breaking news
Siddipet District Latest News
-
పశువైద్యాధికారిపై వేటు
నూతనంగా కొండల్‌రెడ్డి నియామకం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా ఇన్చార్జి పశువైద్య, పశు సంవర్థకశాఖ అధికారిగా కొండల్‌రెడ్డిని నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ సూపరింటెండెంట్ పూర్ణిమ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగపూర్ణచందర్రావు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తదితర అంశాలపై వరుసగా సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారించి నాగపూర్ణచందర్రావును బాధ్యతల నుంచి తొలగించారు. ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేసి, కోడ్ ముగిసిన తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ‘విద్య నా హక్కు. బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం’ అని నినాదంతో ముందుకు వెళదామన్నారు. గత ప్రభుత్వం హయాంలో మూసివేసిన ఆరు వేల పాఠశాలలను తెరిపించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులను విద్య కోసం కేటాయించాలన్నారు. కవికి కీర్తి రత్న పురస్కారం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి వెంకటేశం కీర్తి రత్న పురస్కారం అందుకున్నట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘అందమైనది నాదేశం’ గేయానికి గాను భ వాని సాహిత్య వేదిక నిర్వాహకులు కీర్తి రత్న పురస్కారంతో పాటుగా ఘనంగా సన్మానించారన్నారు. వెంకటేశంకు జిల్లా కవులు బస్వరాజ్‌కుమార్, కాల్వ రాజయ్య, కోణం పర్శరాములు, తదితరులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఆహ్వానం సిద్దిపేటజోన్: సిద్దిపేట బల్దియా పరిధిలో రంగధాంపల్లి హనుమాన్ దేవాలయం వద్ద జరిగే దసరా వేడుకలకు హాజరుకావాలని ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా దసరా ఏర్పాట్లు గూర్చి అరా తీశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వార్డు ప్రతినిధులు తిరుమల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కనకయ్య, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు. జోరు తగ్గని మంజీరాపాపన్నపేట(మెదక్): మంజీరా నది వరదలు సోమవారం సైతం కొనసాగుతున్నాయి. ఘనపురం అనకట్టపై నుంచి సుమారు 1.06 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవిహిస్తోంది. దీంతో దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. అయితే ఎల్లాపూర్ బ్రిడ్జి, ఏడుపాయల బ్రిడ్జిపై నీటి ప్రవాహం తగ్గడంతో వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. -
స్థానిక సమరమే..
కోడ్ కూసె.. పోరు ఎగిసెపల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ రావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో బరిలోకి దిగాలని భావిస్తున్న నేతలు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు దసరా పండుగల సందర్భంగా విందులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. – సిద్దిపేటజోన్ -
పుస్తక రూపిణి.. వివేకధాత్రి
వర్గల్ సరస్వతిదేవి నిజరూపదర్శనం ● వైభవంగా ‘మూల’ మహోత్సవం ● లక్ష పుష్పార్చన, మహా పుస్తకపూజ ● భారీగా చిన్నారులకు అక్షరాభ్యాసాలువర్గల్(గజ్వేల్): పుస్తక రూపిణి..వివేకధాత్రి.. విద్యాసరస్వతిదేవి నిజరూప దర్శనం భక్తజనావళిని మంత్రముగ్ధులను చేసింది. శంభుని కొండ అమ్మవారి స్మరణతో మార్మోగింది. విశేషాభరణాలు, నవరత్న మణిమయ స్వర్ణకిరీటంతో పుస్తకరూపిణి దివ్యదర్శనం..ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన ఈ అపూర్వఘట్టం సోమవారం వర్గల్ క్షేత్రంలో మూల మహోత్సవం సందర్భంగా ఆవిష్కృతమైంది. పీఠాధిపతులు విద్యాశంకరభారతి స్వామి, మాధవానందసరస్వతి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి ఆధ్వర్యంలో మూల నక్షత్ర వేడుకలు కొనసాగాయి. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తజన సామూహిక లక్ష పుష్పార్చన, మహాపుస్తక పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. పూర్ణకుంభస్వాగతం క్షేత్రం సందర్శించిన పుష్పగిరి, రంగంపేట పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి, మాధవానంద సరస్వతి స్వామిలకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అభిషేకాది పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో తరించారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.3,000పైగా అక్షర స్వీకారాలు మూల మహోత్సవం సందర్భంగా సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి కొనసాగింది. 3000 పైగా చిన్నారులు అక్షరస్వీకారాలు చేశారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
● ఎన్నికల షెడ్యూల్ విడుదల ● అక్టోబర్ 23, 27తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్ ● నవంబర్11న ఓట్ల లెక్కింపు,ఫలితాలు విడుదల ● మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్.. అదే రోజు ఫలితాలు
జిల్లాలోని గ్రామ పంచాయతీ(సర్పంచ్), మండల, జిల్లా ప్రాదేశిక సభ్యుల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) స్థానాలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్ జరుగనుంది. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎన్నికల ఫలితాలు నవంబర్11న విడుదల కానున్నాయి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలను అక్టోబర్ 31, నవంబర్4, 8 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్నారు. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలను పోలింగ్ రోజనే జరిగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. జెడ్పీటీసీ 26, ఎంపీటీసీ 230.. జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలతో పాటు 508 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 4508 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంసిద్ధమై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. ఇదే క్రమంలో ఈనెల 27న జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ గెజిట్ జిల్లా యంత్రాంగం అధికారికంగా విడుదల చేసింది. విడతల వారీగా ఎన్నికలు.. జిల్లాలోని 26 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను అక్టోబర్ 23, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతల్లో 15మండలాల్లో, రెండో విడతలో 11 మండలాల వారీగా ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. 508 పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో రెవెన్యూ డివిజన్ వారీగా ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. 23, 27 తేదీల్లో పోలింగ్.. జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు.. మొదటి విడత షెడ్యూల్ అక్టోబర్ 9న ఓటర్ల జాబితా, 11న అభ్యర్థుల నామినేషన్ తుది గడువు, 15న అభ్యర్థుల తుది జాబితా విడుదల, అక్టోబర్ 23న ఉదయం7నుంచి సాయంత్రం5 వరకు పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడనుంది. అదేవిధంగా రెండో విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 13న ఓటర్ల జాబితా విడుదల, 15 నామినేషన్ దాఖలు చివరి గడువు, 19న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, 27న పోలింగ్ జరగనుంది. మూడు విడతల్లో.. జిల్లాలోని 508 సర్పంచ్, 4,508 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ పోలింగ్, అదే రోజు ఫలితాలు విడుదల అవుతాయి. ఈ క్రమంలో మొదటి విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17న, రెండో విడత 21న, మూడో విడత 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ కొనసాగించనున్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు: కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, పంచాయతీ అధికారి దేవకీదేవి, డీఆర్డీఓ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
విశ్వబ్రాహ్మణులకూ రిజర్వేషన్లు కల్పించాలి
హుస్నాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే, విశ్వబ్రాహ్మణుల జనాభా ప్రకారం 5 శాతం సీట్లు తమకు కేటాయించాలని విశ్వనాథుల పుష్పగిరి డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయాల్లో తమ వంతు వాటా దక్కాలనే డిమాండ్‌తో ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం హుస్నాబాద్‌కు చేరుకుంది. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర 13 రోజులుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు రాజకీయాలలో ఎదిగితేనే జాతి మనుగడ సాధ్యమన్నారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు సదానందం, కార్యదర్శి శ్రీనివాస్, మనుమయ సంఘం అధ్యక్షుడు సదానందం, సుదర్శనంచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతి మాతగా విజయదుర్గ
కొండపాక(గజ్వేల్): మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఎనిదవ రోజున అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ మాతగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది బీఆర్ఎస్సేబతుకమ్మకు రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చింది బీఆర్ఎస్సేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతీ తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ విశిష్టతలను పెంచుతున్నారన్నారు. బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, దుర్గా మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశామన్నారు. -
పూల సింగిడి.. సద్దుల సందడి
● పల్లెపల్లెనా పూల పులకింత ● ఘనంగా బతుకమ్మ వేడుకలు ● ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలుజిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా పూలజాతర కనువిందు చేసింది. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ఆడిపాడిన మహిళలు, యువతులు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు ఆడిపాడారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని సద్దులను ఆరగించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, వివిధ కాలనీలలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని శాఖల అఽధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట) -
ఊరెళ్తున్నారా?.. జర భద్రం
తీసుకోవాల్సిన జాగ్రత్తలుసిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండుగల సెలవులు వచ్చాయి. వివిధ రకాల పనులు, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, పట్టణాల్లో స్థిరపడ్డారు. వరుస సెలువల నేపథ్యంలో పట్టణాల నుంచి తమ సొంత ఊర్ల బాట పట్టారు. ఇలాంటి సమయంలోనే దుండగులు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం సిద్దిపేటలో తాళం వేసిన షెటర్లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడిన నిందితులను సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఇంటికి తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లే వారు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం, నగదు ఇంట్లో ఉంచకూడదు పండుగ సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్తే.. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఉంచకూడదు. బ్యాంకు లాకర్లో భ్రదపర్చుకోవడం ఉత్తమం. పగటి సమయంలో గుర్తు తెలియని దుండగులు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి, టార్గెట్ చేసుకుని ఇంట్లోని బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారు. ఈ ఏడాది పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు తాళం వేసిన ఇళ్లు, దుకాణాల షెటర్లు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి వెళ్తే అప్రమత్తంగా ఉండాలి సమాచారం ఇవ్వాలి పండుగల సెలవుల వేళ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరుస సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి ఊరెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. దొంగతనాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. – సీహెచ్ కుశాల్కర్, అదనపు డీసీపీ అడ్మిన్ రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం వరుస సెలవుల నేపథ్యంలో పట్టణంలో, కాలనీల్లో రాత్రి వేళల్లో బ్లూకోల్ట్ సిబ్బందితో నిరంతరం నిఘా ఏర్పాటు చేశాం. అనుమానాస్పద వ్యక్తులను ఫింగర్ ఫ్రింట్ డివైజ్‌తో పరిశీలించనున్నాం. ప్రజలు సంతోషంగా బతుకమ్మ, దసరా పండగను జరుపుకోవాలి. – వాసుదేవరావు, సిద్దిపేట వన్ టౌన్ సీఐ -
శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం
● మహాచండీదేవిగా అమ్మవారు దర్శనం ● నేడు మూల మహోత్సవం మహాలక్ష్మి స్వరూపిణిగా.. విద్యుద్దీపాల వెలుగుల్లో వర్గల్ క్షేత్రంవర్గల్(గజ్వేల్): శంభునికొండ దేదీప్యమానమైంది. విద్యుత్ దీపాలతో వర్గల్ క్షేత్రం కాంతు లీనుతోంది. దసరాశరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి మహాభిషేకం, రాజోపచార, షష్ట్యుపచార పూజలు నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నేడు విశేషపూజలు, అక్షరస్వీకారాలు ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన మూల మహోత్సవానికి వర్గల్ క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా నిజరూప దర్శనమిస్తారు. రంగంపేట, పుష్పగిరి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, శ్రీవిద్యాశంకర భారతి స్వామి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. రోజంతా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. భారీసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కొండపాక(గజ్వేల్): మర్పడ్గలో విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు మహాలక్ష్మి స్వరూపిణిగా దర్శనం ఇచ్చారు. ఉదయం 6 గంటలకు క్షేత్రం నిర్వాహకులు చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మహిళలు లక్ష పుష్పార్పన చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు.అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి గజ్వేల్‌రూరల్: అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఎళ్లప్పుడూ ఉండాలని నాచారం క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామివారు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పట్టణంలోని మహంకాళీ దేవాలయంలో అమ్మవారు శాంభవిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న రాజశ్యామల ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మధుసూదనానంద సరస్వతి స్వామివారు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో కొంత సమయం దైవచింతనకు కేటాయించాలన్నారు. సామూహిక కుంకుమార్చన నంగునూరు(సిద్దిపేట): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు మహచండీగా దర్శనమిచ్చారు. బద్దిపడగలో వీరసావర్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. -
గొప్ప పండుగ
బతుకమ్మ చాలా గొప్ప పండుగ. పండుగ వచ్చిందంటే మహిళలు, పిల్లల్లో సంబరమే. నాకు 80 ఏళ్లు. అయినా ప్రతి ఏటా తప్పకుండా బతుకమ్మను పేరుస్తా. నా పిల్లలకు బతుకమ్మ పేర్చడం, పండుగ విశేషాలు నేర్పాను. 12 ఏళ్ల వయస్సు నుంచే బతుకమ్మ ఆడుతున్నా. – బిల్ల సరోజన, దుబ్బాక ఘనంగా నిర్వహిస్తాం సద్దుల బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తాం. పండుగకు ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి తల్లి గారింటికి రావడంతో ఇళ్లన్నీ సందడితో కళకళలాడుతాయి. బతుకమ్మ పండుగ ప్రతి ఏటా సంతోషాన్ని నింపుతుంది. – ఎర్రగుంట సుజాత, కవయిత్రి లచ్చపేట పోటాపోటీగా పేర్చేటోళ్లం మేము చిన్నతనంలో సద్దుల బతుకమ్మను పోటీపడి పెద్దగా పేర్చేటోళ్లం. పండుగకు ఒక రోజు ముందే అడవికి వెళ్లి గునుగు పువ్వు కోసుకొచ్చేవాళ్లం. ఇప్పుడు సద్దుల బతుకమ్మను చిన్నగా పేర్చుతుండ్రు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. – స్వాతి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు -
పెంపుడు జంతువులపై అప్రమత్తత అవసరం
జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖాధికారి పూర్ణచందర్రావు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పెంపడు జంతువుల పట్ల అప్రమత్తతంగా ఉండాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అఽధికారి పూర్ణచందర్రావు అన్నారు. ప్రపంచ రేబీసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో పెంపుడు జంతువులకు టీకాలు వేశారు. పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పెంపుడు జంతువులకు వ్యాధులు సంక్రమించినపుడు తప్పనిసరిగా చికిత్స చేయించాలన్నారు. జిల్లాలోని అన్ని పశువైద్యశాలల వద్ద సిబ్బంది చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. -
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కొనుగోళ్లదారులతో కిటకిటలాడుతున్న సిద్దిపేట పట్టణంలోని సుభాష్‌రోడ్డు ఊరూరా పూలవనాలు.. ఉవ్వెత్తున సంబురాలుబతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఎటు చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే దేవతగా కొలిచే అరుదైన ఈ పండుగలో పేద, ధనిక తారతమ్యాలు లేకుండా మహిళలు, ఆడపడుచులు పాల్గొంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ సంబరాలు జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన ఈ ఉత్సవాలలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. –ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/దుబ్బాకఆటపాటలతో హోరెత్తుతున్న పల్లెలు, పట్టణాలు నేడే సద్దుల బతుకమ్మ -
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గడువు లేదు
జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ప్రశాంత్‌నగర్( సిద్దిపేట): వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువును ప్రభుత్వం విధించలేదన్నారు. సెప్టెంబరు 30లోగా హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకుంటే రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారనే సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వాహనదారులు నమ్మవద్దన్నారు. మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అనుపమ చక్రవర్తి ఆదివారం దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్జి జస్టిస్ సాధన, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకిలో నాకాబందీ బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి –కల్లెపెల్లి రోడ్డులో ఎస్ఐ సౌజన్య ఆధ్వర్యంలో ఆదివారం నాకాబందీ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు పరిశీలించారు. నిబంధన లు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. గణేశ్‌కు నిఫా పురస్కారం తొగుట(దుబ్బాక): అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నిఫా (నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ యాక్టివిస్ట్) సిల్వర్ జూబ్లీ జిల్లా స్థాయి అవార్డును మండల పరిధిలోని వెంకట్రావుపేటకు చెందిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, సామాజిక కార్యకర్త బండకాడి గణేశ్ అందుకున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి బండి సంజయ్ నుంచి ఆదివారం కరీంనగర్లో అందుకున్నారు. గణేష్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన నిఫా రాష్ట్ర అధ్యక్షుడు యాదవ రాజుతో పాటు టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
బోర్డులే దర్శనం.. మైదానాలు నిరుపయోగం
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక, సరైన వసతులు లేక బోర్డులకే పరిమితమయ్యాయి. ముళ్ల పొదలు, చెత్తా చెదారంతో దర్శన మిస్తున్నాయి. దీంతో లక్షల నిధులు వృథాగా అయ్యాయి. కొన్ని క్రీడా ప్రాంగణాల్లో వసతులు లేక క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో క్రీడా సామగ్రి కనిపించక కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉత్కంఠకు తెర
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేన్లు ఖరారుసాక్షి, సిద్దిపేట: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఉత్కంఠకు తెర పడింది. జిల్లాలోని సర్పంచ్‌లు 508, ఎంపీటీసీలు 230, వార్డు సభ్యులు 4,508, జెడ్పీటీసీలు 26లకు రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. శనివారం జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్లను కలెక్టరేట్లో, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఎదుట 50శాతం మహిళలకు సంబంధించిన డ్రాను తీశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఏమి ఉండబోతున్నాయో అని ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీసీలకు 11 జెడ్పీటీసీలు జిల్లా వ్యాప్తంగా 26 జెడ్పీటీసీలు, ఎంపీపీలుండగా అందులో 11 బీసీలు, ఎస్సీలకు 5, అన్ రిజర్వ్ 9, ఎస్టీలకు ఒకటి కేటాయించారు. జనరల్‌కు 15, మహిళలకు 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీపీలు అన్ రిజర్వ్‌కు 9 కేటాయించగా జనరల్‌కు 5, మహిళలకు 4, బీసీలకు 11 కేటాయించగా జనరల్‌కు 6, మహిళలకు 5, ఎస్సీలకు ఐదు కేటాయించగా జనరల్ 3, మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.పలువురికి నిరాశ రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పలువురు రాజకీయ నాయకులు నిరాశ చెందారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఆశావహులకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసుకున్నారు. పలువురు ఆశావహులకు రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో డైలామలో పడ్డారు. గత ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పట్టుసాధించుకున్న నేతలు.. రిజర్వేషన్లు తారుమారు కావడంతో తలలు పట్టుకుంటున్నారు. అలాగే కొన్ని మండలాల్లో కొత్త లీడర్లు, వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడమే మిగిలి ఉంది. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్ సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో 11 మండలాల్లో గెలిచే జెడ్పీటీసీలలో ఒక్కరికి చైర్మన్ దక్కే అవకాశం ఉండనుంది. -
ఒక్కేసి పువ్వేసి చందమామ
ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలుసిద్దిపేటరూరల్: జిల్లా అధికార యంత్రాంగం కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కలిసి మహిళల ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ప్రపంచంలోనే పువ్వులను పూజించే ఏకై క పండగ బతుకమ్మ పండగ అని కలెక్టర్ చెప్పారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఎప్పుడు ఆఫీస్ పనులతో బిజీగా ఉండే ఉద్యోగస్లుఉ సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కాగా, బతుకమ్మ పండుగ విశిష్టతపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించిన ఇ.సాయి సంతోషి, డి.సృజన, జి.మనస్వినిలకు, షార్ట్ ఫిలిం కాంపిటేషన్ విజేత గిరిబాబులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ హబ్‌గా సిద్దిపేట
గజ్వేల్: ఆయిల్‌పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా హబ్‌గా మారబోతుంది. తెలంగాణలో ఐదేళ్ల క్రితం కొత్తగా ప్రారంభమైన సాగును క్రమంగా విస్తరించుకుంటూ సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు కేంద్రం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్‌పామ్(ఎస్ఎంఈఓ) పథకంలో భాగంగా నాలుగేళ్లల్లో తెలంగాణ 1,25,300 హెక్టార్ల సా గు లక్ష్యానికి తెలంగాణ ఇప్పటివరకు 78,869 హెక్టార్లకుపైగా లక్ష్యాన్ని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో సాగు పెరుగుతూ వస్తున్న జిల్లాల్లో సిద్దిపేట తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. గడిచిన ఐదేళ్లల్లో ఇక్కడ 12,350 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చింది. జిల్లాలోని నర్మెటలో మాజీ మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా రూ.300 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులు పూర్తికాగా, ప్రస్తుతం క్రషింగ్‌ను ట్రయల్ చేస్తున్నారు. దీని కారణంగా రాబోవు రోజుల్లో జిల్లాలో ఆయిల్‌పామ్ మరింతగా పెరగనున్నది. నర్మెటలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ ఆయిల్‌పామ్ సాగు సమీప జిల్లాలో విస్తరించడానికి అడుగులు పడ్డాయి. ఇంతకాలం మార్కెటింగ్ సౌకర్యాలు సక్రమంగా లేక, సాగుకు వెనుకంజ వేసిన రైతులు ఆయిల్‌పామ్ సాగును పెంచుకునే అవకాశం కలిగింది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో నిత్యం 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగివున్నది. ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్‌కు అవకాశమున్నది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి యంత్ర సామగ్రి ఇప్పటికే అమర్చారు. ఈ అంశంపై సిద్దిపేట జిల్లా ఉద్యానవనశాఖాధికారి సువర్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి హబ్‌గా మారే అవకాశమున్నదని చెప్పా రు. జిల్లాలోని రైతులకు ఈ సాగు కొత్తయినా, ఏటా ఈ పంటను సాగుచేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని, ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. గణనీయంగా పెరుగుతున్న సాగు -
ఐటీఐలో కొత్త కోర్సులు
● కలెక్టర్ హైమావతి ● అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అధునాతన సాంకేతిక కేంద్ర (ఏటీసీ) బోధన తీరులను శనివారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి తే విజయం సాధిస్తారన్నారు. ప్రభుత్వం అందిస్తు న్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్నారు. మారుతున్న కాలంతో సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని చెప్పారు. ఐటీఐలో కొత్త కోర్సులను చేర్చి శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉపాధి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, విద్యార్థులు చెక్కపై మిషన్‌తో బొమ్మలు తయారు చేసిన తీరు లను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్ రమణ పాల్గొన్నారు. వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్‌లో వైద్య సేవ లందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించి వైద్యం అందుతున్న తీరులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అక్టోబరు 2 వరకు స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్ వైద్య సేవలందిస్తామన్నారు. పీహెచ్సీ పరిధిలో ఇప్పటి వరకు 85 మందికి పైగా మహిళలకు వైద్యం అందించామంటూ వైద్యులు శ్రీధర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
ధాన్యం కొనుగోలుకు సమగ్ర ప్రణాళిక
● జిల్లా లక్ష్యం 5.03లక్షల మెట్రిక్ టన్నులు ● రైతులకు ఇబ్బందులు కలుగొద్దు ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటజోన్: వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలతో యంత్రాంగం ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. వరి ధాన్యం కొనుగోళ్లు–మద్దతు ధర తదితర అంశాలపై శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో వానాకాలం 2025–26 కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తెచ్చిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందేలా చూడాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3,29 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, మొత్తంగా 8.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో రైతుల అవసరాలు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్లకు పోను 5.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో సన్న, దొడ్డు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం మద్దతు ధర క్వింటాలుకు రూ 2,389, సాధారణ రకం క్వింటాలుకు రూ 2,369 ప్రభుత్వం ధర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లినర్, వేయింగ్ స్కెల్, తేమ పరీక్ష మిషన్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో పెద్ద కొనుగోలు కేంద్రాలకు ఆటోమేటిక్ ప్యాడి క్లినర్లను ఇస్తామన్నారు. ప్రభుత్వ బోనస్ రూ 500అదనంగా చెల్లింపు ఉంటుందన్నారు. నిర్దేశించిన లక్ష్యం ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగ్‌లను సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సరిపడా హమాలీలు ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ తనూజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డిఎం సివిల్ సప్లై,, ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ బదిలీ అయ్యారు. నూతన పోలీసు కమిషనర్‌గా ఎస్ఎమ్ విజయ్‌కుమా ర్ను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌ను సిద్దిపేట నూతన సీపీగా నియమిస్తూ, ఇప్పటి వరకు సిద్దిపేట సీపీగా కొనసాగిన అనురాధను ఎల్బీ నగర్ డీసీపీగా నియమించారు. పండుగలు సంస్క ృతికి ప్రతీకలుఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): పండుగలు సంస్క ృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని శ్రీ దేవి నవరాత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గా మాతను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావనతో పాటు సామాజిక సేవను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు సూకూరి లింగం, మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ కో అప్షన్ మెంబర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ భైరయ్యపాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీకి నివాళిసిద్దిపేటకమాన్/ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో బాపూజీ విగ్రహానికి కలెక్టర్ హైమావతి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, తదితరులు పాల్గొన్నారు. అలాగే.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ పాల్గొన్నారు. బాపూజీ బాటలో ముందుకు సాగాలి: ప్రొఫెసర్ కోదండరాం ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ బాపూజీ అంకిత భావం స్ఫూర్తిగా సమాజ సేవకు యువత నడుం బిగించాలని ప్రొఫెసర్ ఎం.కోదండరాం పిలుపు నిచ్చారు. ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన ఆచార్య లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ బాపూజీ జీవితం, రాజకీయ చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ఉద్యాన వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్.దండా రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
దుబ్బాకటౌన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఐఓసీ కార్యాలయంలో ఉదయం అక్బర్పేట భూంపల్లి, మధ్యాహ్నం వివిధ మండలాల ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల రోజు నిర్వహించే విధుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జహీరోద్దిన్, ఎంపీఓ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శ్రీహరి, రవీందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. సర్వేకు సహకారం అవసరం మిరుదొడ్డి(దుబ్బాక): పంటల సర్వేకు రైతులు సహకరించాలని ఏడీఏ మల్లయ్య కోరారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో సాగైన పంటలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ల ప్రకారం పంటలు వివరాలు నమోదు చేయాలన్నారు. దీనివల్ల దిగుబడిని విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటా యని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్, ఏఈఓ సాయి కుమార్, రైతులు పాల్గొన్నారు. చెరువు కట్టకు మరమ్మతులు గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని పిడిచెడ్ గ్రామంలోగల లక్ష్మీదేవి చెరువుకట్టకు గండిపడే అవకాశం ఉండడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇరిగేషన్ ఏఈ సుశాంత్ పర్యవేక్షణలో శుక్రవారం చెరువుకట్టపై మట్టి పో యించి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గండి పడితే సుమారు 200 ఎకరాల పరిధిలోని పంటలు నీటమునిగే ప్రమాదముంటుందన్నారు. వారం రోజుల క్రితం చెరువుకట్ట పొలాలవైపు కుంగిపోతున్నట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టా మని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం మద్దూరు(హుస్నాబాద్): సీజనల్ వ్యాధులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ సూచించారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలో నిర్వహించిన స్వస్థ్ నారి సశక్తి అభియాన్ వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాధుల సోకిన వారు వెంటనే వైద్యులను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్వర సేవలందించడమే లక్ష్యం వర్గల్(గజ్వేల్): ఖాతాదారులకు సత్వర సేవలందించడమే తమ లక్ష్యమని గౌరారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సీహెచ్ మాతాజీ అన్నారు. ఇందిరా మహిళాశక్తి మిషన్‌లో భాగంగా ఐకేపీ పర్యవేక్షణలో ఏర్పాటైన ఐదు స్వయం సహాయక వృద్ధుల సంఘాలకు శుక్రవారం బ్యాంకు ఖాతాలు తెరిపించి పాస్ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో పాములపర్తి సీసీ పద్మలత, మహిళలు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా గోపి హుస్నాబాద్: మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా మాటూరి గోపి ఎన్నికయ్యారు. డీలర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం గోపి, యాదగిరి పోటీపడ్డారు. ఒక్క ఓటు తేడాతో మాటూరి గోపి ఎన్నికై నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. కార్యదర్శిగా గూళ్ల మంగ, కోశాధికారిగా మల్లేశం ఎన్నికయ్యారు. -
జీవిత లక్ష్యసాధనకు చదువే పునాది
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు తాము ఎంచు కున్న లక్ష్యాన్ని సాధించాలంటే చదువే పునాది అని డీఐఈఓ కె.రవీందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర అన్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్ కె.శారద, అధ్యాపకులు చంద్రం తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల సహకారం అవసరం సిద్దిపేటఎడ్యుకేషన్/ములుగు(గజ్వేల్)/వర్గల్(గజ్వేల్)/నంగునూరు(సిద్దిపేట)/గజ్వేల్‌రూరల్/హుస్నాబాద్: తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యం ఉంటేనే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశాలలో ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ సత్యనారాయణరెడ్డి, హిమబిందు మాట్లాడారు. కళాశాలలకు అందిస్తున్న నిధులు, సౌకర్యాలు, విద్యార్థుల స్థితిగతులను తల్లిదండ్రులకు వివరించారు. కోఎడ్యుకేషన్ కళాశాలలో అగ్నిమాపక సీఐ వెంకటేశ్వర్లు అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో వివరించారు. ఏజీఎంసీ దేవయ్య, సుధాకర్‌రెడ్డి, కనకచంద్రం, శ్రీనివాస్‌రెడ్డి, నగేశ్, అశోక్ పాల్గొన్నారు. అలాగే ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశికళ మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో విలువ పెరుగుతుందన్నారు. వర్గల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు విద్యార్థుల అకడమిక్, నాన్ అకడమిక్ అంశాలను చర్చించారు. నంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్ శివకోటి మాట్లాడారు. గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్ ప్రిన్సిపాల్ కిషన్ నగదు బహుమతులు అందజేశారు. గజ్వేల్ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్‌గౌడ్, జ్యోతిర్మయి వేర్వేరుగా నిర్వహించిన సమావేశాలలో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతి బాటలో తల్లిదండ్రులు, అధ్యాపకులు కలిసి రావాలన్నారు. అలాగే బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పొరేట్‌కు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నామని ప్రిన్సిపాల్ లలిత అన్నారు. డీఐఈఓ రవీందర్‌రెడ్డి -
ప్రజారోగ్యంపై పట్టింపేది?
దుబ్బాకటౌన్: ప్రజలు తినే ఆహార పదార్థాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో పర్యవేక్షణ లేక హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. అసలు పర్యావేక్షణాధికారులు ఉన్నారా? లేరా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఫలితం బయట పెట్టని అధికారులు ఇటీవల దుబ్బాకలోని ఉడిపీ హోటల్లో సాంబా రులో పురుగు వచ్చి కలకలం సృష్టించిన ఘటన తెలిసిందే. జిల్లా ఆహార తనిఖీ అధికారి వచ్చి సాంపిల్ తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా దాని ఫలితం బయట పెట్టక పోవడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బేకరీల్లో కాలం చెల్లిన కేక్‌లు పట్టణంలోని కొన్ని బేకరీలలో మున్సిపల్ అధికారుల చేపట్టిన తనిఖీలలో కాలం చెల్లిన కేక్‌లు బయటపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఎప్పడికప్పుడు సక్రమంగా తనిఖీలు చేపట్టకపోవడంతో బేకరీలు, హోటళ్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని, కాలం చెల్లిన తినుబండారాలను అమ్మతున్నారని వాపోతున్నారు. అదే విధంగా బేకరీలో ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశం అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఒక బేకరిలో కుళ్లిన కేక్ విక్రయించగా తిన్న పిల్లలు అనార్యోగం బారినపడ్డారు. అయినప్పటికీ ఆహార తనిఖీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు ఆహార పదార్థాల్లో ఏ పురుగో, కీటకాలనో గుర్తించినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే వచ్చి శాంపిల్ సేకరించి ఫలితం బయట పెట్టకుండా చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లేదని వాపోతున్నారు. కాలం చెల్లిన పదార్థాల విక్రయం తయారీలో నాణ్యత కరువు కానరాని పర్యవేక్షణ అధికారులు తీరు మార్చకోవాలి జిల్లాలో కొంత మంది హోటల్, బేకరీ, ఇతర ఆహార విక్రయదారులు ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. నాణ్యత లేని, కాలం చెల్లిన పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుబ్బాకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందు కు తనిఖీలు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదు. ఇకనైనా అధికారులు తీరు మార్చుకోవాలి. – మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక సహించేదే లేదు.. దుబ్బాకలో బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారపదార్థాల తయారు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పరిశుభ్రత పాటించకుంటే జరిమానాలు తప్పవు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు. – రమేశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక -
నాచ‘గిరి’ ప్రదక్షిణం.. వెల్లివిరిసిన ఆధ్యాత్మికం
‘స్వాతి’ నక్షత్రం.. నృసింహుడి జన్మనక్షత్రం.. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికత పంచుతున్న వేళ.. ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో ‘గిరి ప్రదక్షిణ’ క్రతువుకు బీజం పడింది. గురువారం ఉదయం భక్తజన హర్షధ్వానాలు, నారసింహ స్మరణ మధ్య పీఠాధిపతి మాధవానంద సరస్వతి ప్రారంభించారు. ప్రముఖులు, అర్చక, వేదపండితులు, సిబ్బంది, భక్తజనులు ఈ మహాక్రతువులో పాల్గొన్నారు. భజనలు చేస్తూ గిరిప్రదక్షిణ చేయడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ గిరిప్రదక్షిణతో శుభాలు కలుగుతాయన్నారు. – వర్గల్(గజ్వేల్) -
‘మత్తు’ వదిలించేందుకే బైక్ యాత్ర
● ప్రభుత్వ ఉపాధ్యాయుడి సాహసయాత్ర ● జిల్లాలో విస్తృతంగా అవగాహనసాక్షి, సిద్దిపేట: పండుగ సెలవులు వస్తే చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఫ్యామిలీతో, లేదా ఫ్రెండ్స్‌తో విహార యాత్రలు చేస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాత్రం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నడుంబిగించారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బైక్ యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 21న సూర్యాపేటలో ప్రారంభమైన యాత్ర 900 కిలో మీటర్ల మేర సాగింది. యాత్ర ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో కొనసాగి.. సిద్దిపేట మీదుగా జనగాం వరకు గురువారం చేరుకుంది. తన బాల్య మిత్రుడి వలే.. బాల్య మిత్రుడు ధూమపానానికి బానిసై క్యాన్సర్ బారినపడి మృతి చెందాడు. మత్తు పదార్థాలతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తన బాల్యమిత్రుడి వలె ఎవరూ బలికావద్దని, మత్తుపదార్థాల నిర్మూలనకు జనచైతన్యమే మార్గమని భావించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో పర్యటన జిల్లాలో జనం రద్దీ ఉండే ప్రాంతాలు, బస్టాండ్, టీ స్టాల్, కూలీల అడ్డాల దగ్గర ఆగి.. యువత, ప్రజలు మాదకద్రవ్యాలకు, ధూమపానానికి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దంటూ ప్రచారం చేశారు. సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా ప్రభాకర్‌ను కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకుడు రామచంద్రం, మోటివేషనల్ స్పీకర్ నాగరాజు, సోషల్ స్టడీస్ ఫోరమ్ అధ్యక్షుడు పూర్ణచందర్ రావులు సన్మానించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే.. మత్తు పదార్థాల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్రను చేపట్టాను. నా బాల్యమిత్రుడు సిగరేట్ తాగి క్యాన్సర్‌తో మృతిచెందారు. నన్ను కొందరు హేళన చేస్తున్నా.. నా ఆశయం నెరవేరేందుకు ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా చైతన్యం కల్పిస్తున్నాను. –రాచకొండ ప్రభాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
మద్యం టెండర్లకు వేళాయె..
కొత్త మద్యం పాలసీ(2025–27)ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం నుంచి మద్యం షాప్‌లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2023–25 మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుంది. గత మద్యం పాలసీలో 93 వైన్ షాప్‌లకు 4,166 మంది దరఖాస్తు చేశారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 93 వైన్ షాప్‌లకు శుక్రవారం నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. షాప్‌ల వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి అక్టోబర్ 23న లక్ష్కీ డ్రా తీయనున్నారు. దరఖాస్తులను సిద్దిపేటలో ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో స్వీకరించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తు ధరను రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. కొత్త షాప్‌లు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు వేల నుంచి 50వేల జనాభా ఉన్న దుకాణాలకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష మంది వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.65 లక్షల ఫీజును వసూలు చేయనున్నారు. డ్రా తీసిన కలెక్టర్ దుకాణాల కేటాయింపు గౌడ సామాజిక వర్గానికి 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను గురువారం కలెక్టర్ హైమావతి తీశారు. జిల్లాలో 93 వైన్ షాప్‌లు ఉండగా గౌడ సామాజిక వర్గానికి 16, ఎస్సీలకు 09 షాప్‌లు కేటాయించారు. గౌడ కులస్తులకు దుబ్బాక పట్టణం( గెజిట్ నంబర్ 19), చిన్నకోడూరు(21), గజ్వేల్ పట్టణం(27), గజ్వేల్ పట్టణం(29), గజ్వేల్ పట్టణం(31), ముట్రాజ్‌పల్లి(36), ములుగు(42), వేలురు(వర్గల్, (47), గౌరారం(48), మర్కూక్(49), హుస్నాబాద్ పట్టణం(54), పోతారం( హుస్నాబాద్, 56) చేర్యాల పట్టణం(68), దుద్దెడ–1(75), దూల్మిట్ట (80), అక్బర్పేట–1(85)లను కేటాయించారు. ఎస్సీలకు.. సిద్దిపేట పట్టణం(8), సిద్దిపేట పట్టణం(14), దుబ్బాక పట్టణం(16), రాఘవాపూర్(24), గజ్వేల్ పట్టణం(32), గజ్వేల్ పట్టణం( 35), చేర్యాల పట్టణం(70), కొమురవెల్లి–1(81), రాయపోలు(89) కేటాయించారు. ఎస్టీలకు వైన్ షాప్‌లను కేటాయించలేదు. రిజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు చేసేవారు కుల ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. ఎకై ్సజ్ చట్టం 1968 ప్రకారం శిక్షపడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. మద్యం వ్యాపారులు, ఆశావహులు సిండికేట్‌గా మారి దరఖాస్తు చేసేందుకు డబ్బులను సిద్ధం చేసుకుంటున్నారు. తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్‌ల దరఖాస్తుల స్వీకరణ కోసం సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల రెండు చొప్పున, మిరుదొడ్డి ఒకటి కౌంటర్లు ఉండనున్నాయి. దరఖాస్తు దారులు అందరూ ఆయా కౌంటర్లలో దరఖాస్తులు అందజేయాలి. – శ్రీనివాస మూర్తి, ఈఎస్నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ -
‘గౌరవెల్లి’ని పూర్తి చేసి తీరుతాం
అక్కన్నపేట(హుస్నాబాద్): మొట్టప్రాంత రైతుల చిరకాల కోరికైన గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధుల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాలన్నింటికీ సాగునీరందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. 2016లో అక్కన్నపేట మండలం ఏర్పాటు కాగా అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవన్నారు. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. త్వరలోనే తహసీల్దార్ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ మండలాధ్యక్షుడు ఐలయ్య, నాయకులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో వసతులు కల్పించాంహుస్నాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటి ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయా లు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధు లకు పుస్తకాలు, క్యాలిక్యులేటర్స్, ఇతర కిట్స్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి హాస్టల్ వసతి ఏర్పాటు చేశా మన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్, ఆర్డీఓ రామ్మూర్తి, ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై జీఓ ఏదీ?
● స్థానిక సంస్థల ఎన్నికలపై రోజుకో మాట ● ఉపాధ్యాయుల సెలవులపై పునరాలోచించాలి ● ఎంపీ రఘునందన్‌రావు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన జీఓ విడుదల చేయలేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభత్వుం రోజుకో మాటమాట్లాడుతోందన్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులు గుంతల మయంగా మారాయన్నారు. రహదారులపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రకృతి కోపిస్తే ఇలాగే ఉంటుందని, అందువల్ల పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు దోచుకున్న డబ్బుతో ఏమి చేయాలో తెలియక ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. అవినీతిని బయటకు తీస్తామన్న కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటోందన్నారు. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు పెద్ద పండుగలని, మహిళా ఉపాధ్యాయులను విధులకు హాజరుకావాలని హుకుం జారీ చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్, వెంకట్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఉనికి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరాటం వర్గల్(గజ్వేల్): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం వర్గల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలలో రోడ్లు ఎక్కడా సరిగాలేవు. నాణ్యత కొరవడ్డాయి. అన్నీ గోతులే అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు ప్రజల మేలు కోసం పనులను చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రస్థానం ముగిసిందిచిన్నకోడూరు(సిద్దిపేట): స్కామ్‌లు, స్కీమ్‌ల పేరుతో బీఆర్ఎస్ ప్రస్థానం ముగిసిందని.. బీఆర్ఎస్లో ఏ నాయకుడు ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని అయోమయ స్థితిలో ఉందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సేవా పక్షంలో భాగంగా గురువారం చిన్నకోడూరులో మొక్కలు నాటి, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపలేదా అని ప్రశ్నించారు. నాడు ఒక మాట, నేడు ఒక మాట మాట్లాడటం బీఆర్ఎస్కు చెల్లుతుందన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలన్నారు. సోషల్ మీడియాలో బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే బీఆర్ఎస్ నాయకులను తరిమి కొడతామన్నారు. -
విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి
హుస్నాబాద్: ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లో వేర్వేరుగా జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆకృతిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అనేది యువతను సమాజానికి దగ్గర చేసే వేదిక అని అన్నారు. ప్రతి విద్యార్ధి సేవా భావంతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్యలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలోనూ ముందుకు సాగాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్స్ గంగాధర్, లలిత, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు రణధీర్, కరుణాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యాధరి సేవలో ఎమ్మెల్సీ కవిత
వర్గల్(గజ్వేల్): కంచి పీఠం, కంచి స్వామి ఆశీస్సులతో వేదోక్తంగా, శాస్త్రోక్తంగా కొనసాగుతున్న అద్భుత పూజాకార్యక్రమాలతో రాష్ట్రానికి వర్గల్ క్షేత్రం ఆశీర్వాదమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో వర్గల్ అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పం నెరవేరిందన్నారు. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలో ఆడపిల్లలు అందరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. ఆమె వెంట నాచగిరి ఆలయ మాజీ చైర్మన్, లీగల్‌సెల్ రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి తదితరులున్నారు. -
అపురూపం.. అమ్మరూపం
అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం అమ్మవారిని అన్నపూర్ణా దేవిగా అలంకరించారు. మండపాల వద్ద కుంకుమార్చన, పుష్పార్చన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దివ్య దర్శనమిచ్చారు. వర్గల్తోపాటు జిల్లా కేంద్రంలోనిసంతోషిమాత ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాలలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/వర్గల్(గజ్వేల్) -
క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎస్సీసెల్ నేత
మల్లు రవిని కలిసిన విజయ్‌కుమార్ గజ్వేల్: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ బుధవారం హాజర య్యారు. ఆగస్టు 3న గజ్వేల్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ సమక్షంలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి విజయ్‌కుమార్ డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే ఇటీవల నర్సారెడ్డి కమిటీ ఎదుట హాజరై తన వాదనను వినిపించారు. బుధవారం విజయ్‌కుమార్ సైతం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యుల ముందు హాజరై తన వాదన చెప్పుకున్నారు. ఆయనతోపాటు గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి తదితరులు ఉన్నారు. విజయ్‌కుమార్‌కు మద్దతుగా మహిళలు, నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌కు మద్దతుగా వారు ప్లకార్డులను ప్రదర్శించారు. -
ఎట్టకేలకు నిధులొచ్చే..
దుబ్బాక: నిధులు లేక సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మూడేళ్లుగా నిధుల జాడలేకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తాజాగా నగర అభివృద్ధి నిధుల కింద జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.45 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. గత జులైలోనే ప్రభుత్వానికి నిధుల ప్రతిపాదనలను ఆయా మున్సిపల్ కమిషనర్లు నివేదించారు. ఈ మేరకు నగర అభివృద్ధి కింద నిధులు మంజూరు కావడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలపై దృష్టి నిధులు లేక అధ్వానంగా తయారైన డ్రైనేజీలు, రోడ్లు, చెరువుకట్టల సుందరీకరణ, వరదనీరు మళ్లింపు, పార్కుల సుందరీకరణ, పారిశుద్ధ్యంతో పాటు పలు ప్రధాన సమస్యల పరిష్కారం కానున్నాయి. దుబ్బాక మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం కాలనీలో స్ట్రీట్ లైటింగ్, డ్రైనేజీలకు రూ.40 లక్షలు, పార్కుకు రూ.40 లక్షలు, వరద నీరు పోయే కాల్వల నిర్మాణానికి రూ.1.60 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే చేర్వాపూర్ అనంతమహాలక్ష్మి టెంపుల్ నుంచి మారెమ్మ దేవాలయం వరకు సీసీ, బీటీ రోడ్డు మరమ్మతులకు రూ.1.40 కోట్లు, దుబ్బాక పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40 లక్షలు, జంక్షన్ నిర్మాణానికి రూ.40 లక్షలు, మున్సిపాల్టిలోని 20 వార్డులకు ఒక్కో వార్డుకు రూ.50 లక్షల చోప్పున పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయి. సర్వత్రా హర్షాతిరేకాలు దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.45 కోట్లు మంజూరు కావడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి మార్గం దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి నగర అభివృద్ధి కింద రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులకు మోక్షం కలగనుంది. డ్రైనేజీలు, వరద నీటి కాలువలు, అసంపూర్తి, అధ్వాన రోడ్లు నిర్మాణం చేపడుతాం. చాలా సమస్యలు తీరే అవకాశం ఉంది. – రమేశ్‌కుమార్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్ వివరాలు ఇలా.. మున్సిపాలిటీ వార్డులు జనాభా దుబ్బాక 20 40,000 హుస్నాబాద్ 20 30,000 చేర్యాల 12 14,000 -
స్థానిక పోరు.. చర్చ జోరు
● ఆశావహుల్లో దడ ● మొదలైన ఎన్నికల సందడి ● రాజకీయ పార్టీలు ఫోకస్ రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపైనే జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఇటీవల పూర్తి చేయగా, ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అధికారికంగా రిజర్వేషన్లను ప్రకటించవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రిజర్వేషన్లను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో దడపుడుతోంది. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో స్థానికసమరంపై పల్లెల్లో సందడి మొదలైంది. – సాక్షి, సిద్దిపేట రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. గ్రామాల్లో ఎక్కడ నలుగురు కలిసినా సర్పంచ్ రిజర్వేషన్ ఇది అయిందని.. ఎంపీటీసీ ఇలా అయిందని జోరుగా చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు రిజర్వేషన్లపై కుతూహలంగా, మరోవైపు ఆందోళనగా ఉన్నారు. మండల స్థాయి అధికారులను మచ్చిక చేసుకుని ఏ రిజర్వేషన్ ఎవరికి అయిందని తెలుసుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. ఎవరికి చెప్పవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలుండటంతో చెప్పే సహసం అధికారులు చేయడం లేదని తెలుస్తోంది. దీంతో నేతలే పోటీ చేసే స్థానానికి ఏ రిజర్వేషన్ వస్తుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తే కొత్తగా ఏ స్థానం ఎవరికి రిజర్వేషన్ అవుతుందోననే చర్చ కొనసాగుతుంది. ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలైతే మారే రిజర్వేషన్ల తీరుపై కూడా మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగో మహిళలకు 50శాతం స్థానాలు కేటాయిస్తారు. అందుకే మహిళా స్థానాలు ఆయా పదవులకు రిజర్వ్ అయితే నాయకులు వారి సతీమణులు, తల్లులను కూడా బరిలో దించేందుకు సమాయత్తమవుతున్నారు. రాజకీయ పార్టీల నజర్ ఇప్పటికే సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావహులు వివిధ రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయా పార్టీల నేతలను కలిసి అభ్యర్థిస్తున్నారు. పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్న వారు గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు, కుల పెద్దలు, యువజన, మహిళా సంఘాల నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. మరోవైపు పల్లెల్లో మరింత పట్టు సాధించేందుకు సర్పంచ్ ఎన్నికలు కీలకమని భావిస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎవరిని పోటీ చేయించాలి? ఎవరికి పట్టు ఎక్కువగా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. గ్రామ పంచాయతీలు: 508 వార్డులు: 4,508 ఎంపీటీసీలు: 230 జెడ్పీటీసీలు: 26 పల్లె ఓటర్లు మొత్తం: 6,55,958మహిళలు: 3,34,186పురుషులు: 3,21,766ఇతరులు: 06 -
కేంద్ర మంత్రిని కలిసిన మత్స్యకారులు
హుస్నాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని మంగళవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు కలిశారు. పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న ముదిరాజ్ ఫంక్షన్ హాలుకు బోరు మోటారు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన బండి సంజయ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పొన్నం మల్లయ్య, కార్యదర్శి రాగుల శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులుమిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి, 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో మెదక్ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన శ్రావణి, శరణ్య, అలాగే బాలుర జట్టు నుంచి కృష్ణ సాయి ఎంపికయ్యాడని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు తమిళనాడులో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే టోర్నిలో రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రోడ్డెక్కిన హైర్ బస్సులు డ్రైవర్లతో చర్చలు సఫలం సిద్దిపేటకమాన్: వేతనాలు పెంచాలని నిరసన తెలిపిన హైర్ బస్సుల డ్రైవర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సిద్దిపేట ఆర్టీసీ డిపో హైర్ బస్సుల డ్రైవర్లు సోమ, మంగళవారాల్లో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. డీఎం రఘు ఆధ్వర్యంలో అద్దె బస్సు యజమానులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం సాయంత్రం అద్దె బస్సులు రోడ్డెక్కాయి. డ్రైవర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంతో పాటు అదనంగా మరో రూ.2వేలు చెల్లించేందుకు నిర్ణయించారు. అలాగే ఏడాదికి ఒక డ్రైవర్‌కు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నట్లు తెలిపారు.శ్రావణి శరణ్య కృష్ణ సాయి -
వివరాలు నమోదు చేసుకుంటేనే ‘మద్దతు’
● జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి ● గజ్వేల్‌లో క్రాప్ సర్వే తీరు పరిశీలనగజ్వేల్: రైతులు సాగుచేసిన పంటల వివరాలను నమోదు చేసుకుంటేనే మద్దతు ధరతోపాటు ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తెలిపారు. మంగళవారం గజ్వేల్‌లో పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఏఈఓలు క్రాప్ సర్వేలో నిమగ్నమయ్యారని చెప్పారు. సర్వే ముగియగానే ఏఈఓలు సంబంధిత జాబితాను పంచాయతీల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలుంటే రైతులు తెలియజేయాలని సూచించారు. వరి, పత్తి, మొక్కజొన్నతోపాటు పప్పుధాన్యాలు సోయాబీన్‌లాంటి కోత పూర్తయిన పంటలు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కౌలు రైతులకు సైతం ప్రత్యేక రిజష్టర్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి రైతు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈఓలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఫిర్యాదు
గజ్వేల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్వహణపై మంగళవారం బీజేపీ నేతలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు కోసం వాడుకోవాల్సిన క్యాంపు కార్యాలయాన్ని ప్రైవేటు కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుడిక్యాల రాములు, ఎస్సీమో ర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయ లోపమే కారణం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డు ఆధునీకరణకు పదేళ్ల క్రితం అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో సుమారు రూ.45కోట్ల వరకు వెచ్చించారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తా నుంచి గజ్వేల్‌లోని తూప్రాన్ రోడ్డు వైపున 133/33కేవీ సబ్‌స్టేషన్ వరకు 5కిలోమీటర్ల మేర పనులు సాగాయి. 100మీటర్ల విస్తరణతో డివైడర్లు, బట్టర్ఫ్లై లైట్లు, ఫుట్‌పాత్‌లతో అందంగా తీర్చిదిద్దారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను నాటి మరింత శోభను తీసుకొచ్చారు. పదేళ్ల క్రితమే పనులు పూర్తికాగా, అయిదేళ్ల క్రితం నేషనల్ హైవే అథారిటీకి అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ రోడ్డుపై పలు చోట్ల అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉండగా.. వాటిని డిజైన్‌లో మరిచిపోయారు. ఫలితంగా ఈ రోడ్డుకు ఏటా వరద ముప్పు తప్పడం లేదు. ఆక్రమణలో నాలాలు ప్రధానంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దూకితే...ఆ నీరు వెళ్లడానికి అవసరమైన నాలాల వ్యవస్థ లేదు. నాలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. నిజానికి ఈ వరద నీరు నాలాల ద్వారా రాజిరెడ్డిపల్లి కుంటలోకి అక్కడి నుంచి క్యాసారం కుంటలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ నీరు వెళ్లే మార్గం లేక అక్కడి నుంచి ఇళ్ల మధ్య నుంచే వరద నీరు కొట్టుకు వస్తోంది. ఇదే నీరు పార్ధివేశ్వరస్వామి ఆలయం ఆర్చి వద్ద రోడ్డుపైకి వచ్చి జలమయంగా మారుతోంది. దీనివల్ల రోజుల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. తరచూ జలదిగ్బంధంలో ప్రధాన రహదారి సమస్య పరిష్కారానికి ప్రధాన రహదారి కింది భాగంలో అండర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా.. దానిని మరిచిపోయారు. నీటిపారుదల శాఖ, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో ఈ సమస్యపై గతంలో స్పందించి ఉంటే.. కొంతమేరకు నాలాల వ్యవస్థను సరిచేసే అవకాశం ఉండేది. ప్రధాన రోడ్డుపైకి వరద పొంగి పొర్లే పార్ధివేశ్వర కమాన్ వద్ద, తూప్రాన్ రోడ్డు వైపున బ్రిడ్జిలు లేదా అండర్ పాస్‌ల నిర్మాణం జరిగి ఉండాల్సింది. ఇందుకోసం రూ.12కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. కానీ ఆమోదం లభించలేదు. అదేవిధంగా ఎర్రకుంట నుంచి పాండవుల చెరువు ఫీడర్ ఛానెల్ నిర్మాణానికి మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ఈ ప్రతిపాదన లకు మోక్షం కరువైంది. ప్రస్తుతం ఈ సమస్య పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తున్నది. ఇప్పటికై నా శాశ్వత పరిష్కారం లభించేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
ఆయుర్వేదం జీవన విధానం
● ప్రకృతి సహజ మందులు ● కలెక్టర్ హైమావతి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆయుర్వేదం అనేది వైద్యం మాత్రమే కాదని, భారతీయుల జీవన విధానమని కలెక్టర్ హైమావతి అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మంగళవారం సిద్దిపేట పట్టణం నర్సాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం భారతీయుల జీవితాల్లో భాగమైందన్నారు. సూర్యుని ద్వారా లభించే శక్తిని స్వీకరించి సహజసిద్ధంగా పెరిగే ప్రకృతి సిద్ధమైన మొక్కల నుంచి ఆయుర్వేదిక్ మందులను తయారు చేస్తారన్నారు. ఆయుర్వేదిక్ మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నారు. మందులతో వ్యాధులు త్వరగా నయమవుతాయన్నారు. అందువలన అల్లోపతికి బదులుగా ఆయుర్వేదిక్ మందులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ మితాహారం, మసాలాలు తక్కువ తీసుకోవడం వల్ల రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. వైద్య శిబిరంలో దాదాపు 300 మంది పరీక్షలు చేసుకొని మందులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆయుర్వేదవైద్యం జిల్లా ఇన్చార్జి డాక్టర్ రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, వైద్యు లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులు,కుంటలపై దృష్టి సారించండి
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● ఇరిగేషన్ అధికారులతో సమీక్షదుబ్బాక: భారీ వర్షాల నేపథ్యంలో నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటల రక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఇరిగేషన్ అధికారులతో నీటిపారుదల రంగంపై సమీక్షించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తు న్న వర్షాలతో చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయన్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదకరంగా ఉన్న చెరువుకట్టల రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. -
నెరవేరుతున్న సొంతింటి కల
● సంతోషంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ● ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ● సిద్దిపేటలో ఇళ్ల పరిశీలనపేద ప్రజల అభివృద్ధే ముఖ్యం సిద్దిపేటకమాన్: పేదల సొంతింటి కల నెరవేరుతుండటంతో ఇందిరమ్మ లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 37వ వార్డులో నిర్మాణంలో ఉన్న పలు ఇందిరమ్మ ఇళ్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను ఊరించిందేకాని, ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నేడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నామనే సంతోషం కనిపిస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసిందన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాయకులు ఇష్టారీతినా భవనాలు నిర్మించారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణం పూర్తయ్యే సరికి విడతల వారీగా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ, తహశీల్దార్, నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, వార్డు కౌన్సిలర్ సాకి బాల్‌లక్ష్మి, మార్క సతీష్, శ్రీనివాస్, అత్తు, ముద్దం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేటఅర్బన్: రాష్ట్రంలోని ప్రతి పేద వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్సాన్‌పల్లిలో 127 ఇండ్లు మంజూరు కాగా 90 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు క్వాలిటీతో ఇళ్ల నిర్మాణాలను చేసుకుంటున్నారని అభినందించారు. గత బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు స్వంత ఇంటి కల నెరవేరలేదన్నారు. మున్సిపల్ కమిషనర్‌పై మంత్రి సీరియస్.. మున్సిపల్ నిధుల విషయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు సహకరించడం లేదని నాయకులు కమిషనర్ ఆశ్రిత్‌కుమార్‌పై మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి కమిషనర్‌పై సీరియస్ అయ్యారు. తనకు తెలియకుండా ఎలాంటి కేటాయింపులు చేయవద్దని ఆదేశించారు. -
వేదస్వరూపిణి.. సకల శుభకరి
బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా నేత్రపర్వం చేస్తున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం ఆయా మండపాలలో, దేవాలయాలలో అమ్మవార్లను గాయత్రీ దేవిగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. వర్గల్ సరస్వతి క్షేత్రంలో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వర్గల్ ఉత్సవాలకు రావాలంటూ నగరంలో రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలను ఆలయకమిటీ ప్రతినిధులు కలిసి ఆహ్వానపత్రికలు అందజేశారు. గజ్వేల్ పట్టణంలోని మహంకాళీ దేవాలయంలో 400కిలోల కుంకుమతో త్రిమూర్తి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా, మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/ వర్గల్(గజ్వేల్)/గజ్వేల్‌రూరల్ -
యూరియా కోసం అవే బారులు
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సోమవారం తెల్లవారుజామునుంచే రైతులు పీఏసీఎస్‌తో పాటు, గోదాం వద్ద బారులు తీరారు. గంటల తరబడి పడిగాపులు పడితే తప్ప యూరియా బస్తా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంట కాలం అదను దాటిపోతుండటంతో యూరియా కొరత వల్ల తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరిగతిన యూరియా అందుబాటులోకి తెచ్చి తమను నష్టాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
జోరు వాన.. జనం హైరానా
కొండపాకలో 85 మి.మీ.వర్షం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/దుబ్బాక: జిల్లాలో సోమ వారం జోరుగా వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో ఏకధాటిగా రెండు గంటల పాటు వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొండపాకలో 85మిల్లీమీటర్లు, కొమురవెల్లిలో 72 మి.మీ., సిద్దిపేటలో 71.5మి.మీ.వర్షపాతం నమో దు అయ్యింది. అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షంతో ప్రజలు, వాహనదారులకు తిప్పలు తప్పలేదు. డీఈ కార్యాలయంపై పిడుగు.. జిల్లా కేంద్రంలోని విధ్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీ ర్ శాఖ కార్యాలయంపై పిడుగు పడడంతో ప్రమా దం చోటు చేసుకుంది. పిడుగు పడే సమయంలో కార్యాలయంలో ఆరుగురు ఇంజనీర్లు విధులు నిర్వ హిస్తున్నారు. పిడుగు పడడంతో విద్యుత్ పరిక రాలు, కంప్యూటర్లు ముఖ్యమైన పరికరాలు దెబ్బతిన్నాయి. కొద్దిసేపు విద్యుత్ సరాఫరాకు అంతరా యం ఏర్పడింది. సిబ్బంది మరమ్మతులు చేపట్టి సరాఫరాను పునరుద్ధరించారు. ఈ పిడుగు ప్రమాదంలో సుమారుగా రూ. 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం -
ఏ స్థానం ఎవరికో?
గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలనే అంశంపై సంబంధిత అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తోంది. ఆయా స్థానాల రిజర్వేషన్ల జాబితాలను రూపొందించి పంపాలని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో సోమవారం కలెక్టరేట్లో ఆయా ఆర్డీఓలు, జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓ, ఎంపీఓలు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో 26 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఎంపీపీ స్థానాలు 26 ఉన్నాయి. ఈ స్థానాలు ఏ సామాజి కవర్గానికి రిజర్వు చేయాలనే అంశంపై కసరత్తు కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే డాటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కేటాయిస్తున్నా రు. డాటాను ప్రభుత్వం నుంచే జిల్లాకు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బీసీలకు దాదాపు పది జెడ్పీటీసీలు, 96 ఎంపీటీసీలు కేటాయించే అవకాశం ఉంది. బీసీలకు 213 సర్పంచ్ స్థానాలు? జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే 213 గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఏ గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వు అవుతాయి? ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వు అయ్యే పంచాయతీలు ఏవీ? ఎస్టీలకు కేటాయించే పంచాయతీలు ఏవీ? అనే అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ల ఖరారుకు లాటరీ పద్ధతి ద్వారా చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు. నేడు రిజర్వేషన్ల జాబితా? ఆయా స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసి.. సంబంధిత జాబితాలను మంగళవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు పంపనున్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్ల పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల సూచనల ప్రకారం ఈ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆయా ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆర్డీఓలు ఖరారు చేయనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్‌ను పంచాయతీ కమిషనర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.రిజర్వేషన్లపై ఉత్కంఠ! -
అర్జీల పరిష్కారానికి కృషి
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● వచ్చిన దరఖాస్తులు 174 సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను సత్వరం పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణిలో గరీమా అగర్వాల్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జిదారులకు న్యాయం జరిగేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, పెన్షన్లు వంటి ఇతర అర్జీలు మొత్తం 174 వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
శక్తి స్వరూపిణి.. త్రిపుర సుందరి
మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం ● బాలాత్రిపుర సుందరిదేవీగా అమ్మవారు దర్శనం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా మండపాలలో అమ్మవార్లు కొలువుదీరారు. ఉత్సవాల తొలిరోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి మండలపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జగన్మాత నామంతో శంభుని కొండ మార్మోగింది. అభిషేకాలు, పారాయణాలతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శోభిల్లింది. సరస్వతి అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నాచగిరి శ్రీక్షేత్రం పీఠాధిపతి శ్రీమధుసూదనానంద సరస్వతి పర్యవేక్షణ, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/వర్గల్(గజ్వేల్) -
సుందరీకరణ వేగిరం చేయండి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఎల్లమ్మ చెరువు కట్ట పనుల పరిశీలన హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్ట సుందరీకరణ పనులు, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. చెరువు నిండుగా ఉండటంతో కట్ట లోపలికి బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లైటింగ్, స్టేజీ, సౌండ్ సిస్టమ్, పోలీస్ బందోబస్తు, జాతీయ రహదారి నుంచి ఎల్లమ్మ చెరువు వైపు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే దసరా పండుగ రోజు నిర్వహించే రాంలీలా కార్యక్రమం విజయవంతం కోసం ప్రచారం నిర్వహించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మున్సిపల్ మాజీ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, అఖిలపక్ష నాయకులు ఉన్నారు. -
బతిమిలాడి ఆయిల్‌పామ్ పంట వేయించా..
నంగునూరు(సిద్దిపేట): ‘ఆయిల్‌పామ్ పంటకు నేను జిమ్మెదారిగా ఉంటా అని రైతులను బతిమిలాడి పంటను సాగు చేయించా. లాభాలు గడించిన రైతులను, నిర్మాణం పూర్తయిన ఫ్యాక్టరీని చూస్తుంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు బావోద్వేగానికి లోనయ్యారు. నంగునూరు మండలం నర్మేటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలసి హరీశ్‌రావు సందర్శించారు. ఫ్యాక్టరీలో కలియ తిరుగుతూ యంత్రాలను, నీటి స్టోరేజీ ట్యాంక్, విద్యుత్ ఉత్పత్తి యూనిట్ పని తీరు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మండుటెండలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తడి దూకడంతో నాటి కరువు ప్రాంతం నేడు సస్యశ్యామలమైందన్నారు. కేసీఆర్, హరీశ్‌కు ధన్యవాదాలు చేర్యాల మండలానికి కూతవేటు దూరంగా నర్మేట లో నిర్మించిన ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కరెంటు, విత్తనాలు, ఎరువులు, సాగు నీరందించడంతో పాటు నకిలీ ఎరువులు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టడంతో నేడు 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు కృషి పలితంగా ఈప్రాంతం సస్యశ్యామలమైందన్నారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగు చేసే లా కృషి చేస్తామన్నారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రాణంగా ప్రేమించే సిద్దిపేటను హరీశ్‌రావుకు అప్పగించడంతో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. యాదవరెడ్డి మాట్లాడుతూ కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేటను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత హరీశ్‌కే దక్కిందన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ఆయాలుగా గౌరవ వేతనంపై విధులు నిర్వహించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంచినీళ్ల బండ, బొంపల్లి, ఆరెపల్లి, తునికిశాల, సంగీత, నంగునూరు, బంజేరుపల్లి, ఆర్అండ్ ఆర్కాలనీ గజ్వేల్ ఆర్అండ్ ఆర్ కాలనీ గజ్వేల్–2లలో ఉపాధ్యాయులుగా, ఆయాలుగా ఖాళీలు ఉన్నాయన్నారు. వీటిలో విధులు నిర్వహించుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేలు గౌరవవేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27లోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి దుబ్బాక ఆస్పత్రి ఎదుట సీఐటీయూ ధర్నా దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుచేయాలని సీఐటీయూ జిల్లా కోషాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక వంద పడకల ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్కు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు అమలుచేయకుండా కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారన్నారు. కార్మికులకు న్యాయపరంగా దక్కాల్సిన వేతనాలతో పాటు సౌకర్యాలు అమలుపర్చాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక పట్టణ కన్వీనర్ భాస్కర్, సాజిద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈత చెట్లకు పూజలు గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని అహ్మదీపూర్‌లో గౌడ సంఘం నాయకులు ఈత చెట్లకు పూజలు చేశారు. సోమవారం ఈత వనంలో ఈదులు గీసేందుకు ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతియేటా దసరాకు నూతనంగా కల్లు దుకాణాలను ప్రారంభించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
అద్దె బస్సు.. కస్సు!
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు తమ జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. దీంతో అద్దె బస్సులన్నీ సోమవారం డిపోకే పరిమితమయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగ వేళ ఊరెళ్లేవారికి సరిపడా బస్సులు లేక, సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. నిత్యం వేల కిలోమీటర్లు.. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో 53 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు సిద్దిపేట డిపో నుంచి నిత్యం జేబీఎస్, హన్మకొండ, కామారెడ్డి, వేములవాడ, మెదక్, రామాయంపేట రూట్లలో తిప్పుతారు. ఈ బస్సులు రోజూ 20వేల కిలోమీటర్ల ద్వారా సుమారు 25వేల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తుంటారు. అద్దె బస్సు యజమానులు హైర్ బస్సు డ్రైవర్లకు ప్రతి నెలా (15రోజులు డ్యూటీ) రూ.15వేలు వేతనంగా చెల్లిస్తుంటారు. కానీ తమకు వేతనం సరిపోవడం లేదని, తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకు మరో రూ.5వేలు వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం విధులు బహిష్కరించి డ్రైవర్లు నిరసన తెలిపారు. అధికారులు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే తిప్పారు. అద్దె బస్సుల్లో రెండు బస్సులను వాటి యజమానులే నడపగా.. మిగిలిన బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో పలు రూట్లలో సరిపడా బస్సులు లేక, సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పలేదు. నిలిచిన బస్సులు.. వేతనాలు పెంచాలి సిద్దిపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాను. రోజు విడిచి రోజు విధులు నిర్వహిస్తున్నాను. నెలలో 15రోజులు డ్యూటీ చేస్తాను. ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వేతనం రూ.15వేలు మాత్రమే చెల్లిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. వేతనాలు పెంచి ఆదుకోవాలి. – ప్రశాంత్, అద్దె బస్సు డ్రైవర్ ప్రయాణికులకు ఇబ్బందులు రానివ్వం హైర్ బస్సు డ్రైవర్లు వేతనాలు పెంచాలని డ్యూటీకి రాలేదు. 53 అద్దె బస్సుల్లో రెండింటిని వాటి యజమానులే (ఓనర్ కమ్ డ్రైవర్) నడుపుతున్నారు. మిగతా బస్సులు నడవట్లేదు. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా సేవలు అందిస్తున్నాం. హైర్ బస్సు యజమానులు డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. త్వరలో విధుల్లో చేరుతారని భావిస్తున్నాం. – రఘు, సిద్దిపేట డిపో మేనేజర్ -
పండుగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త
సీపీ అనురాధసిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అనురాధ సూచించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నామన్నారు. సీసీ కెమరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలన్నారు. శివారు కాలనీలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం కావాలన్నారు. ఖరీదైన వస్తువులు, బంగారం, నగదు ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేయకూడదని, బ్యాంకు లాకర్లో భద్రపర్చాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తొగుట(దుబ్బాక): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా దుబ్బాక నీటిపారుదల శాఖ డీఈఈ చెన్ను శ్రీనివాస్‌రావు, తొగుట సీఐ ఎస్కే లతీఫ్‌లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లో ఆశా గీతాంజలి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారం ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి వేదిక ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కురుమలు కేవలం ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారం, రాజకీయాలలో రాణించాలని కురుమ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంత్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు కంతుల రాములు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోతుగంటి రవికాంత్, ప్రధాన కార్యదర్శిగా వాసూరి శ్రీకాంత్, కోశాధికారిగా బండారి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ఏలేటి రమేష్, బట్టు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా కంతుల లక్ష్మణ్, కోల్పుల రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా కంతుల శ్రీశైలం, అంజయ్య, దేవరాజులు వ్యవహరించారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు రవికాంత్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. అధైర్య పడవద్దని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, రామచంద్రం గౌడ్, భార్గవ్, లక్ష్మారెడ్డి, నందు తదితరులున్నారు. -
సన్నాహాలు
ధాన్యం కొనుగోళ్లకు● 5.03 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వడ్ల సేకరణ లక్ష్యం ● 439 కేంద్రాలు ఏర్పాటు ● ఇరవై రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ షురూ.. ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలో 3.6లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రాగా, 8.28లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 5.03లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఇందుకోసం 439 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. – గజ్వేల్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లను చేపట్టడానికి అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఈ అంశంపై ఒక దఫా ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఒకటిరెండ్రోజుల్లో మరోసారి సమీక్ష జరిపి ఏర్పాట్లపై సర్వం సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి 3.60లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. ఇందులో 3.24లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగులోకి వచ్చాయి. మరో 36వేల ఎకరాల్లో సన్న రకం వడ్లు సాగయ్యాయి. అతివృష్టి.. యూరియా కొరతతో.. ఈసారి అతివృష్టి చాలా ప్రాంతాల్లో వరికి తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. భారీ వరదల కారణంగా వరి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. దీనివల్ల ఆదిలోనే పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. మరోవైపు యూరియా కొరత కూడా వరి దిగుబడులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. సకాలంలో యూరియా వేయకపోవడం వల్ల పంట ఎదుగుదల లోపించింది. మరోవైపు తెగుళ్లు చుట్టుముట్టి దిగుబడులు పడిపోయేలా చేశాయి. అయినా ఈ సీజన్లో మొత్తంగా 8.28లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 5.03లక్షల మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోలు కేంద్రాలకు అమ్మకానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగానే 4.83లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, మరో 20,380 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు వస్తాయని భావిస్తున్నారు. వచ్చే నెల 10 తరువాతే.. అక్టోబర్ 10తర్వాతే కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశమున్నందన అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది వరికి రూ.2,369మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రూ.69 పెరిగింది. మద్దతు ధరను రైతులకు కచ్చితంగా అందించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ప్రత్యేకించి గన్నీ బ్యాగుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇబ్బందులు రానివ్వం జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. కొనుగోళ్లకు సర్వం సిద్దం చేస్తున్నాం. మరో 20 రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తాం. – ప్రవీణ్, పౌరసరఫరాల శాఖ డీఎం ఈ సీజన్లో వడ్ల కొనుగోళ్లకు మొత్తంగా 439 కేంద్రాలను ఏర్పాటుచేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో 231ఐకేపీ, 202 సహకార సంఘాలు, మరో 6 మెప్మాకు చెందిన కేంద్రాలు ఉండబోతున్నాయి. అంతేకాకుండా వడ్లను నింపడానికి 1,25,95000 గన్నీ బ్యాగులు అవసరముండగా, ఇందులో 5,79,3700 పాతవి అందుబాటులో ఉన్నాయని, మరో 6,80,1300 కొత్త గన్నీ బ్యాగులను తెప్పించనున్నారు. అదేవిధంగా వడ్లను నిల్వ చేసుకోవడానికి అవసరమైన గోదాములను సైతం సిద్ధం చేశారు. గోదాముల వద్ద సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. సన్నరకం వడ్లను అమ్మిన రైతులకు వెంటనే బోనస్ డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడానికి అవసరమైన చర్యలు సైతం చేపడుతున్నారు. -
కేతకీలో అమావాస్య పూజలు
తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులుఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో భక్తులు అమావాస్య పూజలు నిర్వహించారు. ఆదివారానికి తోడు అమావాస్య కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాలం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. వేకువ జాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారిని క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు భక్తులు స్వామి వారికి అభిషేకం, అర్చన, హారతితోపాటు వాహన పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అదేవిధంగా పంచభక్ష పరమాన్నాలు మహా నైవేద్యంగా సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
చింతమడక.. స్ఫూర్తి మరవక
సిద్దిపేటరూరల్: స్వగ్రామమైన చింతమడక గ్రామస్తుల స్ఫూర్తితోనే జాగృతి పేరిట బతుకమ్మ పట్టుకొని రాష్ట్రమంతటా తిరిగానని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఆమెను ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. చింతమడకలోని రామాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం మాదిగ సంఘం గ్రామ అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో బతుకమ్మ పేర్చారు. అనంతరం హైస్కూల్ గ్రౌండ్లో గ్రామస్తులతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు. ఆమె మాట్లాడుతూ చింతమడక చరిత్ర సృష్టించిన గ్రామమన్నారు. అదే చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. సొంత ఊరంటే చాలా మందికి ప్రేమ ఉంటుంది. చింతమడకలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకున్నట్లు తనకు గుర్తుందన్నారు. చిన్నప్పుడు అన్ని కులాల వారిని కలుపుకొని బతుకమ్మ ఆడుకున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో బతుకమ్మ ఎత్తుకొని కాళ్లకు బలపం కట్టుకొని తిరిగినట్లు గుర్తు చేశారు. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే అదంతా చేయగలిగానన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అంతకుముందు రాఘవాపూర్‌లో అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేశారు. బతుకమ్మతో రాష్ట్ర మంతటా తిరిగా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎంగిలిపూల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ -
అక్షరాలకు ఆది
● నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ● ముస్తాబైన వర్గల్ క్షేత్రం వర్గల్(గజ్వేల్): తెలుగు రాష్ట్రాల్లో రెండో బాసరగా ఖ్యాతిగడించిన వర్గల్ విద్యా సరస్వతీ క్షేత్రం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. స్వయంభువుగా మహదేవుడు వెలసిన వర్గల్ శంభునికొండపై సప్తస్వరాల గుండు చెంత విద్యా సరస్వతి ఆలయం కొలువుదీరి దినదిన ప్రవర్థమానమై విరాజిల్లుతోంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని వర్గల్ క్షేత్రానికి సికిందరాబాద్ గురుద్వార్ నుంచి ఆర్టీసీ సౌకర్యం ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒక ట్రిప్ చొప్పున బస్సు బయల్దేరుతుంది. ఇవే కాకుండా కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ వైపు వెళ్లే బస్సులో వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద దిగి ఆటోలో క్షేత్రానికి చేరుకోవచ్చు. ఉత్సవాలకు నేడు అంకురార్పణ సోమవారం ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. కలశస్థాపన, చతుషష్ట్యోపచార పూజలు, అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. 29న విశేష మూల సందర్భంగా ఉదయం గిరి ప్రదక్షిణ, 9 గంటలకు లక్ష పుష్పార్చన, 11 గంటలకు పుస్తక పూజ, అక్టోబర్1న మహర్నవమి, ఉదయం 9 గంటలకు అమ్మవారికి అష్టోత్తరశత కలశాభిషేకం, 2న కలశోద్వాసన, అభిషేకం, విద్యాసరస్వతి మాత విజయదర్శనం, శ్రవణా నక్షత్ర సందర్భంగా వెంకటేశ్వర స్వామికి లక్ష తులసి అర్చన జరుగుతుంది.అన్ని ఏర్పాట్లు చేశాంఅమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందిలేకుండా బారికేడ్లతో క్యూలైన్లు, చిన్నారుల అక్షరస్వీకారాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పీఠాధిపతులను, మంత్రులు తదితర ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తూ ఉత్సవ ఆహ్వానపత్రికలు అందజేశాం. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలి. – యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ -
సీఎంకు ఎంపీ చామల వినతి
వీరబైరాన్‌పల్లిగా మార్చండి మద్దూరు (హుస్నాబాద్): దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామాన్ని ప్రభుత్వం వీరబైరాన్‌పల్లిగా పేరు మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రజాకార్లకు వ్యతిరేకంగా బైరాన్‌పల్లిలో జరిగిన పోరాటం చరిత్రలో నిలిపోతుందని, వారి దాడిలో 119 మంది అమరులైనట్లు గుర్తు చేశారు. నాటి అమరవీరుల త్యాగాలకు గుర్తు గా గ్రామాన్ని వీరబైరాన్‌పల్లిగా పేరు మార్చుతూ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయాలన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలోని బురుజు, అమరవీరుల స్తూపం మరమ్మతు కోసం ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. -
2.24 లక్షల మెట్రిక్ టన్నులబియ్యం ఎగుమతి
గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు.. ● గజ్వేల్ రేక్ పాయింట్ రికార్డు ● ఒక్కో రేక్ సామర్థ్యం 2,800 టన్నులపైనే.. ● దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలింపు గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మూడేళ్ల క్రితం ఏర్పాటైన రేక్ పాయింట్ ద్వారా ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ)కు చెందిన బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పదికిపైగా ముఖ్యమైన రేక్ పాయింట్లు ఉండగా, వాటికి దీటుగా ఇక్కడ లావాదేవీలు నడుస్తున్నాయి. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు 80కిపైగా రేక్‌ల ద్వారా 2.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. అలాగే.. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు రసాయనిక ఎరువుల సరఫరా కేంద్రంగా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతికి నిలయంగా మారింది. భవిష్యత్‌లో ఈ రేక్ పాయింట్ మరింత కీలకంగా మారనున్నది. గజ్వేల్‌లో 2022 జూన్ 27న రేక్ పాయింట్‌ను ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో సనత్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, తిమ్మాపూర్, జమ్మికుంట, మహబూబ్‌నగర్, జమ్మికుంట, మహబూబాబాద్ తదితర రేక్ పాయింట్లు ఉండగా, గజ్వేల్‌లో కొత్తగా ఏర్పాటైంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైనన్్ నిర్మాణం జరుగుతుండగా.. ఈ లైన్‌పై గజ్వేల్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ వద్ద రేక్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఎఫ్‌సీఐకి ప్రధాన వనరుగా.. గజ్వేల్ రేక్ పాయింట్ ఎస్సీఐకి ప్రధాన వనరుగా మారింది. ఈ ప్రాంతంలోని అక్కారం, అల్లాపూర్ గోదాముల నుంచి బాయిల్డ్ రైస్‌ను దేశంలోని కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రైలు మార్గంలో గూడ్స్ రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు సుమారుగా 80 రేక్‌ల ద్వారా 2.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను ఇక్కడి నుంచి ఎగుమతి చేశారు. ఒక్కో రేక్ సామర్థ్యం 2,800 టన్నులకుపైనే ఉంటుంది. ఇదే కాదు.. ఈ రేక్ పాయింట్‌కు తమిళనాడు రాష్ట్రలోని కరిగెకళ్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి రైలు మార్గం ద్వారా కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా నిల్వలు వస్తాయి. ఇలా వచ్చిన నిల్వలను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రితోపాటు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు కేటాయింపుల వారీగా వ్యవసాయశాఖ సరఫరా చేస్తున్నది. మక్కలు ఇతర వ్యవసాయోత్పత్తులు సైతం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలను ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఏర్పాటైన ఈ రేక్ పాయింట్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలోని రేక్ పాయింట్లకు ప్రత్యామ్నాయం కావడం వల్ల రాబోవు రోజుల్లో మరింత కీలకంగా మారబోతున్నది. ఈ పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం పరికిబండలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్‌కు అనుకూలంగా మారింది. -
సంప్రదాయ పంటలకు స్వస్తి
నంగునూరు(సిద్దిపేట): సంప్రదాయంగా సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు స్వస్తి పలకాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్‌పామ్ ప్యాక్టరీని శనివా రం ఆయన సందర్శించి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గింజల నుంచి ఆయిల్ తీసే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, అధికారులు చెప్పడంతో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా సిద్ధం చేయాలన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నర్మేటలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే మొదటి సంతకం చేసినట్లు గుర్తు చేశారు. నర్మేట ప్యాక్టరీ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ ప్యాక్టరీ సిద్దిపేట జిల్లాకు ఎంతో కీలకంగా మారనుందన్నారు. రాష్ట్రంలో తయారయ్యే పామాయిల్‌ను ఇతర రాష్ట్రాలకు పంపితే అక్కడే ప్యాకింగ్ చేశారని, ఇక నుంచి నర్మేటలోనే శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తారన్నారు. నాలుగేళ్లు అంతర పంటలు ఆయిల్‌పామ్ తోటలోనాలుగేళ్ల పాటు అంతర పంటగా కోకో, జాజి, మొకడామియా, మునగ, వక్క పంటలను సాగు చేయడంతో అధిక లాభాలు గడించవచ్చని మంత్రి అన్నారు. ఆయిల్‌పామ్ టన్నుకు రూ.20 వేలు అందించేలా కృషి చేస్తామన్నారు. కావున ఆయిల్‌పామ్ సాగు శాతం పెంచేలా అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ డెరెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆయిల్‌ఫెడ్ ఎండీ శంకరయ్య, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సువర్ణ, ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రుణ లక్ష్యాన్ని సాధించాలి
బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశంసిద్దిపేటరూరల్: బ్యాంకర్లకు వివిధ సెక్టార్లో ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ద్వారా ప్రజల్లో డిజిటల్ మోసాల నివారణ, సోషల్ సెక్యూరిటీ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతులకు, వ్యవసాయ రంగానికి ఎక్కువగా రుణాలు అందించాలని కోరారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు అందించాల్సిన రుణాల్లో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందన్నారు. బ్యాంకర్లకు ఇచ్చిన టార్గెట్‌ను బట్టి రుణాలు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ జయదేవ్‌ఆర్యా, ఆర్బీఐ ఏజీఎం గోమతి, నాబార్డు డీడీఎం నిఖిల్, ఎల్డీఎం హరిబాబు, యూబీఐ ఆర్‌హెచ్ శ్రీనివాస్, ఎస్బీఐ ఆర్ఎం మారుతి, మెదక్ డీసీసీబి డీజీఎం విశ్వేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
సీనియర్ సివిల్ జడ్జి మిలింద్ కాంబ్లేమిరుదొడ్డి(దుబ్బాక)/సిద్దిపేటకమాన్: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటేనే సమాజంలో క్రైం రేట్ తగ్గుతుందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మిలింద్ కాంబ్లే అన్నారు. మండల పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే.. సిద్దిపేట జిల్లా జైలును సందర్శించి వంట గది, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలన్నారు. ఖైదీలందరికీ న్యాయవాదుల ఉండాలన్నారు. లేనివారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వికాస్, న్యాయవాదులు యాదయ్య, ఖాజీపురం యోగేందర్, పారా లీగల్ వాలంటీర్ సీహెచ్ కవిత, ప్రొ.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. -
కనెక్షన్.. కలెక్షన్!
● విద్యుత్ శాఖలో పైరవీలదే రాజ్యం ● అధికారులు, కాంట్రాక్టర్ల చేతి వాటం ● ఒక్కో కనెక్షన్‌కు రూ10 వేల నుంచి 20 వేలు వసూలుసాక్షి, సిద్దిపేట: విద్యుత్ శాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారు. పైస లేనిదే పని కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించినా అధికారులు, కాంట్రాక్టర్లకు చేతులు తడపాల్సిందే. దరఖాస్తులు సీరియల్ నంబర్ ప్రకారం కాకుండా పైరవీ చేసిన వారికే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లేకుంటే ఏదో సాకులు చెప్పి విద్యుత్ కనెక్షన్లు జాప్యం చేస్తున్నారు. విద్యుత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో సాగునీటి సౌకర్యం లేని సన్నకారు రైతులు సైతం బోరు వేసి పంటలను పండిస్తున్నారు. ఒకప్పుడు వర్షాధారం మీదనే పంటలు పండించేవారు. ప్రస్తుతం బోర్ల ద్వారా పంటలు ఎక్కువగానే సాగు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,627 విద్యుత్ కనెక్షన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాసులిస్తేనే.. కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కొందరు విద్యుత్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కాసులు దండుకుంటున్నారు. సిఫార్సులు, పైరవీలతో పాటు చేతులు తడిపిన వారికే ముందస్తు కనెక్షన్లు ఇస్తున్నారు. సాధారణ రైతులకు మాత్రం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్, ఇతర మెటీరియల్, కనెక్షన్ కావాలంటే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి అవినీతి, అక్రమాలను అరికట్టాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు. -
విధుల్లో అలసత్వం తగదు
● విద్యార్థులకు మెనూ ప్రకారంభోజనం అందించాలి ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతోపాటు విధుల్లో అలసత్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. మెనూ ప్రకారం కాకుండా అన్నం, పప్పుచారు, గుడ్డు మాత్రమే అందించినందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం మిక్స్డ్ వెజిటేబుల్ కూర వండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హాస్టల్ వార్డెన్, సిబ్బందిని హెచ్చరించారు. ప్రాంగణంలోని కిచెన్ గార్డెన్ పరిశీలించి ఆరోగ్యాన్ని కాపాడే మునగ తప్పనిసరిగా పెట్టాలన్నారు. కిచెన్ గార్డెన్ ను బాగా అభివృద్ధి చేయాలని ప్రిన్సిపాల్ రవీందర్‌ను ఆదేశించారు. పాఠశాలలో కుట్టుమిషన్ శిక్షణ ఇస్తున్న క్రమంలో కుట్టు మిషన్ నైపుణ్యం పెంచేలా బాలికలకు శిక్షణ ఇవ్వాలని ట్రెయినీ టీచర్‌కు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
లంచాల కార్యదర్శి మాకొద్దు
అదనపు కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదునంగునూరు(సిద్దిపేట): ప్రతి పనికి పైసలు డిమాండ్ చేస్తున్న పంచాయతీ కార్యదర్శిని తొలగించాలని గట్లమల్యాల గ్రామస్తులు అదనపు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. గట్లమల్యాలలో నిర్మించిన ప్రభు త్వ ఆస్పత్రిని శుక్రవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రేవతి సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై టీఎస్ఎంఐడీ ఈఈకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఆస్పత్రి భవనం పూర్తయినా వసతులు లేక ప్రారంభానికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిచి కాంపౌండ్‌వాల్, పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయకుంటే టెడర్ రద్దు చేసి కొత్త వారిని పిలుస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి లలిత ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. -
ఉత్తమస్థానం ఉపాధ్యాయుల కృషి ఫలితమే
డీఈఓ శ్రీనివాస్రెడ్డిజగదేవ్పూర్(గజ్వేల్): ఉపాధ్యాయుల సహకారంతోనే రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాకు ఉత్తమస్థానం లభించిందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్ మండల విద్యాధికారి మాధవరెడ్డి పదవీ విరమణ అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాధవరెడ్డి మూడు దశాబ్దలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ప్రశంసలు పొందారని గుర్తు చేశారు. నాడు క్లాస్మెంట్.. నేడు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాధికారి మాధవరెడ్డిలు కలిసి చదువుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరు విద్యారంగంలో స్థిరపడ్డారు. శ్రీనివాస్‌రెడ్డి తరగతి గదిలో క్లాస్మెంట్గా ఉద్యోగంలో జిల్లా అధికారిగా పదవీ విరమణ సభకు హాజరు కావడం విశేషం. మాధవరెడ్డి దంపతులకు డీఈఓ శాలువా కప్పి సన్మానించారు. -
ఆయిల్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ సక్సెస్
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. ఆయిల్ యూనిట్లో గింజల నుంచి ఆయిల్ తీస్తూ టెక్నికల్ సిబ్బందితో కలిసి ఆయిల్‌ఫెడ్ అధికారులు లోపాలను గుర్తించారు. ఇంకా పవర్‌ప్లాంట్ యూనిట్‌ను పరీక్షించాల్సి ఉండగా మిగతా పనులు పూర్తి కావడంతో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తి కావడంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ జరిగిన ఫ్యాక్టరీ నేడు ప్రారంభానికి సిద్ధం కావడం చిరస్మరణీయమన్నారు. -
ఉద్యాన వర్సిటీలో ముగిసిన సదస్సు
ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రెండురోజులుగా నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. సదస్సులో వనరుల పరిరక్షణ, పర్యావరణ మార్పుల ప్రభావం, ఉద్యాన రంగంలో వ్యూహాలు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. వాతావరణ మార్పులకు కారణంగా వచ్చే ఉద్యాన పంటల ప్రభావాలను ఎలా తగ్గించవచ్చు, అనువర్తాల వైవిధ్యాన్ని ఏవిధంగా పెంచుకోవచ్చు, భవిష్యత్తులో ఉద్యాన రంగంలో సాధించాల్సిన లక్ష్యాలపై చర్చించారు. సదస్సులో విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రాజిరెడ్డి సందర్శించి ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో యునివర్సిటీ అధికారులు భగవాన్, సురేశ్‌కుమార్, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, శ్రీనివాసన్, విజయ తదితరులు పాల్గొన్నారు.చిన్నకోడూరు(సిద్దిపేట): ఈదురు గాలులతో కూడిన వర్షానికి శుక్రవారం మండల పరిధిలోని మాచాపూర్‌లో రెండు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల సమీపంలో భారీ చెట్లు పడటంతో ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపడి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గల్(గజ్వేల్): తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన గౌరారం చిన్నారులకు అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పిల్లలను పరామర్శించి ఓదార్చారు. రూ.36,000 ఆర్థికసాయం అందజేశారు. రెండు నెలల వ్యవధిలో చిన్నారుల తల్లిదండ్రులు, అమ్మమ్మ మృతి బాధకరమన్నారు. పిల్లల దైన్యస్థితి ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం డిమాండ్ సిద్దిపేట రూరల్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పశువైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పశువైద్యాధికారిపై ‘సాక్షి’లో ప్రచురితమైన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలన్నారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో గొర్రెల కాపరుల్లో ఆందోళన నెలకొందన్నారు. తక్షణమే దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. అండర్ 14 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో సిద్దిపేటఅర్బన్, ద్వితీయ స్థానంలో దౌల్తాబాద్, తృతీయ స్థానం చిన్నకోడూరు, నాల్గవ స్థానంలో నంగునూరు మండలాలు నిలిచాయి. అండర్–17 బాలుర విభాగంలో దుబ్బాక ప్రథమ, హుస్నాబాద్ ద్వితీయ, తృతీయ స్థానంలో జగదేవ్‌పూర్ నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో కూకునూరుపల్లి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో హుస్నాబాద్, తృతీయ స్థానంలో ధూళ్మిట్ట మండలాలు నిలిచాయి. -
న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిందే
సిద్దిపేటకమాన్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే శాసనసభ సమావేశాల్లో రక్షణ బిల్లును ప్రవేశపెట్టాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రమేష్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూలులో, నాంపల్లిలో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట కోర్టు ఎదుట న్యాయవాదులు నల్లబ్యాడ్జీలతో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదిపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీనారాయణ, సాయిబాబ, గోవర్ధన్‌రెడ్డి, రవిబాబు, పత్రి ప్రకాష్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్‌లో నిరసన హుస్నాబాద్: న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టులో అనిల్‌కుమార్ అనే న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ శుక్రవారం న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, వారి హక్కుల రక్షణ కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు చేయడం తగదన్నారు. స్టేషన్ బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కిరణ్‌కుమార్, కన్నోజు రామకృష్ణ, జుమ్లాల్నాయక్, కొత్తపల్లి దేవేందర్, బాలకిషన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ తీగ కాజేస్తుండ్రు
కరెంట్ తీగలను దోచేస్తున్నారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే కరెంట్ వైరును కాజేస్తున్నారు. సాగు నీటిని అందించేందుకు తప్పని పరిస్థితుల్లో విద్యుత్ వైర్లు బయట కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు అందిస్తే బిగిస్తున్నారు. రైతుల ఆపదను ఆసరాగా చేసుకుని విద్యుత్ వైరును పలువురు కాంట్రాక్టర్లు అందించడం లేదు. విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,79,527 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేశారు. అందులో 1,78,900 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా 2,627 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. – సాక్షి, సిద్దిపేట బోర్లు, బావుల కింద పంటల సాగుకు రైతులు కరెంట్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. 5హెచ్‌పీ మోటార్లకు విద్యుత్ శాఖ కనెక్షన్లు ఇస్తోంది. 5హెచ్‌పీ కనెక్షన్‌కు రైతు రూ.5,350 మీ సేవలో చెల్లించాలి. విద్యుత్ శాఖ ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా సర్వే చేస్తారు. లైన్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అంచనాలు తయారు చేసిన అనంతరం మంజూరు చేస్తారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.70వేలు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా అవసరమగు సామగ్రిని విద్యుత్ శాఖ కొనుగోలు చేసి కాంట్రాక్టర్‌కు అందజేస్తుంది. విద్యుత్ శాఖ అందించే వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామగ్రితో రైతులకు విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. ఇంకా అదనంగా అవసరమైతే మళ్లీ డీడీ చెల్లించాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీలోనే అంతా సామగ్రి వస్తే అవసరం లేదు. ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని.. దాదాపు గత ఏడాది నుంచి విద్యుత్ కనెక్షన్‌కు సబ్సిడీ మంజూరు ఆలస్యమవుతుంది. పంటలకు సాగునీటిని అందించకపోతే నష్టపోయే ప్రమాదం ఉండటంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తాం.. విద్యుత్ వైర్ కొనుగోలు చేసి తీసుకవస్తే బిగిస్తాం అని రైతులకు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీంతో వైర్‌ను కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.70వేల నుంచి కరెంట్ వైర్, ఇతర సామగ్రిని డ్రా చేస్తున్నారు. కానీ వైర్‌ను తిరిగి రైతులకు అందించడం లేదు. ఇలా చాలా ప్రాంతాల్లో కాసుల కోసం విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారు. దీంతో రైతుల పై భారమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు దృష్టి సారించి అక్రమాలకు చెక్‌పెట్టాలని రైతులు కోరుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు రైతుల ఆపదను ఆసరా చేసుకుని మోసం విద్యుత్ శాఖ వైరు అందించినారైతులకు ఇవ్వని వైనం -
ఇంటింటా పౌష్టికాహారం
దుబ్బాక: శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధిస్తున్నా.. ఇంకా పౌష్టికాహారం లోపంతో మాతాశిశు మరణాలు చోటుచేసుకుంటుండటం బాధాకరం. ఆర్థిక పరిస్థితులతో చాలా మంది మహిళలు గర్భంతో ఉన్న సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోకపోతుండటంతో మధ్యలోనే అబార్షన్లు కావడం.. ప్రసవం అయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి తల్లిబిడ్డలు పురిట్లోనే మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో మాతా శిశు మరణాలను నివారించడంతోపాటు ఆరోగ్య తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే పోషణ మాసోత్సవంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించడంతో పాటు గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నారు. పౌష్టికాహారం లోపంపై.. పిల్లల సంరక్షణ, పెంపకంపై సరైన అవగాహన లేకపోవడం, పెరుగుదల, ఆటంకాలు, అనారోగ్యాలకు వెంటనే చికిత్స అందించక పోవడం తదితర అంశాల్లో ఇంకా చాలా ప్రగతి సాధించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. పౌష్టికాహార లోపంపై ఐసీడీఎస్ యుద్ధంలా కార్యక్రమాలు చేపడుతూ ప్రగతిని సాధిస్తోంది. 1,150 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,150 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. గర్భిణులు 6,152, బాలింతలు 4,995, ఐదేళ్లలోపు పిల్లలు 60,836 మంది ఉన్నారు. వచ్చే నెల 16 వరకు.. ఈ నెల 17న ప్రారంభమైన పోషణ మాసం వచ్చే నెల 16 వరకు చేపడుతున్నారు. జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరధిలో సీ్త్ర శిశు సంక్షేమశాఖ జిల్లా అఽధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలతో సమావేశాలు చేపట్టడడం పౌష్టికారం లోపం వల్ల జరిగే నష్టాలు తెలియజేస్తున్నారు. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి తదితర విషయాలపై సంపూర్ణంగా అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా తయారు చేసిన రకరకాల పౌష్టికారాన్ని అందిస్తూ అంగన్వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. విస్తృతంగా ప్రచారం గర్భిణులు సరైన పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడంతో పుట్టబోయే పిల్లలు తక్కువ బరువుతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. పౌష్టికాహారలోపాలు లేకుండా చూసేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. గర్భిణులు పోషకాహారం సక్రమంగా తీసుకుంటనే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. పుట్టబోయే బిడ్డ తల్లి ఆరోగ్యవంతంగా ఉంటారు. – లక్ష్మీకాంతరెడ్డి, జిల్లా మహిళా శిశు, సంక్షేమ అధికారి సీ్త్ర శిశుసంక్షేమ శాఖ చర్యలు విస్తృతంగా పోషణ మాసోత్సవం ఐదు ఐసీడీఎస్ పరిధిలో1,150 అంగన్వాడీ కేంద్రాలు -
కొనసాగుతున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో గురువారం స్పాట్ అడ్మిషన్ల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా శుక్రవారం కూడా ఈ స్పాట్ అడ్మిషన్లు కొనసాగనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఈ నెల 20న దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. స్పాట్ అడ్మిషన్లో పాల్గొనే విద్యార్థులు రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఉద్యాన శాఖ అధికారి రమేశ్ దుబ్బాక: ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని ఉద్యాన శాఖ అధికారి రమేశ్ అన్నారు. గురువారం పెద్దగుండవెల్లిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు రవి వ్యవసాయ భూమిలో రెండు ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ మల్లయ్య, ఏఈఓ సంధ్య, పంచాయతీ సెక్రటరీ మరళీ, రైతులు ఉన్నారు. డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయుడే మార్గదర్శకుడని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రామంచ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అబ్దుల్ షరీఫ్ ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయులకు తమ ఉద్యోగ జీవితంలో తరగని ఆస్తి వారి వద్ద చదువుకున్న విద్యార్థులేనన్నారు. సమావేశంలో జీడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎంఈఓ యాదవరెడ్డి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్గల్(గజ్వేల్): గౌరారంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను గురువారం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పరామర్శించారు. రెండు నెలల వ్యవధిలో తల్లి కవిత, అమ్మమ్మ భారతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఇటీవల అనారోగ్యంతో తండ్రి మంజునాథ్ మృతిచెందడంతో పదమూడేళ్లలోపు ఉన్న నయనిక, అక్షయ్ అనాథలుగా మిగిలారు. పిల్లల దయనీయ పరిస్థితి తెలిసి చిన్నారులను పరామర్శించారు. రూ.30,000 ఆర్థికసాయం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున భవిష్యత్‌లో అండగా ఉంటామని పిల్లలకు భరోసా కల్పించారు. సిద్దిపేటకమాన్: మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మత్తు పదార్థాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలపాలన్నారు. -
దంచికొట్టిన వాన
గజ్వేల్: భారీ వర్షాలు కురవడంతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మరోసారి మత్తడి దూకుతోంది. ఫలితంగా ఆ వరదనీరంతా పార్ధివేశ్వరాలయం రోడ్డువైపు నుంచి ప్రధాన రోడ్డుపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డుపై ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో బంకులో లావాదేవీలు నిలిపేశారు. మళ్లీ జలదిగ్బంధంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రోడ్డు -
ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం
● పల్లెల్లో ఆరోగ్య సేవలు అందించాలి ● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అక్కన్నపేట(హుస్నాబాద్): మారుమూల పల్లెల్లో జ్వరాలు ప్రబలకుండా వైద్యబృందం ఎప్పటికప్పుడు సేవలను అందించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్యర్వంలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియోన్ ద్వారా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. స్వయంగా అక్కడే బీపీ పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కంటి, దంత, ఘగర్, బీపీ, గర్భ, చర్మ తదితర సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరం పేదప్రజలకు వరంలాంటిదన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న రోగల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని గరీమా అగర్వాల్ రైతులకు సూచించారు. మండలంలోని మోత్కులపల్లికి చెందిన గొర్ల కొమురయ్య అనే రైతుకు చెందిన మూడెకరాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఆమె మాట్లాడుతూ ఆయిల్‌పామ్ అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చున్నారు. అలాగే ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి స్వరూప, ఎంపీడీఓ భానోతు జయరాం తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో కిశోర బాలికల సంఘాలు
● కలెక్టర్ హైమావతి ● ఆరోగ్య, శిశుసంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం సిద్దిపేటరూరల్: మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరే త్వరలో కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో గ్రామీణాభివృద్ధి శాఖ, పాఠశాల, ఇంటర్మీడియెట్, లేబర్, ఇండస్ట్రీస్, వైద్యారోగ్య, శిశు సంక్షేమ, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లాలోని కిశోర బాలికలతో సంఘాల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కిశోర బాలికల సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను తొలగించవచ్చన్నారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు అనేది జీవితంలో అత్యంత కీలక దశ అని, ఈ దశలో సరైన మార్గదర్శకం ఇస్తేనే కౌమార బాలికలు సమాజానికి మార్గదర్శకులుగా మారతారన్నారు. బాల్యవివాహాలు, చదువు నిలిపివేయడం, రక్తహీనత, పోషకాహారలోపం, వేధింపులు వంటి ఎన్నో సవాళ్లు కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్నారన్నారు. బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారతన్నారు. గ్రామాల వారీగా సెర్ప్, ఏపీఎంలు, సీసీలు, వీఓఏలు సంఘాలు ఏర్పాటు చేసేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఏడీఆర్డీఓ సుధీర్, డీఎంహెచ్ఓ, పరిశ్రమల శాఖ అధికారి గణేష్ రామ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీందర్‌రెడ్డి, లేబర్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సెర్ప్ డీపీఎంలు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌లో వేగం పెంచి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియపై జూమ్ ద్వారా ఎంపీడీఓలు, ఎంపీఓ, హౌసింగ్ ఏఈ, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్మెంట్ లెవల్లోకి రాని వారి వివరాలు తన వద్దకు తీసుకురావాలన్నారు. ఇంకా మార్కింగ్ చేయని వారితో మాట్లాడి సుముఖంగా లేని వారితో లెటర్ రాయించి తీసుకోవాలన్నారు. ఇసుక కొరత లేకుండా చూసుకోవాలని, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు గృహాల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. -
పంటకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు
సిద్దిపేటజోన్: ఆయిల్‌పామ్ సాగుకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఇటీవల ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్‌కు అనుసంధానంగా కోకో, వక్క పంట సాగును అధ్యయనం చేసిన రైతులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం జరిగిందని, నాలుగేళ్ల కష్టం ఫలితాలు మీకళ్ల ఎదుటే ఉందన్నారు. ఆయిల్ పామ్ రైతులుగా ఉన్న అనుభవాన్ని ఇతర రైతులకు అవగాహన కల్పించి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటగా కోకో సాగుకు ఎకరాకు రూ.12 వేలు రాయితీ ఉందన్నారు. అదనంగా రూ. 80 వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోకో పంట ఎంతో లాభదాయకంగా ఉందన్నారు. ఇది ఆయిల్‌పామ్ సాగుకు ముందడుగు లాంటిదని అభివర్ణించారు. రైతులకు మేలు చేసే దిశగా ఆయిల్‌పామ్ సాగు విస్తరణ పెరిగేలా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 28 శాతాన్ని 18శాతానికి తగ్గించిందని, దీనిపై పోరాటం చేస్తామన్నారు. ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటల సాగుకు మొగ్గుచూపాలి సహచర రైతులకు అవగాహన కల్పించాలి రైతులతో ఎమ్మెల్యే హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ -
సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్కొండపాక(గజ్వేల్): రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం చూపవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హెచ్చరించారు. కుకునూరుపల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల నమోదు రిజిస్టరును, ఆన్లైన్ నమోదు తీరులను పరిశీలించారు. ఈసందర్భంగా హమీద్ మాట్లా డుతూ త్వరలో భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వం పరిష్కార దిశగా ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. సాదా బైనామాల సమస్యల పరిష్కారం విషయంలో చేసుకున్న దరఖాస్తులను పరిష్కారించే దిశగా స్పష్టమైన ప్రకటన రానుందన్నారు. అందుకు అనుగుణంగా సిద్దంగా ఉండాలన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలు పేరుకుపోకుండా చూసుకోవాలన్నారు. -
నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలలో ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిబద్ధత కల్గి ఉండాలని ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి) డైరెక్టర్ గాజర్ల రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్‌లో నిర్వహించిన విద్యాశాఖ అధికారుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో గాజర్ల రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో సుమారు 15 అంశాలపై సమీక్ష నిర్వహించి, జిల్లా విద్యాధికారి, కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులకు, గాజర్ల రమేశ్ సూచనలు ఇచ్చారు. కొండపాక మండల పరిధిలోని సిరిసినగండ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల కనీస సామర్థ్యాలు, ప్రతిభను పెంచుతున్న తీరును ప్రశంసించి సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
బియ్యం నాసిరకం.. బువ్వ అదోరకం
● పాఠశాలలకు పురుగుల బియ్యం సరఫరా ● మెత్తటి అన్నంతో విద్యార్థుల అవస్థలు ● అధికారుల పర్యవేక్షణ లోపం ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు దుబ్బాకటౌన్: ప్రతీ పాఠశాలకు నాణ్యమైన సన్న బియ్యంతో విద్యార్థుల కడుపునింపుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ దుబ్బాకలోని పలు పాఠశాలల్లో మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు. బియ్యం సంచి తెరిస్తే చాలు ముక్క వాసన, తెల్లపురుగులు, లక్క పురుగులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యం ఘనమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యమైన బియ్యం అందక కింది స్థాయి ఉద్యోగులు, భోజనం మింగుడు పడక విద్యార్థులు నానావస్థలు పడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం పురుగుల బియ్యం సరఫరా చేయడంతో వాటిని తొలగించడానికి వంట పని వారు సైతం నానా తంటాలు పడుతున్నారు. పాఠశాలలో ఓ గదిలో బియ్యం ఆరబెట్టి పురుగులు తొలగిస్తున్నారు. కానీ వారు ఎంత వరకు పురగులు తొలగిస్తున్నారనేదే సందేహించాల్సిన విషయం. పురుగులు పూర్తి స్థాయిలో తొలగించకుంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటని, వారి ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అస్వస్థత బారిన విద్యార్థులు నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రుల వాదన. దుబ్బాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెం.1లో నిత్యం తెల్ల పురుగులు, మెత్తటి అన్నంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నాసిరకం మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని వారు కోరుతున్నారు. బియ్యంలో పురుగులు దుబ్బాక మండలంలో 57 పాఠశాలకు దాదాపు వంద క్వింటాళ్ల బియ్యం ప్రతీ నెల సరఫరా చేస్తున్నారు. ఇందులో అధిక శాతం పురుగుల బియ్యం ఉండటం గమనార్హం. ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం నాసిరకం బియ్యం సరఫరా కాకుండా చర్యలు చేపడతాం. దుబ్బాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెం.1కు అందించే బియ్యం నాసిరకంగా ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే నాణ్యమైనవి అందించేలా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు భయాందోళనకు గురి కావద్దు. –ప్రభుదాస్, ఎంఈఓ, దుబ్బాక మెత్తటి ముద్దలాంటి అన్నం -
లబ్ధిదారులే ఆ ఇళ్లల్లో ఉండాలి
● కలెక్టర్ హైమావతి ● డబుల్బెడ్రూం ఇళ్లపై అధికారులతో సమీక్ష సిద్దిపేటరూరల్: జిల్లాలోని డబుల్బెడ్రూం ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు అప్పగింత, ఇతర ప్రగతి పనులపై తహసీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరైనా లబ్ధిదారులకు అందించకపోవడం, కొన్ని అన్యాక్రాంతం కావడం వంటి ఘటనలు దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో డబుల్బెడ్రూం ఇళ్లను వేరేవాళ్లు ఆక్రమించిన క్రమంలో వెంటనే అధికారులు క్షేత్రస్తాయిలో తనిఖీలు నిర్వహించి ఖాళీ చేయించి అర్హులకు అప్పగించాలన్నారు. మిగిలిన ఇళ్లను ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హతగల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి మిగిలిన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వెంటనే మానిటరింగ్ కమిటీలను నియమించాలని, నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓలు సదానందం, రామ్మూర్తి, చంద్రకళ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ పతాకం ఆవిష్కరణ సిద్దిపేటజోన్: ప్రజాపాలన వేడుకల్లో భాగంగా బుధవారం జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ హైమావతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ చరిత్ర ఘనం
అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ సిద్దిపేటకమాన్: తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉందని సిద్దిపేట అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ అన్నారు. ప్రజాపాల న దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ హుస్నాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. మోదీ జన్మదినం పురస్కరించుకొని పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, మండల అధ్యక్షుడు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో వేర్వేరుగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించగా 103 మంది రక్త దానం చేశారు. విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు, రామ మందిరం నిర్మాణం, జఠిలమైన సమస్యలను మోదీ పరిష్కరించారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాం గోపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో ఈ నెల 22 నుంచి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానిస్తూ బుధవారం పలువురి ప్రముఖులకు ఆలయ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తదితరులను హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానపత్రికలు ఇచ్చారు. దరఖాస్తు చేసుకోండి గజ్వేల్‌రూరల్: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సబ్జెక్ట్‌లో బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం బుధవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఎస్సీ, ఎస్టీలు 50శాతం మార్కులతో, బీసీ, ఓసీలు 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు. అదే విధంగా యూజీసీ, నెట్, సెట్, పీహెచ్డీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో ఈనెల 18న ఉదయం కళాశాలలో జరిగే ఇంటర్వ్యూ(డెమో)కు హాజరు కావాలని సూచించారు.శిక్షణ పొందుతున్న సర్వేయర్లు హుస్నాబాద్‌రూరల్: పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో కొత్త సర్వేయర్లు భూముల కొలతలపై డిజిటల్ సర్వేలో శిక్షణ పొందుతున్నారు. వీరికి సర్వేయర్ లక్ష్మీనారాయణ మ్యాప్‌లు గీయడం, పాత రికార్డుల ప్రకారం కొలతలు వేయడంపై శిక్షణ ఇస్తున్నారు. సర్వేయర్లకు డిజిటల్ పరిజ్ఞానం కోసం కంప్యూటర్లో అవగాహన కల్పిస్తున్నారు. -
యూరియా కొరత లేదు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి జగదేవ్‌పూర్(గజ్వేల్): రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతులకు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జగదేవ్‌పూర్ మండలంలో 50 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, విడతల వారీగా పంపిణీ చేస్తామన్నారు.ప్రతి రైతుకూ యూరియా అందుతుందన్నారు. -
అభివృద్ధి శరవేగం
● బైరాన్‌పల్లి పోరాట పటిమ.. తెలంగాణ పోరాటానికి మార్గదర్శకం ● ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు కల్పించాం ● జిల్లాను ప్రగతి పథంలో నిలుపుదాం ● రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవంసంక్షేమానికి ప్రాధాన్యంసాక్షి, సిద్దిపేట: ప్రజాపాలన ప్రభుత్వం.. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.5లక్షల నుంచి రూ. పది లక్షలు పెంచామన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. సెప్టెంబర్ 17న భారత దేశంలో తెలంగాణ హైదరాబాద్ విలీనమైన రోజు, ఈ విలీన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరుపుకొంటున్నామని తెలిపారు. బైరాన్‌పల్లి పోరాట పటిమ తెలంగాణ పోరాట స్ఫూర్తికి మార్గదర్శకమని కోనియాడారు. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా.. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డు కోసం పదేళ్లుగా జనం నిరీక్షించారని, వారందరూ సన్న బియ్యం తినాలన్న ఉద్దేశ్యంతో కొత్త కార్డులు జారీచేశామన్నారు. రెవెన్యూ ప్రక్షాళన చేస్తూ భూ భారతిని తీసుకువచ్చామని గుర్తు చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ సమృద్ధిగా నిధులు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళల అభివృద్ధి కోసం ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ పంపులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని మంత్రి వివరించారు. 65వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. హైదరాబాద్‌లో అమరవీరుల స్ఫూర్తిగా స్తూపం నిర్మిస్తున్నామని, ఇది భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా రూపకల్పన చేస్తున్నామన్నారు. మొక్కలను నాటి ఆదర్శంగా నిలిచిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ డాక్టర్ అనురాధ, అదనపు కలెక్టర్లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా అఽధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి
హుస్నాబాద్: ప్రస్తుతం 90 శాతం రోగాలు ఆహారం ద్వారానే వస్తున్నాయని, మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు, కౌమార దశ బాలికలకు వైద్య శిబిరాలు నిర్వహించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబంలో మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మునగాకు, పప్పులు, ఆకుకూరలు సమపాళ్లల్లో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆస్పత్రిలో ఆయా వైద్య శిబిరాలను ప్రారంభించారు. -
రాష్ట్రపతి నిలయంలో ‘పూలే’ విద్యార్థుల ప్రదర్శన
వర్గల్(గజ్వేల్): సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం వర్గల్ పూలే గురుకుల డిగ్రీ కళాశాల బాలికలకు దక్కింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధారాణి మార్గదర్శకంలో 22 మంది వలంటీర్ల బృందం రాష్ట్రపతి నిలయం చేరుకున్నారు. ‘తెలంగాణ ఉదయం’ పేరిట తెలంగాణ విమోచన పోరాట చరిత్ర ఘట్టాలను చాటుతూ 15 నిమిషాల నాటక ప్రదర్శనతో ఆహుతులను అలరింపజేశారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, మాడపాటి హన్మంతరావు, ఆరుట్ల కమలాదేవి తదితర పాత్రలతో విద్యార్థులు ఆకట్టుకుని ప్రశంసలు చూరగొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రసిద్ధ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, రజాకార్ సినిమా నిర్మాత నరసింహరెడ్డి, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రమేశ్ విద్యార్థుల ప్రదర్శన తిలకించి అభినందించారు. జ్ఞాపికను అందించి సన్మానం చేశారు. -
ఆదిపితామహుడు విశ్వకర్మ
సిద్దిపేటరూరల్: కర్మయోగం, శిల్పకళ, యాంత్రిక విజ్ఞనానికి ఆదిపితామహుడు విశ్వకర్మ అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. బుధవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి మంత్రి పొన్నం, కలెక్టర్ హైమావతి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ మహర్షి నిర్మించిన అద్భుతాలను మనం శ్రుతి, స్మృతి, పురాణాల్లో తెలుసుకుంటామన్నారు. మన జీవనోపాధికి, సమాజ అభివృద్ధికి మూలా ధారం అయిన పనిముట్లను కూలీలు, శిల్పులు, ఇంజనీర్లు, కార్మికులు, కర్మకారులు అందరూ పూజిస్తారన్నారు. ప్రతి పని చిన్నది పెద్దది అని చూడకుండా, కష్టపడి, నిజాయితీతో పనిచేస్తేనే జీవితం సార్థకమవుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, సీపీ అనురాధ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా స.హ.చట్టం
సిద్దిపేటరూరల్: సమాచార హక్కు చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సమాచార హక్కు చట్టంపై పీఐఓలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లు అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, పీవీ శ్రీనివాసరావు, మెహసిన పర్వీన్‌లు కలెక్టర్ హైమావతి, సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌లతో కలిసి పాల్గొన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, దీనికి కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో 17,000 దరఖాస్తులు పెండింగ్ ఉన్న సందర్భంగా వాటిని పరిష్కరించి జీరోగా మార్చేందుకే జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా లక్షా 50 వేల మంది సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగుతున్నారన్నారు. తెల్లరేషన్ కార్డ్ దారుడు ఉచితంగా సమాచారాన్ని పొందవచ్చన్నారు. ఇతరులు 10 రూపాయల కోర్ట్ ఫీ ద్వారా చెల్లించి సమాచారం పొందవచ్చన్నారు. పౌర సేవలు ఏ సమయంలో అందించాలి, అధికారుల వివరాలను తెలిపే సైన్ బోర్డ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్యాలయంలో పీఐఓ, ఏపీఐఓలు దరఖాస్తులు స్వీకరించి సమాచారం అందించాలని సూచించారు. చట్టంపై అధికారులందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరిగేలా ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా చట్టంపై పీఐఓ,ఏపీఐ లకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సమాచార హక్కు చట్టం కమిషనర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ ఆర్టీఐ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వారథులుగా ప్రభుత్వ అధికారులు సిబ్బంది పని చేయాలన్నారు. తప్పుడు సమాచారం అందించినా, ఆలస్యం చేసినా ఆర్ట్టీఐ చట్టం ప్రకారం కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు అనవసరంగా భయాందోళనలకు గురై సమాచారాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం చాలా దోహదం చేస్తుందన్నారు. జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న 170 కేసులను కమిషన్ సభ్యులు శాఖల వారీగా పరిశీలించి పరిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, ఏసీపీలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పూజల
ప్రశాంత్‌నగర్(సిద్ధిపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల పూజల హరికృష్ణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. జిల్లా కాంగ్రెస్‌లో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలపై పార్టీ చూసుకుంటుందని, పట్టించుకోవద్దని తాను అండగా నిలబడతానని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సిద్దిపేటలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులును ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజురెడ్డి, ఆర్థికప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దుబ్బాక: దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలు చేసేలా త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని 15వ, 6వ వార్డుల్లో, చేర్వాపూర్‌లో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, మేసీ్త్రలతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. దుబ్బాక పట్టణం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వెనుకబడి ఉందన్నారు. ముగ్గులు పోసిన చోట వారం రోజుల్లో బేస్మెంట్ లెవల్ పూర్తికావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనంతుల శ్రీనివాస్, చంద్రారెడ్డి, వార్డు ఆఫీసర్స్ తదితరులు ఉన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలకు నోటీసులు అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి(ఏఓ) తస్లీమా సుల్తానా మంగళవారం స్థానిక రైతు వేదికలో విలేకరులతో మాట్లాడు తూ వెల్లడించారు. పోతారం(జే) గ్రామంలోని లక్ష్మి ఫర్టిలైజర్ దుకాణం, మల్లంపల్లిలోని రైతు ఉత్పత్తిదారుల సంఘం(ప్రహర్ష), కట్కూర్ లోని సహకార సంఘానికి నోటీసులు ఇచ్చిన ట్లు తెలిపారు. యూరియా బస్తాలు తీసుకెళ్లేందుకు టోకెన్లు ఇవ్వగా, రైతులు ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లేలోపే యూరియా బస్తాలను ఇతరు లకు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోతారం(జే)లోని ఎరువుల దుకాణం యజ మాని బ్లాక్‌లో బస్తా యూరియాను రూ.500ల కు అమ్మిన్నట్లు తెలిసిందన్నారు. దీంతో సద రు దుకాణదారుడికి నోటీస్ జారీ చేశామన్నా రు. యూరియా బ్లాక్‌లో అమ్మినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి గజ్వేల్: త్వరలోనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని, షరతుల్లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం లభించనున్నదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గఫార్ ఉద్యోగ విరమణ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. మెరుగైన పీఆర్సీ ఇప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ వృత్తిలో అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగం, రాష్ట్ర నాయకులు వంగ మోహన్‌రెడ్డి, గుండు లక్ష్మన్, జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సిద్ధం
● ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ● త్వరలో సీఎం రేవంత్‌తో ప్రారంభిస్తాం ● ఫ్యాక్టరీ పనుల పరిశీలన నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రాంరంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీని సందర్శించారు. ట్రయల్‌రన్‌లో భాగంగా ఆయిల్‌పామ్ గింజల కొనుగోలు చేసే ర్యాంపు పనులను ప్రారంభించారు. యంత్రాల పని తీరును పరిశీలించి ఆయిల్‌ఫెడ్ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో విధులు నిర్వహించాలి
● పోలీసు కమిషనర్ అనురాధ ● సిద్దిపేట ఏసీపీ కార్యాలయం, టూటౌన్ పీఎస్ సందర్శన సిద్దిపేటకమాన్: పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సీపీ అనురాధ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట ఏసీపీ కార్యాలయం, టూటౌన్ పీఎస్‌ను సీపీ మంగళవారం సందర్శించారు. పీఎస్ ఆవరణలో మొక్కను నాటారు. పీఎస్‌లో సీజ్ చేసిన వాహనాలను, పలు రికార్డులను పరిశీలించారు. జిల్లాలో నూతనంగా మహిళా పోలీసు సిబ్బంది నిర్వహించే బ్లూకోల్ట్స్ విధులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆన్లైన్ గేమ్‌లు, బెట్టింగ్, అక్రమ ఇసుక రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వీపీఓలు తరచూ గ్రామాలను సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు ఉపేందర్, వాసుదేవరావు, విద్యాసాగర్, శ్రీను, శ్రీధర్‌గౌడ్, కిరణ్, ఎస్ఐలు ఆసిఫ్, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
తపాలా.. ఎందుకిలా?
హుస్నాబాద్: పలు ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లను ఎత్తేశారు. దీంతో గ్రామీణులకు తిప్పలు తప్పడంలేదు. ప్రముఖ పుణ్య క్షేత్రాలు, టూరిజం స్పాట్లకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే శ్రేయస్కరం. రైలు సౌకర్యం లేని సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు పని చేస్తున్నాయి. భారత రైల్వేలు, పోస్టల్ శాఖ సమన్వయంతో ఇండియా పోస్ట్ ప్యాసింజర్ రైల్వే సిస్టమ్ (ఐపీపీఆర్ఎస్) ప్రవేశపెట్టారు. రైల్వే శాఖ, పోస్టల్ శాఖ సమన్వయంతో హుస్నాబాద్ సబ్ పోస్టాఫీస్‌లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా రైతులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు వివిధ ప్రాంతాలు, దేవస్థానాలకు వెళ్లేందుకు టికెట్ బుకింగ్ చేసుకొనే ప్రయోజనం ఉంది. అయితే దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసులకు గాను 134 సెంటర్లల్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లను ఎత్తివేశారు. ఇందులో తెలంగాణలో హన్మకొండ, భూపాల్పల్లి, హుస్నాబాద్, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి సబ్ ఫోస్టాఫీస్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత వాసులకు తిప్పలు హుస్నాబాద్ సబ్ పోస్టాఫీస్‌లోని టికెట్ కౌంటర్ నుంచి రోజు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి నగరాలకు రైల్వే రిజర్వేషన్లకు టికెట్లను బుక్ చేసుకుంటారు. కరీంనగర్, వరంగల్ ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడేకే వచ్చి రైల్వే రిజర్వేషన్ చేసుకుంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలు, నగరాలకు వెళ్లకుండా స్థానిక పోస్టాఫీస్‌లోని రిజర్వేషన్ల బుకింగ్ కౌంటర్ ద్వారా టికెట్లు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కౌంటర్‌ను మూసివేయడంతో పట్టణాల్లో కానీ, ఆన్లైన్లో రైల్వే రిజరేషన్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.టార్గెట్ పూర్తికాకపోవడంతో.. పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన ఐపీపీఆర్ఎస్ సెంటర్ ద్వారా రోజు 10 టికెట్లు తగ్గకుండా ఎక్కువగా రిజర్వేషన్లు బుక్ చేసుకోవాలని టార్గెట్ విధించారు. కానీ 5 నుంచి 6 మాత్రమే ఎప్పుడో ఒక్కసారి 10 లోపు టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి. దీంతో టార్గెట్ పూర్తికావడం లేదని పోస్టల్ శాఖ భావించింది. అలాగే సిబ్బంది కొరత, ఇతరత్రా సమస్యలతో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ భారమని పోస్టల్ శాఖ కౌంటర్లను ఎత్తివేసినట్లు తెలుస్తోంది. రైల్వే బుకింగ్ వల్ల పోస్టాఫీస్‌కు సంబంధించిన పథకాలు, లావాదేవీలకు ఆటంకం కలుగుతుందని సమాచారం. అందుకే రైల్వే సేవల నుంచి పోస్టల్ శాఖ తప్పుకుంది. హుస్నాబాద్ పోస్టాఫీస్‌లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్‌ను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాసిన విషయం విదితమే. -
వైద్య సేవల్లో అలసత్వం తగదు
● కలెక్టర్ హైమావతి ● జగదేవ్‌పూర్‌లో పర్యటన జగదేవ్‌పూర్(గజ్వేల్): వైద్య సేవల్లో అలసత్వం తగదని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయా?..అంటూ ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలితో కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. వైద్యులు సూచించిన విషయాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆస్పత్రి రికార్డులను తప్పనిసరిగా అమలు చేయాలని, రోగుల వివరాలను నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌కు వైద్యురాలు బీపీ, షుగర్ చూసి సాధారణంగా ఉందని తెలిపారు. భూ భారతి సమస్యలు పరిష్కరించాలి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తుల తీరు తెన్నులపై ఆరా తీశారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను భూ భారతి నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అలాగే దౌలాపూర్‌లో ఇందిరమ్మ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగవంతం చేయాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహశీల్దార్ నిర్మల, ఎంపిడిఓ రాంరెడ్డి, వైద్యుడు సత్యప్రకాష్, కార్యదర్శి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్ల తిరకాసు
ఎఫ్డీ చేస్తేనే డాక్యుమెంటేషన్ అంటూ మెలిక ● అయోమయంలో ‘డెయిరీ’ లబ్ధిదారులు ● ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 8.40కోట్ల సబ్సిడీ విడుదల ● ఇప్పటివరకు గ్రౌండింగ్ అయింది 281 యూనిట్లే ● పట్టించుకోని ఉన్నతాధికారులుసాక్షి, సిద్దిపేట: బ్యాంకర్లు తిరకాసు పెడుతుండటంతో ‘డెయిరీ’ లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రుణాలు ఇవ్వాల్సింది పోయి.. సబ్సిడీ మినహా రుణాన్ని ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేస్తేనే డాక్యుమెంటేషన్ అంటూ మెలిక పెడుతున్నారు. దీంతో యూనిట్ మంజూరైనప్పటికీ ఎఫ్డీ చేయకపోవడంతో గ్రౌండింగ్ కావడం లేదు. ఎస్సీ కార్పొరేషన్లో 2020–21కు సంబంధించి 600 యూనిట్లకు రూ.8.40కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 281 యూనిట్లు గ్రౌండింగ్ కాగా 4.46కోట్ల సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో మూలుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డెయిరీ యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసింది. 2020–21లో 978 డెయిరీ యూనిట్లు మంజూరు కాగా 600 యూనిట్లకు రూ 8.40కోట్ల సబ్సిడీ విడుదలయ్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ. 2లక్షలు. అందులో ప్రభుత్వం నుంచి రూ.1.40 లక్షలు (70శాతం) సబ్సిడీ, లబ్ధిదారుడి వాటా బ్యాంక్ నుంచి రుణం రూ.60 వేలు (30శాతం) అందించాలి. ఇప్పటి వరకు 281 యూనిట్లను పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్లో రెండు పాడి పశువులు అందించారు. ఇంకా 319 యూనిట్లు గ్రౌండింగ్ కాకపోవడంతో రూ.4.46 కోట్లు బ్యాంక్‌లోనే నిల్వ ఉన్నాయి. బెజ్జంకిలోనే అధికం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రౌండింగ్ కోసం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో సబ్సిడీ డబ్బులను జమ చేసింది. గ్రౌండింగ్ చేయకుండా బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా లబ్ధిదారులు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నా రుణాలు మంజూరు చేయడంలేదు. బెజ్జంకి మండలంలోని కేడీసీసీ బ్యాంక్‌లో దాదాపు 80 మంది లబ్ధిదారుల సబ్సిడీ డబ్బులు గతంలోనే జమ అయ్యాయి. ఇదే బెజ్జంకి కేడీసీసీ బ్యాంక్ వారు గతంలో రుణం డబ్బులు ఎఫ్డీ చేస్తేనే యూనిట్‌ను గ్రౌండింగ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లొద్దు ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా బ్యాంకర్లు ముందుకు వెళ్లవద్దు. ఎస్సీ కార్పొరేషన్ డెయిరీ యూనిట్ల మంజూరుపై బ్యాంక్ మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తాను. బ్యాంకర్లు రుణాలు ఇవ్వని పక్షంలో వెంటనే సబ్సిడీ డబ్బులను ఎస్సీ కార్పొరేషన్‌కు రిటర్న్ చేయాలని ఆదేశిస్తాను. – హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్మాకొద్దు యూనిట్లు బ్యాంకర్లు పెట్టే ఇబ్బందులు.. మరో పక్కన తీసుకవచ్చిన పాడి పశువులతో సరిగా పాల ఉత్పత్తి రాకపోవడంతో మాకు వద్దు యూనిట్లు అంటూ రద్దు కోసం ఎస్సీ కార్పొరేషన్లో లేఖలను అందిస్తున్నారు. హర్యానా నుంచి పాడి పశువులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో అక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకవచ్చిన పాడి పశువులు ఇక్కడి వాతావరణానికి సరిగా అలవాటు పడటం లేదు. దీంతో పాలు తక్కువగా ఇస్తున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకల్ అయిన, ఆంధ్రప్రదేశ్‌లోనైనా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని, బ్యాంకర్లే రుణం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
సుందరీకరణకు మంగళం
ఎనిమిది పనుల్లో మూడే పూర్తి ● రూ.2కోట్ల నిధుల్లో అరకొర వినియోగం ● మిగిలిన నిధులు ల్యాప్స్ ● తాజాగా రూ.15కోట్లతో ప్రతిపాదనలుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణ పనులకు మంగళం పాడారు. పట్టణంలోని ఎనిమిది జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా.. కేవలం మూడింటిని మాత్రమే అభివృద్ధి చేసి చేతులు దులుపుకొన్నారు. రూ.2 కోట్ల నిధులు గతంలో విడుదల కాగా పావువంతుకుపైగా నిధులు ఖర్చుపెట్టి.. మిగిలిన నిధులు ల్యాప్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులకు ఆమోదం వస్తేనే పట్టణానికి కొత్త కళ రానుంది. – గజ్వేల్ ‘అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని’ అనే సామెత గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సరిగ్గా సరిపోతుంది. అభివృద్ధిలో ఆదర్శంగా కీర్తించిన ఈ మున్సిపాలిటీలో ప్రధాన పనులు పూర్తి చేయకపోవడంతో నిధులు సగంలోనే ల్యాప్స్ కావడం ఆందోళన కలిగిస్తోంది. మూడున్నరేళ్ల క్రితం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించారు. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తా, తూప్రాన్ రోడ్డులోని బాబుజగ్జీవన్‌రామ్ వై జంక్షన్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వద్ద గల సర్కిల్, ముట్రాజ్‌పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్ చౌరస్తా, బాబూజగ్జీవన్‌రామ్ చౌరస్తా, ముట్రాజ్‌పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేసి, మిగతా పనులను చేపట్టలేదు. పట్టణంలో సుందరీకరణ పనులను పూర్తి చేయడమేకాకుండా, సెంట్రల్ లైటింగ్, హౌసింగ్ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణ, డ్రైనేజీలు, వరద కాల్వ నిర్మాణానికి రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్ పార్కుకు రూ.కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.5కోట్లు, సుమారు మరో 10కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం వస్తేనే పట్టణానికి నయా లుక్ రానుంది. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను వివరణ కోరగా గతంలో ‘గడా’ ద్వారా వచ్చిన సుందరీకరణ నిధులు ల్యాప్స్ అయిన మాట వాస్తవమేనన్నారు. తాజాగా ఇటీవల రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆమోదం రాగానే పనులు పూర్తి చేస్తామన్నారు.ఎందుకీ పరిస్థితి? మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఈ మున్సిపాలిటీకి అడిగిందే తడవుగా నిధులు వచ్చాయి. కానీ నిధులను సకాలంలో వినియోగించి పట్టణ ప్రగతిని పరిగెత్తించడంలో మాజీ పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. ప్రత్యేకించి పట్టణంలో సుందరీకరణ పనులు పూర్తి కాకపోవడానికి, సగంలోనే నిధులు ల్యాప్స్ కావడానికి పాలకవర్గంలోని విభేదాలే కారణంగా నిలిచాయి. ఇందిరాపార్కు చౌరస్తాతో ఇతర కూడలిల పనుల ప్రారంభానికి ప్రజాప్రతినిధులే అడ్డంకిగా మారారు. -
ముమ్మరంగా చేపట్టాలి
పారిశుద్ధ్యం పనులు● కలెక్టర్ హైమావతి ● అధికారులతో సమావేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలతో నేల చిత్తడిగా మారి, నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించేలా మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. ● ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారి స్వశక్తి అభియాన్ కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ, డీఆర్డీఓ, విద్య తదితర శాఖల సమన్వయంతో ఆస్పత్రులలో నిర్వహించాలన్నారు. అన్ని వయస్సు బాలికలు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ ను ఆదేశించారు. ● స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా ఈనెల 17 నుంచి 2 వ తేదీ వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో శ్రమదానం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థాలు తొలగింపు, పర్యావరణహితమైన పండుగల నిర్వహణకు చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య ను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
స.హ.చట్టం..
ఎవరికీ పట్టని చుట్టం● సమాచార హక్కు చట్టం కింద సిద్దిపేట పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఇంటి నిర్మాణాల గురించి డిసెంబర్ నెలలో మున్సిపాలిటీలో ప్రవీణ్ దరఖాస్తు చేశారు. మే నెల వరకు వేచి చూసినా అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. దీంతో సదరు దరఖాస్తు దారుడు అప్పీల్ కోసం రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించారు. ● జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్రీడా ప్రాంగణాలు నిర్మించారు? ఎన్ని వినియోగంలో ఉన్నాయని సిద్దిపేటకు చెందిన వ్యక్తి ఆర్టీఐ కింద డీఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారం సరిగా లేదని రాష్ట్ర ఆర్టీఐ కమిషన్‌ను ఆశ్రయించారు. సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ సంస్థల్లో, పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనం పెంచడమే సమాచార హక్కు చట్టం లక్ష్యం. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా భారత పౌరసత్వం కలిగిన వ్యక్తులు అవసరమైన సమాచారాన్ని కోరవచ్చు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం అరకొరగా ఇవ్వడం, దరఖాస్తు చేసిన తర్వాత నిర్ణీత సమయం దాటినా సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌కు అప్పీల్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2022 నుంచి ఇప్పటి వరకు 137 మంది దరఖాస్తు దారులు అప్పిల్‌కు వెళ్లారు. దీంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అప్పీల్ కేసులు పరిష్కరించేందుకు సమాచార హక్కు కమిషనర్లు వస్తున్నారు. కన్పించని బోర్డులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డులలో పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నంబర్ ముద్రించి ఉండాలని చట్టం చెప్తుంది. కానీ పలు కార్యాలయాల్లో నిబంధనలు అధికారులు ఉల్లంగిస్తున్నారు. అధికారులు బదిలీ అయినా పాత వారి పేర్లే దర్శనమిస్తున్నాయి. నేడు ఆర్టీఐ కమిషనర్లు రాక స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఐదుగురు కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోహిసినా పర్వీన్, భూపాల్, వైష్ణవిలు మంగళవారం సిద్దిపేటకు రానున్నారు. పీఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించనున్నారు. పక్క ఫొటోలో కన్పిస్తున్నది మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు లో భాగంగా ఏ అధికారిని సంప్రదించాలని తెలిపే బోర్డు. ఈ బోర్డులో ఉన్న అప్పీల్ అధికారి, ఈఈ గిరిధర్ గత నెల 31న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి బోర్డులో అధికారి పేరు మార్చలేదు. అలాగే ప్రత్యేకంగా బోర్డు కాకుండా వైట్ పేపర్లో ప్రింట్ తీసి అతికించడం గమనార్హం.సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు దారుడు అడిగిన సమాచారాన్ని 30రోజుల్లోగా పీఐఓ సమాచారం ఇవ్వాలి. లేనిపక్షంలో దరఖాస్తు దారుడు మొదటి అప్పీల్ చేసుకోవచ్చు. 90 రోజుల్లోగా సమాచారం రాకుంటే రెండో అప్పీల్‌గా రాష్ట్ర సమచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. జిల్లా వ్యాప్తంగా 137 మంది రెండో అప్పీల్‌కు వెళ్లారు. అందులో రెవెన్యూ అప్పీల్ కేసులే అధికంగా ఉన్నాయి. రెవెన్యూకు సంబంధించనవి 88, ఆర్ ఆండ్ ఆర్కు 15, వ్యవసాయశాఖ 4, ట్రాన్స్‌పోర్టు 4, వైద్యారోగ్య శాఖ 2, విద్యుత్ శాఖ 2, ట్రైబల్ వెల్ఫేర్ 2, ఇతర శాఖలకు చెందినవి 20 కేసులున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండో అప్పీల్లో 137 కేసులు పలు కార్యాలయాల్లో కన్పించని బోర్డులు నేడు జిల్లాకు సమాచార హక్కు కమిషనర్లు -
రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్‌ను పునరుద్ధరించండి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం లేఖ హుస్నాబాద్: పట్టణంలోని సబ్ పోస్టాఫీస్‌లో రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాన్ని పునరుద్ధరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి మంచి సదుపాయం ఉండేదని, ఈ కౌంటర్ మూసివేయడంతో అందరికీ అసౌకర్యంగా మారిందన్నారు. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖలోని సంబంధిత అధికారులతో చర్చించి కేంద్రాన్ని త్వరగా పునరుద్ధరించాలని మంత్రి పొన్నం లేఖలో విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్‌లో బీజేపీ రాస్తారోకో హుస్నాబాద్: పట్టణాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాసీ్త్రయంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలిపిందన్నారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 20 నెలలు దాటుతున్నా విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంపత్ నాయక్, నాయకులు శ్రీనివాస్, సతీష్, రాజేంద్ర ప్రసాద్, బొల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మంత్రి కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యను అంగన్ వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హుస్నాబాద్‌లోని మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ పోటీ సెంటర్లను ప్రారంభించి అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేయాలనే కుట్ర పన్నుతున్నారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లకే ప్రీ ప్రైమరీ విద్యను అప్పగించాలన్నారు. అనంతరం మంత్రి పీఏకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.పద్మ తదితరులు ఉన్నారు. సిద్దిపేటరూరల్: మొక్కలను విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పర్యావరణ ప్రేమికుడు, నవ సమాజ నిర్మాణ సమితి జాతీయ అధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్ వర్మ అన్నారు. సోమవారం రావురూకుల మాజీ ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్ రావుతో కలిసి విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా 10 లక్షల విత్తన బంతులు తయారుచేసి, రోడ్ల వెంబడి, గుట్టలపైన అడవుల్లో చల్లుతున్నామన్నారు. దీని ద్వారా చెట్ల పెంపకానికి దోహదం చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు తెలిపారు. ఎవరికై నా విత్తన బంతులు కావాలంటే ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. విత్తన బంతులలో ముఖ్యంగా మర్రి, మారేడు, వేప, రావి, జువ్వి, చింత, ఉసిరి, సీమసింత, మామిడి లాంటివి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఐలయ్య యాదవు, లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షులు ప్రశాంత్, యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతులు
జగదేవ్‌పూర్(గజ్వేల్)/హుస్నాబాద్‌రూరల్/మద్దూరు(హుస్నాబాద్): యూరియా కోసం రైతుల అరిగోస వీడటంలేదు. సోమవారం పలు ప్రాంతాల్లో బారులు తీరారు. యూరియా అందకపోవడంతో కొన్ని చోట్ల ఆందోళనకు దిగారు. జగదేవ్‌పూర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదను దాటుతున్నా పంటకు యూరియా వేయకపోవంతో ఎదుగుదల ఆగిపోతున్నదని వాపోయారు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. – హుస్నాబాద్‌లో యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహించి ఎరువుల దుకాణం ఎదుట బైఠాయించారు. దుకాణ యజమాని యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించారని మండిపడ్డారు. యజమానిపై చర్యలు తీసుకుని షాప్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఓ వచ్చి నచ్చజెప్పినా వినిపించుకోలేదు, యజమానికి సోకాజ్ నోటీస్ జారీ చేస్తానని, విశాల పరపతి సంఘంలో ఎరువులు ఇప్పిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. – మద్దూరు రైతువేదిక, పీఏసీఎస్ సొసైటీల వద్ద రైతులు పడిగాపులు కాశారు. బస్తా యూరియా కోసం రోజంతా నిరీక్షించాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. తీరని యూరియా వెతలు -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల వినతులు పరిష్కారం అవుతున్నందునా ప్రజావాణిపై విశ్వాసం పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యలు, పలు సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 152 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయండి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు రశీదు పొందడం సమస్యగా మారింది. వినతిపత్రాన్ని అందించిన అనంతరం రశీదు కోసం కౌంటర్ ఒక్కటే ఉండడంతో తీవ్ర ఆలస్యమవుతుంది. గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. అధికారులు మరో కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని అర్జీదారులు కోరుతున్నారు. -
కేంద్రంలో ఉండే సదుపాయాలు
● వృద్ధులు ఆడుకోవడానికి వీలుగా క్యారం, చెస్‌తో పాటు ఇతర సదుపాయాలు ● సేదతీరడానికి ఆహ్లాదరక వాతావారణం, గార్డెనింగ్, మొక్కల పెంపకం ● వంట గది, గ్రంథాలయంతో పాటు ఇతర మౌలిక వసతులు ● తరచూ కేంద్రంలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ ● వీల్ చైర్స్‌తో పాటు ర్యాంప్‌ల నిర్మాణం ● అత్యవసర పరిస్థితుల్లో అలారం సిస్టమ్ ఏర్పాటు ● మానసిక వేధన, భావోద్వేగానికి గురయ్యే వారికి కౌన్సెలింగ్ -
ఎవరు లీక్ చేస్తున్నారు?
సాక్షి, సిద్దిపేట: ఆఫీస్‌లో జరిగే విషయాలు బయటకు ఎలా వెళ్తున్నాయి? ఎవరు లీక్ చేస్తున్నారు? అనే అంశాలపై కలెక్టర్లోని ఉన్నతాధికారి ఆరాతీస్తున్నారు. ఈ నెల 7న ‘సాక్షి’ దినపత్రికలో దఫ్తర్లోనే బిస్తర్! అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం విదితమే. ఇలా పలు విషయాలు లీక్ చేస్తున్నారన్న కక్షతో కింది స్థాయి సిబ్బందికి మోమోలు ఇచ్చినట్లు వినికిడి. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీఎస్)పై ఒక పక్క ఈడీ విచారణ జరుగుతుండగానే అందులో నుంచి రూ.2లక్షలను సదరు అధికారి నేరుగా డ్రా చేశారు. గజ్వేల్ నియోజకర్గం పరిధిలోని ఓ మండల వైద్యశాలకు తనిఖీకి వెళ్లిన సమయంలో డాక్టర్‌తో సిగరేట్ డబ్బా తీసుకురావాలని హుకుం జారీ చేశారని తెలిసింది. ఎస్ఆర్డీఎస్ పథకం అమలు కావడంతో గొర్ల కాపర్ల అభివృద్ధిపై ఈ నెల 10న క్షేత్రస్థాయిలో పరిశీలన, సదస్సుకు జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లికి రాష్ట్ర గొర్రెల డెవలప్మెంట్ ఎండీ సుబ్బారాయుడు వచ్చారు. ఓ ఉన్నత స్థాయి అధికారి వచ్చినప్పుడు వెళ్లాల్సి ఉండగా.. వెళ్లకుండా.. సుబ్బారాయుడు పరిశీలన ముగిసిన తర్వాత తాపీగా గజ్వేల్‌కు చేరుకున్నారు. ఇలా అనేక తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి పలువురికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీఎన్జీవోస్, వైద్యులు, గొర్రెల కాపర్ల సంఘం నేతలు కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మేధావులూ ఆలోచించండి
● నాడు సిద్దిపేట దేశంలోనే ఆదర్శం.. ● నేడు ఆగిన ప్రగతితో వెలవెల ● మాజీ మంత్రి హరీశ్రావుసిద్దిపేటజోన్: పదేళ్లుగా ప్రగతి పథంలో పయనించిన సిద్దిపేట.. రెండేళ్లుగా వెనుకబడిన ప్రక్రియపై మేధావులు, జర్నలిస్టులు ఆలోచించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు. అధికారులు సిద్దిపేటకు వచ్చి అధ్యయనం చేసేలా గొప్పగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఇబ్రహీంపూర్‌ను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు తిలకించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిటిష్ అంబాసిడర్ సైతం సిద్దిపేట స్వచ్ఛతను చూసి కితాబిచ్చారన్నారు. నాటి అభివృద్ధిని జర్నలిస్టులు విజయగాథలుగా అద్భుతంగా రాశారన్నారు. అదే సిద్దిపేట.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆగిన అభివృద్ధితో వెలవెల పోయిందన్నారు. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టులు, మేధావులు ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలో ఒక్క రూపాయి సిద్దిపేటకు రాలేదన్నారు. ఒక్క పని కూడా జరగలేదని వివరించారు. జర్నలిస్టు జీవితం అంతా ఇబ్బందులతో ముడి పడి ఉంటుందన్నారు. వారి కష్టాలు వర్ణనాతీతమన్నా రు. కరోనా సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు రంగాచారి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించండి
● కలెక్టర్ హైమావతి ● రాఘవాపూర్ కేజీబీవీ ఆకస్మిక తనిఖీసిద్దిపేటరూరల్: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి కేజీబీవీ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల పరిధిలోని రాఘవాపూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం, తరగతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట సీసీ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వంటేరు వజ్రమ్మకు నివాళి
జగదేవ్‌పూర్(గజ్వేల్): అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తల్లి వజ్రమ్మకు ఘన నివాళులర్పించారు. ఆదివారం జగదేవ్‌పూర్‌లో పదకొండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాణిక్‌రావు, జనార్దన్‌రెడ్డి, పద్మాదేవేంద్‌రెడ్డి తదితరులు వజ్రమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల మాజీ ప్రతినిధులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. అలాగే శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వజ్రమ్మ చిత్రాన్ని సబ్బు బిళ్లపై అద్భుతంగా చిత్రించి ప్రతాప్‌రెడ్డికి అందించారు.శ్రద్ధాంజలి ఘటించిన మాజీ మంత్రులు, పలువురు నేతలు -
కలవని చేతులు
జిల్లాలో కాంగి‘రేసు’లో ఎవరికి వారే అనే విధంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీలో ఇంకా విభేదాలు సమసిపోవడం లేదు. ఓ వైపు పార్టీ అధిష్టానం కలిసికట్టుగా ముందుకు సాగాలనేసంకేతాలిస్తుంటే జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీచేసినట్లు, సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ నుంచివివరణ అడిగినట్లు పీసీసీ వర్గాల ద్వారా తెలిసింది. – సాక్షి, సిద్దిపేట నర్సారెడ్డిపై విజయ్ ఫిర్యాదు గజ్వేల్ పట్టణంలో ఆగస్టు 3న రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కాగా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఒకరి పై ఒకరు ధూషించుకున్నారు. దీనితో నర్సారెడ్డిపై పోలీస్ స్టేషన్లో విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అలాగే వీరిద్దరు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి లకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో నర్సారెడ్డిని ఆదివారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలిచారు. ‘షోకాజు నోటీసులు జారీచేస్తున్నాం.. రాత పూర్వకంగా వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి’ అని చెప్పినట్లు తెలిసింది. దీనిపై నర్సారెడ్డిని వివరణ కోరగా నిజమని తెలిపారు.హరికృష్ణను వివరణ కోరిన మల్లు సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిలకు ఆరుగురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎంపీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ కోసం పని చేయకుండా క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయ్యారని, ఇటీవల ఇన్చార్జి మంత్రి మంజూరు చేసిన రూ.2 కోట్ల నిధులలో కమిషన్లు తీసుకున్నారని పలువురు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనితో మల్లు రవి స్పందించి వివరణ ఇవ్వాలని హరి కృష్ణను ఆదేశించారు. ఈ విషయం పై హరికృష్ణను వివరణ కోరగా ‘నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. వస్తే ఎందుకు వచ్చాయో అందరికీ తెలియజేస్తాను’ అని తెలిపారు. -
వయో వృద్ధులకు డే కేర్
జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా వృద్ధులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల నిమిత్తం వెళ్లినప్పడు ఒంటరితనంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తమను పలకరించేవారు లేక మనోవేధనకు గురవుతున్నారు. ఇలాంటి వారికి డే కేర్ సెంటర్ బాసటగా నిలవనుంది. ఇందులో ఇతర వృద్ధులతో కలిసి ఆడుతూ, పాడుతూ సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. త్వరలో జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యే కేంద్రంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 50 మంది ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వృద్ధులు ఈ కేంద్రంలో ఉండడానికి వీలుగా ఇండోర్ గేమ్స్, గ్రంథాలయం, ఇతరత్ర సదుపాయాలు కల్పించనున్నారు. జిల్లాలో ఈ కేంద్రం ఏర్పాటు కోసం సేవా సంఘం అనే ఎన్జీఓకు అధికారులు బాధ్యతలు అప్పగించారు. మెదక్ పట్టణంలో ఒక భవనాన్ని సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. -
నిరుద్యోగులకు వరం ఉచిత కంప్యూటర్ శిక్షణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉచిత కంప్యూటర్ శిక్షణ నిరుద్యోగులకు వరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వేదాస్ సంస్థలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందిన 35 మంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికి ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఉచిత కంప్యూటర్ శిక్షణతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు రాణించాలన్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణలో ఉచిత వసతి, భోజనంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలి చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు సమాజాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టాలని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ విద్యాసాగర్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆదివారం పెద్దకోడూరులో స్పెషల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపును ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీనరీ పెంచడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. సమాజం కోసం ఏవిదంగా పని చేయాలో వివరించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ముచ్చటించారు. ఆత్మరక్షణకు కరాటే దోహదం జనగామ డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి చేర్యాల(సిద్దిపేట): ఆత్మ రక్షణకు కరాటే తోడ్పడుతుందని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రేణుక గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు కరాటే బెల్టుల ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కరాటేలో పోటీల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కరాటే రాష్ట్ర అధ్యక్షుడు పాషా మాట్లాడుతూ కరాటేతో మానసిక, శారీరక, ఉన్నతితో పాటు ఉద్యోగాల్లో సైతం అవకాశాలుంటాయని అన్నారు. కరాటే మహిళలకు ఆత్మ రక్షణతో పాటు మనోధైర్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కరాటే జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, ప్రభాకర్, ఎల్లాగౌడ్, ఎల్లదాస్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడికి షోకాజ్ నోటీసు గజ్వేల్: పట్టణానికి చెందిన బీజేపీ క్రీయాశీలక నాయకుడు కాశమైన నవీన్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12న పట్టణంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు వద్ద పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించివేసి, అసభ్యపదజాలంతో దుర్భాషలాడినందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
వేగంగా డబుల్ రోడ్డు పనులు
● రూ. 20 కోట్ల నిధులతో పనులు అక్కన్నపేట మండలం అంతక్కపేట క్రాసింగ్ నుంచి తుది దశకు చేరుకున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండల ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డబుల్ రోడ్డు కల తీరనుంది. అక్కన్నపేట మండల అంతక్కపేట గ్రామ క్రాసింగ్ నుంచి కట్కూర్ గ్రామం మీదుగా రూ.20కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతక్కపేట క్రాసింగ్ నుంచి భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వరకు దాదాపు 11.5కిలోమీటర్ల మేర ఈ డబుల్ రోడ్డును నిర్మించనున్నారు. ప్రస్తుతం పనులు సగానికి పైగా పూర్తిగా కాగా డాంబర్ పోయడమే మిగిలి ఉంది. తీరనున్న కల... సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తారు. ఇక్కడ ప్రతీ ఏటా మకర సంక్రాంతి సందర్భంగా జాతర జరుగుతుంది. దీంతో అక్కన్నపేట మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రోడ్డు ద్వారానే ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లపై వెళ్తుంటారు. డబుల్ రోడ్డు నిర్మించాలని గతంలో అనేకసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో తీసుకుని డబుల్ రోడ్డు విస్తరణ పనుల్ని చేపట్టారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవీ?
సిద్దిపేటజోన్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రస్తుత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ, ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి ఎక్కడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేస్తున్న జాబ్‌మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విపంచి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు హారీశ్‌రావు హాజరై మాట్లాడారు. అంతకుముందు ట్రస్మా ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..యువత భవిష్యత్తు బాగుండాలనే జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఉద్యోగం కోసం ఊరు దాటితేనే ప్రపంచం గురించి అర్థం అవుతుందని చెప్పారు. విద్యార్థులకు విద్యతోపాటుగా సామాజిక నైతిక బాధ్యతను చిన్ననాటి నుంచే నేర్పించాలని సూచించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు అందించాలన్నారు. క్రీడలతో విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు. సిద్దిపేటలో అన్ని రకాల విద్య సంస్థలున్నాయని, వెటర్న రీ కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తరలించుకుపోయారని, మళ్లీ అధికారంలోకి రాగానే తిరిగి కళాశాలను ప్రారంభిస్తామన్నారు. పనులు వేగవంతం చేయాలి నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని హరీశ్‌రావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగిలో ఎదురైన సమస్యలు వానాకాలం పంటకు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ పారూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి: హరీశ్‌రావు సిద్దిపేటరూరల్: ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని చింతమడక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు ఆవిష్కరించారు. అనూహ్య స్పందన ఈ సందర్భంగా నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు 2వేలకుపై చిలుకు నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. మహేంద్ర టెక్, రిలయన్స్, జీఎంఆర్, అమెజాన్, ఎయిర్ టెల్, ఎంఆర్ఎఫ్, పేటీఎం, డెలివరీ, ఐకియా, ఫ్లిప్‌కార్డ్, జుమోటో, జెప్టో, మిషో, బిగ్‌బాస్కెట్, డిమార్ట్, గ్లోబల్ సొల్యూషన్ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు. -
భూ పంపిణీ అమలులో వైఫల్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాములు సిద్దిపేట అర్బన్: రైతాంగ సాయుధ పోరాటం నాటి భూ ఎజెండాను పాలకులు నేటికీ పరిష్కరించకుండా నివాస, సాగు యోగ్యమైన భూమి లేని పేదలకు భూమిని పంచడంలో పూర్తిగా వైఫల్యం చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ అమరవీరుల సంస్మరణ సభ శుక్రవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..సాయుధ పోరాటం ఫలితంగానే భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందని, దాని వల్ల పేదల చేతుల్లో భూములున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్, ప్రశాంత్, నాయకులు కనకయ్య, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్‌లో 8 రెవెన్యూ క్లస్టర్లు హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలను 8 రెవెన్యూ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీపీఓలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తహసీల్దారు లక్ష్మారెడ్డి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాలనా సౌలభ్యం కోసం సమీపంలోని గ్రామాలను కలుపుతూ రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్–1, హుస్నాబాద్–2, తోటపల్లి, పోతారం(ఎస్)–3, మీర్జాపూర్, వంగరామయ్యపల్లి, భల్లునాయక్‌తండా–4, పందిల్ల, కూచనపెల్లి, మాలపల్లి–5, పొట్లపల్లి–6, మహ్మదాపూర్, మడద, రాములపల్లి, నాగారం–7, ఉమ్మాపూర్, జిల్లెలగడ్డ–8 గ్రామాలను రెవెన్యూ క్లస్టర్లోకి తీసుకున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. వైద్య వృత్తి పవిత్రమైనది ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్‌రూరల్: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆపత్కాలంలో మనిషి ప్రాణాలను కాపాడలిగేది వైద్యం మాత్రమేనని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శనివారం కోలా అభిరాం గార్డెన్స్‌లో జరిగిన ప్రగతి జూనియర్ కళాశాల ఎంపీహెచ్‌డబ్ల్యూ ప్రథమ సంవత్సర విద్యార్థినుల క్యాపింగ్ కార్యక్రమంలో యాదవరెడ్డి పాల్గొని మాట్లాడారు. రోగులు తొందరగా కోలుకునేలా వైద్యసేవలు అందించాలని, విద్యార్థినులు నర్సింగ్ వృత్తిలో రాణించి అందరి మన్ననలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మంజీ రా, ప్రగతి విద్యాసంస్థల కరస్పాండెంట్ అంబ దాస్, ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్ మట్టయ్య చౌదరిలతోపాటు సంధ్య పాల్గొన్నారు. సీఎం హామీని అమలు చేయాలి వీహెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ దండు శంకర్ సిద్దిపేటరూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వీహెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ దండు శంకర్ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ...వృద్ధులు, వితంతువులు, ఒంటరిమహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, దివ్యాంగులకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయని నేపథ్యంలో ఈనెల 15న పెన్షన్ దారులతో ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కస్తూరి రాజిరెడ్డి, సత్తయ్య, వేణు, జక్కయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లకు కార్యాచరణ
పత్తి కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధమవుతోంది. కలెక్టర్ రెండ్రోజుల కిందట దీనిపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 1.07లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగులోకి రాగా, ఈసారి 10లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. గజ్వేల్: మరో నెల రోజుల తర్వాత పత్తి మార్కెట్లోకి వచ్చే అవకాశముండగా...అధికార యంత్రాంగం కొనుగోళ్ల ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లాలో ఈసారి 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఈసారి పత్తి రైతులకు ఆది నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. సీజన్ ఆరంభంలో అనావృష్టి దెబ్బతీస్తే....ఆగస్టు నెల నుంచి అతివృష్టి అపార నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలోనే రోజుల తరబడి చేలల్లో వరద నిలిచి పంట ఎదుగుదల లోపించింది. తెగుళ్లు చుట్టుముట్టి పంట రంగు మారిపోయింది. కొనిచోట్ల కాత, పూత లేకుండా తయారయి..దిగుబడులపై ప్రభావం పడింది. మార్కెటింగ్ శాఖ మాత్రం ఈసారి ఎకరాకు 10క్వింటాళ్ల చొప్పున 10లక్షల క్వింటాళ్లకుపైగా ఉత్పత్తులు రావొచ్చని అంచనా వేస్తోంది. జిల్లాలో 1.07 లక్షల ఎకరాలకుపైగా సాగు గోదాములు సిద్ధం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 63 గోదాములు పత్తి నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 1,59,150మెట్రిక్ టన్నుల పత్తిని నిల్వ చేసుకునే అవకాశముంది. ఈసారి ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించినందు వల్ల...సీసీఐ కేంద్రాల్లో ఈ ధరను పొందడానికి రైతులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఏఈఓలతో ఈ పంటను నమోదు చేయించుకుని, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు ఆధారంగా అమ్ముకోవాల్సి ఉంటుంది. పత్తి కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తహసీల్దార్, ఏఓ, ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌజ్ ఆఫీసర్), మార్కెట్ కమిటీ కార్యదర్శి, సీసీఐ అధికారి, రైతు ప్రతినిధులతో కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. గతేడాది మాదిరిగానే జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, చిన్నకోడూర్, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హుస్నాబాద్, చేర్యాల మార్కెట్ కమిటీల పరిధిలో 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా మిల్లుల్లో రైతులకు కావాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లపై అధికారులు తనిఖీ చేయనున్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం పత్తి కొనుగోళ్లపై ముంద స్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుంది. మరో నెల రోజుల తర్వాత పత్తి మార్కెట్లోకి వచ్చే అవకాశమున్నందున ఆలోగా కొనుగోళ్లకు సర్వం సిద్ధంగా ఉంటాం. – నాగరాజు, సిద్దిపేట జిల్లా మార్కెటింగ్ అధికారి -
చేపలు చేరేదెప్పుడు?
అదను దాటిపోయిందని ఆందోళన పడుతున్న మత్స్యకారులు సాక్షి,సిద్దిపేట: చేప పిల్లల పంపిణీకి సంబంధించి అదను దాటిపోతున్నా ఇంకా టెండర్లు కూడా ఖరారు కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూలై–ఆగస్టు మధ్య కాలంలోనే చేప పిల్లలను వదలాల్సి ఉండగా, ఇప్పటివరకు పంపిణీకి సంబంధించిన ప్రక్రియే పూర్తి కాలేదు. దీంతో పలువురు మత్స్యకారులు సొంతంగానే చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లోకి వదులుతున్నారు. మరోవైపు చేపపిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానింగా కేవలం ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే బిడ్లు వేయడంతో చేపపిల్లలను ఎప్పుడు పంపిణీ చేసేది? ఎప్పుడు వదిలేది? ఎప్పుడు ఎదిగేది అని మత్స్యకారులు వాపోతున్నారు. చేపపిల్లల పంపిణీ కాంట్రాక్ట్‌లు ఇంకా టెండర్ ఖరారు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జిల్లాలో 379 మత్స్యకార సొసైటీలు జిల్లాలో 379 మత్స్యకార సొసైటీలు ఉండగా 24,517 మంది సభ్యులున్నారు. అందులో 40 మహిళా సొసైటీలు 1,975 సభ్యులు, పురుషుల సొసైటీలు 339 ఉండగా అందులో 22,442 మంది సభ్యులున్నారు. 2025–26 ఏడాదికి 1,715 చెరువుల్లో 4.42కోట్ల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. గత నెల 20 నుంచి ఈ నెల 1 వరకు టెండర్లను ఆహ్వానించగా ఎవరూ ముందుకురాకపోవడంతో రెండోసారి ఈనెల 8 వరకు ఆ తర్వాత మళ్లీ 12 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే బిడ్లు దాఖలు చేశారు. దరఖాస్తుల పరిశీలన ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులో పేర్కొన్నవాటిని, ఫాంలో చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయా?... సరఫరా చేసే సామర్థ్యం ఉందా అని అధికారులు పరిశీలించనున్నారు. ఇంకా 20 రోజుల ప్రక్రియ మిగిలి ఉంది. అంటే చేప పిల్లలు అక్టోబర్ నుంచి ప్రారంభమ య్యే అవకాశం ఉంటుంది. ప్రారంభమైన రోజు నుంచి అన్ని చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేయాలంటే 45 రోజులు సమయం పట్టనుంది. టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్లు సక్రమంగా పంపిణీ చేస్తారా? లేదా ? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎదుగుదల ఇలా... ఫిబ్రవరి, మార్చి నాటికి చెరువులు ఎండుముఖం పడుతాయి. ఏప్రిల్ మే నెలలలో పూర్తిగా వట్టిబోయే అవకాశం ఉంటుంది. జాప్యం జరిగిన కొద్దీ చేపలు ఎదగక నష్టపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. బంగారు తీగరకం 8 నెలలకు, బొచ్చ 9 నుంచి 10 నెలల కాలం, రాహు సంవత్సరానికి 500 నుంచి 750గ్రామలు బరువు వస్తుందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే నాటివరకు చేపలు చేతికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.టెండర్లు ఖరారు కాగానే పంపిణీ టెండర్లు ఖరారు కాగానే చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తాం. ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. కాంట్రాక్టర్ దాఖలు చేసిన ప్రకారం పరిశీలించి టెండర్లు ఖరారు చేస్తాం. –మల్లేశం, ఎఫ్డీఓఎదురు చూసి.. కొనుక్కునిసిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ చెరువులో సొసైటీ సభ్యులు ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేస్తారని నెల రోజులుగా ఎదురు చూశారు. ఇంకా టెండర్ల ప్రక్రియనే కొనసాగుతుండటంతో చేప పిల్లలు వదిలే సమయం దాటిపోతుందని రూ.13 వేలతో చేప పిల్లలను తెచ్చి పోసుకున్నారు. ఇక చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యమైన చేపపిల్లల్ని తామే కొనుగోలు చేసి సరైన సమయంలో చెరువులు, కుంటల్లో వదులుకుంటామని పలువురు మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. -
రాష్ట్రంలో దగాకోరు పాలన
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు పాలనలో ప్రజలు, రైతులు నరకయాతన పడుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేవలం 22 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో విసుగువచ్చిందన్నారు. యూరియా దొరకక రైతులు తమ పంటలను పశువులను మేపుతూ, దున్నేస్తున్నారని ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఎప్పుడు వస్తుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితులున్నాయంటే పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు సమస్యల కోసం ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు ధ్వంసమై బస్‌లు కూడా గ్రామా లకు రాని పరిస్థితి దాపురించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి.. సంక్షేమ హాస్టళ్లపై రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లలో దయనీయమైన పరిస్థితులు నెలకొనడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసి హాస్టళ్లల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. -
కమలంలో కుంపట్లు
జిల్లా భారతీయ జనతాపార్టీ(బీజేపీ)లో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంటోంది. సమన్వయం కొరవడి పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురువుతున్నారు. ఆరు నెలల క్రితం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బైరీ శంకర్‌ను రాష్ట్ర పార్టీ ప్రకటించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి జిల్లా అధ్యక్ష పదవిని కట్టాబెట్టారని అప్పటి నుంచి పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తూవస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు, సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శలు చేసే వరకు వెళ్లింది. – సాక్షి, సిద్దిపేట జిల్లా బీజేపీ మూడు వర్గాలుగా విడిపోయింది. ప్రస్తుత అధ్యక్షుడు బైరీ శంకర్, మాజీ అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, దూది శ్రీకాంత్‌రెడ్డి ఒకరికొకరు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మోహన్‌రెడ్డి వర్గం దూరంగా ఉంటోంది. పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ రఘునందన్ రావు పాల్గొనే వాటికి మాత్రమే శ్రీకాంత్‌రెడ్డి వర్గం పాల్గొంటోంది. మిగతావాటికి దూరంగానే ఉంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర ఇన్చార్జి చంద్రశేఖర్ జీకి పలువురు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి రఘునందన్ రావుకు అధికంగా ఓట్లు వచ్చాయి. జిల్లాలో పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో నేతల వర్గపోరుతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్‌లోనే జిల్లా కార్యవర్గం జిల్లా కార్యవర్గాన్ని ఇంకా పెండింగ్‌లోనే పెట్టారు. జిల్లా అధ్యక్షుడిని నియమించి ఆరు నెలలు కావస్తున్నా జిల్లా కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో అధ్యక్షుడి మార్పు ఉంటుందని కార్యకర్తలు జోరుగా చర్చించుకుంటున్నారు. అధిష్టానం దృష్టి సారించేనా? జిల్లాపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టి వర్గపోరును కట్టడి కోసం చర్యలు తీసుకుంటుందా? లేదా అన్న చర్చ కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది. ఇదే విధంగా వర్గపోరు ఉంటే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధిష్టానంతో పాటు, ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి కేంద్రికరించి వర్గపోరు నియంత్రించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.ఫోన్ కాల్ సంభాషణ.. ‘ఏ పార్టీ నుంచైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే వారికి ఆర్థిక సాయం అందించాలి. మధన్న(కాంగ్రెస్) వెనకాల టీం ఉంటే ఉపయోగంగా ఉంటుంది’ అని ఓ వ్యక్తితో జిల్లా అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడిన సంభాషణ కలకలం రేపుతోంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కులం పేరుతో పార్టీకి వెన్నుపోటు పోడిచే విధంగా ఉందని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌తో పాటు పలువురు కలిసి ఈ ఫోన్ కాల్ సంభాషణపై వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు వర్గాలుగా విడిపోయిన నేతలు జిల్లా అధ్యక్షుడిపై అధిష్టానానికి ఫిర్యాదు ఇంకా ఖరారుకాని జిల్లా కార్యవర్గం ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయోమయంలో క్యాడర్ -
ఇందిరమ్మ ఇళ్ల వేగం పెంచాలి
హుస్నాబాద్‌రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తోటపల్లిలో ఇందిరమ్మ లబ్ధిదారుడు గూళ్ల లింగం,లావణ్య దంపతుల గృహ ప్రవేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని చాలా మంది గృహ ప్రవేశాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం పేదల సొంతింటి కల నేరవేర్చుతోందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తోటపల్లిలో గృహప్రవేశం -
ప్రవక్త జీవితం ఆదర్శనీయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రవక్త ప్రవచనాలు విశ్వశాంతికి మార్గదర్శకాలని ముస్లిం మత పెద్దలు ముఫ్తి ఆసిఫ్, కరీం పటేల్‌లు అన్నారు. మిలాద్ ఉన్ నబి పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేటలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త కారణ జన్ముడని ఆయన చూపిన బాటలో పయణిస్తే జీవితం సుఖ శాంతులతో ఉంటుందన్నారు. ప్రవక్త జీవితం మొత్తం మానవాళికి ఆదర్శప్రాయమని కొనియాడారు. మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన ఘనత మహమ్మద్ ప్రవక్త దేనన్నారు. తల్లి దండ్రులను మనం ప్రేమిస్తే జీవితం సఫలమైనట్టేనని ప్రవక్త తెలిపారన్నారు. ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గంగా జమున తహజీబ్‌గా ప్రజలందరం కలిసి ఉండాలని సూచించారు. అనంతరం సిద్దిపేట ఏసీపీ రవీందర్ మాట్లాడుతూ ర్యాలీని నిర్వహకులు శాంతియుతంగా నిర్వహించారని కొనియాడారు. సిద్దిపేటలో మిలాద్ ఉన్ నబి శాంతి ర్యాలీ -
మత్తళ్లు.. పరవళ్లు
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. నంగునూరు, పాలమాకుల, బద్దిపడగ, రాంపూర్, మగ్ధుంపూర్, సిద్దన్నపేట, అంక్షాపూర్, నాగరాజుపల్లి, నర్మేట లోని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. నంగునూరు మండలం గుండా ప్రవహించే మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చెక్‌డ్యామ్‌లు పరవళ్లు తొక్కుతున్నాయి. కాగా భారీ వర్షాలతో అక్కేనపల్లి లోని బుడగ జంగాల కాలనీ నీట మునిగింది. నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. హుస్నాబాద్ మండలంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యకారులు చేపలు పడుతుండటంతో చెరవుల వద్ద సందడి నెలకొంది. అక్కన్నపేట మండలం గండిపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 0.5టీఎంసీలు. కొన్ని రోజులుగా నీళ్లు లేక ఎండిన ప్రాజెక్టులో నీళ్లు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – నంగునూరు(సిద్దిపేట)/హుస్నాబాద్‌రూరల్/అక్కన్నపేట(హుస్నాబాద్) -
జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు గజ్వేల్: ప్రధాని మోదీ కృషి వల్ల భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి గజ్వేల్‌లో జీఎస్టీ తగ్గింపుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 11 ఏళ్లలో మోదీ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్రం జీఎస్టీని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేసిందన్నారు. మరోవైపు 12లక్షల లావాదేవీలకు వరకు ఇన్కమ్ ట్యాక్స్‌ను రద్దు చేయడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ మేలు జరిగిందన్నారు. నేడు అమెరికా ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడు తున్నా నరేంద్రమోదీ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. సదస్సులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోరాట స్మృతి చిహ్నాలను కాపాడాలి మద్దూరు(హుస్నాబాద్): పోరాట స్మృతి చిహ్నా లను కాపాడాలని, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. శుక్రవారం దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లిలో రజాకార్ల దాడిలో అమరులైన 118కి బురుజు, స్తూపం వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని బీజేపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. గుండ్రంపల్లి, బైరాన్‌పల్లి, కూటిగల్ లాంటి ఖిల్లాలను గుర్తిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. గొల్ల కురుమలపై సర్కార్ వివక్షసిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కురుమల పట్ల వివక్ష చూపుతోందని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కురుమల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేదన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా నట్టల మందులు సరఫరా చేయాలని, పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల నగదు బదిలీ చేయలన్నారు. నూతన సొసైటీలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఐలయ్య, పట్టణ శాఖ అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు పాల్గొన్నారు. -
రోడ్లు కోత.. పయనం వెత
అక్కన్నపేట మండలం ధర్మారం, పోతారం(జే), మైసమ్మవాగుతండా గ్రామాల్లో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురయ్యాయి. తాటివనం బ్రిడ్జి వద్ద రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణం ప్రమాదంగా మారింది. అలాగే పలు చోట్ల సైడ్ బర్ములు కొట్టుకుపోయ్యాయి. ధర్మారం వెళ్లే మార్గంలో బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురై వరి పొలంలో ఇసుక మేటలు వేశాయి. ఎలాంటి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
అదే వరుస.. తప్పని గోస
యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా బస్తా యూరియా దొరకడం గగనంగా మారుతోంది. శుక్రవారం మిరుదొడ్డిలో రెండు యూరియా లారీల లోడ్ రావడంతో రైతులు ఒక్కసారిగా కిక్కిరిసి పోయారు. కొందరికి టోకెన్లు లభించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మిరుదొడ్డి గోదాం వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. చిన్నకోడూరులో తెల్లవారుజామునే ఫర్టిలైజర్ షాపునకు పరుగులు పెట్టారు. వరుసలో చెప్పులను పెట్టారు. దుబ్బాక పట్టణంలో 5 సెంటర్లలో యూరియా రావడంతో రైతులు ఐదు చోట్ల బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక్క సంచి యూరియా కోసం నానా అవస్థలు పడ్డారు. దూల్మిట్ట మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్దకు యూరియా రావడంతో వందలాది మంది రైతులు తరలివచ్చారు. గంటలకొద్దీ నిరీక్షించినా కొంత మందికి యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. – మిరుదొడ్డి(దుబ్బాక)/చిన్నకోడూరు(సిద్దిపేట)/దుబ్బాకటౌన్/మద్దూరు(హుస్నాబాద్)అక్రమంగా నిల్వ చేసిన యూరియా సీజ్ ఒకరిపై కేసు నమోదుఅక్కన్నపేట(హుస్నాబాద్): ఒకవైపు యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే మరొపక్క బ్లాక్‌లో యూరియా బస్తాలను అమ్మేస్తున్నారు. మండల పరిధిలోని నందారం గ్రామానికి చెందిన కరివేద సంజీవ్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా యూరియా బస్తాలు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి తొమ్మిది బస్తాలను సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి హుటాహుటిన సందర్శించారు. అలాగే మండలంలోని పలు ఫర్టిలేజర్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం ఏఓ తస్లీమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.రోజురోజుకు పెరుగుతున్న యూరియా అవస్థలు -
మీడియా గొంతు నొక్కడమా?
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. చంద్రబాబు పెద్ద నియంత దుబ్బాక: దేశంలోనే పెద్ద నియంత చంద్రబాబు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కక్షసాధించడం తగదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను దళిత, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. – భీమసేన, భీమ్ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి దుర్మార్గం దుబ్బాక: ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సాక్షిపై తప్పుడు కేసులు బనాయించడం దారుణం. ప్రజా ఉద్యమాలకు మొదటి నుంచి ఊపిరిపోస్తున్న సాక్షిపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దుర్మార్గమైన వైఖరిని మాలమహానాడు తీవ్రంగా ఖండిస్తోంది. – ర్యాకం శ్రీరాములు, జాతీయమాలమహానాడు రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్ పత్రికాస్వేచ్ఛను హరించడమే దుబ్బాక: నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. చంద్రబాబు సర్కార్ భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం హేయమైన చర్య. – అమ్మన రాంచంద్రారెడ్డి, సీనియర్ న్యాయవాది మంచి పరిణామం కాదు.. సిద్దిపేటజోన్: పత్రికా స్వేచ్ఛను హరించవద్దు. పత్రికలపై నిర్బంధాలు మంచి పరిణామం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, జర్నలిస్టుల మీద పెట్టిన అక్రమ కేసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలకు పాలకులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, అప్పుడే నిజానిజాలు బహిర్గతం అవుతాయి. –పరమేశ్వర్. జిల్లా టీన్జీఓ అధ్యక్షుడు నిర్బంధ చర్యలు తగవు సిద్దిపేటజోన్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధి పత్రికలు. పత్రికలు, జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించడం తగదు. నిర్బంధ చర్యలు మంచి సంస్కృతి కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణం. ఏపీ ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తే వాటిని ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. – విక్రమ్ రెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధి. దాడులు సరికాదు సిద్దిపేటజోన్: నిజాన్ని నిర్భయంగా వెలికితీయడమే మూల సూత్రంగా పనిచేసే మీడియాను ఇబ్బంది పెట్టడం, దాడులు చేయడం సరికాదు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే మీడియా స్వేచ్ఛకు భంగమే. ఇకనైనా జర్నలిస్టులపై దాడులు ఆపాలి. – వరుకోలు రాజలింగం, అడ్వకేట్, సిద్దిపేట -
యూరియా కొరతకు కేంద్రమే కారణం
● కామారెడ్డి సభతో సత్తా చాటుదాం ● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం తెస్తే అది జరగకుండా కేంద్రంలో బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరై సత్తా చాటుదామన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడే..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా కలంపై కత్తి కట్టడాన్ని పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పలువురి నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. కక్ష సాధింపు సిగ్గుచేటు దుబ్బాక: ఆంధ్ర ప్రదేశ్‌లో నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలకు మద్దతుగా కథనాలు రాస్తున్న సాక్షిపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యాలయాలపై దాడులకు పాల్పడటం పత్రిక స్వేచ్ఛను హరించడమే. ప్రజల కష్టాలను, కన్నీళ్లను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా వెలికితీసే కథనాలు రాయడమే సాక్షి తప్పా. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటు. దాడులు, అక్రమ కేసులను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించడంతో పాటుగా సాక్షికి అండగా నిలుద్దాం. – కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే దమననీతి చర్యలు తగవు ఏపీ ప్రభుత్వం చేస్తున్న దమననీతి చర్యలు ఖండిస్తున్నాం. వాస్తవాలు బాహ్య ప్రపంచానికి చెప్పే బాధ్యతగా సాక్షి మీడియా ప్రయత్నాలు చేస్తుంటే, అణచివేత ధోరణితో నిర్బంధ చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛను హరించడమేకాక, ప్రజల భావ స్వేచ్ఛను కాలరాయడమే. తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలను విరమించాలి. –రంగాచారి. జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఏపీలో పోలీస్ రాజ్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పోలీసులను, అధికారులను ఉపయోగించి పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నారు.ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. సాక్షి ఎడిటర్, సాక్షి మీడియా మీద నిర్బంధ చర్యలు సరికావు. ఇది మంచి సంస్కృతి కాదు. నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా పాలన సాగుతోంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. –రాజిరెడ్డి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేసులు పెట్టడం మూర్ఖత్వమే.. సిద్దిపేటఅర్బన్: ఏపీ లోని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌పై, జర్నలిస్టులపై కేసులు పెట్టడం మూర్ఖత్వమే.. కేసులు పెట్టి భయపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని, భావప్రకటన స్వేచ్ఛను కాలరాయాలని చూడడం సరైంది కాదు. – ఆముదాల మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముమ్మాటికీ కక్షపూరితమే.. సిద్దిపేటఅర్బన్: నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియానే. ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం హేయమైన చర్య. కలంపై కత్తి కట్టడం ముమ్మాటికీ కక్షపూరితమైన చర్యే. – కిష్టాపురం లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిజర్నలిస్టుల గొంతు నొక్కడమే.. ఏపీలో జర్నలిస్టులపై, ముఖ్యంగా సాక్షి మీడియాపై జరుగుతున్న నిర్బంధ చర్యలు భావ స్వేచ్ఛను హరించేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పోలీస్ యంత్రాంగం ద్వారా పత్రికా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముమ్మాటికీ జర్నలిస్టుల గొంతు నొక్కడమే. ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే పత్రికా ముఖంగా ఖండించాలి. కానీ ఇలాంటి చర్యలు చేపట్టడం తగవు. –గందే నాగరాజు, జిల్లా జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు -
యూరియా.. అవే అవస్థలయా
దుబ్బాకలో యూరియా కోసం బారులుదీరిన రైతులుపలు ప్రాంతాల్లో బారులు తీరిన రైతులు ఒక్క బస్తా కోసం గంటల తరబడి నిరీక్షణ జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తీరడంలేదు. వ్యవసాయ పనులన్నీ వదిలేసి యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. వేసిన పంటలను రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఒక రోజు ముందే యూరియా పంపిణీ కేంద్రాలకు సద్దులు, దుప్పట్లు పట్టుకుని వస్తుండటం గమనార్హం. గురువారం దుబ్బాకలో ఇదే సీన్ కనిపించింది. వేల మంది రైతులు గంటల కొద్దీ లైన్లో నిరీక్షించారు. ఈ క్రమంలో గంభీర్‌పూర్‌కు చెందిన వృద్ధురాలు రెడ్డి చిత్తవ్వ స్పృహతప్పి పడిపోయారు. దీంతో తోటి రైతులు సపర్యలు చేయడంతో కోలుకున్నారు. పాఠశాలలు, కళాశాలలకు డుమ్మాకొట్టి విద్యార్థులు సైతం తల్లిదండ్రుల కోసం క్యూలో నిల్చుంటున్నారు. తీరా 520 యూరియా బస్తాలు వస్తే కొద్ది మందికే దొరకడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరుగాల్సి వచ్చింది. – సిద్దిపేటరూరల్/దుబ్బాక/హుస్నాబాద్/రూరల్/చేర్యాల(సిద్దిపేట)/దౌల్తాబాద్ (దుబ్బాక) -
రక్తదానం సామాజిక బాధ్యత
కలెక్టర్ హైమావతిసిద్దిపేటఎడ్యుకేషన్: ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, రెడ్ రిబ్బన్ క్లబ్‌ల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధు లు ప్రభలుతున్న ప్రస్తుత తరుణంలో రక్తదానం చేస్తూ విద్యార్థులు మానవీయతను, సామాజిక స్ఫూర్తిని చాటుతున్నారన్నారు. అభినందించారు. రక్తదానం ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత కావాలన్నారు. ఆదిశగా విద్యార్థులు, అధ్యాపకులు ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ శిబిరంలో 30 మందికి పైగా రక్తదానం చేశారు. కార్యక్రమ నిర్వాహకులను, రక్త దానం చేసిన వారిని కలెక్టర్ అభినందించి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు, అయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘కోడ్’ల రద్దుకు సంఘటిత పోరు
గజ్వేల్: కార్మికుల పాలిట ఆశనిపాతంగా మారిన లేబర్కోడ్ల రద్దుకు సంఘటితంగా ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. గురువారం గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో రాణే బ్రేక్లైనింగ్ ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల స్థానంలో లేబర్కోడ్లను అమలు చేయడం వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదని వాపోయారు. దీనివల్ల కనీస వేతన హక్కుచట్టం, గ్రాట్యూటీ, పెన్షన్, పనిభద్రత, సెలవులు, ఇతర సౌకర్యాలు లేకుండా హరించివేస్తున్నారని తెలిపారు. కార్మికులతో పాటు ఉద్యోగులకు ఈ లేబర్కోడ్లు తీవ్రమైన నష్టాన్ని కల్పించనున్నాయని పేర్కొన్నారు. వీటిని రద్దు చేసేంతవరకు పోరాటాలను ముమ్మరం చేయాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు. -
ఆస్పత్రి వెనుక డోర్ సైతం సీజ్
ఆర్ఎంపీ వైద్యుడిపై పీఎస్‌లో మరోమారు ఫిర్యాదు కొండపాక(గజ్వేల్): కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆస్పత్రి వెనుక డోర్ నుంచి వైద్య చికిత్సలు చేస్తున్న ఆర్ఎంపీ వైద్యుడిపై అధికారులు చర్యలు చేపట్టారు. ‘కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్’ అనే శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆర్ఎంపీ వైద్యుడి తీరుపై కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్ మండల రెవెన్యూ అధికారి సత్యనారాయణతో వెళ్లి ఆస్పత్రి వెనక ఉన్న డోర్‌ను సీజ్ చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు సుదర్శన్‌పై మరోమారు కుకునూరుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. -
మళ్లీ వణికిన మెదక్
మెదక్‌జోన్: భారీ వర్షంతో మెదక్ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాందాస్ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్‌ను జేసీబీతో తొలగించి నీరు దిగువకు వెళ్లేలా చేశారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్‌లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్నగర్, ఫతేనగర్, సాయినగర్, నర్సిఖేడ్ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెంటీ మీటర్లు, హవేళిఘణాపూర్‌లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి మెదక్ అంతా జలమయం అయింది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న పుష్పలవాగు ఉధృతి మళ్లీ ప్రారంభం కావటంతో సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ మళ్లీ నీట మునుగుతుందా.. అంటూ జనం భయాందోళన వ్యక్తం చేశారు. వర్షం తగ్గటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోనూ వర్షాలు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో గురువా రం సాయంత్రం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం మిరుదొడ్డి మండలంలో 39.6 మిల్లీమీటర్లు, అక్కన్నపేటలో 21.5 మి.మీ, దుబ్బాకలో 17.8 మి.మీ, నంగునూరు మండలంలో 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కుమ్మేసిన వాన.. మెదక్‌లో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం -
బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు
సిద్దిపేటరూరల్: స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయానికి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు వచ్చినట్లు ఆలయ చైర్మన్ కరుణాకర్, ఈఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నారాయణరావుపేట శివారులోని స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకలను దేవాదాయ, పోలీసుల సమక్షంలో లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో రూ.1,70,293 సమర్పించుకున్నారన్నారు. ఈ డబ్బును దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, చైర్మన్ కరుణాకర్, డైరెక్టర్లు శ్రీనివాస్, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ‘భూ భారతి’ సమస్యలు పరిష్కరించండి ● అలసత్వం చూపితే చర్యలు ● కలెక్టర్ హైమావతి కొండపాక(గజ్వేల్): భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. కొండపాకలోని సమీకృత కార్యాలయం భవనాన్ని బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ భూ హక్కుల పరిరక్షణ కోసం భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైన వారు నిర్మాణాల విషయాల్లో జాప్యం చేస్తే నోటీస్ అందించి మరొకరి పేరిట మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచుతూ పారదర్శకత లోపించకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాగి జావ ఆరోగ్యానికి మేలుడీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాగి జావ ఆరోగ్యానికి మేలు చేస్తుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే రాగిజావ పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిఽధి మహదేవ్ నరేష్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యం భేష్ ఇర్కోడ్ను సందర్శించిన ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు -
పల్లెలకు వెలుగులు: మంత్రి పొన్నం
హుస్నాబాద్‌రూరల్: పల్లెల్లో సెంటర్ లైటింగ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం రాత్రి పందిల్ల, పోతారం (ఎస్) గ్రామాల్లో జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్స్‌ను కలెక్టర్ హైమావతితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్‌ను విద్య, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిరీమా ఆగర్వాల్, జిల్లా గ్రంథాల చైర్మన్ లింగమూర్తి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నో యాక్షన్..!
మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్ ప్లాన్ మొక్కుబడిగా సాగింది. ప్రభుత్వం నుంచి కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు సైతం ప్రణాళిక అమలును మమ అనిపించారు. దీంతో ప్రగతి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇళ్ల మధ్య, రోడ్లపైనే చెత్త దర్శనమిస్తోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. రెగ్యులర్‌గా చేపట్టే పనులను మాత్రం నిర్వహించడం గమనార్హం. జిల్లాలోని మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుపై ‘సాక్షి’ బృందం పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి.అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యం అధ్వానం గజ్వేల్: మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మొదలుకొని భువన్ సర్వే, ట్రేడ్ లైసెన్స్‌లు, ఇళ్ల అసిస్మెంట్ల టార్గెట్లు, ఇంటి పన్నుల వసూళ్లు, ఇళ్ల అనుమతులు, నల్లా కనెక్షన్ల ఆన్లైన్ తదితర అంశాలవారీగా వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగానే 2,685 నల్లా కనెక్షన్లను ఆన్లైన్ చేశారు. 34 గృహలను వాణిజ్య గృహాలుగా మార్చారు. 486 ట్రేడ్ లైసెన్స్‌లు అందించారు. 37శిథిల ఇళ్లను గుర్తించి నోటీసులు ఇచ్చి, వీటిలో 19 ఇళ్లను కూల్చేశారు. కానీ పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్ల విషయంలో పరిస్థితి మారలేదు. ఇళ్ల మధ్యే చెత్తను పారబోస్తున్నారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అంతర్గత రోడ్లకు మరమ్మతులు కరువై నడవడానికి కూడా వీలు లేకుండా తయారయ్యాయి. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో తమ కృషిని కొనసాగించామని తెలిపారు.తీరని మురుగు వ్యథసిద్దిపేటజోన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో వందరోజుల యాక్షన్ ప్రణాళిక మొక్కుబడిగా ముగిసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించలేదు. అయినప్పటికీ మున్సిపల్ నిధులతో కొన్ని పనులను చేపట్టారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను వందరోజుల ప్రణాళికలలో బల్దియా ఆశించిన స్థాయిలో చేపట్టలేదు. భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వల్ల మురుగు నీటి ఇబ్బందులు తప్పడంలేదు. ఇదే అంశంపై మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ మాట్లాడుతూ.. యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పట్టణంలో అనేక అంశాలపై దృష్టి సారించామని తెలిపారు.నిధులు రాక.. పనులు చేపట్టకదుబ్బాక: నిధులు లేక మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వంద రోజుల ప్రణాళికలో నిధుల జాడ లేకపోవడంతో కొత్తగా పలాన పని అయిందన్న దాఖలాలు కనిపించలేదు. మున్సిపాలిటీలో సరిపడే సిబ్బంది లేక పారిశుద్ధ్య నిర్వాహణ అంతంత మాత్రంగానే తయారైంది. నిధులు లేకపోవడంతో కేవలం రెగ్యులర్‌గా నిర్వహించే శానిటేషన్, ట్రేడ్ లెసెన్స్‌లు, నల్లా కనెక్షన్ల ఆన్లైన్ తదితర పనులు మాత్రమే పూర్తిస్థాయిలో చేపట్టారు. అంతర్గత రోడ్లు, డ్రేనేజీలు అధ్వానంగా ఉండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. -
హుస్నాబాద్‌ను కరీంనగర్లో కలపాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్లో కలపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్లో కలుపుతామని మాట ఇచ్చి తప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గ్రామాల్లో అడ్డుకుంటామని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారన్నారు. నేడు మాట ఎత్తడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
కొండపాక(గజ్వేల్): సాక్షాత్తు కలెక్టర్ ఆదేశాలను ఆర్ఎంపీ వైద్యుడు ఉల్లంఘించారు. ఆస్పత్రిని సీజ్ చేసినా వెనకాల నుంచి యథాతథంగా వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఈ ఘటన కుకునూరుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు సుదర్శన్.. ఆస్పత్రి అని పేరుపెట్టుకొని వైద్యం అందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన విద్యార్థి యశ్వంత్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా ఎలాంటి పరీక్షలు చేయకుండానే అత్యవసర వైద్యం అందించడంతో ఆగస్టు 29న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ధనరాజు ఆస్పత్రిని సీజ్ చేశారు. అంతేకాక పోలీస్‌స్టేషన్‌లో వైద్యుడిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదయ్యింది. అయినా యథావిధిగా ఆస్పత్రి వెనుక నుంచి డోర్ ఓపెన్‌చేసి వైద్య చికిత్సలు చేస్తున్నారు. వెనకాల డోర్ తెరిచి ఉన్న దృశ్యాన్ని బుధవారం సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. దీంతో పాటు లోపలికి వెళ్లి ఆస్పత్రి సీజ్ అయిన విషయాన్ని వైద్యుడు సుదర్శన్‌తో ప్రస్తావించగా.. సీజ్ అయిన విషయం వాస్తవమే. కానీ వెనకాల ఉన్న డోర్‌ను వైద్యాధికారి ధనరాజ్ ఓపెన్ చేసుకోమన్నారంటూ చెప్పడం గమనార్హం. ఈ విషయమై వైద్యాధికారిని వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని, నిబంధలు ఉల్లంఘిస్తే మరో కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామన్నారు. ఉల్లంఘించిన ఆర్ఎంపీ వైద్యుడు ఆస్పత్రిని సీజ్ చేసినా యథాతథంగా వైద్య చికిత్సలు -
పరిషత్ ఓటర్లు 6,55,958
జిల్లాలో పరిషత్ ఓటర్లు 6,55,958 మంది ఉన్నారు. పరిషత్ ఓటర్ల తుది జాబితాను బుధవారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో సీఈఓ రమేశ్ విడుదల చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా జాబితాను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రాగానే నిర్వహించేందుకు ఓటరు జాబితాను సిద్ధం చేశారు. – సాక్షి, సిద్దిపేటమహిళా ఓటర్లే..పరిషత్ ఓటర్లలో మహిళా ఓటర్ల అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఓటర్లు 6,55,958 మంది ఉండగా అందులో మహిళలు 3,34,186, పురుషులు 3,21,766, ఇతరులు ఆరుగురు ఉన్నారు. కోహెడ మండలంలో అధికంగా ఓటర్లు, దూళ్మిట్టలో తక్కువ ఓటర్లు ఉన్నారు.జిల్లా వ్యాప్తంగా మూడు అభ్యంతరాలుజిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా 1,291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6న ఓటరు ముసాయిదాను ప్రదర్శించారు. ఈ నెల 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా దరఖాస్తులను ఈ నెల 8 వరకు స్వీకరించగా మూడు అభ్యంతరాలు వచ్చాయి. వాటిని 9వ తేదీ వరకు పరిష్కరించి బుధవారం జాబితాను ప్రచురించారు. జిల్లాలో జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) 26, మండల ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ)లు 230 ఉన్నాయి. -
యూరియా పంపిణీలో సర్కార్ విఫలం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా సరఫరాపై ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టలేదన్నారు. జిల్లాల్లో ఎంత మంది రైతులు ఉన్నారు? ఎంత సాగవుతోంది? ఎంత యూరియా అవసరం? అనే వివరాలు తీసుకుని ప్రభుత్వానికి కలెక్టర్లు తెలపాలన్నారు. వివరాలు పూర్తిగా తెలిస్తే కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి యూరియా తీసుకువచ్చే బాధ్యత ఎంపీలదన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద తమ తల్లి పేరున మొక్కను నాటి సంరక్షించాలన్నారు. స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ నివారణ, స్వదేశీ వస్తువుల వినియోగం, రక్తదానాలు, పేదలకు ఆహార పదార్థాలు అందించడం లాంటి కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలు చేపట్టాలన్నారు. జీఎ స్టీపై ఈ నెల 12 న గజ్వేల్, 13న సిద్దిపేటలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, మార్కండేయులు, తదితరులు పాల్గొన్నారు.అలసి.. కునుకు తీసిజగదేవ్పూర్(గజ్వేల్): జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బుధవారం యూరియా కోసం రైతులకు బారులు తీరారు. ఉదయమే వివిధ గ్రామాల రైతులు రైతు వేదికకు వచ్చి వేచి చూశారు. రాళ్లు, చెప్పులు, పాస్ పుస్తకాలు క్యూలో పెట్టారు. ఓ గ్రామానికి చెందిన వృద్ధ రైతు అలసి పోయి అక్కడే కొంతసేపు కునుకు తీశారు. ఏఓ వసంతరావు మాట్లాడుతూ మండలానికి 15 వందల బస్తాలు వచ్చాయని వరుస క్రమంలో యూరియాను అందించినట్లు తెలిపారు.సహకార సంఘం ఎదుట బారులు మద్దూరు(హుస్నాబాద్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం ధూళ్మిట్ట మండల కేంద్రంలో ఉదయం నుంచి సహకార సంఘం వద్ద రైతులు క్యూలైన్లో వేచి ఉన్నారు. వారం రోజులుగా ఒక్క సంచి దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్లు ఒక చోట యూరియా మరో చోట ఇవ్వడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. రైతులు అధైర్యపడొద్దు.. అందరికీ అందిస్తాం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు -
వనం..
ఒకే రోజు 15,292 మొక్కలు నాటిన అధికారులు వనమహోత్సవంలో నంబర్ వన్‌గా నిలిచిన జిల్లా సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఒక్కో మొక్కను నాటి ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మంగళవారం ‘ఏక్ పేడ్ మా కే నామ్ (తల్లి పేరు మీద) స్ఫూర్తితో కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా 15,292 మొక్కలు నాటారు. ఇందులో అటెండర్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఉద్యోగులు ర్యాలీగా వచ్చి మొక్కలు నాటే వినూత్న కార్యక్రమం చేపట్టారు. మొక్కను నాటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలలో షేర్ చేశారు. అలాగే నాటిన మొక్కలకు జీయో ట్యాగ్ చేసి ఏక్ పేడ్ మా కే నామ్ యాప్‌లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని, అందుకే తల్లి పేరుపై మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత చూసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ వన మహోత్సవం కార్యక్రమంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా జిల్లా నిలిచింది. 2025–26కుగాను 18.02కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13.14కోట్ల(72.89శాతం) మొక్కలను నాటారు. అందులో జిల్లా లక్ష్యం 22.47లక్షలు కాగా 23.32 లక్షల (103.79 శాతం) మొక్కలు నాటి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. -
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిలు క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలను సమానంగా చూడాలన్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సెల్‌ఫోన్‌కు బానిసలవ్వరాదని, సెల్‌ఫోన్‌కు కేటాయించే సమయాన్ని క్రీడలకు కేటాయించాలన్నారు. జిల్లా స్థాయిలో రాణించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యి, జిల్లాకు పతకాలు తీసుకురావాలన్నారు. డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అట్టహాసంగా జిల్లా క్రీడాపోటీలు షురూ.. -
మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్
దుబ్బాక: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ హైమావతి, జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. మంగళవారం సాయంత్రం దుబ్బాకలో కోర్టుకాంప్లెక్స్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కోర్టు ప్రాంతంలోనే జడ్జి క్వార్టర్స్ ఉండేలా చూడాలన్నారు. పాత తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అధికారులు సర్వేచేసి ప్రభుత్వ భూమి సేకరించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు అన్ని సౌకర్యాలతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్ రూపొందించాలన్నారు. అతి త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, ఆర్డీవో సదానందం, రెవెన్యూ, కోర్టు, సర్వే, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. త్వరలోనే నిర్మాణానికి శంకుస్థాపన కలెక్టర్ హైమావతి, జిల్లా జడ్జి సాయిరమాదేవి దుబ్బాకలో స్థల పరిశీలన -
యూరియా పక్కదారి పట్టిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి కొమురవెల్లి(సిద్దిపేట): యూరియాను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. మంగళవారం మర్రిముచ్చాల రైతు వేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీకి ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు కావాల్సినంత యూరియా అందిస్తామన్నారు. కొందరు ప్రయివేటు డీలర్లు యూరియా పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం ఉందని, వారిపై వారిపై కఠినచర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఆత్మ కమిటీ డైరెక్టర్ జంగని రవి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ హితమే లక్ష్యం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గజ్వేల్‌లోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిని గౌరవించుకోవడంతోపాటు భావితరాల బాగు కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, సూపర్వైజర్ మహిపాల్, నాయకులు పాల్గొన్నారు. చేప పిల్లల పంపిణీలో సర్కార్ విఫలం సిద్దిపేటజోన్: ఉచిత చేప పిల్లల పంపిణీలో సర్కార్ విఫలమైందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసిందని, ముదిరాజ్‌లకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత ఏడాది టెండర్ల పేరిట కాలయాపన చేసిన ప్రభుత్వం ఈసారి అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. చేప పిల్లలను వదిలే సీజన్ దాటినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేప పిల్లలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వెంకటేశం, యాదగిరి, ఎల్లం, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ నాయకుల వినూత్న నిరసన సిద్దిపేటజోన్: విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. స్థానిక సుభాష్ రోడ్ మార్గంలో దుకాణాలలో నాయకులు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్ షిప్‌లను సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరశురాం, అరవింద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు పడిన గండి పూడ్చివేత మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం ఖాజీపూర్ రోడ్డు ఇటీవల కురిసి వర్షాలకు గండి పడింది. 15 రోజులుగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో రుద్రారం గ్రామానికి చెందిన సామాజిక సంఘ సేవకుడు మల్లన్నగారి భిక్షపతి ప్రత్యేక చొరవతో మంగళవారం జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి గండిని పూడ్చివేశారు. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
బాధితులకు న్యాయం జరగాలి
పటాన్చెరు టౌన్: సిగాచి పరిశ్రమ బాధితులకు న్యాయం జరగాలని, ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్లో టీపీజేఏసీ కన్వీనర్ అశోక్ కుమార్, సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు పలువురు మేధావులు, వక్తలు, బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘం నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ బాధలను పంచుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ...సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. యాజమా న్య తప్పిదం తోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారని తెలిపారు. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం సరి కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై కేసులు పెట్టి దొరికిన వారిని అరెస్టు చేసిన ప్రభుత్వాలు ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాలపై మరొకలా వ్యవహరించడం ఏం నీతని నిలదీశారు. కార్మికుల సజీవ దహనానికి కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలతోపాటు పౌర సమాజం ఈ ప్రమాదం నుంచి గుణ పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిర్మాణాత్మక శైలిలో నిబంధనలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలతోపాటు నిపుణులు, మేధావులు ఒకతాటిపై వచ్చి ప్రణాళిక సిద్ధం చేసి సీఎంను కలిసి వివరిద్దామని తెలిపారు. సంఘటన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతోపాటు గాయపడిన క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ప్రకటించారని వెంటనే ఆ పరిహారాన్ని చెల్లించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.సిగాచి పరిశ్రమ నిర్లక్ష్యం, కాలం చెల్లిన మెషీనరీతో అవగాహన లేని కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం, పరిశ్రమలో తయారుచేసే మిశ్రమం నుంచి వచ్చిన ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు తేల్చిచెప్పారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.కోటితో పాటు గాయపడ్డ క్షతగాత్రులకు రూ.పదిలక్షల నష్టపరిహారం ప్రకటించినా ఇప్పటివరకు కార్మికులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. పక్క రాష్ట్రంలో ప్రమాదం జరిగిన వారం రోజుల్లోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తే తెలంగాణలో మాత్రం కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అడ్వొకేట్ వసుదా నాగరాజు సహకారంతోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. పరిశ్రమల్లో కార్మిక భద్రత గురించి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం: బాబూరావు సిగాచిపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రొఫెసర్ కోదండరామ్ బాధిత కుటుంబ సభ్యుల సమస్యలు చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్తా ప్రకటించిన పరిహారం త్వరగా చెల్లించండి -
రోడ్డుపై బైఠాయించి నిరసన
చేర్యాల(సిద్దిపేట): యూరియా బస్తాల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్న స్థానిక ఏఓపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం పట్టణంలోని బాలాజీ కళామందిర్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఓ టోకెన్ జారీ చేసినా షాపుల నిర్వాహకులు యూరియా ఇవ్వడం లేదన్నారు. వచ్చిన బస్తాలకన్నా ఎక్కువ టోకెన్లు జారీ చేస్తూ రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నారన్నారు. రోజంతా లైన్లో నిలబడినా యూరియా అయిపోందంటూ పంపిస్తున్నారని వాపోయారు. మరోవైపు రాజకీయ నాయకులకు చాటుగా యూరియా బస్తాలు అందిస్తున్న ఏఓపై చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏడీఏ రాధిక రైతులతో మాట్లాడారు. సమస్యపరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పడంతో రైతులు శాంతించారు. -
జీఓ 99 సవరించాల్సిందే
హుస్నాబాద్: ఎస్సీ వర్గీకరణ కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబర్ 99 అత్యంత ప్రమాదకరమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. సోమవారం మాల మహానాడు పిలుపు మేరకు మాలలు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డు గేట్ వద్ద జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఈ జీవో వల్ల మాలల విద్యార్థులకు విద్య, ఉద్యోగ సీట్లల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్ విధానంలో 22 నుంచి 16కు తగ్గించాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 99ని సవరించే వరకు పోరాటం ఆగదన్నారు. అనంతరం మంత్రి పీఏకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ ఇన్చార్జి ఆరె కిషోర్, నాయకులు వెన్న రాజు, దండి లక్ష్మి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి దుబ్బాక: ఏబీసీడీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాలమహానాడు నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నాయకులు ముట్టడించారు. క్యాంపు ఆఫీసు గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి లేక పోవడంతో పీఏకు వినతి పత్రం అందించారు. జీఓ 99 ను రద్దుచేయాలని, ఏబీసీడీ వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో మాట్లాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడించిన మాలమహానాడు నాయకులను పోలీసులు అక్కడినుంచి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మాలమహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి కాల్వ నరేష్, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కాల్వ లింగం, ఆస రాజశేఖర్, శ్రీనివాస్, రాజేష్, ప్రభాకర్, శేఖర్‌రావు, నారాయణ తదితరులు ఉన్నారు.మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ -
బినామీల దందా!
ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన దుకాణాల అద్దె వ్యవహారంలో బినామీల దందా కొనసాగుతోంది. కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 15 ఏళ్లుగా అద్దెను పెంచనివ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ ఖజానాకు గండి కొడుతున్నారు. తక్కువ అద్దెకు షెట్టర్లను తీసుకొని అధిక అద్దెలకు వ్యాపారులకు ఇచ్చి ఏటా రూ. లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఇతరులకు అక్రమంగా అద్దెలకు ఇచ్చి ఆదాయం పొందుతున్నా.. కొన్నేళ్లుగా అద్దెలు చెల్లించకపోయినా అడిగే నాథుడే కరువయ్యారు. – సాక్షి, సిద్దిపేటఎస్సీల అభివృద్ధి కోసం స్వయం కృషి పథకంలో భాగంగా 1989–90లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల 50షెట్టర్లను నిర్మించారు. సిద్దిపేటలో ఐదు, దుబ్బాకలో 10, గజ్వేల్‌లో ఐదు, తిమ్మాపూర్‌లో 5, జగదేవ్‌పూర్‌లో 5, కొండపాకలో 5, లింగారెడ్డిపల్లిలో 5, మద్దూరులో 5, లచ్చపేటలో ఐదు షెట్టర్లు ఉన్నాయి. వీటిని 19 నుంచి 45 సంవత్సరాల లోపు ఎస్సీలకు అద్దెలకు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారు. 2008లో పట్టణాల్లో అయితే రూ.600 నుంచి రూ.800, గ్రామ పంచాయతీల్లో రూ.400 అద్దెగా నిర్ణయించారు. మార్కెట్ ధర ప్రకారం 5శాతమే అద్దె 2008 నుంచి కొందరు అద్దెను చెల్లించడమే బంద్ చేశారు. దాదాపు 15 ఏళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మరి కొందరు ఇతరులకు అక్రమంగా అద్దెకు ఇచ్చి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఎస్సీ కార్పొరేషన్‌కు అద్దె మాత్రం చెల్లించడంలేదు. ఇటీవల అధికారులు నోటీసులు ఇవ్వడంతో కొంత చెల్లించారు. మార్కెట్ ధర ప్రకారం అద్దెను చూస్తే కనీసం 5శాతం సైతం లేని అద్దెను సకాలంలో చెల్లించడం లేదు. 2008లో నిర్ణయించిన ప్రకారం చూస్తే సిద్దిపేటకు చెందిన షెట్టర్లు రూ.7.20లక్షలు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు రూ2.77లక్షలు మాత్రమే చెల్లించారు. గజ్వేల్‌లో రూ.3.60లక్షలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించింది రూ.1.95లక్షలే. దుబ్బాకలో రూ.10లక్షలకు గాను రూ.6.7లక్షలు మాత్రమే చెల్లించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అద్దెను సవరించి, పాత బకాయిలను వసూలు చేయాలని, బినామీలకు షెట్టర్లను రద్దు చేసి నిరుద్యోగ ఎస్సీ యువతకు అందించాలని కోరుతున్నారు. సిద్దిపేట పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఐదు షెట్టర్లను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వాటిని ఎస్సీలకు కేటాయించారు. 2008లో రూ.800 అద్దెగా నిర్ణయించారు. అప్పటి నుంచి అంతే అద్దెకు కొనసాగుతోంది. వీటిలో రెండు షెట్టర్లను కేటాయించిన వారు కాకుండా ఇతరులకు అద్దెకు ఇచ్చి ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సమీపంలోనే మున్సిపాలిటీకి సంబంధించిన షెట్టర్లు ఉండగా వాటికి ఒక్కోదానికి రూ.12వేల నుంచి రూ.14వేలు వసూలు చేస్తున్నారు. దుబ్బాక పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద పది షెట్టర్లను ఎస్సీ కార్పొరేషన్ నిర్మించి అద్దెకు ఇచ్చింది. 2008లో ఒక్కో షెట్టర్‌కు రూ. 600గా నిర్ణయించారు. అప్పటి నుంచి అద్దెను పెంచలేదు. ఇందులో దాదాపు నలుగురు ఇతరులకు అక్రమంగా అద్దెకు ఇచ్చి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ సాధారణంగా ఒక్కో షెట్టర్‌కు రూ.8వేల నుంచి రూ.10వేలు అద్దె ఉంది. ఇతరులకు ఇచ్చిన వారిపై చర్యలు త్వరలో అద్దెలను పెంచుతాం. షెట్టర్లలో అద్దెకు ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చాం. దీంతో దాదాపు రూ.11లక్షల వరకు అద్దె వసూలు చేశాం. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వాటిని మరమ్మతులు చేయిస్తాం. కేటాయించిన వారు కాకుండా ఇతరులకు అద్దెలకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం. – భార్గవ్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ దుకాణాల అద్దెలో గోల్మాల్ 15 ఏళ్లుగా కిరాయి చెల్లించని లబ్ధిదారులు అక్రమంగా ఇతరులకు కేటాయింపు అధిక కిరాయి వసూలు కార్పొరేషన్ ఖజానాకు గండి -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ సమస్యలు, పలు సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 168 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రశీదు కౌంటర్ వద్ద గందరగోళం ప్రజావాణిలో భాగంగా దరఖాస్తు అందించిన అనంతరం రశీదు అందించే కౌంటర్ వద్ద గందరగోళం నెలకొంది. రశీదు కోసం గంటల తరబడి వేడిచూడాల్సి వచ్చింది. అధికారులు మరో కౌంటర్ ఏర్పాటు చేసి రశీదు అందిస్తే బాగుంటుందని పలువురు కోరారు. కలెక్టర్ హైమావతి ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ -
వణికిస్తున్న జబ్బు.. ఆస్పత్రులు గబ్బు..
చీటిలకూ పడిగాపులే..ఓ వైపు వణికిస్తున్న జబ్బు.. మరోవైపు ఆస్పత్రుల్లోని కంపుతో రోగులు బెంబేలుచెందుతున్నారు. అసలే జ్వరాల సీజన్ కావడంతో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్యం కోసం ఓపీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఓపీ కేంద్రం నుంచి వైద్యం చేయించుకునే వరకు రోగులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆస్పత్రికి వస్తే.. ముక్కు పుఠాలు ముక్కలయ్యేలా కంపు కొడుతోంది. దీంతో ఆస్పత్రులకు వచ్చిన రోగులు, వారికి తోడుగా వచ్చిన సహాయకులు.. కొత్త రోగాల బారిన పడుతుండటం గమనార్హం. ఇక పట్టణ ఆస్పత్రుల్లో అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరతతో అవస్థలు తప్పడంలేదు. సోమవారం పట్టణ ఆస్పత్రులను సాక్షి విజిట్ చేయగా పలు విషయాలు వెలుగుచూశాయి. గజ్వేల్‌రూరల్: రోగమొస్తే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుందామనుకునే ప్రజలు.. వైద్యుల వద్దకు వెళ్లేముందు తీసుకునే టోకెన్ల(చీటి) కోసమే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అంతేగాకుండా వైద్యులు సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గజ్వేల్ పట్టణంలో జిల్లా ప్రభుత్వాస్పత్రితో పాటు మాతాశిశు సంరక్షణ ఆస్పత్రులను ప్రభుత్వం వేర్వేరుగా ఏర్పాటు చేసింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జనరల్ వ్యాధులతో పాటు పీడియాట్రిక్, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్ తదితర చికిత్సలను అందిస్తుండగా, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఆస్పత్రులలో నిత్యం సుమారు 700 నుంచి 900 మంది వైద్యం కోసం వస్తుంటారు. అయితే జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుని వద్దకు వెళ్లేకంటే ముందు టోకెన్(చీటి) తీసుకోవడానికి సుమారు అరగంటకుపైగా క్యూలైన్లో పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. అంతేగాకుండా వైద్యులు సైతం సమయపాలన పాటించడం లేదని ఆసుపత్రికి వచ్చే వారు ఆరోపిస్తున్నారు. వైద్యం సకాలంలో అందడంలేదని చెబుతున్నారు. కంపుకొడుతున్న పెద్దాస్పత్రిసిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ఆస్పత్రికి వస్తే వ్యాధి నయమవడం ఏమో కానీ వ్యాధుల బారీన పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నిత్యం పలు విభాగాల్లో 1600మంది ఓపీ సేవలు పొందుతున్నారు. ఇందులో వైరల్ ఫీవర్ వారు ఎక్కువగా ఉన్నారు. నెల రోజుల్లో 37మంది డెంగీ బారీన పడ్డారు. జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, గైనకాలజీ విభాగాల ఓపీ వద్ద రోగులు క్యూ కట్టారు. ప్రస్తుతం ఇన్ పేషెంట్ విభాగంలో 256 మంది చికిత్స పొందుతున్నారు. రోగులను తీసుకెళ్లాల్సిన స్ట్రెచర్ పైన సిబ్బంది మందులు తీసుకెళ్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో శానిటేషన్, వైద్య సేవలపై ఆర్ఎంఓను సంప్రదించగా చెత్త తీసుకెళ్లే వాహనం రిపేర్ వల్ల రాలేదని, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి చెత్తను తొలగిస్తామని, ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో వైద్య సేవలందుతున్నాయని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డాక్టర్లు అరకొర.. రోగులు కిటకిటహుస్నాబాద్: వైరల్ ఫీవర్‌తో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడాయి. 419 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 83 మందికి వైరల్ ఫీవర్‌గా గుర్తించారు. 24 మంది జ్వర పీడితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు జ్వరాలు పెరగడంతో రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఉదయాన్నే రోగులు క్యూలైన్లు కట్టారు. ఆస్పత్రిలో 16 డాక్టర్ల పోస్టులకు గాను ఏడుగురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ జ్వరాలతో బాధపడుతున్నారు. వైద్యం దైవాదీనంఓపీ కేంద్రాల వద్ద రోగులు బారులు గంటల తరబడి నిరీక్షణ అరకొర మందులు.. వేధిస్తున్న సిబ్బంది కొరత ఎవరికీ పట్టని పేదల గోస సాక్షి విజిట్‌లో వెలుగుచూసిన వాస్తవాలు -
ప్రశాంతంగా నిమజ్జనం
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025డీజే సౌండ్లు, భక్తుల కోలాహలం, పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర దుబ్బాకలో శనివారం రాత్రి ప్రారంభమై ఆదివారం సాయంత్రానికి ప్రశాంతంగా ముగిసింది. డీజే పాటలకు మహిళలు, యువతీయవకుల నృత్యాలు, మహారాష్ట్ర మహిళల బ్యాండ్ ట్రూప్‌లతో శోభాయాత్ర కనుల విందుగా సాగింది. నిమజ్జనానికి వివిధమండపాలనుంచి వివిధ ఆకృతుల్లో తీసుకువచ్చిన వినాయక విగ్రహాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. – దుబ్బాకటౌన్ -
కరెంట్.. కట్‌కట
● వ్యవసాయానికి వేళాపాళా లేని విద్యుత్తు కోతలు ● రోజుకు 10 గంటలు కూడా సరఫరా కాని దుస్థితి కొండపాక(గజ్వేల్): కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లో వ్యవసాయ రంగానికి వేళాపాళా లేని విద్యుత్తు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు రాజ్యమంటూ గొప్పలు చెపుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఓ పక్క యూరియా కొరత వేధిస్తుండగా మరో పక్క వ్యవసాయ బావులకు త్రీ ఫేజ్ విద్యుత్తు కోతలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. త్రీ ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోతుండటంతో రాత్రింబవళ్లూ వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రారంభంలో 12 నుంచి 15గంటలు సరఫరా వర్షాకాలం వ్యవసాయ సాగు పనులు ప్రారంభంలో ప్రతీ రోజు 12 నుంచి 15 గంటల వరకు త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా జరిగేది. అయితే ఆలస్యంగా వర్షాలు కురవడంతో రెండు మండలాల్లో 3నుంచి 4 గ్రామాల్లో మినహా మిగతా గ్రామాల్లోని చెరువులు నిండటంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. కొండపాక మండలంలో సుమారు 20 వేల ఎకరాల్లో, కుకునూరుపల్లి మండలంలో 8 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కొండపాక మండలంలో 7,452 అధికారిక వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లుండగా, కుకునూరుపల్లి మండలంలో 3,510 వ్యవసాయ అధికారిక విద్యుత్తు కనెక్షన్లుండగా మరికొన్ని అనధికారిక విద్యుత్తు కనెక్షన్ల ద్వారా త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా జరుగుతోంది. ఇందుకుగాను దుద్దెడ, కొండపాక, మర్పడ్గ, బందారం, వెలికట్ట, తిమ్మారెడ్డిపల్లి, మేదినీపూర్, తిప్పారం గ్రామాల్లోని 32/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ల నుంచి వ్యవసాయ బావులకు విద్యుత్తు సరఫరా జరుగుతోంది. ప్రచారార్భాటం పటాటోపమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిమిషమైనా కరెంటు కోతలుండవంటూ ప్రచారం చేసి తీరా అధికారంలోకి రాగానే కరెంటు సరఫరా తీరులను పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవయసాయ రంగానికి రోజుకు 18 నుంచి 20 గంటల వరకు సరఫ రా జరగ్గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 8 నుంచి 10 గంటల విద్యుత్తు సరఫరా కూడా కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. విద్యుత్తు శాఖ గజ్వేల్ డీఈ భానుప్రకాశ్‌ను వివరణ కోరగా త్రీ ఫేజ్ విద్యుత్తు సరపరాలో కోతల విషయమై నిర్ధారించడం లేదు.పొట్ట దశకు చేరుకున్న వరిపంటలు వర్షాకాలం ప్రారంభ దశలో సాగు చేసిన పంటలు చిరు పొట్ట దశకు చేరుకున్నాయి. ఈ దశలో నీటి వినియోగం ఎక్కువగా అవసరపడుతుందని సమయంలో వేళాపాళాలేని విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 4 గంటలకు నిలిచిపోయిన త్రీ ఫేజ్ కరెంటు మధ్యరాత్రి సుమారు 2 నుంచి 3 గంటలకు సరఫరా అవుతుందన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రి పూట వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
అంగన్వాడీలా!
● అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం ● ఆట వస్తువుల పరిస్థితి అంతంతే ● కొరవడిన అధికారుల పర్యవేక్షణచిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నారులు, గర్బిణీలు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు బాల్యం నుంచే చదువుపై ఆసక్తి కల్పించే లా ఆట, పాటలతో బోధించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరైన వసతులు లేకపోవడం వల్ల పిల్లలను అంగన్వాడీలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తిచూపడం లేదు. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో అరకొర వసతులు వేధిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏడు అద్దె భవనాల్లో మండలంలో మొత్తం 54 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 28 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలుండగా, 19 కేంద్రాలు అద్దె లేని భవనాల్లో కొనసాగుతుండగా, ఏడు కేంద్రాల్లో అద్దె భవనాల్లో సాగుతున్నాయి. ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి అద్దె చెల్లిస్తోంది. అద్దె మొత్తం కంటే ఎక్కువగా ఉంటే టీచర్లు మిగిలిన డబ్బు భరించాలి.నిలిచిపోయిన నిర్మాణాలు అద్దె భవనాల్లో ఉన్న కొన్ని కేంద్రాలకు గతంలో భవనాలు మంజూరైనా పనులు అసంపూ ర్తిగా నిలిచిపోయాయి. మరికొన్నింటికి పనులు ప్రారంభం కాలేదు. చిన్నకోడూరులో రెండు భవనాలు, ఎల్లాయపల్లిలో ఒక భవ నం నిర్మాణ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. అధికారులు స్పందించి భవనాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.నాణ్యమైన భోజనం అందించాలికొండపాక(గజ్వేల్): విద్యార్థులకు నాణ్యమైన బోధన, భోజనం అందేలా చూసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను ఆదివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి పూట అందించిన భోజనాన్ని పరిశీలిస్తూ ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయన్న విషయమై కలియ తిరుగుతూ పరిశీలించారు. మురికి కాలువలు చెడిపోవడంతో దుర్వాసన వస్తున్న విషయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తేవడంతో స్పందించి వెంటనే పనులు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. అక్కడక్కడ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ..కామన్ డైట్ మెనూను పాటించాలన్నారు. విద్యాపరమైన అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపేరు మీద మొక్క నాటాలి సిద్దిపేటరూరల్: జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేర కు ‘ఏక్ పేడ్ మా కే నామ్‌పే’ అనే నినాదంతో ప్రతీ అధికారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ కె.హైమావతి ఆదివారం పిలుపునిచ్చారు. 9న తల్లి పేరున ఒక మొక్క స్ఫూర్తితో జిల్లాలోని అధికారులంతా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో గుర్తించిన 13,900ల మంది ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. -
న్యూస్‌రీల్
జిల్లాస్థాయి క్రీడా పోటీలుప్రశాంత్నగర్(సిద్దిపేట): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12 వరకు 69వ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14, 17 బాలురు, బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, ఇందులోనుంచి జిల్లా స్థాయి జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలు ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాలలో, క్రికెట్ స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. లడ్డూను దక్కించుకున్న ముస్లింమద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో శివ భజరంగి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలందుకున్న గణపతి లడ్డూను వేలంపాటలో అదేగ్రామానికి చెందిన ముస్లిం యువకుడు మొహమ్మద్ జహంగీర్ దక్కించుకున్నారు. శనివారం రాత్రి నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.14,916కు జహంగీర్ దక్కించుకున్నారు. కాగా, హిందూ పండుగలో ముస్లిం యువకుడు భాగస్వామి కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నాచగిరి ఆలయ ద్వారబంధనంవర్గల్(గజ్వేల్): సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాచగిరి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజాకార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులకు దర్శనం ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి విజయ రామారావు తెలిపారు. వంటేరుకు ప్రముఖుల పరామర్శజగదేవ్పూర్(గజ్వేల్): మాతృవియోగంతో బాధపడుతున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పరామర్శించారు. సమస్యల పరిష్కారానికి కృషిటీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ సిద్దిపేటజోన్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. బతుక మ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధా న కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ ప్రతినిధులు బలరాం, వికాస్, ప్రవీణ్ పాల్గొన్నారు.