భారత రాజకీయాల్లో మహిళల పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు అన్ని రాజకీయ పార్టీలలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరుగుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
2024లో రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలువురు మహిళా నేతలు తామేమటన్నదీ రుజువుచేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే పలువురు మహిళా నేతలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.
కంగనా రనౌత్
నటి కంగనా రనౌత్ ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై గెలుపొంది, పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో కంగనా రనౌత్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 2024లో వార్తల్లో నిలిచారు.
మహువా మోయిత్రా
పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మోయిత్రా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ముఖ్యాంశాలలో నిలిచారు. మహువా మోయిత్రా జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
స్వాతి మలివాల్
సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలైన స్వాతి మలివాల్ 2024లో వార్తల్లో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెక్రటరీపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దరిమిలా స్వాతి మలివాల్ పేరు హెడ్ లైన్స్ లో నిలిచింది.
కొంపెల్ల మాధవీ లత
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొంపెల్ల మాధవీ లతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికైన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై మాధవీ లత పోటీ చేశారు. ఆమె ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రజల దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో తరచూ కనిపించారు.
వసుంధర రాజే
రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధించిన దరిమిలా మహిళా నేత వసుంధరా రాజే సీఎం అవుతారనే వార్తలు వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా బీజేపీ నేత భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలకు కలతచెందిన వసుంధరా రాజే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వసుంధర రాజే తన ప్రసంగాలు, వ్యాఖ్యల కారణంగా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే..
Comments
Please login to add a commentAdd a comment