బంగారి (ఫైల్)
సాక్షి, దేవరకొండ (నల్లగొండ): భార్యతో గొడవెందుకు కొడుకా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. పండుటాకు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఛాతి ఎడమ భాగంలో పొడవడంతో అక్కడికక్కడే కూప్పకూలి ప్రాణాలొదిలింది.
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల పరిధి లోని చింతచెట్టుతండా గ్రామపంచాయతీ జేత్యతండాకు చెందిన మూఢావత్ రవి వ్యవసాయం చేసుకుంటూ భార్య విజయ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు.
మద్యానికి బానిసై..
రవి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా మద్యం విషయంలోనే దంపతులు గొడవ పడ్డారు. తనను మద్యం తాగనీయకుంటే చస్తానని, కత్తి తీసుకుని ప్రాణం తీసుకుంటానని భార్యను బెదిరించాడు. పెద్దపెట్టున అరుస్తుండడంతో భర్త తీరుకు విసుగుచెందిన విజయ పిల్లలను తీసుకుని తండాలోనే బంధువు ఇంటికి వెళ్లింది.
గొడవ పెట్టుకోవద్దని అన్నందుకు..
కాగా, మూఢావత్ రవి ఇంటి ఎదురుగానే ఇస్లావత్ బంగారి(60), భర్త చందుతో కలిసి జీవనం సాగి స్తోంది. వీరికి కుమారుడు, కుమార్తెకు వివాహాలు కావడంతో హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే, రవి తన భార్యతో గొ డవ పెట్టుకుండుడం విన్న బంగారి నచ్చచెప్పేందుకు అతడి ఇంటికి వెళ్లింది.
భార్యతో గొడవపెట్టుకోవద్దని, బాగా జీవించాలని చెప్పి ంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి కత్తితో ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. బంగారి ఛాతి ఎడమ భాగంలో బలంగా కత్తితో పొడవడంతో నిల్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
తాళ్లతో బంధించి..
రవి ఘాతుకానికి ఎదురుగా అరుగుపై కూర్చున్న బంగారి భర్తతో పాటు మరికొందరు హతాశులయ్యారు. వెంటనే వారు అక్కడికి వెళ్లే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడి బంగారి ప్రాణాలు వది లింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మరికొందరు తండావాసులు నిందితుడు రవిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. బంగారి మృతదేహాన్ని రవి ఇంటి ఎదుట ఉంచి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆందోళన చేపట్టారు.
బంగారి మృతి వార్త తెలుసుకున్న బంధువులు తండాకు చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. .తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కొండమల్లేపల్లి, గుడిపల్లి, గుర్రపోండు ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, వీరబాబు, శ్రీనయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment