
సాక్షి, కృష్ణా : జిల్లాలోని నూజివీడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలం వేంకటాయపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వేంకటాయపాలెంకు చెందిన భుక్యా భీముడు తన భార్య కనకమ్మపై అనుమానంతో కత్తితో విచక్షణా రహితంగా పొడిచి అక్కడినుంచి పారిపోయాడు.
తీవ్ర గాయాలపాలైన కనకమ్మ పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భుక్కా భీముని కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment