సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈనెల 4న పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీని పటిష్టం చేస్తామని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక టీడీపీ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రొక్లెయినర్లతో అర్థాంతరంగా కూల్చివేశారని మండిపడ్డారు. చాలా చోట ఘర్షణలు జరిగాయని అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. పాత కేసులను తవ్వి అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారని అన్నారు. దాడులకు గురై నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.
నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. వాళ్ల వద్దకు వెళ్లి, దైర్యపరిచి, పార్టీని గుంటూరు జిల్లాలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్లు చెప్పారు. జిల్లాలోని పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
చదవండి:
జి
Comments
Please login to add a commentAdd a comment