Siddipet District News
-
వైభవం.. బొడ్రాయి వార్షికోత్సవం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూరులో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా దూసకంటి రాజేశ్‌శర్మ, నవీన్‌శర్మ, వంశీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ ఇండ్ల వద్ద నుంచి బిందెలతో నీళ్లు తీసుకువచ్చి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలతో తరలివెళ్లి బొడ్రాయి, పోచమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యం
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లిబెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని గుగ్గిల్ల, దాచారం, కల్లెపెల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. అంతరం మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.5.56 లక్షల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీఓ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, మండల అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, చేప్యాల శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్, కుమార్, నర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
సిబ్బందిని నియమిస్తాం..
పిల్లల పార్కులు, ఉద్యాన వనాలను మెరుగుపరిచేందుకు త్వరలో తగిన చర్యలు తీసుకుంటాం. నిధుల లభ్యతను బట్టి సౌకర్యాలు కల్పిస్తాం. వాటి నిర్వహణకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక మరమ్మతులు చేపట్టాలి పట్టణంలో రామసముద్రం చెరువు కట్టపై పార్కులో ఆట వస్తువులు విరిగి పోవడంతో చిన్నారులు నిరాశ చెందు తున్నారు. విరిగిన ఆట వస్తువులకు మరమ్మతులు చేయించాలి. అలాగే ఉయ్యాలలను తిరిగి ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్, దుబ్బాక -
నిర్వహణ లేక కరువైన ఆహ్లాదం
● విరిగిన పరికరాలు, పాడైన సామగ్రి ● పట్టించుకోని అధికారులు పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కులు, ఉద్యానవనాల నిర్వహణ కరువైంది. దుబ్బాకలో పార్కులను అభివృద్ధి చేసినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై కన్నెత్తి చూడకపోవడంతో అధ్వానంగా మారాయి. లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆట పరికరాలు, ఇతర సామగ్రి పాడవుతోంది. దుబ్బాకటౌన్: పట్టణ కేంద్రంలో ప్రజలు సేద తీరేందుకు రామసముద్రం చెరువుకట్ట మీద చిల్డ్రన్ పార్క్‌ను, 18వ వార్డులో ఉద్యానవనం, దుంపలపల్లి 4వ వార్డులో ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేశారు. నిర్వహణ శూన్యం లక్షల రూపాయల నిధులతో పలుచోట్ల ఏర్పాటు చేసిన పార్కుల్లో ఆహ్లాదం లేకుండా పోయింది. పార్కు చుట్టూ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో కట్టపై ఓపెన్ జిమ్ వద్ద ప్లాట్‌ఫామ్ ధ్వంసమైంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలుమండిపడుతున్నారు. విరిగిన ఆట వస్తువులు పట్టణ సుందరీకరణలో భాగంగా రామసముద్రం చెరువు కట్టపై 2019లో రూ.50 లక్షల ఎస్ఓఎఫ్ నిధులతో నిర్మించిన పిల్లల పార్కు విరిగిన ఆట వస్తువులతో దర్శనమిస్తోంది. గుర్రపు బొమ్మలు, జారుడు బల్లలు, ఉయ్యాలలు విరిగిపోయాయి. కొన్నింటిని మందుబాబులు చెరువులో పడేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబులకు అడ్డాగా మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి నాలుగో వార్డులో 2022లో రూ.4 లక్షలు వెచ్చించి ఫ్రీడమ్ పార్కు నిర్మించారు. అందులో వివిధ రకాల మొక్కలు నాటి, జాతీయజెండా రంగులో టైర్లతో కుర్చీలు, ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మొక్కలకు నీరందడం లేదు. దీంతో అవి ఎండిపోవడంతో పశువులకు మేతగా మారాయి. పార్కు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ విరిగిపోయి, సిమెంటు దిమ్మెలు ధ్వంసమయ్యాయి. పార్కులో ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు దర్శనమిస్తున్నాయి. రామసముద్రం కట్టపై పిల్లల పార్కు -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీడీపీఓ శారదచిన్నకోడూరు(సిద్దిపేట): గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టడంతోపాటు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలన్నారు. గర్భిణులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలోనే ఒక పూట భోజనం తినాలని, పిల్లలకు బాలామృతం తినిపించాలని సూచించారు. పోషకాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి, సామూహిక సీమంతాలు చేశారు. ఎంపీడీఓ జనార్దన్, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.. హుస్నాబాద్‌రూరల్: గర్భిణులు పోషకాహారం తీసు కుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ అధికారి తిరుమల అన్నారు. పందిల్లలో నిర్వహించిన పోషక పక్షోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొని పోషకాలు కలిగిన ఆహారం గురించి అవగాహన కల్పించారు. పౌష్టికాహారం తీసుకొంటే పిల్లల ఎదుగలలో లోపాలు ఉండవని, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం సామూహిక సీమంతాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా యుడు అశోక్, అంగన్వాడీ టీచర్లు శారద తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే ఎదుగుదల బెజ్జంకి(సిద్దిపేట): పౌష్టికాహారాన్ని అందించినపుడే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని హుస్నాబాద్ సీడీపీఓ జయమ్మ అన్నారు. మండలంలోని బేగంపేటలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. సూపర్వైజర్ నాగరాజు, తోటపెల్లి వైద్యాధికారి కృష్ణతేజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ముండ్రాయి సెక్టార్లో.. నంగునూరు(సిద్దిపేట): గర్భిణులు వైద్యులు సూచించిన వాక్సిన్లు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సీడీపీఓ శారద సూచించారు. ముండ్రాయి సెక్టార్లో సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో వండిన పదార్థాలను ప్రదర్శించి వాటి లాభాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, సూపర్ వైజర్ స్వరూప, హెచ్ఓ స్వామి, అనురాధ, సౌమ్య, రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకమని డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్‌లో శనివారం నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసు బోధనల ప్రాధాన్యాన్ని చాటిచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, కార్యక్రమ నిర్వాహకులు రూబెన్, బాపురెడ్డి, ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సమీర్, మొనగారి రాజు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్‌లో ర్యాలీ హుస్నాబాద్: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో క్రైస్తవులు, పాస్టర్లు, ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ల కమిటీ అధ్యక్షుడు సాల్మన్ రాజ్, మలాకీ, రత్నకుమార్, ఇస్సాక్, తిమోతి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిన కాంగ్రెస్
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాకటౌన్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. రాయపోల్ మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 27న జరిగే సభకు ప్రజలు చీమల దండులా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన కొండపాక(గజ్వేల్): రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన కొనసాగుతుందంటూ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కుకునూరుపల్లి, దుద్దెడలోని ప్రైవేటు పంక్షన్ హాళ్లలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభ నిర్వహణ కోసం శనివారం ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగంలా ప్రజలు కొలుస్తున్నారన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో నిర్వహించినది రాజ్యాంగ పరిరక్షణ పోరుయాత్ర కాదని ముఖ్య నేతల పదవులను కాపాడుకునేందుకు నిర్వహించిన పోరుబాట అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీరు విడుదల చేయకుండా లక్షల ఎకరాల్లో పంటలు ఎండగొట్టి రైతులను ఆగం చేసిందని వాపోయారు. ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగసభకు అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కోరారు. అనంతరం బహిరంగసభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రవీందదర్, అమరేందర్, దుర్గయ్య, కుమార్, శ్రీనివాస్, కనకయ్య, భగవాన్, శ్రీనివాస్, కిరణ్‌కుమార్‌చారి, శ్రీనివాస్, ఐలయ్య, ఎల్లం, లక్ష్మణ్‌రాజ్, హైమద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘విశ్వావసు’ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విశ్వవాసు తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్‌ను మోహినిపుర వెంకటేశ్వర ఆలయంలో దేవాదాయశాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి శనివారం ఆవిష్కరించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉద్యోగులు, అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈఓ విశ్వనాఽథ్శర్మ, బుగ్గ రాజేశ్వరిస్వామి ఆలయ ఈఓ శ్రీధర్‌రెడ్డి, చైర్మన్ అమరేశ్ విష్ణు, ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, చంద్రకుమార్, రాంరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ రక్షణ అందరి బాధ్యత గజ్వేల్‌రూరల్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుజాత, దేవదాసు అన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు శంషాబాద్ పరిధిలోని కర్తల్లో శనివారం జరిగిన ‘యూత్ లీడర్స్ కాన్ల్కెవ్ ఫర్ బెటర్ ఎర్త్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు పోస్టర్ ప్రెజంటేషన్ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై వివరించారు. ప్రొఫెసర్లు పురుషోత్తంరెడ్డి, బాలకృష్ణారెడ్డి మాట్లాడారు. జంతు జాలాన్ని రక్షించుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భారీనష్టం దుబ్బాకటౌన్: అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భారీగా ఆస్తి, ప్రాణనష్టం తప్పదని అగ్నిమాపకశాఖ అధికారి కమలాకర్ హెచ్చరించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం సినిమా థియేటర్లో ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కంచారు. లీడింగ్ ఫైర్ అధికారి లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్‌కు దారేది? హుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేదారి లేకుండా అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు శనివారం డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన మున్సిపల్ భవనం వద్ద అధికారులు బ్యారి కేడ్లు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దీని వల్ల కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ వాహనాలను ఎండలోనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, నవీన్, జగ్జీవన్, వికాస్, అరవింద్ పాల్గొన్నారు. హరీశ్‌రావు పరామర్శ సిద్దిపేటరూరల్: మండలంలోని చింతమడక గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త వాతపు సత్యనారాయణ భార్య రామలక్ష్మి ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వర్మ తదితరులు ఉన్నారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకే కక్ష సాధింపు
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేకే గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, ఆరపల్లె జంక్షన్ల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీబీఐ, ఈడీలపై ఆధారపడి బీజేపీ సర్కార్‌ను నడుపుతోందన్నారు. బీజేపీ బలహీనపడే సందర్భంలో పార్లమెంట్లో, బయట నరేంద్రమోడీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నార న్నారు. మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ఉండి, ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణి మంచి పద్ధతి కాదన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు అభినందన.. హుస్నాబాద్‌రూరల్: గ్రామీణ క్రీడల్లో రాణించి హుస్నాబాద్‌కు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.జిల్లా స్థాయి కబడ్డీ ట్రోఫీని గెలుపొందిన పోతారం(ఎస్) కృష్ణ కబడ్డీ క్లబ్ జట్టును గురువారం మంత్రి అభినందించారు. ఈ నెల 11, 12, 13న గజ్వేల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ట్రోఫీని పోతారం జట్టు గెలువడం హర్షణీయమన్నారు. గ్రామాల్లో క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాలని కోచ్ కృష్ణకు సూచించారు. -
అప్పుల బాధ తాళలేకవ్యక్తి ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జహీరాబాద్ మండలంలోని అల్గోల్‌కు చెందిన ఉప్పరి వెంకట్(50)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం పనులు చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో అప్పు బారిన పడ్డాడు. భూమి తాకట్టుపెట్టి కొంత అప్పులు తీర్చాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బాధ భరించలేక గురువారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో వలస కూలీ రామచంద్రాపురం(పటాన్చెరు): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అసోం రాష్ట్రానికి చెందిన బిషాల్(30) జీవనోపాధికి తెల్లాపూర్ మున్సిపల్‌కు వలసొచ్చాడు. ఆరు నెలలుగా కొల్లూరులోని కారు వాషింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు. గురువారం తెల్లావారుజామున కారు వాషింగ్ షెడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు షెడ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎండు గంజాయి స్వాధీనం
● నలుగురు రిమాండ్ మునిపల్లి(అందోల్): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్నాం. బీదర్ నుంచి హైద్రాబాద్‌కు వెళ్తున్న కారులో 130 గ్రాముల ఎండు గంజాయి లభించింది. కారులో ఉన్న వత్సల్ రామ్శెట్టి, ఆకాశ్, అజయ్ దేశ్ముఖ, సోహెల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గంజాయి చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేశ్‌నాయక్, పోలీస్ సిబ్బందిని కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. అలాగే కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌లపై రియాజ్ పాషా, రేహాన్, సోఫి యాన్, ఆసిఫ్ 110 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించాం. రియాజ్ పాషా, రేహాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిపారు. కంది శివారులో ఐదు కిలోలు కంది(సంగారెడ్డి): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్ఐ రవీందర్ కథనం మేరకు.. మండల కేంద్రమైన కంది శివారులో సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో 5 కిలోల ఎండు గంజాయి దొరికింది. కాశీపురం ఆంజనేయులుగా గుర్తించి కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐపేర్కొన్నారు. విషపు ఆహారం తిని.. ● మూడు ఆవులు మృతి హత్నూర (సంగారెడ్డి): విష ఆహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్ల మాచునూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య పాడి గేదెలు, ఆవులను మేపుతూ జీవిస్తున్నాడు. గ్రామ శివారులో గల చెరువు సమీపంలో ఇటీవల సినీ ఇండస్ట్రీ వాళ్లు సినిమా షూటింగ్లో భాగంగా అమ్మవారికి అన్నం రతి పోసి నైవేద్యం సమర్పించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. సుమారు 3 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం వదిలేసి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట వండిన అన్నం కావడంతో పూర్తిగా కుళ్లిపోయింది. ఆ ఆహారాన్ని బుధవారం సాయంత్రం మూడు ఆవులు తిని మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మున్సిపాలిటీ వద్దు జిన్నారం(పటాన్చెరు): జిన్నారంను మున్సిపాలిటీ చేయొద్దని డిమాండ్ చేస్తూ జిన్నారం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జగన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం మందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిన్నారంను మున్సిపల్ చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. రైతులు నష్టపోతారని వివరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, ప్రతాపరెడ్డి, రాజిరెడ్డి, రమేశ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు. శబ్ద గ్రంథాలయాలు దివ్యాంగులకు ఉపయోగం కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: శబ్ద గ్రంథాలయాల్లో ఆడియో పుస్తకాలు దివ్యాంగులకు ఎంతో ఉపయోగమని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో కంటిచూపు లేని దివ్యాంగుల కోసం మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధులు,ట్రాన్స్‌జెండర్స్ శాఖ ఆధ్వర్యంలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...దివ్యాంగులు కూడా మిగతా వారితో సమానంగా విద్యను సమాచారాన్ని పొందడానికి హక్కు కలిగి ఉన్నారన్నారు. ఈ లైబ్రరీ ద్వారా చదువును వినిపించి, దివ్యాంగులకు విజ్ఞానాన్ని చేరవేసే అవకాశం లభించనుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిప్యూటీ ఇంజనీర్ దీపక్, డీసీపీఓ రత్నం, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
5.33 గంటలు.. 40 కిలో మీటర్లు
మొక్కు చెల్లించడానికి పరుగెత్తారు దుబ్బాకటౌన్: అనుకున్న లక్ష్యానికి, దైవ భక్తికి ఏ ఆటంకం ఎదురు రాదని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన కమ్మరి సాయి వర్ధన్, దుంపలపల్లికి చెందిన దొందడి రాకేశ్ నిరూపించారు. ఇటీవల భారత ఆర్మీ (అగ్నివీర్)కి సాయి వర్ధన్, రాకేశ్ ఎంపికయ్యారు. గురువారం ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించడానికి స్వగ్రామం నుంచి 40 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 33 నిమిషాల్లో పరుగెత్తి ఆలయాన్ని చేరుకున్నా రు. కాగా సాయివర్ధన్ గతంలో ఆర్మీ సెలక్షన్లో రెండు సార్లు విఫలమయ్యాడు. దీంతో ఈసారి ఎంపిక కావాలని పట్టువదలని విక్రమార్కుడిలా రోజు ఉదయం గ్రౌండ్లో చెమటోడ్చి అనుకున్న లక్ష్యం సాధించాడు. -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమై ఘటన అక్కన్నపేట మండలం పంతుల్‌తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భానోతు పకాలియా–సారవ్వ కుటుంబ సభ్యులు గురువారం వ్యవసాయ పొలం పనులు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మంటాలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగానికి పైగా వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇటీవల మహిళా సంఘం ద్వారా వచ్చిన డబ్బులు రూ.లక్ష ఇంట్లో దాచిపెట్టగా బుగ్గిపాలయ్యాయి. అదే విధంగా ఫ్యాన్లు, గిన్నెలు, ఫ్రీజ్, కూలర్‌తోపాటు బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, గిరిజన మోర్చా మండలాధ్యక్షుడు రైనా నాయక్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.రూ.లక్ష నగదు, విలువైన వస్తువులు కాలి బూడిద -
గొర్రెలు, మేకల దొంగలు అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గొర్రెలు, మేకలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నీరజ్‌కుమార్ ఇంచురే(21), మాఖన్ విశాల్‌సింగ్(22), రాహుల్, బాబు నలుగురూ గొర్రెలు, మేకలను అపహరించడమే లక్ష్యంగా ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 24న దిల్‌సుఖ్‌నగర్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చీర్ల మల్లేశంకు చెందిన మేకల దొడ్డిలో 4 మేకలను అపహరించారు. కారులో వేసుకొని హైదరాబాద్‌లోని జియాగూడలో విక్రయించారు. రెండ్రోలకు 26న తొగుట సమీప రాంపూర్‌లో 4 గొర్రెలు అపహరించి విక్రయించారు. బాధితుడు చీర్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం గౌరారం హోటల్ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన ముఠాలోని ఇద్దరు సభ్యులు నీరజ్‌కుమార్ ఇంచురే, మాఖన్ విశాల్సింగ్లను అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చోరీ ఘటనలు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కౌడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఇటీవల మండలంలోని రాజిపేట శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో చోరీ జరుగగా కేసు నమోదు చేశాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. గురువారం కౌడిపల్లి శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని దేవులతండాకు చెందిన విస్లావత్ ప్రేమ్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆలయంలో రూ.2 వేలు నగదు, రోల్డ్‌గోల్డ్, వెండి అభరణాలు చోరీ చేయగా దీంతోపాటు శివ్వంపేట మండల కొత్తపేట్ ఎల్లమ్మగుడి, చండీలోని ఆలయం, నర్సాపూర్ మండలం గొల్లపల్లిలోని మల్లన్నగుడిలో సైతం చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మాకేది పరిహారం?
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో3 వేల ఎకరాల్లో ఎండిన చేన్లు ● వట్టిపోయిన బోర్లు,చుక్క నీరు లేని బావులు ● వడగళ్లకు నష్టపోయినపంటలకే ఇస్తే ఎలా? ● ఎండిన పంటలకు సైతంఇవ్వాలని డిమాండ్ ● గౌరవెల్లి ప్రాజెక్ట్ కిందమెట్ట రైతులను వీడని కరువు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భైరి భిక్షపతి. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుడు. ప్రాజెక్టులో ఊరు గుడాటిపల్లె ముగిని పోతే ముల్లె మూట సర్దుకొని హుస్నాబాద్‌కు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. గాంధీనగర్‌లో మూడు ఎకరాలు సెలక కొని రూ.4 లక్షలు పెట్టి రెండు బోర్లు వేయించాడు. వానాకాలం బాగానే పంట వచ్చింది. ఈ యాసంగి వరి పెడితే ఒక బోరులో నీళ్లు లేక రెండు ఎకరాల వరి ఎండిపోయింది. బోరుకు తెచ్చిన బాకీలు రూ.2లక్షలు తీరకముందే రూ.60 వేల నష్టం వాటిల్లింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి ఊరు విడిసిన గోదారి నీళ్లు రాకపాయే కరువు తప్పకపాదాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతం ఊట బావులు, బోర్ల నీటి లభ్యత మేరకు రైతులు పంటలు సాగు చేస్తారు. డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో యాసంగి 68,272 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తే 53,280 ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. వానా కాలం వర్షాలు సమృద్ధి కురిసినా భూగర్భజలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోవడంతో రైతుల పంట చేన్లకు నీరు అందక ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు మార్చి 11 వరకు 593 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు అంచనా వేశారు. మీర్జాపూర్ క్లస్టర్ పరిధిలోనే 600 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. హుస్నాబాద్ డివిజన్లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకొని నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. పంట నష్ట పరిహారం ఏది? వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రూ.వేల కొద్ది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మాకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యరని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో రైతు బంధు ఇవ్వకపోతే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటల బీమా లేకపోవడంతో నష్టపోయిన పరిహారం అందడం లేదు. బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సమయంలో పంట బీమా చేసినా ఏ రైతుకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. 18 ఏళ్లుగా గోదావరి నీళ్ల ముచ్చటే! మెట్ట ప్రాంత రైతులకు కరువు దూరం చేయాలని 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టుకు పునాదులు వేశాడు. అప్పటికే 90 శాతం పనులు పూర్తి చేసినా మహానేత మరణంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి 8 టీఎంసీల వరకు 2020లో పనులు పూర్తి చేశారు. అధికారులు ముంపునకు గురైన గుడాటిపల్లె, తెనుగుపల్లె, కొత్తపల్లితో పాటు నాలుగు గిరిజన తండాలను ఖాళీ చేయించి 2023 జూన్ 30న గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రైయల్ రన్ చేసి గోదావరి నీళ్లు వస్తున్నాయని ఆశలు కల్పించారు. ఎన్జీటీలో కేసు ఉండటంతో పనులు నిలిపేయాలని స్టే ఇవ్వగా అధికారులు నిలిపేశారు. 2024 ఆగస్టులో ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.431 కోట్లు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తాయని నాయకుల ప్రసంగాలతో రైతులకు భరోసా కల్పించారు. కాల్వల ద్వారా నీళ్లు రాకపోయినా ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తే బావుల్లో నీటి ఊటలు పెరిగుతాయని ఆశ పడ్డారు. 18 ఏళ్ల నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయనే నాయకుల మాటలే తప్ప ఇప్పటికీ నీళ్లు తీసుకరాలేదని రైతులు వాపోతున్నారు.2 ఎకరాలు ఎండింది వానాకాలం వరి కోతల వరకు వర్షాలు పడ్డాయని బావుల్లో నీళ్లు ఉంటే మూడు ఎకరాలు వరి వేసిన. ఉగాదికి ముందే ఊటలు వెనక్కి వెళ్లిపోవడంతో బాయి నీళ్లు అడుగంటిపోయి మొదటి మడి పారలేదు. వరుస తాళ్లు పెడితే ఒక ఎకరం పంట చేతుకి వచ్చింది. రెండు ఎకరాలు కళ్ల ముందే ఎండిపోతే పశువులకు మేతకు వదిలేసిన. రూ.45 వేలు పెట్టుబడి నష్టపోయిన ప్రభుత్వం మాకు పరిహారం ఇయ్యాలే. – దేవేందర్ నాయక్, భల్లునాయక్ తండా రూ.5 లక్షల వరకు నష్టం గాంధీనగర్‌లో సొంత పొలంలో పశువులను పెంచి సేంద్రియ ఎరువు తయారుతోనే పంటలు సాగు చేస్తున్నా. ఎరువును ఇరుగు పొరుగు వారికి సరఫరా చేస్తా. 10 ఏళ్ల నుంచి ఎప్పుడూ చూడని కరువును ఇప్పుడు చూశా. రెండు బావులు, ఒక బోరు ఎండిపోతే రూ.1.50 లక్షలతో మరో 600 ఫీట్ల బోరు వేయించిన రూ.1.50 లక్షలతో మోటారు బిగిస్తే ఒక్క రోజులోనే ఎండిపోయింది. 3.20 ఎకరాల సేంద్రియ సన్నరకం వరి పంట ఎండిపోయింది. రూ.5 లక్షల వరకు నష్టం వచ్చింది. పశువుల మేతకు మరో దగ్గర నుంచి పశుగ్రాసం కొనుగోలు చేయాల్సి దుస్థితి వచ్చింది. – మాదాడి రాజేశ్వర్‌రావు, గాంధీనగర్ హుస్నాబాద్ -
స్వాతంత్య్రోద్యమం కోసమే ఆ పత్రిక
సంగారెడ్డి: స్వాతంత్య్ర సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పత్రికే నేషనల్ హెరాల్డ్ అని అటువంటి పత్రికపై విషం గక్కుతున్న బీజేపీని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని టీపీసీసీ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేషనల్ హెరాల్డ్ పుట్టినప్పుడు నరేంద్రమోదీ, అమిత్‌షా పుట్టనేలేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీలది క్షమించే గుణమని, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలది కుట్రల గుణమని చెప్పారు. రాహుల్ గాంధీకి, అమిత్‌షాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రిగా చేయలేదో ఆర్ఎస్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద ధర్నాలో టీపీసీసీ జగ్గారెడ్డి సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ... -
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..
● ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి ● మరో నలుగురికి గాయాలు ● నిజాంపేట్ మండలంలో ఘటననారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండిన వరి ధాన్యాన్ని తానే ట్రాక్టర్ నడుపుతూ రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. కొద్దిదూరంలో కొనుగోలు కేంద్రం ఉందనగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజాంపేట్ మండలం శాఖాపూర్‌కు చెందిన గడ్డమీది అశోక్ (38) తన పొలంలో పండిన ధాన్యంను నిజాంపేటలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు ట్రాక్టర్లో లోడ్ చేశాడు. ట్రాక్టర్‌ను తోలుకుంటూ అశోక్ వస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రానికి కొద్ది దూరంలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న రైతు అశోక్ ట్రాక్టర్ స్టీరింగ్ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న బీర్ల లక్ష్మయ్య, బీరయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అశోక్ భార్య సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మొరంగపల్లి రాజయ్య(79) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం సదాశివపేట పట్టణానికి టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఆరూర్ శివారులోని ఎవరెస్ట్ పరిశ్రమ వద్దకు రాగానే వెనుక వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజయ్యను సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి చిన్నశంకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన క్యాసారం ఎల్లయ్య కుమారుడు దాసు(32) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. గొర్రెలను మేపడానికి గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దాసు చందంపేట గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద దాహం తీర్చుకునేందుకు వెళ్లాడు. బోరు బావి స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గజ్వేల్‌రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అక్కారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గొర్లకాడి దుర్గాప్రసాద్(26) బైక్‌పై ప్రజ్ఞాపూర్ నుంచి తీగుల్ వైపు వస్తున్నాడు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి ఏడాది కిందట చేర్యాల ప్రాంతానికి చెందిన పుష్పతో వివాహం జరుగగా ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణీ అని గ్రామస్తులు పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బాలసదనంలో లీగల్ అవేర్నెస్
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని బాలసదనంలో గురువారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతి రెడ్డి హాజరై పిల్లలకు చట్టాలు, చదువు విలువ గూర్చి వివరించారు. సమస్యలు ఉంటే 15100 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. బాలసదనంలో ఉన్న పిల్లల యోగ క్షేమాల గూర్చి ఆరా తీశారు. అలాగే సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, వంటగది, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆమె శిశు కేంద్రాన్ని సందర్శించారు. -
ఆర్‌ఈఏసీ సభ్యురాలిగాకౌడిపల్లి మహిళా రైతు
● కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి అరుదైన గౌరవం ● వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలు సాగు కౌడిపల్లి(నర్సాపూర్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్‌ఈఏసీ (రిసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యురాలిగా కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నాయిని లక్ష్మీ ఎంపిక అయ్యారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నత్నయపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శోభ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూలో గురువారం ఆర్‌ఈఏసీ సమావేశం వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులు ఎంపిక కాగా ఇందులో లక్ష్మీని ప్రభుత్వం ఎంపిక చేసిందని రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగుతుందన్నారు. లక్ష్మీ కంచన్పల్లిలోని తన వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలతోపాటు అదనపు ఆదాయం కోసం ఒరంగట్టుపై టేకు మొక్కలు పెంపకం, కోళ్లఫారమ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఇచ్చిన మినికిట్స్తో విత్తన వరిని సైతం సాగు చేస్తుందన్నారు. ఆర్‌ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్‌లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బల్లెపు సంగయ్య (34) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1న జహీరాబాద్ నుంచి రైలులో వికారాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఇప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి వృద్ధుడు మిరుదొడ్డి (దుబ్బాక ): వృద్ధుడు అదృశ్యమైన ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. గురువారం ఎస్సై బోయిని పరశురామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వనం యాదయ్య(55) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతుండేవాడు. 14న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుండ్లపల్లిలో వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధి గుండ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుల్ల మల్లేశం 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతికని వెళ్లి వ్యక్తి -
పామాయిల్ సాగు అంతంతే!
ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలుత సిద్దిపేటలో సాగు ● ఇప్పటి వరకు 4,515 మంది రైతులు.. 15వేల ఎకరాల్లో సాగు ● గతేడాది 10వేల ఎకరాల లక్ష్యానికి సాగైంది 3వేలు మాత్రమే ● ఈ ఏడాదైనా సాగు పెంచేందుకు అధికారులు కృషి చేయాలి సాక్షి, సిద్దిపేట: పామాయిల్‌ను అంతంత మాత్రంగానే సాగు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా సాగు చేస్తే వచ్చే లాభాలపై అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించి.. రైతులను అటు వైపు మళ్లించారు. ఏడాదిన్నర నుంచి అఽధికారులు , ప్రజాప్రతినిఽధులు అవగాహన కల్పించకపోవడంతో పాటు నీటి ఇబ్బందులతో పామాయిల్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 15వేల ఎకరాల్లో సాగు.. తొలుత సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల తర్వాత మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పామాయిల్ సాగును ప్రారంభించారు. ఉమ్మడి మెదక్‌లో 4,515 మంది రైతులు, 15,134 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మొక్కలను తెలంగాణ ఆయిల్ ఫెడ్, మెదక్, సంగారెడ్డిలలో ప్రైవేట్ కంపెనీలు అందజేస్తున్నాయి. గతేడాది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉద్యాన శాఖ 10వేల ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించగా 3,110 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఇటీవల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సందర్శించిన అనంతరం అధికారులతో సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగు తక్కువగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ అధికారులు సమన్వయంతో సాగుతూ సాగు విస్తీర్ణం పెంచే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. గతంలో పామాయిల్ సాగుకు అధిక ప్రాధాన్యమిచ్చి పెద్ద రైతులను గుర్తించి వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారిని పామాయిల్ సాగు చేసే విధంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడే విక్రయించుకొనే అవకాశం ఇప్పటికే సిద్దిపేటలో పామాయిల్ సాగవుతున్న పలు చోట్ల దిగుబడి ప్రారంభమైంది. గెలలు కోసి సిద్దిపేటలోనే విక్రయించి రైతులు ఆదాయం పొందారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతులను పామాయిల్ సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తే ఎంతో మేలు జరగనుంది. ఎకరానికి రూ.50 వేల రాయితీ రైతులను ప్రోత్సహించేందుకు పలు రకాల సబ్సిడీని అందిస్తోంది. ఎకరం ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం రూ. 50,600 రాయితీ ఇస్తున్నది. మొక్కలకు 80 శాతం సబ్సిడీ, అలాగే డ్రిప్ సిస్టమ్ కోసం బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇలా 12.5ఎకరాల వరకు రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంది. అలాగే మొక్కలు నాటిన నాలుగేండ్ల వరకు కాత రాదు. ఈ సమయంలో మొక్కల సంరక్షణతో పాటు ఆయిల్ పామ్ అంతర పంట సాగు కోసం ప్రభుత్వం రూ.4,200 చొప్పున నాలుగేండ్లకు రూ.16,800 చెల్లిస్తుంది. ఈ సాగుతో నాలుగేండ్ల తర్వాత నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు. -
విద్యార్థులకు ఏఐ బోధన
మిరుదొడ్డి (దుబ్బాక): విద్యలో వెనుకబడిన విద్యార్థుల స్థాయి పెంపునకు ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ బోధన దోహద పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి, విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్, గణితంపై అసెస్మెంటన్లు ప్రాక్టీస్ చేయించారు. అనంతరం పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజనంతోపాటు ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. అలాగే లింగుపల్లి ప్రాథమిక పాఠశాల, చెప్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి డైట్ విద్యార్థుల ద్వారా థర్డ్ పార్టీ ఫిజికల్ వెరిఫికేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ బాబు, ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు బాలకిషన్ , శ్రీనివాస్ పాల్గొన్నారు. దళారులను ఆశ్రయించొద్దు బెజ్జంకి(సిద్దిపేట): వరి ధాన్యం విక్రయాల కోసం దళారులను ఆశ్రయించవద్దని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య రైతులకు సూచించారు. బెజ్జంకి ఏఎంసీ మార్కెట్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమ, తాలు లేకుండా ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. వడ్లను తూర్పార బట్టే మిషన్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల కోసం కుడుతున్న యూనిఫామ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఎం నర్సయ్య, సీసీలు సారయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనర్సింహ స్వామి ఆదాయం 4.80 లక్షలు బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.4 లక్షల 80 వేల 276 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ తెలిపారు. ఎండోమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం హుండీ తెరిచారు. మార్చి 23 తేదీ నుంచి నేటి వరకు హుండీలో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. హుండీ ఆదాయంతో కలుపుకొని మొత్తం జాతర ఆదాయం రూ.14 లక్షల 9వేల 990 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ శర్మ, పూజారి మధుసూదనాచారి, ఏఎస్ఐ శంకర్రావు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ డయాలసిస్ సెంటర్‌కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు దుబ్బాక: ఉత్తమ సేవలు అందించినందుకు గాను దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్ సెంటర్‌కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు లభించింది. అపెక్స్ కిడ్నీ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై దుబ్బాక కిడ్నీ సెంటర్‌కు అవార్డును అందించింది. 2023 మార్చ్ 5న దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో ఐదు బెడ్స్‌తో డయాలసిస్ సెంటర్ ప్రారంభమైంది. దీంతో ఇప్పటివరకు ఈ సెంటర్లో 8200 డయాలసిస్ కేసులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోనే ఉత్తమ అవార్డు రావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, డయాలసిస్ ఇన్చార్జ్ శేఖర్, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు మెదక్ జిల్లా డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్లో 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆలస్యమైతే నో ఎంట్రీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు కేంద్రంలోని చేరుకోవాలన్నారు. పదికి 3.. ఇంటర్‌కు 5 కేంద్రాలు: జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షలకు మెదక్, నర్సాపూర్, తూప్రాన్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం మెదక్(2), నర్సాపూర్(2), తూప్రాన్(1) చొప్పున మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కనీస వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిమినల్ కేసులు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వారి పై చట్టం 25/1997 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వా డ్, ఇద్దరు ప్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారన్నారు. 5 నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ అభ్యర్థులకు గుర్తింపు కార్డు తప్పనిసరి -
రైతులను ఆదుకుంటాం
● అకాల వర్షంతో తీరని నష్టం ● ఎకరాకు రూ.10వేల పరిహారం ● మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ కుటుంబాన్ని కేంద్రం వేధిస్తోంది● విచారణ పేరిట రాక్షసత్వం తగదు ● మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట(హుస్నాబాద్): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండలం పంతుల్‌తండాలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి బుధవారం పరిశీలించారు. అలాగే అక్కన్నపేట, గొల్లకుంట, అంతక్కపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఎకరాకు రూ.10వేల పరిహారం అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగళ్ల వాన వల్ల కూరగాయాల పంటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తోందన్నారు. గౌరవెల్లి నీళ్లు వచ్చినట్లయితే ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులందరూ ఆయిల్‌పామ్ తోటలు పెట్టాలని, పంట సాగుపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే కూరగాయాల పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ మండలాధ్యక్షుడు అయిలయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కరంటోతు రవీ, నాయకులు పాల్గొన్నారు.హుస్నాబాద్: సోనియా గాంధీని విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాక్షసత్వంగా వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంఽధీలపై ఈడీ చార్జిషీట్లను నిరసిస్తూ బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి ధర్నా చేపట్టారు. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్య్రం కోసం పని చేసిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. దేశంలో అనేక మంది నిరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలు ఎల్ఐసీ, ఎయిర్పోర్ట్, రైల్వేలు, అన్ని ఆర్థిక సంస్థలను అదాని, అంబానీలకు అప్పగిస్తున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంట ప్రజలు ఉన్నారని, దేశమంతా ముక్తకంఠంతో మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
జీవనోపాధికి చేయూత
డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య చిన్నకోడూరు(సిద్దిపేట): చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడంతో పాటు పేదలకు జీవనోపాధి కల్పించడమే వాటర్ షెడ్ పథకం లక్ష్య మని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. బుధవారం చౌడారంలో వాటర్ షెడ్ యాత్ర నిర్వహించారు. అలాగే జీవనోపాధి కింద నెలకొల్పిన పలు యూనిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. వర్షపు నీరు వృథాకాకుండా ఈ పథకం ద్వారా కందకాలు, రాతికట్టడాలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవచ్చన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వృథా నీటిని భూమిలో ఇంకేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. నాలుగు రెవెన్యూ గ్రామాల్లో 311 మందికి రూ.1.54 కోట్ల రుణాలు వీఓల ద్వారా మహిళల జీవనోపాధికి అందజేశామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి రాధిక, అదనపు పీడీ బాలకిషన్, డీపీఎం కరుణాకర్, ఏడీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ జనార్దన్, వాటర్ షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్ నూరొద్దిన్, ఎంపీఓ సోమిరెడ్డి, ఏపీఓ స్రవంతి, ఏపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. సామర్థ్యాలను పెంచేందుకే ఏఐ బోధన: డీఈఓచిన్నకోడూరు(సిద్దిపేట): విద్యలో వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ బోధన ఎంతగానో దోహదపడుతుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం రామంచ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులు చేస్తున్న ఏఐ టూల్స్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ విధానంతో విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. అన్ని పాఠశాలల్లో నెట్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పాఠశాలల రికార్డులు, మధ్యాహ్న భోజనంతో పాటు ఆవరణలో నాటిన పండ్ల మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, హెచ్ఎంలు సత్తవ్వ, అబ్దుల్ షరీఫ్, ఉపాధ్యక్షు లు భాస్కర్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయండిఅదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గజ్వేల్‌రూరల్: లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మండల పరిధిలోని గిరిపల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించుకోవాలని సూచించారు. ఎలాంటి ఆటంకంలేకుండా ఇళ్లకు ఇసుక సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ చంద్రకళను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 23న మున్సిపల్ షెటర్లకు వేలందుబ్బాకటౌన్: పట్టణంలో మూడు చోట్ల ఉన్న 26 మున్సిపల్ షెటర్లకు ఈనెల 23న అద్దె ప్రాతిపాదికన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పోచమ్మ దేవాలయ సమీపంలో ఉన్న 16 షెటర్లకు, శాస్త్రి విగ్రహ సమీపంలో ఉన్న ఆరు షెటర్లకు, డబుల్ బెడ్రూం సమీపంలో ఉన్న 4 షెటర్లకు వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు పోచమ్మ సమీపంలో ఉన్న షెటర్లకు రూ. 50 వేలు, మిగతా రెండు చోట్ల ఉన్న షెటర్లకు రూ.25వేల డీడీ తీసి దరఖాస్తు ఫారంతో ఈ నెల 22న కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
ధర లేదని పొగాకు పారబోత
దుబ్బాకరూరల్: పొగాకుకు మద్దతు ధర లేకపోవడంతో ఆవేదన చెందిన రైతు రోడ్డుపై పారబోశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అప్పనపల్లి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు పొగాకును తీసుకు వచ్చి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తారు. గత ఏడాది పొగాకు ధర క్వింటాలుకు రూ.15వేలు ఉండేది. ప్రస్తుతం రూ.6వేలుకు పడిపోయింది. తేమ, రకం బట్టి పొగాకుకు మద్దతు ధర కేటాయిస్తున్నారు. గత ఏడాది కంటే ప్రస్తుతం భారీగా ధర పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకును విక్రయించడానికి వచ్చిన ఓ రైతు కనీస మద్దతు ధర లేక పోవడంతో ఆవేదన చెందాడు. కనీసం మద్దతు ధర లేక పోవడంతో ఆగ్రహంతో తాను తెచ్చిన పొగాకును రోడ్డుపై పారబోశాడు. పంటకు పెట్టిన పెట్టుబడి రావడం లేదని కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దళారుల బారిన పడకుండా పొగాకుకు మద్దతు ధర కేటాయించాలని రైతులు కోరారు. -
అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు
డీఎంహెచ్ఓ పల్వన్‌కుమార్ సిద్దిపేటకమాన్: కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో అవసరమైన వారికి రోజూ 20మందికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ సర్జరీలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. గర్భిణులకు ఆరోగ్య వైద్య సేవల నిమిత్తం 102 వాహనం ద్వారా ఇంటి నుంచి ఆస్పత్రికి, తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, సైకియాట్రిక్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ శాంతి, ఆర్ఏంఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలి
గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని పలు ఆయిల్‌పామ్ తోటలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మండలంలోని బూర్గుపల్లి, అక్కారం గ్రామాల్లోని ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 66,546 మొక్కలు నాటేందుకు చర్యలు చేపడతున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు 12,339 ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగవుతున్నట్లు తెలిపారు. 329 మంది రైతులు 322.83టన్నుల ఆయిల్‌పామ్ దిగుబడి సాధించారన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం చెప్యాలలో, మర్కూక్ మండలాల్లో ఆయిల్‌పామ్ గెలల కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో నంగునూరు, నర్మెట్టలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.21000 వరకు ఉందని, రైతులు పంట సాగుచేసేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, అదనపు డైరెక్టర్(హార్టికల్చర్) సరోజినిదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి సువర్ణ, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వేసవిలో ఎక్కువ నీరు అందించాలి కొమురవెల్లి(సిద్దిపేట): వేసవిలో ఆయిల్‌పామ్ మొక్కలకు ఎక్కువ నీరు అందించాలని డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డాక్టర్ పొన్నుస్వామి సూచించారు. బుధవారం మండలంలోని గురువన్నపేటలో పలు అయిల్‌పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా అరటి, మునగ వేసుకోవడం వల్ల మొదటి మూడేళ్లు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని దేవి, జిల్లా అధికారి సువర్ణ, అయిల్‌ఫెడ్ జిల్లా ఇన్చార్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో తోటలను సందర్శించిన కేంద్ర బృందం -
గజ్వేల్.. మరో టెర్మినల్!
రైల్వేస్టేషనే ప్రత్యామ్నాయం ● హైదరాబాద్‌లోని స్టేషన్లలో పెరిగిన రద్దీ ● ఈ ప్రాంతంపై దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి ● మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి.. ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే మహర్దశే గజ్వేల్ రైలు మార్గంరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రత్యామ్నాయం కాబోతున్నది. నగరంలోని స్టేషన్లలో రద్దీ పెరగడం, అభివృద్ధి పనుల పేరిట తరుచూ రైళ్లను మళ్లించాల్సి వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గజ్వేల్ రైల్వేస్టేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయి, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే గజ్వేల్‌కు మహర్దశ పట్టనుంది. గజ్వేల్: మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవునా ఈ న్యూ బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతోంది. ఇందుకు రూ.1160.47కోట్లు వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారుతోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. మొత్తం ఈ లైన్‌కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ జరిగింది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 75కిలోమీటర్లకుపైగా పనులు పూర్తికాగా ప్యాసింజర్ రైలు కూడా నడుస్తోంది. గజ్వేల్ వరకు గూడ్స్ రైలు విజయవంతంగా నడుపుతున్నారు. మరోవైపు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పనులు జోరుగా సాగుతున్నాయి. ‘గ్రాండ్ టంక్ లైన్’తో అనుసంధానం ఈ లైన్ వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనుంది. పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్‌లైన్‌కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్లాట్‌ఫామ్‌లను మూసేశారు. అంతేకాకుండా పలు రైళ్లను చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. కొన్ని నెలలపాటు ప్రయాణికులకు ఈ అసౌకర్యం తప్పేలా లేదు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేద్దామనే ఆలోచన దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారుల్లో మొదలైంది. ఇలాంటి తరుణంలో నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రాంతమే ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయా స్టేషన్లలో రద్దీ పెరగటం వల్ల, మరిన్ని కొత్త రైళ్లను నడపడానికి అవకాశంలేని సందర్భాల్లో నగరానికి సుమారుగా 50కిలోమీటర్ల దూరంలోపే ఉన్న గజ్వేల్ నుంచి ప్రధాన రైళ్లు నడిపితే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. ఇక్కడి నుంచే కొన్ని ప్రధాన రైళ్లు అంటే తిరుపతి, బెంగళూరు, ముంబై, షిర్డీకి రైళ్లను నడపవచ్చని సమాచారం. నగరంలో రద్దీ పెరగడం.. రైల్వే స్టేషన్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కొత్త రైళ్ల పయనం విజయవంతంగా సాగితే హైదరాబాద్ నగరవాసులేకాకుండా, ఇతర ప్రధాన ప్రాంతాలకు చెందిన వారు గజ్వేల్‌కు వచ్చి బయలుదేరాల్సి ఉంటుంది. ఈ లెక్కన సహజంగానే గజ్వేల్ ప్రాంత ప్రాధాన్యం ఒక్కసారిగా పెరగనుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి, ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ పనులు మొదలైతే గజ్వేల్‌కు మహర్దశ పట్టనుంది. అంతేకాకుడా ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి బాటలు పడే అవకాశముంది. భారీ, చిన్న తరహ పరిశ్రమలకు సంబంధించిన వస్తు ఎగుమతులు, దిగుమతులకు అవకాశం కలిగిన వ్యాపార రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. వీటన్నంటితోపాటు ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగి పర్యాటకం రంగం కూడా అభివృద్ధి చెందనుంది. గజ్వేల్ స్టేషన్ అభివృద్ధి అంశాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి ధ్రువీకరించారు. -
మల్లన్న సన్నిధిలో కాత్యాయనిదేవి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని ఐఏఎస్ అధికారి, స్టేట్ ఫైనాన్షియల్ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని దేవి కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదం, శేష వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు శ్రీరాములు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలుమల్లన్న ఆలయ ఈఓ అన్నపూర్ణ కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడమేకాక, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. సోమవారం ఆమె ఆలయ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. 50 వసతి గదుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. స్వామి వారి కల్యాణం నాటికి మేడలమ్మ, కేతలమ్మలకు స్వర్ణ కిరీటా లు అలంకరిస్తామని తెలిపారు. ఐదు అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కార్యాచరణ కొనసాగుతోందన్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్ ఆలయ నిధులతో.. మిగతా అంతస్తులు దాత ల సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులుహుస్నాబాద్: నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రిని సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఏజీపీ ఒగ్గోజు సదానందం, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం దుబ్బాకటౌన్: రాయపోల్ మండల పరిధి లోని మందూరు, రాయపోల్, రామారం, గొల్లపల్లి, టెంకంపేటతో పాటు పలు గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం కిషన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీలు రాజేశ్వర్‌రావు, కిష్టయ్య, ప్రవీణ్, రవీందర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు పాల్గొన్నారు. -
ఏఐ సరే.. ఇంటర్నెట్ మరి!
ఫోన్ నెట్ సాయంతో.. పక్క చిత్రంలో కనిపిస్తున్నది తొగుట మండల పరిధి.. కాన్గల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్. ఫోన్ నెట్‌తో ఏఐ క్లాస్‌లను విద్యార్థులు వింటున్నారు. ఒక్కో సారి ఫోన్ సిగ్నల్ రాకపోవడం.. ఇంటర్నెట్ లేకపోవడంతో క్లాస్‌లకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో సీ గ్రేడ్‌లో 3వ తరగతిలో ఆరుగురు, నాల్గవ తరగతిలో ఇద్దరు, ఐదవ తరగతిలో నలుగురు ఉన్నారు. విద్యార్థులకు అందని క్లాసులు ● చదువులో వెనుకబడిన వారి కోసం ఏర్పాటు ● పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 47 పాఠశాలలో అమలు ● నెట్ సౌకర్యం లేకపోవడంతో తప్పని ఇబ్బందులు సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు ఇంటర్నెట్ అడ్డంకిగా మారింది. ప్రతీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ఏఐ సాయంతో మెరుగైన సాధన కోసం చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ కింద 47 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో పలు చాలా వరకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో క్లాస్ అంతంత మాత్రంగా సాగుతున్నాయి. వారానికి నాలుగు రోజులు.. 3 నుంచి 5వ తరగతిలో వెనకబడిన విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మ్యాథ్స్, జనరల్ సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించిన క్లాస్‌లు వారానికి నాలుగు రోజులు ఏఐ ద్వారా చెప్పిస్తున్నారు. ఒక్కో క్లాస్ 20 నిమిషాల పాటు కంప్యూటర్లో ఆన్లైన్లో ఏఐ క్లాస్‌లు చెబుతున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులు ఈ టూల్స్‌ను ఉపయోగించుకొని స్వయంగా వారే తెలుగు, ఇంగ్లిష్ భాషలో అక్షరాల గుర్తించే విధంగా కృషి చేస్తుంది. సరళ పదాలు, వారి స్థాయి మేరకు పదాలను చదవడం, రాయడం, గణితంలో సంఖ్యలు రాయడం, కూడిక నుంచి మొదలుకొని భాగాహారం వరకు విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి ఏఐ దోహపడుతుంది. ఏఐ ద్వారా విద్యార్థులో ఆసక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతంత మాత్రంగానే.. పలు పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని కారణంగా మొబైల్ నెట్ కనెక్షన్‌తో క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు సెల్ ఫోన్ల సిగ్నల్ లేక కొన్ని పాఠశాలలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మొదటి విడతలో ఏఐ క్లాస్‌ల నిర్వహణలో ఏర్పడిన సమస్యలను అధిగమిస్తేనే సత్ఫాలితాలు వస్తాయి. అన్ని పాఠశాలలో ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారు మరింతగా చదివే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.స్కూల్ గ్రాంట్స్‌తో తీసుకోవాలి ఏఐ ద్వారా బోధనకు ఎంపికై న పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను స్కూల్ గ్రాంట్ నిధులతో తీసుకోవాలని ఆదేశించాం. పాఠశాలలను పరిశీలించి అన్నింటికీ ఇంటర్నెట్ ఉండేలా కృషి చేస్తాం. –శ్రీనివాస్ రెడ్డి, డీఈఓఫోన్ డేటా సాయంతోనే.. మా పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో మా ఫోన్లతోనే ఇంటర్నెట్ను కనెక్ట్ చేసి విద్యార్థులకు ఏఐ ద్వారా బోధనను అందిస్తున్నాం. ఒక డెస్క్ టాప్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లను వినియోగిస్తున్నాం. మరో మూడు డెస్క్ టాప్‌లను వినియోగించడం లేదు. పలు ప్రైవేట్ కంపెనీల ఇంటర్నెట్ వారిని నెట్ కోసం సంప్రదించాం. చాలా దూరం ఉండటంతో ఇవ్వలే మని చెబుతున్నారు. అయినా ప్రయత్నిస్తున్నాం. – మధు, హెచ్ఎం, కాన్గల్, ప్రాథమిక పాఠశాల -
అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీలో మంటలు
గోదాం దగ్ధం ● భయంతో పరుగులు తీసిన కూలీలు, రైతులు ● రూ. 1.50 కోట్ల నష్టం కొండపాక(గజ్వేల్): ప్రమాదవశాత్తు అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. పెద్దఎత్తున దట్టమైన పొగలు, మంటలు ఎగసి పడటంతో గోదాంలో పని చేసే కూలీలు, సమీప వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మండల పరిధిలోని మర్పడ్గ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మర్పడ్గ నుంచి ఖమ్మపల్లికి వెళ్లే దారిలో అర ఎకరం భూమిలో సుమారు రూ.2 కోట్లతో సిద్దిపేటకు చెందిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీ అరటి పండ్ల గోదాం నిర్వహిస్తున్నారు. అరటి తోటల నుంచి కాయలను తీసుకువచ్చి కోల్డ్ స్టోరేజీలో పండ్లుగా మార్చుతారు. వీటిని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల పట్టణాలకు సరఫరా చేస్తుంటారు. సాయంత్రం వేళ గోదాంలోంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు వచ్చాయి. బావుల నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది. దీంతో సుమారు రూ.1.50 కోట్ల వరకు నష్టం జరిగిందంటూ గోదాం నిర్వాహకులు పేర్కొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయండి
గజ్వేల్: భారత దేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ల పరం చేయడానికి కేంద్రం చేపట్టిన శ్రీఆపరేషన్ కగార్శ్రీను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గజ్వేల్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతృత్వంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శ్రీఆపరేషన్ కగార్శ్రీవల్ల జరుగుతున్న నష్టాలను పోస్టుకార్డులో వివరిస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తికి పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ అడవులను, అందులోని విలువైన ఖనిజ సంపదను కాపాడుతున్న ఆదివాసీ ప్రజలు నక్సలైట్లకు అండగా నిలుస్తున్నారని సాకుగా చూపి వారిని ఏరివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వందల సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ, అటవీ రక్షణ చట్టాలకు తిలోదకాలిస్తూ..అడవులను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామికవాదులు, ప్రకృతి ప్రేమికులను కేంద్ర ప్రభుత్వ చర్యలను గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఇందులోభాగంగానే తాము దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఏ.రాంచంద్రం, గజ్వేల్ జోన్ కన్వీనర్ జే.శ్రీనివాస్, ఆ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌లో ఉపాధ్యాయ, ప్రజా సంఘాల పోస్టుకార్డు ఉద్యమం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన నాయకులు -
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
● ఆయన ముందు చూపు వల్లే తెలంగాణ ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చిన్నకోడూరు(సిద్దిపేట): అంబేడ్కర్ గొప్ప ఆదర్శనీయుడని, ఆయన ముందు చూపు వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్, పెద్దకోడూరులో అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టారన్నారు. అందుకే కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారన్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేశారన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహానాయకుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ శర్మ, మాణిక్యరెడ్డి, కనకరాజు, సుభాష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అదనపు సాయం మాటేమిటీ? గజ్వేల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళితులకు రూ.లక్ష అదనంగా సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ అంశంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. మండల పరిధిలోని గిరిపల్లిలో సోమవారం రాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఏ పథకం చేపట్టినా సమగ్రంగా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళితులకు రూ.లక్ష అదనపు సాయం అందిస్తామని గొప్పగా ప్రకటించగా... ఈ విషయాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు దళితబంధు సాయాన్ని రూ.12లక్షలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో వేడుకలు సిద్దిపేటజోన్: బోధించు.. సమీకరించు... పోరాడు అనే నినాదాలతో సంఘటితం చేసిన అంబేడ్కర్ చూపిన బాటలో మనమంతా పయనించాలని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవసమాజ నిర్మాణం జరగాలంటే మహాత్మా గాంధీ, జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్‌రాం, బీఆర్ అంబేడ్కర్ వంటి మహానుభావులు చూపిన మార్గంలో నడవాలన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య వృత్తి మహోన్నతమైనది
జ్యోతిప్రజ్వలన చేస్తున్న మంత్రి పొన్నంసిద్దిపేటఅర్బన్: వైద్య వృత్తి మహోన్నతమైనదని, వృత్తిలో రాణించి తల్లిదండ్రులకు, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు మంత్రితో పాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్‌రావు, యూనివర్సిటీ వీసీ నందా కుమార్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనబడే దేవుళ్లు డాక్టర్లేనని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీలు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా కాలేజీలు వచ్చాయన్నారు. నేటి విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని, తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడంతో పాటు సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని అన్నారు. డాక్టర్లుగా వెళ్తున్న 2019 బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురభి మెడికల్ కాలేజీ చైర్మన్ హరిందరావు, మహేందర్ రావు, మనోహర్ రావు, డీన్ రఫీ, మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సురభి స్నాతకోత్సవంలో మంత్రి పొన్నం -
అభివృద్ధి చూసి ఓర్వలేకే విమర్శలు
గజ్వేల్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో మిషన్ భగీరథ నీటి కొరత తలెత్తడంతో సమస్య పరిష్కారానికి మినీ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారి విమర్శలను ఎక్కడికక్కడా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నేతలు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి -
వడగళ్ల వాన బీభత్సం
అక్కన్నపేట మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వానతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అంతా తడిసి ముద్దయింది. చాలా వరకు ధాన్యం కొట్టుకుపోయింది. ఐదు రోజుల కిందటే అమ్మకానికి ధాన్యం తీసుకొచ్చినా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేయడంతో చేసిన కష్టం అంతా వర్షార్పణమైందని రైతులు వాపోయారు. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో చేతికందే వరి పంటలు సైతం నేలకొరిగాయి. అక్కన్నపేట, పంతుల్‌తండా, చాపగానీతండా, కన్నారం గ్రామాల్లో వడగళ్ల వానతో పలు పంటలు దెబ్బతిన్నాయని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
విద్వేషకర పోస్టులుపెడితే కేసులు: సీపీ
సిద్దిపేటకమాన్: సోషల్ మీడియాలో విద్వేషకర, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ అలాగే మార్ఫింగ్ ఫొటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ పెడితే చర్యలు తప్పవన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించవద్దన్నారు. విద్వేషకర పోస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసు కమిషనర్ కంట్రోల్ రూంనంబర్ 87126 67100కు సమాచారం అందించాలన్నారు. నిధులు మంజూరు చేయండికేంద్రమంత్రికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి బెజ్జంకి(సిద్దిపేట): పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 24 గ్రామాలలో మౌలిక వసతుల కోసం రూ.2కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కలిపాక రాజు, నాయకులు బుర్ర మల్లేశం, సతీష్‌రెడ్డి, అమర్ పాల్గొన్నారు. టెన్త్ మూల్యాంకనాన్ని పక్కాగా చేపట్టాలి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పక్కాగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు సలహాలు, సూచనలు అందించారు. మూల్యాంక కేంద్రం వద్ద విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పరీక్షల సహాయ అధికారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లిలో భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గంగిరేణి చెట్టు, ఆలయ ముఖ మండపాలలో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు గుట్టపైన కొలువుతీరిన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాస్థానం ఈఓ (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) ఏ.భాస్కర్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఏఈఓ బుద్ది శ్రీనివాస్ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్తగా విత్తనోత్పత్తి
నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే లక్ష్యంగా.. విత్తనోత్పత్తి పథకాన్ని సరికొత్తగా చేపట్టడానికి రంగం సిద్ధమైంది. గతంలో చేపట్టిన పథకం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోగా, పథకం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెసర్ జయశంకర్ ఆగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో ముగ్గురు లేదా ఆపైన అభ్యుదయ రైతులను ఎంపిక చేసి విత్తనోత్పత్తి చేపట్టనున్నారు. వచ్చే జూన్‌లో ఈ పథకం అమలుచేయడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.వివరాలు పంపించాం కొత్తగా చేపట్టబోతున్న విత్తనోత్పత్తి పథకానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలు, రైతుల వివరాలు పంపించాం. పూర్తి సమాచారంతో కూడిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉన్నది. వస్తే దాని ప్రకారం ముందుకు సాగుతాం. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారిగజ్వేల్: వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో వానా కాలానికి సంబంధించి 5.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలే కీలకం. అదేవిధంగా యాసంగికి సంబంధించి 4లక్షల ఎకరాల మేర పంటలు సాగవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామ విత్తనోత్పత్తి పథకం(సీడ్ విలేజ్) అమలు చేసిన సంగతి తెల్సిందే. వరి, మొక్కజొన్న, కంది, శనగ పంటల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా రైతులకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) 50శాతం సబ్సిడీపై అందించేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవాలి. కానీ దీని ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదు. ఫలితంగా పథకం అమలు నిలిచిపోయింది. నాణ్యమైన విత్తనం అందించడమే లక్ష్యంగా.. ఈసారి పకడ్బందీగా పథకం అమలు చేయడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు మూల విత్తనం(ఫౌండేషన్ సీడ్) అందించి విత్తనోత్పత్తి చేపట్టనున్నది. ప్రతి గ్రామంలో ముగ్గురికిపైగా రైతులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన రైతు సుమారు ఎకరా విస్తీర్ణంలో విత్తనోత్పత్తి చేపడతారు. వ్యవసాయశాఖ, అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. రైతులకు నాణ్యమైన మూల విత్తనం అందించడమేకాకుండా, ఎరువులు, క్రిమిసంహారకాలపై సబ్సిడీపై అందించే అవకాశముంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా ఒప్పందం జరగనుంది. రైతులకు లాభం చేకూరేలా ఈ ఒప్పందం ఉండబోతున్నదని తెలుస్తోంది. ఈ విధంగా నాణ్యమైన విత్తనాలను రాష్ట్రంలో పంపిణీ చేయనున్నారు. దీనిద్వారా ప్రైవేటు రంగంలో జోరుగా సాగుతున్న విత్తనోత్పత్తికి పోటీగా నిలవాలని భావిస్తున్నారు. మరో ముఖ్యవిషయమేమీటంటే విత్తనోత్పత్తి చేపడుతున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు విత్తనం వేసింది మొదలు.. ఉత్పత్తులు చేతికందేవరకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించి నాణ్యమైన విత్తనోత్పత్తికి బాటలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్పష్టతతో కూడా మార్గదర్శకాలు విడుదల కోసం వ్యవసాయశాఖ ఎదురుచూస్తోంది.ప్రతి గ్రామంలో అభ్యుదయ రైతుల ఎంపిక వరి, కంది, పెసర తదితర రకాల ఉత్పత్తి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణ వచ్చే జూన్‌లో అమలుకు అవకాశం -
సోలార్!
విద్యుత్ చార్జీల మోతకు చెక్ ● సిద్దిపేటలో ప్రయోగాత్మకం వాటర్ పంపింగ్ కేంద్రాలే లక్ష్యంగా.. ప్లాంట్ల ఏర్పాటుకు సర్వే డీపీఆర్ రూపకల్పనలో అధికారులు ● 18న ఏజెన్సీ బృందం రాకబల్దియాల్లో విద్యుత్ వినియోగ చార్జీల బిల్లు గుదిబండగా మారుతోంది. ప్రతి నెలా పెద్ద పద్దు కింద రూ.లక్షలు చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్ వినియోగం అనివార్యంగా మారడంతో చార్జీల మోత నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం సౌరశక్తిపై దృష్టి సారించింది. జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సర్వే ప్రక్రియ చేపట్టి డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఏజెన్సీ ప్రతినిధులు సిద్దిపేటలో సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం. సిద్దిపేటజోన్: జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీలోని ప్రజలకు తాగునీరు అందించే క్రమంలో పంప్ హౌస్, హై లెవల్ వాటర్, లో లెవల్ వాటర్ ట్యాంక్‌లు నిర్మించారు. అలాగే వీధి దీపాలు, ప్రధాన రహదారులపై వివిధ రకాల దీపాలు, కార్యాలయం నిర్వహణ నిమిత్తం ఇతర అవసరాలకు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం అవసరం కావడంతో దానికి అనుగుణంగా విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ప్రతీసారి కష్టంగానే.. బల్దియా చెల్లింపు ప్రక్రియలో విద్యుత్ చార్జీల అంశం ప్రతి నెల పెద్ద సమస్యగా మారుతోంది. గతంలో కొన్ని మున్సిపాలిటీలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో సంబంధించిన శాఖ విద్యుత్ సరఫరాను తొలగించిన సంఘటనలు అనేకం. మున్సిపల్ ఆదాయ వనరులకు అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి. సిబ్బంది, కార్మికుల వేతనాల చెల్లింపులు చిన్నపాటి మున్సిపాలిటీల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఇలాంటి స్థితిలో విద్యుత్ చార్జీల అంశం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో సోలార్ ద్వారా అవసరమైన విద్యుత్ ఉత్పత్తితో కొంతమేరకు చార్జీల భారం తగ్గించే అవకాశం ఉందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సిద్దిపేటలో ప్రయోగాత్మకం.. జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసి దాని ఫలితాల మేరకు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో అమలుకు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని సుమారు లక్షన్నర జనాభాకు అవసరమైన తాగునీరు సరఫరా కోసం పెద్ద ఎత్తున విద్యుత్ వాడకం చేస్తున్నట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి మానేరు నీటిని పంపింగ్ విధానం ద్వారా తరలించి ఆయా వార్డులకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు మంగోల్ నుంచి మిషన్ భగీరథ నీటిని పంపింగ్ జరుగుతోంది. ఈ లెక్కన పట్టణంలో 63 నీటి ట్యాంక్‌లు, కమ్మర్లపల్లి, ఇల్లంతకుంట పంపింగ్ స్టేషన్లు, నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, ఫిల్టర్ బెడ్స్ లాంటి వాటి వినియోగం కోసం పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగిస్తున్నారు. కేవలం తాగునీటికి విద్యుత్ వాడకం కింద బల్దియా ప్రతి ఏటా రూ.5కోట్లు చెల్లించాల్సి వస్తోంది. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాలకు కోసం ప్రతి నెలా సుమారు రూ.80లక్షల కరెంట్ బిల్లు వస్తుంది. దీనిని అధిగమించేందుకు జిల్లా కేంద్రంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఏజెన్సీ ప్రతినిధులు సిద్దిపేట మున్సిపాలిటీలో సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.విద్యుత్ బిల్లులు ఇలా.. (రూ.లలో) మున్సిపాలిటీ ఏడాదికి.. సిద్దిపేట 9.60కోట్లు గజ్వేల్ 1.20 కోట్లు దుబ్బాక 60లక్షలు హుస్నాబాద్ 38లక్షలు చేర్యాల 36లక్షలు ప్రక్రియ వేగవంతం.. సిద్దిపేట మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సర్వే, డీపీఆర్ ప్రక్రియ వేగవంతం చేసేలా అడుగులు వేస్తున్నారు. కమ్మర్లపల్లి, ఇల్లంతకుంటలోని పెద్ద పంప్ హౌస్‌ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో, అదేవిధంగా సిద్దిపేట నాసర్ పూర ఫిల్టర్ బెడ్, చింతల్ చెరువు, నర్సాపూర్ చెరువు ఎస్టీపీ ప్లాంట్లు, పట్టణంలోని 11 హై లెవల్ వాటర్,లో లెవల్ వాటర్, లో లెవల్ వాటర్ ట్యాంక్ ల వద్ద ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.జీరో పవర్ బిల్లే లక్ష్యం సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రతి నెల రూ.80లక్షల కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. సోలార్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా చేపట్టి జీరో పవర్ బిల్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం డీపీఆర్ తయారీలో నిమగ్నమయ్యాం. సర్వే అనంతరం క్లారిటీ వస్తుంది. అవసరమైన విద్యుత్‌ను సోలార్ ద్వారా ఉత్పత్తి చేసే ఆలోచన ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. –ఆశ్రిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట -
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో వరంగల్ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు.. రాహుల్ గాంధీని అశోక్ నగర్‌కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగపోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాల పేరిట యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల బాధలు కనబడడం లేదా వినబడడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన నిరుద్యోగ భృతి వట్టి మాటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి యువత కీలకమని, రజతోత్సవ సభకు వరంగల్ వరకు వెయ్యి మంది యువత పాదయాత్ర చేయనున్నారని అన్నారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి వట్టిమాటేనా? ప్రభుత్వ తీరుపై హరీశ్ ఫైర్ -
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఎంపీ రఘునందన్రావునంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముడ్రాయి, రాజగోపాల్‌పేట, వెంకటాపూర్, మైసంపల్లి, పాలమాకులలో వడగళ్ల వానతో దెబ్బ తిన్న రైతుల పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాళ్ల వాన పడితే తాలు తప్ప గింజ మిగలదని తెలియని ఓ మంత్రి.. పొలంలో వరిని చూసి తాలు పండిస్తారా అని అవమానకర రీతిలో మాట్లాడడం బాధాకరమన్నారు. పంటలను పరిశీలించిన మంత్రి పరిహారం ఇమ్మంటే సొళ్లు కబురు చెప్పారని, ఇందిరమ్మ రాజ్యమంటే రైతులను గోస పెట్టడమేనా అని ప్రశ్నించారు. ఏఓ, ఏఈఓలు గ్రామాల్లో తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకొని నివేదిక పంపాలన్నారు. అలాగే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మండలశాఖ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తిరుపతిరెడ్డి, రజినీకర్‌రెడ్డి, యాదమల్లు, శ్రీనివాస్, కృష్ణమూర్తి ఉన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి సిద్దిపేటజోన్ : సిద్దిపేట పట్టణంలోని 16, 31, 32 వార్డుల్లో గావ్ ఛలో, బస్టీ ఛలో కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల పై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా సమయంలో ఉచితంగా టీకా, బియ్యం ఇచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. -
కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ. 8 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్ తెలిపారు. జాతర ఉత్సవాలకు సంబంధించిన 59 రోజుల అమ్మవారి హుండీని లెక్కించారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్ నరేశ్, సిబ్బంది మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, హరి, చందు, చిన్నా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గింజకూ మద్దతు ధర డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): ప్రతి గింజకూ మద్దతు ధర అందించేలా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పార పట్టాక పాసింగ్ చేయాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్‌ను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్‌రావు, నాయకులు వెంకటేశంగౌడ్, సుదర్శన్, పర్శరాములు, ప్రభాస్, నరేందర్ రావు, నర్సింగరావు, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సాగు నీరు అందిస్తాం మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్, బెక్కల్ గ్రామాల రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గండిమావరం రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీటిని గ్రామంలోని బయ్యన చెరువులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. కాలువ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన వెంటనే చేపట్టాలని శనివారం జిల్లా ఇరిగేషన్ డీఈ శ్రవణ్‌కు సూచించారు. అంతకుముందు కొండాపూర్ గ్రామంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానపరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, కమలాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్‌బోర్డు బిల్లు రద్దు చేయాలి చేర్యాల(సిద్దిపేట): వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై యుద్ధం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి అందె అశోక్ అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని జనగామ–సిద్దిపేట రహదారిపై ముస్లింలతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు బిల్లు తీసుకురావడం దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం విభజించి పాలన చేస్తున్నదని ఆరోపించారు. మతాల, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వక్ఫ్‌బోర్డు బిల్లును రద్దు చేయకుంటే భవిష్యత్తులో తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మజీద్, ముఖీమ్, భూమయ్య, యాదగిరి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాలకు అంబాసిడర్ రేవంత్
సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావుసిద్దిపేటజోన్ /ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వరంగల్‌లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ సభ సందర్భంగా జనసమీకరణ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ 25ఏండ్ల రజతోత్సవ కీర్తి, ఉద్యమానికి పురుడు పోసింది సిద్దిపేటేనని పేర్కొన్నారు. 27న పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వల్ల ఎంత వేగంగా అధికారంలోకి వచ్చిందో.. అంతే వేగంగా హామీల ఎగవేతతో ప్రజల్లో ఆదరణ పడిపోయిందన్నారు. సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం 40శాతం నూకలను ప్రజలకు ఇస్తోందని ఆరోపించారు. సిద్దిపేట పై ప్రభుత్వం కక్ష గట్టి నిధులను ఆపేసిందని ఆరోపించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జడ్పీ మాజీ చైర్మన్ రోజాశర్మ, నాయ కులు రాజనర్స్, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని రామ రాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని, హనుమాన్ మాలధారులతో కలిసి భిక్ష చేశారు. నెలాఖరులోగా న్యాక్ భవనం.. సిద్దిపేట అర్బన్: న్యాక్ భవనం పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మె ల్యే హరీశ్‌రావు ఆదేశించారు. మందపల్లి గ్రామ శివారులో నిర్మితమవుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) భవనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం అందుబాటులోకి వస్తే ఎల్అండ్టీ సంస యేటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. -
స్కాన్ చెయ్.. టికెట్ తీయ్
సిద్దిపేటకమాన్: జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు ప్రారంభమయ్యాయి. నగదు రహిత సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు జేబులో డబ్బు లేకున్నా ఆన్లైన్ (గూగుల్ పే, ఫోన్ పే) ద్వారా డబ్బులు చెల్లించి తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. ఇక నుంచి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులకు, కండక్టర్లకు మధ్య చిల్లర విషయంపై గొడవలు తలెత్తకుండా సమస్య పరిష్కారం కానుంది. సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం టి.రఘు తెలిపారు. ప్రస్తుతం పది డీలక్స్ బస్సుల్లో ప్రారంభం సిద్దిపేట ఆర్టీసీ డిపో పరిధిలో 53 ఆర్టీసీ, 53 అద్దె బస్సులతో కలిపి మొత్తం 106 బస్సులు ఉన్నాయి. వీటిలో పది డీలక్స్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఈ బస్సులు ప్రతి రోజు సుమారు 39వేల కిలో మీటర్లు తిరుగుతూ ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. గతంలో టికెట్ చార్జీల చెల్లింపులకు సంబంధించి చిల్లర విషయంలో బస్ కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య గొడవలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బస్సులలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేట ఆర్టీసీ డిపోలోని 10 డీలక్స్ బస్సులలో గురువారం డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించారు. టిమ్ యంత్రాల ద్వారా ప్రయాణికుల నుంచి ఆన్లైన్ (పోన్ పే, గూగుల్ పే) ద్వారా టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా ప్రయాణం సులభతరం అవుతుందని పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీలక్స్ బస్సులు ప్రతి రోజు సిద్దిపేట నుంచి జేబీఎస్‌కు 20 ట్రిప్పుల ద్వారా 5వేల కిలోమీటర్లు తిప్పుతున్నారు. త్వరలో దశల వారీగా అన్ని బస్సులకు డిజిటల్ టిమ్ యంత్రాలను ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయనున్నామని, డిపోకు ఇప్పటికే 90 డిజిటల్ టిమ్ యంత్రాలు వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.డీలక్స్ బస్సుల్లో ప్రారంభమైన ఆన్లైన్ సేవలు సిద్దిపేట డిపోకు చేరుకున్న 90 డిజిటల్ టిమ్ యంత్రాలు దశల వారీగా అన్ని బస్సుల్లో ఏర్పాటు తీరనున్న చిల్లర కష్టాలు ఇక ప్రయాణం సులభతరంఆన్లైన్ పేమెంట్స్‌తో సులభం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ జేబీఎస్‌కు వెళుతున్నాను. టికెట్ చార్జీలు ఆన్లైన్ చెల్లింపులు చేయడం బాగుంది. గతంలో చిల్లర సమస్య తలెత్తేది. ప్రస్తుతం నగదు రహిత సేవల వల్ల టికెట్ తీసుకోవడం సులభమైంది. ఆన్లైన్ సేవలు బాగున్నాయి. – రాజు, ప్రయాణికుడుసద్వినియోగం చేసుకోవాలి సిద్దిపేట డిపోలోని డీలక్స్ బస్సులలో డిజిటల్ టిమ్ యంత్రాలను ఏర్పాటు చేశాం. ఈ బస్సులు సిద్దిపేట నుంచి జేబీఎస్ రూట్లో తిప్పుతున్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించి సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఆన్లైన్ చెల్లింపులు, సేవల ద్వారా చిల్లర సమస్య పరిష్కారం కానుంది. నగదు రహిత ఆన్లైన్ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – టి.రఘు, సిద్దిపేట డిపో మేనేజర్ -
పామాయిల్ రైతుకు భరోసా
రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ పరిశ్రమసాక్షి, సిద్దిపేట: ఆయిల్ గెలల నుంచి ముడి నూనె తీయడంతోపాటు శుద్ధి చేసిన తరువాత ఆయిల్ ప్యాకెట్స్ రూపంలో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఉండగా తాజాగా మూడోది తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని నంగనూరు మండలం నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల్లో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ జూన్ చివరి వరకు అందుబాటులోకి రానుంది. సాగుకు అనుగుణంగా ఫ్యాక్టరీ.. ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోంది. దీనిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్‌లను సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ ఫామ్‌లను ఎక్కువగా సాగు చేసేవారు. ప్రస్తుతం 31 జిల్లాల్లో 64,325 మంది రైతులు 2,42,627 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఉండాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీకి 2023లో శంకుస్థాపన చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కాబోతున్న ఫ్యాక్టరీలో గంటకు 30టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ప్రారంభించనున్నారు. ఆయిల్ ఫామ్ గింజల ఉత్పత్తి పెరిగే కొద్దీ సామర్థ్యంను గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే తొలి ఫ్యాక్టరీ ఇది. వ్యర్థాలతో విద్యుత్ ఆయిల్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ఆవరణలోనే 4 మెగావాట్ల కో జనరేషన్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాలను ఉడికించి స్టీమ్‌తో ఆధునిక టర్బైన్లతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక్క యూనిట్‌కు రూ1.5 ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. కాలుష్య రహితంగా.. కాలుష్య రహితంగా ఉండేవిధంగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి రీ యూజ్ చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. దీంతో భూగర్భజలాలు అంతరించిపోకుండా ఉంటాయి. నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ఈ పరిశ్రమ దోహదపడనుంది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిశీలించారు. గెలల వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సిద్దిపేట జిల్లా నర్మెటలో 62 ఎకరాల్లో.. రూ. 300 కోట్లతో నిర్మాణం 64వేల మంది రైతులు 2.42 లక్షల్లో సాగు జూన్ చివరికి అందుబాటులోకి ఇక్కడే రిఫైన్డ్ ప్రస్తుతం అశ్వారావుపేటలో గంటకు 30 టన్నులు, అప్పారావురావుపేటలో 90టన్నుల సామర్థ్యంతో పరిశ్రమలున్నాయి. వీటి నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్‌ను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఆయిల్ ఫెడ్‌కు పంపి అక్కడ రిఫైన్డ్ చేసి ప్యాకింగ్‌లో మార్కెట్లోకి పంపించేవారు. సిద్దిపేటలో ఏర్పాటు అవుతున్న ఫ్యాక్టరీలో గెలల నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్‌ను తీసి అక్కడే రిఫైన్డ్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపుతారు. ఇక్కడ గంటకు 250 టన్నుల పామాయిల్‌ను ప్యాకింగ్ చేయనున్నారు. జూన్ చివరికి అందుబాటులోకి.. సిద్దిపేటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ జూన్ చివరి వరకు అందుబాటులోకి వచ్చేలా పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని జిల్లాలకు దగ్గరగా ఈ పరిశ్రమ ఉండటంతో రైతులకు ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఉన్న రెండు పరిశ్రమలలో టన్నుకు 19.4శాతం ఆయిల్ వస్తుంది. ఆయిల్ శాతం పెరిగితే రైతుకు మరింత ఆదాయం పెరగనుంది. – సుధాకర్ రెడ్డి, జీఎం, తెలంగాణ ఆయిల్ ఫెడ్ -
కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.8 లక్షలు వచ్చినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి 59 రోజుల హుండీలోని కానుకలను శుక్రవారం లెక్కించినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ నరేష్, సిబ్బంది మహేందర్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, హరి, చందు, చిన్నా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సీపీని కలిసిన నూతన డీటీఓ సిద్దిపేటకమాన్: జిల్లా నూతన ట్రాన్స్పోర్ట్ ఆఫీ సర్గా బాధ్యతలు చేపట్టిన కిష్టఫర్.. సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సంయుక్తంగా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటజోన్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా వివిధ క్రీడా అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు 14 ఏళ్లలోపు బాల, బాలికలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు శిక్షణ ఇచ్చే క్రీడల వివరాలు తదితర అంశాలపై ఈనెల 19లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్టేడియంలోని జిల్లా క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందచేయాలని, క్రీడలు నిర్వహించే వారికి గౌరవ వేతనం, క్రీడా సామగ్రి అందించనునట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9014580816 నంబర్లో సంప్రదించాలని సూచించారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో సిర్సనగండ్ల, మర్పడ్గ, దుద్దెడ, వెలికట్ట గ్రామాల్లో, ఐకేపీ ఆధ్వర్యంలో బొబ్బాయిపల్లి, తిప్పారం, మాత్‌పల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరను పొందాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్‌ను చెల్లించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. -
గొప్ప దార్శనికుడు పూలే
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సిద్దిపేటజోన్: సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనులకు దశదిశగా నిలిచిన దార్శనికుడు జ్యోతిరావు పూలే అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం స్థానిక విపంచి ఆడిటోరియంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, స్వేచ్ఛ, సమానత్వం గురించి పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన సేవలను సమాజానికి తెలపాలని సూచించారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అదనపు కలెక్టర్ హమీద్‌లు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. పూలే జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ రఘునందన్ రావు ఫొటో లేదని, ప్రొటోకాల్ ఉల్లంఘన అంటూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. -
చిరుధాన్యాలతోనే ఆరోగ్యసిరి
వర్గల్(గజ్వేల్): సామలు, అరికెలు తదితర చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం మాతాశిశువులకు ఎంతో ప్రయోజనకరమని సీడీపీఓ సరిత అన్నారు. శుక్రవారం వర్గల్ మండలం నెంటూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ హరితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశువులకు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు. -
పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం
కొండపాక(గజ్వేల్): పేదలు కడుపు నిండా అన్నం తినేలా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని చేపట్టిందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో రేషన్‌కార్డు ద్వారా సన్న బియ్యం పొందిన లబ్ధిదారుడి ఇంట్లో శుక్రవారం భోజనం చేశారు. సన్న బియ్యం పథకం ఎలా ఉందంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా రేషన్ దుకాణాల ద్వారా 5,775 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. కాయ కష్టం చేసే పేదలు కడుపు నిండా ఆహారం తీసుకునేలా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందన్నారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడంలో డీలర్లు అలసత్వం చూపితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సన్న బియ్యం పంపిణీ దోహదపడుతుందన్నారు. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారుడి కుటుంబీకులు తలపాన శ్రీనివాస్, పుష్ప, అదనపు కలెక్టర్ హమీద్, డీఎస్ఓ తనూజ, డీపీఓ దేవకీదేవి, తహసీల్దార్ దిలీఫ్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి లబ్ధిదారుడి ఇంట్లో భోజనం -
ఆయిల్‌పామ్ సాగులో మోడల్‌గా నిలపాలి
నంగునూరు(సిద్దిపేట): తెలంగాణకు గుండెకాయగా ఉన్న సిద్దిపేటను ఆయిల్‌పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. నర్మెటలో 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, సామర్థ్యం, జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంట, నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే తొలి సంతకం చేశానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన మిషన్లు, టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, ఇక్కడే రిఫైనరీ చేస్తారన్నారు. జూన్ నెలాఖరు వరకు ఫ్యాక్టరీ ప్రారంభించేలా ఆయిల్‌ఫెడ్ చైర్మన్, కలెక్టర్ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నారు. నూనె వినియోగం పెరగడంతో లక్ష కోట్ల రూపాయల విదేశీ మారకం వృథాగా మారుతోందని, దీన్ని అరికట్టేందుకు 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్గదర్శకంగా నిలిచిన తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు 200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసి గుజరాత్లో క్షీర విప్లవం తెచ్చిన కురియన్లా అందరికీ మార్గదర్శకంగా నిలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో అధికంగా ఆయిల్‌పామ్ సాగు చేసేలా ప్రోత్సహిస్తామని, పదెకరాల భూమి కొని నేను కూడా అయిల్‌పామ్ సాగు చేస్తానన్నారు. కలెక్టర్ మనూ చౌదరి మాట్లాడుతూ జిల్లాలో, 230 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరగుతోందని అధిక లాభాలు గడించే పంటను రైతులు సాగు చేయాలన్నారు. ఉద్యాన అధికారిపై మంత్రి ఆగ్రహం ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించకుండా అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి తుమ్మల ఉద్యాన శాఖ జిల్లా అధికారి సువర్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సాగుపై అధికారులు ఆవగాహన కల్పించడం లేదని, ఆయిల్ గింజలు అమ్మి వారం రోజులు గడిచినా బిల్లు రాలేదని రైతు చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, డీఏఓ రాధిక, అఽధికారులు పాల్గొన్నారు.జిల్లా ఆదర్శం కావాలి జూన్ నెలాఖరులోగా నర్మెట ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
అభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హుస్నాబాద్‌రూరల్: అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు పల్లె సోల్జర్స్‌గా నిలవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) శుభం గార్డెన్లో అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, సీఏలకు యుడీఐడీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేయూత, సదరం పింఛన్ల కోసం వృద్ధులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. సదరం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లకుండానే మన ఇంటి నుంచే యుడీఐడీలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దీనిపై అవగాహన కల్పించాలని వివరించాలన్నారు. -
బడి.. భయపెడుతోంది
ఊడిపడుతున్న పెచ్చులు.. కూలుతున్న చెట్లు బడి భయపెడుతోంది. పైకప్పు ఊచలు తేలి పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడలు బీటలు వారాయి. వానొస్తే ఉరిసి తడిసిముద్దవుతోంది. శిథిల భవన సముదాయం ఎప్పుడు కూలుతుందోనన్న భయం నెలకొంది. ఆవరణలో భారీ వృక్షాలు సైతం నేలకూలుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వారం క్రితం స్కూల్ వదలిన తరువాత ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకూలింది. పిల్లలు లేని సమయం కావడంతో ముప్పుతప్పింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితి వర్గల్ మండలం జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాలలో నెలకొనగా.. తక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారగణం ఏమీపట్టనట్లు చోద్యం చూస్తుండటం గమనార్హం. శిథిలావస్థలో.. పాత బురుజు పక్కన జబ్బాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. ఐదు తరగతులు, నాలుగు గదులు, 71 మంది విద్యార్థులతో కూడిన ఈ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులున్నారు. ఇందులోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. దశాబ్దాల క్రితం ఈ భవన సముదాయం నిర్మితమైంది. భవనాలకు పగుళ్లు, పైకప్పునకు తేలిన ఊచలు దర్శనమిస్తాయి. –వర్గల్(గజ్వేల్)మందుబాబులు ధ్వంసం చేసిన టాయ్‌లెట్ టైల్స్మందు బాబులకు అడ్డాగా సర్కారు బడులుకొండాపూర్లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ధ్వంసమవుతున్నాయి. సరస్వతీ నిలయాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు ఆవరణాలుసిట్టింగులుగా మార్చేస్తున్నారు. అంతటితో ఆగక తాగిన మద్యం బాటిళ్లను పగులగొడుతున్నారు. దీంతో ఉదయం బడికి వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. మరోవైపు టాయిలెట్స్‌ను సైతం ధ్వంసం చేయడంతో అవసరాలను తీర్చుకోవడానికి విద్యార్థులు ఇంటి దారి పట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందు బాబుల ఆగడాలు శృతి మించుతున్నాయని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మందుబాబుల ఆగడాలకు కళ్లెం వేయాలని వారు కోరుతున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
పనిమంతులు
అతివలే ‘ఉపాధి’ పనుల్లో మహిళలే ఎక్కువ● ఉమ్మడి మెదక్ జిల్లాలో జాబ్ కార్డులు 5.8లక్షలు ● కూలీలు 11.29లక్షలు ● వసతులు కల్పిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలీ పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. గ్రామీణ నిరుపేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిది. ఉమ్మడి మెదక్ జిల్లా (2024–25)లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని దినాలను ఉపయోగించుకుని భేష్ అనిపించారు. సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.8లక్షల జాబ్ కార్డులుండగా 11.29లక్షల మంది ఉపాధి కార్మికులున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన కొత్తల్లో పురుషులే పనులకు వెళ్లేవారు. రానురాను క్రమంగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో మహిళలలే ముందు వరుసల్లో నిలిచారు. ఉమ్మడి జిల్లాలో మహిళలు 90,88,784 పని దినాలను, పురుషులు 56,09,316 పని దినాలను ఉపయోగించుకున్నారు. నైపుణ్య శిక్షణ పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లో యువతీ యువకులుంటే వారికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నతి అనే పథకం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఉన్నతి శిక్షణలో సైతం అనేక రకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణతో మరింత రాణించి ఆర్థికంగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని వసతులు కల్పిస్తే.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్ని వసతులు కల్పిస్తే మహిళల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోజుకు 3 నుంచి 5గంటల వ్యవధిలో రూ.307 వరకు సంపాధించుకునే ఆస్కారం ఉండడంతో వ్యవసాయ ఆధారిత కూలీలు సైతం ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.ఉపాధి పనులు చేస్తున్న కార్మికులు -
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
గజ్వేల్: గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాటం కొనసాగిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హెచ్చరించారు. గురువారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా గ్యాస్ ధరలను పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విర్తుస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక్కో సిలిండర్‌పై రూ.50 ధరను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ శాఖ అధ్యక్షులు అజహర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల నాయకుడు అభిలాష్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సమీర్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్‌లో ర్యాలీ, ప్రధాని దిష్టిబొమ్మ దహనం -
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయి, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముదిరాజు రాష్ట్ర నాయకులు గీస భిక్షపతి, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. పోషకాహారంతోనే ఆరోగ్యం చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు పోషక విలువలు ఉన్న ఆహార పదర్థాలను తినాలని.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. గురువారం ఇబ్రహీంనగర్ ఆదర్శ పాఠశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహార లోపం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు మంచి పోషక విలువలు ఉన్న చిరుధాన్యాలను తీసుకోవాలన్నారు. రక్త హీనతకు గురి కాకుండా పల్లి పట్టీలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరీశుభ్రత, ఆరోగ్య సమస్యలపై వివరించారు. విద్యార్థినులకు రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
● దొడ్డు, సన్నాలు వేర్వేరుగా లోడ్ చేయాలి ● కలెక్టర్ మనుచౌదరి మద్దూరు(హుస్నాబాద్): కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసే అవకాశం ఉందని టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ బోనస్ కూడా ప్రకటించిందన్నారు. అందువల్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరతో పాటు, బోనస్ సైతం పొందాలని రైతులకు తెలిపారు. సెంటర్ చుట్టుపక్కల హార్వెస్టింగ్ అవుతున్న వరిధాన్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని లోడ్ చేసేటప్పుడు వేరువేరుగా చేయాలని సూచించారు. మిల్లర్ల వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తూకం లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఆదేశించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల ప్రాథమిక వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఎంపీడీఓ, సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు. వసతి గృహాల్లో మెనూ తప్పనిసరి ● నాణ్యమైన భోజనం అందించాలి ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వం ప్రకటించిన మెనూను విఽధిగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వసతి గృహ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ మెనూలో ఉన్న మిల్లెట్ బిస్కెట్, నెయ్యి తప్పని సరిగా వినియోగించాలన్నారు. విద్యార్థినుల వ్యాయామానికి జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. నల్లా కనెక్షన్, లైబ్రరీలో బుక్స్ కావాలని విద్యార్థులు కోరగా వెంటనే మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి హమీద్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల.. కాదు పానశాల
సరస్వతీ నిలయమైన పాఠశాల ఏకంగా పానశాలగా మార్చేశారు. రాత్రి అయ్యిందంటే చాలు మోత్కులపల్లిలోని ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు, టీచర్లకు పాఠశాల ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ పడేసిన బీరు, కల్లు సీసాలు దర్శనమిస్తున్నాయి. కొన్నింటిని అక్కడే ధ్వంసం చేస్తుండటంతో ప్రాంగణంలోకి రావాలంటేనే జంకుతున్నారు. ప్రహరీ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
అన్నదాత.. గుండె కోత
బాధిత రైతులను ఆదుకోండి ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటజోన్: పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. గురువారం కలెక్టర్ మనుచౌదరి, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంట లను అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందన్నారు. వ్య వసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ●వడగళ్ల బీభత్సం ●ఆరు నెలల కష్టం వర్షార్పణం ●వేల ఎకరాల్లో పంట నష్టం ఇంటిల్లిపాది రెక్కల కష్టం వర్షార్పణమైంది. పంట చేతికొచ్చే తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన అన్నదాతను నిండా ముంచింది. ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో నష్టం జరిగిందని రైతులు వాపోయారు. నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, వడగళ్ల వానకు మామిడి కాయలు సైతం నేలరాలాయి. అలాగే మొక్కజొన్న, మిర్చి, టమాటా, కూరగాయ పంటలు నేలకొరిగాయి. నంగునూరు మండలంలోని 11 గ్రామాల్లో 3,869 ఎకరాలు, చిన్నకోడూరు మండలంలో 2,100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఏడీఏ పద్మ, ఏఓ గీత తెలిపారు. – నంగునూరు/చిన్నకోడూరు(సిద్దిపేట)30 ఏళ్లలో ఎన్నడూ చూడలే రెండు ఎకరాల్లో వరి పంట కోసి ఐకేపీ సెంటర్‌కు తెచ్చి ఆరబెట్టాను. రాత్రి కురిసిన వడగళ్ల దెబ్బకు వడ్లన్నీ బియ్యంగా మారాయి. ఇంత రాళ్లవాన, నష్టం 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. – చంద్రయ్య, రైతు, పాలమాకుల -
అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
చేర్యాల(సిద్దిపేట): అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పద్మశ్రీ , ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం మండల పరిధిలోని శభాష్‌గూడెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ కుల వ్యవస్థ కారణంగానే దేశంలో ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశానికి ఉన్నత వర్గాల వారే ప్రధానులు అయ్యారని, ప్రస్తుతం మోదీ మాత్రమే బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చారన్నారు. రాజ్యంగంలో కల్పించిన హక్కులతోనే నేడు దళితులు రాజకీయంగా ఎదుగుతున్నారన్నారు. దళితుల ఉన్నతి కి పాటు పడిన మహనీయుల్లో జ్యోతిరావుపూలే, సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ ఉన్నారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి జగదేవ్‌పూర్(గజ్వేల్): మహానీయుల అడుగు జాడల్లో నేటి యువత నడువాలని మందకృష్ణ మాదిగ కోరారు. కుకునూర్‌పల్లి మండలం చిన్నకిష్టాపూర్‌లో జైభీమ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం లేన్నందున మీ గ్రామానికి మరోసారి వస్తానని, ఇక్కడే నిద్ర చేసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మంద కృష్ణమాదిగ శభాష్ గూడెంలో విగ్రహావిష్కరణ -
అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తాం
దుబ్బాక: ‘చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం.. అసంపూర్తిగా డబుల్ బెడ్రూంల నిర్మాణాలు’పేరిట ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు బుధవారం జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్‌రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా పలు బ్లాక్‌లలో డబుల్ బెడ్రూంలు అసంపూర్తిగా ఉండటంపై సంబంధిత కాంట్రాక్టర్‌తో పీడీ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయిస్తామని, అలాగే అలాట్మెంట్ చేయకున్నా డబుల్ బెడ్రూంలలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా అధికారులు వచ్చిన విషయం తెలుసుకొని ‘సాక్షి’ప్రతినిధి అక్కడికి వెళ్లగా అప్పటికే అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా బ్లాక్‌లలోకి రాలేరని రోడ్డు వైపు మంచిగా ఉన్న వాటినే అధికారులు చూసి పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలు పూర్తి కాకుండానే అడ్వాన్స్‌గా కాంట్రాక్టర్‌కు అధిక పేమెంట్ చేయడంపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయం జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే త్వరలో కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామన్నారు.జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్‌రావు -
బాబోయ్ బర్డ్ ఫ్లూ
ప్రజలకు వైద్య పరీక్షలు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫాం పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కోళ్ల నుంచి వ్యాధి ప్రజలకు సోకే అవకాశం ఉండటం వల్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాల్ట్రీ ఫాం పరిసరాలకు ఎవరూ వెళ్లకుండా అక్కడ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు.సామూహికంగా కోళ్ల పూడ్చివేత కాన్గల్ గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అవ్వడంతో ఆ పౌల్ట్రీ ఫాంలోని 1.45లక్షల కోళ్లను అధికారులు చంపి పూడ్చిపెడుతున్నారు. బుధవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. వారం రోజుల పాటు కొనసాగనుంది. బర్డ్‌ఫ్లూ సోకిన పౌల్ట్రీఫాంకు కిలోమీటర్ దూరంలో చికెన్, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. దీంతో పాటు వ్యాధి సోకిన ఫామ్‌కు కిలోమీటర్ సమీపంలోని పౌల్ట్రీ ఫాంలపై దృష్టి సారించారు.ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బర్డ్‌ఫ్లూ.. ఈ పేరు వింటేనే జిల్లా ప్రజలు జంకుతున్నారు. తొగుట మండల పరిధిలోని కాన్గల్ గ్రామంలోని లేయర్ ఫౌల్ట్రీలో మరణించిన కోళ్ల శాంపిల్‌ను ఈ నెల 4న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు పరీక్షల నిమిత్తం పంపించగా, 7న బర్డ్‌ఫ్లూ ఉందని రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు కాన్గల్ పౌల్ట్రీఫాంలో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి పౌల్ట్రీ ఫాంలో కోళ్లను సామూహికంగా చంపేసి పూడ్చిపెడుతున్నారు. జిల్లాలో 235 వరకు పౌల్ట్రీ ఫాంలు ఉండగా 92లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా బర్డ్ ఫ్లూ భయం జిల్లా వాసులను, పౌల్ట్రీ నిర్వాహకులను వణికిస్తోంది. కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు కోరుతున్నారు. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, కోడిగుడ్ల విక్రయాలు, వినియోగం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి.● కలకలం సృష్టిస్తున్న వైరస్ ● కాన్గల్‌లో నిర్ధారించిన పశుసంవర్ధకశాఖ ● బెంబేలెత్తుతున్న పౌల్ట్రీ నిర్వాహకులుటోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు జిల్లాలో బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 85004 04016ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ సంబంధిత ఆనవాళ్లు ఉంటే ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. సందేహం ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపించడంతో పాటు, సలహాలు, సందేహాలను నివృత్తి చేయనున్నారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయింది జిల్లాలో కాన్గల్ గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ నిర్థారణ అయింది. ఆ ఫాంలోని కోళ్లను చంపి పూడ్చే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని ఇతర పౌల్ట్రీ ఫాంలలో కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలి. వైరస్ సోకకుండా పౌల్ట్రీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. –అశోక్‌కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ -
రథోత్సవం.. భక్తి పారవశ్యం
కొండపాక(గజ్వెల్): మండలంలోని కుకునూరుపల్లిలో వెలసిన సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడ సేవా రథోత్సం కనుల పండువగా సాగింది. ఆలయ కమిటీ చైర్మన్ పొల్కంపల్లి నరేందర్ సేన ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ సంకల్ప బలంతోనే రఽథోత్సవం విజయవంతంగా ముగిసిందన్నారు. మాజీ సర్పంచ్ ఐలం సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అమరేందర్, ఉప్పల రాజు, కొంతం రాజు, కనకయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కనుల పండువగా గరుడ సేవా రథోత్సవం -
సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు
ప్రగతి ఆధారంగా పంచాయతీరాజ్ మార్కులుసాక్షి, సిద్దిపేట: పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన వంటి తొమ్మిది అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి మెతుకుసీమలోని 24 పల్లెలు పురోగతిలో ఫ్రంట్‌రన్నర్‌గా నిలిచాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా మార్కుల జాబితాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు గణనీయమైన మార్కులు సాధించాయి. తొమ్మిది అంశాల ఆధారంగా... కేంద్రప్రభుత్వం పంచాయతీ ముందస్తు సూచి(అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) పేరుతో ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1,615 గ్రామ పంచాయతీలు దరఖాస్తు చేశాయి. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల స్వావలంబనకు అనుకూలమైన విధానాలు అనే అంశాల ఆధారంగా గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం మార్కులను కేటాయించింది. ఇందులో 24 పంచాయతీలు ఫ్రంట్‌రన్నర్‌గా నిలవడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పంచాయతీకీ అచీవర్స్ హోదా దక్కలేదు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన గ్రామం గుడాటిపల్లి 39.39 మార్కులతో ‘ఈ’గ్రేడ్‌లో నిలిచింది. అలాగే బీ గ్రేడ్‌లో నిలిచిన పటేల్‌గూడ, సుల్తానాపూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.ఫ్రంట్ రన్నర్స్‌గా నిలిచిన గ్రామ పంచాయతీలు ఇవేగ్రేడ్ మార్కులు పంచాయతీలు ఏ(అచీవర్స్) 90 నుంచి 100 0 బీ(ఫ్రంట్ రన్నర్స్) 75 – 89 24 సీ(పెర్ఫార్మర్) 60 – 74 1,419 డీ(యాస్పిరెంట్) 40 – 59 171 ఈ(బిగినర్) 39 01 ఉమ్మడిజిల్లాలో బీ గ్రేడ్‌లో 24, సీ గ్రేడ్‌లో 1,419, డీ గ్రేడ్‌లో 171 జీపీలు ఏ పంచాయతీకి దక్కని అచీవర్స్ హోదామెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామం తొమ్మిది అంశాలలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు వైకుంఠథామం, డంపింగ్‌యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, తాగునీటి సరఫరాను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంతో 77.90మార్కులు సాధించింది. దీంతో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.– సిద్దిపేట జిల్లాలో... మిట్టపల్లి(77.59), చెక్కల్(77.24), అంగడి కిష్టాపూర్(77.5), బుస్సాపూర్(77.05), కట్కూర్(76.58) గురువన్నపేట(75.94), మల్లంపల్లి(75.9), రాఘవాపూర్(75.55), బైరాన్‌పల్లి(75.38), పొన్నాల(75.36), కురేళ్ల(75.24) – మెదక్‌లో... వల్లూర్(77.9), నారాయణపూర్(77.67), మనోహరాబాద్(75.2)– సంగారెడ్డిలో పటేల్గుడా(79.67 మార్కులు), సూల్తానాపూర్(78.87), మైకోడ్(78.63), మల్చల్స్(78.3), చిటుకుల్(77.48), ఎద్దుమల్లారం(77.3),కొత్తాపూర్ (75.89), ఇలాపూర్(75.77), జనకంపేట్(75.18)ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పచ్చదనం పెంపు ఇలా విభాగాల సమన్వయంతో ముందుకు సాగి ఉన్న గ్యాప్‌లను పూర్తి చేసి త్వరలో ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి చేస్తాం. – దేవకీ దేవి, డీపీఓ, సిద్దిపేటసిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో 939 గృహాలుండగా 3,184 జనాభా ఉన్నారు. 2009–10లో నిర్మల్ పురస్కారం, 2021లో పారిశుద్ధ్య నిర్వహణలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ భవనంపై సోలార్‌ను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నారు. మిట్టపల్లి గ్రామం 77.59 మార్కులు సాధించడంతో పంచాయతీ కార్యదర్శి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మున్సిపాలిటీలోని చేర్వాపూర్, చెల్లాపూర్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు కై లాసం, నరేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వనిత భూంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి, ఏఓ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషిడీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ‘జై బాపు జై భీమ్, జై సంవిధాన్’కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంవిధాన్ పాదయాత్ర సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నాయకులు సమీర్, మొనగారి రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట సీపీ అనురాధ హెచ్చరించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువత బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. అప్పుల చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బెట్టింగ్‌పై సమాచారం తెలిస్తే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 8712667100కు సమాచారం అందించాలని సూచించారు. వాటర్ షెడ్ పథకం వినియోగించుకోవాలి డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య చిన్నకోడూరు(సిద్దిపేట): వాటర్ షెడ్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య సూచించారు. బుధవారం మండల పరిధిలోని చౌడారం గ్రామంలో పర్యటించి వాటర్ షెడ్ పథకం గురించి ప్రజలకు వివరించారు. ఈ పథకంపై 16న గ్రామంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పనుల పరిశీలన, కొత్త పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. చౌడారంతోపాటు సమీప గ్రామాల ప్రజలు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
దుబ్బాక: విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం దుబ్బాక మండలం హబ్షీపూర్లోని జ్యోతి బాపులే తెలంగాణ బీసీ బాలుర గురుకులాన్ని సందర్శించారు. వంట గదిలో అన్నం, కూరలను పరిశీలించి రుచి చూశారు. తాజా కూరగాయలను వాడాలని, వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కొత్త డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అనంతరం 8వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. సదుపాయాలు బాగున్నాయా అని అడిగారు. స్టడీ అవర్స్‌లో గణితం సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ భూపాల్‌రెడ్డి గురుకులంలో 391 మంది విద్యార్థులు ఉంటున్నారని ఇందుకు సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మ తదితరులు ఉన్నారు.కలెక్టర్ మను చౌదరి -
కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి
నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనులు నిర్వహించే స్థలంలో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీపీఓ, మండల స్పెషలాఫీసర్ దేవకీదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంగునూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రోజు 150 మందకి మించకుండా కూలీలను ఏర్పాటు చేసుకొని పనులు చేయించాలన్నారు. పనులు చేయించే స్థలంలో వర్క్‌షెడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫాస్టెయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎండీపీఓ లక్ష్మణప్ప, టీఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. -
మొదటి వెయ్యి రోజులే ముఖ్యం
చేర్యాల(సిద్దిపేట): గర్భిణిలకు మొదటి వెయ్యి రోజులు ఎంతో ముఖ్యమని సీడీపీఓ రమాదేవి అన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పట్టణ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం–6లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీ్త్ర తాను గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి పుట్టిన బిడ్డ రెండేళ్ల వయస్సు వచ్చే సమయాన్ని మొదటి 1000 రోజులు అంటారన్నారు. ఈ సమయంలో గర్భిణిలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఒక పూట పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. సీడీపీఓ రమాదేవి పోషణ పక్వాడ అవగాహన సదస్సు -
మహారాష్ట్ర, కర్ణాటకల్లో వైన్ టూరిజం..
ప్రస్తుతం మన రాష్ట్ర అవసరాలకు మహారాష్ట్ర నుంచి ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలను అందిస్తుండటంతో సాగు క్రమంగా పెరుగుతోంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ‘వైన్ టూరిజం’ ట్రెండ్ కొనసాగుతోంది. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న రైతులు.. తమ తోటలను ‘ఎకో టూరిజం’ ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తోటల్లో ఎక్కువగా వైన్ వైరెటీగా చెప్పుకునే రేసిన్ రకం ద్రాక్షను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తోటల్లోనే వైన్ ఉత్పత్తి యూనిట్లను సైతం ఏర్పాటుచేసి.. తమ తోటల్లో వచ్చే పర్యాటకులకు తక్కువ ధరకు వైన్ అందిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్‌కు వైన్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. లిక్కర్లో అల్కాహాల్ శాతం 46శాతం వరకు ఉంటే వైన్‌లో కేవలం 8–10శాతం అల్కాహాల్ ఉండటం వల్ల ప్రత్యేకించి యువతతోపాటు అన్ని వయసుల వారు వైన్ సేవించడానికి మక్కువ చూపుతున్నారు. తమ కళ్లముంగిటే సహజమైన పద్ధతుల్లో వైన్ దొరుకుతుండటంతో దీనిని ఇష్టంగా సేవిస్తున్నారు. -
పేదల నడ్డివిరుస్తున్న మోదీ సర్కార్
సిద్దిపేటఅర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేటలోని గాంధీ చౌరస్తా వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలపై భారం మోపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. వంట గ్యాస్‌పై ఏకంగా రూ.50 పెంచడం, పెట్రోల్, డీజిల్‌పై రూ.2 పెంచి ఆయిల్ కంపెనీలు భరించాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ప్రదాని మోదీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బన్సీలాల్, మల్లేశం, జనార్ధన్, చంద్రం, నరేష్, నాయకులు సంపత్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించాల్సిందే సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం -
ఇళ్ల పనులు వేగిరం చేయండి
బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని తక్షణం అరికట్టాలికొమురవెల్లి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు పోసాన్పల్లిలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని లబ్ధిదారులకు సూచించారు. అదే విధంగా ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను వెంటనే అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పనులు వేగవంతమైతే బిల్లులు వెంటనే చెల్లిస్తామని లబ్ధిదారుకుల భరోసా ఇచ్చారు. అంతకు ముందు కేజీబీవీ పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆడపిల్లలు అన్నిరంగాల్లో ముందు ఉండాలని అన్నారు. అనంతరం పోసాన్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, ఎంపీడీఓ శ్రీనివాస వర్మ, హౌసింగ్ పీడీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేటరూరల్: తొగుట మండలం కాన్గల్ గ్రామంలో బర్డ్‌ఫ్లూతో 15వేల కోళ్లు మృత్యువాత పడటంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అత్యవసర సమావేశమయ్యారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ సోకిన కోళ్లను శాసీ్త్రయ పద్ధతిలో భూమిలో పూడ్చి వేయాలన్నారు. ఫారంలో పనిచేసే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, కిలోమీటరు లోపు కోడిగుడ్లు అమ్మకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ పల్వాన్‌కుమార్, సీఐ మల్లేశ్‌గౌడ్, డీపీఆర్ఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోళ్ల మృత్యువాతపై అదనపు కలెక్టర్ అత్యవసర సమావేశం అధికారులకు దిశా నిర్దేశం -
ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
న్యాయమూర్తి స్వాతిరెడ్డి సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. జిల్లా జైలును న్యాయమూర్తి మంగళవారం సందర్శించి, న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జైలులోని వంట గది, స్టోర్‌ను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఖైదీలకు అడ్వకేట్స్ ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వికాస్, జైలు, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం: డీపీఓ దేవకీదేవి అక్కన్నపేట(హుస్నాబాద్): మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దేవకీదేవి అన్నారు. అక్కన్నపేట మండలం కట్కూర్లో మంగళవారం రుతు ప్రేమపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకర సమాజం దిశగా సాగాలన్నారు. రుతుస్రావం సమయంలో మహిళలు వినియోగించే శానిటరీ ప్యాడ్స్ డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పేరుకుపోతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భానోతు జయరాం, ఎంపీఓ మోహన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి స్వరూప, మహిళలు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు గుంటుకు శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యం–సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక.. ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొనగారి రాజు, సుఖేందర్‌రెడ్డి, గుంటుకు ఆంజనేయులు, మల్లేశం, మహేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ గజ్వేల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఏడీఏ బాబునాయక్ హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్‌లోని రైతువేదికలో విత్తన డీలర్ల సమావేశం నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ లైసెన్సులు కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయించినా, నకిలీ విత్తనాలను అమ్మినా సహించేదిలేదన్నారు. ప్రతి డీలర్ తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈవోలు, డీలర్లు పాల్గొన్నారు. -
సాగు పెంపునకు ఏం చేద్దాం?
గజ్వేల్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే ద్రాక్ష సాగుకు బీజం పడింది. 1890లో ఎనాబ్–ఇ–సాహి ద్రాక్ష రకాన్ని హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ బక్వీర్ అనే వ్యక్తి సాగు చేశారు. ఆ తర్వాత కాలం 1960లో దివంగత హార్టికల్చరిస్ట్ శంకర్పిల్లై ఇదే రకాన్ని అభివృద్ధి చేసి నగరంలో సాగు చేశారు. హెక్టారుకు 105 టన్నుల దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. దీని ద్వారా ద్రాక్ష సాగుకు తెలంగాణ పుట్టినిల్లుగా మారింది. ఇదే క్రమంలో పదిహేనేళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఈ తోటల సాగుకు ఆధారంగా ఉండేవి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా కొంత విస్తీర్ణం సాగయ్యేది. ఆయా జిల్లాల్లో మొత్తంగా ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటలు సాగులోకి వచ్చేవి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదపడే రకాలను ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే నిపుణులైన కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని ఎకరాకు రూ.10లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలు బాగానే గడించారు. ఆ తర్వాత కాలంలో తోటలు తెగుళ్ల బారిన పడటం వరుసగా చోటుచేసుకుంది. దీంతో రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రోత్సాహాం కరువైంది. ఈ దశలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు ద్రాక్ష తోటలను తొలగించి తమ భూములను ప్లాట్లుగా మార్చారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ, సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలుచేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ములుగు యూనివర్సిటీ పరిధి రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఇటీవల గ్రేప్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌హెచ్‌యూ మాజీ ఛాన్స్లర్ డాక్టర్ శిఖామణి, ద్రాక్ష సాగులో తనకుంటూ ప్రత్యేకతను చాటుకున్న మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగుపై తగ్గడానికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌కు సమీపంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలోని భూములన్నీ రియల్ వ్యాపారం కారణంగా బడా బాబులు చేతులకు వెళ్లిపోవడం, ద్రాక్ష సాగుకు కూలీలు సమస్యగా మారడం, పెట్టుబడి లక్షల్లో ఉండటం, ఎరువులు, క్రిమిసంహారకాల నిర్వహణ కష్టతరంగా మారడం వంటి కారణాల వల్ల క్రమంగా సాగు పడిపోతోంది. ఈ క్రమంలోనే ఏటా కొత్తగా ద్రాక్ష సాగు పెరిగేలా ఏంచేయాలనే అంశంపైనా కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు అవగాహన కల్పించి ఈ నేలలకు అనుకూలమైన రకాలను ఎంచుకొని సాగు చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. -
బందారం కథలలో తెలంగాణ జీవితం
సిద్దిపేటకమాన్: బందారం కథలలో తెలంగాణ జీవితం ఉన్నదని సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సిద్దారెడ్డి ‘బందారం కథలు’ పుస్తకావిష్కరణ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కథలు వస్తే పల్లె బతుకుల గుండె ఆవిష్కరణ అవుతుందన్నారు. సిదారెడ్డి పీడిత పక్షపాతి అన్నారు. సాహిత్యంలో మానవీయ సంబంధాలు ఉండాలని అన్నారు. ఈ పుస్తకం ద్వారా సాహిత్య చరిత్రలో బందారం గ్రామం నిలబడుతుందన్నారు. సభలో సిద్దారెడ్డి, మరసం అధ్యక్షుడు రంగాచారి, ప్రముఖ కవులు పొన్నాల బాలయ్య, అంజయ్య, యాదగిరి, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. మల్లన్న ఆలయ ఉద్యోగిపై కేసుకొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ప్లంబర్‌గా విధులు నిర్వహిస్తున్న సార్ల విజయ్‌కుమార్‌పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు. గత నెల 26న ఆలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆరెళ్ల మహేష్, ప్లంబర్ విజయ్‌కుమార్ గొడపడ్డారు. దీంతో సార్ల విజయ్‌కుమార్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై తనకు అన్యాయం జరిగిందంటూ.. ముందుగా విజయ్‌కుమార్ తనపై దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులకు విన్నపించారు. విషయాన్ని విచారించిన పోలీసులు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు.ఈ విషయం కొమురవెల్లిలో చర్చనీయాంశగా మారింది. -
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాస్థానం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణకు మల్లన్న ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు బందారం కవితల పుస్తకావిష్కరణ సిద్దిపేటకమాన్: తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన బందారం కథల పుస్తకావిష్కరణ మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు మంజీర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగాచారి తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి కవులు, సాహితీ వేత్తలు హాజరై విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, భగవాన్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేర్యాల(సిద్దిపేట): వేసవి కాలం దృష్ట్యా బస్సులో ప్రయాణం చేస్తూ బస్టాండ్‌లో వేచి చూసే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు అన్నారు. సోమవారం స్థానిక బస్టాండ్‌లో రూ.80వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన చల్లని నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు. జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి సిద్దిపేటరూరల్: మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ బీసీ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మనుచౌదరికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ మహనీయుల జయంతి ఉత్సవాలు జరిపేందుకు బడ్జెట్లో కనీసం నిధులు కూడా నామమాత్రంగానే కేటాయిస్తున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం లేదన్నారు. తమతో కలెక్టర్ స్పందిస్తూ పూలే జయంతి నిర్వహణకు బడ్జెట్ లేదన్నారన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పినప్పటికీ కలెక్టర్ నామమాత్రంగా స్పందించారన్నారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌గౌడ్ , జిల్లా ఇన్చార్జి మంత్రిగా బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీసీ మహానీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో శ్రీహరియాదవ్, ప్రభాకర్‌వర్మ, నవీన్‌గౌడ్, మామిండ్ల ఐలయ్య, ప్రశాంత్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. -
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
దుబ్బాక డబుల్ బెడ్రూంల వ్యూ అసంపూర్తిగా డబుల్ బెడ్రూంల నిర్మాణాలు ● పనులు పూర్తికాకుండానే అధిక పేమెంట్ ● అధికారుల పర్యవేక్షణ లోపం ● కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ● దుబ్బాక పట్టణంలో పేదల ఇళ్ల దుస్థితిదక్కించుకున్న పనులు పూర్తయి నెలలు గడిచినా ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రీవర్స్.. కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ పేమెంట్ల పేరుతో అధికారులు ఇష్టారాజ్యంగా చెల్లించారు. ఓ వైపు పనులు వంద శాతం పూర్తికాకున్నా.. చెల్లించాల్సిన వాటి కంటే ఎక్కువే పేమెంట్ చేశారు. దుబ్బాక పట్టణంలో 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను రెండు ఏజెన్సీలకు అప్పగించారు. అందులో 876 డబుల్ బెడ్రూంల నిర్మాణాలు జరగగా అందులో పది శాతం వరకు మైనర్ పనులు మిగిలే ఉన్నాయి. రెండేళ్ల కిత్రం పేమెంట్లు పూర్తి చేసినా సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడం గమనార్హం.రూ. 5.30లక్షల చొప్పున.. ఒక్కో డబుల్ బెడ్రూం నిర్మాణానికి రూ.5.30లక్షల చొప్పున చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులు సరిపోవని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు అడ్వాన్స్ పేమెంట్లు చేయించి నిర్మాణాలు ప్రారంభించారు. 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను సదరు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. కొంత స్థలం తక్కువగా ఉండటంతో 876 డబుల్ బెడ్రూంల పనులు ప్రారంభించారు. వీటి నిర్మాణాలకు రూ.46,42,80,000 అవుతుంది. అయితే రెండేళ్ల కిత్రం రూ.46,47,22,256 చెల్లించారు. ఒక వైపు వంద శాతం పనులు పూర్తి కానప్పటికీ రూ.4,42,256 అధికంగా చెల్లించారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే అధికంగా చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూంలలో పెండింగ్‌లో ఉన్న మైనర్ పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. సాక్షి, సిద్దిపేట: దుబ్బాక పట్టణం బల్వంతపూర్ రోడ్లో మోడల్ కాలనీగా 2017లో జీ ప్లస్ టూ తో డబుల్ బెడ్రూంల నిర్మాణాలను ప్రారంభించారు. వెయ్యి డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా 948 నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. అందులో బల్వంతపూర్ రోడ్లో జీ ప్లస్ టూతో ఒక్కో బ్లాక్‌లో 12 చొప్పున 66 బ్లాక్‌లు, మల్లయిపల్లి రోడ్లో ఏడు బ్లాక్‌లు ఇలా మొత్తంగా 876 డబూల్ బెడ్రూంల నిర్మాణాలు జరిగాయి. వీటిలో 588 డబుల్ బెడ్రూంలను లబ్ధిదారులకు అందించారు. ఇంకా 288 డబుల్ బెడ్రూంలలో పలు మైనర్ పనులు మిగిలిపోయాయి. డోర్లు, కిటికీలు, పెయింటింగ్, మరుగుదొడ్లు, కరెంట్ వైరింగ్ పనులు మిగిలిపోయాయి. మిగిలిన వాటికి లబ్ధిదారుల పేర్లను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. దీంతో నిరుపేదలు ఇంటి అద్దెను చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎక్కువ పేమెంట్ జరగలేదు దుబ్బాకలో నిర్మించిన డబుల్ బెడ్రూంల విషయమై కాంట్రాక్టర్‌కు ఎక్కువ పేమెంట్ చేయలేదు. రికార్డ్ చేసిన విధంగా బిల్లులను అందించాం. బెడ్రూంలలో అసంపూర్తిగా పనులు ఉంటే పరిశీలించి చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఇన్చార్జ్ ఈఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ -
స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో?
సాక్షి, వరంగల్: అడవుల్లో తుపాకీ పట్టి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు.. తనకు లొంగుబాటు సమయంలో ప్రకటించిన పునరావాస ఫలాల కోసం అధికారుల చుట్టూ 13 ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన పాశం స్వరూప ఆడవిలో దాదాపు తొమ్మిదేళ్లు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో చివరగా సిరొంచ కమాండర్‌గా పనిచేస్తూ 2012లో పోలీసులకు లొంగిపోయింది. ఆ సమయంలో పునరావాసం కింద 500 గజాల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూమి కేటాయించి నివేదిక సైతం ఇచ్చారు. కానీ అలాట్మెంట్ చేయలేదు. ఆమె కుటుంబపోషణ కోసం కొమురవెల్లి దేవస్థానం ప్రాంగణంలో కట్టెలు, పూలు అమ్ముకుంటూనే, జనజీవన స్రవంతిలో తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇస్తానన్న భూమి కోసం ఇంకా పోరాటం సాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి మరోసారి కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు తన బాధను ఏకరువు పెట్టుకున్నారు. ఇప్పటికై నా సంబంధిత పత్రాలు నాకు ఇచ్చి భూమి కేటాయించి నా కుటుంబానికి భరోసా ఇవ్వాలి’అని స్వరూప కన్నీటి పర్యంతమయ్యారు. -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం కావాలి
గజ్వేల్: సంపూర్ణ ఆరోగ్యమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, ఇందుకోసం వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గజ్వేల్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఆస్పత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం, నీరు, గాలికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ప్రజల్లో ఆరోగ్యంపై స్పృహను పెంచడమే లక్ష్యంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ రాము, డ్యూటీ డాక్టర్ నవ్యరావు, డాక్టర్ తర్జనితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య సేవలపై నిర్లక్ష్యం తగదు
సిద్దిపేటకమాన్: వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ పల్వన్‌కుమార్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం మన హక్కుగా సిబ్బంది భావించి వైద్య సేవలు అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా వ్యాధి నిరోధక టీకాలు సమయానికి అందించాలన్నారు. గర్బిణులకు, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి డీఎంహెచ్ఓ పల్వన్‌కుమార్ -
రాజ్యాంగం మార్చే కుట్ర
వర్గల్(గజ్వేల్): దేశంలో రాజ్యాంగం మార్చే కుట్ర జరుగుతోందని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడదామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో గ్రామస్థాయి పాదయాత్రను సోమవారం మండల కేంద్రం వర్గల్తోపాటు గౌరారంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తే ప్రజలు తరిమికొడతారని, మెల్లమెల్లగా వాటిని తీసే ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అక్కడ చెట్లు నరకలేదని, జింకలు, నెమళ్లను చంపలేదని స్పష్టం చేశారు. పదేళ్లు దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంలో కులగణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గురుకులం అందరిది ఒకే కులం అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు. పేదవారికి సన్నబియ్యం పంచిన ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. మన డబ్బు తింటూ ఫామ్‌హౌస్‌లో పడుకున్న వాళ్లను నిద్రలేపాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా వర్గల్లో సన్నబియ్యం లబ్ధిదారుడు అయ్యగల్ల యాదగిరి ఇంట్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులతో కలిసి కుటుంబీకులతో సహపంక్తి భోజనం చేశారు. పాదయాత్ర కార్యక్రమంలో ఆయనతోపాటు యూత్‌కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి రంగారెడ్డి, రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి, ప్రభుదాస్‌గౌడ్, భానుప్రసాద్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం సన్నబియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్‌దే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ -
నెత్తిన ‘బండ’
నేటి నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు● రూ.855 నుంచి రూ.905లకు చేరిన ధర ● జిల్లా వ్యాప్తంగా 3.23లక్షల కనెక్షన్లు ● ప్రతి నెలా రూ.సుమారు 75లక్షల భారం సాక్షి, సిద్దిపేట: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. కేంద్రం ఒక్కో సిలిండర్ పై ఏకంగా రూ.50లు పెంచింది. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ సిలిండర్ రూ.855 ఉండగా రూ.50లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ.905లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 3,23,500 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో ప్రతి నెలా ఒక్కో సిలిండర్ చొప్పున 1.5లక్షల మంది వినియోగిస్తున్నారు. దీంతో కుటుంబాలపై ప్రతి నెలా దాదాపుగా రూ.75లక్షల భారం పడనుంది. ఈ పెంపు ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్లకు సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.500లకు సిలిండర్‌ను అందజేస్తోంది. జిల్లాలో 1,62,257 మందికి రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ. 500లకు అందజేస్తున్న సిలిండర్ ధరను సైతం రూ.550లకు పెంచడంతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు పెంచుతుందా? అనే నిర్ణయం తేలాల్సి ఉంది. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ ధర ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా పడనుంది. -
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోదీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రధాని మోదీ దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మొదట ఇద్దరు ఎంపీలతో మొదలైన పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి చరిత సృష్టించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌ను కలిసిన సూర్యవర్మ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జిల్లా ఆర్టీఏ (రీజినల్ ట్రాన్స్పోర్ట్ అఽథారిటీ) సభ్యు డు డాక్టర్ సూర్యవర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారన్నా రు. యువతకు ప్రతినెలా తప్పకుండా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పోలీసు వ్యవస్థకి ప్రజలకి వారధిలా ఉండాలని సూచించారన్నారు. ట్రైకార్ రుణాలువిడుదల చేయండి హుస్నాబాద్: బకాయి పడిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలు వెంటనే విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా గిరిజన యువతి, యువకుల నుంచి వేలాదిగా దరఖాస్తులు స్వీకరించిందన్నారు. అందులో నుంచి కొంత మందికి రుణాలు మంజూరు చేస్తూ లబ్ధిదారులను గుర్తించిందన్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి చెక్‌లను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందన్నారు. ప్రస్తుతం వీరందరూ రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే రుణాలు తీసుకున్నట్లుగా చూపిస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో గిరిజన సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని సత్యం నాయక్ హెచ్చరించారు. సమావేశంలో లంబాడి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు భూక్యా కృష్ణ నాయక్, నాయకులు ఉన్నారు. దుర్గమ్మా.. దండాలమ్మాపాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అమ్మవారిని పూజారులు పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
‘నెక్లెస్’ సుందరం.. నడక భయానకం
కోమటి చెరువు (నెక్లెస్ రోడ్డు)పై నడక భయానకంగా మారుతోంది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్‌పై మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు అక్కడే మకాం వేస్తున్నారు. అంతేకాక తాగిన సీసాలను పగులగొట్టి విచ్చలవిడిగా పారేస్తున్నారు. రోజూ తెల్లవారుజామునే సుమారు 500 మందికిపైగా వాకర్స్ నెక్లెస్ రోడ్డుపై నడక సాగిస్తుంటారు. గాజు సీసాలను కొందరు గమనించక గాయాలపాలవుతున్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి మందుబాబులను కట్టడి చేయాలని వాకర్స్ కోరుతున్నారు. –సిద్దిపేటజోన్ -
చెత్త.. నో చింత!
తిలకించి.. పులకించిరాములోరి కల్యాణంకమనీయం.. వైభవంగా శ్రీరామనవమి వేడుకలుఎక్కడికక్కడే శుద్ధి ● సిద్దిపేట బల్దియా వినూత్న ఆలోచన ● స్వచ్ఛత లక్ష్యంగా అడుగులు ● మరిన్ని కంపోస్టు యార్డులఏర్పాటుకు చర్యలుస్మార్ట్ సిటీ లక్ష్యంగా సిద్దిపేట బల్దియా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. చెత్త సేకరణ ప్రక్రియ సత్ఫలితాలు అందిస్తున్న క్రమంలో మరింత స్వచ్ఛత కోసం పారిశుద్ధ్య విభాగం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడికక్కడే చెత్తను శుద్ధి చేసేందుకు సంకల్పించింది. వార్డుల్లో సేకరించిన తడి చెత్తను సుదూరంలో ఉన్న కంపోస్టు యార్డులకు తరలించడం పారిశుద్ధ్య విభాగానికి సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి చెత్తను అక్కడే పునర్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో పలుచోట్ల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం అందించారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో రికార్డుల ప్రకారం ప్రతి రోజు 25మెట్రిక్ టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతోంది. సేకరించిన తడి చెత్తను ప్రస్తుతం మందపల్లి, పశువుల ఆస్పత్రిలో, లింగారెడ్డిపల్లి, స్వచ్ఛబడిలోని ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. బల్దియాలో 43 వార్డులు ఉండడం, విలీన వార్డులు పట్టణానికి సరిహద్దుల్లో ఉన్న నేపథ్యంలో తడి చెత్త తరలింపు అంశం బల్దియాకు వ్యయ ప్రయసాలతో కూడుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికుల మీద వత్తిడి పడకుండా అదనంగా కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మున్సిపాలిటీ గుర్తించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వేసవిలో మరో చిక్కు.. వేసవిలో పారిశుద్ధ్య విభాగానికి కొత్త చిక్కు ఏర్పడుతోంది. హరిత సిద్దిపేట దిశగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. దీంతో వేసవిలో ఎండు ఆకుల సమస్య ఏర్పడుతోంది. పెద్ద ఎత్తున రోజూ ఎండిన ఆకులను ట్రాక్టర్ల కొద్దీ సేకరించి కంపోస్టు యార్డులకు తరలించాల్సి వస్తోంది. తరలించిన ఎండు ఆకులను సేంద్రియ ఎరువుల తయారీలో వాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎక్కడికక్కడే కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయడమే మేలని బల్దియా భావిస్తోంది. రెండు లక్షల కిలోల విక్రయాలు.. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లలో ఇప్పటివరకు సుమారు రెండు లక్షల 30 వేల కిలోల సేంద్రియ ఎరువును విక్రయించారు. వర్మీ కంపోస్టు ఎరువు కిలో రూ.10కాగా, సెమి వర్మీ కంపోస్టు ధర 3 నుంచి 4 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై ఫోకస్ పెట్టడం విశేషం.పార్కుల్లో ప్రాసెసింగ్ యూనిట్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్కుల్లో తడి చెత్తను వర్మీ కంపోస్టుగా మార్చే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా హౌసింగ్ బోర్డ్, మైత్రి వనం, నెహ్రు పార్కు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎర్ర చెరువు, కోమటి చెరువు, నర్సాపూర్ చెరువు ప్రాంతాల్లో పార్కుల్లో కంపోస్టు యార్డుల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అందుకు అవసరమైన ప్రక్రియ పనులను మున్సిపల్ అధికారులు వేగవంతం చేస్తున్నారు. సౌలభ్యం కోసమే.. ఎక్కడి చెత్తను అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే 4చోట్ల యూనిట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. – ఆశ్రిత్ మున్సిపల్ కమిషనర్ -
కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం
● రుక్మాభట్ల గేయ రామాయణం అద్భుతం ● ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటజోన్: కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలీల గేయ రామాయణ వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహా స్వామిని శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రుక్మాభట్ల గేయ రామాయణం రచించి తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారం తీసుకున్న రుక్మాభట్లకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పాత తరం వాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట ఎందరో గొప్ప వారిని అందించిందని కళలకు కాణాచిగా అభివర్ణించారు. ఆధునిక యుగంలో మరుగున పడిపోయిన కళలు, సంప్రదాయాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా రుక్మాబాట్ల గేయ రామాయణ గానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. అన్నదాతలకు ఇబ్బందులు రావొద్దు సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐకేపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సేకరణకు ఒక్క పైసా ఇవ్వలేచిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లాలోని ప్రాజెక్టుల కింద చిన్న కాలువల కోసం భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని చౌడారం మీదుగా బిక్కబండకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం భూసేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ఎడాదిన్నర కాలంలో ఒక్క ఎకరా కూడా ప్రాజెక్టుల కింద భూసేకరణ చేయలేదన్నారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇది కేసీఆర్ ఘనత అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాలువలు నిర్మించే వరకు పోరాడుతాం
దుబ్బాకరూరల్: నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూర్తి చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోతారం గ్రామంలో ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇంకా అక్కడక్కడా కాలువలు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేసే దాకా పోరాడుతానని తెలిపారు. శ్రీరామనవమి రోజున తన సొంత గ్రామమైన పోతారం చెరువుకు నీళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిండిన చెరువును పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం దుబ్బాక: క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు నియోజక వర్గం నుంచి భారీ సంఖ్యలో శ్రేణులు హాజరుకావాలన్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు అంకుఠిత దీక్షతో పనిచేయాలన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బానాల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి -
జగ్జీవన్‌రాంకు ఘన నివాళి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్‌రాం 118వ జయంతి ఉత్సవాలను సిద్దిపేటలో శనివారం ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్‌రాం విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సుభాష్ చంద్రబోస్, అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, ఉపాధ్యాయ, కులసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకు ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జగ్జీవన్ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఆర్ఓ నాగరాజమ్మ, ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి హమీద్, పెర్క పర్శరాములు, లింగంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దళిత సంఘాల నాయకుల నిరసన డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలలో సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ఇతర జిల్లా స్థా యి నాయకులు పాల్గొనలేదని దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. -
ఇక ఆస్తుల విస్తీర్ణం డిజిటలైజేషన్
ఇళ్లు, స్ధలాల వివాదాలకు చెక్ ● సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డు ● మాస్టర్ ప్లాన్‌కు సులభతరం ● పారదర్శకంగా ఇంటి పన్నుల కుదింపు ● మున్సిపాలిటీకి పెరగనున్న ఆదాయంహుస్నాబాద్: ఇక ముందు రెవెన్యూ రికార్డులు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు, వివాద స్ధలాలకు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్షా) కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి, విస్తీర్ణాన్ని నక్షా సర్వేతో జల్లెడ పట్టి డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నారు. ప్రతి ఇంటి యజమానికి ఆస్తి హక్కును కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఉంది. హుస్నాబాద్‌లో మున్సిపల్ రికార్డుల ప్రకారం 7,343 ఇళ్లు ఉన్నాయి. నక్షా ఏరియల్ సర్వేతో ఆస్తుల విస్తీర్ణాన్ని డిజిటల్ పద్ధతిలో నమోదు చేయనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు ఉండే పట్టణాలు, ఇరుకుగా ఉండే చోట్ల హెలికాప్టర్‌ను ఉపయోగించి వాటికి ప్రత్యేకమైన కెమెరాలను బిగించి సర్వే పూర్తి చేశారు. పట్టణంలో 48 చోట్ల సర్వే సరిహద్దులను ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వే ద్వారా పట్టణ విస్తీర్ణాన్ని నిర్ధారించి కచ్చిమైన పట్టణ మ్యాప్‌ను తయారు చేయనున్నారు. ప్రతి ఇంటికి త్రీడీ కెమెరాతో మ్యాపింగ్ చేస్తారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌కు సులభతరం మౌలిక వసతుల కల్పన, రోడ్లు, మంచి నీటి సౌకర్యం, ఇలా పలు అంశాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మాస్టర్ ప్లాన్ అవసరం. ప్రస్తుత నక్ష ప్రకారం ఇళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలు, రహదారులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్ధలాల ఆస్తుల లెక్కలు పక్కాగా తెలుస్తోంది. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సర్వే కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఇంటింటికి తిరిగి ఇంటి ఆస్తుల వివరాలను పూర్తి స్ధాయిలో సేకరించనున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నారు. ఆస్తి పన్నుల లెక్కా పక్కా నక్షా సర్వే ద్వారా ప్రతి ఇంటి ఆస్తి వివరాలు గుర్తిస్తారు. ప్రస్తుతం ఒక ఇంటి (గ్రౌండ్ ఫ్లోర్)అనుమతితో రెండు, నుంచి మూడు ఫ్లోర్లు వేస్తున్నారు. మున్సిపల్ రికార్డులో ఎన్ని అంతస్తులు ఉన్న ఒక ఇంటికే పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం ఏడాది ఇంటి పన్నుల వసూళ్లు రూ.1.72 కోట్లు ఉండగా, ఈ సర్వేతో ఆదాయం రెట్టింపు కానుంది. ఈ సర్వే ద్వారా బహుళ అంతస్తుల లెక్క తేలుతుంది. ఆస్తి పన్నును మదింపు చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు ప్రస్తుతం ప్రతిదానికి ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ తరహాలోనే ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు ఇవ్వబోతున్నారు. ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పూర్తి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్నుల వివరాలు, విస్తీర్ణం, భూముల సర్వే నంబర్లు, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా పూర్తి స్ధాయి వివరాలు ప్రాపర్టీ కార్డులో ఉంటుంది.సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళికనక్షా సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళిక రూపొందుతుంది. ప్రతి ఇంటి ఆస్తి హద్ధు లు నిర్ణయిస్తాం. యజమానికి ఆస్తి హక్కును కల్పిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో దోహదపడుతుంది. ఆస్తి పన్నుల నిర్ణయంతో పారదర్శకంగా ఆదాయాన్ని పెంచుకునే వీలు ఉంటుంది. ప్రతి ఇంటికి ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నాం. ఈ కార్డుతో రుణాలు పొందవచ్చు. – మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ -
సన్‌ఫ్లవర్ రైతులను ఆదుకోండి
మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే హరీశ్ విజ్ఞప్తిసిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండల రైతుల సమస్యలను తెలుసుకున్న హరీశ్.. మంత్రికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మండలంలోని రైతులు 18 వేల క్వింటాళ్ల దిగుబడి సన్ ఫ్లవర్ సాగు చేసినట్టు పేర్కొన్నారు. అందులో 5 వేల క్వింటాళ్లు పీఏసీఎస్ ద్వారా, మరో 2 వేల క్వింటాళ్లు మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిగతా 11 వేల క్వింటాళ్ల సన్‌ఫ్లవర్ మిగిలిందని, దీనితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడు చూపిన మార్గం అనుసరణీయం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆదర్శప్రాయుడు శ్రీరాముడు చూపిన మార్గం మనందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కంటే బాధ్యత గొప్పద న్నది రామతత్వం, కష్టంలో కలిసి నడవాల న్నది సీతాతత్వం అన్నారు. శ్రీరాముడు కష్టా ల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారన్నారు. మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారన్నారు. శ్రీరాముని అనుగ్రహంతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. -
అంకిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్ పట్టా
కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన తోట శారద పేదరికం, అంగవైకల్యాన్ని జయించి కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టానందుకున్నారు. ఆమెది పేద కుటుంబం. ఐత చంద్రయ్య సాహిత్యం సమగ్ర పరిశీలన అంశంపై యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసింది. శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టరేట్‌ను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లి పట్టాను దక్కించుకుంది. దీంతో గ్రామస్తులు శారదకు అభినందించారు. శ్రీరామనవమికి నాచగిరి సిద్ధం నేడు సీతారాముల కల్యాణం వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలోని శ్రీరామాలయం శ్రీరామనవమి మహోత్సవానికి ముస్తాబైంది. శ్రీలక్ష్మీ నృసింహుని గర్భగుడి చెంతనే గుహలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి, ఆ పక్కనే ఆంజనేయ స్వామి కొలువుదీరారు. ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో విశాలమైన కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటలకు జగదభిరాముని కల్యాణోత్సవం జరుగుతుంది. భక్తజనులు కల్యాణ మహోత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించాలని ఆలయ ఈఓ విశ్వనాథశర్మ కోరారు. కొమురవెల్లి ఈవోగా అన్నపూర్ణ నియామకంకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నూతన ఈవోగా అన్నపూర్ణను నియమించారు. ఈ మేరకు దేవాదాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆలయ ఈవోగా పని చేస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. సోమవారం అన్నపూర్ణ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త పెన్షన్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం: చంద్రారెడ్డిప్రశాంత్నగర్(సిద్దిపేట): కొత్త పెన్షన్ సవరణ బిల్లును తీసుకురావడంతో ప్రస్తుత పెన్షనర్ల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని, అందువల్ల కొత్త పెన్షన్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దామని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సవరణతో భవిష్యత్‌లో పాత పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులను రెండుగా విభజించనున్నట్లు తెలిపారు. దీంతో పెన్షన్‌దారులకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కేంద్రం వెంటనే కొత్త పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కల్పించాలి హుస్నాబాద్‌రూరల్: వడ్లకు ప్రభుత్వ మద్ధతు ధర చెల్లించాలని రైతులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. హుస్నాబాద్‌లో వ్యాపారులు రైతుల నుంచి పచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు రూ.1,900లు చెల్లిస్తామని చెప్పిన వ్యాపారులు తూకం వేసిన తర్వాత రూ.1760లు చెల్లించడంతో రైతులు గోమాత మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. మద్ధతు ధర రూ.2,330లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభ్యున్నతే ధ్యేయం గజ్వేల్‌రూరల్: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తున్నదని ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో సన్నబియ్యం పంపిణీని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, గణేశ్, కరుణాకర్, మహేశ్, నర్సిహులు, సురేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో uపంట నష్టానికి పరిహారమేదీ?అకాల వర్షాలతో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు గజ్వేల్: అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం సహజ పరిణామంగా మారుతోంది. ఈనెల 3న కురిసిన వర్షాలకు జిల్లాలోని వందలాది ఎకరాల్లో ప్రధాన పంటలకు నష్టం జరిగింది. అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికలు పంపినా.. పరిహారం అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం పంటల బీమా పథకం అమలై ఉంటే రైతులకు కొంత ఉపశమనం కలిగేది. కానీ ప్రభుత్వం నుంచి పరిహారం రాక, బీమా సౌకర్యం అమలుకు నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 3.52 లక్షల ఎకరాల్లో వరి, 22వేల ఎకరాల్లో మొక్కజొన్న, 11వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మరో 5వేల ఎకరాల్లో ఇంతర పంటలు సాగులోకి వచ్చాయి. పంటలు చేతికొచ్చే సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వరి, మొక్కజొన్న పంటలకు వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్షం ధాటికి గెలలు కట్టిన వరి నేలవాలి వడ్లు పూర్తిగా రాలిపోయాయి. చేతికందే దశలో మొక్కజొన్న పంట సైతం నేలవాలి కంకులు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో రైతుకు లక్షల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నివేదికలకే పరిమితం అకాల వర్షాలు కురిసిన సందర్భంలో వ్యవసాయాధికారులు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి పరిమితమవుతున్నారనే తప్పా.. పరిహారం మాత్రం అందటం లేదు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నది. ప్రస్తుతం కూడా పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. న్యూస్‌రీల్ బీమా లేక ఏటా తప్పని ఇబ్బందులు రైతన్నను నిండా ముంచిన వర్షాలు -
జూన్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
● ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం ● ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో నంగునూరు మండలం నర్మేటలో నిర్మి స్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జూన్‌లో ప్రారంభిస్తామని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, ఎల్లాయిగూడ, రంగ నాయకసాగర్లోని ఆయిల్‌పామ్ నర్సరీల స్థితిగతులను, పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. సిద్దిపేట, జనగామ జిల్లాల వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన ఆయిల్ గెలలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న నిర్మా ణం పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు జనగామ, సిద్దిపేట జిల్లాలోని భూములు అనువుగా ఉన్నాయని, పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. చిన్న, చిన్న పనులను పూర్తి చేసి జూన్ నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్య
సిద్దిపేటరూరల్: ఉరేసుకొని యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పుల్లూరుకు చెందిన కర్రె సంజీవ్(18) వారం రోజుల కిందట స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో తండ్రి బాలయ్యతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి ఓ వ్యక్తి వచ్చి సంజీవ్ ఉన్నాడా.. అని తండ్రిని అడిగాడు. ఇంట్లో పడుకున్నాడని చెబుతూ గది తలుపులు తెరిచి చూడగా సంజీవ్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. సంజీవ్ దొంగతనం చేసిన విషయం చిన్న కుమారుడు తండ్రికి చెప్పాడు. నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తన కుమారుడి మరణంపై ఎలాంటి అనుమానం లేదని బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒకే తాటిపైకి రెవెన్యూ ఉద్యోగులు
● భూభారతితో రైతులకు మెరుగైన సేవలు ● త్వరలో అవుట్ సోర్సింగ్‌కు శుభవార్త ● ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ● ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేటఅర్బన్: రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకూ భరోసా ఉంటుందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సంబంధించి త్వరలోనే ప్రభు త్వం శుభవార్త చెబుతుందని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖల్లోకి వస్తున్న గ్రామ పరిపాల న అధికారులు (జీపీవో) సర్వీసుపరమైన అభద్రత కు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వీరందరికి కామన్ సర్వీస్, పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడం వల్ల రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయని ఆయన వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను క్రమంగా సాధించుకుంటున్నామని, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూభారతి చట్టంతో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, టీజీజీఏ జనరల్ సెక్రెటరీ పూల్‌సింగ్, టీ జీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.రాంరెడ్డి, భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనం గౌడ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, సీసీఎల్ఏ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణచైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేశం, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
కోహెడరూరల్(హుస్నాబాద్): ప్రతి వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం మండలంలోని చెంచెల్ చెర్వుపల్లిలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో శ్రమించి రాసిన రాజ్యాంగం పట్ల కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరిస్తూ మందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. -
సాగునీటి ఇబ్బందులు తలెత్తొద్దు
● కాలువల పనులు వేగిరం చేయాలి ● నీటిపారుదల సమీక్షలో హరీశ్‌రావు సన్‌ఫ్లవర్ కేంద్రాలు కొనసాగించండి సిద్దిపేట రూరల్: సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు కొనసాగించేలా చొరవ చూపాలని కలెక్టర్ మనుచౌదరిని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శుక్రవారం కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ ప్రాంత రైతులు సన్ ఫ్లవర్ పెద్ద ఎత్తున సాగు చేసినట్లు వివరించారు. కాళేశ్వరం కాలువల నిర్మాణాలకు భూసేకరణలో జాప్యం జరుగుతోందని, పనులను వేగవంతం చేయాలని కోరారు.సిద్దిపేటజోన్: రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మల్లన్న, రంగనాయకసాగర్ కాల్వల స్థితిగతులు, నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ వచ్చే యాసంగి పంట వరకు శాశ్వతంగా కాల్వలు ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇర్కోడ్ లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సాగునీటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. పాలనలో సీఎం ఫెయిల్ భూముల అమ్మకాల పేరిట మూగ జీవాల గోస పోసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డిని చివరికి మూగ జీవాలు కూడా క్షమించవని హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన వరంగల్ రజతోత్సవ సభసన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా పేరిట విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలను నాశనం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి పాలన ఫెయిల్ అయ్యిందని, ఆయనను తిట్టని ఊరు లేదన్నారు. రుణమాఫీ అమలు సగం వరకు సాగిందని, ఇక కాదని సీఎం చేతులు ఎత్తివేశారని విమర్శించారు. వానాకాలం రైతుబంధు లేదన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేయడం రావట్లేదని, ఆయన మాటలు అన్ని బోగస్ అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల చేర్యాల, మద్దూరు, బచ్చన్న పేట, జనగామలలో 50 వేల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి రంగనాయకసాగర్ లోకి నీళ్లు తేవడం వల్లే సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని, ప్రభుత్వ వైఫల్యాలను వరంగల్ సభలో ఎండగడతామన్నారు. -
నాణ్యమైన భోజనం అందించండి
● విద్యార్థుల కోసం పోచమ్మ ఆలయం వద్ద బస్సులు ఆపండి ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ● బాలికల వసతి గృహం తనిఖీప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలోని మెదక్ రోడ్డు పోచమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలంటూ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్.. డీఎంకు ఫోన్లో సూచించారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల బీసీ వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోచమ్మ ఆలయం వద్ద బస్సుల నిలుపడంలేదని దృష్టికి తెచ్చారు. వెంటనే అదనపు కలెక్టర్ స్పందిస్తూ డీఎంతో ఫోన్లో మాట్లాడారు. అలాగే మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా? అని తెలుసుకున్నారు. ఇరుకుగదులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలుపగా, త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం పెంచాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు. స్టోర్ రూంలో బియ్యం, కూరగాయలు, ఇతర అహార పదార్థాలను పరిశీలించారు. బియ్యం నిల్వల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వార్డెన్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, సిద్దిపేట అర్బన్ తహశీల్దార్ సలీం తదితరులు పాల్గొన్నారు. -
● కొందరు ఆర్థిక ఇబ్బందులతో దూరం ● పైలెట్ ప్రాజెక్ట్‌గా 26 మండలాల్లో26 గ్రామాలు ఎంపిక ● ముగ్గు పోసింది 2,667 మందిలో 533 మందే ● ఇప్పటి వరకు బేస్మింట్ లెవల్ వరకు నిర్మించింది 78 ఇళ్లే
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముందడుగు పడటం లేదు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి అర్హులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లోని 26 గ్రామాల్లో 2,667 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలతో పలువురు లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. – సాక్షి, సిద్దిపేట ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి మాకు సొంత ఇల్లు లేదు. ఇటీవల ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అయితే ఇసుక సమస్య ఉండటం వల్ల ఇంటి నిర్మాణం ప్రారంభించడం ఆలస్యం అవుతోంది. అధికారులు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తే మాకు ఆర్థికంగా భరోసా కల్పించినట్లు అవుతుంది. – పొన్నబోయిన యాదయ్య, లబ్ధిదారుడు, ధర్మారంజిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 533 మంది మాత్రమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. అందులో ఇప్పటి వరకు 78 గృహాలు మాత్రమే బెస్మింట్ స్థాయి వరకు నిర్మించారు. మంజూరు పత్రాలను అందజేసి 75రోజులవుతున్నా చాలా మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించలేదు. ప్రస్తుతం నిర్మించే వారికి మొదటి బిల్లు రాగానే ప్రారంభిస్తామని.. మరి కొందరు ఇసుక కొరతతో.. ఇంకొందరు ముగ్గు పోసినా ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 2.30లక్షల మంది దరఖాస్తు జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం 2,30,483 మంది దరఖాస్తు చేశారు. వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. సొంత ఇంటి స్థలం ఉండి పక్కా ఇల్లు లేనివారు 76,337 మంది. అసలే ఇంటి స్థలం లేనివారు 34,404. అనర్హులుగా 1,19,742 మందిని గుర్తించారు. వీరిలో ప్రభుత్వం మంజూరు చేసే నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో ఎంపిక చేయనున్నారు. 400 నుంచి 600 ఫీట్లలోపు స్థలంలోనే ఇంటి నిర్మాణం సడలింపు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.●ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు ఇంటి నిర్మాణం బెస్మింట్ లెవల్ వరకు నిర్మించిన వారికి మొదటి బిల్లు కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. త్వరలో మొదటి బిల్లు బ్యాంక్ అకౌంట్లో జమఅవుతాయి. కొంత మంది మంచి ముహూర్తాలు లేవని కొందరు, పాత ఇంటినికూల్చివేసేందుకు ఇంకొందరు సమయం తీసుకుంటున్నారు. – దామోదర్, పీడీ, హౌసింగ్ -
దెబ్బతిన్న పంటల పరిశీలన
గజ్వేల్: మండల పరిధి ధర్మారెడ్డిపల్లి, సంగుపల్లి, కోమటిబండ, జాలిగామ, గజ్వేల్ పట్టణ శివార్లలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రాథమిక అంచనాల ప్రకారం మొక్కజొన్న 54, వరి 126 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. వర్గల్ మండలంలో.. వర్గల్(గజ్వేల్): అకాల వర్షాలు, గాలివాన, వడగళ్ల కారణంగా వర్గల్ మండలంలో దెబ్బతిన్న పంటలను, ఉద్యాన తోటలను శుక్రవారం వ్యవసాయ, ఉద్యాన అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయాధికారి శేషశయన, ఉద్యాన అధికారి రమేష్, ఏఈఓలతో కలిసి నెంటూరు, జబ్బాపూర్, మైలారం, చౌదరిపల్లిలో మొక్కజొన్న పైర్లు, కూరగాయలు, పండ్ల తోటలు పరిశీలించారు. మైలారంలో గాలివాన తాకిడికి శేఖర్‌కు చెందిన మొక్కజొన్న చేలు నేలకొరిగింది. చౌదరిపల్లి సమీప మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. పంట నష్టం 33 శాతం లోపే ఉందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. -
జీవజాతులను కాపాడుకుందాం
● పర్యావరణంతోనేమానవజాతికి మనుగడ ● సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా జీవజాతులను గుర్తించి పరిరక్షించవచ్చని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) హైదరాబాద్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. పర్యావరణ సమతుల్యత సమగ్రాభివృద్ధి అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించి పోతున్న జీవజాతులను పరిరక్షించుకోవాలని తద్వారా పర్యావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ జీవజాతులను కాపాడుకునేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. వరల్డ్‌వైడ్ లైఫ్ ఫండ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల మాట్లాడుతూ పర్యావరణం బాగుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందన్నారు. ప్రొఫెసర్ రామనాథన్ మాట్లాడుతూ నీటి కాలుష్యంతో సముద్రంలోని జీవజాతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. సముద్రజీవజాతులకు పొంచి ఉన్న ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ సదస్సుకు ఆయా రాష్ట్రాల నుంచి పరిశోధనా పత్రాలు వచ్చాయాన్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు ప్రదర్శించిన వాల్‌పోస్టర్లను పరిశీలించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. -
చదువుతోపాటు నైపుణ్యం ముఖ్యం
● కష్టపడితే ఏదైనా సాధ్యమే ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● నాగసముద్రాలలో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణకోహెడరూరల్(హుస్నాబాద్): విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడిపిన బాపూజీ విగ్రహాన్ని పాఠశాలలో ఆవిష్కరించుకోవడం ఆభినందనీయమన్నారు. మహనీయుల నుంచి స్ఫూర్తిని పొంది ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధనకు నిరంతరం కష్టపడాలన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే 32 మండలాలకు గాను 29 మోడల్ స్కూల్ లు తీసుకువచ్చానన్నారు. స్కూల్స్‌లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వాతంత్య్ర చరిత్ర, తెలంగాణ ఉద్యమం, సైన్స్‌లపై అవగాహన అవసరమన్నారు. విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రోజు జరుగుతున్న అంశాలపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్‌రెడ్డి, గాంధీ జ్ఞాన్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఆర్డీఓ రామూర్తి, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ కృష్టయ్య తదితరులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచండిహుస్నాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. తెలంగాణ భవిష్యత్‌కు విద్యార్థులే ఆస్తి అని అందరూ బాగా చదువుకొని భవిష్యత్‌కు పునాదులు వేయాలని మంత్రి కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎంఈఓ బండారి మనీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమేనని, వారిలో సృజనాత్మకత పెంపొందించాలని డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుద్దెడలోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలు, పాటలను నేర్పించాలని అన్నారు. పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా సర్కారు బడులకు పంపేలా తల్లిదండ్రులు, యువకులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆయిల్‌పామ్ పంట కోత షురూ గజ్వేల్: మండల పరిధి అక్కారంలో మొదటి కోతకు వచ్చిన లక్ష్మణ్ ఆయిల్‌పామ్ తోటను ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఏడీఏ బాబునాయక్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పంట కోతను ప్రారంభించారు. నాలుగేళ్లుగా సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ తొలిసారి కోతకు రావడం పట్ల రైతు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈవోలు జ్యోతి, మాధవి, ఆయిల్ఫామ్ ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వీహెచ్ ప్రత్యేక పూజలు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఽశుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు హనుమంతరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ సతీష్, మహేందర్‌రావు, దాస అంజయ్య, భిక్షపతి, అర్జున్ పాల్గొన్నారు. యశోదారెడ్డి కథలు భావితరాలకు స్ఫూర్తి సిద్దిపేటఎడ్యుకేషన్: యశోదారెడ్డి కథలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ రాజిరెడ్డి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శుక్రవారం తెలుగు శాఖ ఆధ్వర్యంలో యశోదారెడ్డి కథాసాహిత్యంపై విస్తృతోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజిరెడ్డి మహేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 60 ఏళ్ల క్రితమే తెలంగాణ భాషను, సంస్కృతిని పరిరక్షించే దృక్పథంతో యశోదారెడ్డి రాసిన కథలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. తెలంగాణ భాషాసంస్కృతి పరిరక్షణకు కృషిచేసిన వారిలో యశోదారెడ్డి ముందువరుసలో ఉంటారన్నారు. ఎచ్చమ్మ కథలు, మాఊరి ముచ్చట్లు తదితర కథలను విద్యార్థులు చదివి వాటిపై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరన్నారు. కళాశాల తెలుగుశాఖ అధ్యక్షులు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యశోదారెడ్డి సాహిత్యసృజన తెలంగాణ భాషకు, యాసకు జీవగర్ర, పుట్టు కుల్లలు అని కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు పిట్లదాసు, నారోజు వెంకటరమణ, నరేష్, శైలజ, సంపత్‌కుమార్, రామస్వామి, నర్సింలు, సాయిసురేశ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
సిరుల ‘బ్రహ్మోత్సవం’
నాచగిరికి రూ.16 లక్షల ఆదాయం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహుని నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కాసుల వర్షం కురిపించాయి. గత నెల 19 నుంచి పన్నెండు రోజులపాటు కొనసాగిన ఉత్సవాలలో ఆలయానికి రూ.16.13 లక్షల ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దర్శనం, అభిషేకం, అర్చన, సేవా టికెట్లు తదితర సేవల ద్వారా మొత్తం రూ.16,13,328 ఆదాయం లభించినట్లు ఈఓ విశ్వనాథశర్మ పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం నంగునూరు(సిద్దిపేట): చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ అఽథారిటీ సర్వీసెస్ కార్యదర్శి స్వాతిరెడ్డి సూచించారు. గురువారం అక్కెనపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు బానిసలుగా మారితే జీవితం నాశనమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా షీటీమ్, సైబర్ నేరాలు, నూతన చట్టాలు, ఈవ్‌టీజింగ్, పోక్సో, సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలపై ఎస్ఐ ఎండీ ఆసిఫ్ వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించండినంగునూరు(సిద్దిపేట): విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందజేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం నర్మేట కస్తూర్భాగాంధీ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం, గోదాంలో నిల్వ ఉన్న కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని ఆరా తీశారు. ఆమె వెంట డీపీఓ దేవకీదేవి, తహసీల్దార్ సరిత, ఎంఈఓ దేశిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణప్ప, స్పెషలాఫీసర్ తదితరులు ఉన్నారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యం కావాలి: డీఈఓ మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రేబర్తి, గాగ్గిళ్లాపూర్ గ్రామాల్లోని పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యా సంవత్సరం క్యాలెండర్ అమలు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధనపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.అనంతరం రేబర్తి పాఠశాల వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారికి అధించారు. 6 నుంచి బీజేపీ ఆవిర్భావ వేడుకలు జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శంకర్ మాట్లాడారు. ఈనెల 6న జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. 7న ప్రతి క్రియాశీల కార్యకర్త ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 8,9తేదీలలో మండలాల వారీగా క్రియాశీల సభ్యులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. 10, 11, 12న గావ్ ఛలో, బస్తీచలో అభియాన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో వివిధ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
● తడిసిన పొద్దు తిరుగుడు ధాన్యం ● ధర్మారెడ్డిపల్లిలో కూలిన కోళ్ల ఫారం షెడ్డు ● 1,500 కోళ్లు మృతి గజ్వేల్‌రూరల్: గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో చేతికందిన పంటలు నేలకూలాయి. మరో పది రోజుల్లో చేతికందుతాయనుకున్న వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలు గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలవాలాయి. అంతేగాకుండా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోగల మామిడి తోటలు సైతం దెబ్బతిన్నాయి. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయించేందుకు తీసుకువచ్చిన పొద్దు తిరుగుడు ధాన్యం తడిసిపోయింది. ఇదిలా ఉంటే గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో పౌల్ట్రీ రైతు లింగాల శ్రీనివాస్‌గౌడ్‌కు చెందిన కోళ్ల ఫారంలోని పైకప్పు రేకులు వర్షానికి కూలిపోవడంతో అందులో ఉన్న సుమారు 1500 వరకు కోళ్లు మృతి చెందగా, మరో వెయ్యి కోళ్ల వరకు గాయపడ్డాయని బాధిత రైతు వాపోయాడు. పలుచోట్ల వడగళ్లు వర్గల్(గజ్వేల్): మండలంలో గురువారం సాయంత్రం పలుగ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. జబ్బాపూర్, నెంటూరు, మైలారంలో వడగళ్లు పడ్డాయి. గాలివాన తోడవడంతో వరిపైర్లు నేలవాలాయని రైతులు తెలిపారు. గౌరారం రాజీవ్‌రహదారిపై వరద ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెంటూరు వద్ద గాలిదుమారానికి రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలాయి.గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై వరద ప్రవాహం -
నీరివ్వకుంటే ఉద్యమమే..
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరిక ● కుంటలు, చెరువులు, సాగునీటి కాల్వల పరిశీలన దుబ్బాక: ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక నియోజకవర్గం సర్వం కోల్పోయింది. ముందుగా ప్రాజెక్టు నుంచి నీరు మాకు ఇవ్వాలి.. లేకుంటే హైదరాబాద్‌కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం రైతులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి దుబ్బాక, పెద్దగుండవెల్లి గ్రామాల్లో కుంటలు, చెరువులు, సాగునీటి కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాల్వలను కూడా నిర్మించడం లేదని విమర్శించారు. ఏడాది కాలంగా మల్లన్నసాగర్ ఉపకాల్వల నిర్మాణం చేపట్టి పంటలకు నీరందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వల నిర్మాణం లేకపోవడంతో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే కాల్వల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. సన్నబియ్యం అంటూ కొబ్బరికాయలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. రైతే దేశానికి వెన్నెముక దౌల్తాబాద్ (దుబ్బాక): అన్నం పెట్టే రైతును నిర్లక్ష్యం చేస్తే దేశం వెనుకబాటు తనానికి కారణమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధి గాజులపల్లిలోని పటేల్ చెరువు కాలువ నుంచి మల్లన్న సాగర్‌జలాలు విడుదల చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాదయాత్ర రసాభాస
సిద్దిపేటరూరల్: కాంగ్రెస్ పాదయాత్ర రసాభాసగా మారింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. గురువారం మండల పరిధిలోని తోర్నాల గ్రామంలో పాదయాత్రను నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సమన్యాయాన్ని పొందారన్నారు. ఇదిలా ఉండగా తోర్నాల గ్రామంలో ప్రధాన వీధుల నుంచి పాదయాత్ర చేపడుతున్న క్రమంలో మండల అధ్యక్షుడి విషయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు, నాయకుల జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. ప్రధానంగా మండలానికి అధ్యక్షుడు ఉన్నారా? లేరా? అసలు అధ్యక్షుడు ఎవరు? అనే అనుమానాలను ప్రజలు, నాయకులు లేవనెత్తారు. గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో మండల అధ్యక్షుడిగా ఎవరికి గుర్తింపు ఇవ్వాలో తెలియడం లేదంటూ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో ముత్యాల బుచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకుల మధ్య వాగ్వాదం మండల అధ్యక్షుడి విషయమై గొడవ -
మున్సిపల్ కమిషనర్‌కు ప్రశంసాపత్రం
సిద్దిపేటజోన్: మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ప్రశంసా పత్రం అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ (సీడీఎంఏ)శ్రీదేవి చేతుల మీదగా పత్రం అందుకున్నారు. 84.15శాతం పన్ను వసూలు చేసినందుకు గాను ప్రభుత్వం అభినందించి ప్రశంసా పత్రం అందజేసింది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం సిబ్బంది, పట్టణ ప్రజల సహకారంతో మెరుగైన లక్ష్యం సాధించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ కమిషనర్‌కు.. హుస్నాబాద్: మున్సిపాలిటీలో అత్యధికంగా ఇంటి పన్నులు వసూలు చేసినందుకు కమిషనర్ మల్లికార్జున్ సైతం ప్రశంసా పత్రం అందుకున్నారు. 2023–24 సంవత్సరానికి 76 శాతం ఇంటి పన్నులు వసూలు చేయడంతో కమిషనర్ ప్రశంసలు అందుకున్నారు. -
విత్తన సబ్సిడీకి పదేళ్లుగా ప్రభుత్వం మంగళం పాడింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రైతులు ప్రైవేటు మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏటా కోట్లల్లో భారం తప్పడం లేదు. సబ్సిడీ మాటను పక్కన పెడితే పూర్తి ధర చెల్లించినా మార్కెట్లో నాణ్యమైన వి
గజ్వేల్: జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం సీజన్లో 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. వరి 3.50లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం జిల్లాకు వివిధ రకాల వరి విత్తనాలు 60వేల క్వింటాళ్లకుపైగా అవసరమవుతాయి. గతంలో తెలంగాణ సోనా విత్తనాలు క్వింటాలుకు రూ.3,400కుపైగా ఎంటీయూ రకం రూ.3,100కుపైగా ధరకు లభించాయి. వచ్చే వానాకాలంలో ధర ఏవిధంగా ఉండబోతుందో ఎదురుచూడాల్సి ఉంది. కాగా కంది ఈసారి 60వేల ఎకరాల్లో సాగులోకి వస్తుందని అంచనా ఉండగా.. 3,053క్వింటాళ్లకుపైగా విత్తనాలు అవసరం. ఈ విత్తనం ధరపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. సోయాబీన్ 120ఎకరాల్లో సాగులోకి వస్తుందనే అంచనా ఉండగా.. 30క్వింటాళ్ల విత్తనం అవసరమున్నది. ఈ విత్తనం కూడా గతంలో క్వింటాలుకు రూ. 9800కు లభించింది. వీటి కొత్త ధరలు కొద్ది రోజుల్లోనే రానున్నాయి. దాదాపుగా పెరుగుదల ఉంటుందనే భావిస్తున్నారు. రైతులపై రూ. కోట్లల్లో భారం ప్రభుత్వం గతంలో వరి, మొక్కజొన్న, పెసర్లు, మినుమలు, కందులు, పొద్దు తిరుగుడు, శనగలు తదితర విత్తనాలను సబ్సిడీపై అందించేది. వీటిపై రైతులకు 33నుంచి 50శాతం సబ్సిడీ వర్తించేది. ప్రస్తుతం పచ్చిరొట్టె విత్తనాలకు మాత్రమే సబ్సిడీ కొనసాగుతుండగా, మిగతా వాటికి పూర్తిగా ఎత్తేశారు. జిల్లా రైతులకు 60వేల క్వింటాళ్ల మేర వరి విత్తనాల అవసరమవుతాయని అంచనా. వీటి ధర తక్కువలో తక్కువగా క్వింటాలుకు రూ.3వేల వరకు లెక్కిస్తే రైతులు రూ.18కోట్ల మేర విత్తనాలకు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఈ విత్తనాలపై కనీసం 25శాతం సబ్సిడీ అందించినా రైతులపై రూ.4.5కోట్ల భారం తప్పేది. కానీ సబ్సిడీని పునరుద్ధరించే అవకాశమే కనిపించడం లేదు. ఇదే తరహాలో మొక్కజొన్న, కంది, సోయాబీన్, పెసర్లు, మినుములపై భారం తప్పని పరిస్థితి నెలకొన్నది. పత్తి బీటీ–2 విత్తనాలపై వాత ఇప్పటికే ప్రారంభమైంది. బీటీ–2 ప్యాకెట్ గతేడాది రూ.864ఉండగా...ఈసారి రూ.901కు పెంచారు. దీని ప్రకారం ఒక్కో ప్యాకెట్‌పై రూ.37అదనపు భారం పడనున్నది. జిల్లా రైతాంగానికి సీజన్లో 4.5లక్షల వరకు విత్తన ప్యాకెట్లు అవసరముంటాయి. పెరిగిన ధర ప్రకారం రైతులపై రూ.1.66కోట్ల మేర భారం పడనుంది. నాణ్యమైన విత్తనమే లక్ష్యం వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విత్తన ప్రాసెసింగ్ సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రాసెసింగ్ విధానంపై నిఘా పెడతాం. ఈసారి కూడా పోలీసుశాఖ సహకారంతో టాస్క్‌ఫోర్స్ కమిటీగా ఏర్పడి విత్తన ప్రొసెసింగ్, ప్యాకింగ్‌లో లోపాలు జరగకుండా చూస్తాం. విత్తనాల పంపిణీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగనుంది. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారి పర్యవేక్షణ తప్పనిసరి జిల్లాలోని గజ్వేల్ ప్రాంతం విత్తన ప్రాసెసింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రత్యేకించి ములుగు, వర్గల్, మర్కూక్, గజ్వేల్ మండలాలు విత్తన కంపెనీలకు అడ్డాగా మారాయి. సిద్దిపేటలోనూ కంపెనీలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 40కిపైగా కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. కానీ గతంలో కొన్ని కంపెనీలు ప్రాసెసింగ్ సక్రమంగా చేయకుండా, నాణ్యతా పరీక్షలతో ప్రమేయం లేకుండా విత్తనాలను మార్కెట్లోకి వదలడం, రిజక్ట్ అయిన విత్తనాలను తిరిగి ప్యాకింగ్ చేయాలనుకోవడం వంటి అక్రమాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈసారైనా విత్తన ప్రాసెసింగ్‌పై పర్యవేక్షణను మరింత పకడ్బందీగా చేపట్టాల్సిన అవసరం ఉంది. రైతులకు ఏటా తప్పని నష్టాలు తీరు మారితేనే ఉపశమనం విత్తనోత్పత్తి సీజన్ ప్రారంభం -
సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
● ఎలాంటి పొరపాట్లు జరగవద్దు ● కలెక్టర్ మనుచౌదరి కొండపాక(గజ్వేల్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించాచారు. కొండపాక మండలం బందారంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. అలాగే లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ పేదలు కడుపు నిండా ఆహారం తీసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. పథకం నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అలసత్వం జరగవద్దన్నారు. లబ్దిదారుల పేర్లను ఈ పాస్ మిషన్న్లో అప్లోడ్ చేశాకే బియ్యాన్ని అందజేయాలన్నారు. లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డైట్ మెనూ తప్పనిసరి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రతి రోజు విధిగా డైట్ మెనూ పాటించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ వేల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో తరగతి గదులు, వంటశాల, డార్మెటరీ, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఐదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ దినపత్రికలు చదవాలన్నారు. అనంతరం పరీక్షలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ మండల తహసీల్దార్ సలీం, గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. -
అతిథులొచ్చాయోచ్..
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దేశీయ పక్షులతో సైబీరియన్ కొంగలువిదేశాల నుంచి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి. దేశ వాలీ పక్షులతో కలిసి ఆహారాన్వేషణ సాగిస్తున్నాయి. పంట పొలాలు, అడుగంటుతున్న చెరువులు, కుంటల్లోని పురుగులను, చేపలను వేటాడి తింటున్నాయి. మండల కేంద్రమైన మిరుదొడ్డి పెద్ద చెరువులో సందడి చేస్తున్న దేశీయ పక్షులతో పాటు, సైబీరియన్ కొంగలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)న్యూస్‌రీల్ -
పాపన్న స్ఫూర్తితో అసమానతలపై పోరాడుదాం
కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్చేర్యాల(సిద్దిపేట): సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో నేటి యువత సమాజంలోని అసమానతలపై పోరాడాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్ సూచించారు. బుధవారం పాపన్న 315వ వర్ధంతిని పురష్కరించుకుని స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అరుణ్ మాట్లాడుతూ సామాన్య కల్లు గీత కార్మిక కుటుంబంలో పుట్టిన పాపన్న సమాజం బాగుండాలని కోరుకున్నారని, అందు కోసం కల్లుగీసే కత్తిని పక్కన పెట్టి ఖడ్గం చేతపట్టాడన్నారు. మొగలు సైన్యంపై తిరగబడి విజయం సాధించి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత సమాజంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా గీత కార్మికులను పట్టించుకోవడం లేదని, రోజు రోజుకూ గీత వృత్తి అంతరించిపోతోందన్నారు. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ చెప్పిన విధంగా అన్ని రంగాల్లో సమానత్వం కోసం పాటుపడాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సర్వాయి పాపన్న, కంటమయ్య, రేణుక ఎల్లమ్మల స్ఫూర్తితో ఉద్యమం చేస్తామని అందుకు గీత కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు నర్సింహులు, కనకయ్య, సిద్దిరాములు, బుచ్చిరాములు, గణేష్, రాములు, రాజు, సత్తయ్య, రాజయ్య, గోపాల్, ఐలయ్య, యాదగిరి, నరేష్, శ్రీనివాస్, చందు, వెంకటేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ల పంట పండింది
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పంటల ఉత్పత్తి పెరగడంతో పలు మార్కెట్లకు ఆదాయం పెరిగింది. గతేడాది వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ జిల్లా పరిధిలోని 14 మార్కెట్లకు రూ.35 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ యేడాది మార్చి 31 నాటికి రూ.33.94కోట్లు ఫీజుల రూపంలో వసూలైంది. లక్ష్యానికి చేరువలోకి రావడమేకాక, గతేడాది కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. వచ్చిన ఆదాయం వివరాలు.. (రూ.లలో) మార్కెట్ 2024–25 2023–24సిద్దిపేట 361.04 366.24చిన్నకోడూరు 187.12 162.77నంగనూరు 127.51 80.41తొగుట 70.06 35.08దౌల్తాబాద్ 150.05 86.89కొండపాక 138.29 73.00మిరుదొడ్డి 141.92 58.27దుబ్బాక 195.70 195.43బెజ్జంకి 269.61 267.54హుస్నాబాద్ 456.57 403.47కోహెడ 121.37 112.12గజ్వేల్ 481.23 346.73చేర్యాల 481.04 357.84వంటిమామిడి 212.76 173.06సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్లలో ఫీజుల రూపంలో అధికంగా డబ్బులు వసూలు చేసి గజ్వేల్ టాప్‌లో నిలువగా, తొగుట మార్కెట్ లాస్ట్‌లో నిలిచింది. నిర్దేశించిన లక్ష్యం కంటే చిన్నకోడూరు, నంగనూరు, మిరుదొడ్డి, బెజ్జంకి, గజ్వేల్, చేర్యాలలో అధికంగా ఆదాయం వచ్చింది. కోహెడ, సిద్దిపేట, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, దుబ్బాక, హుస్నాబాద్, ఒంటిమామిడి మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. పౌరసరఫరాల సంస్థ ద్వారా ధాన్యం, మార్కెఫెడ్ ద్వారా పొద్దుతిరుగుడు గింజలు, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు మార్కెట్ ఫీజులతో ఆదాయం మార్కెట్లకు వస్తోంది. పెరిగిన ఆదాయం 2023–24 సంవత్సరానికి రూ.27.18కోట్లు రాగా 2024–25కు రూ.33.94కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే రూ.6.76 కోట్ల ఆదాయం పెరిగింది. మార్కెట్ ఫీజులు, లైసెన్స్ రెన్యూవల్స్, వ్యవసాయ శాఖ చెక్ పోస్టుల ద్వారా మార్కెట్లకు ఆదాయం వస్తోంది. పలు చోట్ల రైతు బజార్, సమీకృత మార్కెట్, మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లతో పాటు గదుల అద్దెల ద్వారా, పశువుల సంత ద్వారా ఆదాయం సమకురుతోంది. దీంతో కొన్ని మార్కెట్లకు ప్రతి యేడాది ఆదాయం పెరుగుతూ వస్తోంది.జిల్లా వ్యాప్తంగా రూ.33.94 కోట్ల ఆదాయం గజ్వేల్‌లో ఎక్కువ.. తొగుటలో తక్కువ గతేడాది రూ.27.18 కోట్లే.. లక్ష్యం చేరుకోని పలు మార్కెట్లు గతేడాది కంటే అధిక ఆదాయం జిల్లాలో వ్యవసాయ శాఖ చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశాం. కార్యదర్శులందరూ సమష్టి కృషితో గతేడాది కంటే అధిక ఆదాయం వచ్చింది. నిర్దేశించిన టార్గెట్‌ను పలు మార్కెట్లు చేరుకోలేదు. వాటిపై ప్రత్యేక ఫోకస్ పెడతాం. రైతులు పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నాం. – నాగరాజు, మార్కెటింగ్ అధికారి -
మిషన్ భగీరథ ఎస్ఈగా వెంకట్‌రెడ్డి
సిద్దిపేటజోన్: జిల్లా మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టర్ మనుచౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ఎస్ఈ చారి పదవీ విరమణ పొందడంతో మహబూబ్‌నగర్ జిల్లా గ్రిడ్ ఈఈగా పనిచేసిన వెంకట్ రెడ్డి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఇన్చార్జ్ డీటీఓ సిద్దిపేటరూరల్: జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన క్రిష్టఫర్ బుధవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీటీఓగా ఉన్న కొండల్‌రెడ్డి పదవీ విరమణ పొందారు. దీంతో గజ్వేల్ రవాణా శాఖ అధికారిగా కొనసాగుతున్న క్రిష్టఫర్‌ను ఇన్చార్జ్ డీటీఓగా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.పథకాలు సద్వినియోగం చేసుకోండి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేటజోన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అద నపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రం భారత్‌నగర్‌లోని 35 రేషన్‌షాప్‌లో ఆమె సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇక ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని, పేదలు ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తనూజ, తహసీల్దార్ సలీమ్ మియ్యా పాల్గొన్నారు. కమ్యూనికేషన్ సీఐగా శ్యాంసుందర్ సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ కమ్యూనికేషన్ సీఐగా శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శ్యాంసుందర్ సీపీ అనురాధను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని సీపీ సీఐకి సూచించారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం సిద్దిపేటకమాన్: ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్‌లు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహనతోపాటు, అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వాసుదేవరావు సూచించారు. సైబర్ జాగృక్ దివాస్ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాలపై బుధవారం వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్, మేసేజ్‌లకు ఎవరూ స్పందించకూడదని తెలిపారు. ఏటీఎం పిన్, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు ఇతరులకు తెలపకూడదని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లకూడదన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని అవమానిస్తే సహించం
గజ్వేల్: భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచేవిధంగా పాలన కొనసాగిస్తున్న బీజేపీ తీరును ప్రజ ల్లో ఎండగడతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మ న్ ప్రీతమ్ అన్నారు. టీపీసీసీ పిలుపుమేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో నిర్వహిస్తున్న గ్రామస్థాయి పాదయాత్రను బుధవారం గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ నిండు పార్లమెంట్లో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్రమంత్రి అమిత్‌షా అవమానించారని మండిపడ్డారు. అంబేడ్కర్‌పై అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలంతా గమనించారన్నారు. గ్రామస్థాయి పాదయాత్రల ద్వారా బీజేపీ విధానాలను ప్రజల్లో తిప్పి కొడతామని హెచ్చరించారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమీటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతాం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ అక్కారంలో ‘జై బాపు, జై భీమ్,జై సంవిధాన్’ పాదయాత్ర పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
దుండగులను శిక్షించాల్సిందే
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై కాల్పులు జరిపిన వారిని శిక్షించాల్సిందేనని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదిర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించడంలో పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే ‘ప్రశ్నించే గొంతులు–అణచివేత’లపై నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని లింగుపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం గద్దర్ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్‌పై కాల్పులు జరిపిన వారిని శిక్షించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వమైనా దుండగులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు జోగ్గారి బాల్ నర్సు, నర్సింహులు, మహేష్, రాజు, భిక్షపతి, బాలరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
చలివేంద్రాలతో ఎంతో మేలు
సిద్దిపేటకమాన్: ఎండల తీవ్రత పెరుగుతోందని, నిత్యం గ్రామాల నుంచి కేసుల నిమిత్తం కక్షిదారులు వస్తుంటారని వారి దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని న్యాయమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో మంచినీటిని ఎక్కువగా తాగాలని సూచించారు. న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్‌కాంబ్లి, చందన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రమేష్‌బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలి
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్ మండల ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానిక ఎస్వీ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి సుజాతతో పాటు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుజాత మాట్లాడుతూ సమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని, నూతన మండల కమిటీ సభ్యులు సైతం సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీనివాసరావు, వెంకటేశం, నాగజ్యోతి, రామకృష్ణ, లక్ష్మణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కోటి తలంబ్రాల దీక్ష అద్భుత ఘట్టం
జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక గజ్వేల్‌రూరల్: కోటి తలంబ్రాల దీక్ష అద్భుత ఘట్టమని గజ్వేల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక అన్నారు. భద్రాచల సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా 250 కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు రామకోటి రామరాజుకు ఆ దేవస్థాన పాలకమండలి అప్పగించింది. గోటి తలంబ్రాలను సిద్ధం చేసి తిరిగి భద్రాచలంలో అప్పగించేందుకు తీసుకెళ్తున్న సందర్భంగా ప్రజ్ఞాపూర్‌లోని త్రిశక్తి అమ్మవారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి ప్రియాంక మాట్లాడుతూ కోటి తలంబ్రాల దీక్షలో ప్రాంత ప్రజలను భాగస్వాములను చేయడం పట్ల రామకోటి రామరాజును అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో త్రిశక్తి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
చరిత్రాత్మకం: మంత్రి పొన్నం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకంహుస్నాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో తెల్లరేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2.91 లక్షల రేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకు అమ్మడం, రేషన్ దుకాణాలకు వాపస్ ఇవ్వడం జరిగేదన్నారు. ఇక నుంచి సన్న బియ్యం అందరూ తీసుకుంటారన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సన్న బియ్యం పఽథకం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. గజ్వేల్‌రూరల్: సన్నబియ్యం పంపిణీతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. గతంలో సరఫరా అయిన దొడ్డు బియ్యాన్ని తినకపోవడంతో అవి పక్కదారి పట్టేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టి, పేద ప్రజల కడుపు నింపే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సింగారంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కేతకీలో కర్ణాటక ఎమ్మెల్సీల పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్, భీమ్రావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, నాయకులు చంద్రశేఖర్ పాటిల్, మల్లయ్య స్వామి, రుద్రయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహం తొలగించడం సరికాదు
సిద్దిపేటకమాన్: ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది సరికాదని అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవిలయ్య అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో 16ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఐదు గ్రామాలకు కూడలి వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించకుండా అక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బాబురావు, యాదగిరి, రాజు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ భూములు కాపాడండి
సీపీఎం జిల్లా నేత వెంకట్మావోచేర్యాల(సిద్దిపేట)/బెజ్జంకి(సిద్దిపేట)/మద్దూరు(హుస్నాబాద్): హెచ్‌సీయూ భూములను కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్‌మావో పిలుపునిచ్చారు. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన నిరసన కార్యక్రమాల సందర్భంగా మంగళవారం పలువురు ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. యూనివర్సిటీ భూములను అమ్ముకొనే చర్యను వెంటనే మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నాగరాజు, శ్రీహరి, ప్రభాకర్, మల్లేశం, కుమార్ తదితరులున్నారు. అదే విధంగా బెజ్జంకిలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సాయికృష్ణ, అధ్యక్షుడు మహేశ్‌ను అరెస్టు చేశారు. మద్దూరు, దూల్మిట్ట మండలాల సీపీఎం కార్యదర్శులు ఎండీ షఫీ, రాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.పోలీసుల అదుపులో సీపీఎం నాయకులు -
నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై చర్యలేవీ?
సీపీఎం జిల్లా నేత ఎల్లయ్యగజ్వేల్రూరల్: నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్లయ్య మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వాసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాముకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలు దాటినా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చికిత్స కోసం వచ్చేవారికి వైద్యం అందించకుండా ఫోన్లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని, దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నారన్నారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి తదితరులున్నారు. -
ఇందిరమ్మ డిజైన్లపై నిరుత్సాహం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఇళ్లను మంజూరు చేసిన రెండు నెలలు దగ్గర పడుతున్నా జిల్లాలో కనీసం 30 శాతం మంది లబ్ధిదారులు కూడా ముగ్గు పోసుకోలేదు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు రాగా, ఇందులో 1.36 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. సొంతంగా ఇంటి స్థలం ఆధారంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాలుగా రూపొందించిన విషయం విదితమే. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి అర్హతలున్న వారికి ఈ ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఒక్కో మండలానికి ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేసి..ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఇలా జిల్లాలో మొదటి విడతలో 1,200 మంది లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఈ ఇళ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఇందులో కేవలం 275 మంది లబ్ధిదారులే ముగ్గు పోసుకున్నారు. బేస్మెంట్ వరకు కట్టుకున్న లబ్ధిదారులు 21 మంది మాత్రమే కావడం గమనార్హం.ప్రారంభమైన ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటివరకు ముగ్గు పోసింది.. 30 శాతం మందే అతి తక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే ఇళ్లపై పెదవి విరుస్తున్న లబ్ధిదారులు వేరే డిజైన్లలో నిర్మించుకుంటే బిల్లులు మంజూరవుతాయా అని సందిగ్ధం -
చట్టాలపై అవగాహన అవసరం
జిల్లా జడ్జి స్వాతిరెడ్డి సిద్దిపేటరూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి స్వాతిరెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం చింతమడకలోని మహాత్మాజ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే నిరంతరం కష్టపడాలన్నారు. అనంతరం ఎస్ఐ అపూర్వరెడ్డి మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో హక్కులపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత, అడ్వకేట్ అరవింద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట సిద్దిపేటకమాన్: మహిళలు, చిన్నారుల రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని షీటీమ్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత నెలలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గత నెలలో 48మంది ఈవ్‌టీజర్లను పట్టుకుని కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఎవరైనా పోకిరీలు వేధించినా, వెంటపడినా డయల్ 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 67434కు సమాచారం అందించాలన్నారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: నియోజకవర్గ అభివృద్ధి కోస మే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరిన వెంటనే సీఎం స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపానన్నారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్, రింగ్ రోడ్డుతో పాటు పలు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ అడుగుజాడల్లోనే ముందుకు నడుస్తానని ఆయన అన్నారు. చక్రధర శర్మకు సన్మానం గజ్వేల్‌రూరల్: గౌరీభట్ల చిక్రధరశర్మను వీరశైవ లింగాయత్ సమాజం మంగళవారం సన్మానించింది. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందించింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడకు చెందిన గౌరీభట్ల చక్రధరశర్మ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రిమ్మనగూడకు చెందిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజం సభ్యులు చక్రధరశర్మ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. ‘యువ వికాసం’ సద్వినియోగం చేసుకోవాలి గజ్వేల్‌రూరల్: ప్రభుత్వం చేపట్టిన యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు సూచించారు. గజ్వేల్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 14 వరకు గడువు పొడగించారని; ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, అరుణ్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
హుస్నాబాద్‌లోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలుభక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్–ఉల్–ఫితర్‌ను జిల్లా వ్యాప్తంగా సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు మైనార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)ప్రార్థన చేస్తున్న చిన్నారిన్యూస్రీల్ -
మతాలకతీతంగా కలిసి నడుద్దాం
రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటజోన్: మతాలకతీతంగా ప్రగతికి కలిసి నడుద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా స్థానిక ఎక్బాల్ మినార్ వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం అనే భేదాలు లేకుండా సంతోషంగా పండుగలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. కొంతమంది దుష్ట శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందరూ ఓపిక, శాంతితో కలిసిమెలిసి ఉండి దేశ, రాష్ట్ర అభ్యున్నతికి సోదర భావంతో ఉండాలని సూచించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో పాటు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పలువురు ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి ఈద్ ముబారక్
హుస్నాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలోని ముస్లిం నేతలు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ తినిపించారు. మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్‌తో పాటు పలువురి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, చిత్తారి రవీందర్ ఉన్నారు. -
బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాలి
నారాయణఖేడ్: బసవేశ్వరుడు చూపిన మార్గంలోని నడుచుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. నాగల్గిద్ద మండలం మావినెళ్లి గ్రామంలో జరుగుతున్న చెన్న బసవేశ్వర జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...మానవా ళికి బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో బాల్కి పీఠాధిపతి బసవలింగ పట్టదేవర, జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షట్కార్, టీపీసీసీ సభ్యుడు శంకరయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు సాగర్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతర ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించి గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు. -
నేటి నుంచి టోల్ మోత
వాహనదారులపై మరింత భారం తూప్రాన్: మండలంలోని అల్లాపూర్ శివారు 44వ నంబర్ జాతీయ రాహదారిపై ఏర్పాటు చేసిన టోల్గేట్ మీదుగా ప్రయాణం మరింత భారం కానుంది. 5 నుంచి 10 శాతం టోల్ రేట్లు పెంచినట్లు నేషనల్ హైవే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే వాహనదారులు టోల్గేట్ భారం అధికంగా ఉందని గగ్గోలు పెడుతుండగా, మరోమారు రేట్లు పెంచారు. అయితే ఏటా ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. పాత ధరలను చెల్లించలేకే కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా వెళ్తున్నారు. నిత్యం ఈ టోల్గేట్ మీదుగా 12 నుంచి 15 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజువారి టోల్ గేట్ రూ. 12 లక్షల నుంచి రూ. 15 వరకు ఆదాయం ఉంటుంది. పెరిగిన ధరలతో వాహనదారుల జేబుకు చిల్లు పడనుంది. కాగా టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తున్న సమయంలో చుట్టూ 20 కిలోమీటర్ల వరకు వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ. 350 చెల్లించి నెలవారీ పాసులు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కాని టోల్‌ప్లాజా సమీప గ్రామాల ప్రజలు నిత్యం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సామగ్రి కోసం రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇందుకు టోల్ రుసం ఎలా చెల్లించాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నేషనల్ హైవే అధికారులు స్పందించి స్థానికులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేత
ములుగు(గజ్వేల్): రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి మహ్మద్ జుబేర్పాష సోమవారం మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. సీపీఎం మహాసభల ప్రతినిధిగా మల్లారెడ్డి సిద్దిపేటఅర్బన్: తమిళనాడులోని మదురైలో ఏప్రిల్ 2 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రతినిధిగా పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన నాయకులను జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. మల్లారెడ్డి జాతీయ మహాసభలకు ప్రతినిధిగా ఎంపికవడం పట్ల పార్టీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ సేవలపై సర్వేసిద్దిపేటకమాన్: ఆర్టీసీ నుంచి అందుతున్న సేవలపై సర్వే నిర్వహించారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్‌లో డిపో మేనేజర్ రఘు ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి హాజరై మాట్లాడారు. సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశానుసారం సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ నుంచి అందుతున్న సేవలపై సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ‘వట్టికోట’ పదవీ విరమణవర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి నాచారం గుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు వట్టికోట కృష్ణమాచార్యులు సోమవారం పదవీ విరమణ పొందారు. 45 ఏళ్ల పాటు సుధీర్ఘకాలం ఆయన నాచగిరీశుని సన్నిధిలో సేవలందించారు. రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం పొందారు. పదవీ విరమణ సందర్భంగా ఆలయ ముఖమండపంలో ఆయనను దేవస్థాన సిబ్బంది, అర్చకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో తనకు ప్రతి ఒక్కరి సహకారం అందిందన్నారు. అదేస్థాయిలో ఆలయ అభివృద్ధి కోసం అందరూ కృషిచేయాలన్నారు. సీనియర్ అసిస్టెంట్ సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆలయ అర్చకులు జగన్నాథాచార్యులు, హరిప్రసాద్‌శర్మ, నాగరాజుశర్మ, నరేందర్‌గౌడ్, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. శతఘటాభిషేకం
వర్గల్(గజ్వేల్): ఉగాది పర్వదినవేళ నాచగిరీశుని సన్నిధిలో అష్టాత్తర శతఘటాభిషేకం నేత్రపర్వం చేసింది. గర్భగుడిలో విశేషాలంకరణలో కొలువైన లక్ష్మీనృసింహుల దివ్యదర్శనంతో భక్తజనావళి తరించింది. పన్నెండు రోజులు ఆధ్యాత్మిక పరిమళాలు పంచిన బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఆలయ ముఖమండపంలో అర్చకులు 108 కలశాలు స్థాపన చేశారు. మహాపూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ జరిపారు. నృసింహ నామాలు, మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడిలో మూలవరులకు మహాభిషేకం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. వేడుకలలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తరించారు. -
రంజాన్ వేడుకలకు సిద్ధం
మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రంజాన్ పండుగ నిర్వహించుకునేందుకు జిల్లాలోని ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లింలు తమ కుంటుబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బెజ్జంకికి వ్యవసాయ కళాశాల మంజూరు బెజ్జంకి(సిద్దిపేట): మండలానికి గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల మంజూరైనట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహిస్తున్న ఈ కళాశాలను బెజ్జంకి మండలానికి మార్చుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నందన్నారు. వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, సహకరించిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, ఏఎంసీ వెస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలరించిన కుస్తీ పోటీలు కల్హేర్(నారాయణఖేడ్): ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మండలంలోని మార్డిగ్రామంలో, సిర్గాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా అలరించాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. చివరి కుస్తీ పోటీ విజేతకు వెండి కడియం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గుర్రపు మశ్చేందర్, బీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రాజుకుమార్ సిగ్రె, తదితరులు పాల్గొన్నారు. సంతాప ర్యాలీ సంగారెడ్డి జోన్: ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం, సంగారెడ్డి నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతిర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో యూసీఎఫ్ అధ్యక్షుడు రూబెన్రెడ్డి, ఉపాధ్యక్షుడు మధుమోహన్, జనరల్ సెక్రటరీ సునీల్ జయ కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ ఫలమేదీ?
ప్రాజెక్ట్ టీచర్లు ఆయాలు దుబ్బాక 02 13 సిద్దిపేట 0 24 చేర్యాల 01 18 హుస్నాబాద్ 05 13 గజ్వేల్ 04 22 ● అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఎదురు చూపులు ● 9 నెలలుగా ప్రయోజనాలు అందక అవస్థలు ● జిల్లాలో రిటైర్డు అయిన 12 మంది టీచర్లు, 90 మంది ఆయాలు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ పొందారు.. కానీ నేటికీ ప్రయోజనాలు అందలేదు. 65 ఏళ్లు నిండిన వారిని ప్రభుత్వం పదవీ విరమణ ప్రకటించింది. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, ఆయాకు రూ.లక్ష చొప్పున ఇస్తామని తెలిపింది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలదే ముఖ్య పాత్ర. గతంలో వీరికి ఉద్యోగ విరమణ గడువు ఉండేది కాదు. కానీ గతేడాది జూన్ 30వ తేదీకి 65 ఏళ్లు నిండిన అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు మొత్తం 102 మంది ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: అంగన్ వాడీ టీచర్లు, ఆయాల్లో కొందరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించారు. 1985లో విధుల్లో చేరిన వారు గతేడాది జూన్30న ఉద్యోగ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాల కాలంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారు వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బూత్‌లెవల్ అధికారిగా, పల్స్ పోలియో, వివిధ సర్వేలను విజయవంతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ప్రతి చిన్న కార్యక్రమానికి వారిని వినియోగించారు. పదవీ విరమణ పొంది 9నెలలు గడిచినా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్యోగికై నా ఉద్యోగ విరమణ తర్వాత ఎంతో కొంత డబ్బులు వస్తే వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుంది. టీచర్. ఆయాగా విధులు నిర్వర్తించినప్పుడు నెల నెల జీతం వచ్చేది. పదవీ విరమణ డబ్బులైనా వస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని వాపోతున్నారు. ఇదేనా గుర్తింపు? నాలుగు దశాబ్దాల పాటు చిన్నారులు. బాలింతలు, గర్భిణులు సేవలందించిన వారికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని అంగన్ వాడీ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్లను వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లకు పింఛన్ నెలకు రూ. 6వేలు, ఆయాలకు రూ. 4వేలు అందించాలని యూనియన్ నాయకులు విన్నవించారు.. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇప్పించాలని రిటైర్డ్ అయిన టీచర్లు, ఆయాలు కోరుతున్నారు. -
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మున్సిపల్ అభివృద్ధికి రూ.10 కోట్లు మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరైనట్లు సీడీఎంఏ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. చైతన్య పాఠశాల నుంచి పెట్రోల్ బంక్ వరకు సెంట్రల్ లైటింగ్ ప్లాంటేషన్ కోసం రూ.కోటి, మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజురయ్యాయి. అలాగే కొత్త చెరువు సుందరీకరణకు రూ.2కోట్లు, హుస్నాబాద్ మున్సిపల్ స్వాగత తోరణాల ఏర్పాటుకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. నూతన జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.80 లక్షలు మంజూరయ్యాయి. ప్లాస్టిక్‌ను నివారిద్దాం.. ప్లాస్టిక్‌ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్‌కు వంద గ్లాస్‌ల చొప్పున పంపిణీ చేశామన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్స్ చొప్పున స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు -
ఆధ్యాత్మికతతోనే గుణాత్మక మార్పు
●వారి అకౌంట్లలోనే జమ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలుగా పదవీ విరమణ పొందిన వారి వివరాలను పంపించాం. వారికే నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు జమ కానున్నాయి. –లక్ష్మీకాంతరెడ్డి, డీడబ్ల్యూఓసిద్దిపేటజోన్: ఆధ్యాత్మికతతోనే మనుషుల్లో గుణాత్మక మార్పు సాధ్యమని, ఆదిశగా ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మాబాట్ల నర్సింహాశర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడారు. మనిషి సత్ మార్గంలో పయనించాలని, అందుకు ఆధ్యాత్మికత అవసరమన్నారు. రేపటి తరానికి సంస్కృతి నేర్పిద్దామన్నారు. విదేశాల్లో పండుగలు, దేవాలయాలు, పూజలు చేస్తూ మన సంస్కృతి కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సమాజాన్ని నడిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు. కోమటి చెరువు వద్ద టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం పలువురు కవులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, పరిషత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ దేవాలయంలో పూజలు చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని కొండెంగలకుంటలో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రేపటి తరాలకు సంస్కృతిని నేర్పిద్దాం ఎమ్మెల్యే హరీశ్ రావు -
మిగిలింది ఒక్క రోజే..
నిబంధనల అమలుపై అనుమానాలు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల తగ్గింపు వ్యవహారంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులు నిబంధనలు పాటించడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. పన్నుల వసూలు లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఆరాటామా..? ఇతర కారణాలో తెలియదు కానీ కొందరికి పన్నులు తగ్గించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాలతో ప్రాపర్టీ టాక్స్ తగ్గించాలని ఆయా మున్సిపాలిటీల్లో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులను స్వీకరించిన అధికారులు.. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ మొత్తం రికవరీ చేసి, ఆ తర్వాత టాక్స్ తగ్గింపునకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలి. దీనికి తగినంత సమయం కూడా తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆస్తి పన్నుల వసూళ ్లలక్ష్యం పూర్తయ్యేనా? ● సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలు ముందంజ ● ఆ రెండు ప్రాంతాల్లో80శాతానికిపైగా వసూలు ● వెనుకబడిన హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్‌తోపాటు చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఏటా రూ. 16.81కోట్లకుపైగా ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రూ.4.81కోట్లతో రెండోస్థానంలో ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రూ.1.5–3కోట్లతో తర్వాత స్థానాలను ఆక్రమిస్తున్నాయి. సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో.. సిద్దిపేట మున్సిపాలిటీలో 36,136 ఇళ్లు ఉండగా ఆస్తి పన్నుల రూపంలో రూ.16.81కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఈనెల 29 వరకు రూ.14కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.2.81కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం 83.28శాతం లక్ష్యాన్ని సాధించారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 12,419 ఇళ్లు ఉన్నాయి. ఆస్తి పన్ను రూపంలో రూ.4.81కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఈనెల 29నాటికి రూ.3.92 కోట్ల పన్నులు వసూలు చేశారు. 81.50శాతం లక్ష్యాన్ని సాధించారు. గతంలో ఈ మున్సిపాలిటీ 95శాతానికిపైగా లక్ష్యాన్ని సాధించగలిగింది. కానీ ఈసారి మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ ఇందులో కలవడం, ఆ కాలనీలో అనుకున్న స్థాయిలో పన్నుల వసూలు జరగక వెనుకబడినట్లు అధికారులు చెబుతున్నారు. వసూళ్లలో నత్తనడక.. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 7,286 ఇళ్లకు రూ.1.73కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయడం లక్ష్యంగా ఉంది. కానీ ఈనెల 29వరకు 1.28కోట్ల మాత్రమే వసూలు చేసి 73.99శాతం లక్ష్యాన్ని సాధించారు. దుబ్బాకలో 6,209 ఇళ్లు ఉన్నాయి. రూ.2.03కోట్ల ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యానికి రూ.1.48కోట్లు రాబట్టారు. ఇకపోతే చేర్యాల మున్సిపాలిటీలో 5,162 ఇళ్లకు రూ.3.06కోట్లు వసూళ్లు వసూలు చేయాల్సి ఉంది. ఈనెల 29వరకు కేవలం రూ.1.95కోట్లు వసూలు చేసి 63.73లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు మినహా మిగతావి వందశాతం లక్ష్యాన్ని సాధించకపోవడంతో ఉగాది, రంజాన్ సెలవులను సైతం రద్దు చేసి ఆస్తిపన్నుల వసూళ్ల స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశాలిచ్చారు. మొత్తానికి ఈనెల 31 తేదీ మాత్రమే మిగిలిఉంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలు లక్ష్యం వందశాతం పూర్తికావడం అనుమానంగానే ఉంది. సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల్లో ఈనెల 29 వరకు 80శాతానికిపైగా వసూళ్లు చేపట్టారు. హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీలు మాత్రం వెనుకబడ్డాయి. ఈ నెలాఖరు వరకు గడువు నేపథ్యంలో ఏ మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో వేచి చూడాల్సిందే. -
జాన్ వెస్లీ అరెస్టు అప్రజాస్వామికం
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి సిద్దిపేటఅర్బన్: పభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ గ్రూపు యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని పోరాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల క్రితం ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే ఆ స్థలాలను రామోజీ యాజమాన్యం ఆక్రమించి పట్టాలున్న పేదలను స్థలంలోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం రామోజీ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాలస్వామి, శశిధర్ పాల్గొన్నారు. -
పదోన్నతులతో మరింత బాధ్యత
సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరిధి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన జె.బాలమల్లయ్య, సీఏఆర్ హెడ్ క్వార్టర్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున ఏ.వెంకట్‌రెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. దీంతో వారు మర్యాదపూర్వకంగా సీపీని గురువారం కలవడంతో వారిని సీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహాంతో ప్రజలకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్తీక్, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సీపీ అనురాధ తెలిపారు. గజ్వేల్ డివిజన్ పోలీసు అధికారులతో సీపీ కార్యాలయంలో పెండింగ్ కేసులపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ..పోక్సో, క్రైమ్ కేసులలో నిందితులను వెంటనే అరెస్టు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ లేజర్ గన్‌తో కేసులు నమోదు చేయాలన్నారు. క్రికెట్ బెట్టింగ్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రేపటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈనెల 29 నుంచి సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. ఏప్రిల్ 13 వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆమె తెలిపారు. -
కాయకల్ప బృందం సందర్శన
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని కాయకల్ప బృందం గురువారం సందర్శించింది. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని కాయకల్ప బృందం ప్రభుత్వాస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్, లేబర్రూమ్తో పాటు పలు వార్డులను పరిశీలించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాయకల్ప బృందం సభ్యులు శ్రీనివాస్, పద్మావతి, విజేత, ఫాతిమ, మేరి, సుష్మిత, మనోజ్‌లతో పాటు ప్రభుత్వాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. -
బెల్ట్‌షాపులు తొలగించండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: పల్లెల్లో పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ గ్రామానికి వెళ్లినా బెల్ట్ షాప్‌లను తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. పల్లెల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో యువత పెడదారి పడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే ఆర్థికంగా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం.. ముందుగా బెల్ట్‌షాపులను తొలగించి అండగా నిలవాలన్నారు. బ్రిడ్జిని పూర్తి చేయండి దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగుపై మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏళ్లుగా పిల్లర్ల దశలోనే నిలచిపోయిందని ప్రస్తావించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే నాలుగైదు మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వానాకాలంలో వరద వస్తే రాకపోకలు బంద్ అవుతాయని, దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని కోరారు. దరఖాస్తుల గడువు పెంపు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగించారు. 2024– 25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జమిలి ఎన్నికలపై అవగాహన కల్పించండి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఒకే దేశం, ఒకే ఎన్నికతో ప్రజాస్వామ్య అభివృద్ధికి నాంది పలుకుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక జిల్లా కన్వీనర్ నలగామ శ్రీనివాస్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బైరి శంకర్ పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జమిలీ ఎన్నికలు నిర్వహించాలని, ప్రధాని మోదీ సారథ్యంలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారన్నారు. జమిలి ఎన్నికల పై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కోకన్వీనర్ తోడుపునూరి వెంకటేశం, పార్లమెంట్ కో కన్వీనర్ చింత సంతోష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల జనార్దన్, మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. పేదల సేవలోనే సంతృప్తి దుబ్బాకటౌన్: నిరుపేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రంజాన్ పురస్కరించుకుని గురువారం దుబ్బాక పట్టణంలో బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 55 మంది పేద ముస్లిం మహిళలకు 20 రకాల నిత్యావసర సరుకులతో కూడిన తోఫా, చీరలు, రూ.500 నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవసేవగా భావించి పేదలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ సలీం మియా, ట్రస్ట్ అధ్యక్షుడు చాంద్‌మియా తదితరులు పాల్గొన్నారు. -
పోచమ్మకు బోనాలు
ఆలోచన అదిరె.. దృష్టి మరలె దేవక్కపల్లెలో రెడ్డిసంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు బోనాలతో ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని రెడ్డి సంఘం నాయకులు ఆకాంక్షించారు. – బెజ్జంకి(సిద్దిపేట)పశుపక్షాదుల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌లో ఓ రైతు బీర పంట చుట్టూ చీరలను ఏర్పాటు చేశారు. నర దిష్టి తగలకుండా ఉండేందుకు ఇలా చీరలను ఏర్పాటు చేసినట్లు రైతు చెబుతున్నారు. చీరలను పంట చుట్టూ ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తిగా దృష్టి సారిస్తుండటం విశేషం. – మిరుదొడ్డి(దుబ్బాక) -
మహనీయుల చరిత్రను చాటుదాం
సమష్టిగా పనిచేద్దాం.. లక్ష్యం సాధిద్దాం● పన్నుల వసూలులో మున్సిపాలిటీని అగ్రగామిగా నిలుపుదాం ● చైర్పర్సన్ మంజుల సిద్దిపేటజోన్: ఆస్తి పన్ను, నల్లా పన్నులు వందశాతం వసూలు చేసి రాష్ట్రంలో సిద్దిపేట మున్సిపాలిటీని మొదటి స్థానంలో నిలుపుదామని చైర్ పర్సన్ మంజుల సూచించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకు పాలకవర్గం, అధికార యంత్రాంగం సమష్టిగా లక్ష్యం సాధించాలన్నారు. మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది గురువారం నాటికి రూ.14.28కోట్లు వసూలు చేసిందని, మిగతా రూ.1.36 కోట్లను వసూలు చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ పక్షాన మున్సిపల్ రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. నల్లా కనెక్షన్లు ఉండి తాగునీరు సరఫరా లేని ప్రత్యేక కేసులను అధికారులు పరిశీలించాలన్నారు. అలాగే పట్టణంలో చాలా పురాతన ఇళ్లు ఉన్నాయని, వాటికి ఫ్యామిలీ మెంబర్, మరణ పత్రాల ఆధారంగా పేర్ల మార్పిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ మాట్లాడుతూ.. త్వరలో పట్టణంలో నీటి నల్లా కనెక్షన్లు ఉండి తాగునీరు రాని వాటిపై సమీక్ష చేస్తామన్నారు. పేర్ల మార్పిడి అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు రంజాన్, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు వినోద్, సుందర్, లక్ష్మణ్, బ్రహ్మం, నాగరాజు రెడ్డి, విఠోభ, మల్లికార్జున్, సతీష్, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటరూరల్: బాబు జగ్జీవన్‌రావు, బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో వివిధ దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను నేటి యువతరానికి తెలిజేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వచ్చే నెల 5న బాబు జగ్జీవన్‌రావు, 14న బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాన్నారు. ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున గ్రాంట్‌ను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఎండీ హమీద్, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ దళిత నాయకులతో సమావేశం -
క్రమబద్ధీకరణ కష్టాలు
● ఒక్కప్లాటు కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లు నిషేధిత జాబితాలోకే.. ● ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ తీరు.. అంతంత మాత్రంగానే స్పందనసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25శాతం డిస్కౌంట్ ఇస్తామని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేస్తోంది. కానీ ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్య లెవల్–1 స్థాయి అధికారుల వద్ద పరిష్కారమవుతుందా.. లెవల్– 2 అధికారుల పరిధిలోకి వస్తుందా..? లెవల్– 3 అధికారుల వద్దకు వెళ్లాలా తెలియక తికమకపడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిషేధిత జాబితా కష్టాలు.. ఒక లేఅవుట్లోని సర్వేనంబర్‌లో సుమారు 200 ప్లాట్లు ఉంటే.. అందులో ఒకటీ.. రెండు ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉంటే.. ఆ సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లను నిషేధిత (ప్రొహిబీటెడ్) జాబితాలో చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలామంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ నుంచి ఎన్ఓసీ తీసుకుని ఎల్–1 స్థాయి అధికారులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. కనిపించని ఓపెన్ స్పేస్‌లు.. అనధికారిక వెంచర్లు వేసిన అక్రమార్కులు చాలా చోట్ల ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10 శాతం స్థలాలను (టెన్ పర్సెంట్ ల్యాండ్)లను కూడా ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. ఆయా కాలనీల్లో బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కు వంటి వాటి నిర్మాణం కోసం ఈ స్థలాలను కేటాయించాలి. నిబంధనల ప్రకారం ఈ 10 శాతం భూమిని సంబంధిత మున్సిపాలిటీ గానీ, గ్రామపంచాయతీ తన అధీనంలోకి తీసుకోవాలి. కానీ సంబంధిత అధికారులు వెంచర్ నిర్వాహకులతో చేతులు కలపడంతో ఈ ప్రజావసరాల ల్యాండ్ కూడా పరాధీనమైపోయింది. కానీ, ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాటు కొన్నందుకు లేని ఓపెన్ స్పేస్‌కు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దరఖాస్తుదారులకు ఏర్పడింది. డాక్యుమెంట్స్ షార్ట్‌ఫాల్ పేరుతో.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో చాలామందికి డాక్యుమెంట్ షార్ట్‌ఫాల్ అని వెబ్సైట్లో చూపుతోంది. అయితే ఏ డాక్యుమెంట్ అవసరమో సాధారణ దరఖాస్తుదారులకు తెలియడం లేదు. సేల్‌డీడ్, ఈసీ, లింక్‌డాక్యుమెంట్లు, లేఅవుట్కాపీ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిని నీర్ణీత సైజులో స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అయితే అంతగా అవగాహన లేని వారికి ఈ సాకేంతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. హెల్ప్‌డెస్క్‌ల్లో సమాచారం అంతంతే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్‌ల్లో పనిచేస్తున్న సిబ్బందికి చాలామందికి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో ఉన్న సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ.. చాలామందిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల నుంచి, మండలాల నుంచి దరఖాస్తుదారులు కలెక్టరేట్లకు తరలివస్తున్నారు. -
కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు
తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తు హార్డ్ కాపీలను (దరఖాస్తు ఫారం, రేషన్ కార్డు, ఆధార్ కార్డుల జీరాక్స్‌లను, అప్లికేషన్ ఐడీ నంబర్) స్వీకరిస్తున్నారు. ఇలా కార్యాలయానికి తీసుకవచ్చిన వారివే అప్రూవల్ చేస్తున్నారు. హార్డ్ కాపీలను అందజేయని వారివి పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు దారులకు కష్టాలు తప్పడం లేదు. పలువురు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్టిఫికెట్ల కోసం డబ్బులు సైతం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
గజ్వేల్‌లో నీటి కష్టాలు
‘మిషన్ భగీరథ’కు పట్టినిల్లు అయిన గజ్వేల్‌లోనే మంచినీళ్ల కష్టాలు మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గడపకు నల్లా ద్వారా మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టింది. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ప్రధాని మోదీ 2016 ఆగస్టు 7న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కానీ నేడు ఈ ప్రాంతానికి సరిపడా నీటి సరఫరా జరగకపోవడంతో నీటి కష్టాలు తప్పడంలేదు. ● ‘మిషన్ భగీరఽథ’కు అంకురార్పణ జరిగిన చోటే తగ్గిన నీటి సరఫరా ● రోజువారీ వినియోగం 70ఎంఎల్డీ పైనే.. ● సరఫరా అవుతోంది... 60లోపే ● రాబోవు రోజుల్లో కొరత తీవ్రమయ్యే అవకాశం ● మల్లన్నసాగర్ పైపులైన్ పూర్తయితే సమస్యకు పరిష్కారం మల్లన్నసాగర్ జలాశయం నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మల్లన్నసాగర్ నుంచి వచ్చే జలాలు కొండపాక మండలం మంగోల్ డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధి జరిగి అక్కడి నుంచి సరఫరా అవుతాయి. ఇక్కడి నుంచి లకుడారం వద్ద నిర్మించిన జీఎల్బీ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కి వస్తాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం సిద్దిపేట, జనగామ జిల్లాలకు ప్రత్యేక లైన్ ద్వారా ఇప్పటికే నీటి సరఫరా జరుగుతోంది. ఇక్కడి నుంచి రూ.210కోట్ల వ్యయంతో 16కిలోమీటర్ల పొడవున గజ్వేల్ మండలం అక్కారం సంపు వరకు లైన్ నిర్మాణం జరుగుతోంది. మరో నెల రోజుల్లో ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ నుంచి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనుంది. అక్కారం సంపు నుంచి కోమటిబండ మిషన్ హెడ్‌వర్క్స్‌కు గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు సరిపడనంతగా నీరు రానుంది. మల్లన్నసాగర్ లైన్ పూర్తయితేనే.. గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ పథకం దేశం దృష్టిని ఆకర్షించింది. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కేసీఆర్.. మానేరు ద్వారా సిద్దిపేటకు వాటర్‌గ్రిడ్ తరహాలో అందించిన నీటి పథకం తీరును పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. తొలి ఫలాలను గజ్వేల్ అందుకుంది. కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ వాటర్‌గ్రిడ్‌కు (గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1,055కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగానే కొండపాకలోని హెచ్ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్‌లైన్‌ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 హాబిటేషన్లలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని కలుపుకుని మరో 65 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు. దుబ్బాకకు సైతం ఇక్కడి నుంచే.. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, చేగుంట, దౌల్తాబాద్ మండలాల్లోని 213 గ్రామాలకూ ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోంది. సరఫరా 60ఎంఎల్డీలోపే.. ప్రస్తుతం కోమటిబండలోని ‘మిషన్ భగీరథ’ హెడ్వర్క్స్నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు రోజువారీగా 70ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 60ఎంఎల్డీలోపే సరఫరా అవుతోంది. ట్యాపింగ్ పాయింట్ నుంచి ఇంతే నీరు వస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి నిత్యం 8ఎంఎల్డీ నీరు రావాల్సి ఉండగా.. 5ఎంఎల్డీ మాత్రమే వస్తున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నీరు సరిపోక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. త్వరలోనే పైపులైన్ పూర్తిచేస్తాం మల్లన్నసాగర్ నుంచి వచ్చే పైప్‌లైన్ నిర్మాణం పూర్తయితే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ఇక ఇబ్బంది ఉండదు. త్వరలోనే ఈ పనులు పూర్తిచేసి హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ ట్యాపింగ్ మూసేస్తాం. ప్రస్తుతానికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రయత్నిస్తున్నాం. –శ్రీనివాస్, ఈఈ, గజ్వేల్ మిషన్ భగీరథ ఈనెల 21న మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 15, 16 వార్డులకు చెందిన ప్రజలు కమిషనర్ గొల్కొండ నర్సయ్యకు మంచినీటి సమస్యపై వినతి పత్రం ఇచ్చిన సంగతి కూడా తెల్సిందే. నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీకి నిత్యం 6.3 ఎంఎల్డీ నీరు రావాల్సి ఉంది. అయితే 5.5ఎంఎల్డీ మాత్రమే వస్తుండటంతో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. కొండపాక మండలం లకుడారం గ్రామంలోనూ పైప్‌లైన్ సమస్య వల్ల నాలుగైదు రోజులపాటు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించారు. కమిషనర్‌కు వినతి.. -
స్వశక్తితో ముందుకు సాగాలి
అదనపు కలెక్టర్ అగర్వాల్సిద్దిపేటజోన్: మహిళలు స్వశక్తితో సాధికారత వైపు అడుగులు వేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. బుధవారం సెట్విన్ కేంద్రంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు శిక్షణ ద్వారా మరింత నైపుణ్యం సాధించాలని సూచించారు. మహిళలకు రుణాలు, శిక్షణ తరగతులు, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సెట్విన్ ఇన్చార్జి అమినా భాను, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నాణ్యమైన బియ్యం అందించండి దుబ్బాకరూరల్: మండలంలోని రామక్కపేట బాలికల గురకుల పాఠశాలను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వంట గదిని, కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. బియ్యం నాణ్యతగా లేక పోవడంతో వెంటనే సివిల్ సప్లై అధికారులతో మాట్లాడారు. నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ఆదేశించారు. వంట విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శారద, జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ, తహసీల్దార్ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. -
విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి
● ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం ● జాతీయ సదస్సు ప్రారంభం సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సును బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచేలా ఉన్నత విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయన్నారు. వీటిని వెనకబడిన వర్గాలు అందిపుచ్చుకుంటేనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి మాట్లాడుతూ ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ నేపథ్యంలో సామాజిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయని, వాటిని అధిగమించి అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఉద్యమ జ్ఞాపకాలు, పాటలతో విద్యార్థినీ, విద్యార్థులను అలరించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడుతూ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60 పరిశోధనా పత్రాలు వచ్చాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించిన అర్థశాస్త్ర విభాగం అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో దరువు ఎల్లన్న, డా. దివ్య తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ అనురాధతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
జిల్లా వ్యవసాయ అఽధికారి రాధిక జగదేవ్‌పూర్(గజ్వేల్): జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. బుధవారం మండలంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు, పీఎస్బీ, ట్రైకోడెర్మా విరిడిని పంపిణీ చేశామన్నారు. పంట మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. ఎకరం వరిని పండించే నీటితో ఐదెకరాల మొక్కజొన్నను సాగు చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఏఓ వసంతరావు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. పంట మార్పిడి తప్పనిసరి మర్కూక్(గజ్వేల్): పంట మార్పిడితోనే చీడపీడల ఉధృతి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. మండంలోని నర్సన్నపేటలో బుధవారం మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు యాసంగిలో పత్తి పంట తీసిన తర్వాత మొక్కజొన్న పంటలను సాగుచేయడం వలన నీటిని ఆదాచేయడంతోపాటు పంటమార్పిడి జరుగుతుందని తెలిపారు. తద్వారా చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈఓ విష్ణు, రైతులు పాల్గొన్నారు.