కృతి రికార్డ్‌ | Nine year old Kristi Shikha sets national record for bilingual singing in 41 mins | Sakshi
Sakshi News home page

కృతి రికార్డ్‌

Published Sun, Jun 9 2024 6:21 AM | Last Updated on Sun, Jun 9 2024 7:32 AM

Nine year old Kristi Shikha sets national record for bilingual singing in 41 mins

వైరల్‌

అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించడం ఇది రెండోసారి.

తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ ఆప్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ‘ఈ రికార్డ్‌ కృతి ప్రతిభకు మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యానికి కూడా అద్దం పడుతుంది. భాషా సామరస్యత అనే భావనను పెం΄÷ందిస్తుంది’ అంటూ ఒక యూజర్‌ స్పందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement