2024.. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ ఏడాది మనకు పలు తీపి గురుతులను, విషాద ఛాయలను అందించింది. వీటిని పక్కన పెడుతూ ఈ ఏడాదిలో మిగిలిన కాసిన్ని రోజులను ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నిస్తే రాబోయే నూతన సంవత్సరం మనకు మరింత కాంతిమయం అవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అందుకు అవలంబించాల్సిన పనులను కూడా వారు తెలియజేస్తున్నారు.
ప్రకృతిలో ఒడిలో..
ఒక అందమైన పార్క్‌లో నడవండి లేదా సైకిల్ తొక్కండి.
సమీపంలోని కొండలు లేదా అడవికి షార్ట్ ట్రిప్ వెళ్లండి.
సూర్యాస్తమయాన్ని ఆస్వాదించండి.
ప్రియమైనవారితో..
కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సమయాన్ని గడపండి.
వారితో బోర్డు గేమ్స్ ఆడండి. కలిసి భోజనం చేయండి. తనివితీరా మాట్లాడండి.
కొత్తదేదో నేర్చుకోండి
కొత్త భాష నేర్చుకోవడం ప్రారంభించండి.
కొత్త వంటకం చేయడానికి ప్రయత్నించండి.
ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి.
దాన గుణం, దాతృత్వం..
స్వచ్ఛంద సేవలో పాల్గొనండి.
స్థానికంగా ఉన్న ఆశ్రమానిక ధనరూపేణా లేదా వస్తురూపేణా దానం చేయండి.
ఎవరో ఒకరికి సహాయం చేయండి.
శారీరక ఆరోగ్యం కోసం..
ఒక రోజు స్పాకు కేటాయించండి.
మసాజ్ లేదా ఫేషియల్ చేయించుకోండి.
యోగా లేదా ధ్యానం చేయండి.
సృజనాత్మకతను..
డ్రాయింగ్, పెయింటింగ్ లేదా ఏదోఒకటి కొత్తగా రాయడానికి ప్రయత్నించండి.
సంగీత పరికరాన్ని వాయించండి లేదా పాటలు పాడండి.
ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి ప్రయత్నించండి.
ఇష్టమైన అంశాలతో..
మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవండి.
మీకు నచ్చిన సినిమా చూడండి.
మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి.
తగినంత విశ్రాంతి తీసుకోండి.
పుస్తకం చదువుతూ లేలేత సూర్యరశ్మిని ఆస్వాదించండి.
వారాంతంలో మరింతసేపు నిద్రకు సమయం వెచ్చించండి.
మీకు ఇష్టమైన పానీయం తాగండి.
కృతజ్ఞత వ్యక్తం చేయండి
మీకు ఈ ఏడాదిలో మంచిని అందించినవారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి.
మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే లేదా మీపట్ల శ్రద్ధ చూపే వారికి కృతజ్ఞతలు తెలియజేయండి.
ఈ జాబితాలోని వీలైనన్ని అంశాలను అమలు చేయడం ద్వారా 2024లోని ఈ చివరి వారాన్ని ఆనందంగా ముగించగలుగుతారు. అలాగే రాబోయే 2025 నూతన సంవత్సరాన్ని మరింత సంతోషంగా ప్రారంభించగలుగుతారు. మరెందుకాలస్యం..
ఇవి కూడా చదవండి: Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు
Comments
Please login to add a commentAdd a comment