుసా..? అనే శీర్షికన వివిధ చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని పాఠకులకు పరిచయం చేసింది. వాటిని ప్రతి రోజూ కత్తిరించి పదిలపరచుకునేవాడు. ఈ కలెక్షన్ సంఖ్య 2016 సెప్టెంబర్ 30 నాటికి 2,669 పాటలయ్యాయి. వాటిని సీడీ రూపంలోకి తీసుకొచ్చిన అచ్యుత్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సుకు పంపించాడు. ఆ ఆ ప్రతినిధులు దీనికి తమ రికార్డుల్లో స్థానం కల్పించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్తో పాటు మెమొంటో, గుర్తింపు కార్డు, ఇతర పత్రాల్ని అచ్యుత్‌కి ఇటీవలే పోస్టులో పంపించారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సహస్రకు చోటు
ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివిన ఆసిఫాబాద్ చిన్నారి ఆసిఫాబాద్ : ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన సాయిని సంతోష్-అనూష దంపతుల కుమార్తె సహస్ర చోటు దక్కిందించుకుంది. తండ్రి సంతోష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సహస్ర కూడా అక్కడే చందానగర్ క్యూట్ ఎలాండ్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. గత నెల 14న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఏర్పాటు చేసిన పోటీల్లో ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివి అబ్బురపరిచింది. గతంలో ఒక నిమిషంలో ఎనిమిది శ్లోకాలు చదివిన రికార్డులను అధిగమించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు -
వండర్ కిడ్ శివాని
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు విజయవాడ స్పోర్ట్స్: పిట్ట కొంచెం కూత ఘనం.. అంటే ఇదేనేమో.. ఆర్చరీలో ఘనమైన వారసత్వం కలిగి ఉన్న రెండు సంవత్సరాల 11 నెలల చిన్నారి డాలీ శివాని మంగళవారం అరుదైన ఘనత సాధించింది. విజయవాడకు చెందిన ప్రఖ్యాత ఆర్చర్, కోచ్ దివంగత చెరుకూరి లెనిన్ సోదరైన డాలీ తన ప్రావీణ్యంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. గురి తప్పకుండా 5మీ., 7మీ., దూరంలో బాణాలు విసిరి 388 పాయింట్లను సాధించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డులకెక్కింది. ఇండియా బుక్ ప్రతినిధుల సమక్షంలో డాలీ శివానీకి 7 మీటర్ల దూరంలో టార్గెట్ ఫేస్ (122 సెం., ఎత్తు 166 సెం., 90 డిగ్రీలు), అలాగే 5 మీటర్ల దూరంలో టార్గెట్ ఫేస్ (80 సెం. ఎత్తు మీటర్లు, 166 సెం.)లో లక్ష్యాలను ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగానికి 36 బాణాల చొప్పున 72 బాణాలు ఇచ్చారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు 200 పాయింట్లు వస్తే సరిపోతుంది. అయితే 7 మీటర్ల టార్గెట్‌లో 199, 5 మీటర్ల డిస్టెన్స్‌లో 189 పాయింట్లతో మొత్తం 388 పాయింట్లను కైవసం చేసుకుని ఔరా అనిపించుకుంది. శివానికి బంగారు పతకంతో పాటు సర్టిఫికెట్ అందించారు. -
రెండువేల మందితో రాధాకృష్ణుల సమ్మేళనం
ఒంగోలు నగరం ఒక అరుదైన ఘనతను సాధించేందుకు, ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు సంసిద్ధమవుతోంది. అందుకోసం హిందూ ధర్మ సంరక్షణ సమితి, స్వామి వివేకానంద 150వ ఉత్సవ జయంతి సమితి సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ అరుదైన ప్రదర్శనకు స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వేదిక కానుంది. నగరంలోని త్యాగరాజ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు తడికమళ్ల హరిప్రసాదరావు, పాంచాలవరపు రాంబాబు ఆ వివరాలు వెల్లడించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం సాధించేందుకు ఈ నెల 25వ తేదీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో రెండువేల మంది చిన్నారులతో శ్రీకృష్ణ బాలబృందావనం పేరిట రాధాకృష్ణుల సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు వారు వివరించారు. రాధాకృష్ణుల సమ్మేళనంలో 12 సంవత్సరాల్లోపు బాలబాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనదలచిన వారు తమపేర్లను ఈ నెల 20వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా సమ్మేళనంలో పాల్గొనవచ్చన్నారు. వారంతా దరఖాస్తు ఫారాలు పూర్తిచేసి 50 రూపాయల నిర్వహణ విరాళాన్ని అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పలురంగాల ప్రముఖులు రాధాకృష్ణుల సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపా రు. సమ్మేళనంలో పాల్గొనదలచిన చిన్నారులకు తల్లిదండ్రులు ఇంటివద్దనే మేకప్ వేసి నిర్ణీత సమయానికి తీసుకురావాలన్నారు. ఎక్కువమంది విద్యార్థులు, చిన్నారులు సమ్మేళనంలో పాల్గొనేలా ప్రోత్సహించిన పాఠశాలలకు బహుమతులు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. సమ్మేళనంలో పాల్గొన్న వారికి ప్రశంసపత్రాలు అందజేస్తామన్నారు. సమ్మేళనం ముగిసిన నెలరోజుల తర్వాత అవసరమైతే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులకు నిర్ణీత రుసుం చెల్లించి వారి నుంచి అధికార పూర్వకంగా కూడా సర్టిఫికెట్ పొందవచ్చని నిర్వాహకులు వివరించారు. ఒంగోలులో తొలిసారి భారీస్థాయిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని వారు కోరారు. కార్యక్రమ వివరాలకు తడికమళ్ల హరిప్రసాదరావు (98487 97339), పాంచాలవరపు రాంబాబు (96403 00507)ను సంప్రదించాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో మైనంపాటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.