ఎంపీ రాజయ్యపై వేధింపుల కేసు | harrassment case filed on siricilla mp rajaiah | Sakshi

ఎంపీ రాజయ్యపై వేధింపుల కేసు

Apr 29 2014 10:26 AM | Updated on Aug 14 2018 4:24 PM

ఎంపీ రాజయ్యపై వేధింపుల కేసు - Sakshi

ఎంపీ రాజయ్యపై వేధింపుల కేసు

వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు, ఆయన కుటుంబంపై వేధింపుల కేసు నమోదైంది.

వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు, ఆయన కుటుంబంపై వేధింపుల కేసు నమోదైంది. సికింద్రాబాద్ బేగంపేట మహిళా పోలీస్టేషన్లో రాజయ్య కోడలు సారిక ఈ కేసు పెట్టారు. 2006లో రాజయ్య కుమారుడు అనిల్‌తో ఆమెకు వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. ఈ మధ్య కాలంలో అనిల్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీంతో అనిల్‌ కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడు అనిల్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యుల పై నాంపల్లి కోర్టులో సారిక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నాంపల్లి ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులతో బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు  ..రాజయ్య కుటుంబంపై వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని బేగంపేట ఏసీపీ మనోహర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement