harrassement case
-
కీచకపర్వం.. మంగళగిరిలో ఏం జరుగుతోంది?
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడా చూసినా అత్యాచారాలు, హత్యలు, దాడులే కనిపిస్తున్నాయి. మొన్నటి ముచ్చమర్రి ఘటనతో మొదలైన అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది.కాగా, ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ దారుణాలపై ట్విట్టర్లో..‘మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు. నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో శాంతి భద్రతను గాలికొదిలేసి.. కామాంధులకి లైసెన్స్ ఇచ్చేశావా నారా లోకేష్’ అని ప్రశ్నించింది. మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించిన కామాంధులు24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి కామాంధులు యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న…— YSR Congress Party (@YSRCParty) September 14, 2024ఇదిలా ఉండగా.. ఏపీలో రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతల అంశం గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందోననే భయంలో ప్రజలు ఉన్నారు. వరుసగా అఘాయిత్యాల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ముచ్చుమరి ఘటన నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ దారుణాల వరకు బాధితులకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
'సార్ వద్దు.. నన్ను అలా పిలువు! నా కోరిక తీర్చవా? అంటూ మహిళా ఉద్యోగితో..
సాక్షి, సిద్దిపేట: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా స్థాయి అధికారి కింది స్థాయి మహిళా ఉద్యోగితో అస్యభంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేక.. నిత్యం లైంగిక వేధింపులు భరించలేక సదరు మహిళ లోలోపలే కుమిలిపోతోంది. జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన వీడియో కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్ వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగినిని ద్వితీయ స్థాయి అధికారి తనను పెళ్లి చేసుకోవాలంటూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆయనకు 50 ఏళ్లు, పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 22 ఏళ్ల వయసు ఉండే మహిళా వైద్యురాలిపై కన్నేసి ఆమెకు రాత్రి వేళల్లో ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ‘సర్ అనకు.. నన్ను మామయ్య అను’.. ‘వీడియో కాల్ చేస్తే కనబడవా.. చిన్న కోరిక కూడా తీర్చవా’.. ‘నీవు రెడీ అంటే.. పెళ్లి చేసుకుంటా..’ అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. అధికారి వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేధైర్యంలేక ఆమె ఆవేదన చెందుతోందని అక్కడి ఉద్యోగుల నుంచి సమాచారం. ఆయన గతంలో పనిచేసిన చోట కూడా ఇలానే ప్రవర్తించాడని కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆ అధికారిపై చర్యలు తీసుకుని ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. -
ట్రైన్లో మహిళకు వేధింపులు.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు!
భోపాల్: రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ మహిళను వేధించారనే కారణంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైన ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో గురువారం జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సునీల్ సరాఫ్(కోట్మా నియోజకవర్గం), సిద్దార్థ కుశ్వాహా(సాట్నా నియోజకవర్గం)లు రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏసీ కోచ్‌లో గురువారం ప్రయాణం చేశారు. మద్యం మత్తులో వారు కర్నీ స్టేషన్లో ట్రైన్ ఎక్కారు. అదే కోచ్‌లో ఓ మహిళ తన శిశువుతో ప్రయాణం చేస్తోంది. ఎమ్మెల్యేలు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారి ప్రవర్తనపై భర్తకు ఫోన్ ద్వారా తెలియజేసింది. ఏసీ కోచ్‌లో ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ రైల్వే శాఖ, రైల్వే పోలీసులకు ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు బాధితురాలి భర్త. ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు ట్రైన్‌లోకి వెళ్లి మహిళ బెర్త్‌ను మార్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఎల్ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? -
పెచ్చుమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు
నెల్లూరు (క్రైమ్) : లోన్ యాప్స్‌కు చెందిన రికవరీ ఏజెంట్ల వేధింపులు మితిమీరుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ప్రజాప్రతినిధులను వదలడంలేదు. ‘‘మీ బంధువులు/స్నేహితులు రుణం తీసుకున్నారు.. దానికి మీరే చెల్లింపులు చేయాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. వారెవరో తమకు తెలియదని చెబుతున్నప్పటికీ మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. సరిగ్గా ఈలాంటి అనుభవమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత మంత్రి, మాజీమంత్రికి ఎదురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖులకు సైతం రికవరీ ఏజెంట్లు ఫోనుచేసి బెదిరిస్తున్న వైనంపై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. వివరాలివీ.. పదేపదే ఫోన్లుచేసి.. చెన్నైలోని కోల్మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరు రామలింగాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థ పాతపాటి అశోక్‌కుమార్‌కు రూ 8.5 లక్షలు రుణమిచ్చింది. అతను తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెన్సీకి సదరు సంస్థ అతని ఫోను నంబర్‌ను ఇచ్చింది. ఏజెన్సీ మేనేజర్లు గురుప్రసాద్‌రెడ్డి, మహేంద్రన్, పెంచలరావు, టీం లీడర్ మాధురివాసులు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను సేకరించారు. ఈనెల 25న మంత్రి కాకాణి గోవర్థనరెడ్డికి ఫోనుచేశారు. ఆయన ఫోను తన పీఏ శంకరయ్య వద్ద ఉండడంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. టీం లీడర్ మాధురివాసు ప్రియాంకగా పేరుమార్చి అసభ్యకరంగా మాట్లాడి అతని నుంచి రూ.25వేల నగదు తీసుకుంది. దీంతో పీఏ ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదుచేసి నలుగురు నిందితులను అరెస్టుచేశారు. మాజీమంత్రికి సైతం.. మరోవైపు.. మాజీమంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాతపాటి అశోక్‌కుమార్ రుణం తీసుకున్నాడని.. ఆ రుణం చెల్లించాలంటూ అనిల్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డు ఆడియో సోషల్ మీడియాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు మాట్లాడుతూ.. జిల్లాలో మంత్రి, మాజీమంత్రికి ఫోన్లుచేసి బెదిరించిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఫోన్లు చేయకుండా ఇతరులకు ఫోనుచేసి బెదిరించడం చట్టరీత్యా నేరమన్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎవరికైనా ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్ -
నిత్య పెళ్లికొడుకు సహా నలుగురిపై కేసు
పెద్దతిప్పసముద్రం: ముగ్గురు మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్న నిత్యపెళ్లికొడుకు సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన టీడీపీ నాయకుడు దండుపల్లె మంజునాథ్ (32) ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతడి మోసాల గురించి తెలుసుకున్న వారిలో ఇద్దరు భార్యల ఆవేదనపై ఆదివారం ‘సాక్షి’లో ‘ఆ టీడీపీ నేత...నిత్య పెళ్లికొడుకు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కర్ణాటక రాష్ట్రం దావణగెరెకు చెందిన మూడో భార్య ఎస్.ప్రియాంక ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు మంజునాథ్‌తో పాటు మూడు పెళ్లిళ్లకు సహకరించిన అత్త, మామ, ఆడపడుచు అయిన వెంకట్రమణ, వెంకట్రమణమ్మ, మమతపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 495, 498ఏ, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కర్ణాటక వాసులు ఆరుగురి వచ్చి నవాబుకోటలో మంజునాథ్ ఇంటి ఎదుట బైఠాయించి వాదులాటకు దిగారని తనకు ఫోన్ రావడంతో సిబ్బందితో వెళ్లి విచారించినట్లు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై మూడో భార్య ప్రియాంక ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయాన్ని కూడా విచారిస్తామని తెలిపారు. తనకు ఇంతకుముందే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తూ రెండో భార్య ఆశ ఈ నెల 11న కర్ణాటక చిక్బళ్లాపురంలోని మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ కేసు నమోదైందని చెప్పారు. -
మగబిడ్డ పుట్టలేదని మరుగుతున్న నీటిని భార్యపై పోసిన కసాయి
లక్నో: మగపిల్లలు పుట్టలేదని.. పుట్టిన ముగ్గురు పిల్లలూ ఆడ పిల్లలేనని.. ఓ భర్త తను కట్టుకున్న భార్యపై అమానుషంగా వ్యవహరించాడు. కడుపులో వుంది మగబిడ్డా, ఆడబిడ్డా అనేది మహిళలకు సంబంధం లేకున్నా మగపిల్లవాడు కావాలంటూ మహిళలకు అవమానాలు, చీదరింపులు, చీత్కారాలు మాత్రం తప్పడం లేదు. యూపీలో ఓ భర్త తన భార్యపై మరుగుతున్న నీటిని పోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌కు సంజు అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి అదనపు కట్నం రూ. 50 వేలు తీసుకురావాలంటూ కొంతకాలంగా సత్యపాల్ భార్యను వేధిస్తున్నాడు. ప్రతి రోజూ ఇదే విషయంపై హిసించసాగాడు. మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్యపై ద్వేషం పెంచుకున్న సత్యపాల్ కొద్ది రోజులుగా సంజూకు భోజనం కూడా పెట్టడం లేదు. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 13న ఇంట్లో ఉన్న తన భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో పక్కనే స్టవ్‌పై మరుగుతున్న వేడినీటిని ఆమెపై పోశాడు. దీంతో సంజూ తీవ్రంగా గాయపడటంతో గమణించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. -
గిరిజన విద్యార్థినిపై లైంగిక వేధింపులు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ప్రాక్టికల్, పరీక్ష రాయడానికి వచ్చిన గిరిజన విద్యార్థినీని ఓ కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె శనివారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివి.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దరి మారుమూల గిరిజన తండాకు చెందిన నర్సింగ్ విద్యార్థిని కాకినాడలో మూడో సంవత్సరం చదువుతోంది. ప్రాక్టికల్స్, పరీక్షల కోసం గాజువాక షీలా నగర్‌లోని మదర్ థెరిస్సా నర్సింగ్ కళాశాలకు వెళ్లాలని యాజమాన్యం సూచించింది. ఇటీవల పరీక్షలు రాయడానికి వచ్చిన ఆ విద్యార్థినీని కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వెంకటరావు లైంగిక వేధింపులకు గురి చేశాడు. తను చెప్పినట్లు నడుచుకోకపోతే.. పాస్ అవ్వకుండా చేస్తానని బెది రించాడు. ఒకే రోజు మూడుసార్లు ఒళ్లం తా మసాజ్ చేయించుకున్నాడని, కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడని విద్యార్థిని వాపోయింది. ఆమె తన సోదరుడి సాయంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రిన్సిపాల్ వెంకటరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరీ ప్రేమ వేధింపులు
సాక్షి, జూబ్లీహిల్స్: ప్రేమించాలంటూ వివాహిత వైద్యురాలిని వేదిస్తున్న ఓ వ్యక్తి.. ఆమె ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఇదెలా సాధ్యమయ్యిందో వైద్యురాలికి అంతు పట్టలేదు. చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి వైద్యురాలు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తుందో తెలుసుకునేదుకు ఏకంగా ఆమె కారుకు జీసీఎస్ ట్రాకర్‌ను అమర్చినట్లు వెల్లడించాడు. ఆ వివరాలు.. బాధితురాలు జూబ్లీహిల్స్‌లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ వైద్యురాలిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా విశ్వనాథ్ తన తీరు మార్చుకోలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో వైద్యురాలు దీని గురించి తన భర్తకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యురాలి భర్త విశ్వనాథ్‌ని హెచ్చరించడం కోసం అతడి ఇంటికి వెళ్లాడు. విశ్వనాథ్ ఇంట్లో అతడితో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. తమను హెచ్చరించడానికి వచ్చిన వైద్యురాలి భర్తపై విశ్వనాథ్, అతడి స్నేహితుడు శ్రీకాంత్ గౌడ్ ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో వైద్యురాలు, ఆమె భర్త విశ్వనాథ్ మీద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో సంచలన విషయాలు తెలిసాయి. వైద్యురాలిని వెంటాడేందుకు విశ్వనాథ్ ఆమె కారుకు జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చినట్లు వెల్లడించాడు. చదవండి: ‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’ -
పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం
బోసి నవ్వులు కురిపిస్తున్న ఆ పసిబిడ్డను చంపడానికి ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో.. తన పోలికలతో లేడంటూ అత్యంత కిరాతకంగా ఆ చిన్నారి ప్రాణాలు తోడేశాడు. నేలకేసి కొట్టి.. ఆపై గొంతుమీద కాలేసి తొక్కి పసివాడి ఉసురుతీశాడు. అనుమానం పెనుభూతమై.. అతడిని రాక్షసుడిని చేసింది.. రాచర్ల: రాచర్లకు చెందిన గుమ్ముళ్ల చిన్న పుల్లయ్య.. 2009లో అర్థవీడు మండలం, మొహిద్దీన్‌పురానికి చెందిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, ఒక కుమార్తె సంతానం. 2011లో పుట్టింటికి వెళ్లి రెండో సంతానానికి జన్మనిచ్చిన లక్ష్మీదేవి బాలింతగా ఉండగానే ఆమెపై అనుమానం పెంచుకుని.. కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసులో అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక 2017లో వెఎస్సార్ జిల్లా రామాపురానికి చెందిన రమాదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. బేల్దారి పనులు, కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఎనిమిది నెలల కుమారుడు రేవంత్ ఉన్నాడు. బిడ్డ పుట్టినప్పట్నుంచి.. తన పోలికలతో లేడని నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం రాత్రి ఇదే విషయంపై మళ్లీ వేధించాడు. శనివారం ఉదయం కూడా భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంచంపై ఉన్న రేవంత్‌ను తీసుకుని నేలకేసి కొట్టాడు. అది చాలదన్నట్టు గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. కన్న బిడ్డను కళ్ల ముందే చంపేస్తుండటం చూసి హతాశురాలైన రమాదేవి కేకలు వేస్తూ ఇరుగు పొరుగును పిలిచింది. దీంతో మరింత రెచ్చిపోయిన పుల్లయ్య పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని ఆమె తలపై బలంగా మోదాడు. తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేస్తూ వీధిలోకి వచ్చి కుప్పకూలిపోయింది. బిడ్డ అప్పటికే మరణించాడు. అది చూసి పుల్లయ్య అక్కడ నుంచి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న రమాదేవిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రమాదేవి సోదరులు శ్రీరాములు, అంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని రమాదేవి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ సుధాకర్‌రావు చెప్పారు. -
శ్రీచైతన్య కళాశాల విద్యార్థికి వేధింపులు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్లో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్న ఘాతుకం విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తున్నారంటూ యశ్వంత్‌తోపాటు మరికొంత మంది విద్యార్థులను ప్రిన్సిపాల్, లెక్చరర్లు కొంతకాలంగా హింసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం టిప్పర్ల బజార్లో ఓ కారు అద్దాలు పగిలితే దానికి కారణం యశ్వంత్ అని యశ్వంత్‌ను శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ హింసించాడు. అది తట్టుకోలేని యశ్వంత్ బయటకు వెళ్లి నిద్రమాత్రలు తెచ్చుకుని మింగి నిద్రపోయాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ వెంటనే తమ కళాశాలలో విద్యార్థులు మత్తుపదార్థాలు తీసుకున్నారని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు యశ్వంత్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఉన్న రూమ్‌లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయబోగా వారు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కళాశాల సిబ్బంది యశ్వంత్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన యశ్వంత్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యశ్వంత్ తల్లి మస్తానమ్మకు కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, మీ కుమారుడు కాలేజీలో నిద్రపోతున్నాడని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. కంగారు పడిన మస్తానమ్మ భర్తను వెంటపెట్టుకుని కళాశాలకు రాగా అప్పటికే విద్యార్థులను పోలీసులు తీసుకెళ్తుండడం చూసి, అడ్డుపడింది. అయినా పట్టించుకోకుండా పోలీసులు విద్యార్థులను స్టేషన్‌కు తరలించారు. తమ తోటి విద్యార్థులను అన్యాయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లడాన్ని చూసి ఆగ్రహించిన ఇతర విద్యార్థులు కళాశాల ఆద్దాలు పగలకొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యార్థులను కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించామని పట్టణ సీఐ నరేష్కుమార్ చెప్పారు. పోలీసులు ఎవరినీ కొట్టలేదని అన్నారు. -
‘ఆ కోచ్‌కు ఎక్కడా జాబ్ ఇవ్వొద్దు’
న్యూఢిల్లీ: ఓ మైనర్ గర్ల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ గోవా స్మిమ్మింగ్ కోచ్ సురజిత్ గంగూలీపై వేటు పడింది. తనపై సురజిత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మైనర్ బాలిక ఫిర్యాదుకు కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. అతనిపై చర్యలకు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు రిజుజు ఆమెకు హామీ ఇచ్చారు. అదే సమయంలో సురజిత్‌కు భారత్‌లో ఎక్కడా కూడా స్విమ్మింగ్ కోచ్‌గా పదవి ఇవ్వొద్దంటూ స్విమ్మింగ్ ఫెడరేషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇప్పటికే గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. దేశంలో ఎక్కడా అతనికి ఉద్యోగం లేకుండా స్విమ్మింగ్ ఫెడరేషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఇది అన్ని ఫెడరేషన్లకు వర్తిస్తుంది. క్రమశిక్షణా నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదు’ అని రిజుజు తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నారు. రెండున్నరేళ్ల క్రితం సురజిత్ గంగూలీని స్విమ్మింగ్ కోచ్‌గా గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ నియమించింది. సురజిత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉన్న కారణంగానే అతన్ని కోచ్‌గా ఎంపిక చేశారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో సురజిత్ 12 పతకాలు సాధించారు. 1984లో హాంకాంగ్‌లో జరిగిన ఆసియా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో సురజిత్ తొలి పతకం గెలుచుకున్నారు. అయితే తాజాగా మైనర్ బాలికపై సురజిత్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతనిపై వేటు పడింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సురజిత్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. I've taken a strong view of the incident. The Goa Swimming Association has terminated the contract of coach Surajit Ganguly. I'm asking the Swimming Federation of India to ensure that this coach is not employed anywhere in India. This applies to all Federations & disciplines. https://t.co/q6H1ixZVsi — Kiren Rijiju (@KirenRijiju) September 5, 2019 -
చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై న్యాయ విద్యార్థి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును స్యుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు బాధిత యువతి తన ఎల్ఎల్ఎం కోర్సును కొనసాగించేందుకు వీలుగావేరే కాలేజీకి బదిలీ చేయాలని యోగి ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఐజీ స్థాయి పోలీసు అధికారి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించాలని సూచించింది. అనంతరం కేసును అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం బదిలీ చేసింది. అలాగే బాధితురాలితో పాటు, ఆమె తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. న్యాయమూర్తుల బృందం గురువారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు లేఖ రాయడంతో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చేపట్టింది. కాగా బీజేపీ నాయకుడు చిన్మయానంద్‌పై చిన్మయానంద్‌కు చెందిన లా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసిన అనంతరం కనిపించకుండా పోయింది. చివరకు న్యాయవాదులు, కోర్టుల జోక్యంతో ఆమెను రాజస్థాన్‌లో గుర్తించారు పోలీసులు. అనంతరం గత శుక్రవారం సుప్రీంకోర్టులో హాజరుపరిచారు. అయితే తనను తాను రక్షించుకునే క్రమంలో తన ముగ్గురు కళాశాల సహచరులతో కలిసి షాజహాన్‌పూర్ నుంచి పారిపోయానని బాధిత యువతి న్యాయమూర్తులకు తెలిపిన సంగతి విదితమే. చదవండి : మాజీ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు చిన్మయానంద్‌పై ఆరోపణలు చేసిన యువతి ఆచూకీ లభ్యం -
ప్రేమ పేరుతో బెదిరింపుల కారణంగానే...
సాక్ష, ఇల్లెందు(ఖమ్మం): పట్టణంలోని నెంబర్–2 బస్తీకి చెందిన ఎం.సంధ్య(19) ఆత్మహత్యకు ఓ యువకుడి వేధింపులు, బెదిరింపులే కారణమని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆమె సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పి భరించలేకనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదంటూ అదే రోజు రాత్రి తండ్రి శ్రీనివాస గౌడ్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత, తన కుమార్తె ఆత్మహత్యకు ఓ యువకుడి వేధింపులు, బెదిరింపులే కారణమంటూ మరోసారి ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం, ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ప్రధాన రహదారిపై ఆమె కుటుంబీకులు బైఠాయించారు. ఇల్లెందు పట్టణంలోని నెంబర్–2 బస్తీకి చెందిన సిద్ధూ అనే యువకుడి వేధింపులు, ప్రేమ పేరుతో బెదిరింపుల కారణంగానే సంధ్య ప్రాణం తీసుకుందని ఆరోపించారు. ఆమె తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. -
వేధింపుల కేసు: బీజేపీ చీఫ్ కుమారుడికి బెయిల్
సాక్షి, చండీగఢ్: యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాకు బెయిల్ మంజూరైంది. గతంలో కింది కోర్టులో నాలుగుసార్లు వికాస్ బెయిల్ పిటీషన్ కొట్టివేయగా, ఐదోప్రయత్నంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా ఎట్టకేలకు బెయిల్ లభించింది. యువతి కారు అడ్డగింత, వేధింపులు, కిడ్నాప్ యత్నం కేసులో గతేడాది ఆగస్టు 9న వికాస్‌ను, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు బాధితురాలు వర్ణికా కుందును బరాలా కౌన్సిల్ దాదాపు ఐదు గంటలపాటు కొన్ని వందల ప్రశ్నలు అడిగారు. అనంతరం రెండు రోజులకు గురువారం నిందితుడు వికాస్ బరాలకు పంజాబ్, హర్యానాల ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది ఆగస్టు 4న చండీగఢ్‌లోని సెక్టార్ 8లో వర్ణికా కుందు తన కారులో వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్‌తో కలిసి తమ ఎస్యూవీ వాహనంతో 8 కిలోమీటర్లు ఫాలో అవుతూ వెంబడించి వేధించారు. పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయగా వారు అక్కడికి చేరుకుంటుండగా వికాస్, ఆశిష్‌లు తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఆ మరుసటిరోజు రాత్రి జరిగిన వేధింపులు, కిడ్నాప్ యత్నం ఘటనను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై 354డీ తోపాటు మోటారు వెహికల్ యాక్ట్‌లోని ఐపీసీ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. -
ఎంపీ రాజయ్యపై వేధింపుల కేసు
వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు, ఆయన కుటుంబంపై వేధింపుల కేసు నమోదైంది. సికింద్రాబాద్ బేగంపేట మహిళా పోలీస్టేషన్లో రాజయ్య కోడలు సారిక ఈ కేసు పెట్టారు. 2006లో రాజయ్య కుమారుడు అనిల్‌తో ఆమెకు వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. ఈ మధ్య కాలంలో అనిల్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీంతో అనిల్ కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడు అనిల్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యుల పై నాంపల్లి కోర్టులో సారిక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నాంపల్లి ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులతో బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు ..రాజయ్య కుటుంబంపై వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని బేగంపేట ఏసీపీ మనోహర్ తెలిపారు.