భార్యపై దాడి.. కూతురితో కలిసి ఆత్మహత్య | father commits suicide with daughter in nalgonda | Sakshi
Sakshi News home page

భార్యపై దాడి.. కూతురితో కలిసి ఆత్మహత్య

Published Sat, Sep 24 2016 2:38 PM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

father commits suicide with daughter in nalgonda

తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో శనివారం ఉదయం దారుణం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామచంద్రం కుటుంబ కలహాల కారణంగా భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలసి కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో రామచంద్రంతో పాటు చిన్న కూతురు మృతి చెందారు.

కాగా దాడిలో గాయపడిన భార్యతో పాటు, పెద్దకూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement