Old Woman
-
‘అమ్మా’నవీయం!
గన్నవరం/కొమరోలు: కన్న తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు. నవ మాసాలు మోసి కనీపెంచిన అమ్మలను అమానవీయంగా వదిలించుకుంటున్నారు. గన్నవరం సమీపంలో ఎముకలు కొరికే చలిలో శనివారం రాత్రి ఓ తల్లిని వదిలి వెళ్లగా, ప్రకాశం జిల్లా కొమరోలులో ఓ తల్లి వారం రోజులుగా నడిరోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నా.. కుమారుల మనసు కరగలేదు. ఎముకలుకొరిచే చలిలో 85 ఏళ్ల అవ్వ కృష్ణా జిల్లా గన్నవరం శివారు ఆల్ఫా హోటల్‌కు సమీపంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారులో 85 ఏళ్ల ఓ వృద్ధురాలిని కొంత మంది వ్యక్తులు తీసుకొచ్చారు. కిందికి దింపి అక్కడో ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. చలికి గజగజ వణుకుతున్న ఆ వృద్ధురాలిని కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండడంతో స్థానిక బీకేఆర్ వృద్ధాశ్రమానికి తరలించారు. ఆమె వద్ద లభ్యమైన ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఆమె గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన నక్కా లక్ష్మీకాంతంగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దుప్పటి కూడా లేక నడిరోడ్డుపైనే 75 ఏళ్ల అమ్మ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లికి చెందిన కలిగవిన వెంకటలక్ష్మమ్మ(75) భర్త కొంత కాలం కిందట మృతిచెందాడు. అనంతరం ఆమె ముగ్గురు కుమారుల వద్ద ఉంటూ కాలం గడుపుతోంది. ఆస్తుల పంపకాల అనంతరం తల్లిని మాత్రం వారు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కాలంగా ఓ గుడిసెలో వదిలేశారు. ప్రతినెలా వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను కూడా వారే బలవంతంగా తీసుకెళుతున్నారు. వెంకట లక్ష్మమ్మ నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ఇటీవల కుమారులు తల్లిని ఇళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ వారం కిందట వెన్నంపల్లెలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారం రోజులుగా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ నానా యాతనపడుతోంది.కట్టుబట్టలు తప్ప కనీసం దుప్పటి కూడా లేకపోవడంతో ఆ అమ్మ కష్టాలు వర్ణనాతీతం. గ్రామస్తులే అన్నం పెడుతున్నారు. వృద్ధురాలి దీన స్థితిని చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లునాయక్కు గ్రామానికి చేరుకుని కుమారులతో ఫోన్లో మాట్లాడారు. తల్లి బాగోగులు చూసుకోవాలని లేకుంటే.. అనాథాశ్రమానికి తరలిస్తామని చెప్పారు. -
93 ఏళ్ల బామ్మ.. 34 ఏళ్లుగా జైల్లోనే
రాయచూరు రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలికి ఉపశమనం కలిగింది. ఉప లోకాయుక్త ఆదేశాలతో ఆమెకు విముక్తి లభించింది.శిక్ష మూడేళ్లు మాత్రమేవివరాలు.. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకావాసి నాగమ్మ 1995 లో వరకట్న వేధింపుల కేసులో నిందితురాలిగా జిల్లా కేంద్ర జైలుకు వచ్చారు. ఆనాటి నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 93 ఏళ్లు. ఆమెకు విధించిన శిక్ష 3 ఏళ్లు మాత్రమే. కానీ పట్టించుకుని బెయిలు ఇప్పించేవారు లేకపోవడంతో కటకటాలే పుట్టినిల్లయింది. ఇటీవల ఉప లోకాయుక్త బి.వీరప్ప జైలును సందర్శించి ఆమె కథను విని చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టితో ఫోన్లో మాట్లాడారు. నాగమ్మకు పూర్తిగా అశక్తురాలని, ఆమెను వదిలివేయాలని ఉప లోకాయుక్త సూచించారు. జైలు సూపర్నెంటు అనిత పెరోల్ ఇవ్వడంతో బంధువులు ఆమెను తీసుకెళ్లారు.34 ఏళ్లుగా జైల్లో.. పాపం నాగమ్మ! -
పాపం నాగమ్మ!
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు. వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు. -
బాంబుల బామ్మ
-
పెన్షన్ కోసం 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్లిన 80 ఏళ్ల బామ్మ
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్లోని రైసాన్‌లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు. -
'సరిపోదా శనివారం ట్రైలర్ ఈవెంట్' .. స్పెషల్ అట్రాక్షన్‌గా 70 ఏళ్ల బామ్మ!
హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు కనిపించని పాత్రలో నాని నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సరిపోదా శనివారం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 70 ఏళ్ల భామ తన అభిమాన హీరో నాని చూసేందుకు వచ్చింది. ఆమెను గమనించిన హీరో నాని సంతోషం వ్యక్తం చేశారు. మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ బామ్మను హీరో నాని పలకరించాడు. ఈ ఈవెంట్లో మీరు ఎంతో స్పెషల్ అని ఆయన అన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. 70 years old lady cheers got #Nani at #SaripodhaaSanivaaram Grand Trailer Launch Event💥 #NaturalStarNani #SaripodhaaSanivaaramTrailer pic.twitter.com/jouQRl0L1L— YouWe Media (@MediaYouwe) August 13, 2024 -
పెన్షన్ అందక 90 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన
-
మిస్ టెక్సాస్ అందాల పోటీలో పాల్గొన్న 71 ఏళ్ల వృద్ధురాలిగా రికార్డు..! (ఫొటోలు)
-
ఏ పాము కరిచిందని అడుగుతారని..
రాయపర్తి(వరంగల్): తన పెద్దమ్మ పాముకాటుకు గురికాగా, ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏ పాము కరిచిందనే ప్రశ్నలు వేస్తారని ముందుగానే ఊహించిన వరుసకు కుమారుడయ్యే వ్యక్తి ఆ పామును చంపి మరీ ప్లాస్టిక్ సంచిలో వేసుకొచ్చాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన వృద్ధురాలు మేరుగు ఎల్లమ్మ వరండాలో కూర్చోగా, వీపుపై పాము కాటువేసింది.దీంతో ఆమె కేకలువేయడంతో రమేశ్ అక్కడికి చేరుకుని పామును చంపేశాడు. వెంటనే ఎల్లమ్మను చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అనంతరం వైద్యులు ఎల్లమ్మకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఎల్లమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
డేరింగ్ దాది
బకుళాబెన్ పటేల్‌ను సూరత్‌లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.సూరత్‌లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్‌కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.కొత్త జీవితంబకుళా బెన్ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.అన్నీ భిన్నమేపిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.500 మెడల్స్‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్. -
పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా
పండ్లు తొందరగా పక్వానికి రావడానికి ఇటీవల కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్పైడ్, ఇథలిన్ వంటి రసాయానాలతో పండ్లను మాగబెట్టే యత్నం చేస్తున్నారు. ఇలాంటి రసాయనాలు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా రైతులను, విక్రయదారులను ఇలాంటి రసాయనాలు వినియోగించొద్దని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి కూడా. అయితే పూర్వకాలంలో పండ్లను మాగబెట్టడానికి ఒక టెక్నిక్ ఉపయోగించేవారు. అది కూడ సహసిద్ధమైన రీతిలో మాగబెట్టవేరు. అదెలోగా ఓ బామ్మ చేసి చూపించింది. ఎలాగంటే..ఓ బామ్మ అరటి పండ్లను పూర్వకాలంలో ఎలా ముగ్గబెట్టేవారో చేసి చూపించింది. అరటి చెట్టుకి కాసిన గెలను కోసి చక్కగా దాన్ని భూమిలో కొద్దిమేర గొయ్యి తీసి దాంట్లో ఈ అరటి గెలను ఉంచింది. తర్వాత ఓ మట్టి పాత్రలో బొగ్గులను రాజేసి దాన్ని కూడా అరటిపండ్ల గెల ఉన్న చోట పెట్టి పైన ఆరటి ఆకులతో కప్పి ఉంచింది. ఆ తర్వాత పైన మరిన్ని ఎండిన కొబ్బరి ఆకులను మట్టిని కూడా వేసి అలా రెండు రోజులు వదిలేసింది. ఆ తర్వాత రోజు చూస్తే చక్కగా మంచి సువాసనతో ముగ్గిపోయి ఉన్నాయి అరటి పండ్లు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పండ్లు ముగ్గేంత వరకు చెట్టుకే ఎందుకు ఉంచరు అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రసాయనాలకు బదులుగా పూర్వకాలంలో ఉపయోగించిన ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది. ఎలాంటి దుష్పభావాలు లేని ఆరోగ్యకరమైన టెక్నిక్ అంటూ ఆ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Eswari S (@countryfoodcooking)(చదవండి: మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. -
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
వయసు@ 70..సోలో ట్రావెలర్
‘‘వయసు కాదు ప్రతి ఒక్కరూ తమ హృదయ లయను అర్ధం చేసుకొని, దానిని అనుసరించాలని నమ్ముతాను. ఇతరుల గుండె చప్పుడులో జీవించాలని ఎప్పుడూ అనుకోవద్దు’’ అంటోంది రిటైర్డ్ ప్రోఫెసర్ జైపూర్‌వాసి నీరూ సలూజా. జీవితం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ బయటే ఉంటుందనే వాస్తవాన్ని గట్టిగా నమ్మే ఈప్రోఫెసర్ డెభ్లై ఏళ్ల వయసులో సోలో ట్రావెలర్‌గా 80 దేశాలు చుట్టొచ్చింది. భిన్న సంస్కృతులను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంతో మందిని కలుసుకొని కొత్త ఉత్తేజాన్ని ΄పొందడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అని చెబుతుంది. ‘‘ఫసిపిక్లోని గాలా పాగోస్ దీవుల నుండి అట్లాంటిక్ మంచుతో నిండిన క్షితిజాల వరకు చేసిన పర్యటనల ద్వారా ఎన్నో స్మారక చిహ్నాలను సేకరించాను. వాటితో అలంకరించిన నా ఇంటిని చూసిన వాళ్లు ప్రపంచ మ్యాప్‌లా ఉంటుందని అంటారు. ఈ జ్ఞాపకాలు అన్నీ ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలను గుర్తుచేస్తాయి. ఇంకా నా ఇంటి గోడలపై మిగిలిన ఖాళీ స్థలాలు రాబోయే చిహ్నాల కోసం నాతో సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. కల వెనకాల రహస్యం నాకు ప్రయాణాల పట్ల ఆసక్తి కలగడానికి స్కూల్ రోజుల్లోనే బీజం పడింది. స్కూల్‌కి సైకిల్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురై ఎడమ కాలు విరిగింది. ఫిజియోథెరపీ సెషన్లతో పాటు నెలల తరబడి బెడ్‌రెస్ట్‌లో ఉండిపోయాను. ఇతర పిల్లలు స్కూల్లో ఉంటే నేను గదికి పరిమితం అయ్యాను. అప్పుట్లో వినోదానికి టీవీ లాంటి ఏ సాధనమూ లేదు. దీంతో పడకగదిలోని కిటికీలోంచి బయటకు చూస్తూ గంటల తరబడి కాలం గడపవలసి వచ్చింది. అక్కడ నుంచి ఆకాశం కేసి చూస్తూ ఉండేదాన్ని. ప్రపంచాన్ని అన్వేషించాలనుకునేదాన్ని. దాదారు ఆరు దశాబ్దాల తరువాత అలా నా కల నిజమైంది. ప్రేమ వారసత్వం కాలేజీలోప్రోఫ్రెసర్గా ఉద్యోగ నిర్వహణ, భార్యగా విధులు, తల్లిగా బాధ్యతలు, ఇంటి నిర్మాణం.. అన్నీ నిర్వర్తించాను. నా పిల్లలు స్థిరపడ్డారు. నా భర్తతో కలిసి చాలా టూర్లకు వెళ్లేవాళ్లం. ఆయన నాకు భర్త మాత్రమే కాదు నా ట్రావెలర్ ఫ్రెండ్ కూడా. 2010లో ఆయన మరణించడంతో మా ప్రేమ వారసత్వాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండలేను. ఆ విధంగా ఎనభైకి పైగా దేశాలను చుట్టొచ్చాను. ప్రపంచాన్ని అన్వేషించగలగడం ఒక అదృష్టంగా భావించకూడదు. అదొక ప్రయాణం. దృష్టి కోణాన్ని మార్చింది మొదటి ఒంటరి ప్రయాణం మాత్రం నాకు ఒక సాహసమే అని చెప్పగలను. 2014లో యూరప్ క్రిస్మస్కి క్రూయిజ్ ద్వారా వెళ్లాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటరిగా ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్రతో నాకు అర్ధమైంది. నిరుత్సాహమైనదని కొందరు అంటుంటారు. కానీ, నేనది అంగీకరించను. ప్రయాణ ప్రణాళికను బాగా ΄్లాన్ చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందు తెలుసుకున్నాను. మనతో ఒకరు తోడు కావాలనుకుంటే మాత్రం మార్గంలో ఎంతో మంది కొత్త స్నేహితులు కలుస్తారు. కాబట్టి నిజంగా ఒంటరిగా ఉన్నాననే ఆలోచనే రాదు. ఈ యాత్ర నా దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చింది. ఒంటరిగా ప్రయాణించడం, గన్యాలను, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ఒక సమూహం, కుటుంబ పర్యటన అయితే ఒక సమయపాలనకు కట్టుబడి ఉండాలి. ఆ గ్రూప్‌లో ఎవరు ఏం చేస్తారో మీరూ అదే చేయాల్సి ఉంటుంది. కానీ, ఒంటరి యాత్రికుల విషయంలో అలాంటి డిమాండ్స్ ఏవీ ఉండవు. అడుగడుగునా ఉత్సుకత నా జీవితంలో అతి ఎక్కువగా గుర్తుండిపోయేది 2017 చలికాలంలో స్వీడన్ పర్యటన. నార్తర్న్ లైట్స్‌కు ప్రసిద్ధి చెందిన స్టాక్ హోమ్ నుండి అబిస్కోకు రైలు ఎక్కడం ద్వారా ఇది ప్రారంభమైంది. మన దేశం రైళ్లకు, అక్కడి రైళ్లకు ఏ మాత్రం పోలిక లేదు. బోర్డింగ్‌లో ప్రతి వ్యక్తికీ వాష్‌రూమ్‌కి ఒక కీ ఇస్తారు. అదొక ఖరీదైన హోటల్ లాంటిది. అక్కడి బాత్రూమ్లో ఒక గంట సమయం గడపాలనుకున్నాను. తిరిగి కంపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు అది లాక్ అయిపోయింది. ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు. కంగారు పడ్డాను. కానీ, చివరకు మార్గాన్ని కనుక్కోగలిగాలను. ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు, ఉత్సుకతలు, సాహసాలు.. ఒక్కరోజులో చెప్పలేను. అబిస్కోలో ఒక మంచు గదిలో బస. అక్కడ అది ఎంతో అందంగా, సహజంగా ఉంది. కానీ, బాత్రూమ్లు లేవని ఆలశ్యంగా తెలసింది. అక్కడ పడిన పాట్లు ఒక్క మాటలో చెప్పలేను. మాస్కో నుండి బీజింగ్ వరకు ట్రాన్స్ –సైబీరియన్ రైలు ప్రయాణం.. అదొక ప్రపంచం. మెల్బోర్న్లో 12 వేల అడుగుల నుండి స్కై డైవింగ్ చేయడం అత్యంత ఉత్కంఠను కలిగించింది. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. ఒక స్వేచ్ఛ విహంగమై చేస్తున్న ప్రయాణం నాకు ఎన్నో తీరాలను పరిచయం చేస్తోంది’’ అని వివరిస్తుంది ఈ ట్రావెలర్. -
Hansaji Yogendra: వయసు 76..ఉత్సాహం 16
మన దేశంలో యోగా గురువులంటే పురుషులే కనిపిస్తుంటారు. కాని హన్సా యోగేంద్ర యోగా గురువుగా చేసిన కృషి ఎవరికీ తక్కువ కానిది. ముఖ్యంగా వయోవృద్ధులలో నైరాశ్యం తొలగి జీవన ఉత్సాహం ఏర్పడాలంటే ఏం చేయాలో ఆమె వీడియో పాఠాల ద్వారా తెలియచేస్తుంది. ఆలోచన, ఆహారం, ఆరోగ్యం ఈ మూడింటికీ మార్గదర్శి హన్సా యోగేంద్ర. ముందు మనం హన్సా యోగేంద్ర రోజువారీ జీవితం చూద్దాం. ఆమె ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తారు. కాసేపు మంచం మీదే పవన ముక్తాసన వంటి ఒకటి రెండు ఆసనాలు వేస్తారు. కొన్ని నిమిషాల ప్రాణాయామం చేస్తారు. ఓంకార ధ్వని చేస్తారు. ‘ఇది సృష్టిలోని శక్తిని మీకు అనుసంధానిస్తుంది’ అంటారు. అప్పుడు ‘మార్నింగ్ డ్రింక్’ తాగుతారు. అంటే టీ, కాఫీ కాదు. రాత్రంతా వెండిగ్లాసులో ఉంచిన నీటిని కాచి దానిలో ఉసిరి, అల్లం, మిరియాలు, పసుపు, అశ్వగంధ మిశ్రమాల ΄పొడిని కొద్దిగా కలిపి కాస్త నిమ్మకాయ పిండి ఆ కషాయాన్ని తీసుకుంటారు. ‘ఇది జఠరాగ్నికి చాలా మంచిది’ అంటారామె. ఆ తర్వాత కాసేపు మత్సా్యసనం, భుజంగాసనం, శలభాసనం వేస్తారు. సరిగ్గా 8.30 అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం అంటే రాత్రి నానబెట్టిన డ్రైఫ్రూట్స్. చివరలో పాలు. ఆ తర్వాత ఆమె యోగా వీడియోలు రికార్డు చేస్తారు. లేదంటే తమ మానసిక శారీరక బాధలు చెప్పుకోవడానికి వచ్చే అనుయాయుల సమస్యలు విని కౌన్సెలింగ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనంలో ఒక రోటీ, పప్పు, ఏదైనా కూర. ‘నేను భోజన బల్ల మీద నీళ్ల గ్లాస్ పెట్టుకోను. మజ్జిగ గ్లాసు పెట్టుకుంటాను. నీళ్ల కంటే మజ్జిగ మన జీర్ణక్రియకు మంచిది’ అంటారామె. ఆ తర్వాత పనిలో పడతారు. సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తారు. ఉడకబెట్టిన పప్పులేవైనా తీసుకుంటారు. రాత్రి సూప్‌తోపాటు, ఇడ్లీ సాంబార్ లాంటివి భుజిస్తారు. రాత్రి సరిగ్గా 10.30కు నిద్ర ΄ోతారు. ‘జీవితం ప్రశాంతంగా గడవాలంటే సిస్టమేటిక్‌గా ఉండాలి’ అంటారామె. యోగా గురువు హన్సా యోగేంద్ర ముంబైలో పుట్టి పెరిగింది. చిన్న వయసులోనే యోగా పట్ల ఆకర్షితురాలైంది. బిఎస్సీ, ఎల్ఎల్బీ చేసినా మనసు యోగా వైపుకు లాగడంతో ప్రఖ్యాత యోగా గురువు యోగేంద్ర స్థాపించిన ‘ది యోగా ఇన్స్టిట్యూట్’కు తరచూ వెళ్లేది. అక్కడే ఆమె యోగేంద్ర కుమారుడు జయదేవ యోగేంద్ర దగ్గర యోగా నేర్చుకుంది. ఆ తర్వాత జయదేవను వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఆమెవైపు పెద్దలు అంగీకరించలేదు. కాని తన జీవితాన్ని యోగాకు అంకితం చేయాలన్న నిశ్చయంతో ఆమె జయదేవను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి యోగా కేంద్రాన్ని వృద్ధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె 76 సంవత్సరాలు. గత ముప్పై, నలభై ఏళ్లలో ఆమె సంస్థ ద్వారా తయారైన యోగా టీచర్లు, ఆమె ద్వారా కనీసం లక్షమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇవాళ ఆమె చేసే వీడియోలు లక్షల్లో చూస్తున్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఉత్తమ మార్గం అంటారామె. అలవాట్లు.. ఆలోచనలు ఆలవాట్లు. ఆలోచనల మీద నియంత్రణ అన్నది జీవితాన్ని అదుపులో ఉంచుతుందని అంటారు హన్సా. అర్థవంతంగా జీవించడం ప్రతి ఒక్కరి అవసరం అని చెబుతారు. విపరీతమైన పరుగులాట, వేళకాని వేళ భోజనం, వేళకాని వేళలో నిద్ర... ఇవి జీవితానికి, ఆరోగ్యానికి ప్రధాన శత్రువులంటారామె. ఇవే అనవసర వృద్ధా΄్యాన్ని తెస్తున్నాయని అంటారు. ప్రకృతిలో దొరికే అందరికీ తెలిసిన పదార్థాలతోనే అకాల వృద్ధా΄్యాన్ని నిరోధించవచ్చంటారు. కాఫీ, టీ వంటివి కూడా శరీరానికి అక్కర్లేదని అవి అలవాటుగా మారి నాడీ వ్యవస్థను డీలా పరుస్తాయంటారు. ‘ఐదు ముఖ్యమైన ఉదయపు అలవాట్లు’,‘మంచినీరు తాగాల్సిన పద్ధతి’, ‘ప్రతి స్త్రీ వేయాల్సిన ఐదు ఆసనాలు’, ‘స్నానం చేయాల్సిన పద్ధతి’,‘ఎలాంటి ఆహారం తీసుకోవాలి’, ‘జబ్బులు రానివ్వని ఐదు ముద్రలు’... ఆమె చేసిన ఇలాంటి వీడియోలన్నీ పెద్దఎత్తున ఆదరణ ΄పొందాయి. సాత్విక ఆహారం గురించి ‘ది సాత్విక్ కిచెన్’ అనే పుస్తకం రాశారామె. ‘ఆ«ధ్యాత్మికత, ఆసనాలు మన జీవితానికి మార్గం చూపుతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆధ్యాత్మికంగా మీ బలహీనతలను జయించండి’ అంటారు హన్సా. ‘జీవితం విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండి రిస్క్ తీసుకునైనా నిజాయితీగా ΄ోరాడితే జీవితం కచ్చితంగా మీకు సంతోషాలనే ఇస్తుంది. జీవితాన్ని అనవసర జంజాటాల్లో పడేయకండి’ అంటారామె. హన్సా కుమారుడు రిషి జయదేవ్ యోగేంద్ర కూడా యోగ సాధనలో ఉన్నాడు. ‘అతన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అంటారామె. -
చంద్రబాబు పేరు ఎత్తగానే అవ్వ రియాక్షన్...
-
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
వందేళ్ల ఫ్రాన్స్ బామ్మగారికి పద్మశ్రీ!
యోగా అనేది మన దేశానికి చెందినది. అయితే మన దేశంలో కూడా అంతలా శ్రద్ధగా చేసేవాళ్లు తక్కువే. యోగా చేస్తున్న అతి పెద్ద వయసు వృద్ధులు లేరు కూడా. కానీ ఫ్రాన్స్‌కి చెందిన ఓ బామ్మ మాత్రం అతి పెద్ద వయసు యోగా టీచర్. ఆమె ఫ్రాన్స్‌లో యోగా విప్లవాన్నే తీసుకొచ్చి ఎనలేని కృషి చేసింది. అందుకుగానే భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్న పురస్కారం ఆమెను పద్శ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నలుగురు ఫ్రెంచ్ జాతీయులకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. వారిలో ఈ బామ్మ కూడా ఉన్నారు. గతేడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడూ తొలిసారిగా పారిస్‌లో షార్లెట్ చాపిన్ను కలిశారు. ఆమె చాలా చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్దావిడి అంతలా ఎలా చలాకీగా ఉన్నారని ఆరా తీశారు మోదీ. అప్పుడే తెలిసింది మోదీకి ఆమె ఒక యోగా గురవని. ఈ విషయాన్నే ఆయన మనకీబాత్‌లో ప్రస్తావిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ చాపిన్ ఈ యోగా విద్య ఎలా నేర్చుకుందో వింటే ఆశ్చర్యపోతారు. ఆమెకు ఏడేళ్ల వయసులో భారత్‌కు వచ్చినప్పుడూ ఈ యోగా విద్య గురించి తెలిసుకుందంట. అక్కడ కొందరూ మగపిల్లలు ఈ యోగాసనాలు వేయడం చూసి, తాను అలా వేయగలనా? అని మనసులోనే అనుకుందట ఆ బామ్మ. అయితే ఆమె తర్వాత ఫ్రాన్స్ వెళ్లిపోవడంతో...ఆ ఆసనాల సంగతి మర్చిపోయి బాల్ రూమ్ డ్యాన్సర్‌గా కెరియర్ని మొదలుపెట్టింది. ఈ డ్యాన్స్‌ని చేసేటప్పుడు అయిన గాయాల వల్ల మూడుసార్లు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలను చేయించుకుంది. వాటి నుంచి కోలుకొనే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాని తిరిగి 50 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ‘అప్పట్నుంచీ యోగమార్గమే నా జీవితం అయ్యింది. యాభై ఏళ్లుగా నేను చేస్తూ, ఎంతో మందితో చేయిస్తున్నా. లెక్కల ప్రకారం చూస్తే నాకిప్పుడు వందేళ్లు. కానీ పాతికేళ్లే అనుకుంటారు. యోగావల్లనే ఆ హుషారు, ఉత్సాహం’ అనే చాపిన్ ఫ్రాన్స్‌లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు. అంతేగాదు ఆమె పలు టీవీ షోలు కూడా చేస్తున్నారు. ఈ యోగాసనాలతో గిన్నిస్ రికార్డునీ కూడా సొంతం చేసుకున్నారు. వయసు మీరడం వల్ల ఆమె మాట ముద్దగా ఉంటుందేమో కానీ... ఆమె వేసే యోగాసనాల్లో మాత్రం వణుకూ లేకపోవడం విశేషం. ఇక మోదీ ఆమెను చూసి యోగా కేవలం పశ్చిమ దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలకు చేరుకుంటుంది. అది కేవలం షార్లెట్ వంటి వారి కృషి వల్లే జరుగుతుందంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు మోదీ. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
Hyderabad: దోమలగూడలో దారుణం
సాక్షి, హైదరాబాద్: దోమలగూడలోని గగన్‌మహల్ రాధామదన్‌నివాస్‌లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి యజమానులు లేని సమయంలో కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మృతురాలు స్నేహలత దేవి (61)కు భర్త మహేష్ కుమార్.. కుమారుడు పవన్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహేష్ కుమార్ పవన్ కుమార్ గోషామాల్‌లో ప్లైవుడ్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వ్యాపార నిమిత్తం తండ్రి కొడుకు ప్లైవుడ్ షాప్‌కు వెళ్లారు. ఆ సమయంలో కారు డ్రైవర్ మహేష్.. స్నేహలత దేవి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలతో పరారైనట్లు దోమలగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌కు చెందిన మహేష్ రెండు నెలల క్రితమే వీరి వద్ద కారు డ్రైవర్‌గా విధుల్లో చేరాడని తెలిపారు. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో స్నేహలత దేవిని హుటాహుటిన హైదర్‌గూడాలోని అపోలో ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాల ధ్రువీకరించాయి. ముఖానికి ప్లాస్టర్ వేయటంతో ఊపిరడకపోవటం వల్లే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని దోమలగూడ పోలీసులు తెలిపారు. గాంధీనగర్ ఏసీపీ కే రవి కుమార్, దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. చదవండి: TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్ -
కర్ణాటకలో పింఛన్ కష్టం..
శివాజీనగర: పింఛన్ కోసం కర్ణాటక రాష్ట్రంలో 77 ఏళ్ల ఓ దివ్యాంగ వృద్ధురాలు రెండు కిలోమీటర్లకు పైగా పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చిన ఘటన అందర్నీ నివ్వెరపరిచింది. పంటిబిగువన నరకయాతన అనుభవిస్తూ పోస్టాఫీసుకు వచ్చిన ఆమెకు తీవ్ర నిరాశే మిగిలింది. అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు, ఇతర రాష్ట్రాలకు ఉన్న తేడాకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ఒకటో తేదీ వచ్చిందంటే.. వలంటీర్లు తెల్లారకముందే తలుపుకొట్టి అవ్వాతాతల చేతుల్లో పింఛను సొమ్ము పెడుతుండడం తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటకలో అమలవుతున్న తీరుతో కన్నడిగులు పోలుస్తున్నారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా కుణిబెళకెర గ్రామానికి చెందిన వయో వృద్ధురాలు గిరిజమ్మకు ఎవరూలేరు. ప్రభుత్వం ఇచ్చే పెన్షనే ఆమెకు జీవనాధారం. ప్రతి నెలారంభంలో హరిహర పోస్టాఫీసులో పెన్షన్ తీసుకుంటుంది. గత ఏడాది నవంబరు నుంచి సక్రమంగా అందడంలేదు. ఆటోలో రావడానికి డబ్బులు లేకపోవడంతో వారం రోజుల కిందట గ్రామం నుంచి రెండు కిలో మీటర్లు పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చింది. 77 year old divyang woman crawls for her unpaid pension in Congress ruled Karnataka. Meanwhile, @INCIndia plays 'Nyay' in the sky. Sickening irony! https://t.co/9RbFUanKd4 pic.twitter.com/KEW4hfeiWG — Anoop Antony (@AnoopKaippalli) January 14, 2024 కానీ, పెన్షన్ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో హతాశురాలైంది. ఆమె కష్టాన్ని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. అంతదూరం నుంచి పాక్కుంటూ రావడంవల్ల ఒళ్లు చీరుకుపోయి బొబ్బలు వచ్చినా లెక్కచేయలేదు. ‘ఆ పెన్షన్ వస్తేనే నాకు రోజు గడుస్తుంది. అదే లేకపోతే ఏం తినాలి, అందుకే కష్టమైనా పాకుతూనే వచ్చాను..’ అని గిరిజమ్మ దీనంగా చెప్పింది. కాగా, ఈ విషయమై పెద్దఎత్తున విమర్శలు రావడంతో స్థానిక సబ్ కలెక్టర్ అమూల్య పాండా స్పందిస్తూ.. ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసే సదుపాయం రాష్ట్రంలో లేదనడం గమనార్హం. ఏపీలో వైఎస్ జగన్ సర్కారు ప్రతి నెలా మొదటి తారీఖునే ఇళ్లకే వెళ్లి మరీ అవ్వాతాతలకు రూ.3వేలు చొప్పున ఫించన్ సొమ్ము అందజేస్తుండడం తెలిసిందే. దేశంలో రూ.3 వేల ఫించన్ తోపాటు ఎక్కువ మందికి ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే కావడం విశేషం. -
90 ఏళ్ల మృత్యుంజయురాలు
టోక్యో: జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం మిగిలి్చంది. వంద మందికిపైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. 90 ఏళ్లకుపైగా వయసున్న ఓ వృద్ధురాలు శిథిలాల నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడం ఆశ్చర్యం కలిగింది. ఇషికావా జిల్లాలోని సుజు సిటీలో భూకంపం వల్ల కూలిపోయిన రెండంతస్తుల భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ వృద్ధురాలు బయటకు వచి్చంది. ఆహారం, నీరు లేక బలహీనంగా మారిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించారు. ఏకంగా 124 గంటలపాటు ఆమె ఈ శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, మాట్లాడగలుతోందని, ఆమె కాళ్లకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. జపాన్‌లో ఆరు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో కనీసం 126 మంది మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
కరీంనగర్: ముసలమ్మ నాకొద్దు!
నవ మాసాలు మోసి కనాలి. పాలిచ్చి పెంచాలి. అడిగివన్నీ చేసి పెట్టాలి. అపురూపంగా చూసుకోవాలి. కానీ, వయసు మీద పడితే.. ఆ తల్లి భారమైపోతుందా?.. అలాగే అనుకున్నాడు ఇక్కడ ఓ కొడుకు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోలేనంటూ చలిలో రోడ్డు పక్కన పడేశారు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్తతోపాటు పెద్ద కొడుకు రాజయ్య, ఓ కూతురు కొన్నాళ్ల కిందట చనిపోయారు. వయసు పైబడడంతోపాటు ఇళ్లు పాడుబడి పోయింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకుల కుటుంబాలు వంతులవారీగా లచ్చమ్మను చూసుకుంటూ వస్తున్నారు. రాజయ్య కుటుంబం మహారాష్ట్రంలో ఉంటోంది. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్ తీసుకొచ్చి దిగబెట్టింది. అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చిన్న కొడుకు కుటుంబం అడ్డుకుంది. రాజయ్య కొడుకు వెళ్లిపోయే దాకా చూసి.. ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేశాడు. చలిలో రోడ్డు మీద వణుకుతూ కనిపించిన లచ్చమ్మను స్థానికులు చూశారు. డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు చిన్న కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే యత్నం చేశారు. కానీ, అతను ముసలి అమ్మ వద్దంటూ కరాకండిగా చెప్పేశాడు. కావాలంటే పాత ఇంట్లో ఆమె ఉండొచ్చని.. తిండి కావాలంటే అక్కడికే తీసుకెళ్లి ఇస్తానని చెప్పాడు. దీంతో.. చేసేది ఏం లేక ఆ 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు ఆమె పాత ఇంటి వద్ద దిగబెట్టారు. -
Viral Video: ఖవాల్‌జీత్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ప్రస్తుతం కూరగాయలు, పండ్లు కోనుగోలు చేయడానికి జనాలు సూపర్ మార్కెట్లు, డెలివరీ యాప్స్‌ను వాడుతున్నారు. అక్కడక్కడా రోడ్డుపై బండ్లు పెట్టుకొని అమ్మెవారి వద్ద కూడా కొనుకున్నా.. కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి!. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి సోషల్‌మీడియాలో పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆయన చేసిన ఏంటని అనుకుంటున్నా?. పంజాబ్‌లోని లూథియాకు చెందిన ఖవాల్‌జీత్ సింగ్ పండ్లు కొందామని రోడ్డు పక్కన ఓ వృద్దురాలి పండ్ల బండి వద్దకు వెళ్లాడు. 62 ఏళ్లు ఉన్న ఆ వృద్దురాలతో వద్ద పండ్లు కొనుగోలు చేస్తూ ఆమె వ్యాపారం గురించి అడిగి తెలుకున్నాడు. 12 గంటలు కష్టపడి పండ్లు అమ్మినా తన వద్ద పండ్లు ఎవరూ కొనడంలేదని ఆమె వాపోయింది. దీంతో ఖవాల్‌జీత్.. ఆమె బండిపై ఉన్న సుమారు రూ.3000 విలువగల అన్ని పండ్లను ఒకేసారి కొన్నాడు. View this post on Instagram A post shared by Kawaljeet Singh (@kawalchhabra) ‘నేను పండ్లు కొనడాకి వెళ్లినప్పుడు.. వాటిని అమ్మె వృద్దురాలు ధీనంగా కూర్చుని ఉంది. ముందు రోజు కూడా పండ్లు అమ్ముడుపోలేదని తెలిపింది. ఇప్పటి వరకు కేవలం రూ.100 పండ్లు మాత్రమే అమ్ముడుపోయినట్ల చెప్పింది. అందుకే మొత్తం బండిపై ఉన్న పండ్లు కొనుగోలు చేశాను’ అని ఖవాల్‌జీత్ తెలిపారు. దీనికి సంబధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏడుపు ఆగలేదు’, ‘చాలా మంచి పని చేశారు సర్దార్జీ’ అని కామెట్లు చేస్తున్నారు. -
ఆటో డ్రైవర్ దుర్మార్గం! వృద్ధురాలిపై..
యలమంచిలి: ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆటో డ్రైవర్ దుర్మార్గంగా ప్రవర్తించాడు. వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి. ఈ నెల 2వ తేదీన అనకాపల్లి మండలం నర్సింగరావుపేట, చవితిని వీధికి చెందిన చవితిని చిలకమ్మ (70) రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో ఉన్న తన కుమార్తె మరపురెడ్డి భవానీ ఇంటికి వెళ్లడానికి అనకాపల్లిలో ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ ప్రయాణికులతో పాటుగా ఆమెను యలమంచిలి పట్టణానికి తీసుకొచ్చాడు. అప్పుడు చిలకమ్మ పంచదార్ల వెళ్లడానికి ఆటోని యలమంచిలిలో నిలపమని డ్రైవర్‌కు చెప్పగా నేను కూడా పంచదార్ల మీదుగా వెళతానని ఆమెను మభ్యపెట్టి ఆటోను పురుషోత్తపురం సమీపంలో ములకలాపల్లి మీదుగా పోలవరం కాలువ వైపు పోనిచ్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరాక ఆమెను బెదిరించి ఆమె మెడలో గల మూడు తులాల బంగారు గొలుసు, రెండు తులాల తాడును లాక్కొని ఆమె తలపై రాయితో కొట్టి ఉడాయించాడు. దీంతో ఆమె సంఘటన స్థలంలో స్పృహ తప్పి పడిపోయింది. కొంత సమయానికి కొత్తలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను గమనించి ఆటోలో యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ కె.సన్నిబాబు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డ ఆటోడ్రైవర్ యలమంచిలిలో ఒక మందుల దుకాణం వద్ద ఆటోను నిలిపి మందులు కొనడానికి షాపు దగ్గరకు వెళ్లగా అక్కడ ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి విచారణ చేశారు. కొక్కిరాపల్లి సమీపంలో గురువారం ఆటోలను తనిఖీ చేస్తుండగా అనకాపల్లి బీఆర్టీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్‌గా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించడంతో అతనితో పాటు మరో ఆటో డ్రైవర్ భర్నికాల గంగరాజు పాత్ర ఉండడంతో వారి వద్ద నుంచి బంగారం అమ్మిన నగదు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పథకం ప్రకారమే చోరీ.. కాగా అనకాపల్లిలో ఆటో ఎక్కడానికి వచ్చిన వృద్ధురాలు చవితిన చిలుకమ్మ మెడలో బంగారంపై కన్నేసిన నిందితులు పథకం ప్రకారమే ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. రెడ్డప్ప వృద్ధురాలి నుంచి దొంగిలించిన బంగారాన్ని స్నేహితుడు గంగరాజుకు ఇవ్వగా, గంగరాజు దానిని విక్రయించి వచ్చిన నగదు పంచుకుందామనుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు ఇతర అలవాట్లకు బానిసైన గంగరాజు అప్పుల పాలై రెడ్డప్పను డబ్బు అడిగాడు. స్నేహితుడు అడిగిన డబ్బు ఇవ్వడానికే ఈ దొంగతనం చేయాల్సి వచ్చిందని రెడ్డప్ప విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్ అనకాపల్లి వలస వచ్చి కొంతకాలంగా భార్యతో కలిసి బీఆర్టీ కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఇటువంటి ఘటనల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆటోల్లో ప్రయాణించేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఇవి చదవండి: సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?