
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: మగపిల్లలు పుట‍్టలేదని.. పుట్టిన ముగ్గురు పిల్లలూ ఆడ పిల్లలేనని.. ఓ భర్త తను కట్టుకున్న భార్యపై అమానుషంగా వ్యవహరించాడు. కడుపులో వుంది మగబిడ్డా, ఆడబిడ్డా అనేది మహిళలకు సంబంధం లేకున్నా మగపిల్లవాడు కావాలంటూ మహిళలకు అవమానాలు, చీదరింపులు, చీత్కారాలు మాత్రం తప్పడం లేదు. యూపీలో ఓ భర్త తన భార్యపై మరుగుతున్న నీటిని పోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌కు సంజు అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి అదనపు కట్నం రూ. 50 వేలు తీసుకురావాలంటూ కొంతకాలంగా సత్యపాల్ భార్యను వేధిస్తున్నాడు. ప్రతి రోజూ ఇదే విషయంపై హిసించసాగాడు. మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్యపై ద్వేషం పెంచుకున‍్న సత్యపాల్ కొద్ది రోజులుగా సంజూకు భోజనం కూడా పెట్టడం లేదు. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 13న ఇంట్లో ఉన్న తన భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో పక్కనే స్టవ్‌పై మరుగుతున్న వేడినీటిని ఆమెపై పోశాడు. దీంతో సంజూ తీవ్రంగా గాయపడటంతో గమణించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment