ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది.
Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022
आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी।
ఇదిలా ఉంటే జూన్‌లో ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కరోనా కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు గడువు సైతం కోరారు. ఈలోపు కరోనాతో ఇబ్బందిపడ్డ ఆమెను గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు కూడా.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కీలక, అగ్రనేతలు వరుసగా కొవిడ్-19 బారినపడుతున్నారు. కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, మల్లికార్జున ఖర్గే.. ఈ వారం మొదట్లో సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా సైతం కరోనా బారినపడడం విశేషం.
ఇదీ చదవండి: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
Comments
Please login to add a commentAdd a comment