LookBack Trends
-
Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు
మనం 2024కు వీడ్కోలు పలకబోతున్నాం. గడచిన ఈ ఏడాదిలో రక్షణ రంగంలో దేశం పలు విజయాలను సాధించింది. వీటిలో చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)వెంబడి దళాల ఉపసంహరణ, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్ ఎంకే 1ఏకు మొదటి టెస్ట్ ఫ్లైట్, హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష మొదలైనవి ఉన్నాయి. భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.1. చైనాతో సరిహద్దు వివాదం2024 అక్టోబరులో భారత్- చైనాలు దేప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్ ఏర్పాట్లపై దళాల తొలగింపు చివరి దశపై అంగీకారం తెలిపాయి. ఈ ఉత్తర లడఖ్ ప్రాంతంలో గతంలో పలు వివాదాలు ఉన్నాయి.2. మిషన్ దివ్యాస్త్రమార్చిలో భారత్.. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దివ్యస్త్రతో మల్టిపుల్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఏకకాలంలో పలు ఆయుధాలను మోసుకెళ్లగలదు.3. ప్రాజెక్ట్ జోరావర్జూలైలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), లార్సెన్ అండ్ ట్రాబ్ (ఎల్ అండ్ టీ) లడఖ్‌లో చైనాకు చెందిన జేక్యూ-15ని ఎదుర్కొనేందుకు రూపొందించిన లైట్ ట్యాంక్‌ను అభివృద్ధి చేశాయి. ఈ ట్యాంక్ బరువు 25 టన్నులు. ఇది త్వరలోనే సైన్యంలో చేరనుంది.4. తేజస్ ఎంకే 1ఏ విమానంమార్చి 28న తేజస్ ఎంకే 1ఏకు చెందిన తొలి విమానం విజయవంతమైంది. భారత వైమానిక దళానికి చెందిన పాత విమానాల స్థానంలో దీనిని రూపొందించారు.5. ఐఎన్ఎస్ అరిఘాట్ ఆగస్టు 29న భారత్‌కు చెందిన రెండవ అరిహంత్-తరగతి అణు జలాంతర్గామి.. ఐఎన్ఎస్ అరిఘాట్‌ను ప్రారంభించింది. ఈ జలాంతర్గామి భారతదేశ భద్రతను మరింత పటిష్టం చేస్తుంది.6. అణు క్షిపణి పరీక్షఐఎన్ఎస్ అరిఘాట్‌ను ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత, భారతదేశం కే-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది 3,500 కి.మీ. రేంజ్ సామర్థ్యం కలిగివుంది.7. హైపర్సోనిక్ క్షిపణి పరీక్షనవంబర్లో భారత్ ఒడిశా తీరంలో సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.8. కొత్త నేవీ హెలికాప్టర్ల కమిషన్మార్చిలో భారత నౌకాదళం కొత్త ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్ల స్క్వాడ్రన్‌ను ప్రారంభించింది. యాంటీ సబ్‌మెరైన్ హెలికాప్టర్లలో ఇది ఒకటి.9. సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ అక్టోబర్‌లో భారత్,, గుజరాత్లో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ అవ్రో-748 విమానాలను తయారు చేస్తారు.10. రుద్రం-II మేలో భారత్ ఎస్‌యూ-30ఎంకేఐ నుండి రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రమ్-IIను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి రూపొందించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు -
Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరం-2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల్లోనే 2024 ముగియనుంది. తరువాత జనం నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోనున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు చోటుచేసుకోబోతున్నప్పటికీ, భారత రాజకీయాలకు 2024 ప్రధానమైనదిగా నిలిచింది. 2024లో ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడం, 24 ఏళ్లు ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓడిపోవడం వంటి ఘటనలు ఎప్పటికీ మరచిపోలేనివిగా నిలిచాయి.లోక్‌సభ ఎన్నికలు- 20242024 సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈసారి ఎన్నికల ఫలితాలు పలు రాజకీయ పార్టీలకు షాకింగ్‌గా నిలిచాయి. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారత మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయిన ఘనత ప్రధాని మోదీ దక్కించుకున్నారు.అయోధ్యలో బీజేపీ ఓటమి2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. 400 ఫిగర్ దాటుతుందనే నినాదం అందుకున్న బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు గాను బీజేపీకి 37 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి రెండు సీట్లు, అప్నాదళ్కి ఒక సీటు లభించాయి. దేశంలోనే అత్యంత హాట్ సీటుగా నిలిచిన అయోధ్య లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.జైలుకెళ్లిన కేజ్రీవాల్ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’కు సంబంధించిన అవినీతి కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణంలో 2024, మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసును ఈడీ, సీబీఐ రెండూ విచారించాయి. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12న సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ సెప్టెంబర్ 17న రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది.హేమంత్ సోరెన్ జైలు జీవితం2024లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అవినీతి కుంభకోణంలో జనవరిలో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత బెయిల్ పొందిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పదవిని చేపట్టారు. ఈఘటనల దరిమిలా చంపై సోరెన్ జెంఎంఎంను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించి, హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.నవీన్ పట్నాయక్ ఓటమిఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరొందిన నవీన్ పట్నాయక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి 51 సీట్లకు తగ్గగా, బీజేపీకి 78 సీట్లు రావడంతో పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది.ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంనెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఈ ఏడాది రాజకీయాల్లో క్రియాశీలక అరంగేట్రం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదిలి రాయ్‌బరేలీ స్థానానికి ఎంపీగా కొనసాగారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రియాంక గాంధీని వయనాడ్ స్థానం నుండి బరిలోకి దింపింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 64.99శాతం ఓట్లతో విజయం సాధించి తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలికారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గానూ 230 స్థానాల్లో విజయం సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, శివసేన 57 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఎంవీఏ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మీద 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాదాపు 48 ఏళ్లుగా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం విశేషం.ఢిల్లీ సీఎంగా అతిశీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ సీఎం ఎవరనేదానిపైనే చర్చ జరిగింది. మనీష్ సిసోడియాకు ఢిల్లీ సీఎం పదవి ఇవ్వవచ్చని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎం పదవికి అతిశీ పేరును ప్రతిపాదించారు. అందరి అంగీకారంతో అతిశీ ఢిల్లీ సీఎం అయ్యారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: 180 ఐఏఎస్‌లు, 200 ఐపీఎస్‌ల ఎంపిక.. టాప్‌లో ఏ రాష్ట్రం? -
Year Ender 2024: 180 ఐఏఎస్‌లు, 200 ఐపీఎస్‌ల ఎంపిక.. టాప్‌లో ఏ రాష్ట్రం?
2024 మరికొద్ది గంటల్లో ముగియనుంది. వెంటనే 2025 ఆవిష్కృతం కానుంది. గడచిన 2024 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ సర్వీస్‌లకు ప్రత్యేకంగా నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు ఎంపికయ్యారు.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంక్, అనన్యారెడ్డి మూడో ర్యాంకు దక్కించుకున్నారు. వీరంతా యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారు. నిబద్ధతతో చదువుకుంటూ, ఉత్తీర్ణులై అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో స్థానం సంపాదించారు.2024 యూపీఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణులైనవారిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారు. యూపీ నుంచి గరిష్టంగా 27 మంది ఐఎఎస్ అధికారులు ఎంపికయ్యారు. రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన 23 మంది అభ్యర్థులు ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారు. బీహార్ నుంచి 11 మంది, మధ్యప్రదేశ్ నుంచి 7 మంది అభ్యర్థులు అధికారులుగా ఎన్నికయ్యారు.ఈ ఏడాది టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఐపీఎస్ అధికారులు. వన్ ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ, నాల్గవ ర్యాంక్ సాధించి పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్, ఐదవ ర్యాంక్ సాధించిన రౌహానీలు ఇప్పటికే హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. గత 11 ఏళ్లుగా సర్వీస్‌లో ఉంటున్న ఒక అధికారి యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు 2013లో ఐపీఎస్ అధికారి గౌరవ్ అగర్వాల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు.ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగాల నియామకం కోసం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రక్రియతో సహా మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు తొమ్మిది లక్షల నుండి 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం -
కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..
దేశానికేకాదు, వ్యక్తులకు వారి పెట్టుబడులకు బడ్జెట్ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఆయా ఇన్వెస్ట్మెంట్ల(investments)ను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో సాధారణంగా చాలామంది తమ పెట్టుబడులను సమీక్షిస్తారని చెబుతున్నారు.విడిగా ఒక లక్ష్యానికి ఎంత కాలంలో, ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది బడ్జెట్లో రాసుకుంటారు. అందుకు అనుకూలించే ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటారు. మరి సదరు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పనితీరు మీ రాబడులు ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? లేదా? పనితీరు బాగోలేకపోతే ఆ ఒక్క పథకంలోనే అలా ఉందా లేక ఆ విభాగంలోని మిగిలిన పథకాల పనితీరు కూడా అదే మాదిరిగా ఉందా? అన్నది పరిశీలించుకోవాలి. విభాగం మొత్తం పనితీరు అదే మాదిరిగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. మరికొంత వ్యవధి ఇచ్చి చూడొచ్చు. పథకంలో లోపం ఉంటే, అందుకు కారణాలను గుర్తించాలి. అవి సమగ్రంగా లేకపోతే మరో పథకంలోకి మారిపోవడాన్ని పరిశీలించొచ్చు.రిస్క్‌ను అధిగమించేలా..ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏదో ఒక విభాగంలోని పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందితే, రీబ్యాలన్స్ (Re balance) చేసుకోవాలి. ఒక విభాగం పెట్టుబడుల విలువ అధికంగా వృద్ధి చెందినప్పుడు.. అధిక విలువ ఉన్న చోట నిర్ణీత శాతం మేర పెట్టుబడులు విక్రయించి, తక్కువ విలువ వద్దనున్న విభాగంలోకి మార్చుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్గా చెబుతారు. దీని ద్వారా రిస్క్‌ను అధిగమించొచ్చు. బీమా కవరేజీపై దృష్టిటర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance)లోనూ మార్పులు అవసరం పడొచ్చు. ఉదాహరణకు గృహ రుణం తీసుకున్నారని అనుకోండి.. ఆ మేరకు టర్మ్ కవరేజీని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఇతర ఏ రుణం తీసుకున్నా సరే ఆ మేరకు కవరేజీ పెంచుకోవాలి. వివాహం, పిల్లలతోపాటు బాధ్యతలూ పెరుగుతుంటాయి. ఏటా ఆదాయం కూడా వృద్ది చెందుతుంది. వాటికి అనుగుణంగా తమ బీమా కవరేజీని సమీక్షించుకోవాలి. ఆరోగ్య బీమా కవరేజీ ప్రస్తుత కుటుంబ అవసరకాలకు సరిపడా ఉందా? అని సమీక్షించుకోవాలి. లేదంటే అదనపు కవరేజీతో తక్కువ వ్యయానికే సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’అత్యవసర నిధి.. వీలునామాలో మార్పులురుణ భారంలో ఉంటే కొత్త ఏడాదిలో దాన్నుంచి బయటపడే మార్గాన్ని గుర్తించాలి. అత్యవసర నిధిలోనూ మార్పులు అవసరమే. జీవన వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. కనుక 2–5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధి ఇప్పటి అవసరాలకు సరిపోకపోవచ్చు. ప్రస్తుత ఖర్చులను కనీసం ఏడాది పాటు అయినా అత్యవసర నిధి గట్టెక్కించగలదా? అన్నది సమీక్షించుకోవాలి. లేదంటే అదనంగా సమకూర్చుకోవాలి. రెండేళ్ల అవసరాలకు సరిపడా ఏర్పాటు చేసుకుంటే మరింత నిశ్చింతగా ఉండొచ్చు. నామినేషన్లు, వీలునామాలో మార్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు మార్పులు చేసుకోవాలి. అవసరమైతే ఏడాదిలో ఒక్కసారి అయినా ఆర్థిక నిపుణులను సంప్రదించి సమగ్రమైన సమీక్ష చేయించుకోవాలి. -
Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం
2024 కొద్ది గంటల్లో ముగియనుంది. 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మధ్యకాలంలో మనం గడచిన ఏడాది మిగిల్చిన గురుతులను ఒకసారి నెమరువేసుకుందాం. ముఖ్యంగా 2024 ఎంతో ప్రత్యేకంగా నిలిచిన జమ్ముకశ్మీర్ గురించి చర్చిద్దాం.2024 అక్టోబర్ 8న జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధికార హోదాను దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అత్యధిక మెజారిటీతో కొత్త అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే పూర్తి రాష్ట్ర హోదా లేని కారణంగా ఈ ప్రభుత్వానికి మునుపటిలా అత్యధిక అధికారాలు లేవు. దీంతో పరిమిత అధికారాలతో ప్రభుత్వాన్ని నడపడం ఒమర్ అబ్దుల్లాకు సవాల్‌గా మారింది. అయితే ఈసారి జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విలసిల్లింది.జమ్ముకశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి. 2024లో ఇక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General election) గత 35 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. 58.46 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగి, 63.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి వేర్పాటువాదులు, జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధం ఉన్నవారు కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమాత్-ఎ-ఇస్లామీ నిషేధానికి గురైనా, దానికి మద్దతు పలికిన అభ్యర్థులు 10 స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో చాలామంది తమ డిపాజిట్లను కూడా కాపాడుకోలేకపోయారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమాత్‌పై నిషేధం విధించారు.మరోవైపు జమ్ము డివిజన్లోని రియాసి, దోడా, కిష్త్వార్, ఉధంపూర్లలో పాకిస్తానీ ఉగ్రవాదులు(Pakistani terrorists) దాడులకు పాల్పడటం భారత భద్రతా ఏజన్సీల ఆందోళనను పెంచింది. జూన్ 9న రియాసిలో ఏడుగురు యాత్రికులు శివ్ ఖోరీ తీర్థయాత్ర నుండి బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. అదేవిధంగా ఉధంపూర్, కిష్త్వార్లలో ముగ్గురు గ్రామ రక్షణ గార్డులు మృతిచెందారు. వేర్వేరు ఉగ్రవాద ఘటనల్లో 18 మంది భద్రతా దళాల సిబ్బంది అమరులయ్యారు.రాబోయే 2025లో జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా సంస్థలు మరింత ఉత్సాహంగా పాక్ చొరబాటు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. 2019కి ముందున్న కాశ్మీర్ అందాలను కాపాడుతూ, ఇక్కడ అల్లరి మూకల హింసాకాండ చెలరేగకుండా భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: 100 శాతం ఫలితాలతో క్యాన్సర్ ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
లాభాల ‘ఆఫర్లు’.. క్యూకట్టిన ఇన్వెస్టర్లు
సరిగ్గా మూడేళ్ల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. భారీ లాభాలతో కళకళలాడాయి. ఈ క్యాలండర్ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను (IPO) చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ (Record) కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్‌స్థాయిలో క్యూకట్టారు. ఫలితంగా లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలవగా.. 17 మాత్రం నష్టాలతో ముగిశాయి.వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ మరుగున పడింది. ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీస్థాయిలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, సులభతర లావాదేవీల నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో అధిక శాతం కంపెనీలు లాభాలతో లిస్టయ్యి ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత పెంచాయి.వెరసి కొత్త ఏడాది (2025)లోనూ మరిన్ని కొత్త రికార్డులకు వీలున్నట్లు మార్కెట్నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్‌డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది!భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai IPO)రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ (Swiggy IPO) రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజినీర్స్, బీఎల్ఎస్ ఈసర్వీసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి.మరింత స్పీడ్ డిసెంబర్ చివరి వారంలో స్పీడ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల ప్యాకేజింగ్ మెషినరీ తయారీ కంపెనీ మమతా మెషినరీ లిస్టింగ్‌లో ఇష్యూ ధర రూ.243తో పోలిస్తే 147% ప్రీమియంతో రూ.600 వద్ద నమోదైంది. రూ.630 వద్ద ముగిసింది. ఈ బాటలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఎంఏ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇష్యూ ధర రూ.283తో పోలిస్తే 39% అధికంగా రూ.393 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 61% ఎగసి రూ.457 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 47% లాభంతో రూ.415 వద్ద స్థిరపడింది.విద్యుత్ ప్రసారం, పంపిణీల ఈపీసీ కంపెనీ ట్రాన్స్‌రైల్ లైటింగ్ షేరు ఇష్యూ ధరరూ.432తో పోలిస్తే 35% ప్రీమియంతో రూ.585 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 40% ఎగసి రూ.604 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 28% లాభంతో రూ.553 వద్ద ముగిసింది. విభిన్న యార్న్ తయారీ సనాతన్ టెక్స్టైల్స్ ఇష్యూ ధర రూ.321తో పోలిస్తే 31% అధికంగా రూ.419 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 31% పెరిగి రూ.423 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 21% లాభంతో రూ.389 వద్ద స్థిరపడింది.వాటర్ ప్రాజెక్టుల కంపెనీ కంకార్డ్ ఎన్విరో ఇష్యూ ధర రూ.701తో పోలిస్తే 19% అధికంగా రూ.832 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 23% ఎగసి రూ.860 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 18% లాభంతో రూ.828 వద్ద స్థిరపడింది. సోమవారం(30న) వెంటివ్ హాస్పిటాలిటీ, సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్, కారారో ఇండియా లిస్ట్‌కానుండగా.. 31న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ నమోదుకానుంది. -
చేతులు మారిన కంపెనీలు.. ఈ ఏడాది బిగ్ డీల్స్ ఇవే..
ఈ కేలండర్ ఏడాది(2024)లో మీడియా, సిమెంట్, ఎయిర్‌లైన్స్ తదితర రంగాలలో భారీ కొనుగోళ్లు, విలీనాలు జరిగాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్– డిస్నీ ఇండియా (Reliance-Disney) డీల్తోపాటు.. ఎయిర్ ఇండియా (Air India Deal), విస్తారా విలీనం, అదార్ పూనావాలా– థర్మ ప్రొడక్షన్స్ డీల్, భారత్ సీరమ్స్‌ను సొంతం చేసుకున్న మ్యాన్‌కైండ్ ఫార్మా, అంబుజా సిమెంట్స్ చేతికి పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ తదితరాలు చేరాయి. వివరాలు ఇలా..భారీ మీడియా సంస్థగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా సంస్థలు, గ్లోబల్ దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన దేశీ విభాగంతో రూ. 70,000 కోట్ల విలువైన విలీనానికి తెరతీశాయి. తద్వారా గ్లోబల్ మీడియా సంస్థ ఆవిర్భావానికి ఊపిరిపోశాయి. వెరసి 2024 నవంబర్ 14కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేశాయి. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 16.34 శాతం, వయాకామ్18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు లభించాయి.టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ 2022లో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ దిగ్గజం విస్తారాను విలీనం చేసుకుంది. 2024 అక్టోబర్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌తో చౌక టికెట్ ధరల ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేసిన తదుపరి విస్తారాతో ఎయిర్ ఇండియాను మరింత విస్తరించింది. వెరసి ప్రస్తుతం ఎయిర్ ఇండియా 5,600 వీక్లీ విమానాలతో 90కుపైగా ప్రాంతాలను కలుపుతూ సర్వీసులు అందిస్తోంది. విలీనంలో భాగంగా కొత్త సంస్థలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను పొందింది.వ్యాక్సిన్ల సంస్థ మీడియావైపు వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్‌కు చెందిన థర్మ ప్రొడక్షన్స్ అండ్ థర్మాటిక్ ఎంటర్టైన్మెంట్పై దృష్టి పెట్టారు. వెరసి పూనావాలా 50 శాతం వాటా దక్కించుకోగా.. కరణ్ జోహార్ వాటా 50 శాతంగా కొనసాగుతోంది. కరణ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఫార్మా చేతికి వ్యాక్సిన్లు హెల్త్‌కేర్ రంగ లిస్టెడ్ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్‌తో డీల్ కుదుర్చుకుంది. భారత్ సీరమ్స్‌ను రూ. 13,768 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా మహిళా ఆరోగ్య పరిరక్షణ, ఫెర్టిలిటీ ఔషధాలలోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు మ్యాన్‌కైండ్ ఫార్మాకు తోడ్పాటునిచ్చింది.సిమెంటింగ్ డీల్ డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సంస్థకు చెందిన అంబుజా సిమెంట్స్ విస్తరణపై కన్నేసింది. దీనిలో భాగంగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను రూ. 10,422 కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా 2024 ఆగస్ట్ 16కల్లా పెన్నా సిమెంట్‌ను పూర్తి అనుబంధ కంపెనీగా మార్చుకుంది. మరోవైపు ఓరియంట్ సిమెంట్‌లో దాదాపు 47 శాతం వాటాను 45.1 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)కు కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. విస్తరణలో భాగంగా దక్షిణాది మార్కెట్లో విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్.. ఇండియా సిమెంట్స్‌పై గురి పెట్టింది. తొలుత 23 శాతం వాటాను సొంతం చేసుకున్న అల్ట్రాటెక్ తదుపరి ప్రమోటర్ల నుంచి మరో 32.72 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 4,000 కోట్లవరకూ వెచ్చించింది. దీంతో ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55 శాతానికి చేర్చుకుంది. ఈ బాటలో తాజాగా ఓరియంట్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాను రూ. 851 కోట్లకు చేజిక్కించుకుంది. -
Year Ender 2024: విద్యారంగంలో నూతన అధ్యాయం
2024లో దేశంలోని విద్యావ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలో జరిగిన వివిధ పరీక్షల పేపర్ లీక్ కేసులు ప్రభుత్వాన్ని పలు ఇబ్బందులకు గురిచేశాయి. ఇదిలావుంటే విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను కూడా చేపట్టింది. 2024లో విద్యా రంగంలో చోటుచేసుకున్న నూతన మార్పులను ఒకసారి గుర్తుచేసుకుందాం.వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్దేశంలో విద్య, పరిశోధనలకు నూతన దిశను అందించడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్(One Nation One Subscription) పథకాన్ని ప్రారంభించింది. ఇది విద్యార్థులు, పరిశోధకులకు జాతీయ స్థాయిలో అకడమిక్ జర్నల్స్, ఈ-బుక్స్, పరిశోధన డేటాబేస్లను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకానికి రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు ఇది డిజిటల్ విప్లవంగా మారింది.పీఎం విద్యా లక్ష్మి యోజన2024లో కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం ముఖ్యంగా దేశంలోని 860 ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు కనీస వడ్డీ రేట్ల(Minimum interest rates)కు విద్యా రుణాలు లభిస్తాయి. ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకానికి ప్రభుత్వం వచ్చే ఏడేళ్లలో రూ.3,600 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.పీఎంశ్రీజాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020 కింద పీఎం శ్రీ విద్యాలయాలను నెలకొల్పారు. వీటిని సమగ్ర విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించారు. విద్యార్థులను అకడమిక్ పరిజ్ఞానం వైపు మాత్రమే కాకుండా సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, క్యారెక్టర్ బిల్డింగ్ వైపు ప్రేరేపించడం దిశగా ఈ విద్యా విధానం ముందుకుసాగనుంది.పీఎం ఇంటర్న్‌షిప్ పథకంకేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్(PM Internship) పథకాన్ని కూడా ఈ ఏడాదే ప్రారంభించింది. దీనిలో విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందగలుగుతారు. విద్యను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న యువతకు ఈ పథకం ఒక వేదికను అందిస్తుంది. విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా వివిధ రంగాలలో పనిచేసిన అనుభవాన్ని కూడా సంపాదించవచ్చు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు -
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు
మరికొద్ది గంటల్లో 2024 ముగియబోతోంది. 2025ను స్వాగతించేందుకు ప్రపంచమంతా సిద్ధమయ్యింది. 2024లో దేశంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. యూపీలో జరిగిన రెండు ఘటనలైతే ఎన్నటికీ మరువలేని విషాదాన్ని మిగిల్చాయి. వాటిని తలచుకుంటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.హత్రాస్ తొక్కిసలాట2024, జులై 2న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోరాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ రోజు మంగళవారం.. హత్రాస్(Hathras) పరిధిలోని పుల్రాయి గ్రామంలో నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది తరలివచ్చారు. సత్సంగం ముగిసిన అనంతరం భోలే బాబా పాదాలను తాకేందుకు ఆయన దగ్గరకు ఒక్క ఉదుటున జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమందికి గాయాలయ్యాయి.ఈ ఘటన దరిమిలా భోలే బాబా పరారయ్యాడు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపింది. యూపీ పోలీసులు భోలే బాబా కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాడు సీఎం యోగి స్పందిస్తూ, ఈ ఘటనకు కారకులైనవారినెవరినీ, వదిలిపెట్టబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 91 రోజుల పాటు పోలీసులు కేసు దర్యాప్తు చేసి, మొత్తం 11 మందిని నిందితులుగా తేల్చారు. అయితే ఈ చార్జిషీటులో నారాయణ్ సకర్ హరి అలియాస్ సూరజ్‌పాల్ బాబా(Surajpal Baba) పేరు లేకపోవడం విశేషం. ఈ కేసులో పోలీసులు 3,200 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు.ఝాన్సీ అగ్ని ప్రమాదం2024, నవంబర్ 15న యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ(Maharani Lakshmibai Medical College)లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చైల్డ్ వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎన్ఐసీయూ వార్డులో 54 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, చిన్నారుల బంధువులు చైల్డ్ వార్డు కిటికీ పగులగొట్టి, పలువురు చిన్నారులను రక్షించారు. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. యావత్‌దేశం ఈ ఉదంతంపై కంటతడి పెట్టుకుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం -
Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం
2024 ముగింపు దశకు వచ్చింది. 2024లో దేశంలోని రాజకీయాలతో పాటు సామాన్యుల జీవితాలను కూడా కుదిపేసే పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, విమానాలకు బాంబు బెదిరింపులు, పలుచోట్ల కాల్పులు వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇవి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆందోళన కలిగించాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..1. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జైలుఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 2024, మార్చి 21న అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఈ కేసులో జైలుకు వెళ్లారు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారించాయి. అయితే సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది.2. కోచింగ్ సెంటర్లో ప్రమాదం2024, జూలై 27న ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఇక్కడి రావు కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోని లైబ్రరీలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. భారీ వర్షాల కారణంగా బేస్మెంట్లోకి నీరు ప్రవేశించింది. ముగ్గురు విద్యార్థులు ఆ నీటిలో మునిగి మృతిచెందారు. ఈ దుర్ఘటన అనంతరం పలువురు విద్యార్థులు కోచింగ్ సెంటర్ ముందు నిరసనకు దిగారు. ప్రమాదానికి కారణమైన కోచింగ్ సెంటర్ భవన యజమానులతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు అధికారులు ఈ లైబ్రరీకి సంబంధించిన సమాచారాన్ని దాచినందుకు వారిని సస్పెండ్ చేశారు.3. ఓట్ల లెక్కింపుపై నిషేధంఈ ఏడాదిలో జరిగిన ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును హైకోర్టు నిషేధించింది. ఎన్నికల సమయంలో యూనివర్శిటీ క్యాంపస్‌లో అపరిశుభ్రతతో పాటు అరాచకాలు చోటుచేసుకోవడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ క్యాంపస్ మొత్తాన్ని విద్యార్థి నాయకులు శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కోర్టు అనుమతించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి నేతలను కోర్టు హెచ్చరించింది.4. తరచూ ఫేక్ బాంబ్ కాల్స్దేశ రాజధాని ఢిల్లీలో 2024 మే నుండి ఫేక్ కాల్స్, మెయిల్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవి డిసెంబరు వరకూ కొనసాగాయి. మేలో తొలిసారిగా ఢిల్లీలోని 200 పాఠశాలలు, విద్యాసంస్థలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తరువాత ఆస్పత్రులు, పాఠశాలలు, విమానాశ్రయాలకు వివిధ సమయాల్లో బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు అప్రమత్తమై ముమ్మర తనిఖీలు జరిపారు.5. కాల్పులు, దోపిడీలుఈ ఏడాది ఢిల్లీలో పలు నేర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బహిరంగంగా కాల్పులు జరిగాయి. ఇటువంటి ఘటనల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. జైలుకెళ్లిన పేరుమోసిన గ్యాంగ్స్టర్ల పేరుతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కాల్పులు, దోపిడీ ఘటనలు జరిగాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు
కొద్ది రోజుల్లో 2024 ముగిసి 2025 రాబోతుంది. 2024 మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వాటిని ఇప్పుడొకసారి గుర్తు చేసుకుంటే, భవిష్యత్‌లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడగలుగుతాం. 1. వాటర్ హీటర్ షాక్‌తో మహిళ మృతిఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్‌లో ఈ ఏడాది నవంబర్‌లో వాటర్ హీటర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.తప్పు ఎక్కడ జరిగింది?కరెంట్ స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో పాటు నీళ్లలో చేయి వేయడం ఆ మహిళ తప్పిదమే. ఫలితంగా ఆమె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.గ్రహించాల్సిన విషయంవాటర్ హీటర్ వినియోగించాక స్విచ్ ఆఫ్ చేయాలి. హీటర్ రాడ్‌ను నీటిలో నుండి తీసివేయాలి. ఆ తర్వాతనే ఆ వేడి నీటిని వినియోగించాలి2. రూమ్ హీటర్ కారణంగా వృద్ధురాలు మృతి 2024, నవంబర్‌లో యూపీలోని మీరట్‌లోని ఒక ఇంటిలోని బెడ్రూమ్లో ఒక వృద్ధ మహిళ మృతదేహం కనిపించింది. ఆమె రూమ్ హీటర్ ఆన్ చేసి పడుకుంది.జరిగిన తప్పిదం ఏమిటి?ఆ వృద్ధురాలు హీటర్ స్విచ్ ఆన్ చేసి, గది తలుపులు వేసుకుని పడుకుంది. రూమ్ హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడడంతో దానినే ఆమె పీల్చుకుంది. ఫలితంగా ఆమె మరణించింది.గ్రహించాల్సిన విషయంగదిలోని హీటర్ ఆన్‌చేసి, తలుపులు వేసుకుని ఎప్పుడూ నిద్రపోకూడదు. హీటర్‌ను రెండు గంటల కంటే ఎక్కువసేపు ఆన్‌లో ఉంచకూడదు.3. ప్రెషర్ కుక్కర్ పేలి బాలికకు గాయాలుఈ ఏడాది జూలైలో యూపీలోని శ్రావస్తి జిల్లాలో ప్రెషర్ కుక్కర్ పేలడంతో 11 ఏళ్ల బాలిక గాయపడింది.ఏమి తప్పు జరిగింది?ప్రెషర్ కుక్కర్లో పేలుడు సంభవించడానికి కారణం రబ్బరు సరిగా అమర్చకపోవడం లేదా విజిల్ పాడైపోవడం కారణమై ఉంటుంది.నేర్చుకోవాల్సిన విషయంకుక్కర్ని ఉపయోగించే ముందు రబ్బరు, విజిల్, సేఫ్టీ వాల్వ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.4. గీజర్ కారణంగా నవ వివాహిత మృతి2024 నవంబర్‌లో యూపీలోని బరేలీలో కొత్తగా పెళ్లయిన ఓ మహిళ బాత్రూమ్లో గీజర్ ఆన్‌లో ఉంచి స్నానం చేస్తోంది. అదేసమయంలో ఉన్నట్టుండి గీజర్ పేలిపోయింది.ఏం తప్పు జరిగింది?చాలాకాలంగా ఆ గీజర్‌కు సర్వీస్ చేయించలేదు.నేర్చుకోవాల్సినదిగీజర్ను చాలాకాలంపాటు వినియోగించకుండా ఉంటే, దానిని సర్వీస్ చేయించిన తరువాతనే వినియోగించాలి.5. గ్యాస్ సిలిండర్ పేలుడు2024, మార్చిలో పట్నాలో ఓ పెళ్లి వేడుకలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి.ఏం తప్పు జరిగింది?గ్యాస్ సిలిండర్ పేలిన సందర్భాల్లో సరైన నిర్వహణ లేకపోవడమే కారణం.నేర్చుకోవలసినది ఏమిటి?సిలిండర్‌ను ఎప్పుడూ నిలబెట్టి ఉంచాలి. దానిని పడుకోబెట్టి ఉంచకూడదు. దాని వాల్వ్ ఎప్పుడూ పైకి ఉండాలి. అలాగే సిలిండర్‌ను గాలి తగిలే ప్రాంతంలో ఉంచాలి. కిటికీలు, తలుపులు మూసివున్న ప్రాంతంలో ఉంచకూడదు.6. మొబైల్ ఛార్జర్ కారణంగా బాలిక మృతితెలంగాణలో విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె మొబైల్ ఛార్జర్‌ని ఆన్‌లో ఉంచి ఫోను వినియోగించింది. ఫలితంగా ఆమె విద్యుత్ షాక్‌నకు గురయ్యింది.ఏం తప్పు జరిగింది?విద్యుత్ ఛార్జర్‌ను విద్యుత్ సాకెట్లో పెట్టి, ఫోను వినియోగించడం వలన అది విద్యుత్ షాక్‌కు దారితీస్తుంది.మనం నేర్చుకోవల్సినది ఏమిటి?ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచి ఎప్పుడూ ఉపయోగించకూడదు.7. పవర్ బ్యాంక్ కారణంగా చెలరేగిన మంటలుఈ ఏడాది అమెరికాలోని ఒక ఇంటిలో ఒక శునకం పవర్ బ్యాంక్ నమలడంతో దాని నుంచి మంటలు చెలరేగాయి.ఏం తప్పు జరిగింది?చాలా పవర్ బ్యాంకులు ఓవర్ హీట్ అయినప్పుడు పేలే అవకాశం ఉంది.మనం నేర్చుకోవలసినదిపవర్ బ్యాంక్‌ను చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.8. డీజే సౌండ్‌కు చిన్నారి మృతిఈ ఏడాది భోపాల్‌లో డీజే శబ్దానికి ఓ చిన్నారి మృతి చెందింది.ఏం తప్పు జరిగింది?డీజే నుంచి వచ్చే ధ్వని మనిషి వినికిడి సామర్థ్యం కంటే 300 రెట్లు ఎక్కువ.దీని నుంచి నేర్చుకోవలసినదిఎల్లప్పుడూ లౌడ్ స్పీకర్లకు అత్యంత సమీపంలో నిలబడకూడదు. అటువంటి సందర్బాల్లో నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్లను ఉపయోగించాలి.9. జాబ్ ఆఫర్ పేరుతో మోసంఈ ఏడాది నవంబర్‌లో పంజాబ్‌లోని మొహాలీలో టెలిగ్రామ్‌లో జాబ్ ఆఫర్ పేరుతో ఒక ముఠా మోసానికి పాల్పడింది. ఓ యువకుడి నుంచి రూ.2.45 లక్షలకు పైగా మొత్తాన్ని వసూలు చేసింది.ఏం తప్పు జరిగింది?ఆ యువకుడు ఆ జాబ్ ఆఫర్‌ను గుడ్డిగా నమ్మాడు. వాళ్లు అడిగినంత మొత్తం చెల్లించాడు.దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠంఉద్యోగం పేరుతో ఎవరైనా మీ నుండి డబ్బు డిమాండ్ చేస్తుంటే, అటువంటి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.10. కారు లాక్ కావడంతో మూడేళ్ల బాలిక మృతి2024 నవంబర్‌లో యూపీలోని మీరట్‌కు చెందిన మూడేళ్ల బాలిక ఒక కారులో నాలుగు గంటలపాటు లాక్ అయిపోయింది. ఫలితంగా ఊపిరాడక ఆ చిన్నారి మృతిచెందింది.ఏం తప్పు జరిగింది?కారు డోరు లాక్ కావడంతో దానిలోని ఆక్సిజన్ లెవల్ తగ్గింది. కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగింది. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందింది.నేర్చుకోవలసిన అంశంకారులో పిల్లలను ఉంచి బయటకు వెళ్ల కూడదని గుర్తించాలి.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు -
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు
కొత్త ఏడాది(2025)లోకి మనమంతా అడుగుపెట్టేందుకు ఇక కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ తరుణంలో మన మదినిండా కొత్త ఆశలు చిగురిస్తాయి. అదేసమయంలో పాత ఊసులు కూడా మదిలో మెదులుతుంటాయి. 2024లో దేశంలో పలు విషాదకర ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వాటిలోని ముఖ్యమైన ఐదు ఉదంతాలను మనం ఎప్పటికీ మరువలేం. వాటిని ఒకసారి గుర్తుచేసుకుందాం. రాజ్‌కోట్ గేమింగ్ జోన్ 2024, మే 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇది సౌరాష్ట్రలోనే అతిపెద్ద గేమింగ్ జోన్‌గా పేరొందింది. ఈ ఘటన దరిమిలా పోలీసులు గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకితో పాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేకుండా ఈ గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారని, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది.హత్రాస్ తొక్కిసలాటయూపీలోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. సింకదారావులోని ఒక మైదానం.. సత్సంగం సందర్భంగా శ్మశాన వాటికలా మారింది. 2024, జూలై 2న హత్రాస్‌లోని పుల్రాయి గ్రామంలో సత్సంగం నిర్వహించారు. అనంతరం భోలే బాబా తన కారులో ఆశ్రమానికి తిరుగుపయనమయ్యారు. అదే సమయంలో బాబా పాదాలను తాకేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్బంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతిచెందారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా దేవ్ ప్రకాష్ మధుకర్‌తో సహా తొమ్మదిమందిని చేర్చారు. అయితే భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్‌ను ఈ కేసులో నిందితునిగా పేర్కొనకపోవడం విశేషం.వయనాడ్ విలయం2024, జూలై 30వ తేదీ రాత్రి కేరళలోని వయనాడ్‌లో ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఇది యావత్‌దేశాన్ని కుదిపేసింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మృతిచెందారు. 180 మంది గల్లంతయ్యారు. వారం రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది.ఝాన్సీ ఆస్పత్రిలో మంటలు2024, నవంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది నవజాత శిశువులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. కొందరు శిశువులను వారి తల్లిదండ్రులు కళ్లారా చూసుకోకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక ఆస్పత్రి పాలకవర్గ నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టమయ్యింది. షార్ట్ సర్క్యూట్ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం, సకాలంలో పిల్లలను ప్రమాదం బారి నుంచి తప్పించకపోవడం లాంటివి పెను ప్రమాదానికి దారితీశాయి. ఈ ఘటన దరిమిలా ఝాన్సీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ను విధుల నుంచి తొలగించగా, మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.జైపూర్ ట్యాంకర్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2024, డిసెంబర్ 20న అజ్మీర్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటచేసుకుంది. కంటైనర్ లారీ, ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొన్నాయి. వెంటనే ఎల్పిజి ట్యాంకర్‌కున్న అవుట్లెట్ నాజిల్ విరిగిపోయి, గాలిలోకి విష వాయువు వ్యాపించింది. చిన్నపాటి స్పార్క్ ఇంతటి భారీ ప్రమాదానికి కారణమయ్యింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి దాదాపు 40 వాహనాలు దగ్ధమయ్యాయి. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది.ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే -
Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే..
మనమంతా కొద్దిరోజుల్లో 2025లోకి ప్రవేశించబోతున్నాం. ఈ ముగియబోతున్న 2024 కొన్ని రంగాల్లో భారత్‌కు దిశానిర్దేశం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కొత్త పథకాలను అమలుచేశాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న భారతదేశ కలలను కలలను సాకారం చేసేందుకు దోహదపడనున్నాయి.ఈ సంవత్సరం భారత ప్రభుత్వం దేశంలోని యువతను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి పీఎం విద్యాలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. 2024లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలతో దేశంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో 2024లో కేంద్ర ప్రబుత్వం ఏయే పథకాలను ప్రారంభించిందో తెలుసుకుందాం.పీఎం విద్యా లక్ష్మీ యోజనప్రధాన మంత్రి విద్యా లక్ష్మి యోజన కింద ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఫీజులు, ఇతర ఖర్చులకు హామీ లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందుతారు. నవంబర్ 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు.ఈ పథకం కింద విద్యార్థులు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అదే సమయంలో రూ. 7.5 లక్షల వరకు రుణాలపై, విద్యార్థులు ప్రభుత్వం నుండి 75 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీని పొందుతారు. ఈ పథకం కింద కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4.5 లక్షలు ఉన్న విద్యార్థులకు వడ్డీపై పూర్తి సబ్సిడీ లభిస్తుంది. ఇదేకాకుండా వార్షిక ఆదాయం రూ. 8 లక్షలున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీని ఇస్తారు.బీమా సఖీ పథకంఈ పథకం లక్ష్యం ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడం. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసీ అందించే బీమా సఖీ పథకం నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలను బీమా ఏజెంట్లుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మూడేళ్ల పాటు మహిళలకు ప్రత్యేక శిక్షణ, గౌరవ వేతనం అందించనున్నారు.పీఎం సోలార్ హోమ్ స్కీమ్ప్రధాని నరేంద్ర మోదీ 2024, ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీని అందిస్తారు.సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఈ పథకాన్ని మరింతకాలం పెంచారు. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ అందించనున్నారు. ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. -
Year Ender 2024: వణికించిన విమాన ప్రమాదాలు
2024 ముగియడానికి ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంతలోనే కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఏడాది అధికంగానే విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.జపాన్ విమాన ప్రమాదం2024 జనవరి 2న జపాన్‌లోని టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516- జపాన్ కోస్ట్ గార్డ్ విమానం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు. అయితే కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు మృతిచెందారు.బెల్గోరోడ్ ఓబ్లాస్ట్ విమాన ప్రమాదం2024, జనవరి 24న బెల్గోరోడ్ ఒబ్లాస్ట్‌లో రష్యన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్ ఐఎల్ 76 సైనిక రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానంలో 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలతో పాటు తొమ్మిదిమంది సిబ్బంది ఉన్నారు. వీరంతా మృతిచెందారు.రష్యా విమాన ప్రమాదం2024, మార్చి 12న రష్యాలోని ఇవానోవో ఒబ్లాస్ట్‌లో ఇల్యుషిన్ ఐఎల్76 కార్గో విమానం కూలిపోయింది. దీంతో ఆ విమానంలోని మొత్తం 15 మంది మృతిచెందారు.ఇరాన్ విమాన ప్రమాదం2024, మే 19న ఇరాన్‌లోని తూర్పు అజర్బైజాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా మొత్తం తొమ్మిది మంది మృతిచెందారు.మలావి విమాన ప్రమాదం2024, జూన్ 10న మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా, ఇతర ప్రముఖులతో ప్రయాణిస్తున్న మలావీ డిఫెన్స్ ఫోర్స్ డోర్నియర్- 228 విమానం కూలిపోవడంతో అందులోని తొమ్మిది మంది మృతిచెందారు.నేపాల్ విమాన ప్రమాదం2024, జూలై 24న నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అందులో ఉన్న 19 మందిలో 18 మంది మృతిచెందారు.విన్హాడో విమాన ప్రమాదం2024, ఆగస్ట్ 9న బ్రెజిల్‌లోని సావోపాలోలోని విన్హెడోలో ఫ్లైట్- 2283 క్రాష్ అయ్యింది. అందులో మొత్తం 62 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఇది బ్రెజిల్లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.బ్రెజిల్ విమాన ప్రమాదం2024, డిసెంబర్ 22న బ్రెజిల్‌లోని కెనెలా విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైపర్ పీఏ42 చెయెన్నే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. 17 మంది గాయపడ్డారు.కజకిస్తాన్ విమాన ప్రమాదం2024, డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. క్రిస్మస్ రోజున జరిగిన ఈ విమాన ప్రమాదంలో 38 మంది మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్.. -
Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్..
2024లో భారత్ డిజిటల్ విప్లవంలో అనూహ్య పురోగతిని సాధించింది. క్రియేటర్లు తమ కంటెంట్‌తో ఇన్‌స్టాతో పాటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించారు. అలాగే కొత్తగా పలువురు డిజిటల్ స్టార్లు పుట్టుకొచ్చారు. భారత్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్తలను ఫోర్బ్స్ కూడా ప్రశంసించింది.2024లో 100 మంది కంటెంట్ క్రియేటర్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. గత అక్టోబర్‌లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 భారత్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాను విడుదల చేసింది. వీరిలో క్రియేటర్ నాన్సీ త్యాగి అందించిన ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ ఏడాది చాలా మంది కామెడీ క్రియేటర్లు సోషల్ మీడియాలో తమదైన ముద్రవేశారు. ఫ్యాషన్, కామెడీ క్రియేటర్లు మాత్రమే కాకుండా ఆరోగ్యం, సాంకేతికత, ట్రావెల్ క్రియేటర్లు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ వీరే..1 నాన్సీ త్యాగి (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్))2 సాక్షి కేశ్వాని (కామెడీ)3 డానీ పండిట్ (కామెడీ)4 ధారణ దుర్గా (హాస్యం)5 మహేష్ కేశ్వాల (కామెడీ)6 హర్షిత గుప్తా (కామెడీ)7 రాజవర్ధన్ గ్రోవర్ (కామెడీ)8 అపూర్వ ముఖిజా (కామెడీ)9 తారిణి పెషావారియా (బ్యూటీ)10 కిరణ్ దత్తా (కామెడీ)11 మితికా ద్వివేది (కామెడీ)12 సబా ఇబ్రహీం (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్) 13 శృతిక్ కోలంబకర్ (కామెడీ)14 మృదుల్ శర్మ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్) 15 రేవంత్ హిమత్సింకా (ఆరోగ్యం)16 రాహుల్ డ్యూ (కామెడీ)17 యువరాజ్ దువా (కామెడీ)18 కరిష్మా గాంగ్వాల్ (కామెడీ)19 త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (చేంజ్ మేకర్)20 రాకేష్ కుమార్ (టెక్నాలజీ)21 కరణ్ సోనావానే (కామెడీ)22 రాశి ప్రభాకర్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)23 అంకితా సెహగల్ (కామెడీ)24 సిద్ధార్థ్ బాత్రా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)25 అర్జున్ మనోహర్ (కామెడీ)26 అనుజ్ దత్తా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)27 స్వాతి రాతి (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)28 జీత్ సెలాల్ (ఆరోగ్యం)29 తాన్యా సింగ్ (బ్యూటీ)30 భారత్ వాధ్వా (ఆహారం)31 పూజా చాంద్వానీ (ఆహారం)32 కరణ్ ధింగ్రా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)33 అంకుష్ బహుగుణ (బ్యూటీ)34 షాజ్ జంగ్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)35 నబీల్ నవాబ్ (టెక్నాలజీ)36 ధృవ్ షా అండ్ శ్యామ్ శర్మ (కామెడీ)37 సమీనా మరియం (టెక్నాలజీ)38 అనునయ్ సూద్ (టావెల్ అండ్ ఫోటోగ్రఫీ)39 జెర్వాన్ బున్‌షా (కామెడీ)40 నిహారిక ఎన్ఎమ్ (కామెడీ)41 కోమల్ పాండే (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)42 విజయ్ యేనారెడ్డి (టెక్నాలజీ)43 అల్ఫియా కరీం ఖాన్ (బ్యూటీ)44 సోమశేఖర్ ఎం. పాటిల్ (టెక్నాలజీ)45 విరాజ్ ఘేలానీ (కామెడీ)46 దీబా రాజ్‌పాల్ (ఆహారం)47 జై కపూర్ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)48 అశ్విన్ ప్రభాకర్ (ఆహారం)49 తేజ పుచూరి (ఆహారం)50 నిఖిల్ శర్మ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)51 చేతన్య ప్రకాష్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)52 హర్జాస్ సేథి (కామెడీ)53 కింకర్ రే (టెక్నాలజీ)54 షానైస్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)55 రెబెక్కా రాయ్ అండ్ గౌతమ్ ఇలాంభారతి (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)56 శివభుజితన్ అండ్ స్వర్ణలక్ష్మి శ్రీనివాసన్(ఆహారం) 57 బృందా శర్మ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)58 నందు పాటిల్ (టెక్నాలజీ)59 గౌరవ్ చౌదరి (టెక్నాలజీ)60 ఉమా రఘురామన్ (ఆహారం)61 ఆకాంక్ష మోంగా (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)62 ఇస్సా ఖాన్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)63 ఆదిత్య వెంకటేష్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)64 శ్రీమణి త్రిపాఠి (టెక్నాలజీ)65 ఆకాష్ మల్హోత్రా (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)66 యష్ తివారీ (టెక్నాలజీ)67 శ్రీమయి రెడ్డి (బ్యూటీ)68 నమన్ దేశ్‌ముఖ్ (టెక్నాలజీ)69 సారా హుస్సేన్ (ఆహారం)70 జై అరోరా (టెక్నాలజీ)71 కరీనా టెక్వానీ (బ్యూటీ)72 స్నేహ సింఘీ ఉపాధ్యాయ్ (ఆహారం)73 అనుష్క రాథోడ్ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)74 లక్ష్య ఠాకూర్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)75 శివేష్ భాటియా (ఆహారం)76 షాలిని కుట్టి (బ్యూటీ)77 అక్షత్ శ్రీవాస్తవ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)78 అమీర్ వానీ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)79 తనయ నరేంద్ర (హెల్త్)80 నవనీత్ ఉన్నికృష్ణన్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)81 కాస్లిన్ నహా (బిజినెస్ అండ్ ఫైనాన్స్)82 వాహిని అరుణ్ (ఆరోగ్యం)83 అషర్ (చేంజ్‌మేకర్)84 కోమల్ గుడాన్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)85 మోహిత్ బలానీ (టెక్నాలజీ)86 ఆకాంక్ష కొమ్మిరెల్లి (బ్యూటీ)87 కనిష్క్ అగర్వాల్ (టెక్నాలజీ)88 వైభవ్ కేశ్వాని (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)89 ఉజ్వల్ పహ్వా(బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్)90 సీతారామన్ (టెక్నాలజీ)91 సాహిల్ గులాటి (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)92 మల్హర్ కలంబే (చేంజ్ మేకర్)93 శివమ్ పాట్లే (టెక్నాలజీ)94 శరణ్ హెగ్డే(బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్)95 సన గలార్ (ఆరోగ్యం)96 కుశాల్ లోధా (బిజినెస్ అండ్ ఫైనాన్స్)97 మహి శర్మ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)98 రూహి దోసాని (కామెడీ)99 నిధి తివారీ (చేంజ్ మేకర్)100 అనుజ్ రామ్త్రి (చేంజ్ మేకర్)2024లో కొత్త క్రియేటర్లు కూడా డిజిటల్ ప్రపంచంలో తమ ప్రభావాన్ని చూపారు. వీరు తమ సృజనాత్మకతతో ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. భారతదేశంలో సాంకేతిక పురోగతి , డిజిటలైజేషన్ వేగంగా జరుగుతున్నందున కంటెంట్ క్రియేటర్లకు తమ ప్రతిభ చాటుకునే అవకాశం దక్కుతోంది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న డిజిటల్ స్టార్స్ మరింతమంది కొత్త కంటెంట్ క్రియేటర్లకు స్ఫూర్తినిస్తున్నారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు -
World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు
2024కు త్వరలో వీడ్కోలు చెప్పబోతున్నాం. 2025ను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ 2024లో మనకు కొన్ని మంచి అనుభవాలతోపాటు చేదు రుచులు కూడా ఎదురయ్యాయి. అదే సమయంలో కొందరు రాజకీయ ప్రముఖలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలేమిటో, ఆ ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.మల్లికార్జున్ ఖర్గేఈఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయన తన విమర్శల్లో ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను టార్గెట్‌గా చేసుకున్నారు. ‘భారత్‌లో రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాంగ్లీలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే వ్యాఖ్యానించారు. ‘అవి విషం లాంటివి. ఆ పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. అలాంటి విష సర్పాలను చంపేయాలి’ అని కూడా అన్నారు. ఇదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసిన ఖర్గే ఆయనను తైమూర్ లాంగ్‌తో పోల్చారు. 400 సీట్లు ఖాయమనే నినాదం అందుకున్న మోదీ ప్రభుత్వం అటు జేడీయూ, ఇటు టీడీపీల అండదండలపైనే ఆధారపడిందని ఖర్గే విమర్శించారు. అలాగే ప్రధాని మోదీని అబద్ధాల నేత అని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.లాలూ ప్రసాద్రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన విమర్శలతో ఈ ఏడాది హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ చేపట్టిన మహిళా సంవాద్ యాత్రపై విరుచుకుపడ్డారు. దీనిపై జేడీయూ, బీజేపీలు లాలూపై ప్రతివిమర్శలకు దిగాయి. ‘ఇంతకుముందు లాలూజీ శారీరకంగా మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు మానసికంగా కూడా అస్వస్థతకు గురయ్యారని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా లాలూ చేసిన వ్యాఖ్యానాలు చాలా అసహ్యకరమైనవి, అవమానకరమైనవని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.రాహుల్ గాంధీరాహుల్ తన విదేశీ పర్యటనల సందర్భంగా భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రకటనలు చేశారు. వాషింగ్టన్లో రాహుల్ మాట్లాడుతూ భారత్‌లో మతస్వేచ్ఛ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి భారతదేశంలో లేదని రాహుల్ మరో కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇవి పెను రాజకీయ దుమారాన్ని రేపాయి.గిరిరాజ్ సింగ్కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఛత్ పండుగ రోజున స్వచ్ఛత గురించి మాట్లాడుతూ సిమ్లాలోని ఒక మసీదు వివాదంపై వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. మనం ఐక్యంగా ఉంటే మహ్మద్ ఘోరీ, మొఘల్ లాంటివారెవరూ మనల్ని ఓడించలేరని కూడా గిరిరాజ్ సింగ్ అన్నారు.ఇల్తిజా ముఫ్తీఇల్తిజా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె. ఆమె ‘హిందుత్వం’ను ఒక వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇల్తిజా ముఫ్తీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ వివాదానికి తెరలేపారు.సామ్ పిట్రోడాలోక్సభ ఎన్నికల సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర భారత్‌లోని ప్రజలు తెల్లగా కనిపిస్తారని, తూర్పు భారత్‌లోని వారు చైనీయులుగా కనిపిస్తారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణ భారత్ ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, పశ్చిమ భారతదేశ ప్రజలు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారన్నారు. సామ్ ప్రకటనపై దుమారం రేగడాన్ని చూసిన కాంగ్రెస్ వీటికి దూరంగా ఉంది. ఈ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది.భాయ్ జగ్తాప్కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ గతంలో ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎన్నికల కమిషన్ ఒక కుక్క.. ప్రధాని మోదీ బంగ్లా బయట కూర్చుని కాపలా కాస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఏజెన్సీలన్నీ ఇప్పుడు కీలుబొమ్మలుగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయి. వ్యవస్థను ఎలా తారుమారు చేస్తున్నారో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయని’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం -
World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం
2024.. ప్రపంచమంతటినీ యుద్ధ భయం వెంటాడింది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా నిలిచాయి. దీనికితోడు భీకర విధ్వంసాన్ని సృష్టించే అణ్వాయుధాల ముప్పు కూడా తొంగిచూసింది. 2024లో ప్రపంచాన్ని అనునిత్యం భయానికి గురిచేసిన యుద్ధాలివే..రష్యా-ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2024లో మరింత తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు రష్యా అంతర్భాగంలో యూఎస్ఏ ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే హైపర్సోనిక్ ఐసీబీఎం క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించడం ద్వారా రష్యా అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోదన్న సందేశాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న నాటో, అమెరికా, బ్రిటన్లపై దాడి చేస్తామని రష్యా పలుమార్లు హెచ్చరించింది. ఇది మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని మరింతగా పెంచింది.ఇజ్రాయెల్-హమాస్ 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రమంగా లెబనాన్, యెమెన్, ఇరాన్, సిరియాలను చుట్టుముట్టింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యెమెన్ హౌతీలు.. ఏడెన్ గల్ఫ్‌లోని ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్‌తో పాటు హౌతీలతోనూ పోరాడాల్సి వచ్చింది. హౌతీల దాడులను అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్ కలిసి యెమెన్‌పై పలుమార్లు భారీ వైమానిక దాడులు నిర్వహించి, హౌతీల కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ కూడా హౌతీలపై బలమైన ప్రతీకార దాడులను చేపట్టింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్‌లను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా జనం మృతిచెందారు.ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఇజ్రాయెల్ దళాలు హమాస్ నేతలను హతమార్చిన దరిమిలా ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడి చేపట్టింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఈ వైమానిక దాడిలో మరణించాడు. దీని తరువాత, కొత్త చీఫ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో హతమయ్యాడు. తరువాత గాజా తరహాలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో భూ ఆక్రమణకు పాల్పడింది. పేజర్లు, బ్యాటరీ బ్లాస్ట్లను ఉపయోగించి వేలాది మంది హెజ్బొల్లా యోధులను ఇజ్రాయెల్ అంతమొందించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.ఇజ్రాయెల్-ఇరాన్ ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణకు ముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్, హిజ్బుల్లా చీఫ్‌లు హసన్ నస్రల్లా, హషీమ్ సఫీద్దీన్లను అంతమొందించడంతో ఇరాన్ షాక్‌నకు గురయ్యింది. 2024 అక్టోబర్‌లో ఇరాన్ అకస్మాత్తుగా 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇది ప్రపంచమంతటినీ కలవరానికి గురిచేసింది. ఈ దాడి తరువాత, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ప్రత్యక్ష యుద్ధం ముప్పు మధ్యప్రాచ్యాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటికే యూరప్‌లో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాద ముప్పును మరింత పెంచింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది.సూడాన్- బంగ్లాదేశ్2024లో సూడాన్- బంగ్లాదేశ్‌లలో జరిగిన తిరుగుబాట్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఏప్రిల్ 2023 నుంచి సూడాన్ భీకర అంతర్యుద్ధంలో మునిగితేలుతోంది. జుంటా సైన్యం తిరుగుబాటు దరిమిలా సూడాన్ పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఈ రెండింటి మధ్య సంవత్సరాల తరబడి భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది సైనికులు, ప్రజలు మరణించారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం సూడాన్‌లో జరిగిన ఈ అంతర్యుద్ధంలో 27 వేల మందికి పైగా జనం మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం కారణంగా ప్రధాని షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు. అదిమొదలు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి.సిరియాలో.. సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. వారు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపధ్యంలో రష్యా అసద్‌కు ఆశ్రయం ఇచ్చింది. అనంతరం ఇజ్రాయెల్ సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, ఆ దేశంలోని బఫర్ జోన్‌ను స్వాధీనం చేసుకుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ప్రశ్నలివే.. జాబితా షేర్ చేసిన అమెజాన్ -
Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ప్రశ్నలివే.. జాబితా షేర్ చేసిన అమెజాన్
2024 ముగియడానికి ఇక కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ఏడాదిలో జరిగిన ఘటనలను ఒకసారి గుర్తు చేసుకోవడం పరిపాటి. వీటిలో కొన్ని విషయాలు మనకు ఎంతో వినోదాన్ని పంచుతాయి. అలాంటివాటిలో అలెక్సా వినియోగం ఒకటి.అమెజాన్‌కు చెందిన వాయిస్ అసిస్టెంట్ పరికరం అలెక్సా(alexa)ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. కొంతమంది దీనిని వినోదం కోసం ఉపయోగిస్తుండగా, మరికొందరు విద్య, వ్యక్తిగత జీవితం, వంటకాలు లేదా రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రశ్నలు సంధిస్తూ ఉపయోగించుకుంటున్నారు. అలెక్సా యూజర్ల ప్రశ్నలకు సరైన సమాధానమిస్తుంటుంది.2024లో భారతీయులు(Indians) అలెక్సాను అడిగిన కొన్ని ప్రశ్నల జాబితాను అమెజాన్ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం అలెక్సా యూజర్స్.. క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలను అధికంగా అడిగారు. అలాగే సెలబ్రిటీలు, గ్లోబల్ ఈవెంట్లు, పబ్లిక్ ఫిగర్లకు సంబంధించిన ప్రశ్నలను కూడా అడిగారు. ఈ సంవత్సరం అలెక్సా ఒక కిచెన్ గైడ్‌గా చాలామందికి సహాయపడిందని అమెజాన్ తెలిపింది.యూజర్స్ క్రికెట్‌పై అత్యధికంగా అడిగిన ప్రశ్నలివే..‘అలెక్సా, క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?’‘క్రికెట్ స్కోర్ ఎంత?’‘ఇండియా మ్యాచ్ ఎప్పుడు?’‘ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా స్కోరు ఎంత?’‘ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా స్కోరు ఎంత?’‘తదుపరి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు?’ఈ ప్రముఖుల హైట్ ఎంత అని అడిగారువిరాట్ కోహ్లీక్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)లియోనెల్ మెస్సీషారుక్ ఖాన్అమితాబ్ బచ్చన్కృతి సనన్దీపికా పదుకొనేహృతిక్ రోషన్ఈ ప్రముఖుల వయసు ఎంతని అడిగారునరేంద్ర మోదీవిరాట్ కోహ్లీషారుక్ ఖాన్అమితాబ్ బచ్చన్క్రిస్టియానో రొనాల్డోసల్మాన్ ఖాన్ఎంఎస్ ధోనిరోహిత్ శర్మహృతిక్ రోషన్టేలర్ స్విఫ్ట్ఈ ప్రముఖుల ఆస్తులకు సంబంధించి..2024లో యూజర్స్ ప్రముఖుల ఆస్తుల విలువను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ, మిస్టర్ బీస్ట్, ఎలాన్ మస్క్, క్రిస్టియానో రొనాల్డో, షారుక్ ఖాన్, జెఫ్ బెజోస్, లియోనెల్ మెస్సీ, విరాట్ కోహ్లీ, రతన్ టాటా, బిల్ గేట్స్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో, హార్దిక్ పాండ్యా, సల్మాన్ ఖాన్ తదితరులున్నారు.వింత ప్రశ్నలు కూడా..వాయిస్ అసిస్టెంట్ అలెక్సా పరికరాన్ని ఉపయోగించిన వినియోగదారులు పలు ఫన్నీ ప్రశ్నలు కూడా అడిగారు. ‘అలెక్సా, మీరు ఏమి చేస్తున్నారు?’, ‘అలెక్సా, మీరు నవ్వగలరా?’ ‘అలెక్సా, మీ పేరు ఏమిటి?’ లాంటి ప్రశ్నలను అడిగారు.ఇది కూడా చదవండి: అవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు -
Year Ender 2024: ఈ 10 అంశాలపైనే అంతటా చర్చ
మనమంతా ప్రస్తుతం 2024 చివరి వారంలో ఉన్నాం. ఈ ఏడాది మనదేశంతో పాటు ప్రపంచంలో అనేక ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన భారత్‌లో ఎన్నికలు జరగగా, మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.ఇజ్రాయెల్- ఇరాన్ పోరు2024లో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలోని డమాస్కస్‌లో దేశ కాన్సులేట్‌పై దాడికి ప్రతిగా ఇరాన్ ఏప్రిల్ 14న ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అనంతరం అక్టోబర్ ఒకటిన ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై 200కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దరిమిలా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. హమాస్ తదుపరి అధినేత యాహ్యా సిన్వార్‌ను గాజాలో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.భారత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయంభారతదేశంలో 2024 ఏప్రిల్, జూన్ 2024 మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 543 స్థానాలకు 7 దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న విడుదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 292 సీట్లు గెలుచుకుని, మెజారిటీ సాధించింది. అదే సమయంలో విపక్ష పార్టీల ఇండియా కూటమి 234 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీల విషయానికొస్తే బీజేపీ 240, కాంగ్రెస్ 99, సమాజ్ వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.క్షీణించిన భారత్- కెనడా సంబంధాలు2024 అక్టోబరు మధ్య కాలంలో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో సహా అనేక రంగాలపై కొంతమేరకు ప్రభావం చూపింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుండి భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిచింది.ఎమర్జెన్సీ రోజులకు 50 ఏళ్లు2024, జూన్ 25 నాటికి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దేశంలో ఎమర్జెన్సీ కాలం 1975 నుండి 1977 వరకు కొనసాగింది. ఈ సమయంలో దేశంలో పౌర హక్కులు నిలిపివేశారు. పత్రికా స్వేచ్ఛను పరిమితం చేశారు. సామూహిక అరెస్టులు జరిగాయి. ఎన్నికలను వాయిదా వేశారు. ఎమర్జెన్సీ విధించేందుకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనలను చూపించింది.వయనాడ్‌లో విలయం2024, జూలైలో కేరళలోని వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మేప్పాడి, ముండక్కై తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఆర్జీ కార్ హత్యాచార ఘటన2024 ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్పత్రిలోని సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దరిమిలా కోల్‌కతాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన అనతరం మహిళలపై లైంగిక వేధింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. బంగ్లాదేశ్‌లో కుప్పకూలిన షేక్ హసీనా ప్రభుత్వం2024 ఆగష్టులో బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతకు లోనయ్యింది. పలు హింసాత్మక నిరసనల దరిమిలా బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయింది. అనంతరం షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి ముహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం2024, నవంబర్ 5న అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. సెనేట్‌లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించింది.సిరియాలో తిరుగుబాటుసిరియాలో చాలాకాలంగా మౌనంగా ఉన్న రెబల్ గ్రూపులు బలాన్ని కూడగట్టుకుని సిరియాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఫలితంగా 2000 నుంచి సిరియాను పాలిస్తున్న బషర్ అల్ అసద్ అధికారానికి తెరపడింది. అసద్ సిరియా వదిలి రష్యాలో ఆశ్రయం పొందారు. తిరుగుబాటు గ్రూపు హయత్ తహ్రీర్ అల్-షామ్ సిరియా పరిపాలనను చేపట్టింది.ఇది కూడా చదవండి: Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్ పరిణామాలు -
Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్ పరిణామాలు
దేశంలోని విమానయాన రంగానికి 2024 మిశ్రమంగా గడిచింది. ఈ సంవత్సరం రెండు విమానయాన సంస్థలు మూసివేతకు గురయ్యాయి. ఒక విమానయాన సంస్థ దివాలా ప్రక్రియకు దారితీసింది. ఈ ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెండుసార్లు రికార్డు స్థాయిలో ఐదు లక్షలను అధిగమించింది.దేశంలో దీపావళి, ఛత్ సందర్భంగా విమానయాన టిక్కెట్ల ఛార్జీల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది నవంబర్ 14 వరకు విమానయాన సంస్థలకు మొత్తం 999 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. విచారణలో అవి ఫేక్ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు.2025లో చోటుచేసుకోబోయే మార్పులివే..శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన రంగం 2025లో పెను మార్పులను చూడబోతోంది. భారీ విలీనాలతో పాటు, విమానాల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇంతేకాకుండా పలు కొత్త ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభం కానున్నాయి. మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ట్రాఫిక్ 164 నుంచి 170 మిలియన్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచడం, ఎక్కువ సంఖ్యలో ప్రత్యక్ష విదేశీ విమాన లింక్‌లను ఏర్పాటు చేయడం, దేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడంపై పరిశ్రమ దృష్టి కేంద్రీకృతమై ఉంది.ఇటీవల అకాసా ఎయిర్ హెడ్ వినయ్ దూబే మాట్లాడుతూ భారతీయ విమానయాన మార్కెట్‌కు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయన్నారు. కాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ 60కి పైగా వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా 800 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. 157 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యమైన విస్తారాతో ఎయిర్ ఇండియా తన విలీనాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఎయిరిండియా ఫ్లైట్ రిటర్న్ ప్రోగ్రామ్ పేరును 'మహారాజా క్లబ్'గా మార్చాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. వీటిలో10 వైడ్-బాడీ ఏ350, 90 నారో బాడీ ఏ320 విమానాలున్నాయి.ఇది కూడా చదవండి: Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు -
Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు
2024 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరం సిద్ధమవుతున్నాం. ఈ నేపధ్యంలో 2024 ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2024 భారతదేశంలోని పలు కుటుంబాలకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించింది.దేశవ్యాప్తంగా చాలామంది సెలవు రోజుల్లో తమ కుటుంబాలతో సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. యువత సాహసభరితమైన ప్రయాణాలు సాగించగా, వయసుపైబడినవారు ప్రశాంత వాతావరణాలకు చేరుకుని సేదతీరారు. అందమైన బీచ్‌లు, అద్భుతమైన పర్వతప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలలో ప్రయాణించేందుకు భారతీయులు మక్కువ చూపారు. వాటిలో 10 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోవా2024లో టాప్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ టూరిస్ట్ డెస్టినేషన్‌గా గోవా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. గోవాలోని అందమైన బీచ్‌లు, చర్చిలు ఉన్నాయి. ఇక్కడి సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందిత. కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్చేసేందుకు గోవా అత్యుత్తమ ప్రదేశం. వినోద కార్యక్రమాలను ఆస్వాదించేందుకు, చారిత్రక కోటలను సందర్శించేందుకు, అత్యుత్తమ షాపింగ్‌కు గోవా పెట్టిందిపేరు.కేరళఒకవైపు సహజ సౌందర్యం, మరోవైపు ఘనమైన సంస్కృతికి కేరళ పెట్టిందిపేరు. ఇక్కడి ఆహారం ఆహారప్రియుల నోరూరింపజేస్తుందని చెబుతారు. కుటుంబంతో సహా చూడాల్సిన ప్రాంతాలెన్నో కేరళలో ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్స్, తేయాకు తోటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలు ఉత్సాహాన్ని రెండింతలు చేస్తాయి.కశ్మీర్కశ్మీర్.. ప్రకృతి అందాలకు నెలవు. కుటుంబ సభ్యులతో సహా సందర్శించేందుకు ఉత్తమ ప్రదేశం. గుల్మార్గ్లో స్కీయింగ్, స్నోబోర్డింగ్, బుల్ కార్ రైడ్లను ఆస్వాదించవచ్చు. శ్రీనగర్‌లోని అందమైన లోయలను, సరస్సులను సందర్శించవచ్చు.ముస్సోరీఉత్తరాఖండ్లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరీ. కుటుంబసభ్యులతో సహా ఆనందంగా విహరించేందుకు అత్యుత్తమ ప్రదేశం ఇది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. కేబుల్ కార్ రైడ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. స్థానిక మార్కెట్లను సందర్శించవచ్చు.సిక్కింభారతదేశంలోని ఈశాన్య ప్రాంతమైన సిక్కిం సహజ సౌందర్యానికి నిలయంగా పేరొందింది. ఇక్కడి పురాతన మఠాలు దేశ ఘన చరిత్రను చాటిచెబుతాయి. ఇక్కడికి కుటుంబంతో సహా వచ్చే పర్యాటకులు వివిధసాహస కార్యకలాపాల్లో పాల్గొని ఆనందించవచ్చు.మనాలి హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రసిద్ధ హిల్ స్టేషన్ సాహసాలు చేసేవారికి, ప్రకృతిని ఇష్టపడేవారికి అత్యుత్తమ ఎంపిక. ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్,ట్రెక్కింగ్ మొదలైనవి కుటుంబ సభ్యులకు అమితమైన ఆనందాన్ని అందిస్తాయి. స్థానిక మార్కెట్లు మంచి షాపింగ్ అనుభూతులను అందిస్తాయి. డార్జిలింగ్పశ్చిమ బెంగాల్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ కుటుంబంతో సహా ఎంజాయ్ చేసేందుకు అనువైన ప్రదేశం. ఇక్కడి టాయ్ ట్రైన్ రైడ్ ఎంతో వినోదాన్నిస్తుంది. ఇక్కడి టీ తోటలు ఎవరినైనా సరే వావ్ అనిపించేలా చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుంటుంది.గుల్మార్గ్ కశ్మీర్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ స్కీయింగ్, స్నోబోర్డింగ్ ఇష్టపడేవారికి ఎంతో అనువైనది. కేబుల్ కార్ రైడ్లు, స్నో గేమ్‌లతో వినోదించవచ్చు. స్నోమెన్లను తయారు చేసి ఆనందించవచ్చు.జైసల్మేర్రాజస్థాన్లోని ఈ అందమైన ఎడారి నగరం.. కుటుంబ సభ్యులంతా కలసి సందర్శించినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఒంటె రైడ్, ఎడారి సఫారీ, ఇక్కడి కోటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ కుటుంబంతో సహా చూడాల్సిన అత్యుత్తు ప్రదేశం. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడి వంటకాలు అందరికీ నోరూరేలా చేస్తాయి. స్థానిక స్మారక చిహ్నాలు, మ్యూజియంలు, మార్కెట్లను కుటుంబ సభ్యులంతా కలసి చూసినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఢిల్లీలో పలు థీమ్ పార్కులున్నాయి. ఇవి అత్యుత్తమ వినోదాన్ని పంచుతాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. చాటింగ్ స్టైలే మారిపోయిందే.. -
Year Ender 2024: చివరి వారాన్ని ఇలా ఆనందంగా గడిపితే..
2024.. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ ఏడాది మనకు పలు తీపి గురుతులను, విషాద ఛాయలను అందించింది. వీటిని పక్కన పెడుతూ ఈ ఏడాదిలో మిగిలిన కాసిన్ని రోజులను ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నిస్తే రాబోయే నూతన సంవత్సరం మనకు మరింత కాంతిమయం అవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అందుకు అవలంబించాల్సిన పనులను కూడా వారు తెలియజేస్తున్నారు.ప్రకృతిలో ఒడిలో..ఒక అందమైన పార్క్‌లో నడవండి లేదా సైకిల్ తొక్కండి.సమీపంలోని కొండలు లేదా అడవికి షార్ట్ ట్రిప్ వెళ్లండి.సూర్యాస్తమయాన్ని ఆస్వాదించండి.ప్రియమైనవారితో..కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సమయాన్ని గడపండి.వారితో బోర్డు గేమ్స్ ఆడండి. కలిసి భోజనం చేయండి. తనివితీరా మాట్లాడండి.కొత్తదేదో నేర్చుకోండికొత్త భాష నేర్చుకోవడం ప్రారంభించండి.కొత్త వంటకం చేయడానికి ప్రయత్నించండి.ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి.దాన గుణం, దాతృత్వం..స్వచ్ఛంద సేవలో పాల్గొనండి.స్థానికంగా ఉన్న ఆశ్రమానిక ధనరూపేణా లేదా వస్తురూపేణా దానం చేయండి.ఎవరో ఒకరికి సహాయం చేయండి.శారీరక ఆరోగ్యం కోసం..ఒక రోజు స్పాకు కేటాయించండి.మసాజ్ లేదా ఫేషియల్ చేయించుకోండి.యోగా లేదా ధ్యానం చేయండి.సృజనాత్మకతను..డ్రాయింగ్, పెయింటింగ్ లేదా ఏదోఒకటి కొత్తగా రాయడానికి ప్రయత్నించండి.సంగీత పరికరాన్ని వాయించండి లేదా పాటలు పాడండి.ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి ప్రయత్నించండి.ఇష్టమైన అంశాలతో..మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవండి.మీకు నచ్చిన సినిమా చూడండి.మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి.తగినంత విశ్రాంతి తీసుకోండి.పుస్తకం చదువుతూ లేలేత సూర్యరశ్మిని ఆస్వాదించండి.వారాంతంలో మరింతసేపు నిద్రకు సమయం వెచ్చించండి.మీకు ఇష్టమైన పానీయం తాగండి.కృతజ్ఞత వ్యక్తం చేయండిమీకు ఈ ఏడాదిలో మంచిని అందించినవారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే లేదా మీపట్ల శ్రద్ధ చూపే వారికి కృతజ్ఞతలు తెలియజేయండి.ఈ జాబితాలోని వీలైనన్ని అంశాలను అమలు చేయడం ద్వారా 2024లోని ఈ చివరి వారాన్ని ఆనందంగా ముగించగలుగుతారు. అలాగే రాబోయే 2025 నూతన సంవత్సరాన్ని మరింత సంతోషంగా ప్రారంభించగలుగుతారు. మరెందుకాలస్యం.. ఇవి కూడా చదవండి: Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు -
Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
2024 సోమవారం ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. ఇప్పుడు మనమంతా 2024 చివరిదశలో ఉన్నాం. ఈ ఏడాది పలు ఆనందాన్నిచ్చే ఘటనలతో పాటు విషాదాన్ని పంచే ఉందంతాలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిలో విమాన ప్రమాదాలు ఒకటి. ఈ దుర్ఘటనల్లో పలువురు ప్రముఖులు కన్నుమూశారు.నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదంజూలై 24న సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం పోఖ్రాకు వెళుతుండగా ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఉదయం 11 గంటలకు త్రిభువన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. 21 ఏళ్ల నాటి ఈ విమానానికి మరమ్మతులు చేసి పరీక్షలకు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుని హెలికాప్టర్ మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దుల్లాహియాన్ సహా 9 మంది మృతిచెందారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పలు నివేదికల ప్రకారం పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలోని అజర్బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రష్యాలో విమాన ప్రమాదం2024 జనవరిలో రష్యా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 74 మంది మృతిచెందారు. బెల్గోరోడ్ ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరియు 9 మంది రష్యన్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఘటన తర్వాత రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఉక్రెయిన్ నుండి ప్రయోగించిన క్షిపణి విమానాన్ని తాకిందని పేర్కొంది. ఉక్రెయిన్ దీనిని రష్యా కుట్రగా పేర్కొంది.మలావిలో కూలిన విమానంఈ ఏడాది జూన్‌లో మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మదిమంది విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదాన్ని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా స్వయంగా ధృవీకరించారు. ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం శకలాలు దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఒక పర్వత ప్రాంతంలో కనుగొన్నారు. సౌలోస్ చిలిమా విమానం అదృశ్యమయ్యే ముందు దక్షిణ ఆఫ్రికా దేశ రాజధాని లిలాంగ్వేకు ఉత్తరాన 370 కిలోమీటర్ల దూరంలో ఎగురుతూ కనిపించింది. అననుకూల వాతావరణం, దృశ్యమానత సరిగా లేకపోవడం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది.హాలీవుడ్ నటుని దుర్మరణంహాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఆలివర్ అతని ఇద్దరు కుమార్తెలు, పైలట్ జనవరి ఆరున కరేబియన్ ద్వీపం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. గ్రెనడైన్స్‌లోని పెటిట్ నెవిస్ ద్వీపంలో ఈ విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కూలిపోయింది.చిలీ మాజీ అధ్యక్షుడి హెలికాప్టర్..చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ఈ ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన వ్యక్తిగత హెలికాప్టర్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో నలుగురు ఉన్నారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.ఆఫ్ఘనిస్తాన్‌లో విమాన ప్రమాదంజనవరి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఈ బిజినెస్ జెట్‌లో ఏడుగురు రష్యన్లు ఉన్నారు. వారు అక్కడికక్కడే మృతిచెందారు. విమానం ఇంజన్లో లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. విమానం మొరాకో కంపెనీకి చెందినది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే.. -
Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు
భారత రాజకీయాల్లో మహిళల పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు అన్ని రాజకీయ పార్టీలలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరుగుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలువురు మహిళా నేతలు తామేమటన్నదీ రుజువుచేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే పలువురు మహిళా నేతలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.కంగనా రనౌత్నటి కంగనా రనౌత్ ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై గెలుపొంది, పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో కంగనా రనౌత్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 2024లో వార్తల్లో నిలిచారు.మహువా మోయిత్రాపశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మోయిత్రా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ముఖ్యాంశాలలో నిలిచారు. మహువా మోయిత్రా జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.స్వాతి మలివాల్సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలైన స్వాతి మలివాల్ 2024లో వార్తల్లో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెక్రటరీపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దరిమిలా స్వాతి మలివాల్ పేరు హెడ్ లైన్స్ లో నిలిచింది.కొంపెల్ల మాధవీ లతహైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొంపెల్ల మాధవీ లతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికైన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై మాధవీ లత పోటీ చేశారు. ఆమె ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రజల దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో తరచూ కనిపించారు.వసుంధర రాజేరాజస్థాన్లో బీజేపీ విజయం సాధించిన దరిమిలా మహిళా నేత వసుంధరా రాజే సీఎం అవుతారనే వార్తలు వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా బీజేపీ నేత భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలకు కలతచెందిన వసుంధరా రాజే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వసుంధర రాజే తన ప్రసంగాలు, వ్యాఖ్యల కారణంగా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు.ప్రియాంకా గాంధీరెండు దశాబ్దాల కిందట గాంధీ - నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక గాంధీ 2024లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డుస్థాయి విజయం అందుకున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రచార సమయంలో ఆమె ప్రజలతో మమేకమవుతూ ‘తానొక ఫైటర్’ని అంటూ చేసిన చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే.. -
Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే..
భారతీయ రైల్వే అనునిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. 2024లో రైల్వే అనేక ఆధునిక మార్పులను సంతరించుకుంది. ఈ ఏడాది పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు నగరాలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. 2024లో కొత్తగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే..ఢిల్లీ-పట్నా ఢిల్లీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 30న ప్రారంభమయ్యింది. ఈ రైలు న్యూఢిల్లీ- పట్నాలను అనుసంధానం చేస్తుంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ-బీహార్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ఆధునిక రైలులో ఆన్‌బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార ప్రదర్శనలు, సౌకర్యవంతమైన ఏటవాలు సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.మీరట్-లక్నో మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టు 31న ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన దరిమిలా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా మేరకు తగ్గింది. భద్రతతో పాటు వేగాన్ని దృష్టిలో పెట్టుకుని వందేభారత్ రైళ్లను రైల్వేశాఖ తీసుకువచ్చింది.మదురై-బెంగళూరుమదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తమిళనాడులోని మదురైని కర్ణాటకలోని బెంగళూరుతో కలిపేందుకు ఆగస్ట్ 31న ప్రారంభించారు. రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ రైలు పట్టాలెక్కింది. పర్యాటకులకు ఈ రైలు ఎంతో అనువైనదని చెబుతున్నారు.చెన్నై-నాగర్కోయిల్తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్ట్ 31న ప్రారంభించారు. ఈ రైలు చెన్నైని నాగర్‌కోయిల్‌తో కలుపుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుంది.టాటానగర్-పట్నా టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్‌లోని టాటానగర్ను బీహార్‌లోని పట్నాను కలుపుతుంది. సెప్టెంబర్ 15న దీనిని ప్రారంభించారు. ఈ రైలు రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించేవారికి వరంలా మారింది.భాగల్పూర్-హౌరాభాగల్పూర్-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2024 సెప్టెంబర్ 15న బీహార్‌లోని భాగల్పూర్ను హౌరాతో కనెక్ట్ చేయడానికి ప్రారంభించారు. రైలు ప్రారంభంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది.బ్రహ్మపూర్-టాటానగర్బ్రహ్మపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. ఇది ఒడిశాలోని బ్రహ్మపూర్ను టాటానగర్తో కలుపుతుంది. ఈ రెండు పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార, పర్యాటకరంగ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్ విలయం వరకూ.. -
Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్ విలయం వరకూ..
ప్రస్తుతం మనమంతా 2024 చివరి నెల డిసెంబర్లో ఉన్నాం. త్వరలో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించనుంది. రాబోయే సంవత్సరం కొత్త ఆశలు రేకెత్తిస్తే, గడచిన సంవత్సరం ఎన్నో పాఠాలను అందించింది. ప్రజలంతా నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో 2024లో జరిగిన ప్రముఖ ఘటనలను ఒకసారి నెమరువేసుకుందాం.జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు దేశంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది రియాసీలో జరిగిన సైన్యంపై ఉగ్రదాడి , కోల్‌కతా అత్యాచారం కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే వయనాడ్ కొండచరియలు వినాశనానికి కారణంగా నిలిచాయి. ఇదేవిధంగా దేశంలో చోటుచేసుకున్న 10 ప్రధాన సంఘటనలను ఒకసారి గుర్తుచేసుకుందాం.1. రామ మందిర ప్రారంభోత్సవం2024, జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. దీనిని చూసేందుకు దేశంలోని పలువురు ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు.2. ఇన్సాట్-3డిఎస్ ఉపగ్రహ ప్రయోగంఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్రో.. దేశంలోనే అత్యంత అధునాతన ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో దీనిని ప్రయోగించింది.3. ఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మెఈ ఏడాది మేలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగం సమ్మెకు దిగింది. దీంతో రెండు రోజుల్లో 170కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.4. నీట్ వివాదంజూన్ 4న విడుదలైన నీట్ (యూజీ) 2024 ఫలితాలపై వివాదం నెలకొంది. ఈ పరీక్షలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎన్టీఏ ఈ ఫలితాలను జూన్ 4న విడుదల చేసింది. అయితే అంతకుమందు ఎన్టీఏ ఈ ఫలితాలను విడుదల చేసే తేదీని జూన్ 14గా ప్రకటించింది. ఇదొక్కటే కాదు పరీక్షలో 720 మార్కులకు 720 మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య ఈసారి 67కి పెరిగింది. ఇది అనుమానాలకు తావిచ్చింది. టాప్ ర్యాంకులు సాధించిన వారిలో ఎనిమిదిమంది విద్యార్థులు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయడం విశేషం.5 నెట్ పరీక్ష రద్దు నీట్ పరీక్షకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న తరుణంలోనే విద్యా మంత్రిత్వ శాఖ యూజీసీ నెట్-2024ను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్షలో అవకతవకలు బయటపడటంతో పరీక్షను రద్దు చేశారు. తాజాగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్ష జూన్ 18న జరిగింది. 11 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.6. రియాసిలో సైన్యంపై దాడి2024, జూన్ 9న జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనిలో తొమ్మిది మంది మృతిచెందారు. 33 మంది గాయపడ్డారు. శివ్ ఖోడి ఆలయం నుంచి కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న ఈ బస్సుపై దాడి జరిగింది.7. వయనాడ్ విలయంఈ ఏడాది జూలై 30న కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా నాలుగు వేర్వేరు ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాలుగు గ్రామాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 80 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు.8. కోల్‌కతా అత్యాచారం కేసుకోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహాన్ని ఆగస్టు 9 రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి శరీరంపై గాయాలైన గుర్తులు కనిపించాయి. డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.9. బాబా సిద్ధిఖీ హత్య2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఎన్సీసీ నేత బాబా సిద్ధిఖీపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందని సమాచారం. సల్మాన్ ఖాన్‌తో బాబా సిద్ధిఖీకి మంచి సంబంధాలు ఉన్నాయి.10. లోయలో పడిన బస్సుఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు -
Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం 2024లో ఊపందుకుంది. గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాలను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. 2024లో గూగుల్‌లో కొన్ని పర్యాటక ప్రాంతాలు నిరంతరం ట్రెండింగ్‌లో నిలిచాయి. వీటిలో స్విట్జర్లాండ్, లండన్‌తో పాటు ఐదు దేశాల పేర్లు వినిపించాయి. ఇందులో భారత్‌కు కూడా స్థానం దక్కింది.అజర్బైజాన్2024లో భారత్‌కు చెందిన పర్యాటకలు అజర్‌బైజాన్‌కు సందర్శించేందుకు గూగుల్‌లో విస్తృతంగా సెర్చ్ చేశారు. దీనిని చూస్తుంటే అజర్బైజాన్ భారత పర్యాటకులకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్‌గా తెలుస్తోంది. భారతదేశం నుండి అజర్‌బైజాన్‌కు విమాన టిక్కెట్లు అందుబాటు ధరల్లో ఉంటాయి. అజర్బైజాన్ వెళ్లాలనుకునేవారు ఈ వీసాను మూడు రోజుల్లో సులభంగా పొందవచ్చు. అజర్బైజాన్లో చూడదగిన అద్భుతమైన ప్రదేశాలలో బాకు, అస్తారా, షెకి, క్యూబా, గోయ్గోల్ సరస్సు మొదలైనవి ఉన్నాయి.బాలిబాలి.. భారతీయులు అమితంగా ఇష్టపడే మరో పర్యాటక ప్రాంతం. బాలి ఇండోనేషియాలోని ఒక ప్రావిన్స్. ఇక్కడ కుటా బీచ్, లోవినా బీచ్‌లను సందర్శించవచ్చు. బాలి బర్డ్ పార్క్, బొటానికల్ గార్డెన్, మంకీ ఫారెస్ట్ ఇక్కడి ఆకర్షణ కేంద్రాలు. ప్రకృతి అందించిన సహజ సౌందర్యంతో పాటు, ట్రెక్కింగ్ తరహా సాహసాలను ఇష్టపడేవారికి బాలి పర్యాటక గమ్యస్థానంగా నిలిచింది.మనాలిహిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి అందమైన హిల్ స్టేషన్‌గా పేరుగాంచింది. మనాలీలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇక్కడి మంచు పర్వతాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పలు సాహస క్రీడలు అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన ఫోటోషూట్ చేసుకునేందుకు బాలి అనువైన ప్రాంతం. శీతాకాలంలో మనాలిని సందర్శిస్తే ఆ అనుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయి. 2024లో లెక్కలేనంతమంది పర్యాటకులు మనాలీని సందర్శించారు.కజకిస్తాన్కజకిస్తాన్ ఆసియాలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఇక్కడ కరెన్సీ చాలా చౌకగా ఉంటుంది. భారత్ నుండి కజకిస్తాన్ చేరుకునేందుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇది ప్రపంచంలో 9వ అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. లోయలు, పర్వతాలు, సరస్సులను అతి దగ్గరి నుంచి చూసే అవకాశం కలుగుతుంది.జైపూర్2024లో పర్యాటకులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ప్రాంతాలలోభారత్లోని జైపూర్ కూడా ఉంంది. విదేశీ పర్యాటకులను జైపూర్ అమితంగా ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌ను పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. అమెర్ ఫోర్ట్, హవా మహల్, నహర్‌ఘర్ కోట బిర్లా టెంపుల్‌తో సహా అనేక చారిత్రక ప్యాలెస్‌లు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు జైపూర్‌లో అనేకం ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో సంబ్రమాశ్చర్యాలు కలుగుతాయి. ఇది కూడా చదవండి: మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం -
Year Ender 2024: లీకుల నామ సంవత్సరం
2024లో దేశంలో భారీ రిక్రూట్మెంట్లు జరిగాయి. అలాగే వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో పలు పేపర్ల లీకుల కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో జరుగుతున్న పరీక్షలపై లెక్కకుమించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసు 2024 ఫిబ్రవరిలో వెలుగు చూసింది. ఆ తర్వాత నీట్ యూజీ, సీయూఈటీ, బీహార్ సీహెచ్ఓ, ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షా పత్రాలు లీకయ్యాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష 2024 ఫిబ్రవరిలో జరిగిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పేపర్ లీక్ కావడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 18న పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లను రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని తేలింది. ఈ కేసులో 244 మందిని అరెస్టు చేశారు.సీఎస్ఐఆర్ ఎస్ఓ ఎఎస్‌ఓ రిక్రూట్మెంట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో 444 ఎస్ఓ, ఏఎస్ఓ పోస్టులకు అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష పేపర్‌ను లీక్ చేసిన ఉదంతంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, సాల్వర్ ముఠాలు పోలీసులకు చిక్కారు. వీరు ఎనీడెస్క్ యాప్ ద్వారా కాపీయింగ్‌కు సహకరించారని తేలింది.యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పేపర్ లీక్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024, ఫిబ్రవరి 11న ఆర్ఓ, ఏఆర్ఓ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. పేపర్ లీక్ విషయం వెలుగులోకి రావడంతో యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షను రద్దు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హర్యానాలోని మనేసర్, మధ్యప్రదేశ్‌లోని రేవాలో రిసార్ట్లు బుక్ చేశారు. అక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ నీట్ యూజీ పేపర్ లీక్ వార్త చాలాకాలం వార్తల్లో నిలిచింది. ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. నీట్ యూజీ పేపర్ లీక్ దరిమిలా 1,563 మంది అభ్యర్థులు లబ్ధిపొందినట్లు తేలింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. నీట్ యూజీ నిర్వహణ అధికారులు రివైజ్డ్ రిజల్ట్‌లో టాపర్ల సంఖ్య 61 నుండి 17కి తగ్గించారు.యూజీసీ నెట్ పేపర్ లీక్ 2024 జూన్ 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షను విద్యా మంత్రిత్వ శాఖ జూన్ 19న రద్దు చేసింది. డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందని, టెలిగ్రామ్ ద్వారా అభ్యర్థులకు అందించారని తేలిందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.జెఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పేపర్ లీక్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సీ) సీజీఎల్ పరీక్ష 2024 సెప్టెంబర్ 21,22 తేదీలలో జరిగింది. అభ్యర్థులు ఎస్ఎస్సీ సీజీఎల్ సర్కారీ రిజల్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఇంతలో ఎస్ఎస్సీ సీజీఎల్ పేపర్ లీక్ అయినట్లు వెల్లడయ్యింది.రాజస్థాన్ ఎస్ఐ పరీక్ష రాజస్థాన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2024 పేపర్ లీక్ కేసులో 37 మందిని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) విచారణలో దీని వెనుక రెండు ముఠాలు ఉన్నట్లు తేలింది . 859 పోస్టుల కోసం జరిగిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 7.97 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను 2021 సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షా పత్రాల లీకుతో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌సీఎస్‌సీ) పనితీరుపై పలు అనుమానాలు తలెత్తాయి.ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఫలితాలు బీహార్‌లోని పట్నాలో గల పూర్నియా డిజిటల్ పరీక్షా కేంద్రంలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తేలింది. నకిలీ అభ్యర్థుల ద్వారా ఎస్ఎస్సీ ఎంటిఎస్ పరీక్షను రాయిస్తున్నారని తేలింది. ఈ విషయం తెలిసిన నేపధ్యంలో పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి, ఏడుగురు ఉద్యోగులు, 14 మంది నకిలీ అభ్యర్థులతో పాటు 14 మంది అసలు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ బీహార్ సీహెచ్ఓ పరీక్ష 2024, డిసెంబరు 1, 2, 3 తేదీలలో జరగాల్సి ఉంది. పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 37 మంది నిందితులను అరెస్టు చేశారు.పేపర్ లీక్‌లను నిరోధించడానికి రూపొందిన చట్టాన్ని 2024 జూన్ నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం పరీక్షల్లో పేపర్ లీక్ లాంటి అక్రమ చర్యలకు పాల్పడేవారికి మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృత పేపర్ లీకేజీకి కోటి రూపాయల వరకూ జరిమానా విధించనున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?
ఈ ఏడాది ఇప్పటివరకు 30 శాతానికి పైగా పెరిగిన బంగారం ధరలు భారతీయ మార్కెట్లలో గ్రాముకు రూ. 7,300కి చేరుకున్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్లో ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ ఏడాది పెరుగుదలే అత్యధిక కానుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక వెల్లడించింది.అయితే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థాయి పరుగు 2025 చివరి వరకు కొనసాగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడానికి కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, పెట్టుబడిదారుల కొనుగోళ్లే కారణమని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొందిడబ్ల్యూజీసీ డేటా ప్రకారం.. 2022లో చూసిన స్థాయిలతో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసికం నాటికి బంగారం కొనుగోలు 694 టన్నులకు చేరుకోవడంతో సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ బలంగా ఉంది. 2024 అక్టోబర్ నాటికి తుర్కియే, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు వరుసగా 72 టన్నులు, 69 టన్నుల బంగారు నిల్వలను జోడించి బంగారం మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శించాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్‌లో 27 టన్నులను జోడించింది. ఈ నెల వరకు దాని మొత్తం బంగారం కొనుగోళ్లు 77 టన్నులకు చేరుకున్నాయి. అక్టోబర్ వరకు భారత్ నికర కొనుగోళ్లు దాని 2023 కార్యకలాపాలపై ఐదు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.వచ్చే ఏడాది ఎలా ఉంటుంది?2025 బంగారానికి సవాలుగా ఉండే సంవత్సరంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక ఎదురుగాలులను వారు చూస్తున్నారు. వాటిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై దాని ప్రభావం ఉన్నాయి. బంగారం అతిపెద్ద వినియోగదారులలో ఒకటైన చైనాలో కూడా పరిణామాలు కీలకంగా ఉన్నాయి. -
Year Ender 2024: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. నిత్యం ఇవే వార్తలు
హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హృద్రోగాల బారినపడి ఏటా లక్షలాదిమంది మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2024 కూడా గుండె ఆరోగ్యానికి సవాలుగా నిలిచింది. గుండెపోటు, గుండె ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది లక్షలాదిమంది మృతిచెందారు.కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో గుండె జబ్బులు అధికంగా నమోదవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. 2024లో తీవ్రమైన గుండె సమస్యల కారణంగా మన దేశంలో లక్షలాది మంది మృతిచెందారు. 2024, ఫిబ్రవరి 20న ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ (59) గుండెపోటుతో మరణించారు. రితురాజ్.. హిట్లర్ దీదీ తదితర టీవీ షోలలోనటించారు. అదేవిధంగా నటి కవితా చౌదరి కూడా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె ఉడాన్ తదితర సీరియళ్లలో నటించారు. టీవీ నటుడు, మోడల్ వికాస్ సేథి కూడా 48 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు.గుండెపోటుతో పాటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు ఈ ఏడాది అందరిలోనూ ఆందోళనను పెంచాయి. 2024 జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే(47) గుండెపోటుతో మరణించారు. కాగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనేవి రెండు వేర్వేరు స్థితులు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకి ఏర్పడిన కారణంగా, గుండెకు రక్త ప్రసరణ అందడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ స్థితిలో గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది.కరోనా ఇన్ఫెక్షన్, మరణాల ముప్పును తగ్గించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ టీకా గుండెపోటుతో పాటు మరణాల కేసులు పెరిగాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవని, ఎలాంటి సమస్యలు తలెత్తవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని, అందుకే ముందస్తుగా గుండెపోటు వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెపోటు వచ్చిన బాధితునికి వెంటనే సీపీఆర్ అందించడం ద్వారా అతని ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. గుండె జబ్బుల ముప్పును నివారించడానికి సరైన జీవనశైలిని అనుసరించడం, పోషక ఆహారాన్ని తీసుకోవడం రక్తపోటును, షుగర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే
2024 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యంలో పెద్దపండుగలాంటి లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో జరగగా, అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన ఎన్నికల ఘట్టం ముగిసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయాలు, ఆర్థికరంగ పరిణామాలు, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ ఇలా మరెన్నో రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.బోయింగ్‌కు కలసిరాని ఏడాదిఏవియేషన్ దిగ్గజ సంస్థ బోయింగ్ తమ 737 మ్యాక్స్‌కు గత ఏడాది ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. అయితే 2024 మొదట్లో అలాస్కా ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్ విమానం ప్రయాణం మధ్యలో దాని వెనుక డోర్ ప్లగ్-ఇన్ పనితీరులో విఫలమయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి భారీ ప్రమాదం జరగనప్పటికీ, 737 మ్యాక్స్ 9 తరహాకు చెందిన విమానాల తయారీ నిలిచిపోయింది. ఈ ఏడాది బోయింగ్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. మరోవైపు బోయింగ్‌కు చెందిన మాజీ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్ అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు.స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ప్రయోగం విఫలంబోయింగ్ సంస్థ 2024లో చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాన ప్రయోగం అర్థాంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. వ్యోమగాములు సునీత, విల్మోర్లు ఎనిమిది రోజుల మిషన్ కోసం జూన్‌లో అంతర్జాతీయ స్సేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా, స్టార్ లైనర్‌లో లోపాలు తలెత్తాయి. థస్టర్ విఫలమవడం, హీలియం లీక్ కావడంతో సునీత, విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే 2025 ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయోధ్యలో నూతన రామాలయం2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకతో ఈ ఏడాది హిందువులకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హిందువుల కల నెరవేరింది. నాటి నుంచి బాలరాముని దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.ట్రంప్ పునరాగమనం2024లో అగ్రగాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ విజయం సాధించారు.మరింత ధనవంతుడైన ఎలన్ మస్క్ ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కి 2024 కలసివచ్చింది. పలు వెంచర్లలో మస్క్ విజయాలను అందుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయంతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సంపద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఉక్రెయిన్ చేతికి రష్యా ప్రాంతాలు2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 2024లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2024 ఆగస్టులో ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఉక్రెయిన్ ఇతర ప్రాంతాల్లో ఓడిపోయినప్పటికీ కుర్స్క్‌పై నియంత్రణను కొనసాగించింది.ఇది కూడా చదవండి: Christmas And New Year Trip: రూ. ఐదువేలతో సూపర్ టూర్ ప్లాన్ -
Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు?
ఈ ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ తరం యువత అన్నిరంగాల్లోనూ వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ‘జెన్ జెడ్’ అనే పదం విరివిగా వాడుకలో ఉంది. జెన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్. ఇదేమీ సాంకేతిక పదం కాదు. ఈ కాలం యువతకు ఈ పదం వర్తిస్తుంది. జనరేషన్ జెడ్‌పై 2024లో విపరీతంగా చర్చలు జరిగాయి.ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం, 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను ‘జనరేషన్ జెడ్’ అని అంటారు. వీరు అధునాతన స్మార్ట్ఫోన్లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిని పరిశీలిస్తే, అది 1995 సంవత్సరం తర్వాత అత్యంత వేగంగా పెరిగింది. స్మార్ట్ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో పుట్టిన చిన్నారులు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారని నిపుణులు అంటున్నారు. ఇంతేకాదు మునుపటి తరంతో పోలిస్తే, జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారు మరింత స్నేహశీలురుగా మెలుగుతూ, ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారని చెబుతున్నారు. మాట తీరు ఇంతకుముందు తరాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేషన్ జెడ్.. సంక్షిప్తంగా జెన్ జెడ్.. వ్యవహారికంగా జూమర్స్ అని ప్రస్తుత తరం యువతను పిలుస్తున్నారు. ఈ తరంలో జన్మించినవారు అంతకుముందు తరాలవారి వ్యవహరశైలికి భిన్నంగా ఉంటున్నారు. వీరి విద్యాభ్యాసం విషయానికొస్తే తమ ముందు తరాల కంటే కొంత భిన్నమైన విద్యావిధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం జెన్ జెడ్ తరం వారు హైస్కూలు మొదలుకొని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారిగా ఉన్నారు.వీరు ఆన్లైన్లో స్నేహితులను కలుసుకోవడానికి, భౌతికంగా స్నేహితులను కలుసుకోవడానికి మధ్య పెద్దగా తేడా చూపరు. ఈ కారణంగానే వారు అధికస్థాయిలో స్నేహితులను సంపాదించుకుంటున్నారు. ఇందుకు సాంకేతికను విరివిగా ఉపయోగిస్తున్నారు. జెన్ జెడ్ డిజిటల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంతోపాటు దానిని స్వీకరించిన మొదటి తరం. ఈ తరం డిజిటల్ ప్లాట్‌ఫారాలకు, సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటుంది.కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సమయంలో మిగిలిన తరాల వారు ఎంతో ఇబ్బంది పడినా జెన్ జెడ్ వర్గం వారు దానిని కష్టసమయంగా భావించలేదు. ఇంటర్నెట్ సహాయంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు. మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ జెన్ జెడ్ వర్గంవారు ముందుకు దూసుకుపోతున్నారు. మిగిలిన తరాల కన్నా జెన్ జెడ్వర్గం తక్కువ ఒత్తిడికి గురవుతున్నదని పరిశోధనల్లో తేలింది. ఇంతకుముందు తరాలవారిని ఏ పేరుతో పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ది గ్రేటెస్ట్ జనరేషన్ (1901 నుండి 1927 మధ్యకాలంలో జన్మించనవారు) వీరు తమ బాల్యంలో యుద్ధం, వ్యాధులు, ఆర్థిక కష్టనష్టాల వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు.సైలెంట్ జనరేషన్ (1928 నుండి 1945 మధ్యకాలంలో జన్మించినవారు)ఈ తరంలోనివారు ప్రపంచ యుద్ధాన్ని, బానిసత్వాన్ని చవిచూసారు. దేనికీ స్పందించకుండా, నిరసించకుండా అన్యాయాన్ని భరిస్తూ వచ్చినందున ఈ జనరేషన్ వారిని సైలెంట్ జనరేషన్ అని సంబోధిస్తున్నారు.బేబీ బూమర్ జనరేషన్(1946 నుండి 1964 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరాన్ని ఆధునిక యుగానికి నాందిగా చెబుతారు. రాక్ అండ్ రోల్, హిప్పీ సంస్కృతి, సినిమా, కళ, సంగీతానికి కొత్త మెరుగులు దిద్దిన ఘనత ఈ తరానికి చెందుతుంది. ప్రస్తుతం, ఈ తరానికి చెందిన వారు పాత- కొత్త తరాలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు.జనరేషన్ ఎక్స్ (1965 నుండి 1980 మధ్య కాలంలో పుట్టినవారు) బేబీ బూమర్ల మాదిరిగానే, ఈతరం వారు కూడా ఆధునిక యుగానికి నాందిగా నిలిచారు. ఈ తరం వారు పాత- కొత్త తరాలకు వారధులుగా ఉన్నారు.మిలీనియల్స్(1981 నుండి 1996 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరం వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జీవితంలో గణనీయమైన మార్పులను చూశారు. ఈ మార్పులకు అనుగుణంగా జీవితాలను మలచుకున్నారు. మునుపటి తరాలతో పోలిస్తే ప్రపంచంపై ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరుచుకున్నారు.జనరేషన్ జెడ్ (1997 నుండి 2012 మధ్యకాలంలో పుట్టినవారు)1995 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని అంటారు. ఆధునిక, సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకోవడంలో వీరు ముందున్నారు.జనరేషన్ ఆల్ఫా (2013 నుండి 2025 మధ్య కాలానికి చెందినవారు) జనరల్ ఆల్ఫా పిల్లలు అధునాతన సాంకేతికతకు చిన్నవయసులోనే అలవాటుపడతారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, సోషల్ మీడియాను అంటిపెట్టుకుని ఉంటారు. జెన్ ఆల్ఫాతరం వారు 21వ శతాబ్దపు అతి పిన్న వయస్కులైన వారిగా పరిగణిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు
2024 కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక తీర్పులను వెలువరించింది. ఇవి దేశ రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థకు మైలురాళ్లుగా నిలిచాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో 10 తీర్పులు దేశగతిపై ప్రభావం చూపాయి. ఆ వివరాలు..1. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే ముందు, సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇది ‘రాజ్యాంగ విరుద్ధం,ఏకపక్షం’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ నిధుల మూలాన్ని వెల్లడించకపోవడం అవినీతికి దారితీసిందని కోర్టు పేర్కొంది.2. ఎన్నికల కమిషనర్ల నియామకం ఈ ఏడాది మేలో సుప్రీం ఇచ్చిన ప్రధాన తీర్పులో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించాలనే నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి పిటిషన్లు గందరగోళాన్ని, అనిశ్చితిని సృష్టిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, కార్యాలయ షరతులు) చట్టం 2023 ఆపరేషన్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.3. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు నోజమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తూ 2023, డిసెంబరు 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఛాంబర్లో పిటిషన్లను పరిశీలించింది. ఈ రికార్డులలో ఎలాంటి లోపం కనిపించడం లేదని, అందుకే రివ్యూ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.4.షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)ఉప-వర్గీకరణపై తీర్పుఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ 2024 జూలైలో షెడ్యూల్డ్ కులాలలో (ఎస్సీ) మరింత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కోటాను నిర్ధారించాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను సమర్థించింది. ఈ నిర్ణయం దరిమిలా దళితుల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి, వారికి ఇచ్చే రిజర్వేషన్లో ప్రత్యేక కోటాను కల్పించవచ్చు.5. జైళ్లలో కుల వివక్ష తగదుజైళ్లలో కుల ప్రాతిపదికన వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని 2024, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్ష, కులాల ఆధారంగా విభజన అనేవి రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఒక నిర్దిష్ట కులానికి చెందిన పారిశుధ్య కార్మికులను ఎంపిక చేయడం సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జైళ్లలో ఇలాంటి వివక్షను అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.6. క్షమాభిక్ష పిటిషన్లపై మార్గదర్శకాలు మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లపై త్వరితగతిన సరైన చర్యలు తీసుకునేందుకు 2024 డిసెంబర్ 9న సర్వోన్నత న్యాయస్థానం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించిన అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.7. బుల్డోజర్ జస్టిస్‌కు బ్రేక్ ఈ ఏడాది నవంబర్ 13న సుప్రీం కోర్టు తన ప్రధాన నిర్ణయంలో బుల్డోజర్ జస్టిస్ వ్యవస్థకు బ్రేక్ వేసింది. నిందితులు, దోషులపైన కూడా బుల్డోజర్ చర్య చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. దాని ప్రకారం 15 రోజుల ముందుగానే సంబంధీకులకు నోటీసు ఇవ్వాలి.8) బిల్కిస్ బానో కేసులో..గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ముందస్తుగా విడుదల చేసింది. ఈ దోషులంతా 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు. వీరికి బాధితురాలి కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేయడంలో ప్రమేయం ఉంది. దీనిపై 2024 జనవరి 8న సుప్రీం ఇచ్చిన తీర్పులో దోషులను విడుదల చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.9) మనీష్ సిసోడాయా కేసులోలిక్కర్ స్కామ్ ఆరోపణలపై 2023 ఫిబ్రవరిలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఈ ఏడాది ఆగస్టు 9న సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ కేసులో విచారణ జరుగుతున్నందున నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. ఎక్కువ కాలం జైలులో ఉంచడం ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.10) చైల్డ్ పోర్నోగ్రఫీసుప్రీంకోర్టు 2024, సెప్టెంబరు 23న ఇచ్చిన తీర్పులో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్‌ని డౌన్లోడ్ చేయడం, వీటిని సేవ్ చేయడం నేరం కిందకు వస్తుందని పేర్కొంది. సంబంధిత వ్యక్తి అటువంటి వీడియోలు లేదా సమాచారాన్ని తొలగించకపోయినా లేదా పోలీసులకు తెలియజేయకపోయినా అది పాక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం నేరమని పేర్కొంది. పిల్లల అశ్లీల చిత్రాలను ఎవరికైనా పంపితే తప్ప, వాటిని కలిగి ఉండటం లేదా డౌన్లోడ్ చేయడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు వెలిబుచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి?