నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్‌ వీడియో | Dussehra 2024 a boy garba palying while reading book goes viral | Sakshi
Sakshi News home page

నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్‌ వీడియో

Published Mon, Oct 7 2024 5:17 PM | Last Updated on Tue, Oct 8 2024 3:45 PM

Dussehra 2024 a boy garba palying while reading book goes viral

దసరా నవరాత్రి  ఉత్సవాలు దేశవ్యాప్తంగా  అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.  తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకొంటూ భక్తిపారవశ్యంలో భక్తులు మునిగి తేలుతున్నారు. మరోవైపు దాండియా, గార్బా నృత్యం, కోలాటాలతో  ఈ ఉత్సవాలు మరింత శోభను సంతరించు కుంటున్నాయి.  తాజాగా  గుజరాత్‌లో నిర్వహించిన గార్బా డ్యాన్స్  కార్యక్రమం విశేషంగా నిలుస్తోంది. నెటిజన్ల ఫన్నీ కమెంట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సందడి ఏంటో  తెలుసుకుందాం పదండి! 

దసరా అంటే గార్బా సందడి  ఉండాల్సిందే. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు,ఆఫీసులు, ఇతర ప్రదేశాలలో  గర్బా ఈవెంట్‌లలో చిన్నా పెద్దా అంతా అందంగా ముస్తాబై నృత్యం చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో నవరాత్రి ఉత్సవాలకు దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గుజరాత్‌లోని ఒక గార్బా ఈవెంట్‌లో బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని  మరీ గార్బా స్టెప్పులేయడం విశేషంగా నిలుస్తోంది.  తన తోటి డ్యాన్సర్లు నవ్వుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, చక్కగా తన దారిన తాను నృత్యం చేస్తూ, పుస్తకంలో లీనమై పోయాడు. (అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?)

చదువుకోవాలని అంటే ఎలా అయినా చదువుకోవచ్చు అనే క్యాప్షన్‌తో  ఈ వీడియో ఎక్స్‌ లో పోస్ట్‌ అయింది. దీనిపై నెటిజన్లు ఆ అబ్బాయి కమిట్‌మెంట్‌పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఇది మరీ విడ్డూరం.. చదువుకోవడానికి వేరే ప్రదేశమే దొరకలేదా? అంటూ మరికొందరు కమెంట్‌ చేశారు. ఈ వీడియో మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే అన్నట్టు ఇంకొక యూజర్‌ స్పందించారు. UPSC పరీక్షలకు సిద్ధమవుతున్నాడ నుకుంటా అని  మరొక వినియోగదారు చమత్కరించారు. (సోలోగా కాదు..మ్యాజిక్‌ జరగాలంటే : ఆనంద్‌ మహీంద్ర మరో అద్భుత పోస్ట్‌, వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement