ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ నవోమి కాంప్బెల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు 53 ఏళ్ల వయసులో మరోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని నవోమి తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే మే 2021లో నవోమి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ రెండేళ్ల వ్యవధిలోనే మరో రెండో బిడ్డను స్వాగతించారు. తల్లి కావడానికి వయసుతో సంబంధం లేదని నవోమి నిరూపించింది. ఆమె శిశువును తన చేతుల్లో పట్టుకొని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.
(ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే )
నవోమి తన ఇన్స్టాలో రాస్తూ..' మై లిటిల్ డార్లింగ్! నీ రాకతో మాకు మరింత సంతోషాన్ని తీసుకొచ్చావు. మా ప్రేమ నీకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. నువ్వు దేవుడిచ్చిన బహుమతి. వెల్కమ్ టూ బేబీబాయ్.' క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. పిల్లలను కనేందుకు వయసుతో పనిలేదని రుజువు చేసిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
(ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్డే పార్టీలో సెలబ్రిటీల సందడి)
Comments
Please login to add a commentAdd a comment