2024 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యంలో పెద్దపండుగలాంటి లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో జరగగా, అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన ఎన్నికల ఘట్టం ముగిసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయాలు, ఆర్థికరంగ పరిణామాలు, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ ఇలా మరెన్నో రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
బోయింగ్‌కు కలసిరాని ఏడాది
ఏవియేషన్ దిగ్గజ సంస్థ బోయింగ్ తమ 737 మ్యాక్స్‌కు గత ఏడాది ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. అయితే 2024 మొదట్లో అలాస్కా ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్ విమానం ప్రయాణం మధ్యలో దాని వెనుక డోర్ ప్లగ్-ఇన్ పనితీరులో విఫలమయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి భారీ ప్రమాదం జరగనప్పటికీ, 737 మ్యాక్స్ 9 తరహాకు చెందిన విమానాల తయారీ నిలిచిపోయింది. ఈ ఏడాది బోయింగ్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. మరోవైపు బోయింగ్‌కు చెందిన మాజీ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్ అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు.
స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ప్రయోగం విఫలం
బోయింగ్ సంస్థ 2024లో చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాన ప్రయోగం అర్థాంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. వ్యోమగాములు సునీత, విల్‌మోర్‌లు ఎనిమిది రోజుల మిషన్ కోసం జూన్‌లో అంతర్జాతీయ స్సేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా, స్టార్ లైనర్‌లో లోపాలు తలెత్తాయి. థస్టర్ విఫలమవడం, హీలియం లీక్ కావడంతో సునీత, విల్‌మోర్‌లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే 2025 ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయోధ్యలో నూతన రామాలయం
2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకతో ఈ ఏడాది హిందువులకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హిందువుల కల నెరవేరింది. నాటి నుంచి బాలరాముని దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.
ట్రంప్ పునరాగమనం
2024లో అగ్రగాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ విజయం సాధించారు.
మరింత ధనవంతుడైన ఎలన్ మస్క్
ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కి 2024 కలసివచ్చింది. పలు వెంచర్లలో మస్క్ విజయాలను అందుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయంతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సంపద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.
ఉక్రెయిన్ చేతికి రష్యా ప్రాంతాలు
2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 2024లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2024 ఆగస్టులో ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఉక్రెయిన్ ఇతర ప్రాంతాల్లో ఓడిపోయినప్పటికీ కుర్స్క్‌పై నియంత్రణను కొనసాగించింది.
ఇది కూడా చదవండి: Christmas And New Year Trip: రూ. ఐదువేలతో సూపర్ టూర్ ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment