సాక్షి, సిద్దిపేట: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా స్థాయి అధికారి కింది స్థాయి మహిళా ఉద్యోగితో అస్యభంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేక.. నిత్యం లైంగిక వేధింపులు భరించలేక సదరు మహిళ లోలోపలే కుమిలిపోతోంది. జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన వీడియో కలకలం రేపుతోంది.
సిద్దిపేట జిల్లాలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్ వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగినిని ద్వితీయ స్థాయి అధికారి తనను పెళ్లి చేసుకోవాలంటూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆయనకు 50 ఏళ్లు, పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 22 ఏళ్ల వయసు ఉండే మహిళా వైద్యురాలిపై కన్నేసి ఆమెకు రాత్రి వేళల్లో ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు.
‘సర్ అనకు.. నన్ను మామయ్య అను’.. ‘వీడియో కాల్ చేస్తే కనబడవా.. చిన్న కోరిక కూడా తీర్చవా’.. ‘నీవు రెడీ అంటే.. పెళ్లి చేసుకుంటా..’ అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు.
అధికారి వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేధైర్యంలేక ఆమె ఆవేదన చెందుతోందని అక్కడి ఉద్యోగుల నుంచి సమాచారం. ఆయన గతంలో పనిచేసిన చోట కూడా ఇలానే ప్రవర్తించాడని కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆ అధికారిపై చర్యలు తీసుకుని ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment