మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్‌ కిడ్‌ కూడా! | Nita Ambani Play Dandiya With Kareena Kapoor's Son, Jeh And Other Kids | Sakshi
Sakshi News home page

మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్‌ కిడ్‌ కూడా!

Published Mon, Oct 14 2024 11:28 AM | Last Updated on Mon, Oct 14 2024 11:41 AM

Nita Ambani Play Dandiya With Kareena Kapoor's Son, Jeh And Other Kids

రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్  నీతా అంబానీ దసరా వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు,  మనవడు పృథ్వీ,  చదువుకుంటున్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (NMAJS)లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  అతని క్లాస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిలో  బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ కరీనా , సైఫ్‌ కుమారుడు జెహ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు.  దాదీ, మనవళ్ళ డ్యాన్స్‌ నెట్టింట సందడి  చేస్తోంది.

అంబానీ కుటుంబం ప్రతీ పండుగను వైభవంగా జరుపుకుంటుంది.    తాజాగా నవరాత్రి  సంబరాల్లో  రిలయన్స్‌ అధినేత  ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న  కుమారుడు అనంత్‌ అంబానీ భార్య, కొత్త  కోడలు  రాధికా మర్చంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు.   నీతా కుమార్తె ఇషా అంబానీ కుమారుడు పృథ్వీ స్కూల్‌లో నిర్వహించిన  వేడుకలో   చిన్న పిల్లలతో దాండియా స్టెప్పులు వేశారు. మనవడు పృథ్వీరాజ్ అంబానీ కరీనా కపూర్ కొడుకు జెహ్‌, ఇతర  పిల్లలతో కలిసి సరదాగా గడిపారు.  

పింక్ టోన్ స్ట్రాపీ హీల్స్‌,అద్భుతమైన పింక్ కలర్ సల్వార్ సెట్‌ను ధరించి  నీతా  ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే తల్లి పూనమ్ దలాల్‌తో కలిసి గర్భా ఆచారం,  అమ్మవారికి హారతి ఇచ్చి దసరా వేడుకను జరుపుకున్నారు. 

నీతా అంబానీ  తన మనవడు, పృథ్వీ ,అతని క్లాస్‌మేట్‌లను స్టోరీ సెషన్‌తో ఆశ్చర్యపరిచారు. పెప్పా పిగ్  పుస్తకంనుంచి ఒక కథను వివరించి పిల్లలతో ఉత్సాహంగా కనిపించడం  పిల్లలు శ్రద్ధగా వినడం, లంచ్‌లో వారితో ముచ్చటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలను స్కూలు యాజమాన్యం తన ఇన్‌స్టాలో  పోస్ట్‌ చేసింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement