సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడా చూసినా అత్యాచారాలు, హత్యలు, దాడులే కనిపిస్తున్నాయి. మొన్నటి ముచ్చమర్రి ఘటనతో మొదలైన అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది.
కాగా, ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ దారుణాలపై ట్విట్టర్‌లో..‘మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్‌లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు. నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో శాంతి భద్రతను గాలికొదిలేసి.. కామాంధులకి లైసెన్స్ ఇచ్చేశావా నారా లోకేష్’ అని ప్రశ్నించింది.
మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం
నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్‌లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించిన కామాంధులు
24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి కామాంధులు యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న…— YSR Congress Party (@YSRCParty) September 14, 2024
ఇదిలా ఉండగా.. ఏపీలో రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతల అంశం గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందోననే భయంలో ప్రజలు ఉన్నారు. వరుసగా అఘాయిత్యాల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ముచ్చుమరి ఘటన నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ దారుణాల వరకు బాధితులకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది.
ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment