second time
-
పెళ్లికొడుకు గెటప్‌లో రణబీర్ కపూర్ సందడి (ఫొటోలు)
-
కృతి రికార్డ్
అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించడం ఇది రెండోసారి.తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్ ఆఫ్ ఆప్ రికార్డ్స్’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ‘ఈ రికార్డ్ కృతి ప్రతిభకు మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యానికి కూడా అద్దం పడుతుంది. భాషా సామరస్యత అనే భావనను పెం΄÷ందిస్తుంది’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
పాక్ అధ్యక్షుడిగా జర్దారీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్పర్సన్ ఆసిఫ్ అలీ జర్దారీ(68) పాక్ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికయ్యా రు. శనివారం జరిగిన ఓటింగ్‌లో పీపీపీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) ఉమ్మడి అభ్యర్థి జర్దారీకి 255 ఓట్లు, ఎస్ఐసీ బలపరిచిన మహ్మూద్ ఖాన్‌కు 119 ఓట్లు పోలయ్యాయి. -
Amala Paul Second Marriage Pics: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
గ్రూప్–1 అభ్యర్థుల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఆగమాగం గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు. కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ -
జ్యోతి బసు రికార్డును తిరగరాసిన నవీన్
భువనేశ్వర్: దేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘ కాలంపాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు. ఒడిశా సీఎంగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ అయిదు పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో, చామ్లింగ్ తర్వాతి స్థానంలోకి చేరారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా అయిదు పర్యాయాలు సీఎంగా ఎన్నికైన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మళ్లీ విజయం సాధించి, సీఎంగా పగ్గాలు చేపట్టిన పక్షంలో నవీన్ పటా్నయక్ దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నేతగా నిలుస్తారు. -
రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!
బాలీవుడ్ బుల్లితెర నటి పూజా జోషి అరోరా యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ధర్తి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, యే రిష్టే హై ప్యార్ కే అనే హిందీ సీరియల్స్‌లో కూడా నటించింది. తాజాగా రెండోసారి గర్భం ధరించినట్లు ప్రకటించింది భామ. ఈ విషయాన్ని సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన బిడ్డ, భర్తతో ఉన్న ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!) బుల్లితెర నటి పూజా జోషి.. 2015లో మనీష్ అరోరాను వివాహాం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు 2017లో ఈ జంటకు ఓ పాప జన్మించింది. దాదాపు ఐదేళ్లకు మరోసారి ప్రెగ్నెన్సీ ధరించింది పూజా. అయితే పెళ్లి తర్వాత నటనకు విరామం ప్రకటించిన పూజా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తన ఫోటోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా.. యే రిష్తా క్యా కెహ్లతా హైలో పూజ వర్ష మహేశ్వరి అనే పాత్రను పోషించింది. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by 𝙋𝙤𝙤𝙟𝙖 𝙅𝙤𝙨𝙝𝙞 𝘼𝙧𝙤𝙧𝙖 (@poojajoshiarorareal) -
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. ఏకంగా 53 ఏళ్లకు!
ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ నవోమి కాంప్‌బెల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు 53 ఏళ్ల వయసులో మరోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని నవోమి తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే మే 2021లో నవోమి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ రెండేళ్ల వ్యవధిలోనే మరో రెండో బిడ్డను స్వాగతించారు. తల్లి కావడానికి వయసుతో సంబంధం లేదని నవోమి నిరూపించింది. ఆమె శిశువును తన చేతుల్లో పట్టుకొని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే ) నవోమి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మై లిటిల్ డార్లింగ్! నీ రాకతో మాకు మరింత సంతోషాన్ని తీసుకొచ్చావు. మా ప్రేమ నీకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. నువ్వు దేవుడిచ్చిన బహుమతి. వెల్కమ్ టూ బేబీబాయ్.' క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. పిల్లలను కనేందుకు వయసుతో పనిలేదని రుజువు చేసిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి) View this post on Instagram A post shared by Dr Naomi Campbell (@naomi) -
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్‌కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్‌హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్‌హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్‌తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్‌తో మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్‌లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్‌గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్‌లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారీ బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సాహా చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు. సాహా తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహాను ప్రధాని అభినందించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి పార్టీ ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) పార్టీ నేత కూడా ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిమా బౌమిక్ కేబినెట్లో చేరలేదు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలకు నిరసనగా విపక్ష వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి. తిప్రా మోతా చీఫ్‌తో షా భేటీ ‘గ్రేటర్ తిప్రాల్యాండ్’ సాధన కోసం ఉద్యమసంస్థగా మొదలై తర్వాత రాజకీయ పార్టీగా మారిన తిప్రా మోతా తరఫున ఆరుగురు సభ్యుల ప్రతినిధుల బృందం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయింది. అగర్తలాలో మొదలైన భేటీలో తిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, నూతన సీఎం మాణిక్ సాహా సైతం పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమని, త్రిపుర ట్రైబల్ అటానమస్ కౌన్సిల్‌కు శాసన, ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతున్న విషయం తెల్సిందే. -
సోనియా గాంధీకి మళ్లీ కరోనా
ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది. Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol. आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी। — Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022 ఇదిలా ఉంటే జూన్‌లో ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కరోనా కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు గడువు సైతం కోరారు. ఈలోపు కరోనాతో ఇబ్బందిపడ్డ ఆమెను గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కీలక, అగ్రనేతలు వరుసగా కొవిడ్-19 బారినపడుతున్నారు. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ హెడ్ పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, మల్లికార్జున ఖర్గే.. ఈ వారం మొదట్లో సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా సైతం కరోనా బారినపడడం విశేషం. ఇదీ చదవండి: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి -
ఫలించిన పాజిటివ్ మంత్రం
ఉత్తరప్రదేశ్ ఓటర్లు చరిత్ర సృష్టించారు. యోగి ఆదిత్యనాథ్ పాలనకు జై కొట్టారు. మూడున్నర దశాబ్దాల ఆనవాయితీని తిరగరాస్తూ అధికార పార్టీ బీజేపీకి రెండోసారి అధికారం కట్టబెట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఒంటరి పోరాటం ఫలించలేదు. బీఎస్పీ పూర్తిగా చతికిలపడటం, కాంగ్రెస్ కనుమరుగవడం, బీజేపీ హిందూత్వ ప్రచారం, పాజిటివ్ మంత్రం తదితరాలు అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని దెబ్బతీశాయి. శాంతిభద్రతలు, మోదీ ప్రజాదరణ, ఉచిత రేషన్, అభివృద్ధి వంటి సానుకూలాంశాలు యోగిని గట్టెక్కించాయి. సవ్యమైన శాంతిభద్రతలు యోగి పాలనలో సైతం గత ఐదేళ్లలో యూపీలో దారుణమైన నేరాలు అనేకం జరిగాయి. కానీ వాటికి పాల్పడ్డ వారిని యోగి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేసిన తీరు ప్రజలకు నచ్చింది. నేరాలకు పాల్పడిన మాఫియా నేతలను ఎన్కౌంటర్లలో మట్టుపెట్టిన యోగి ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. ‘యోగి వల్ల మేం రాత్రి 12 గంటలకు కూడా రోడ్డుపై తిరగగలుగుతున్నాం. అంతకంటే మాకేం కావాలి?’ అని లక్నోకు చెందిన సురేఖ రాణి ప్రశ్నించారు. నేరస్తుల పట్ల యోగి అత్యంత కఠినంగా వ్యవహరించారని ప్రజలు విశ్వసించారు. గతంతో పోలిస్తే యూపీలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయని రాయ్‌బరేలీకి చెందిన కిషన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నేను యూపీలో విస్తృతంగా పర్యటించాను. యోగి ప్రభుత్వం పట్ల మహిళల్లో మంచి ఆదరణ కన్పించింది. దానికి మరో అవకాశం ఇవ్వాలన్న పట్టుదల చాలామందిలో గమనించా’ అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలో రావడానికి మహిళల మద్దతు ప్రధాన కారణమని ఆయనన్నారు. అవినీతి నియంత్రణ యోగి తన ఐదేళ్ల పాలనలో అవినీతిని కొంతమేరకు నియంత్రించగలిగారు. ఇది కూడా ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని రాజకీయ విళ్లేషకులు అంటున్నారు. ‘మరీ ముఖ్యంగా పై స్థాయిలో అవినీతిని యోగి బాగా నియంత్రించారని ప్రజలు నమ్మారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయడంలో యోగి సఫలమయ్యారు. ఏ నియోజకవర్గంలో నేరాలు జరిగినా సంబంధిత ఎమ్మెల్యేదే బాధ్యత అన్న యోగి హెచ్చరికలు కూడా ప్రజలకు నచ్చాయి’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వర్మ అన్నారు. ‘కిందిస్థాయిలో అవినీతి ఉన్నా ప్రజలను ఇబ్బంది పెట్టేంతగా లేదని ప్రజలు విశ్వసించారు. మరోసారి యోగి గెలిస్తే అవినీతి మరింత తగ్గుతుందని కూడా నమ్మారు’ అని ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రదీప్ గుప్తా విశ్లేషించారు. పన్నులు పెంచినా వృద్ధీ ఉంది యోగి హయాంలో పన్నులు బాగా పెంచారన్న అసంతృప్తి ప్రజల్లో లేకపోలేదు. కానీ అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి కదా అని సర్దుకుపోయే ధోరణిలో మాట్లాడుతున్న వాళ్లే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా ఐదేళ్లలో బాగానే మెరుగుపడిందని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. యోగికి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వడానికి ఇవీ కారణాలేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సమాజ్‌వాదీ ఓటమికి కారణాలెన్నో.. అఖిలేశ్‌ను ఎలాగైనా మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ముస్లింలలో వచ్చిన పెద్ద మార్పు యూపీలో హిందువుల పోలరైజేషన్‌కు ఉపయోగపడింది. బహుశా ఇదే బీజేపీని గెలిపించినట్టు కన్పిస్తోందని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులకు వ్యతిరేకంగా ఓబీసీలు బీజేపీ వైపు ర్యాలీ అయ్యారని ఆయన విశ్లేషించారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయంగా దాదాపుగా కనుమరుగు కావడం కూడా అఖిలేశ్‌కు అతి పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆమె పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. మాయావతి అనాసక్తిని కనిపెట్టిన కొందరు దళితులు బీజేపీ పంచన చేరారు. మరికొందరు ఎస్పీకి వ్యతిరేకంగా పని చేశారు. నిజానికి ఈసారి ముస్లింలు, యాదవులు అఖిలేశ్‌కు ఏకమొత్తంగా మద్దతు పలికారు. అలా చూస్తే ఆయన పోరాటం నేరుగా 24 శాతం ఓట్లతో మొదలైంది! 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 4 శాతం అధికం. మరో 16 శాతానికి అటూఇటుగా ఓట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం ఆయన సొంతమయ్యేదే. కానీ అది చెప్పినంత తేలిక కాదు. యూపీ రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువే. వారు ఏ పార్టీకి మద్దతిస్తే వారి తరపున జోరుగా ప్రచారం చేస్తారు. పైగా మరో విశేషమేమంటే ఆ వర్గానికి చెందిన వారు కనీసం 90 శాతం దాకా కచ్చితంగా ఓటు వేస్తారు. ఇది ఈసారి అఖిలేశ్‌కు బాగా మైనస్‌గా మారింది. గత ఐదేళ్లలో అఖిలేశ్ పార్టీని పటిష్టపరచుకోగలిగారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పెద్దగా పోరాటాలు చేయలేదన్న అపవాదుంది. ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అలాగే యాదవులు, ముస్లింలు మినహా మిగతా వర్గాలను అఖిలేశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. కానీ, దాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. అందుకు కావాల్సిన యంత్రాంగం, దాన్ని ముందుండి నడిపే వనరుల లేమి కూడా మైనస్ అయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మోదీ మంత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల యూపీ ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సడలకపోవడం కూడా యోగికి ఈసారి పెద్ద వరమైంది. ‘యోగి కంటే మోదీకే యూపీలో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఆయనపై ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం కూడా అఖిలేశ్‌కు బాగా మైనస్ అయింది’ అని సెఫాలజిస్ట్ యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు. వీటికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం కూడా అఖిలేశ్‌కు మరో పెద్ద మైనస్‌గా మారింది. ఎక్కడా కాంగ్రెస్ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా చీల్చే పరిస్థితి కన్పించలేదు. దాంతో అధికార బీజేపీ ఓట్లు చీలలేదు. – (సాక్షి ప్రత్యేక ప్రతినిధి కంచర్ల యాదగిరిరెడ్డి) -
రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకే నెలలో రెండోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం వెనకున్న ఆంతర్యాలను ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలున్నా గత ఏడేళ్లలో ఎప్పుడూ.. ఒకే నెలలో రెండుసార్లు సీఎం ఢిల్లీలో పర్యటించలేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జల వివాదాల నేపథ్యంలో కేసీఆర్ హస్తిన ప్రయాణం ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరుకానున్న సీఎం.. తర్వాత జరిగే బీఏసీ భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరగనున్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి సమీక్షకు హాజరు కానున్నారు. అదే రోజు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయి ధాన్యం కొను గోలు అంశాలపై చర్చించనున్నారు. అదివారం సాయంత్రం సీఎం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. తొలి వారంలో మొదటిసారి ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న ఎనిమిది రోజుల్లో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడంతో పాటు ఇతర కార్య క్రమాలతో బిజీ బిజీగా గడిపారు. జాతీయ రాజకీ యాలపై, ఆర్థిక వ్యవస్థ గురించి తనను కలిసిన వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తీసుకు న్నారు. ఇలా సీఎం ఏకంగా ఎనిమిది రోజుల పాటు ఢిల్లీలో గడపడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా మూడు రోజుల పర్యటన చేపట్టడం కూడా చర్చకు దారితీసింది. తొలిసారి హోం శాఖ సమీక్షకు.. దేశ వ్యాప్తంగా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఏటా కేంద్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. ఇదే క్రమంలో ఈనెల 26న ఈ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ అదనపు డీజీపీ అనిల్‌కుమార్ హాజరుకానున్నారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో మావోయిస్టుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ఉండగా, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు తక్కువ ప్రాబల్యం కల్గిన జిల్లాలుగా కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఆయా జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ కింద ఏటా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, వివిధ పథకాల ద్వారా అక్కడి నిరుద్యోగ యువతకు ఆర్థిక తోడ్పాటు కల్పించడం ద్వారా వారు మావోయిజం వైపు ఆకర్షితులవ కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గడిచిన ఐదేళ్లలో కేంద్ర హోంశాఖ మూడు విధాలుగా నిధులు మంజూరు చేస్తూ వస్తోంది. మరిన్ని నిధులు కోరనున్న సీఎం భద్రత సంబంధిత వ్యయం (ఎస్ఆర్ఈ), ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన పథకం (ఎస్ఐఎస్), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్సీఏ) కింద మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల ఏర్పాటు, బ్యాంకులు, పోస్టాపీసుల ఏర్పాటు వంటివి కేంద్రం చేపడుతోంది. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వాటి ద్వారా ఉద్యోగాల కల్పనకు, విద్యాసంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తూ వస్తోంది. రాష్ట్రానికి ఎస్ఆర్ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి 2021 వరకు రూ.42.06 కోట్ల నిధులును కేటాయించింది. అదే విధంగా ఎస్ఐఎస్ పథకం కింద రూ.13.12 కోట్లు, ఎస్సీఏ కింద రూ.85.92 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు కావడాన్ని ప్రస్తావిస్తూ వాటి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా అమిత్‌షాను సీఎం కోరనున్నట్టు తెలిసింది. ఈ మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో నిరుద్యోగ యువ తకు ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు సంబంధిత అంశాలపై సీఎం ప్రతిపాదనలు సమర్పించనున్నారు. -
రేపు మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: రేపు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలిసింది. ఈనెల 25వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం కానున్నారు. మరుసటి రోజు 26వ తేదీన విజ్జానభవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో మాట్లాడనున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. ఈనెల ఆరంభంలోనే వారం పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. నెల కూడా కాకముందే మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం చర్చనీయాంశం. గతంలో చేపట్టిన ఢిల్లీ పర్యటన రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఒకే నెలలో రెండోసారి పర్యటన చేయడం గమనార్హం. -
రెండోసారి బాధ్యతలు: పురుషోత్తముడి సేవకు ‘వైవీ’ పునరంకితం
టీటీడీలో రెండేళ్లుగా ఆధ్యాత్మిక, ధార్మిక ప్రచారం పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి. చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన అభివృద్ధి హారంలో ‘గుడికో గోమాత’ కలికితురాయిగా నిలిచింది. దేశ నలుమూలలా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుమల స్వామివారి దర్శనంలో భక్తులకు పెద్దపీట వేశారు. కోవిడ్ కష్టకాలంలో భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. లోక కల్యాణం కోసం హోమాలు, శ్లోక పారాయణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డికి రెండోసారి చైర్మన్ పదవి వరించింది. తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 52వ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి మరో అవకాశం కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పాలకమండలి సభ్యులను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2019 జూన్ 21న టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. అదే ఏడాది సెపె్టంబర్లో 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21వ తేదీకి ముగిసింది. దీంతో టీటీడీ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి చైర్మన్‌గా నియమించింది. ఈయన శ్రావణమాసం ప్రారంభమైన తర్వాత గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. (చదవండి: 100 కిలోల స్వర్ణంతో గోవిందుడి గోపురానికి తాపడం) రెండేళ్లలో టీటీడీ అభివృద్ధి ఇలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ‘గుడికో గో మాత’ కార్యక్రమం ప్రారంభం. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి వీలుగా ఎల్ 1, ఎల్ 2 దర్శనాలు రద్దు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలు స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850 బ్రహ్మోత్సవ బహుమానం విరమణ పొందిన అర్చకుల సేవల పునరి్వనియోగం తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమానానికి రూ.14 కోట్లతో రాగిరేకులపై బంగారు తాపడం పనులు ప్రారంభం జమ్మూ సమీపంలోని మజీన్‌గ్రామం వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదాల నివారణకు రూ.3.3 కోట్లతో అధునాతన థర్మోఫ్లూయిడ్ కడాయిల నిర్మాణం తిరుపతి జూపార్కు సమీపంలో రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ, రూ.34 కోట్లతో ఎస్వీ బదిర పాఠశాల హాస్టల్ భవనాల నిర్మాణానికి ఆమోదం. బర్డ్ ఆస్పత్రి నూతన భవనంలో అదనపు ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికి రూ.8.43 కోట్లు మంజూరు చెన్నైలో రూ.3.92 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం టీటీడీ ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్య పథకం (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) అమలు తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అమలు శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులను విక్రయించరాదని నిర్ణయం తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహద్వారం తలుపులకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం టీటీడీ హిందూ ధర్మ ప్రచారం కోసం కొత్తగా 6 ప్రచార రథాలు కొనుగోలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సూర్యప్రభ వాహనానికి 11.766 కిలోల బంగారంతో తాపడం పనులు తిరుపతి ఎస్వీ బాలమందిరంలో రూ.10 కోట్లతో అదనపు హాస్టల్ బ్లాక్ నిర్మాణం తమిళనాడులోని ఊలందూరుపేటలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి శ్రీకారం తిరుమలలో 50 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించాల్సిన 500 ఆలయాలను ఏడాదిలో పూర్తి చేసేలా తీర్మానం గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం అమలు మూడు నెలల్లోపు ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్ల ప్రసారాలు ప్రారంభించేలా చర్యలు తిరుమలలోని హనుమంతుని జన్మస్థలం అభివృద్ధికి నిర్ణయం తిరుమలను గ్రీన్ హిల్స్‌గా ప్రకటించినందున త్వరలో ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటు. లాక్డౌన్ సమయంలో వలస కూలీలకు సుమారు 35.5 లక్షల అన్నప్రసాదం ప్యాకెట్లు పంపిణీ తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆహారం కోసం రూ.50 లక్షలు ఆర్థికసాయం. శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొనుగోలు కోసం రూ.19 కోట్ల కేటాయింపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్ షెడ్లు ఏర్పాటు కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో టీటీడీ ఉద్యోగుల కోసం 140 అక్సిజన్‌బెడ్లు, 14 వెంటిలేటర్ల ఏర్పాటు రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో భక్తులకు శ్రీవారి లడ్డూప్రసాదం పంపిణీ. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో పొందిన భక్తులకు దర్శన తేదీలు మార్చుకునే వెసులుబాటు. రద్దు చేసుకుంటే నగదు రీఫండ్ పొందే సౌకర్యం. లోక కల్యాణం కోసం సుందరకాండ పారాయణం, విరాటపర్వం వంటి ఆధ్యాతి్మక కార్యక్రమాల నిర్వహణ. ఎంతో భాగ్యం దేవదేవుడికి సేవచేసే భాగ్యం మరోసారి దక్కడం ఎంతో సంతోషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. రెండేళ్ల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. సామాన్య భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. దళారీ వ్యవస్థని పూర్తిగా రూపుమాపాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తున్నాం. వారం, పది రోజుల్లో పాలకమండలి సభ్యుల నియామకం ఉంటుంది. - వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్ -
ఇతనో గజిని, భార్యని కూడా మర్చిపోయాడు.. ఆమె ఏం చేసిందంటే?
వాషింగ్టన్: ఏ వ్యక్తికైనా అత్యంత బాధ కలిగించే విషయం ఏమిటంటే, మనం ప్రేమించే వ్యక్తికి ఆరోగ్యం క్షీణించడం. కానీ అంతకన్నా దారుణం ఏమిటంటే, అదే వ్యక్తి మనల్ని ఎవరో మరచిపోవడం. సరిగ్గా అల్జీమర్స్ అనే వ్యాధి ఉన్న వ్యక్తి పరిస్థితి అదే. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి జ్ఞాపకాలు కాలంతో పాటు చెరిగిపోతుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం అల్జీమర్‌తో బాధపడుతున్న 56 ఏళ్ల పీటర్ మార్షల్ జీవితంలోనూ ఇలానే జరిగింది. ఇతను అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. పీటర్ భార్య తెలిపిన వివరలు ప్రకారం.. తాను అప్పటికే వివాహం చేసుకున్నట్లు పీటర్ మర్చిపోయాడని అతనికి ఎంత చెప్పిన గుర్తు రాలేదని తెలిపింది. ఫలితంగా తన పెళ్లి సహా గతాన్నంతా మర్చిపోయిన అతడికి భార్య లీసా తమ పెళ్లి వీడియోను చూపించింది. అయితే ఇవేవి తనకు గుర్తు లేదని, కానీ లీసా అంటే తనకు ఇప్పడు ఇష్టమని పీటర్ చెప్పాడు. దీంతో వారిద్దరికి తమ కూతురు సాయంతో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ‘ఓహ్ హలో అల్జీమర్స్’ అనే ఫేస్ బుక్ పేజీలో పీటర్ ప్రయాణాన్ని లిసా డాక్యుమెంట్ చేసి వారి జీవితంలోని సంఘటనలను అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన భర్త ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న అతనంటే తనకెంతో ఇష్టమని లీసా అంటోంది. చదవండి: Joe Biden: రిపోర్టర్‌పై బైడెన్ సీరియస్.. అంత కోపమెందుకో? View this post on Instagram A post shared by Alzheimers Caregiver Blog (@ohhelloalzheimers) -
‘నా వయసు 97 ఏళ్లు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా’
కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు వేస్తున్న వ్యాక్సిన్‌ను వేసుకునేందుకు కొందరు జంకుతున్నారు. వ్యాక్సిన్ వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవని అవగాహన కల్పిస్తున్నా చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఓ బామ్మ వ్యాక్సిన్ వేసుకునేందుకు చూపిస్తున్న ఉత్సాహం చూస్తే వేరే వారూ కూడా వ్యాక్సిన్ వేసుకునేంత ఉత్సాహం వస్తోంది. ‘నా వయసు 97 ఏళ్లు. నేను మొదటి వ్యాక్సిన్ మార్చి 9వ తేదీన తీసుకున్నా. వ్యాక్సిన్ వేసుకున్నాక ఎలాంటి నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రెండో డోసు బాకీ ఉంది. మే 9వ తేదీన టీకా వేసుకోవడానికి ఎదురుచూస్తున్నా. వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎవరూ భయపడొద్దు. వ్యాక్సిన్ సురక్షితం.. అది మీ మంచికే. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా సాధారణ జీవితం పొందవచ్చు.’ అని ఇంగ్లీష్‌లో మాట్లాడి ఔరా అనిపించింది. ఈ వీడియోను సీనియర్ జర్నలిస్ట్ లతా వెంకటేశ్ ట్వీట్ చేశారు. అవ్వ ఉత్సాహం చూసిన నెటిజన్లు ‘అవ్వా నీకు దండమే..!’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘అవ్వను చూసైనా నేర్చుకోండి. అందరూ వ్యాక్సిన్ వేసుకోండి.’ చదవండి: కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు Hope this young lady can convert some sceptics pic.twitter.com/WYXpPMrKhd — Latha Venkatesh (@latha_venkatesh) May 8, 2021 -
ఎన్నికల ఎఫెక్ట్: మంత్రి పువ్వాడకు రెండోసారి కరోనా
సాక్షి, ఖమ్మం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు రెండోసారి కరోనా సోకింది. మొదటి వేవ్‌లోనే మంత్రి అజయ్‌కు కరోనా సోకగా తాజాగా మరొకసారి పాజిటివ్ తేలడం ఆందోళన రేపుతోంది. తేలికపాటి లక్షణాలు ఉండడంతో శుక్రవారం ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా శనివారం రిపోర్ట్ వచ్చింది. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెంటనే తన నివాసంలో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి వెల్లడించారు. వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే యథావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అని మంత్రి ట్వీట్ చేశారు. అయితే మంత్రి అజయ్ ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎన్నికల వలన పెద్ద ఎత్తున కరోనా సోకుతుందని ఖమ్మంలో ప్రచారం జరుగుతోంది. మొన్న నాగార్జున సాగర్ ఎన్నిక అనంతరం ఏ జరిగిందో చూశాం. సీఎం కేసీఆర్‌తోపాటు పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఖమ్మం నగరంలో కూడా అదే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం -
అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా..
సాక్షి, సత్తెనపల్లి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ రెండోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత జులైలో తనకు కొవిడ్ సోకిందని.. కొన్నిరోజులకే కోలుకున్నానని తెలిపారు. నిన్న అసెంబ్లీలో మరోసారి నిర్వహించిన కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. రీ ఇన్ఫెక్షన్కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అంబటి పేర్కొన్నారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరతానని, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్‌ను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆర్టీసీని టీడీపీ భ్రష్టు పట్టించింది’) -
కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు ఎంతంటే..!
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు 0.04 శాతం మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఖతార్ దేశ విభాగం వెల్లడించింది. అంటే ప్రతీ 10 వేలమందిలో నలుగురికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. కరోనా రెండోసారి వస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. రెండోసారి కేసులు అక్కడక్కడ నమోదవు తున్నాయంటూ హాంకాంగ్, అమెరికా వంటి దేశాల్లో ప్రచారం జరుగుతోంది. మన రాష్ట్రంలోనూ రెండు కేసులు నమోదయ్యా యని ఇక్కడి వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎక్కడా దీనిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదు. తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఖతార్ విభాగం, ఆ దేశ ప్రజారోగ్యశాఖ, ఖతార్ కార్నెల్ యూని వర్సిటీలు దీనిపై సంయుక్తంగా పరిశోధన చేశాయి. ఈ వివరాలు ‘మెడ్ ఆర్ యక్స్ ఐవీ జర్నల్’లో రెండ్రోజుల క్రితం ప్రచురిత మయ్యాయి. 1,33,266 మంది కరోనా వచ్చి.. పోయిన రోగులపై ఈ పరిశోధన చేశారు. వారికి 45 రోజుల తర్వాత మళ్లీ ఆర్టీ–పీసీఆర్ చేశాక, అందులో 54 మందికి తిరిగి పాజిటివ్ వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. తిరిగి పాజిటివ్ వచ్చిన 54 మందిలో 41 శాతం మందికి కొద్దిపాటి లక్షణాలున్నట్లు కనుగొన్నారు. మరో 58 శాతం మందికి ఏ లక్షణాలు లేవు. ఒకరు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందారు. 45 రోజుల వరకు కొందరిలో డెడ్ వైరస్ ఖతార్.. అరేబియా గల్ఫ్ ప్రాంతంలో 28 లక్షల జనాభా కలిగిన ద్వీపకల్పం. యాంటీ బాడీ పరీక్షలు, ఇతర సీరో సర్వేల ద్వారా దేశ జనాభాలో సగం మంది ఇప్పటికే వైరస్ ప్రభావానికి గురైనట్లు తేలింది. అక్కడ మే నాటికే కరోనా తీవ్రరూపం దాల్చింది. వైరస్ ఎందుకింత వేగంగా విస్తరిస్తుందో అంతు బట్టక ఆ దేశ ప్రజారోగ్యశాఖ, శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా, అక్కడ వైరల్ లోడ్ చాలా ఎక్కువని తేలింది. దీంతో కరోనా వచ్చి పోయిన వాళ్లకే మళ్లీ పరీక్షలు చేశారు. కొందరికైతే వచ్చిపోయిన 45 రోజుల్లోగా పరీక్షచేస్తే వారిలో మళ్లీ పాజిటివ్ వచ్చింది. అలా 15,808 మందికి తిరిగి పాజిటివ్ వచ్చింది. అయితే వీరిలో డెడ్ (చనిపోయిన) వైరస్ ఉందని నిర్ధారించారు. డెడ్ వైరస్ ఉండి ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిలో సైకిల్ థ్రిషోల్డ్ వ్యాల్యూ (సీటీ వ్యాల్యూ) 30 కంటే ఎక్కువగా ఉంది. అంటే అది డెడ్ వైరస్ అని నిర్ధారణకు వచ్చారు. కొన్నాళ్ల తర్వాత వారికి నెగెటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో రీఇన్ఫెక్ట్‌కు సంబంధించిన పరిశోధనకు 45 రోజులను కటాఫ్‌గా పరిగణించి పరిశోధన చేశారు. రెండోసారి రావడం అత్యంత అరుదు రీఇన్ఫెక్ట్ అయిన 54 మందిలో సీటీ వ్యాల్యూ 25 కంటే తక్కువుంది. అంటే వైరస్ మళ్లీ వారిలో వచ్చినట్లు గుర్తించారు. అయితే 0.04 శాతం మంది రీఇన్ఫెక్ట్ కావడం అత్యంత తక్కువ. 10 వేల మందిలో నలు గురికి రావడం అత్యంత అరుదైన విషయం. ఒక వేళ రెండోసారి సోకిన 54 మందిని పరిశీలిం చినా వారంతా సురక్షితంగా ఉన్నారని ఈ అధ్య యనం తెలిపింది. వీరిలో సగం మందికి యాంటీ బాడీస్ రాలేదు. మిగిలిన వారికి తీవ్రమైన జబ్బులేమీ లేవు. కాబట్టి రెండోసారి వస్తుంద నేది పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం కాదని తెలిపింది. అయితే దీనిపై తదుపరి జన్యు పరిశోధన చేసి.. మరోసారి రావడానికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించవచ్చని తెలిపింది. మొదటిసారి వైరస్ వచ్చిపోయాక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని, అది కనీసం కొన్ని నెలల వరకు ఉంటుందని ఈ కొత్త పరిశోధన పేర్కొంది. అరుదని తేల్చిన పరిశోధన ఐసీఎంఆర్ చెప్పినట్లు వైరస్లలో రీఇన్ఫెక్షన్ అరుదు. అలా అని రాదని చెప్పలేం. వ్యాక్సిన్ల వల్ల కూడా కొంతమందిలో రియాక్షన్, మరికొందరిలో పనిచేయకపోవడం చూస్తుంటాం. అలా అని వ్యాక్సిన్లు వ్యర్థం అనలేం కదా. హాంకాంగ్‌లో నమోదైన రీ ఇన్ఫెక్షన్ కేసు 5 నెలల తర్వాత వెలుగుచూసింది. అదీ యాదృచ్ఛికంగా బయటపడింది. ఆ వ్యక్తిలో యాంటిబాడీస్ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వైరస్ రెండోసారి సోకడం అరుదని ఖతార్ పరిశోధన తేల్చిచెప్పింది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ -
మళ్లీ తల్లి కాబోతున్నారు
కొన్ని రోజులుగా కంగ్రాచులేషన్ మెసేజ్‌లు, ఫోన్లతో బిజీ బిజీగా ఉన్నారు స్నేహ. రెండోసారి తల్లి కానుండటమే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు స్నేహ. తమిళ నటుడు ప్రసన్న, స్నేహ ‘అచ్చముండు అచ్చముండు’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు విహాన్ అనే నాలుగేళ్ళ బాబు కూడా ఉన్నాడు. -
ట్రంప్‌కు భారీ షాక్: రెండోసారి షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికా మరోసారి షట్‌డౌన్ అయింది. కీలకమైన బిల్లుకు అమెరికా సేనేట్‌లో మరోసారి వీగిపోవడంతో మూడువారాల్లో రెండోసారి ప్రభుత్వం స్థంభించింది. దీంతో ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో ఈ అర్థరాత్రినుంచి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నారు. ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది. సేనేట్తో పాటు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే సేనేట్‌లో ఆమోదం దక్కితేనే ఆ బిల్లుకు హౌజ్‌లో ఆమోదం దక్కే ఛాన్సుంది. కాంగ్రెస్(సేనేట్, హౌజ్ ఆఫ్ కామన్స్), వైట్‌హౌజ్‌లో ట్రంప్ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నా.. షట్‌డౌన్ లాంటి పరిస్థితిని రెండోసారి ఎదుర్కోవల్సి రావడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బేనని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా జనవరిలోనూ ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కకపోవడం వల్ల మూడు రోజుల పాటు ప్రభుత్వ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. -
అప్పుడు రేణు...ఇప్పుడు శ్రుతి
పవన్ కల్యాణ్ పక్కన ఓ హీరోయిన్‌కి రెండో అవకాశం రావడం చాలా అరుదు. గతంలో రేణు దేశాయ్ ఒక్కరే పవన్ సరసన హీరోయిన్గా రెండు సినిమాల్లో నటించారు. ఇప్పుడు శ్రుతీహాసన్ ఆ ఫీట్ రిపీట్ చేస్తున్నారు. పవన్ హీరోగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. కానీ, అంతకు ముందు చాలా తతంగమే నడిచిందట. హీరోయిన్ ఎంపికపై ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రం కోసం శ్రుతీని దర్శక-నిర్మాతలు సంప్రదించే సమయానికి ‘ప్రేమమ్’, ‘సింగం 3’, ‘శభాష్ నాయుడు’ సినిమాలతో ఆమె చాలా బిజీ. పవన్‌తో రెండోసారి జోడీ కట్టాలని మనసులో ఉన్నప్పటికీ.. ఏం చేయలేని పరిస్థితి అట. ఇంతలో కమల్‌హాసన్‌కి గాయమైంది. దాంతో ఆయన నెల రోజుల వరకూ రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ‘శభాష్ నాయుడు’ షూటింగ్ వాయిదా పడింది. ఆ చిత్రానికి ఇచ్చిన డేట్స్‌ని పవన్ సినిమాకి అడ్జస్ట్ చేశారట శ్రుతీహాసన్. -
రాజన్ ‘సెకండ్ ఇన్నింగ్స్’కు నెటిజన్ల మద్దతు
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్‌గా రెండోసారి రఘురామ్ రాజన్‌కు అవకాశం ఇవ్వడంపై ఒకపక్క రాజకీయంగా దుమారం చెలరేగుతుండగా... ఆయనకు నెటిజన్ల నుంచి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆన్లైన్ పిటిషన్ ప్లాట్‌ఫామ్ ఛేంజ్.ఆర్గ్ ద్వారా ఇప్పటివరకూ రాజన్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి 60 వేల మంది విజ్ఞప్తి చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఈ వెబ్సైట్ ద్వారా కనీసం ఏడు పిటిషన్లు ప్రారంభం కాగా, వీటిపై 60 వేల మంది సంతకాలు చేయడం గమనార్హం. దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్ తూట్లు పొడిచారని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అయితే, ప్రధాని మాత్రం ఆర్బీఐ గవర్నర్ పోస్టుకు సంబంధించి చర్చ అనవరమని, సెప్టెంబర్‌లోనే(రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 3తో ముగియనుంది) దీనిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేయడం గమనార్హం. రాజన్‌కు మరో చాన్స్ ఇచ్చేందుకుకే మోదీ సుముఖంగానే ఉన్నారంటూ ఊహాగానాలు ఇటీవల జోరందుకున్నాయి. అటు పారిశ్రామిక వర్గాల నుంచి కూడా రాజన్ రెండో విడత పగ్గాలకు మద్దతు లభిస్తుండటం దీనికి బలం చేకూరుస్తోంది. -
అతనితో రెండోసారి...
ముద్దుగా, బొద్దుగా ఉండే రాశీఖన్నాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్‌కి తగ్గట్టుగా ఆఫర్లు రావడం లేదామెకు. అలాగని రాశీని మరీ తీసి పారేయనవసరం లేదు. తక్కువ ఆఫర్లు వచ్చినా, అవన్నీ మంచివే కావడం విశేషం. గోపీచంద్‌తో ‘జిల్’లో కనబడి జిల్జిల్ మనిపించిన రాశీఖన్నా, మరోసారి అతనితో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ హీరోగా ఏయమ్ రత్నం పెద్ద కొడుకు ఏయమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో గోపీచంద్ సరసన రాశీఖన్నా ఎంపికయ్యారట. నిజంగా రాశీకిది మంచి ఆఫరే. ఆమె ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో ‘సుప్రీమ్’లో నటిస్తున్నారు. రవితేజ సరసన నటించిన ‘బెంగాల్ టైగర్’ వచ్చే నెల 10న విడుదల కానుంది.