నందమూరి బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుత్ను సంగతి తెలిసింది. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్‌బీకే107(#NBK107) అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్నూల్‌లో జరపుకుంటుంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలయ్యను చూసేందుకు స్థానికులు తండోనతండాలుగా తరలివచ్చారు. ఇక ఫ్యాన్స్‌లో బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అన్న, ఆయన కనిపించిన అభిమానులు చేసే రచ్చ అంత ఇంత కాదు.
చదవండి: కదలలేని స్థితిలో కైకాల, బెడ్‌పైనే కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్
ఈ క్రమంలో ఎన్‌బీకే 107 షూటింగ్ సెట్‌ను బాలయ్యను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇందులో ఓ ముసలావిడ కూడా ఉండటం విశేషం. బాలకృష్ణను చూడగానే ఆమె డాన్స్, ఈలలు వేస్తూ రచ్చరచ్చ చేసంది. అంతేకాదు జై బాలయ్య అంటూ పలుమార్లు ఈలలు వేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Celebrating the shoot of #NBK107 ❤️ pic.twitter.com/mQb0MteeyB
— Mythri Movie Makers (@MythriOfficial) July 26, 2022
Comments
Please login to add a commentAdd a comment