
2024 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరం సిద్ధమవుతున్నాం. ఈ నేపధ్యంలో 2024 ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2024 భారతదేశంలోని పలు కుటుంబాలకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించింది.
దేశవ్యాప్తంగా చాలామంది సెలవు రోజుల్లో తమ కుటుంబాలతో సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. యువత సాహసభరితమైన ప్రయాణాలు సాగించగా, వయసుపైబడినవారు ప్రశాంత వాతావరణాలకు చేరుకుని సేదతీరారు. అందమైన బీచ్‌లు, అద్భుతమైన పర్వతప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలలో ప్రయాణించేందుకు భారతీయులు మక్కువ చూపారు. వాటిలో 10 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోవా
2024లో టాప్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ టూరిస్ట్ డెస్టినేషన్‌గా గోవా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. గోవాలోని అందమైన బీచ్‌లు, చర్చిలు ఉన్నాయి. ఇక్కడి సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందిత. కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్‌చేసేందుకు గోవా అత్యుత్తమ ప్రదేశం. వినోద కార్యక్రమాలను ఆస్వాదించేందుకు, చారిత్రక కోటలను సందర్శించేందుకు, అత్యుత్తమ షాపింగ్‌కు గోవా పెట్టిందిపేరు.

కేరళ
ఒకవైపు సహజ సౌందర్యం, మరోవైపు ఘనమైన సంస్కృతికి కేరళ పెట్టిందిపేరు. ఇక్కడి ఆహారం ఆహారప్రియుల నోరూరింపజేస్తుందని చెబుతారు. కుటుంబంతో సహా చూడాల్సిన ప్రాంతాలెన్నో కేరళలో ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్స్, తేయాకు తోటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలు ఉత్సాహాన్ని రెండింతలు చేస్తాయి.

కశ్మీర్
కశ్మీర్.. ప్రకృతి అందాలకు నెలవు. కుటుంబ సభ్యులతో సహా సందర్శించేందుకు ఉత్తమ ప్రదేశం. గుల్‌మార్గ్‌లో స్కీయింగ్, స్నోబోర్డింగ్, బుల్ కార్ రైడ్‌లను ఆస్వాదించవచ్చు. శ్రీనగర్‌లోని అందమైన లోయలను, సరస్సులను సందర్శించవచ్చు.

ముస్సోరీ
ఉత్తరాఖండ్‌లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరీ. కుటుంబసభ్యులతో సహా ఆనందంగా విహరించేందుకు అత్యుత్తమ ప్రదేశం ఇది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. కేబుల్ కార్ రైడ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. స్థానిక మార్కెట్‌లను సందర్శించవచ్చు.

సిక్కిం
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతమైన సిక్కిం సహజ సౌందర్యానికి నిలయంగా పేరొందింది. ఇక్కడి పురాతన మఠాలు దేశ ఘన చరిత్రను చాటిచెబుతాయి. ఇక్కడికి కుటుంబంతో సహా వచ్చే పర్యాటకులు వివిధ
సాహస కార్యకలాపాల్లో పాల్గొని ఆనందించవచ్చు.

మనాలి
హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రసిద్ధ హిల్ స్టేషన్ సాహసాలు చేసేవారికి, ప్రకృతిని ఇష్టపడేవారికి అత్యుత్తమ ఎంపిక. ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్,ట్రెక్కింగ్ మొదలైనవి కుటుంబ సభ్యులకు అమితమైన ఆనందాన్ని అందిస్తాయి. స్థానిక మార్కెట్‌లు మంచి షాపింగ్ అనుభూతులను అందిస్తాయి.

డార్జిలింగ్
పశ్చిమ బెంగాల్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ కుటుంబంతో సహా ఎంజాయ్ చేసేందుకు అనువైన ప్రదేశం. ఇక్కడి టాయ్ ట్రైన్ రైడ్ ఎంతో వినోదాన్నిస్తుంది. ఇక్కడి టీ తోటలు ఎవరినైనా సరే వావ్ అనిపించేలా చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుంటుంది.
గుల్మార్గ్
కశ్మీర్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ స్కీయింగ్, స్నోబోర్డింగ్ ఇష్టపడేవారికి ఎంతో అనువైనది. కేబుల్ కార్ రైడ్‌లు, స్నో గేమ్‌లతో వినోదించవచ్చు. స్నోమెన్‌లను తయారు చేసి ఆనందించవచ్చు.
జైసల్మేర్
రాజస్థాన్‌లోని ఈ అందమైన ఎడారి నగరం.. కుటుంబ సభ్యులంతా కలసి సందర్శించినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఒంటె రైడ్, ఎడారి సఫారీ, ఇక్కడి కోటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ కుటుంబంతో సహా చూడాల్సిన అత్యుత్తు ప్రదేశం. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడి వంటకాలు అందరికీ నోరూరేలా చేస్తాయి. స్థానిక స్మారక చిహ్నాలు, మ్యూజియంలు, మార్కెట్‌లను కుటుంబ సభ్యులంతా కలసి చూసినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఢిల్లీలో పలు థీమ్ పార్కులున్నాయి. ఇవి అత్యుత్తమ వినోదాన్ని పంచుతాయి.
ఇది కూడా చదవండి: Year Ender 2024: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. చాటింగ్ స్టైలే మారిపోయిందే..
Comments
Please login to add a commentAdd a comment