Reading
-
Year Ender 2024: చివరి వారాన్ని ఇలా ఆనందంగా గడిపితే..
2024.. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ ఏడాది మనకు పలు తీపి గురుతులను, విషాద ఛాయలను అందించింది. వీటిని పక్కన పెడుతూ ఈ ఏడాదిలో మిగిలిన కాసిన్ని రోజులను ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నిస్తే రాబోయే నూతన సంవత్సరం మనకు మరింత కాంతిమయం అవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అందుకు అవలంబించాల్సిన పనులను కూడా వారు తెలియజేస్తున్నారు.ప్రకృతిలో ఒడిలో..ఒక అందమైన పార్క్‌లో నడవండి లేదా సైకిల్ తొక్కండి.సమీపంలోని కొండలు లేదా అడవికి షార్ట్ ట్రిప్ వెళ్లండి.సూర్యాస్తమయాన్ని ఆస్వాదించండి.ప్రియమైనవారితో..కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సమయాన్ని గడపండి.వారితో బోర్డు గేమ్స్ ఆడండి. కలిసి భోజనం చేయండి. తనివితీరా మాట్లాడండి.కొత్తదేదో నేర్చుకోండికొత్త భాష నేర్చుకోవడం ప్రారంభించండి.కొత్త వంటకం చేయడానికి ప్రయత్నించండి.ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి.దాన గుణం, దాతృత్వం..స్వచ్ఛంద సేవలో పాల్గొనండి.స్థానికంగా ఉన్న ఆశ్రమానిక ధనరూపేణా లేదా వస్తురూపేణా దానం చేయండి.ఎవరో ఒకరికి సహాయం చేయండి.శారీరక ఆరోగ్యం కోసం..ఒక రోజు స్పాకు కేటాయించండి.మసాజ్ లేదా ఫేషియల్ చేయించుకోండి.యోగా లేదా ధ్యానం చేయండి.సృజనాత్మకతను..డ్రాయింగ్, పెయింటింగ్ లేదా ఏదోఒకటి కొత్తగా రాయడానికి ప్రయత్నించండి.సంగీత పరికరాన్ని వాయించండి లేదా పాటలు పాడండి.ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి ప్రయత్నించండి.ఇష్టమైన అంశాలతో..మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవండి.మీకు నచ్చిన సినిమా చూడండి.మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి.తగినంత విశ్రాంతి తీసుకోండి.పుస్తకం చదువుతూ లేలేత సూర్యరశ్మిని ఆస్వాదించండి.వారాంతంలో మరింతసేపు నిద్రకు సమయం వెచ్చించండి.మీకు ఇష్టమైన పానీయం తాగండి.కృతజ్ఞత వ్యక్తం చేయండిమీకు ఈ ఏడాదిలో మంచిని అందించినవారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే లేదా మీపట్ల శ్రద్ధ చూపే వారికి కృతజ్ఞతలు తెలియజేయండి.ఈ జాబితాలోని వీలైనన్ని అంశాలను అమలు చేయడం ద్వారా 2024లోని ఈ చివరి వారాన్ని ఆనందంగా ముగించగలుగుతారు. అలాగే రాబోయే 2025 నూతన సంవత్సరాన్ని మరింత సంతోషంగా ప్రారంభించగలుగుతారు. మరెందుకాలస్యం.. ఇవి కూడా చదవండి: Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు -
లేబుల్.. డేంజర్ బెల్ చదివితే ఉన్న మతి పోతుంది!
ప్యాకెట్ మీద సగం కోసిన ఆరెంజ్ పెద్ద అక్షరాలతో ‘సి విటమిన్స్ సమృద్ధితో’ అని ఉంటుంది. ‘మీరు ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్ చదవండి’ అంటాడు రేవంత్ హిమత్సింగ్కా. లేబుల్ మీద 0.9 పర్సెంట్ ఆరెంజ్ ఫ్రూట్ ΄పౌడర్ అని ఉంటుంది. అంటే ఒక శాతం ఆరెంజ్, మిగిలిన 99 శాతం కెమికల్. ‘లేబుల్ చదివితే మీరు ఆ విషాన్ని ఇంటికి తేరు’ అంటాడు ఈ హెల్త్ చాంపియన్స్ . ప్రపంచ ఆహార దినోత్సవం సురక్షితమైన ఆహారాన్ని కల్పించుకోమంటోంది. ‘దేశమా... లేబుల్ చదువు’ ఉద్యమం ఒక అవసరమైన చైతన్యం.‘గుర్తు పెట్టుకోండి. ఏది ఎక్కువ రోజులు ప్యాకెట్లో నిల్వ ఉంటుందో అది మనకు ఎక్కువ అపాయం కలిగిస్తుంది’ అంటాడు రేవంత్ హిమత్ సింగ్కా. అమెరికాలో చదువుకుని, మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ అవన్నీ వదులుకొని ఇండియాలో ఫుడ్ రెవల్యూషన్ తేవాలని వచ్చేసిన ఈ కోల్‌కతా కుర్రాడు బడాబడా కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. రావడం రావడమే ముందు బోర్నవిటా హెల్త్‌డ్రింక్ కాదని చేసిన వీడియో సంచలనం సృష్టించింది. కేంద్రప్రభుత్వం బోర్నవిటా యజమాని అయిన క్యాడ్‌బరీకి నోటీసు ఇచ్చి ఇకమీదట లేబుల్ మీద హెల్త్ డ్రింక్ అని వేయకూడదని చెప్పింది. ఆ మాట చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు... లేబుల్ చదివి ఉంటే మనకే తెలిసేది అంటాడు హిమత్ సింగ్కా. ఎందుకంటే 400 గ్రాముల బోర్నవిటాలో 50 గ్రాముల చక్కెర ఉంది. లిక్విడ్ గ్లూకోజ్ ఉంది. కృత్రిమ రంగులు ఉన్నాయి. నిల్వకారకాలైన రసాయనాలు ఉన్నాయి. ఇవన్నీ చూపి అతడు సంధించిన ప్రశ్నలకు గొప్ప స్పందన వచ్చింది. ప్రస్తుతం అతడు ప్యాకేజ్డ్ ఫుడ్ మీద చేస్తున్న వీడియోలు అతణ్ణి ఫుడ్ క్రూసేడర్ అని పిలిచేలా చేస్తున్నాయి.పదార్థం గుట్టు ప్యాకెట్ వెనుకకాలం చాలా మారింది. మన తాత, తండ్రులు అంగడికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. అవి కొన్నాళ్లకు పాడైపోయేవి. కాబట్టి అవసరమైనంత వరకే తెచ్చుకునేవారు. ఇప్పుడు మాల్, మార్ట్ల కల్చర్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. వెళ్లి కొనుక్కొస్తే రెండు మూడు నెలలకు కూడా పాడుకావు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ‘ఎఫ్ఎంసిజి’ (ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్) అంటారు. వీటిలో కొన్ని ‘ఆరోగ్యకరమైనవి’గా, ‘ఆరోగ్యానికి మేలు చేసేవిగా’ చెప్పుకుని అమ్మకాలు పెంచుకోవాలని చూస్తాయి.‘లేబుల్ మీద చూస్తే అవి మీకు హాని చేసేవిగా తెలుస్తుంది’ అంటాడు హిమత్ సింగ్కా. ఇవాళ దేశానికి ‘కాన్షియస్ కాపిటలిజమ్’ కావాలనేది హిమత్ నినాదం. అంటే బాధ్యతాయుతమైన పెట్టుబడిదారీ వ్యవస్థ. ముఖ్యంగా ఆహార రంగంలో ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉండాలంటాడు అతను. ఇవాళ మన దేశం ఏటా 50 వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ప్యాకేజ్డ్ ఫుడ్‌లో విస్తారంగా ఉపయోగిస్తారు. ‘హార్డ్ ఎటాక్‌లకు పామాయిల్ కూడా ఒక కారణం’ అంటాడు హిమత్.ఇంగ్లిష్‌లో చిన్న అక్షరాల్లోమ్యాంగో జ్యూస్‌ల పేరుతో ఇవాళ ఫేమస్ అయిన రెండు మూడు బ్రాండ్ల లేబుల్స్ చదివితే వాటిలో 20 శాతానికి మించిన మ్యాంగో పల్ప్ లేదని ఆ కంపెనీలే చెప్పడం కనిపిస్తుంది. వైట్ బ్రెడ్ కాదని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నవాళ్లు లేబుల్ మీద చూస్తే కలర్ వల్ల మాత్రమే అది బ్రౌన్ కాని, వాస్తవానికి అది మైదాపిండి అని తెలుసుకుంటారు. కంపెనీ ఆ మాట చెప్తుందికానీ చిన్న అక్షరాల్లో, ఇంగ్లిష్‌లో చెబుతుంది. పీనట్ బటర్లోప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని యాడ్స్ చెబుతాయి. కాని పీనట్ బటర్లో క్యాలరీలు తప్ప ప్రోటీన్ 3 శాతానికి మించి ఉండదు.మన దేశంలో ఒకలా విదేశాల్లో ఒకలాఒకే వ్యాపార సంస్థ మన దేశంలో చిప్స్‌కు నాసిరకం నూనె, యూరప్‌లో నాణ్యతగల నూనె వాడుతుంది. ఎందుకంటే యూరప్‌లో నియమాలు కఠినంగా ఉంటాయి. అలాగే రెండేళ్ల లోపు పిల్లలకు అమ్మే సెరియల్స్‌లో మనదేశంలో యాడెడ్ సుగర్స్ ఉంటాయి. యూరప్‌లో ఉండవు. రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ సుగర్స్ ఉన్న ఆహారం అంత మంచిది కాదు. తీపికి అడిక్ట్ అయిన పిల్లలు ఇంట్లో ఆరోగ్యకరమైనది పెట్టినా తినరు. అదీ కంపెనీల ఎత్తుగడ. డబ్బా ఆహారం తినే పసికందులు తర్వాతి కాలంలో స్థూలకాయం, డయబెటిస్‌తో బాధ పడే అవకాశం ఉంటుంది. ‘మా డ్రింక్ రోజూ తాగితే ΄÷డవు పెరుగుతారు’, ‘మా నూనె వాడితే గుండెకు మంచిది’... ఇలాంటివి ఏవీ నమ్మొద్దు అంటాడు హిమత్.దేశమా.. లేబుల్ చదువు...‘మీరు ఏ వస్తువు కొన్నా దాని వెనుక ఉన్న లేబుల్ చదవండి. చెడ్డ పదార్థాలు ఉంటే నాణ్యంగా తయారు చేయమని గొంతు విప్పండి. మనం ఏకమైతే సంస్థలు మారి మంచి ఉత్పత్తులు అందిస్తాయి. మన ఆరోగ్యాలు మెరుగు పడతాయి. అలాగే ప్రకటనలతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలు నాణ్యమైన పదార్థాలు అందిస్తున్నాయి. వాటిని గుర్తించి కొనడం కూడా మన పనే’ అంటాడతను. ఇవాళ ‘వరల్డ్ ఫుడ్ డే’. ‘బలవర్థకమైన, సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు’. కాని మోసాన్ని గుర్తించడంలో మనమే వెనుక ఉంటే నష్టం మనకే కదా. ‘లేబుల్ పఢేగా ఇండియా’. ఇండియా.. లేబుల్ చదువు.కోర్టు కేసులు ఎదుర్కొంటూప్యాకేజ్డ్ ఫుడ్లోని మోసాలను బయట పెడుతున్నందుకు పెద్ద పెద్ద సంస్థలు హిమత్ మీద కత్తి కట్టాయి. కోర్టుకు ఈడ్చాయి. మొదట్లో భయపడినా ఇప్పుడు లెక్క చేయడం లేదు. ‘నన్ను కోర్టుకు లాగితే మిమ్మల్ని బజారుకు లాగుతా’ అంటున్నాడు హిమత్. కొన్ని కంపెనీలు రకరకాల చోట్ల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే తన ఊరి నుంచి కాకుండా వేరే ఊళ్లకు అతడు వాయిదాకు హాజరు కావాలి. -
నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో
దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకొంటూ భక్తిపారవశ్యంలో భక్తులు మునిగి తేలుతున్నారు. మరోవైపు దాండియా, గార్బా నృత్యం, కోలాటాలతో ఈ ఉత్సవాలు మరింత శోభను సంతరించు కుంటున్నాయి. తాజాగా గుజరాత్లో నిర్వహించిన గార్బా డ్యాన్స్ కార్యక్రమం విశేషంగా నిలుస్తోంది. నెటిజన్ల ఫన్నీ కమెంట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సందడి ఏంటో తెలుసుకుందాం పదండి! దసరా అంటే గార్బా సందడి ఉండాల్సిందే. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు,ఆఫీసులు, ఇతర ప్రదేశాలలో గర్బా ఈవెంట్లలో చిన్నా పెద్దా అంతా అందంగా ముస్తాబై నృత్యం చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో నవరాత్రి ఉత్సవాలకు దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గుజరాత్‌లోని ఒక గార్బా ఈవెంట్లో బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని మరీ గార్బా స్టెప్పులేయడం విశేషంగా నిలుస్తోంది. తన తోటి డ్యాన్సర్లు నవ్వుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, చక్కగా తన దారిన తాను నృత్యం చేస్తూ, పుస్తకంలో లీనమై పోయాడు. (అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?)చదువుకోవాలని అంటే ఎలా అయినా చదువుకోవచ్చు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్ లో పోస్ట్ అయింది. దీనిపై నెటిజన్లు ఆ అబ్బాయి కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఇది మరీ విడ్డూరం.. చదువుకోవడానికి వేరే ప్రదేశమే దొరకలేదా? అంటూ మరికొందరు కమెంట్ చేశారు. ఈ వీడియో మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే అన్నట్టు ఇంకొక యూజర్ స్పందించారు. UPSC పరీక్షలకు సిద్ధమవుతున్నాడ నుకుంటా అని మరొక వినియోగదారు చమత్కరించారు. (సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్)'Padhne wale bacche kahi bhi padh lete hai' just got real 😭😭 pic.twitter.com/cieAIqUMmd— Ankita (@Memeswalimulagi) October 6, 2024 -
అద్దె బ్యాచ్ దిగింది !
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/తిరుపతి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తోంది. ఎన్నడూ లేని విధంగా నలుగురైదుగురు ఉన్న చోటకెళ్లి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఆ పార్టీ గెలుస్తోందని అసత్య ప్రచారాలు కల్పిస్తూ ‘చీప్ పాలిట్రిక్స్‌కు’ దిగజారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచించడం సహజం. ప్రజలకు చేసిన మంచి పనులను ఎన్నికల సమయంలో చెప్పుకోవడం, మరోసారి అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తామని ప్రకటించడం పరిపాటి. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏవగింపుగా మారింది. ప్రజాభిమానం కోల్పోయి రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోయిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మౌత్ పబ్లిíసిటీ పేరుతో అడ్డదారులు తొక్కుతోంది. ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఎల్లో కిరాయి మూకలను అద్దెకు ఏర్పాటు చేసుకుని టీ దుకాణాలు, సెలూన్ల వద్ద తిష్టవేసి అధికార పక్షంపై అసత్య ప్రచారం చేయించుకునే దుస్థితికి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకుని అద్దెబ్యాచ్ పట్టణాల్లో తిరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం సహకారంతో విద్యార్థులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి కళాశాల నుంచి కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది. అద్దె బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చి.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థులను టార్గెట్ చేయటంతో పాటు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చారు. శిక్షణా తరగతులను మొదటి, రెండు, మూడు బ్యాచ్‌లుగా విభజించి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి విడతగా నియోజక వర్గానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున రంగంలోకి దింపారు. వీరిపైన జిల్లాకు ఒక కో ఆర్డినేటర్‌ని నియమించారు. ఈ ఇద్దరు రోజూ ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు? అక్కడ పరిస్థితులు ఏంటి అనేది జిల్లా కో ఆర్డినేటర్‌కి నివేదిక రూపంలో అందిస్తారు. దానిని అమరావతిలో ఉండే టీం లీడర్‌కి పంపుతారు. దాదాపు 5 వేల మందికి శిక్షణ ఇచ్చి నగర, పట్టణ ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. లోకల్‌గా కొంతమందిని రిక్రూట్ చేసుకుని వారితో సమన్వయం చేసుకుంటూ అద్దె బ్యా చ్ మౌత్ పబ్లిíసిటీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు రూరల్ ప్రాంతంలో అద్దె బ్యాచ్ టీ దుకాణాల వద్ద చేస్తున్న అసత్య ప్రచారాన్ని కొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ బ్యాచ్ ఆ ప్రాంతాన్ని వదిలి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు, మూడు విడతల్లో మండల, సచివాలయాలు.. మొదటి విడత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పూర్తయ్యాక మరొక బ్యాచ్ రంగంలోకి దిగుతుంది. సంక్రాంతి తరువాత మండల, సచివాలయ కేంద్రాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిసింది. పట్టణాలు, నగరాలు అయితే అద్దె బ్యాచ్ ఎవరనేది ఎవ్వరూ ప్రశ్నించరు. కాబట్టి వారికి ఆ బాధ లేదు. మండల, సచివాలయ కేంద్రాలకు వెళ్లే సమయంలో స్థానిక నాయకుల సహకారంతో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తారు. ఒక అద్దె వ్యక్తి స్థానికుడు ఒకరు ఉంటారు. అలా ఇద్దరికి ఇద్దరు పర్యటిస్తారు. టీ కొట్లు, చిన్న బంకుల వద్ద కూర్చొని అబద్దపు ప్రచారాలకు పదును పెడుతారు. స్థానిక టీడీపీ కార్యకర్త ప్రభుత్వం గురించో, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గురించో ప్రస్తావన చేస్తారు. అద్దె వ్యక్తి ‘అవునంటన్నా. మా బంధువుకి అలా జరిగిందంట, వైఎస్సార్సీపీ వాళ్లు ఇలా చేశారంట’ అని శృతి కలుపుతాడు. నలుగురు కలిసి ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు తీవ్రంగానే కృషి చేయటానికి పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మూడో బ్యాచ్‌లో బరి తెగింపుడే ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మూడవ బ్యాచ్ రంగంలోకి దిగే పనిలో ఉంది. ఈ బ్యాచ్ అన్నింటికీ తెగించిన వారికి ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ వచ్చాక అబద్దాలు ప్రచారం చేయటం కంటే.. స్థానికంగా గొడవలు సృష్టించేందుకే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం దుకాణాల వద్ద, లేదా మద్యం సేవించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్థానికుల మధ్య గొడవలు పెట్టటం లేదా వీరే స్థానికులను రెచ్చగొట్టి విధ్వంసాలకు లాగటమే వీరి స్కెచ్‌గా తెలుస్తోంది. మద్యంపై విషప్రచారం చేయటం, స్థానికులను కొట్టడం, లేదా వారి వద్ద వీరు దెబ్బలు తినటమే ప్రధాన లక్ష్యంగా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఘోర పరాభవాన్ని గుర్తెరిగే.. గత ఎన్నికల్లో మాదిరిగా ఘోర పరాభవాన్ని గుర్తెరిగే టీడీపీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పూనుకొంటోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధితో ఆ ప్రభుత్వానికి ప్రజల్లో పరపతి పెరిగింది. మరోసారి కూడా వైఎస్సార్సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగే ప్రయతాన్ని టీడీపీ చేస్తోంది.అయినా ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మౌత్ పబ్లిíసిటీని నమ్ముకొని దానినే కార్యరూపంలోకి తీసుకొచ్చారు. టీ స్టాళ్లు, సెలూన్లే వేదికలు టీడీపీ కిరాయి మూకలు నగరాలు, పట్టణా ల్లోని టీ దుకాణాలు, సెలూన్లను వేదికగా చేసుకుంటున్నాయి. సాధారణ వ్యక్తుల్లా వెళ్లి అక్కడే తిష్ట వేస్తారు. వారి చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్త లను చదువుతున్నట్లు నటిస్తారు. వార్త ల సారాంశంపై పక్కనున్న వారితో చర్చ పెడతారు. ఆపై ఇదేం ప్రభుత్వం, ఎక్కడ చూసినా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఎక్కడా రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అప్పులు చూస్తే కొండలా పెరిగిపోతున్నాయి, సంక్షేమం అంటూ బటన్లు నొక్కి తిరిగి ధరలు పెంచి మన నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారంటూ పెదవి విరుస్తారు. ఇలా ఎల్లో కిరాయి మూ కలు తమ నటనను ప్రదర్శిస్తారు. అంతే కాకుండా లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు టికెట్ రాదని, ఆయన అవినీతి చేశాడని.. టీడీపీలోకి వలసలు జోరుగా జరుగుతున్నాయంటూ భజన ప్రారంభిస్తారు. టీడీపీ, జనసేన జోడీ బాగుంది.. ఉత్తరాంధ్రలో అంతా టీడీపీ, జనసేన కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని, ఈ దఫా ఈ కూటమికే అధికారం వస్తుందని పదేపదే చెబుతారు. ఆ షాపుల వద్ద జనం ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే అక్కడ తిష్ట వేసి ఇలా తమ నటనను ప్రదర్శిస్తారు. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేర్పరితనంతో వ్యవహరిస్తారు. -
కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం
బెంగళూరు: అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్‌లో ఉత్వర్వులు జారీ చేసింది. -
ఆ పార్కులో మాట్లాడుకోడాల్లేవ్! అంతా సైలెంట్..
పెద్దగా మాటలుండవు. ఒక పదీ పదిహేనుమందివచ్చి పార్కులో కలుస్తారు. అందరి చేతుల్లో వారికి నచ్చిన పుస్తకాలు ఉంటాయి. తలా ఒకచోట కూచుని పుస్తకాన్ని నిశ్శబ్దంగా చదువుకుంటారు. వీడ్కోలుకు ముందు కాసిన్ని కబుర్లు... ఒక చాయ్... ఒకరి పుస్తకం మరొకరికి అరువు...ఒక ఆరోగ్యకరమైన వ్యాపకం ఆరోగ్యకరమైన బృందం...సెల్ఫోన్ల కాలుష్యంలోముంబైలో తాజా ట్రెండ్ ‘సైలెంట్ రీడింగ్‘. శనివారం సాయంత్రం 5 గంటలు. ముంబైలోని జుహూలో కైఫీ ఆజ్మీ పార్క్. మెల్లమెల్లగా కొంతమంది నడుచుకుంటూ వచ్చి ఒకచోట జమయ్యారు. వారి చేతుల్లో పుస్తకాలు, చాపలు, దుప్పట్లు, చిరుతిండ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు వారికి నచ్చినచోట దుప్పటి పరిచి పుస్తకం తెరిచి కూచున్నారు. దూరం నుంచి చూస్తే ఒక పదిహేను ఇరవై మంది శిలల్లా కూచుని చేతుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. మంచి ప్రకృతిలో, మంచి సమయంలో, నచ్చిన పుస్తకాన్ని, తమలా పుస్తకాలను ఇష్టపడేవారి సమక్షంలో చదువుకోవడం ఎంత బాగుంటుంది? పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. పుస్తకాలను చదివేవారితో స్నేహానికి మించింది లేదు. అందుకే ఇప్పుడు ముంబైలో ‘సైలెంట్ రీడింగ్’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. కొత్త స్నేహితులను పరిచయం చేస్తోంది. సైలెంట్ రీడింగ్ ఎందుకు? పుస్తకాభిమానులు బుక్ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్లినా, ఆథర్ టాక్‌కు వెళ్లినా ఏదో రణగొణధ్వని. పుస్తకం గురించి తక్కువ... మెరమెచ్చులు ఎక్కువ. అంతేకాదు, కొంతమంది పుస్తకాన్ని తప్ప దానిని రాసినవారిని కలవాలనుకోరు. మరికొంతమంది ఇంట్రావర్ట్‌లు తాము నిశ్శబ్ద స్నేహితులుగా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారంతా ఏ గోలా లేని ‘సైలెంట్ రీడింగ్’ని ఇష్టపడుతున్నారు. ఈ సైలెంట్ రీడింగ్ గ్రూపుల్లో వాగుడుకాయలకు ప్రవేశం లేదు. హాయిగా నిశ్శబ్దంగా చదువుకోవడమే. మంచి పుస్తకాన్ని ఒకరితో మరొకరు పంచుకోవడమే. బెంగళూరులో మొదలు బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో శ్రుతి షా, హర్ష్ స్నేహాన్షు ఇద్దరు పుస్తక ప్రేమికులు ‘కబ్బన్ రీడ్స్’ పేరుతో ‘సైలెంట్ రీడింగ్’ని 2022 డిసెంబర్లో మొదలెట్టారు. కబ్బన్ పార్క్‌లో పుస్తక ప్రేమికులు విశేషంగా వచ్చి వారానికి ఒకసారి పుస్తకాలు చదువుకుని వెళ్లడం అందరినీ ఆకర్షించింది. దాని ప్రభావంతో ముంబైలోని జుహూలో దియా సేన్‌గుప్తా, రచనా మల్హోత్రా అనే ఇద్దరు స్నేహితురాళ్లు ‘జుహూ రీడ్స్’ పేరుతో ఈ సంవత్సరం మేలో ‘సైలెంట్ రీడింగ్’ను మొదలెట్టారు. వెంటనే జుహూలోని పుస్తక ప్రేమికులను ఇది ఆకర్షించింది. అన్ని వయసుల వాళ్లు ఇక్కడికి వచ్చి కూచుని ప్రశాంతంగా పుస్తకాలు చదవసాగారు. అంతేనా? వీల్‌చైర్‌లో ఉండేవారు కూడా వచ్చి పుస్తకంలో, పుస్తకాన్ని ఇష్టపడేవారి సమక్షంలో ఓదార్పు పొందసాగారు. ‘సెల్ఫోన్లు వచ్చాక పుస్తకం చదివే అలవాటు తగ్గింది. మనుషులు సెల్ చూసుకుంటూ కనిపించడమే అందరికీ తెలుసు. కాని ఒకప్పుడు పుస్తకం చదువుతూ కనిపించేవారు. సైలెంట్ రీడింగ్ వల్ల పుస్తకం చదువుకుంటూ కనిపించేవారు అందరినీ ఆకర్షిస్తున్నారు. దానివల్ల పుస్తకాలు చదవాలన్న అభిలాష పెరుగుతోంది. మేము ఆశిస్తున్నది అదే’ అని జుహూ రీడ్స్ నిర్వాహకులు అన్నారు. దేశ, విదేశాల్లో... బెంగళూరు కబ్బన్ పార్క్‌తో మొదలైన సైలెంట్ రీడింగ్ ఉద్యమం ఇప్పుడు ముంబైలో బాంద్రా, దాదర్, కొలాబా లాంటి ఐదారు చోట్లకు విస్తరించింది. ఇక మన దేశంలోని ఢిల్లీ, పూణె, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లకు కూడా వ్యాపించింది. సోషల్ మీడియా ద్వారా కబ్బన్ రీడ్స్ గురించి తెలుసుకున్న వారు న్యూయార్క్, లండన్, దుబాయ్, మెల్బోర్న్లలో కూడా సైలెంట్ రీడింగ్ సమూహాలను తయారు చేస్తున్నారు. ‘ఈ రీడింగ్స్‌కు వచ్చినవారు మంచి స్నేహితులుగా మారుతున్నారు. బిజీ లైఫ్‌లో మనిషి ఒంటరితనాన్ని ఫీలవుతున్నాడు. ఆ ఒంటరితనం పోగొట్టేందుకు సైలెంట్ రీడింగ్ గ్రూపులు సాయం చేస్తున్నాయి’ అని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే నానా చెత్త ప్రభావంలో పడి అనవసర భావోద్వేగాలకు లోను కావడం కన్నా వికాసం, జ్ఞానం, జీవితానుభవం, ఆహ్లాదం పంచే పుస్తకాన్ని అక్కున చేర్చుకోవడం నేటి తక్షణావసరం. పుస్తకాలు చదివే వారితోనే నాగరిక సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా సైలెంట్ రీడింగ్ గ్రూపులు సమాజాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాయి. ఇలాంటి ఉద్యమాల్ని పుస్తకాభిమానులు ఎక్కడికక్కడ అందుకోవాల్సిన అవసరం ప్రతి ఊళ్లో, పట్టణంలో ఉంది. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
పరీక్షలని పండగ చేసుకోండి! దెబ్బకు ఎగ్జామ్ ఫోబియా పరార్
పరీక్షలు వస్తున్నాయంటే పట్టాలపై పరుగులు తీయాల్సిన రైళ్లు మన గుండెల్లో పరుగెత్తిన రోజులు ఇప్పటికీ గుర్తుంటాయి. తరాలు మారినా పరీక్షల సమయంలో ఒత్తిడి, భయం మారలేదు. పరీక్షల మాట ఎలా ఉన్నా పండగ అంటే బోలెడు సంతోషం వస్తుంది. అందుకే ‘పరీక్షలను పండగ చేసుకోండి. సంతోషం మీ దగ్గర ఉంటే సక్సెస్ మీ దగ్గర ఉన్నట్లే’ అంటున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన అధర్వ, ప్రణయ్ అనే ఇద్దరు మిత్రులు... ఎంతోమంది విద్యార్థుల్లాగే అధర్వ, ప్రణయ్‌లకు పరీక్షలకు రెండు,మూడు రోజుల ముందు హడావిడిగా పుస్తకాలు పట్టుకోవడం అలవాటు. లాస్ట్–మినిట్ రివిజన్ వల్ల గందరగోళానికి గురైన రోజులు ఎన్నో ఉన్నాయి. కట్ చేస్తే.... ఇంజనీరింగ్ చదవడం కోసం ప్రణయ్ ముంబై, అధర్వ చెన్నై వెళ్లారు. ఎవరి దారులు వారివి అయిపోయాయి. చాలారోజుల తరువాత కలుసుకున్నప్పుడు వారి మధ్య ‘ఎగ్జామ్స్ సమయంలో స్టూడెంట్స్’ అనే బరువైన ప్రస్తావన వచ్చింది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ధైర్యం ఇవ్వడానికి, ఉత్సాహం అందించడానికి తమ వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘పఢ్‌లే’ (చదువు కో) అనే యూట్యూబ్ చానల్, వెబ్సైట్. స్టూడెంట్స్‌కు ఉచితంగా అందుబాటులో ఉండే తమ చానల్, వెబ్సైట్లు ఎడ్యుకేషనల్ మెటీరియల్‌కు స్టోర్హౌజ్గా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్స్, లెక్చర్స్, స్టడీ టిప్స్...ఇలా ఎన్నో అంశాలకు ఈ ‘పఢ్‌లే’ వేదికగా మారింది. ప్రకటనలు, డొనేషన్లు తమకు ప్రధాన ఆదాయ వనరు. ‘ఎన్నో రంగాలలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చినా విద్యావ్యవస్థలో మాత్రం రావడం లేదు. బోధన అనేది యాంత్రికం అయితే విద్యార్థులకు అయోమయమే మిగులుతుంది. అది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. పరీక్షలు అంటే స్టూడెంట్స్ భయపడే రోజులు కాదు, సంతోషంతో గంతులు వేసే రోజులు రావాలి’ అంటాడు అధర్వ. ఎంత జటిలమైన విషయాన్ని అయినా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కొందరు ఆ దారుల గురించి కనీసం ఆలోచించరు. కొందరు ఆ దారుల గురించి వెదుకుతారు. ఈ కోవకు చెందిన వారే అధర్వ, ప్రణయ్‌లు. ‘కాన్సెప్ట్‌లను అర్థం చేయించాలంటే విద్యార్థులకు కంఫర్ట్‌గా ఉన్న భాషలో చెప్పాలి. ఇంటర్నెట్లో ప్రతి సబ్జెక్ట్ మీద ఎంతో కంటెంట్ అందుబాటులో ఉంది. అయితే స్టూడెంట్స్ చేతితో రాసుకున్న నోట్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు’ అంటాడు ప్రణయ్. 8,9,10 తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇద్దరు మిత్రులు కాన్సెప్ట్‌లకు సంబంధించిన నోట్స్ రాసుకున్నారు. వాటిని స్కానింగ్ చేసి తమ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. దీంతో పాటు ఫన్నీ వీడియోలతో, మీమ్స్‌తో జటిలమైన కాన్సెప్ట్‌లను అర్థం చేయించడం మొదలుపెట్టారు. ఈ ఫార్మట్ సూపర్ సక్సెస్ అయింది, ‘పదవ తరగతి చదివే మా అబ్బాయి ఆదిత్య చదువులో వెనకబడ్డాడు. నేను అతడికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఫీస్ పనుల వల్ల అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఆదిత్య తరచుగా ప ఢ్లే చానల్ చూసేవాడు. అక్కడ ఎన్నో నేర్చుకున్నాడు. ఇప్పుడు బాగా చదువుతున్నాడు’ అంటున్నాడు ఇండోర్‌కు చెందిన కుమార్ అనే పేరెంట్.‘ఇక చదవడం నా వల్ల కాదు’ అనుకున్న సమయంలో మీ యూట్యూబ్ చానల్ చూశాను. నేను జటిలం అనుకున్న ఏన్నో విషయాలు చాలా సులభంగా అర్థమయ్యాయి. ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉంది’ అని ఈ ఇద్దరు మిత్రులను కలిసి చెప్పిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ‘పఢ్‌లే’గా మొదలైన తమ యూట్యూబ్ చానల్ ఇప్పుడు ‘జస్ట్ పఢ్‌లే’గా మారింది. 1.5 మిలియన్ల సబ్స్క్రైబర్స్తో దూసుకువెళుతోంది. (చదవండి: ఎవ్వరైనా అంతరిక్షంలో చనిపోతే శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు) -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్‌కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్‌జెడ్ జెనరేషన్‌కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్‌గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్‌తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్‌కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్‌గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్‌కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్‌ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్‌కాస్ట్‌తో పాటు ఆడియో బుక్స్‌కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్‌కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్‌తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్‌ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్‌ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్‌ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్‌కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్‌తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్‌లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు. -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా.. కళ్లజోడు లేకుండా నేను ఇప్పుడు చదవలేకపోతున్నా’.. అధికారికంగానే వయసు మీరుతోంది’ అని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ చమత్కరించారు. ఈ మేరకు కళ్లజోడుతో ఉన్నఫోటోలను శుక్రవారం ట్వీట్చ ఏశారు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాను ఉద్ధేశించి ట్వీట్ చేస్తూ ‘ఆర్థిక విధానాల్లో విఫలమైన బ్రిటన్ ప్రధాని లిజ్ కేవలం 45 రోజుల్లో తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌లో మాత్రం 30 ఏళ్లలో లేనంత నిరుద్యోగం, 45 ఏళ్లలో లేనంత ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అతి ఎక్కవ ఎల్పీజీ ధరలు, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి వాటిని మనప్రధాని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. -
జీతం రూ.70 వేలు ..చదవ లేరు..రాయలేరు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నిరక్షరాస్యులు ఎక్కువైపోయారు. జీతం రూ.50వేల నుంచి రూ.70 వేలు తీసుకుంటున్నా... ఇంగ్లిష్‌లో చిన్న పదం కూడా రాయలేని పరిస్థితి. దీంతో పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఎస్కేయూలో దాదాపు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు తమ ‘డిజిగ్నేషన్’ కూడా ఇంగ్లిష్‌లో సరిగా రాయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం ఒక లెటర్‌ను టైప్ చేసి ఉన్నతాధికారులకు పంపడం కూడా వీరికి చేతకాదు. ఒకప్పుడు డైలీ వేజ్ కింద వారంతా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగాన్ని పరి్మనెంట్ చేసుకుని రికార్డు అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్నారు. అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా ఫైల్ డ్రాఫ్టింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపలేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటీవలే వీరందరికీ ప్రత్యేకంగా కంప్యూటర్ నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇచ్చినప్పటికీ, అభ్యసించలేక వెనుకబడ్డారు. దీంతో వారందరినీ నైపుణ్యం లేని విధుల్లో నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే జూనియర్ అసిస్టెంట్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. (చదవండి: బాబు పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడ?) -
బిల్‌గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా?
ప్రపంచ కుబేరుడిగా సుదీర్ఘ కాలం నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొత్త దిశను చూపడమే కాదు ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు గేట్స్. బిజినెస్ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటు ఆయన మానుకోలేదు. రెగ్యులర్‌గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సజెస్ట్ చేస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. వాటిని చదవడం ఎంతో మంచిదంటున్నారు. 1) ది పవర్ ది పవర్ పుస్తకాన్ని బ్రిటీష్ రచయిత నయోమీ అల్డర్‌మ్యాన్ రాశారు. ఈ నవల ఫిక్షన్ విభాగంలో 2017లో రిలీజైన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ పుస్తకం చదవాలంటూ గేట్స్‌కి ఆయన కూతురు సూచించారట. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పైకి కనిపించని ఇబ్బందుతుల తదితర అంశాలను ఇందులో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. 2) వై వీ ఆర్ పోలరైజ్డ్ అమెరికన్ జర్నలిస్టు రాసిన మరో పుస్తకం వై వీ ఆర్ పోలరైజ్డ్. అమెరికా రాజకీయలు ప్రధాన ఇతివృత్తంగా ఉండే ఈ ఫిక్షన్ నవల సైకాలజీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. 3) ది లింకన్ హైవే అమోర్ టవెల్స్ రాసిన ది లింకన్ హైవే పుస్తకం కూడా చదివి తీరాల్సిందే అంటున్నాడు బిల్‌గేట్స్. గతంలో అమెర్ టవెల్స్ రాసిన ఏ జెంటిల్మెన్ ఇన్ మాస్కోకి కొనసాగింపుగా ఈ పుస్తకం వచ్చింది. మొదటిదాని కంటే రెండోది మరీ బాగుందంటూ కితాబు ఇచ్చారు బిల్‌గేట్స్. 4) ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్ కిమ్ స్టాన్లీ రాబిన్సన్ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తు ఎంత దుర్లభంగా ఉంటుందనే అంశాలను లోతుగా చర్చించిన పుస్తకం ఇది. ప్రకృతి పట్ల మన బాధ్యతను ఈ పుస్తకం గుర్తు చేస్తుందంటున్నారు గేట్స్. 5) హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్ ప్రముఖ రచయిత వాక్లవ్ స్మిల్ కలం నుంచి జాలువారిన మరో మాస్టర్ పీస్ హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్. జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. వాటి ఆధారంగానే మన జీవనశైలి ఏలా మారుతుందనే అంశాలను ఇందులో విపులంగా చర్చించారు. చదవండి: బిల్‌గేట్స్, ఎలాన్ మస్క్ మాటల యుద్ధం -
ఇది కరోనా నై‘పుణ్యమే’
సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువును కరోనా అల్లకల్లోలం చేసింది. చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను దెబ్బతీసింది. తల్లిభాషలోనూ తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి విస్మయం కలిగించే నిజాలెన్నో నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్స్ అలయెన్స్(నిసా), తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రాస్మా) సర్వేలో వెల్లడయ్యాయి. కరోనా తర్వాత క్లాస్‌లకు హాజరవుతున్న 44.6 శాతం విద్యార్థులకు చదవడం కష్టంగా ఉందని, 32.8 శాతం మందిలో ఆత్మవిశ్వాసం లోపించిందని నిసా, ట్రాస్మా సర్వేలో వెలుగుచూశాయి. ఆన్లైన్ విధానంలో నష్టపోయిన విద్యను నేర్చుకునేందుకు 45.1 శాతం మంది తిరిగి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని కోరుతున్నట్టు తేలింది. సర్వే నివేదికను ట్రాస్మా మంగళవారం వెల్లడించింది. కరోనాకాలంలో నెలకొన్న విద్యారంగం నష్టంపై ఈ రెండుసంస్థలు కలసి దేశవ్యాప్తంగా ఇటీవల సర్వే జరిపాయి. అన్నిప్రాంతాల విద్యార్థులు, సంస్థల ప్రతినిధులను కలిశారు. 3–5 తరగతులు, 8వ తరగతి విద్యార్థుల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం మంది మాతృభాషలో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం మందిలో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో 14 శాతం చదవడం, 17 శాతం రాయడంలో వెనుకబడి ఉన్నట్టు తేలింది. పట్టుతప్పిన చదువు... ►ఆంగ్లభాషలో విద్యార్థుల ప్రమాణాలు 35 శాతం మేర పడిపోయాయి. 3వ తరగతి విద్యార్థులు ఒకటో తరగతి నైపుణ్యాల స్థాయికి తగ్గిపోయారు. పట్టణాల్లో ఆంగ్ల భాషలో చదివే నైపుణ్యం కొరవడింది. 40% మంది 5వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌లో అర్థం చేసుకోలేనిస్థితిలో ఉన్నారు. ఐదో తరగతి పట్టణ విద్యార్థులు ఇంగ్లిష్ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. ►44 శాతం విద్యార్థులు గణితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. 42 శాతం 5వ తరగతి విద్యార్థులు గణితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గణితంలో ప్రతి ముగ్గురు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ►ఆన్లైన్ బోధనలో 83.9 శాతం మంది యూట్యూబ్, దూరదర్శన్, టీ–శాట్‌కు ప్రాధాన్యమిచ్చారు. 12 శాతం మందికి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోయారు. ఆన్లైన్ బోధనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత కన్పించింది. 44.6 శాతం విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో తరగతిగదుల్లో చదవడం కష్టంగా ఉందని చెబుతున్నారు. ►కరోనా వల్ల 32.8 శాతం మంది ఆత్మ విశ్వాసంతో చదువు కొనసాగించడంలేదు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేస్తాం: వినోద్‌కుమార్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యా ర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్స్ అలయెన్స్ (నిసా), తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) ఇటీవల కరోనా కాలంలో విద్యా ప్రమాణాలపై నిర్వహించిన సర్వే నివేదికను వినోద్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా గ్రామీణ ప్రాంతాలకు విద్య చేరువ కాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో గత రెండేళ్లుగా విద్యారంగానికి జరిగిన నష్టాన్ని ఉపాధ్యాయులు పూడ్చాలని, బ్రిడ్జ్ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అన్ని స్థాయిల్లోనూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ట్రాస్మా సలహాదారు డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ 98 శాతం గ్రామీణ విద్యార్థులు ఆన్లైన్ విద్యపై మక్కువ చూపడం లేదన్నారు. కరోనా మూలంగా విద్యార్థులకు ఆంగ్ల భాష మీద పట్టు తగ్గిందని, రాత నైపుణ్యానికి దూరమయ్యారని, ఈ నష్టాన్ని పూడ్చకపోతే భవిష్యత్‌లో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
బైజూస్ చేతికి సింగపూర్ సంస్థ
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కొత్తగా మరో సంస్థను కొనుగోలు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే గ్రేట్ లెర్నింగ్‌ను 600 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,466 కోట్లు) దక్కించుకుంది. ప్రొఫెషనల్, ఉన్నత విద్య సెగ్మెంట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రేట్ లెర్నింగ్‌లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,977 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. బైజూస్ ఇటీవలే అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫాం ఎపిక్‌ను 500 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,730 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. బైజూస్ గ్రూప్‌లో భాగంగా మారినప్పటికీ వ్యవస్థాపక సీఈవో మోహన్ లక్కంరాజు, సహ వ్యవస్థాపకులు హరి నాయర్, అర్జున్ నాయర్ల సారథ్యంలో గ్రేట్ లెర్నింగ్ ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనుంది. బైజూస్ టెక్నాలజీ, గ్రేట్ లెర్నింగ్ ప్రొఫెషనల్ కోర్సుల కంటెంట్ ఒక దగ్గరకు చేరేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పేరొందిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా కొత్త సెగ్మెంట్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోగలమని బైజూస్ వ్యవస్థాపక, సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. ఆన్లైన్లో ఉన్నత విద్యాభ్యాసం పెరిగే కొద్దీ అందుబాటు ధరల్లో అందరికీ విద్యను అందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని మోహన్ పేర్కొన్నారు. బైజూస్.. గ్రేట్ లెర్నింగ్ ఇలా.. గ్రేట్ లెర్నింగ్ 2013లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా 170 పైచిలుకు దేశాల్లో 15 లక్షల మంది పైగా విద్యార్థులకు కోర్సులు అందించింది. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వంటి దిగ్గజ విద్యా సంస్థలకు చెందిన 2,800 పైగా పరిశ్రమ నిపుణులు ఇందులో మెంటార్లుగా ఉన్నారు. ప్రధానంగా సింగపూర్, అమెరికా, భారత్‌లో గ్రేట్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. -
చుక్క..చుక్క నొక్కేస్తున్నారు..
సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్లో పెట్రోల్ బంకుల యజమానులు రూట్ మార్చి మోసాలకు పాల్పడుతున్నారా, పెద్ద ఎత్తున ఒకేసారి కాకుండా ఒక లీటర్‌కు 5 నుంచి 10 మిల్లీ లీటర్లు తక్కువగా పోస్తూ రూపాయి రూపాయి వెనుకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడుల్లో బయట పడుతున్న విషయాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మూడు రోజులుగా గ్రేటర్ పరిదిలోని పెట్రోల్ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొలతలలో తేడాలు వస్తున్న బంకులపైన కేసులు నమోదు చేస్తున్నారు. తనిఖీల్లో ఒక్కో నాజిల్ నుంచి 5 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌ను పరిశీలించగా 35 నుంచి 30 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వరుసగా తనిఖీలు హైదరాబాద్ జిల్లాలో 176, రంగారెడ్డి జిల్లా రీజియన్‌లో 375 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని రోజులుగా తూనికలు, కొలతల శాఖ అధికారులు స్థబ్ధుగా ఉండటంతో పెద్దగా కేసులు నమోదు కాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రేటర్‌లోని పెట్రోల్ బంకులపై ఫిర్యాదులు వస్తున్నందున తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న బంకుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 25న హస్తినాపురంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో లీటరుకు 6 మిల్లిలీటర్ల చొప్పున తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. బీఎన్ రెడ్డి నగర్, ఇంజాపూర్‌లోని మరో రెండు బంకుల్లోనూ తక్కువగా వస్తుండటంతో వాటిని సీజ్ చేశారు. ఈ నెల 26న అత్తాపూర్, కూకట్పల్లి, ఆరాంఘర్, కర్మాన్ ఘట్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి మూడు బంకుల్లో తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. చిల్లర మోసం పెట్రోల్ బంకుల యజమానులు ఒక లీటర్‌కు 6 మిల్లీలీటర్ల చొప్పున తక్కువగా వచ్చేలా నాజిల్లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లీటరు పెట్రోల్ ధర రూ. 74.45 కాగా ఒక లీటరు కొనుగోలుపై 50 పైసల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక బంకులో ఒక రోజు సుమారు 5వేల లీటర్ల అమ్మకాలు జరిగితే అదనంగా రూ. 2500 వరకు ఆదాయం వస్తుంది. ఈ తరహా మోసాల వల్ల లీటరు, రెండు లీటర్లు పోయించుకునే వారికి పెద్దగా నష్టం ఉండకపోయినా పెద్ద వాహనాలైన లారీలు, బస్సులు, కార్లలో ఒక్కోసారి 100 లీటర్ల వరకు డీజిల్ పోయిస్తుంటారు. ఇలాంటి వినియోగదారులు బంకుల యజమానులు చేసే చిల్లర మోసాలకు అధికంగా నష్టపోతున్నారు. దాడులతో అప్రమత్తం గ్రేటర్‌లోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకుంటే మైలేజీ రావడం లేదని తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొదటి రోజు, రెండో రోజు మూడు కేసులు నమోదు చేశారు. అధికారుల దాడులతో అప్రమత్తమైన బంకుల యజమానులు కొలతల్లో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మూడవ రోజు మేడ్చల్, ఆదిభట్ల, కర్మాన్ ఘట్, శామీర్‌పేట. షాద్‌నగర్ ప్రాంతాల్లోని 17 బంకుల్లో తనిఖీలు చేసిన పెద్దగా తేడాలు రాలేదని తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. రిమోట్ సహాయంతో సరిచేస్తూ పెట్రోల్ బంకుల్లో ఎక్కువ శాతం మోసాలు అధునాతన చిప్‌లను వినియోగించి చేస్తుంటారనే విషయం తెలిసిందే. కారు రిమోట్ తరహాలో ఉండే ఈ రిమోట్ల సహయంతో దూరం నుంచి కూడ వీటిని ఆపరేట్ చేసి నాజిల్లోని రీడింగ్‌ను సెట్ చేయవచ్చు. అధికారులు దాడులకు వస్తే వెంటనే అప్రమత్తమయ్యే బంకుల యజమానులు రీడింగ్‌లో తేడాలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. పలు బంకుల్లో లీటరుకు30 నుంచి 50 మిల్లీలీటర్ల వరకు తక్కువ వస్తున్నా అధికారుల దాడులతో జాగ్రత్త పడినట్లు సమాచారం. అర్ధరాత్రి తరువాత దాడులు మూడు రోజులుగా దాడులు చేస్తుండటంతో బంకుల నిర్వాహకులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మేము కూడ తెలివిగా వ్యవహరించి తనిఖీలు చేపడుతాం. అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేయాలని భావిస్తున్నాం. అక్రమాలకు పాల్పడే వారికి జరిమానాలు విధించడంతో పాటు, నాజిల్లను సీజ్ చేస్తున్నాం. వరుసగా పట్టుబడిన బంకుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – జగన్ మోహన్ రెడ్డి తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ -
ఇలా చదివితే కళ్లు పోతాయ్!
లండన్ : అతిగా చదవటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు శాస్త్రవేత్తలు. సంవత్సరాల తరబడి అలా చదవటం వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బ్రిష్టల్, కర్డిఫ్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. సంవత్సరాల కొద్ది చదువులు చదవటం వల్ల అది నేరుగా కంటిచూపు మీద ప్రభావం చూపుతుందంటున్నారు. వైద్య పరిభాషలో ‘మియోపియా’అని చెప్పబడే కంటి సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ‘మెండెలియన్ రాండమైజేషన్’ పద్ధతి ద్వారా 40-69 మధ్య వయస్సు కలిగిన దాదాపు 68వేల మందితో ఓ సర్వే నిర్వహించారు శాస్త్రవేత్తలు. ‘మియోపియా’ పెరుగుతూపోతే కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. చదువుకునే సంవత్సరాలు పెరిగే కొద్ది వారిలో కంటిచూపు ప్రతి సంవత్సరానికి 0.27 డియోప్ట్రాస్(రిప్రేక్టివ్ ఎర్రర్) మేర నష్టపోయినట్లు వెల్లడైంది. ఇంటర్‌తో చదువు ఆపేసిన వారిలో కంటిచూపు కొంత మెరుగ్గా ఉన్నట్లు తేలింది. చదువులు పెరిగే కొద్ది విద్యార్హత పెరగటంతో పాటు కంటిచూపు తగ్గుతుందని గుర్తించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ర్యాంకుల కోసం పిల్లలకు విశ్రాంతి ఇవ్వకుండా చదివించే తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తే పిల్లలు ‘కళ్ల’కాలం సుఖంగా ఉంటారని మేథావులు సలహా ఇస్తున్నారు. -
ఇష్టంతో చదవాలి
• వేలిముద్రగాళ్లం అయినందునే ఎంతో నష్టపోయాం • 150 సినిమాల్లో పని చేశాం • ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తాడిపత్రి టౌన్ : "మా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాం. మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాం. ఎన్నో అనుభూతులు, అనుభవాలు చవి చూశాం. అయితే చదువులేక వేలిముద్రగాళ్లుగా ఎంతో నష్టపోయాం. మా మాదిరి ఎవరూ కాకూడదు. కష్టమైనా ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే ఇష్టంతో చదవాలి’ అని సినిమా ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ అన్నారు. తాడిపత్రి కాల్వగడ్డ వీధిలోని సాయి సిద్దార్ధ కళాశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ సామాజిక సేవా సంఘం, సాయి సిద్దార్ధ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలికలు–బంగారు భవిష్యత్’ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో వారు మాట్లాడారు. సేవా సంస్థ అధ్యక్షుడు శంకర్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిన కార్యక్రమంలో వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... దేవుని దయ, మా కష్టంతో సినీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరామన్నారు. ఐదు సినిమాల్లో హీరోగా, 150 సినిమాల్లో ఫైట్ మాస్టర్లుగా పని చేసినట్లు పేర్కొన్నారు. ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి సహా ఇతర హీరోల సినిమాల్లో ఫైట్మాస్టర్లుగా పని చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం చిరంజీవి 150 చిత్రానికి, బాలకృష్ట 100 చిత్రానికి ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నామన్నారు. ఫైట్ మాస్టర్లుగా ఎన్నో దేశ విదేశాలు చుట్టొచ్చామని, చదువు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని బాధపడ్డారు. సెల్, కంప్యూటర్ మోజులో జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు, గురువులను పూజించాలని పేర్కొన్నారు. -
క్రమశిక్షణతో చదవాలి
అనంతగిరి (కోదాడరూరల్) : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుతూ అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని సాఫ్ట్‌స్కిల్ ట్రై నర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు ద్యాసపు మురళీధర్ సూచించారు. శనివారం మండల పరిధిలోని అనంతగిరి శివారులో గల అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో పర్సనాల్టీ డెవలప్మెంట్పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుండే ఆంగ్లభాషపై పట్టుసాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ.శివప్రసాద్, టెక్విప్ కోఆర్డినేటర్ వైవీఆర్.నాగపవన్, డి.పాండురంగరావు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
పుస్తక పఠనంతో దీర్ఘాయుష్షు
గంటల కొద్దీ కూర్చోవడం వల్లే లేనిపోని రోగాలన్నీ వస్తుంటాయని చాలా మంది అభిప్రాయం. ఒక వేళ అది నిజమే కావచ్చు. కానీ ఆ కూర్చునే సమయంలో పుస్తకాలను చదివితే మనిషి జీవిత కాలం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యాలే యూనివర్సిటీ ప్రజారోగ్య బృందం చేసిన పరిశోధనలో వెల్లడైన అంశాలు గతనెల ప్రచురితమయ్యాయి. ఈ బృందం అమెరికాలో 50 ఏళ్లు పైబడిన 3,635 మంది నుంచి 1992 నుంచి 2012 మధ్యకాలంలో సమాచారం సేకరించింది. వయసు, లింగము, జాతి, విద్య, వివాహ స్థితి తదితరాల వారిగా విభజించి పరిశోధన చేయగా పుస్తక పఠనం చేసినవారు దీర్ఘకాలం జీవించడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 12 సంవత్సరాల పరిశీలనలో పుస్తకాలు చదవనివారికంటే చదివేవారు చనిపోయే స్థితి 20 శాతం తగ్గింది. మొత్తంగా పుస్తక పఠనం వల్ల 23 నెలల జీవితకాలం పెరిగింది. అలాగే మంచి జ్ఞాన సముపార్జన కలిగి ఉండి, సానుకూల దృక్పథంతో జీవిస్తున్నారు. పుస్తకంలోని కథనం, ఆ కథలోని పాత్రలతో పూర్తిగా లీనమవడంపై కూడా మనిషి జీవిత కాలం పెరుగుదల ఆధారపడి ఉంటుందని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. అదేసమయంలో వార్తాపత్రికలు, మేగజైన్స్ చదివేవారిలో ఎలాంటి మార్పు కనబడలేదు. -
ప్రయాణికుల కోసం పుస్తక భాండాగారం!
టీవీలు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేనపుడు యువతీ యువకులకు పుస్తక పఠనమే అలవాటుగా ఉండేది. సాహిత్య సామాజిక రంగాలకు చెందిన పుస్తకాలు వారి చేతుల్లో కనిపించేవి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి మచ్చుకు కూడ కనిపించడం లేదు. పుస్తకాల స్థానాన్ని సెల్ ఫోన్లు, మాధ్యమాలు ఆక్రమించేశాయి. పుస్తక పఠనం వ్యక్తుల్లో మానసిక వికాసాన్ని కలిగిస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారు లోకజ్ఞానంలోనే కాక, అనేక రకాల సామర్థ్యాలను, ప్రతిభను కలిగి ఉన్నట్లు పరిశోధకులు సైతం గుర్తించారు. అందుకే ప్రయాణీకుల ఖాళీ సమయం వృధా కాకుండా పుస్తక పఠనానికి వినియోగించుకునేందుకు వీలుగా షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల ఆసక్తికి అనుగుణంగా, వారి వయసును, ఇష్టాన్నిబట్టి చదువుకునేందుకు వీలుగా షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం ఓ పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు వారి ఖాళీ సమయంలో తమకిష్టమైన పుస్తకాలు, మ్యాగ్జిన్లు చదువుకునేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లోని మెయిన్ టర్మినల్ లో రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016 ను జరుపుకోవడంతోపాటు తమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణీకులకోసం ఈ కొత్త సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చింది. గల్ఫ్ జాతీయులు, నివాసితుల్లో చదివే సంస్కృతిని పెంపొందించాలన్నదే లక్ష్యంగా విమానాశ్రయాల్లో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ చొరవ చూపించింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ మంత్రిత్వ శాఖ మార్గదర్వకత్వంలో ప్రయాణీకులకు మంచి అనుభవాన్ని అందించేందుకు ఈ రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్ అల్ నయాన్ తెలిపారు. విమానాశ్రయంలో ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, వినియోగదారులు పుస్తక పఠనంతో తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు, కొత్త అనుభవాన్నిపొందేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లో రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా అనేక ప్రచురణలను అక్కడ అందుబాటులో ఉంచినట్లు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయ అథారిటీ ఛైర్మన్ అలీ సేలం అల్ మడ్ఫా తెలిపారు. -
నచ్చకపోతే ఇంతే మరి!
తిక్క లెక్క నిజంగా ఇది తిక్క లెక్కే. ఈ లెక్క వేసిందీ, తీసింది కూడా ఎప్పటిలా పాశ్చాత్యులే. అందులోనూ అమెరికా వాళ్లే. చిరునవ్వు ప్రపంచమంతటా ఒకేలా ఉంటుంది కదా, సుతిమెత్తని చిరచిర కూడా అలాగే ఉంటుందా అనే గొప్ప డౌటొకటి వచ్చి ఓహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం ఓ 150 మంది కాలేజీ అమ్మాయిల ముఖ కవళికల్ని రికార్డు చేసింది. ఆ అమ్మాయిల్లో అమెరికా వాళ్లున్నారు. బ్రిటన్, స్పెయిన్, చైనా వగైరా దేశాల వాళ్లూ ఉన్నారు. ఈ పరిశోధకులు ఏం చేశారంటే... ‘అమ్మాయిలూ.. మీకు నచ్చని విషయమేదైనా ఉంటే దాన్ని మాటల్లోనే కాకుండా మీ ముఖంలో కూడా ఎక్స్‌ప్రెస్ అయ్యేలా చెప్పండి ప్లీజ్’ అని అడిగారు. ఆ తర్వాత వాళ్ల ముఖారవిందాల రీడింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత కామన్‌గా ఉన్న వ్యక్తీకరణల్ని బయటికి తీశారు. మూతి ముడవడం, చుబుకం కాస్త పైకి వెళ్లడం, కనుబొమలు ఎడంగా జరగడం, ముక్కు వంకరపోవడం వంటివి అందరిలోనూ ఒకేలా ఉండడం చూసి... నవ్వు నలభై రకాలుగా ఉంటుంది కానీ, చిరాకు నాలుగైదు రకాలుగా మాత్రమే ఉంటుందని తేల్చేశారు. ఇదేం లెక్కోమరి! -
వినబడని ఆడియోలకు లిప్ రీడింగ్ టెక్నాలజీ..
లండన్: ఇక వీడియోలో మాటలు వినిపించకపోయినా నష్టం లేదని, లిప్ రీడింగ్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చని అంటున్నారు ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం అధ్యయనకారులు. వినికిడి లోపం ఉన్నవారికి విషయాలను కమ్యూనికేట్ చేయడంతోపాటు , నేర పరిశోధనకు ఈ కొత్త టెక్నాలజీ మరింత ప్రయోజనకరంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసినట్లు చెప్తున్నారు. ధ్వని సరిగా వినిపించని సమయంలో సదరు వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు విజువల్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ ని ఉపయోగించి మాటలను గుర్తించేందుకు ఈ కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచినట్లు ప్రొఫెసర్ రిచర్డ్ హార్వే, డాక్టర్ హెలెన్ ఎల్ బీర్ లు చెప్తున్నారు. రికార్డు చేసిన ఆడియోలు, ధ్వని, మాటలు, సీసీ టీవీ ఫుటేజ్ లోని ఆధారాలు... సంభాషణలు సరిగా అర్థంకాని సమయంలో ఈ టెక్నాలజీ వినియోగించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. లిప్ రీడింగ్ టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు దృశ్య సంభాషణ శాస్త్రంలో తాము మరింత పరశోధన జరుపుతున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. శిక్షణా పద్ధతి ద్వారా మునుపటి లిప్ రీడింగ్ పద్ధతులను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని డాక్టర్ బేర్ వివరించారు. సమర్థవంతంగా పెదాల కదలికలను చదివే వ్యవస్థ (లిప్ రీడింగ్) ను నేర పరిశోధన నుంచీ ఎంటర్ టైన్ మెంట్ వరకు ప్రతి విషయానికీ వినియోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. పిచ్ లో ఉన్నపుడు ఫుడ్ బాల్ క్రీడాకారుల అరుపులు, సంభాషణ తదితర ధ్వనులను సులభంగా గుర్తించేందుకు ఇప్పటికే లిప్ రీడింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే కార్లు, ఎయిర్ క్రాఫ్ట్ కాక్ పిట్లు వంటి శబ్దాల స్థాయి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. వినికిడి శక్తి లేనివారు వినియోగించే స్పీచ్ ఇంపెయిర్మెంట్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ లిప్ రీడింగ్ టెక్నాలజీతో అత్యధిక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ బేర్ చెప్తున్నారు. పెదవుల కదలికల ద్వారా రూపాన్ని, ఆకారాన్ని గుర్తించడం అనేది పెద్ద సమస్యగా కనిపించినా ఓ క్రమ పద్ధతిలో ఈ మెషీన్ల కు పెదాల కదలికలు, ఆకారాన్ని బట్టి శిక్షణ ఇవ్వడం ద్వారా అది సాధ్యమౌతుందని హార్వే అన్నారు. ధ్వనిశాస్థ్రం, స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ పై షాంఘై లో జరిగే అంతర్జాతీయ సదస్సులో తమ పరిశీలనలను సమర్పించనున్నారు. ఐఈఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అకౌస్టిక్స్ - స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ 2016 జర్నల్ ప్రొసీడింగ్స్ లో పరిశోధనా వివరాలను ప్రచురించారు. -
స్పీడ్ రీడింగ్ వల్ల ప్రయోజనాలు శూన్యమే..!
స్పీడ్ రీడింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటూ వివిధ సంస్థలు కోచింగ్ క్లాస్ లు, యాప్ లతో ఊదరకొడుతుంటే... అదంతా వృధా ప్రయాసేనంటున్నారు అధ్యయనకారులు. ఎంతటి సమాచారాన్నయినా స్పీడ్ రీడింగ్ ప్రాక్రిస్ తో గుర్తు పెట్టుకోవచ్చన్న వాదాన్ని వారు తప్పుబడుతున్నారు. స్పీడ్ రీడింగ్ పై జరుగుతున్న ప్రచారానికి అర్థం లేదని, వేగంగా పఠించడం వల్ల విషయాలు గుర్తుండవని, హాయిగా... ప్రశాంతంగా చదివినదే ఎక్కువకాలం గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నది పరిశోధకుల వాదన. వేగ పఠనంపై అందుబాటులో ఉన్న యాప్ లు, టెక్నిక్ లను అధ్యయనం చేసిన పరిశోధకులు వాటివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటున్నారు. దశాబ్దాల కాలంగా జరిగిన పరిశోధనలను పరిశీలించిన అధ్యయనకారులు స్పీడ్ రీడర్స్ చదివిన విషయాలను గుర్తు పెట్టుకోలేకపోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ మెయిల్, సామాజిక మీడియా ప్రపంచంలో స్పీడ్ రీడింగ్ అవసరమౌతుందే తప్పించి దీర్ఘ కాల ప్రయోజనాలకు అవసరం లేదంటున్నారు. అతి పెద్ద పుస్తకాల్లో రాసిన విషయాన్ని అప్పటికప్పుడు చదివి, తక్కువ సమయం గుర్తుపెట్టుకొనేందుకు స్పీడ్ రీడింగ్ షార్ట్ కట్ మెథడ్ అని, విజ్ఞాన శాస్త్రంలో అది ఓ చిన్న ఆధారం మాత్రమే అని పరిశోధనల్లో తేలిందని సైకలాజికల్ సైంటిస్టుల బృందం చెప్తోంది. దశాబ్దాల కాలంగా స్పీడ్ రీడింగ్ కోర్సులు ఉండగా... ఇటీవల కన్జూమర్ మార్కెట్లో స్పీడ్ రీడింగ్ టెక్నాలజీల సంఖ్య భారీగా పెరిగిపోయిందని, శాన్ డియాగోలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైకలాజికల్ సైంటిస్ట్ ఎలిజబెత్ స్కాటర్ చెప్తున్నారు. తక్కువ సమయంలో చదవడం వల్ల, విషయాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం తక్కువగానే ఉంటుందని ఆమె వివరిస్తున్నారు. పఠనం అనేది మనసుకు, కళ్ళకు సంబంధించిన ప్రక్రియ అని, ఎంతో నైపుణ్యం కలిగిన వారు నిమిషానికి సుమారు 200 నుంచి 400 పదాలు చదవగల్గుతారని అంటున్నారు. కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ మధ్యభాగంలో వెంట వెంటనే పదాలు ప్రదర్శించడంద్వారా వేగ పఠనం అలవర్చుకొనేందుకు స్పీడ్ రీడింగ్ టెక్నాలజీలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ సరైనది కాదని, ఇందులో జరిగిపోయిన పదాన్ని తిరిగి చదివేందుకు, వాక్యనిర్మాణానికి అవకాశం లేదని, ఇలా స్పీడ్ గా కదిలిపోయే పదాల్లో పది శాతం పదాలను మాత్రమే కళ్ళు చూడగల్గుతాయని పరిశోధకులు చెప్తున్నారు. మన దృష్టి, సామర్థ్యం కలిపితేనే వ్యాక్య నిర్మాణం జరుగుతుందని అప్పుడే చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. భాష పట్ల అవగాహన లేకుండా స్పీడ్ గా చదివే సమర్థతను పెంచడం వల్ల ఏమీ లాభం లేదంటున్నారు. అయితే విషయాలపట్ల సమగ్ర అవగాహన ఉండి, వేగంగా చదివేవారికి ఇది వర్తించదంటున్నారు. చదువుతున్న విషయంపై ఆసక్తి అధికంగా ఉండి, ఎక్కువ విషయాన్ని తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉన్నవారికి ఈ స్పీడ్ రీడింగ్ ది కొంత ప్రయోజనకరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన పఠనాశక్తి కలిగి ఉండాలంటే మాత్రం విషయంపట్ల అవగాహన అవసరం అని, అది మోతాదు ప్రకారం పెంచుకోవడమే అన్ని రకాలుగా శ్రేయస్కరమని అధ్యయనకారులు తేల్చి చెప్తున్నారు. -
‘ఆటో’.. ఇటో... అంటే కుదరదు!
ప్రతి ఆటోకూ మీటర్ ఉండాల్సిందే దాని రీడింగ్ ప్రకారమే కిరాయి తీసుకోవాలి నాన్ ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ అయినా ఉండాలి కౌన్సెలింగ్‌లో స్పష్టం చేసిన డీసీపీ రంగనాథ్ సిటీబ్యూరో: నగరంలో తిరిగే ప్రతి ఆటోకూ మీటర్ ఉండాల్సిందేనని, దాని రీడింగ్ ఆధారంగానే ప్రయాణికుల నుంచి కిరాయి తీసుకోవాలని ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నగరంలో వివిధ రకాలైన ఉల్లంఘనలకు పాల్పడిన 250 మంది ఆటోడ్రైవర్లకు మంగళవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ)లో ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ ఆటోడ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియాల్లో అనేక ఫిర్యాదు వస్తున్నాయి. వీటిలో అత్యధికం ఆటోల ఉల్లంఘనలకు సంబంధించివే. ప్రధానంగా మీటర్లు ఉండట్లేదని, ఉన్నా వాటితో సంబంధం లేకుండా చార్జీలు వసూలు చేస్తున్నారని జనం వాపోతున్నారు. కొందరు ఆటోడ్రైవర్ల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని ఫిర్యాదు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన రహదారి భద్రత సిఫార్సుల కమిటీ ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం జైలు శిక్ష అవకాశం ఉన్న ఉల్లంఘనలను కోర్టుల దృష్టికి తీసుకెళ్లి శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఆదేశాల ప్రకారమే తొలివిడతగా కౌన్సెలింగ్ చేస్తున్నాం. ఆటోడ్రైవర్ల ఉల్లంఘనలు పెరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. క్యాబ్‌లనూ నియంత్రిస్తాం... ఇటీవల అందుబాటులోకి వచ్చిన వివిధ రకాలైన క్యాబ్ సర్వీసుల కారణంగా తాము నష్టపోతున్నామంటూ ఆటోడ్రైవర్లు చేస్తున్న ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్నామని రంగనాథ్ అన్నారు. ఇష్టానుసారంగా రేట్లు వసూలు చేస్తున్న క్యాబ్స్‌ను అదుపు చేయడానికి ఆర్టీఏ అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ తీసుకోవడానికి కనీసం 8వ తరగతి విద్యార్హత ఉండాలని, నగరంలోని అనేక మంది ఆటోడ్రైవర్లు నిరక్షరాస్యులు, 8వ తరగతి కంటే తక్కువ చదివిన వారు ఉంటున్నారని రంగనాథ్ చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటోడ్రైవర్లు తొలుత నాన్-ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ తీసుకున్నా అంగీకరిస్తున్నామని, రెండుమూడేళ్ల అనుభవం తర్వాత దీని ఆధారంగా ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ తీసుకునే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఈ తరహా లెసైన్సులు తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తేవాలని, ఆర్టీఏ అధికారుల సహాయంతో మేళాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోల యజమానులుగా ఉన్న డ్రైవర్లూ ఆ వాహనాల తమ పేరిట లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి పరిష్కారంగా చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రంగనాథ్ తెలిపారు. ‘అవగాహన’కు ఆలోచనలుంటే స్వాగతం... రహదారి భద్రత, నిబంధనలపై నగరవాసులకు అవగాహన కల్పించడానికి సంబంధించి ఎలాంటి ఆలోచన ఉన్నా తమ వద్దకు వచ్చి పంచుకోవాలని రంగనాథ్ కోరారు. ఇలాంటి ఔత్సాహికులు తీసిన లఘు చిత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు అన్ని రకాలైన ప్రచారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగరానికి చెందిన ఖలీమ్ రూపొందించిన ‘ఇట్స్ నాట్ జస్ట్’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను రంగనాథ్ ఆవిష్కరించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ 22 నిమిషాల నిడివి కలిగిన ఈ లఘుచిత్రంలో మాజీ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపీనాథ్ యముడి పాత్రలో నటించారు. ఇందులోని ‘రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు... రక్తమోడుతున్నరు’ అనే పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డికి అంకితమిచ్చారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ మరణించిన విషయం విదితమే. టీటీఐలో జరిగిన కార్యక్రమంలో అదనపు డీసీపీ సుంకర సత్యనారాయణ, ఏసీపీలు జైపాల్, భద్రేశ్వర్, డాక్టర్ ప్రేమ్కాజల్లతో పాటు నాంపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి.హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఆర్‌డీఏతో బిల్లింగ్ పక్కా
ప్రతి నెలా విద్యుత్ బిల్లు తీసేందుకు స్పాట్ బిల్లర్ మన ఇంటికి రావడం..మీటర్లో రీడింగ్ చూసి బిల్లు కొట్టడం. అందులో తప్పులు తడకలు రావడం..వినియోగదారులు బిల్లు ఎక్కువ వచ్చిందని గగ్గోలు పెట్టడం..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎదురవుతున్న విద్యుత్ కష్టాలు. ఇకపై ఇలాంటి కష్ట, నష్టాలకు చెక్ పెట్టేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు సన్నద్ధమయ్యూరు. నూతన సాఫ్ట్‌వేర్‌తో ఐఆర్డీఏ పోర్టు విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు నడుం బిగించారు. దశల వారీగా ఈ విధానం అమలుతో కచ్చితమైన బిల్లింగ్‌కు శ్రీకారం చుట్టారు. గురజాల : గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రస్తుతం వాడుతున్న పాత విద్యుత్ మీటర్ల స్థానంలో ఐఆర్డీఏ పోర్టు మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటర్లు మార్చుకునేందుకు వినియోగదారులపై ఎలాంటి భారం పడదు. మీటర్ల ఏర్పాటు తర్వాత జీపీఆర్ఎస్ టెక్నాలజీతో సాఫ్టవేర్‌ను ప్రస్తుతం బిల్లింగ్ చేస్తున్న మిషన్లకు అనుసంధానం చేస్తారు. ఈ మిషన్‌లో సిమ్ కార్డు వేస్తారు. ఇలా స్పాట్ బిల్లింగ్ ఏజెంట్ ఐఆర్డీఎ పోర్ట్ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ నమోదు చేసే అవసరం లేకుండా స్విచ్ నొక్కగానే ఎంత వినియోగించారో తెలుస్తుంది. కచ్చితమైన రీడింగ్ వస్తుంది. కొనసాగుతున్న ప్రక్రియ... గురజాల విద్యుత్ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం ఐఆర్డీఏ పోర్టు మీటర్లు బిగిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వాణిజ్య, గృహ అవసరాలకు సుమారుగా 10 లక్షల 47 వేల విద్యుత్ మీటర్లున్నాయి. వాటిలో సుమారుగా 80 శాతం మేర పోర్టు మీటర్లు బిగించినట్లు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. మిగిలిన 20 శాతం జనవరి నెలాఖరుకల్లా ఏర్పాటు చేస్తామన్నారు. లాభాలు ఇవి.. వినియోగదారులకు బిల్లులు లెక్కింపులో తప్పిదాలు వచ్చే అవకాశం ఉండదు. కార్యాలయాలు చూట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవాల్సిన పని లేదు. వినియోగదారులు కరెంట్ బిల్లుల సమాచారాన్ని సత్వరమే సర్వర్‌లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. మానవ ప్రమేయం తక్కువ.. మీటర్లుకు ఐఆర్డీఏ పోర్టు అనుసంధానం చేయడంతో కచ్చితమైన బిల్ రీడింగ్ వస్తుంది. ఇప్పటి వరకు మీటర్ ఎంత తిరిగిందో చూసి బిల్లు నమోదు చేసే వారు. ఈ క్రమంలో కొన్ని సార్లు పొరబాట్లు దొర్లుతున్నారుు. ఐఆర్డీఏ పూర్తి సాంకేతిక పరమైంది కావడంతో మానవ తప్పిదాలు ఉండవు. పఠాన్ హుస్సేన్ ఖాన్, అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీరు