husband attacks wife
-
నెల క్రితమే ప్రేమ పెళ్లి.. ఏమైందో తెలియదు.. భార్యపై కత్తితో దాడి
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్య కొత్తా పావని పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం పావనిని ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసిన భర్త సాయికుమార్ పరారీలో ఉన్నాడు. పావని దంపతులు గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త వేధిస్తున్నాడని పావని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్.. పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయి నెలకూడా తిరక్కుండానే ఈ దారుణం చోటుచేసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవకు మరేదైన కారణం ఉందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. -
మగబిడ్డ పుట్టలేదని మరుగుతున్న నీటిని భార్యపై పోసిన కసాయి
లక్నో: మగపిల్లలు పుట్టలేదని.. పుట్టిన ముగ్గురు పిల్లలూ ఆడ పిల్లలేనని.. ఓ భర్త తను కట్టుకున్న భార్యపై అమానుషంగా వ్యవహరించాడు. కడుపులో వుంది మగబిడ్డా, ఆడబిడ్డా అనేది మహిళలకు సంబంధం లేకున్నా మగపిల్లవాడు కావాలంటూ మహిళలకు అవమానాలు, చీదరింపులు, చీత్కారాలు మాత్రం తప్పడం లేదు. యూపీలో ఓ భర్త తన భార్యపై మరుగుతున్న నీటిని పోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌కు సంజు అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి అదనపు కట్నం రూ. 50 వేలు తీసుకురావాలంటూ కొంతకాలంగా సత్యపాల్ భార్యను వేధిస్తున్నాడు. ప్రతి రోజూ ఇదే విషయంపై హిసించసాగాడు. మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్యపై ద్వేషం పెంచుకున్న సత్యపాల్ కొద్ది రోజులుగా సంజూకు భోజనం కూడా పెట్టడం లేదు. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 13న ఇంట్లో ఉన్న తన భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో పక్కనే స్టవ్‌పై మరుగుతున్న వేడినీటిని ఆమెపై పోశాడు. దీంతో సంజూ తీవ్రంగా గాయపడటంతో గమణించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. -
దారుణం: కస్తూర్భ టీచర్‌పై భర్త కత్తి దాడి
సాక్షి, తూర్పు గోదావరి: తుని మండలం వి.కొత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కస్తూర్భా బాలికలో విద్యాలయంలో పనిచేస్తున్న జూవాలజీ టీచర్‌పై ఆమె కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేగింది. భర్త విచక్షణంగా దాడి చేయడంతో సదరు ఉపాధ్యాయురాలు మధురాక్షి తీవ్ర గయాలయ్యాయి. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకుని గాయపడిన మధురాక్షిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ తగాదాలే దాడికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
బీర్ సీసాతో భార్యపై దాడి
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో బోధన్ మండలంలోని సాలూరలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తుల్లో కట్టుకున్న భార్యపై ఓ వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు వివరాల్లోకి వెళితే.. సాలూరలో తల్లి ఇంటి వద్ద ఉన్న సవితపై ఆమె భర్త శ్రీనివాస్ తాగిన మత్తులో దాడికి పాల్పడ్డాడు. ఆమె శరీరంపై బీరు సీసాతో పైశాచికంగా పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సవితను బంధువులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఘటన అనంతరం శ్రీనివాస్.. ఏమి తెలియనట్టు వర్ని మండలం చందూరులోని తన ఇంటికి వెళ్లిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. బార్యపై అనుమానంతో శ్రీనివాస్ ఆమెతో పలుమార్లు గొడవ పడినట్టుగా తెలుస్తోంది. ఈ వేధింపులు భరించలేక సవిత ఇటీవల పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, శ్రీనివాస్-సవిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద కుమార్తె రజిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె లావణ్య మూడో తరగతి చదువుతున్నారు. -
పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం
బోసి నవ్వులు కురిపిస్తున్న ఆ పసిబిడ్డను చంపడానికి ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో.. తన పోలికలతో లేడంటూ అత్యంత కిరాతకంగా ఆ చిన్నారి ప్రాణాలు తోడేశాడు. నేలకేసి కొట్టి.. ఆపై గొంతుమీద కాలేసి తొక్కి పసివాడి ఉసురుతీశాడు. అనుమానం పెనుభూతమై.. అతడిని రాక్షసుడిని చేసింది.. రాచర్ల: రాచర్లకు చెందిన గుమ్ముళ్ల చిన్న పుల్లయ్య.. 2009లో అర్థవీడు మండలం, మొహిద్దీన్‌పురానికి చెందిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, ఒక కుమార్తె సంతానం. 2011లో పుట్టింటికి వెళ్లి రెండో సంతానానికి జన్మనిచ్చిన లక్ష్మీదేవి బాలింతగా ఉండగానే ఆమెపై అనుమానం పెంచుకుని.. కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసులో అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక 2017లో వెఎస్సార్ జిల్లా రామాపురానికి చెందిన రమాదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. బేల్దారి పనులు, కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఎనిమిది నెలల కుమారుడు రేవంత్ ఉన్నాడు. బిడ్డ పుట్టినప్పట్నుంచి.. తన పోలికలతో లేడని నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం రాత్రి ఇదే విషయంపై మళ్లీ వేధించాడు. శనివారం ఉదయం కూడా భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంచంపై ఉన్న రేవంత్‌ను తీసుకుని నేలకేసి కొట్టాడు. అది చాలదన్నట్టు గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. కన్న బిడ్డను కళ్ల ముందే చంపేస్తుండటం చూసి హతాశురాలైన రమాదేవి కేకలు వేస్తూ ఇరుగు పొరుగును పిలిచింది. దీంతో మరింత రెచ్చిపోయిన పుల్లయ్య పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని ఆమె తలపై బలంగా మోదాడు. తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేస్తూ వీధిలోకి వచ్చి కుప్పకూలిపోయింది. బిడ్డ అప్పటికే మరణించాడు. అది చూసి పుల్లయ్య అక్కడ నుంచి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న రమాదేవిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రమాదేవి సోదరులు శ్రీరాములు, అంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని రమాదేవి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ సుధాకర్‌రావు చెప్పారు. -
భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి హత్య
వర్ధన్నపేట: కుటుంబ కలహాలు, అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి హత్యచేసిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున వరంగల్ రూరల్‌జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై బండారి సంపత్ కథనం ప్రకారం మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన చెవ్వల యాదగిరికి రాయపర్తి మండలం కొత్తూరుకు చెందిన మల్లికాంబ(43)తో 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 12 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి ప్రవీణ్, ప్రశాంత్ కుమారులు సంతానం కలిగారు. వ్యవసాయ భూమి అమ్మే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య మాట వినకుండా భూమిని యాదగిరి అమ్మడంతో మల్లికాంబ కుమారులతో పుట్టింటికి వెళ్లింది. యాదగిరి న్యాయస్థానం ద్వారా విడాకులు కోరడంతో మల్లికాంబ తాను, తన పిల్లల జీవనాధారానికి మేయింటెనెన్స్ కేసు వేసింది. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. పిల్లలు పెళ్లికి ఎదిగారు. తల్లితండ్రులు కలిసి ఉంటే అమ్మాయిని ఇస్తారు అని పెద్ద మనుషులు అనడంతో యాదగిరి మల్లికాంబను నమ్మించి పెద్ద మనుషుల సమక్షంలో తాము సఖ్యతగా ఉంటామని ఒప్పందం చేసుకుని ఈ నెల 16న మల్లికాంబను, కుమారులు ప్రవీణ్, ప్రశాంత్‌లను తీసుకుని వచ్చాడు. ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వెళ్లాడు. నిద్రిస్తున్న మల్లికాంబ మెడపై శుక్రవారం తెల్లవారుజామున యాదగిరి గొడ్డలితో దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడు చిక్క నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండారి సంపత్ తెలిపారు. ఈ ఘటన సమాచారం అందగానే వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్, సీఐ ముస్క శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పలువురిని విచారణ చేశారు. నగరం నుంచి క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యపై భర్త దాడి
శ్రీకాకుళం, పాతపట్నం: మండలంలోని పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి చంద్రశేఖర్ తన భార్య చిట్టమ్మపై దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ ఈ.చిన్నంనాయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చంద్రశేఖర్, చిట్టమ్మ గత 25 ఏళ్లుగా విడివిడిగా కాపురం ఉంటున్నారు. వీరి ముగ్గురి కుమారులకు వివాహాలు కాగా, గ్రామంలోనే నివసిస్తున్నారు. ఇటీవల జ్వరం రావడంతో పెద్ద కుమారుడైన ఫాల్గునరావు వద్ద తన భర్త ఉండడంపై భార్య తరచూ తిడుతుండేది. దీంతో అసహనానికి లోనైన చంద్రశేఖర్.. సోమవారం ఉదయం చెరువుకి స్నానానికి వెళ్తున్న చిట్టమ్మను చెతికర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో బాధితురాలిని హుటాహుటిన పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు కె.మోహన్‌బాబు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. తన తల్లిపై తండ్రి దాడి చేశాడని రెండో కుమారుడు వనజానాథం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానంతో భార్యపై కత్తితో దాడి
పోలంపల్లి(వత్సవాయి): భార్యపై అనుమానంతో కొబ్బరిబొండాలు నరికే కత్తితో భర్త దాడిచేశాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలంపల్లి గ్రామానికి చెందిన కొయ్యల బాలకృష్ణకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన మహేశ్వరితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9 సంవత్సరాల కుమార్తె ఉంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ రెండేళ్లుగా గ్రామాన్ని విడిచి బయటే ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పోతుండేవాడు. గ్రామానికి వచ్చినప్పుడల్లా భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన బాలకృష్ణ భార్యతో గొడవ పడ్డాడు. ఇదే క్రమంలో శనివారం అర్ధరాత్రి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కొబ్బరిబొండాలు నరికే కత్తితో ఆమెపై దాడి చేశాడు. కాళ్లు, చేతులపై నరికాడు. అనంతరం స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ పి. ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని మహేశ్వరి పరిస్థితిని గమనించగా ఆమె ఊపిరితో ఉంది. వెంటనే 108 వాహనంలో జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణిపై దాష్టీకం
కర్నూలు, నంద్యాల: ఎన్నో ఆశలతో పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన ఆమెకు ఏడాది తిరక్కముందే వేధింపులు మొదలయ్యాయి. మూడు నెలల గర్భం దాల్చినా వేధింపులుకట్నం తేకుంటే ఆపరేషన్ చేయించుకోవాలని ఒత్తిడి పెంచారు. ఆపరేషన్‌కు ససేమిరా అనడంతో భర్త, అత్త, మామ, మరిదులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ఆమె గర్భం కోల్పోయింది. టూటౌన్ సీఐ మంజునాథరెడ్డి తెలిపిన మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సాయిసురేఖకు గత ఏడాది ఆగస్టులో ప్రకాశం జిల్లా కొమరోలు మండల కేంద్రానికి చెందిన వెంకటేష్‌తో వివాహమైంది. వివాహ సమయంలో రూ.1.60 లక్షల నగదు, రూ.2.40 లక్షల విలువ చేసే బంగారంకట్నంగా ఇచ్చారు. పెళ్లయి కొన్ని నెలలు కూడా గడవకముందే అత్తింటి వారి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. రూ.10 లక్షలు తీసుకొని రావాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. పెద్దలు ఇరు కుటుంబాలను పిలిపించి పంచాయితీ చేశారు. కొద్ది సమయం ఇస్తే డబ్బు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపారు. ఆ తర్వాత సాయిసురేఖ గర్భం దాల్చింది. పిల్లలు పుడితే ఇక డబ్బులివ్వరన్న ఉద్దేశంతో మళ్లీ వేధింపులు మొదలుపెట్టారు. పిల్లలు కనడానికి వీల్లేదని, వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో భర్త వెంకటేష్, మామ సింహాచలం, అత్త గంగ, మరిదులు రమేష్, సుదర్శన్, మేనత్త కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వెంటనే వారు నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్ష చేయించారు. పిండం దెబ్బతినిందని, ఆపరేషన్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని తెలిపారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేయించారు. అలాగే ఈ విషయంపై సోమవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త, అత్త, మామ, మరిదులు, మేనత్తపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. -
అనుమానంతో భార్యపై భర్త దాడి
విజయనగరం, భోగాపురం: అనుమానంతో భార్యపై భర్త దాడిచేసిన సంఘటన మండలంలోని రాజాపులోవలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వనుము పాపయ్య, అతని భార్య గురమ్మల మధ్య రెండు రోజులుగా చిన్న చిన్న తగాదాలు జరుగుతున్నాయి. పాపయ్యకి తన భార్యపైన అనుమానం ఎక్కువగా ఉండడంతో ఆమెను పనికి పంపకుండా, తాను పనికి వెళ్ళకుండా ఇబ్బందులు పెడుతుండేవాడు. వీరికి ఏడేళ్ల వయసున్న బాబు.. ఐదేళ్ల వయసున్న పాప ఉన్నారు. అయి తే ఆదివారం ఏమైందో ఏమో వారిద్దరి మధ్య తగాదా మొదలైంది. ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పాపయ్య తన భార్య గురమ్మపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఎస్సై ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
వివాహేతర సంబంధమే కారణమా..?
ఏలూరు టౌన్: భార్య, అత్తపై భర్త కత్తితో దాడి చేశాడు. ఏలూరు శాంతినగర్ 13వ రోడ్డులో శనివారం సాయంత్రం అత్త, భార్యలపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. భార్య అద్దేపల్లి భవ్యశ్రీకి తీవ్ర గాయాలు కాగా అత్తకు గాయాలయ్యాయి. వీరి ఇరువురిని ఏలూరు అశోక్‌నగర్‌లోని చైత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అద్దేపల్లి భాస్కరరావు, భవ్యశ్రీలకు కొంతకాలం క్రితం వివాహమైంది. సత్రంపాడులో పద్మావతి సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అత్త ముమ్మిన హైమావతి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త గొడవపడుతూ ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న గుడివాకలంకకు చెందిన ముంగర గణేష్ అలియాస్ అభిషేక్ అనే వ్యక్తితో భార్య భవ్యశ్రీ సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేక తరుచూ గొడవలు పడుతున్నారు. భార్య భవ్యశ్రీకి అత్త హైమావతి వత్తాసు పలుకుతుందని, ఇద్దరిని అంతం చేయాలని శనివారం సాయంత్రం ఏలూరు శాంతినగర్ 13వ రోడ్డులో ఉన్న అత్త, భార్యలపై భాస్కరరావు కత్తితో దాడి చేశాడు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నిందితుడు భాస్కరరావు ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, అక్కడ నుంచి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య కనపడటం లేదని ఫిర్యాదు తన భార్య భవ్యశ్రీ, అత్త హైమావతి రెండు రోజులుగా కనిపించడం లేదని భాస్కరరావు శుక్రవారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం ఇరు వర్గాలను పోలీసులు పిలిపించి మాట్లాడారు. అయితే భవ్యశ్రీ విడాకులు కావాలని కోర్టులోనే తేల్చుకుంటామని పోలీసు అధికారుల వద్ద చెప్పి స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం సాయంత్రం భర్త భాస్కరరావు భార్య, అత్తలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. -
భార్యపై అనుమానం.. కత్తితో విచక్షణా రహితంగా..
సాక్షి, కృష్ణా : జిల్లాలోని నూజివీడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలం వేంకటాయపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వేంకటాయపాలెంకు చెందిన భుక్యా భీముడు తన భార్య కనకమ్మపై అనుమానంతో కత్తితో విచక్షణా రహితంగా పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన కనకమ్మ పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భుక్కా భీముని కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. -
అనుమానమే పెనుభూతమై..
సాక్షి, మొగల్తూరు: కట్టుకున్న భార్యపై అనుమానంతో భర్త దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన శని వారం మొగల్తూరు మండలం పేరుపాలెంలో జరిగింది. ఎస్సై కె.గురవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పేరుపాలెం నార్త్ పంచాయతీ కవురువారిపాలెంకు చెందిన గుబ్బల నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గుబ్బల ఏడుకొండలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన ఏడుకొండలు భార్యపై అనుమానం పెం చుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క త్తితో భార్యపై దాడి చేయడంతో మెడపైన, కుడికాలు, కుడి చేతిపై బలమైన గాయాలయ్యాయి. కుటుంబ స భ్యులు హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తరలిం చారు. బాధితురాలు తల్లి కట్టా సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గురవయ్య తెలిపారు. -
భార్యపై దాడి.. కూతురితో కలిసి ఆత్మహత్య
తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో శనివారం ఉదయం దారుణం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామచంద్రం కుటుంబ కలహాల కారణంగా భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలసి కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో రామచంద్రంతో పాటు చిన్న కూతురు మృతి చెందారు. కాగా దాడిలో గాయపడిన భార్యతో పాటు, పెద్దకూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.