సంగారెడ్డి: పిల్లలు లేరనే బాధతో ఆరు నెలల పాపను ఎత్తుకెళ్లిన సంఘటన సంగారెడ్డిలో జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడిని 24గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు డీఎస్పీ రమేష్ కుమార్ శనివారం వెల్లడించారు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన దంపతులు వల్లేపు రాజు, యేసుమని తమ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి చెకప్ కోసం తరచూ వస్తుండేవారు.
శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన వారు రాత్రి పాత బస్టాండ్ సమీపంలోని గంజి మైదాకు వెళ్లి అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో నిద్రించారు. ఆ పక్కనే గద్దైపె పట్టణానికి చెందిన మన్నే అనిల్, అతని స్నేహితుడు శ్రీశైలం మద్యం సేవిస్తున్నారు. అయితే అనిల్‌కు పెళ్లయ్యి ఏడేళ్లవుతున్నా పిల్లలు లేరనే బాధతో పక్కనే నిద్రిస్తున్న చిన్నారి రూపని తన స్నేహితుడి సహాయంతో ఎత్తుకెళ్లాడు.
తెల్లారి నిద్రలేచే సరికి పాప కనిపించకపోవడంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, అతని స్నేహితుడు శ్రీశైలం పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కిడ్నాప్ కేసును చాకచక్యంగా ఛేదించిన పట్టణ సీఐ శ్రీధర్రెడ్డి, రూరల్ సీఐ సుధీర్ కుమార్, ఇన్‌స్పెక్టర్ మహేష్‌లను అభినందించారు. అలాగే మరో ముగ్గురు కానిస్టేబుళ్లు శాఖీర్, మల్లారెడ్డి, శేఖర్‌కు నగదు పురస్కారం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment