అనుమానమే పెనుభూతమై.. | Husband Attacks Wife With Knife Suspecting Her In West Godavari | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 10:32 AM | Last Updated on Sun, Apr 15 2018 10:32 AM

Husband Attacks Wife With Knife Suspecting Her In West Godavari - Sakshi

భర్త చేతిలో గాయపడిన నాగలక్ష్మి

సాక్షి, మొగల్తూరు: కట్టుకున్న భార్యపై అనుమానంతో భర్త దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన శని వారం మొగల్తూరు మండలం పేరుపాలెంలో జరిగింది. ఎస్సై కె.గురవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పేరుపాలెం నార్త్‌ పంచాయతీ కవురువారిపాలెంకు చెందిన గుబ్బల నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గుబ్బల ఏడుకొండలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇటీవల గల్ఫ్‌ నుంచి తిరిగివచ్చిన ఏడుకొండలు భార్యపై అనుమానం పెం చుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క త్తితో భార్యపై దాడి చేయడంతో మెడపైన, కుడికాలు, కుడి చేతిపై బలమైన గాయాలయ్యాయి. కుటుంబ స భ్యులు హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తరలిం చారు. బాధితురాలు తల్లి కట్టా సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గురవయ్య తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement