
ఏం కాదు.. నేనే వేయించుకుంటున్నా.. మీరు కూడా వేయించుకోండి. ఎలాంటి దుష్ప్రభావం ఉండదు అని 97 ఏళ్ల బామ్మ ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరూ నోరెళ్లబెట్టారు.
కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు వేస్తున్న వ్యాక్సిన్‌ను వేసుకునేందుకు కొందరు జంకుతున్నారు. వ్యాక్సిన్ వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవని అవగాహన కల్పిస్తున్నా చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఓ బామ్మ వ్యాక్సిన్ వేసుకునేందుకు చూపిస్తున్న ఉత్సాహం చూస్తే వేరే వారూ కూడా వ్యాక్సిన్ వేసుకునేంత ఉత్సాహం వస్తోంది.
‘నా వయసు 97 ఏళ్లు. నేను మొదటి వ్యాక్సిన్ మార్చి 9వ తేదీన తీసుకున్నా. వ్యాక్సిన్ వేసుకున్నాక ఎలాంటి నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రెండో డోసు బాకీ ఉంది. మే 9వ తేదీన టీకా వేసుకోవడానికి ఎదురుచూస్తున్నా. వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎవరూ భయపడొద్దు. వ్యాక్సిన్ సురక్షితం.. అది మీ మంచికే. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా సాధారణ జీవితం పొందవచ్చు.’ అని ఇంగ్లీష్‌లో మాట్లాడి ఔరా అనిపించింది. ఈ వీడియోను సీనియర్ జర్నలిస్ట్ లతా వెంకటేశ్ ట్వీట్ చేశారు. అవ్వ ఉత్సాహం చూసిన నెటిజన్లు ‘అవ్వా నీకు దండమే..!’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘అవ్వను చూసైనా నేర్చుకోండి. అందరూ వ్యాక్సిన్ వేసుకోండి.’
చదవండి: కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస
చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
Hope this young lady can convert some sceptics pic.twitter.com/WYXpPMrKhd
— Latha Venkatesh (@latha_venkatesh) May 8, 2021