![MLA Ambati Rambabu Infected With Corona For Second Time - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/5/ambati-rambabu.jpg.webp?itok=V2LtA9g8)
సాక్షి, సత్తెనపల్లి: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ రెండోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత జులైలో తనకు కొవిడ్ సోకిందని.. కొన్నిరోజులకే కోలుకున్నానని తెలిపారు. నిన్న అసెంబ్లీలో మరోసారి నిర్వహించిన కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. రీ ఇన్ఫెక్షన్‌కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అంబటి పేర్కొన్నారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరతానని, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్‌ను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆర్టీసీని టీడీపీ భ్రష్టు పట్టించింది’)
Comments
Please login to add a commentAdd a comment